These AP 9th Physical Science Important Questions and Answers 2nd Lesson గమన నియమాలు will help students prepare well for the exams.
AP Board 9th Class Physical Science 2nd Lesson Important Questions and Answers గమన నియమాలు
9th Class Physical Science 2nd Lesson గమన నియమాలు 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
క్రికెట్ ఆటలో పేస్ బౌలర్ బంతిని విసరడానికి ముందు చాలా దూరం నుండి పరుగెత్తి వచ్చి విసురుతాడు ఎందుకు?
జవాబు:
బంతికి కొంత ద్రవ్యవేగము ఇవ్వడానికి చాలా దూరం నుండి. పరుగెత్తి వచ్చి విసురుతాడు. దీనివలన బంతి ఎక్కువ గమన జడత్వం కూడా పొందును.
ప్రశ్న 2.
న్యూటన్ మూడవ గమన నియమాన్ని అవగాహన చేసుకొనుటకు ఒక ప్రశ్నను రాయండి.
జవాబు:
రాకెట్ ఎగురుటలో ఇమిడియున్న సూత్రం ఏది?
ప్రశ్న 3.
క్రికెట్ ఆటగాడు వేగంగా వస్తున్న బంతిని పట్టుకునే సమయంలో చేతులు నక్కి లాగుతాడు. ఎందుకు?
జవాబు:
క్రికెట్ ఆటగాడు వేగంగా వస్తున్న బంతిని పట్టుకునే సమయంలో చేతులు వెనక్కి లాగుతాడు. ఎందుకనగా ప్రచోదన బల పరిమాణం తగ్గించుటకు.
ప్రచోదనం = ఫలితబలం × కాలం.
కాలం పెంచడం ద్వారా ఫలితబలం తగ్గుతుంది.
ప్రశ్న 4.
న్యూటన్ మొదటి గమన నియమమును పేర్కొనుము.
జవాబు:
ఫలిత బలం పనిచేయనంత వరకు నిశ్చలస్థితిలోనున్న వస్తువు అదే స్థితిలోను, సమచలనంలోనున్న వస్తువు అదేసమచలనంలోను ఉంటుంది.
ప్రశ్న 5.
న్యూటన్ మొదటి గమన నియమానికి గల మరొక పేరేమిటి?
జవాబు:
జడత్వ నియమము.
ప్రశ్న 6.
న్యూటన్ రెండవ గమన నియమమును పేర్కొనుము.
జవాబు:
వస్తువు ద్రవ్యవేగంలో మార్పురేటు, దానిపై పనిచేసే ఫలిత బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. దాని దిశ ఫలిత బలదిశలో ఉంటుంది.
ప్రశ్న 7.
జడత్వం అనగానేమి?
జవాబు:
నిశ్చలస్థితిలో గాని, సమచలనంలో గాని ఉన్న వస్తువు, తన గమనస్థితిలో మార్పుని వ్యతిరేకించే సహజ గుణాన్ని జడత్వం అంటారు.
ప్రశ్న 8.
ద్రవ్యవేగం అనగానేమి?
జవాబు:
ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగం, ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి, వేగాల లబ్దంగా నిర్వచించవచ్చు.
ద్రవ్యవేగం (P) = ద్రవ్యరాశి × వేగం
దీని ప్రమాణాలు : కి.గ్రా. మీ/సె. (లేదా) న్యూటన్ -సెకను.
ప్రశ్న 9.
న్యూటన్ మూడవ గమన నియమాన్ని పేర్కొనుము.
జవాబు:
ఒక వస్తువు, వేరొక వస్తువుపై బలాన్ని కలుగజేస్తే, ఆ రెండవ వస్తువు కూడా మొదటి వస్తువుపై అంతే పరిమాణంలో బలాన్ని వ్యతిరేకదిశలో ప్రయోగిస్తుంది.
ప్రశ్న 10.
