Students can go through AP Board 9th Class Biology Notes 5th Lesson జీవులలో వైవిధ్యం to understand and remember the concept easily.
AP Board 9th Class Biology Notes 5th Lesson జీవులలో వైవిధ్యం
→ వైవిధ్యం ప్రకృతి యొక్క సూచిక.
→ జీవుల మధ్య ఉండే పోలికలు, భేదాలను అనుసరించి అవి వివిధ సమూహములుగా ఏర్పడినాయి.
→ ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడాలను వైవిధ్యం అంటారు.
→ జీవించే మొక్కల గింజలలో రెండు దళాలు ఉండే వాటిని ద్విదళబీజాలని, ఒకే దళం ఉంటే ఏకదళ బీజాలు అని అంటారు.
→ ప్రకృతిలో ఏ రెండు జీవులూ ఒకే విధంగా ఉండవు.
→ జీవులు పరిణామము చెందిన విధమును వర్గీకరణమునకు అన్వయించవచ్చు.
→ ప్రకృతిలో ఉన్న జీవుల గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేయడానికి తోడ్పడే శాస్త్రంగా వర్గీకరణను చెప్పవచ్చు.
→ జీవులలో ఉండే వైవిధ్యాన్ని వర్గీకరణ ఆవిష్కరింపచేస్తుంది.
→ జీవులను పోల్చడానికి వర్గీకరణ ఉపయోగపడుతుంది.
→ జీవపరిణామ సిద్ధాంతము చార్లెస్ డార్విన్ (1859) ప్రతిపాదించెను. ‘జీవుల పుట్టుక’ అనే గ్రంథమును రచించెను.
→ మొదటి, రెండవ శతాబ్దాలలో చరకుడు, సుశ్రుతుడు మొక్కలను వాటి ఔషధ గుణాలను ఆధారంగా చేసుకుని వర్గీకరించెను.
→ పరాశర మహర్షి ‘వృక్షాయుర్వేద’ అనే గ్రంథంలో మొక్కలను పుష్పాల నిర్మాణం ఆధారంగా వర్గీకరించెను.
→ 1758వ సంవత్సరంలో కరోలస్ లిన్నేయస్ జీవులను ‘అనిమేలియా’ మరియు ‘ప్లాంటే’ గా విభజించెను.
→ విట్టేకర్ అన్ని జీవరాసులను 5 రాజ్యాలుగా వర్గీకరించారు. అవి :
1) మొనీరా 2) పొటిస్టా 3) ఫంజి 4) ప్లాంటే 5) అనిమేలియా
→ ఐదు రాజ్యాలుగా విభజించడంలో పరిగణనలోనికి తీసుకున్న అంశాలు. అవి : నిజకేంద్రక జీవులా? కేంద్రకపూర్వక జీవులా? ఒంటరిగా జీవిస్తాయా? సమూహాలుగా జీవిస్తాయా? కణకవచం ఉందా? స్వయం పోషకాలా?
→ కణములన్నీ ఒక స్వతంత్ర పూర్వీక కణం అయిన లూకా నుండి ఏర్పడినాయని ఊజ్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.
→ ఈ మధ్యకాలంలో కెవాలియర్ – స్మిత్ (1998) జీవులను 6 రాజ్యాలుగా వర్గీకరించారు.
అవి : 1) బ్యా క్టీరియా 2) ప్రోటోజోవా 3) క్రోమిస్టా 4) ప్లాంటే 5) ఫంగై 6) అనిమేలియా.
మొక్కలను 5 సమూహాలుగా విభజించారు. అవి థాలో ఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పర్ములు మరియు ఆంజయోస్పర్మ్ లు, జంతువులు 10 సమూహాలుగా చేయబడినాయి. అవి పొరిఫెరా, సీలెంటిరేటా, ప్లాటీ హెల్మంథిస్, నెమటోడ, అనెలిడ, ఆర్రోపోడ, మొలస్కా, ఎకైనోడర్మేట, ప్రోటోకార్డేటా మరియు వర్టిబ్రేటా
→ మొనిరా వర్గజీవులు ఏకకణ కేంద్రకపూర్వ జీవులు.
ఉదా : బాక్టీరియా, అనబినా.
→ ప్రొటిస్టా వర్గజీవులు ఏకకణ లేదా బహుకణ నిజకేంద్రక జీవులు.
స్వయంపోషక లేదా పరపోషక జీవులు. ఉదా : పారమీషియమ్, ఆల్గే, డయాటమ్.
→ శిలీంధ్ర జీవులు కొన్ని ఏకకణ జీవులు మరియు బహుకణ జీవులు. సిద్ధబీజాల సహాయంతో ప్రత్యుత్పత్తి జరుపుతాయి.
ఉదా : రైజోపస్, మ్యూకార్, అగారికస్.
