Students can go through AP Board 9th Class Biology Notes 10th Lesson నేల కాలుష్యం to understand and remember the concept easily.
AP Board 9th Class Biology Notes 10th Lesson నేల కాలుష్యం
→ మనం నివసిస్తున్న భూగోళం నేల, నీటితోపాటు చుట్టూరా వాతావరణాన్ని, ఆకాశాన్ని కలిగి ఉంటుంది.
→ జలావరణం, శిలావరణం, జీవావరణం, వాతావరణాల మధ్య పరస్పర చర్య ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్నది.
→ నేల ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన వనరు. నేల లేకుండా జీవనమే లేదు.
→ నేల ఏర్పడడం ఒక సుదీర్ఘమైన సంక్లిష్ట ప్రక్రియ.
→ పంటల నాణ్యత – అది పండే నేల స్వభావంపై ఆధారపడి ఉంటుంది.
→ నేల ప్రాథమిక ధర్మాలను భౌతిక, రసాయనిక, జీవసంబంధ అనే మూడు రకాల ధర్మాలుగా వర్గీకరించవచ్చు.
→ నేలయందలి జంతు సంబంధ పదార్థాలలో మొక్కల పెరుగుదలకు అవసరమయ్యే నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మొదలైన పోషకాలు ఉంటాయి.
→ ఒక నేలలో పెరిగే వృక్షజాలం గురించి, జంతుజాలం గురించి తెలుసుకోవాలంటే ఆ నేలకు సంబంధించిన pH విలువను తెలుసుకోవడం అవసరం.
→ భూమి మీద ఉన్న వైవిధ్యభరితమైన ఆవరణ వ్యవస్థలలో నేల ప్రధానమైనది.
→ నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవ సంబంధ మూలకాలను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరింద్రియ పదార్థాలుగా మార్చడాన్ని ఖనిజీకరణం అంటారు.
→ నేలకు గల సారవంతత దానికి నీటిని నిలిపి ఉంచుకునే శక్తి, మొక్కలకు కావలసిన పోషకాలను కలిగి ఉండి అవసరమైన పరిమాణంలో నేరుగా అందించగలగడం మీద ఆధారపడి ఉంటుంది.
→ వ్యవసాయంలో ఎక్కువ దిగుబడులు పొందాలంటే నేల సారవంతతను కాపాడుకునే సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి.
→ వివిధ రకాల వనరుల నుండి తయారయ్యే వ్యర్థాలను రెండు రకాలుగా విభజించవచ్చు. అవి :
- నేలలో కలసిపోయే చెత్త
- నేలలో కలసిపోని చెత్త.
→ పదార్ధాలు విచ్ఛిన్నమైన చిన్న చిన్న సరళ పదార్థాలుగా మారిపోవడాన్ని కుళ్ళిపోవడం అంటారు.
→ నేల కాలుష్యం అనగా నేల సారం లేదా నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే పదార్థాల చేరిక అని అర్ధం. నేలలో చేరే వ్యర్థాల ఆధారంగా నేల కాలుష్యాన్ని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి :
- వ్యవసాయం వల్ల నేల కాలుష్యం
- పారిశ్రామిక ఘన, ద్రవ వ్యర్థాల వల్ల నేల కాలుష్యం
- పట్టణీకరణవల్ల వెలువడే కాలుష్యం.
→ నేల నాణ్యత, నిర్మాణాన్ని మరియు లవణాలను క్షీణింపచేసే కారకాన్ని, లేదా నేలలోని జీవుల సమతుల్యతను ఆటంకపరచే కారకాన్ని నేల కాలుష్య కారకం అంటారు.
→ శిలీంధ్ర నాశకాలు జంతువులలో మరియు మానవులలో విష ప్రభావాన్ని కలిగించడమే కాకుండా నేలసారాన్ని తగ్గిస్తాయి.
→ అపాయకరమైన రసాయనిక శకలాలు ఆహారపు గొలుసు ద్వారా జీవుల్లోకి ప్రవేశించడాన్ని జైవిక వ్యవస్థాపనం అంటారు.