ద్రవ్యవేగ నిత్యత్వ నియమమును వ్రాయుము.
జవాబు:
ఏదైనా వ్యవస్థపై పని చేసే బాహ్య బలం శూన్యమయితే ఆ వ్యవస్థ యొక్క మొత్తం ద్రవ్యవేగము స్థిరము.
ప్రశ్న 11.
ప్రచోదనం అంటే ఏమిటి?
జవాబు:
ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగంలో మార్పు తీసుకొచ్చే బలం మరియు కాలముల లబ్దాన్ని ప్రచోదనం అంటారు.
ప్రశ్న 12.
సాధారణంగా వస్తువుపై పనిచేయు బలాలను వ్రాయుము.
జవాబు:
వస్తువులపై మనం కలిగించు బలమే కాక ఘర్షణ, గాలి నిరోధం మరియు గురుత్వ బలాలు పని చేస్తుంటాయి.
ప్రశ్న 13.
జడత్వమును నిర్వచించుము. అందలి రకాలను వ్రాయుము.
జవాబు:
జడత్వము :
ఒక వస్తువు నిశ్చలస్థితిలోగాని, సరళరేఖ వెంబడి పోయే సమవేగ స్థితిలోగాని కొనసాగు ధర్మంను జడత్వము అంటారు. జడత్వము మూడు రకాలు. అవి :
- నిశ్చల జడత్వము
- గమన జడత్వము
- దిశా జడత్వము.
ప్రశ్న 14.
గమనంలో ఉన్న రైలు బండిలో గమన దిశలో చూసే విధంగా కూర్చొని ఉన్న ఒక ప్రయాణికుడు ఒక నాణెమును నిలువుగా పైకి విసరగా, అది అతని ముందర పడినట్లయితే రైలు స్థితిని గూర్చి వ్రాయుము.
జవాబు:
రైలు బండి ఋణత్వరణంలో పోతుంటే, నాణెము అతని ముందు పడుతుంది.
ప్రశ్న 15.
సమతలంపై ఉంచిన ‘M’ ద్రవ్యరాశి గల వస్తువుపై క్షితిజ సమాంతరంగా 100 బలం నిరంతరంగా ప్రయోగించడం వల్ల ఆ వస్తువు నిలకడగా కదులుతుంది. స్వేచ్ఛావస్తుపటాన్ని (FBD) గీయండి.
జవాబు:
వస్తువు నిలకడగా కదులుతుందని ఇవ్వడమైనది, అంటే క్షితిజ సమాంతర, లంబ అంశాలలో ఆ వస్తువుపై ఫలిత బలం శూన్యము.
ప్రశ్న 16.
ప్రక్క పటం నుండి నీవు గ్రహించిన విషయమేమి?
జవాబు:
వస్తువుపై పనిచేయు ఫలిత బలం శూన్యము.
ప్రశ్న 17.
నీవు సైకిలు తొక్కునపుడు, తొక్కడం ఆపివేస్తే దాని వేగం తగ్గును. ఎందుకో తెల్పుము.
జవాబు:
సైకిలు గమన దిశకు వ్యతిరేకంగా రోడ్డు ఘర్షణ బలం పనిచేయును కనుక.
ప్రశ్న 18.
వెళ్ళుచున్న బస్సు నుండి దూకటం ప్రమాదకరం. ఎందుకు?
జవాబు:
వెళ్ళుచున్న బస్సు నుండి దూకగానే మన శరీరంలోని పాదాలు నేలను తాకి నిశ్చలస్థితికి వస్తాయి. కాని శరీరం పైభాగం గమనంలో ఉండటం వలన పడిపోయే ప్రమాదముంది.
ప్రశ్న 19.
రాజు వాళ్ళ అమ్మగారు ప్రతిరోజు బట్టలను నీటితో శుభ్రం చేసిన తర్వాత తడిగా ఉన్న వాటిని గట్టిగా విదల్చటం చేస్తున్నారు. ఎందుకు?