→ పుష్పించని మొక్కలను క్రిప్టోగామ్స్ అంటారు. ఉదా : బ్రయో ఫైటా, శిలీంధ్రాలు
→ పుష్పించే మొక్కలను ఫేనెరోగామ్స్ అంటారు. ఉదా : మామిడి, మందార
→ విత్తనాలు పండ్ల లోపల ఉంటే వాటిని ఆవృత బీజాలు అంటారు. ఉదా : మామిడి
→ విత్తనాలు బయటకు కనిపిస్తూ ఉంటే వివృత బీజాలు అంటారు. ఉదా : పైన్
→ పొరి ఫెర అనగా రంధ్రములు గల జీవులు, స్థిరజీవులు. రంధ్రాలు నాళవ్యవస్థగా పని చేస్తాయి.
ఉదా : యూప్లికీలీయ, సైకాన్, స్పంజీలా
→ సీలెంటిరేటా జీవులు ద్విస్తరిత జీవులు. శరీరకుహరం గలవి. నీటిలో నివసిస్తాయి.
ఉదా : హైడ్రా, జెల్లీఫిష్
→ ప్లాటీ హెల్మింథిస్ జీవుల శరీరం ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన త్రిస్తరిత జీవులు. నిజ శరీర కుహరం ఉండదు. చదును పురుగులంటారు.
ఉదా : ప్లనేరియా (స్వతంత్రంగా), టీనియాసోలియమ్ (పరాన్నజీవి) జీవిస్తాయి.
→ నెమటోడ వర్గజీవుల శరీరం ద్విపార్శ్వ సౌష్టవం, త్రిస్తరిత, స్తూపాకార మిధ్యాకుహరం గలిగిన జీవులు.
ఉదా : వుకరేరియ బ్యాంక్రాప్తి, ఆస్కారిస్ లుంబికాయిడ్స్
→ అనెలిడ వర్గజీవుల శరీరం ద్విపార్శ్వ సౌష్టవం, త్రిస్తరిత, ఖనిజ కుహరం గల ఖండిత జీవులు.
ఉదా : వానపాము, జలగ
→ ఆర్థ్రోపోడ వర్గజీవులు ద్విపార్శ్వ సౌష్టవం కలిగిన ఖండిత జీవులు. శరీరకుహరం కలిగి ఉంటాయి. కీళ్ళు గల కాళ్ళు, స్వేచ్ఛాయుత రక్తప్రసరణ కలిగి ఉంటాయి.
→ మొలస్కా జీవుల శరీరం ద్విపార్శ్వ సౌష్టవం కలిగి శరీరకుహరం కుంచించుకుపోయి ఉంటుంది. శరీర విభజన ప్రారంభం అవుతుంది. వృక్కాలు విసర్జనకు తోడ్పడతాయి.
ఉదా : నత్తలు, కోమటి సంచులు (లాలిగా), ఆల్చిప్పలు
→ ఇఖైనోడర్మేటా జీవుల శరీరాలు తీస్తరిత, అనుపార్శ్వ సౌష్ఠవం, ముళ్ళ వంటి చర్మం కలిగినవి. చలనం కోసం నాళికాపాదాలు ఉపయోగించుకుంటాయి.
ఉదా : సముద్ర నక్షత్రం, సీ అర్చిన్లు
→ ప్రొటోకార్డేటా జీవుల శరీరం త్రిస్తరిత, ద్విపార్శ్వ సౌష్టవం, శరీరకుహరం గల జీవులు. సృష్ఠవంశం జీవితంలో ఏదో ఒక ఆశలో తప్పక ఉంటుంది.
ఉదా : బెలనోగ్లోసెస్, హెర్ట్ మానియా మరియు ఏంఫియాక్సస్
→ సకశేరుకాలు నిజమైన శరీర కుహరం, వెన్నెముక అంతర అస్థిపంజరం కలిగి ఉంటాయి.
ఉదా : చేపలు, ఉభయచరాలు మొదలైనవి
→ డాల్ఫిన్, తిమింగలం, నీటిగుర్రాలు జల క్షీరదాలు. వీటిలో మగజీవి పిల్లల్ని కంటుంది.
→ ఒక జీవిని ఒక శాస్త్రీయ నామంతో పిలవడాన్ని ‘నామీకరణం’ అంటారు.
→ ద్వినామీకరణ విధానంలో లిన్నేయస్ ప్రతి జీవికి రెండు పేర్లు ఉండాలని చెప్పాడు. మొదటి పేరు ప్రజాతిని, రెండవ పేరు జాతిని సూచిస్తుంది.
→ వైవిధ్యం : రకరకాల ప్రజలు లేదా వస్తువులు ఒకదాని నుండి మరియొకటి తేడా గలిగినవి. ఒకే జాతి జీవుల మధ్య ఉండే తేడా.
→ జీవ వైవిధ్యం : ఒక నిర్దిష్ట ప్రాంతములో ఉండే రకరకాల జీవ సముదాయం.
→ బీజదళం : విత్తనము నుండి మొలకెత్తే ప్రథమ ఆకు.
→ ఏకదళ బీజాలు : గింజలలో ఒకే బీజదళం కలిగిన మొక్కలు.
→ ద్విదళ బీజాలు : గింజలలో రెండు బీజదళాలు కలిగిన మొక్కలు.