→ వివిధ చర్యల ద్వారా సమాజం చేత ఒకసారి వాడుకొని పారవేయబడిన కర్బన, అకర్బన పదార్థాలు వ్యర్థాలు అన్నింటిని ఘనరూప వ్యర్థాలు అనవచ్చు. ఘనరూప వ్యర్థాలను అవి ఉత్పత్తి స్థానాన్ని బట్టి మూడు రకాలు. అవి :
- మున్సిపల్ ఘనరూప వ్యర్థాలు
- ప్రమాదకరమైన ఘనరూప వ్యర్థాలు
- సంక్రమణకు గురిచేసే ఘనరూప వ్యర్థాలు.
→ గాలి లేదా నీరు ద్వారా మట్టి పై పొరలు కొట్టుకొనిపోవడం వల్ల మృత్తిక క్రమక్షయం ఏర్పడుతుంది.
→ అడవులు, గడ్డి మైదానాలు నేలను గట్టిగా పట్టి ఉంచడం ద్వారా నేల క్రమక్షయానికి గురి కాకుండా కాపాడుతున్నాయి.
→ తగ్గించడం (Reduce), తిరిగి ఉపయోగించడం (Reuse), మరలా వాడుకునేందుకు (Recycle) వీలుగా మార్చడం, తిరిగి చేయడం (Recover) (4R system) అనే పద్ధతుల ద్వారా ఘనరూప వ్యర్థాలను తగ్గించవచ్చు.
→ ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో లేదా ఆక్సిజన్ లేకుండా పదార్థాలను మండించడం పైరాలసిస్.
→ ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పదార్థాలను మండించడం ఇన్‌సినరేషన్.
→ జీవసంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడాన్ని జైవిక సవరణీకరణ అంటారు.
→ నేల కాలుష్యం : నేలలో విషరసాయనాలు పేరుకొనిపోవడం, లవణాలు రేడియోధార్మిక పదార్థాలు లేదా వ్యాధులను కలిగించే కారకాలు. మొక్కల పెరుగుదలకు, జంతుజాల ఆరోగ్యాన్ని ఆటంకపరచేవి చేరడం.
→ జైవిక నేల : జీవులను కలిగియున్న నేల.
→ ఖనిజీకరణం : నేలలో ఉండే సూక్ష్మజీవులు జీవసంబంధ మూలకాలను అనగా సేంద్రియ స్థితిలో ఉన్న వాటిని నిరింద్రియ పదార్థాలుగా మార్చే ప్రక్రియ.
→ జైవిక వ్యవస్థాపనం : అపాయకరమైన రసాయనిక శకలాలు ఆహారపు గొలుసు ద్వారా జీవుల్లోకి ప్రవేశించడం.
→ ఘనరూప వ్యర్థాలు : వివిధ చర్యల ద్వారా సమాజం చేత ఒకసారి వాడుకొని పారవేయబడిన కర్బన, అకర్బన పదార్థాలు, వ్యర్థాలు.
→ భూగర్భ కాలుష్యం : భూమిలోపలి పొరలు వివిధ రకాల రసాయన పదార్థములచే కలుషితం కావడం.
→ పైరాలసిస్ : ఆక్సిజన్ నియంత్రిత పరిస్థితుల్లో లేదా ఆక్సిజన్ లేకుండా పదార్థాలను మండించడాన్ని పైరాలసిస్ అంటారు.
→ ఇన్సనరేషన్ : అతి ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పదార్థములను మండించే ప్రక్రియ.
→ జైవిక సవరణీకరణ : జీవ సంబంధ పద్ధతుల ద్వారా కాలుష్య కారకాలను తొలగించడం.
→ వాతావరణం : భూమి చుట్టూ ఆవరించబడిన గాలి పొర.
→ శిలావరణం : భూమి మీద ఉన్న రాతి పొరల సముదాయం.
→ జలావరణం : భూమి మీద ఉన్న నీటి వనరుల మొత్తం.
→ జీవావరణం : జీవుల మనుగడకు ఆధారాన్నిచ్చే అన్ని మండలాలు.