జవాబు:
బట్టలను విదల్చటం ద్వారా గమన జడత్వ స్వభావం వలన బట్టలలోని నీరు దూరముగా వెళుతుంది. తద్వారా బట్టలు త్వరగా ఆరిపోతాయి.
9th Class Physical Science 2nd Lesson గమన నియమాలు 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
300 Kg ద్రవ్యరాశి గల ఒక వాహనము 90 కి.మీ./గం. వేగముతో ప్రయాణించుతున్నది. దాని ద్రవ్య వేగమును కనుగొనుము.
జవాబు:
వాహనం ద్రవ్యరాశి (m) = 300 kg
వాహన వేగం (v) = 90 km/hr = 90 x \(\frac{5}{18}\) + m/s = 25 m/s
ద్రవ్యవేగం = mv = 300 × 25 = 7500 kg.m.s-1
ప్రశ్న 2.
“నిత్య జీవితంలో అన్ని సందర్భాలలో వస్తువులను కదల్చడానికి వాటిపై బలాన్ని ప్రయోగిస్తూ ఉండాలి”.
అ) ఏ నియమంతో పైన తెలిపిన వాక్యాన్ని సమర్ధిస్తావు?
ఆ) వస్తువుని చలనంలోకి తీసుకువచ్చేది బలమా, ఫలిత బలమా? సమర్ధించండి.
జవాబు:
అ) న్యూటన్ మొదటి గమన నియమం.
ఆ) వస్తువుని చలనంలోకి తీసుకువచ్చేది ఫలిత బలం.
ఉదా : ఒక వస్తువుపై రెండు బలాలు సమానంగా, వ్యతిరేకంగా పని చేసిన వస్తువు కదలదు. ఫలిత బలం సున్న అవుతుంది. అనగా, ఫలిత బలం ఉంటేనే వస్తువు కదులుతుంది.
ప్రశ్న 3.
0.5 కి.గ్రా. ద్రవ్యరాశి గల ఒక వస్తువు, పటంలో చూపిన విధంగా ఒక స్థిరమైన ఆధారానికి వేలాడదీయబడినది. ఆ వస్తువు పై తాడు ప్రయోగించే బలమెంతో కనుక్కోండి.
జవాబు:
వస్తువు పై పనిచేసే బలాలు
- భూమ్యాకర్షణ బలం (క్రింది వైపుకు) = 0.5 కి.గ్రా, × 9.8 m/s² = 4.9 N
- తాడు తన్యత T (పై వైపుకు)
వస్తువు నిశ్చలస్థితిలోనున్నది కావున పై రెండు బలాలు సమానం
∴ వస్తువు పై తాడు ప్రయోగించే బలం T = 4.9 N (పై వైపుకు).
ప్రశ్న 4.
ద్రవ్యవేగంను నిర్వచించుము. ద్రవ్యవేగము సదిశ రాశా? అదిశ రాశా? ప్రమాణాలు ఏవి?
జవాబు:
1) ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి మరియు వేగాల లబ్ధమును ద్రవ్యవేగము అంటారు.
∴ ద్రవ్యవేగము = ద్రవ్యరాశి × వేగం
P = m × v
P = mv
2) ద్రవ్యవేగము సదిశ రాశి. వేగ దిశలోనే ద్రవ్యవేగము దిశ కూడా ఉండును.
ప్రమాణాలు :
S.I పద్దతిలో ద్రవ్యవేగానికి ప్రమాణము కి.గ్రా. – మీ/సెకను (లేదా) న్యూటన్ – సెకను.
ప్రశ్న 5.
ప్రక్క పటంలో F1 మరియు F2, అను రెండు బలాలు పనిచేయుచున్నాయి.
1) వస్తువు పై పనిచేయు ఫలిత బలం ఎంత?