→ వర్గీకరణం : ప్రకృతిలో ఉన్న జీవుల గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేయడానికి తోడ్పడే శాస్త్రం
→ శీతల రక్త జంతువులు : పరిసరాల ఉష్ణోగ్రతకు అనుకూలంగా తమ శరీర ఉష్ణోగ్రతను మార్చుకోగల జంతువులు.
ఉదా : చేపలు, పాములు
→ హిప్పోకాంపస్ : నీటిగుర్రం అంటారు. జంతువులా కనిపించే చేప. మగజీవి పిల్లల్ని కంటుంది.
→ నామీకరణ విధానం : ఒక జీవిని ఒక శాస్త్రీయ నామంతో పిలవడం.
→ వృక్ష సముదాయం : ఒక ప్రదేశంలో ఉండే మొక్కల సమూహాలు.
→ జంతు సముదాయం : ఒక ప్రదేశంలో ఉండే జంతువుల సమూహాలు.
→ పరిణామం : క్రమంగా మార్పుచెందడం. మొక్కలు మరియు జంతువులు క్రమంగా సరళము నుండి సంక్లిష్టముగా మార్పుచెందాయని చెప్పే శాస్త్రీయ విధానం.
→ జంతు రాజ్యం : వర్గీకరణలో ఇది అతిపెద్ద స్థాయి. విట్టేకర్ ప్రకారం జంతువులన్నిటినీ 5 రాజ్యాలుగా విభజించారు.
→ రంగం : వర్గీకరణ విధానంలో జీవుల అమరిక రంగం నుండి ప్రారంభమవుతుంది.
→ వర్గం : ఒకటి లేదా ఎక్కువ విభాగాలు కలిసి ఒక వర్గం ఏర్పడుతుంది. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు మొదలయిన విభాగాలు ప్రొటోకార్డేటాతో కలిసి కార్డేటా ఏర్పడింది.
→ తరగతి : ఒకే రకపు క్రమాలు కలిసి ఏర్పడినది.
→ క్రమం : ఒకటి లేదా దగ్గర సంబంధాలు గల కుటుంబాలు కలిసి ఏర్పడినది.
→ కుటుంబం : సన్నిహిత సంబంధం కలిగిన కొన్ని ప్రజాతులు కలిగినది.
→ ప్రజాతి : దగ్గర సంబంధం కలిగి, కొన్ని లక్షణాలతో పోలికలున్న జాతులు కలిసి ఏర్పడినది.
→ జాతి : ఒకే రకమైన లక్షణాలు కలిగి ఉండి జంటగా లేదా స్వతంత్రంగా తమ సంతతిని ఉత్పత్తి చేయగల జీవుల సమూహం.
→ ధర్మోఫిల్స్ : వేడినీటి బుగ్గలలో నివసించగలిగే కేంద్రక పూర్వజీవులు.
→ హేలోఫిల్స్ : అతి లవణీయత కలిగిన నీటిలో జీవించగలిగే కేంద్రక పూర్వజీవులు.
→ లూకా కణం : కణములన్ని స్వతంత్ర పూర్వక కణం నుండి ఏర్పడినాయి. లూకా నుండి తర్వాత కాలంలో మూడు రకాల కణాలు పుట్టుకొచ్చాయి.
→ క్రిష్ణోగ్రాములు : పుష్పించని మొక్కలు.
→ ఫెనెరోగామ్స్ : పుష్పించే మొక్కలు.
→ ఉష్ణరక్త జంతువులు : పరిసరాల ఉష్ణోగ్రతకు అనుగుణంగా తమ శరీర ఉష్ణోగ్రతను మార్చుకోలేని జంతువులు.
ఉదా: పక్షులు, క్షీరదాలు
→ ద్వినామీకరణం : ప్రతి జీవికీ రెండు పేర్లు ఉండే విధానం. మొదటి పేరు ప్రజాతిని, రెండవ పేరు జాతిని సూచిస్తుంది.
→ త్రిస్తరిత జీవులు : శరీరం మూడు పొరలుగా విభేదనం చెంది ఉంటుంది.
→ ద్విపార్య సౌష్టవం : శరీర కుడి, ఎడమభాగాలు సమంగా ఉంటాయి.
→ శరీర కుహరం : జీవి శరీరం లోపల ఉండే ఖాళీ ప్రదేశం.
→ మిథ్యాకుహరం : నిజమైన శరీరకుహరం లేకపోవటం.
→ ఆర్థ్రోపాడ : కీళ్ళ గల కాళ్ళు ఉండటం
→ ప్రొటోకార్డేటాలు : ఇవి త్రిస్తరిత జీవులు, ద్విపార్శ్వ సౌష్ఠవం గల జీవులు. శరీర కుహరం గలవి. ఈ జీవుల జీవితంలో పృష్ఠ వంశం ఏదో ఒక దశలో తప్పక ఉంటుంది.
→ పృష్ట వంశం : ఇది ఒక కడ్డీ వంటి నిర్మాణం. శరీరం వెనుకభాగంలో తల నుండి చివరి వరకు వ్యాపించి ఉంటుంది.