AP 9th Class Biology Notes 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

Students can go through AP Board 9th Class Biology Notes 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు to understand and remember the concept easily.

AP Board 9th Class Biology Notes 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

→ అనుకూలనాలు అనగా ఒక నిర్ణీత వాతావరణమునకు అనుగుణంగా ఒక జీవిలో కలిగే శరీర మరియు నిర్మాణాత్మక లక్షణము.

→ ఒక జీవి ప్రకృతిలో తన అవసరాలకు అనుగుణంగా అనుకూలనమైన పరిస్థితులను సృష్టించుకుంటుంది.

→ జీవులు మనుగడ సాగించాలంటే వాటికి ఆవాసము, ఆహారము, కాంతి, గాలి మరియు అనేక అవసరాలు కావాలి.

→ రసభరిత కాండాలు, ఆకులు లేకపోవటం మరియు లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉండడం ఎడారి మొక్కలలో అనుకూలనాలు.

→ ఎడారులలో నివసించే జంతువులు కూడా అనుకూలనాలు చూపిస్తాయి.

→ ప్లవకాల లాంటి కిరణజన్య సంయోగక్రియ జరిపే సూక్ష్మజీవులు వాటి కణాలలో ఉండే నూనె బిందువుల సహాయంతో నీటిపై తేలతాయి.

→ ప్రతి సముద్రపు ప్రాణి ఒక నిర్ణీత స్థలంలో ఉండే లవణీయత, ఉష్ణోగ్రత, వెలుతురు లాంటి మార్పులకు అనుగుణంగా అనుకూలనాలు ఏర్పరచుకుంటుంది.

AP 9th Class Biology Notes 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

→ కొన్ని సముద్రపు జీవుల్లో శరీర ప్లవనాన్ని సమతాస్థితిలో ఉంచడానికి ఈత తిత్తులు ఉంటాయి.

→ నీటిలో నివసించే జీవులు నీటి యొక్క పీడనాన్ని తట్టుకునే విధంగా అనుకూలనాలు కలిగి ఉంటాయి.

→ సముద్ర పీడనం వైవిధ్యమైన పరిస్థితులు మరియు ఆవాసాలకు అనుకూలించబడినది.

→ సముద్ర ఆవరణ వ్యవస్థలో సహజీవనం, రక్షించుకునే ప్రవర్తన, దాక్కోవడం, ప్రత్యుత్పత్తి వ్యూహాలు, సమాచార సంబంధాలకు అనుకూలనాలు ఉంటాయి.

→ కాంతి ప్రసారం ఆధారంగా సముద్ర ఆవరణ వ్యవస్థను యూఫోటిక్ మండలం, బేత్యల్ మండలం మరియు అబైసల్ మండలాలుగా విభజించారు.

→ మంచినీటి ఆవరణ వ్యవస్థ నందు లిట్టోరల్ మండలం, లిమ్నెటిక్ మండలం మరియు ప్రొఫండల్ మండలం కలవు.

→ పాక్షికంగా నీటిలో మునిగి ఉండే మొక్కల కాండాలు, ఆకులు, వేర్లలో గాలితో నిండిన అనేక ఖాళీ స్థలాలు ఉంటాయి.

→ సమశీతోష్ణ ప్రాంతంలోని మొక్కలు శీతాకాలం ప్రారంభం కాకముందే ఆకులు రాల్చుతాయి.

→ ఉష్ణమండలాల్లోని కొన్ని మొక్కలు వేసవి మొదలుకాకముందే ఆకులు రాల్చుతాయి.

→ శీతల ప్రదేశాలలో నివసించే జీవులు చర్మాల కింద దళసరి కొవ్వు పొరను నిల్వ చేసుకుంటాయి లేదా దళసరి బొచ్చుతో శరీరాలను కప్పి ఉంచుతాయి.

→ అత్యుష్ణ, అతిశీతల పరిస్థితుల నుండి రక్షించుకోవడానికి కొన్ని జంతువులు శీతాకాలపు సుప్తావస్థ మరియు గ్రీష్మకాల సుప్తావస్థను అవలంబిస్తాయి.

→ సముద్ర అడుగు భాగాలలో నివసించే జంతువులు చాలావరకు భక్షకాలు మరియు పారిశుధ్యజీవులు.

→ మడ అడవులు : సముద్ర తీర ప్రాంతాలలో పెరిగే చెట్లు.

AP 9th Class Biology Notes 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు

→ అనుకూలనాలు : వివిధ పరిస్థితులలో జీవులు జీవించడానికి కొంతకాలం తరువాత వాటికి అనుగుణంగా మారటం.

→ గులకరాళ్ళ మొక్కలు : ఎడారి మొక్కలందు నీటిని నిలవచేసే ఆకులు. ఉదా : బ్రహ్మజెముడు, సాగజెముడు.

→ విశాచరులు : రాత్రి సమయంలో మాత్రమే సంచరించే జంతువులు.

→ ఆవరణ వ్యవస్థలు : జీవావరణం యొక్క ప్రమాణము. దీనిలో నిర్జీవ మరియు సజీవ అంశాలు ఉంటాయి.

→ కిరణజన్య సంయోగక్రియ : స్వయంపోషక జీవులు కార్బన్ డై ఆక్సైడ్, నీరు ఉపయోగించి పత్రహరితము, సూర్యకాంతి సమక్షములో పిండిపదార్థాలను తయారుచేసే జీవక్రియ.

AP 9th Class Biology Notes 9th Lesson వివిధ ఆవరణ వ్యవస్థలలో అనుకూలనాలు 1