2) ఫలిత బలదిశ ఎటువైపు కలదు?
3) వస్తువు ద్రవ్యరాశి 10 కిలోలు అయిన దానిలో కలిగే త్వరణం ఎంత?
జవాబు:
1) ఫలిత బలము = 30-20 = 10 N
2) ఫలిత బలదిశ కుడివైపుకు కలదు.
3) \(\mathrm{a}=\frac{\mathrm{F}}{\mathrm{m}}=\frac{10}{10}=1 \mathrm{~m} / \mathrm{s}^{2}\)
ప్రశ్న 6.
ఆటవుడ్ యంత్రంలో m1 > m1 అయిన ఆ రెండు భారాల త్వరణాలను, తాడులో తన్యతను చూపు FBD పటాలను గీయుము.
(లేదా)
రెండు భారాల యొక్క స్వేచ్ఛ వస్తు పటాలను (FBD) గీయండి.
జవాబు:
ప్రశ్న 7.
జదత్వ ధర్మాన్ని గూర్చి వ్రాసి, దాని ప్రమాణాలను తెల్పుము.
జవాబు:
- వస్తువుల చలన స్థితిలో మార్పుని వ్యతిరేకించే ధర్మాన్నే జడత్వ ధర్మం అంటారు.
- ఇది వస్తువు ద్రవ్యరాశి పై ఆధారపడి ఉంటుంది.
- జడత్వపు కొలతనే వస్తువు ద్రవ్యరాశి అంటారు.
ప్రమాణాలు :
ద్రవ్యరాశి యొక్క S.I ప్రమాణం కి.గ్రా.
ప్రశ్న 8.
కొన్ని ఉదాహరణలతో “ద్రవ్యవేగము” అను ధర్మంను తెల్పుము.
జవాబు:
ఉదాహరణ – 1 :
ఒక బ్యాడ్మింటన్ బంతి, ఒక క్రికెట్ బంతి ఒకే వేగంతో నిన్ను ఢీకొన్న క్రికెట్ బంతి ఎక్కువ బాధ కలిగించును.
ఉదాహరణ – 2 :
ఒక సైకిలు, ఒక లారీ రెండూ ఒక గోడను గుద్దితే లారీ గోడని ఎక్కువ నాశనం చేస్తుంది.
ఉదాహరణ – 3 :
ఒక చిన్న బుల్లెట్ కేవలం దానికి ఉండే వేగం వల్లే దాని దారిలో ఉన్న వస్తువుకు హాని కలిగించును.
పై ఉదాహరణలను గమనించగా ద్రవ్యవేగ ప్రభావం అనేది ద్రవ్యరాశి, వేగంలపై ఆధారపడి ఉంటుందని తెలుస్తుంది.
ప్రశ్న 9.
ప్రచోదనం అంటే ఏమిటో నిర్వచించి, దాని అనువర్తనాలను వ్రాయుము.
జవాబు:
ఒక వస్తువు యొక్క ద్రవ్యవేగంలో మార్పు తీసుకొచ్చే బలం మరియు కాలాల లబ్దాన్ని ప్రచోదనం అంటారు.
(లేక)
ఒక వస్తువుపై బలం ప్రయోగించినప్పుడు ఆ వస్తువు ద్రవ్యవేగంలో వచ్చే మార్పును ప్రచోదనం అంటారు.
అనువర్తనాలు:
- క్రికెట్ ఆడే వ్యక్తి బంతి పట్టుకునేటప్పుడు చేతిని వెనక్కి లాగి పట్టుకుంటాడు. ఎందుకనగా ప్రచోదనబల పరిమాణమును తగ్గించుటకు.
- వాహనాలలో షాకబ్జర్వర్స్ వాడతారు. ఎందుకనగా ప్రచోదనబల పరిమాణాన్ని తగ్గించుటకు,
ప్రశ్న 10.
రాణి తన స్కూలులో Magic shoun కు వెళ్ళింది. షోలో ఒకతను టేబుల్ మీది గుద్దను ఒక్కసారిగా లాగినా దాని మీద పెట్టిన పాత్రలు దాదాపు కదలకుండా అలాగే పడిపోకుండా ఉన్నాయి. రాణికి అతను చేసిన Magic పై కొన్ని సందేహాలు, ప్రశ్నలు తలెత్తాయి. అవి ఏమిటో మీరు ఊహించగలరా ? కొన్నింటిని వ్రాయండి.
జవాబు:
- ఈ Magic ని సమర్థవంతంగా నిర్వహించడానికి ఏం కావాలి?
- అతను ఎటువంటి గుడ్డను ఉపయోగించాడు?
- టేబుల్ పై పెట్టిన పాత్రలు అధిక ద్రవ్యరాశిని కలిగి ఉండాలా? లేక తక్కువ ద్రవ్యరాశివైనా పర్వాలేదా?
- గుడ్డను ఒక్కసారిగా ఎక్కువ బలాన్ని ప్రయోగించి లాగాలా?
- గుడ్డపై బలాన్ని సున్నితంగా, ఎక్కువసేపు ప్రయోగించాలా?
ప్రశ్న 11.
అటవుడ్ యంత్రం పటమును గీయుము.
(లేదా)
‘m1‘, ‘m2’ ద్రవ్యరాశి గల రెండు వస్తువులు ఒక తీగ ద్వారా స్థిరమైన ఆధారానికి వ్రేలాడదీయబడిన కప్పి నుండి వ్రేలాడదీయబడినవి. ఈ యంత్రాన్ని గుర్తించండి. దాని పటమును గీయండి.
(లేదా)
న్యూటన్ గమన నియమాలను నిరూపించు “యంత్రం” పేరు ఏమిటి ? ఆ యంత్రం పటాన్ని చక్కగా గీయండి.
జవాబు:
‘అట్ వుడ్ యంత్రం’తో న్యూటన్ గమన నియమాలను నిరూపించ వచ్చును.
9th Class Physical Science 2nd Lesson గమన నియమాలు 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
కింది పట్టికను పూరించండి.
జవాబు:
ప్రశ్న 2.
న్యూటన్ రెండవ గమన నియమమును నిర్వచించి, దానికి సూత్రమును రాబట్టుము.
(లేదా)
F: ma ను ద్రవ్యవేగం ద్వారా రాబట్టుము.
(లేదా)
న్యూటన్ రెండవ గమన నియమముకు, ద్రవ్యవేగంను ఉపయోగించి సూత్రమును ఉత్పాదించుము.
జవాబు:
న్యూటన్ రెండవ గమన నియమము :
ఒక వస్తువు ద్రవ్యవేగము మార్పురేటు దానిపై చర్య జరిపే బాహ్య బలానికి అనులోమానుపాతంలో ఉండి, ద్రవ్యవేగంలో మార్పు ఆ బాహ్యబల దిశలోనే సంభవించును.
∆p అనగా ఒక కణం (లేక) కణ వ్యవస్థపై కొంత సమయం పాటు ఫలితబలం పనిచేయడం వల్ల వాటి ద్రవ్యవేగంలో వచ్చే మార్పు.
పై సమీకరణం నుండి వస్తువుపై పనిచేసే ఫలిత బలం, బల దిశలోనే వస్తువుపై త్వరణంను కలిగిస్తుంది.
ప్రశ్న 3.
బలానికి సమీకరణాన్ని రాబట్టుము. ప్రమాణాలు వ్రాయుము.
జవాబు:
న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారము వస్తువుల త్వరణము వాటిపై పనిచేసే బాహ్యబలానికి అనులోమాను పాతంలోనూ, వాటి ద్రవ్యరాశులకు విలోమానుపాతంలోనూ ఉంటుంది.
ప్రమాణాలు:
1) బలం యొక్క S.I ప్రమాణం 1 కి.గ్రా. -మీటరు/సెకను². దీనినే న్యూటన్ అంటారు.
∴ 1 న్యూటన్ = 1 కి.గ్రా. -మీటరు/సె²
2) బలం యొక్క C.G.S.ప్రమాణం 1 గ్రాము – సెంటీమీటర్/సెకను . దీనినే డైను అంటారు.
∴ 1 డైను = 1 గ్రా-సెం.మీ/సెకన్²
ప్రశ్న 4.
న్యూటన్ మూడవ గమన నియమం ద్వారా “ద్రవ్యవేగ నిత్యత్వ నియమం”కు సమీకరణంను రాబట్టుము.
జవాబు:
1) m1 మరియు m2 ద్రవ్యరాశులు గల రెండు గోళాలు వరుసగా u1, u2 వేగాలతో సరళరేఖా మార్గంలో ఒకే దిశలో ప్రయాణిస్తున్నాయనుకొనుము.
2) u1 > u2 అయితే గోళాలు అఘాతం చెందుతాయి.
3) అఘాత కాలం ‘t’ సమయంలో మొదటి గోళం, రెండవగోళంపై ప్రయోగించిన బలం F21 గాను, రెండవ గోళం మొదటి గోళంపై ప్రయోగించిన బలం F12 గాను అనుకొనుము.
4) అభిఘాతం తర్వాత ఆ గోళాల వేగాలు వరుసగా v1, v2 అనుకొనుము.
5) న్యూటన్ మూడవ గమన నియమం ప్రకారం మొదటి గోళం రెండవ గోళంపై ప్రయోగించిన బిలం, రెండవ గోళం మొదటి గోళంపై ప్రయోగించిన బలానికి పరిమాణంలో సమానంగానూ, దిశలో వ్యతిరేకంగానూ ఉంటుంది.
∴ అభిఘాతం ముందు వ్యవస్థ మొత్తం ద్రవ్యవేగం = అభిఘాతం తర్వాత వ్యవస్థ మొత్తం ద్రవ్యవేగం. దీనిని బట్టి వ్యవస్థ యొక్క ద్రవ్యవేగం నిత్యత్వం కాబడినది.
ప్రశ్న 5.
ద్రవ్యవేగ నిత్యత్వ నియమమును వ్రాసి కొన్ని ఉదాహరణలిమ్ము.
జవాబు:
ఏదైనా వ్యవస్థపై పనిచేసే బాహ్యబలం శూన్యమయితే ఆ వ్యవస్థ యొక్క మొత్తం ద్రవ్యవేగం స్థిరము. దీనినే ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అందురు.
ఉదాహరణ:
- తుపాకీని పేల్చక ముందు, తుపాకీలోని గుండు మరియు తుపాకీ రెండూ నిశ్చల స్థితిలో ఉంటాయి.
- తుపాకీని పేల్చితే గొట్టం లోపల ఉత్పన్నమైన వాయువులు అధిక పీడనాన్ని కలగజేసి గుండును బయటకు నెడతాయి. ఫలితంగా తుపాకి వెనుకకు కదులుతుంది.
- ఈ విధంగా జరగడానికి కారణమైన వాయువులు ప్రయోగించే బలాలను వ్యవస్థలోగల అంతర్గత బలాలుగా పరిగణించాలి. కాబట్టి వ్యవస్థపై ఫలిత బలం శూన్యమైనది.
ఉదాహరణ : రాకెట్ ను ప్రయోగించినపుడు,
- రాకెట్ అడుగు భాగంలో గల నాజిల్ నుండి అతివేగంగా వెలువడే వాయువుల వల్ల రాకెట్ త్వరణాన్ని పొందును.
- నాజిల్ నుండి వెలువడే వాయువు రాకెట్ పై ప్రయోగించే ప్రతిచర్యా బలం వల్ల వెలువడే వాయువుకి వ్యతిరేక దిశలో రాకెట్ త్వరణం చెందుతుంది.
ఈ విధంగా ద్రవ్యవేగ నిత్యత్వ నియమము ప్రకారం వ్యవస్థపై ఫలిత బలము శూన్యమైనది.
9th Class Physical Science 2nd Lesson గమన నియమాలు 1 Mark Bits Questions and Answers
1. బలానికి S.I ప్రమాణము
A) i మాత్రం
B) ii మరియు iii
C) i మరియు iii
D) i, ii మరియు iii
జవాబు:
C) i మరియు iii
2. వేగంగా కదులుతున్న బంతిని సురక్షితంగా క్యాచ్ పట్టునపుడు
A) చేతులను అడ్డంగా ఉంచాలి.
B) బంతివైపు చేతులను కదిలించాలి.
C) చేతులను వెనుకకు లాగాలి.
D) A మరియు B
జవాబు:
C) చేతులను వెనుకకు లాగాలి.
3. న్యూటను – సెకను అనునది క్రిందివానిలో ……….. కు ప్రమాణం.
A) ద్రవ్యవేగం
B) జడత్వము
C) ప్రచోదనము
D) బలము
జవాబు:
A) ద్రవ్యవేగం
4. కదులుతున్న బస్సులో ఉంచిన సూట్ కేసు ముందుకు కదలాలాంటే, ఆ బస్సు
A) నిశ్చలస్థితిలోకి రావాలి.
B) ముందుకు కదలాలి.
C) ప్రక్కకు తిరగాలి.
D) నిశ్చలస్థితిలో ఉన్నపుడు
జవాబు:
A) నిశ్చలస్థితిలోకి రావాలి.
5. రేఖీయ ద్రవ్యవేగానికి ప్రమాణాలు
A) కి.గ్రా.మీ.సె-2
B) కి.గ్రా.మీ.సె-1
C) కి.గ్రా. మీ.సె-3
D) ప్రమాణాలు లేవు
జవాబు:
B) కి.గ్రా.మీ.సె-1
6. ఇద్దరు వ్యక్తులు 250 న్యూ ఫలిత బలంతో ఒక కారుని 2 సెకండ్ల పాటు నెట్టారు. కారుకి అందిన ప్రచోదనం
జవాబు:
A) 500 న్యూ. సి.
7. పాఠ్య పుస్తకంలోని కాగితపు రింగ్ కృత్యంలో, ఏ భౌతికరాశి యొక్క ఫలితాన్ని గమనించారు?
A) బలం
B) జడత్వం
C) వేగం
D) త్వరణం
జవాబు:
B) జడత్వం
8. బెలూన్ రాకెట్ కృత్యము ఏ నియమాన్ని ఉదహరిస్తుంది?
A) న్యూటన్ మొదటి గమన నియమం
B) న్యూటన్ రెండవ గమన నియమం
C) న్యూటన్ మూడవ గమన నియమం
D) న్యూటన్ గురుత్వాకర్షణ నియమం
జవాబు:
C) న్యూటన్ మూడవ గమన నియమం
9. అట్ ఉడ్ యంత్ర పరికరంలో ఉన్న ముఖ్యమైన భాగం
A) కప్పి
B) స్కేలు (సెం.మీ. లో క్రమబద్దీకరించబడిన)
C) బారోమీటర్
D) స్ప్రింగ్ త్రాసు
జవాబు:
A) కప్పి
10. వస్తు స్థితిని మార్చుటకు ప్రయత్నించు బలము
A) బలం
B) ద్రవ్యవేగము
C) జడత్వం
D) మార్పు
జవాబు:
C) జడత్వం
11. ఏ గమన నియమమును జడత్వ నియమం అంటారు?
A) మొదటి నియమం
B) రెండవ నియమం
C) మూడవ నియమం
D) ఏదీకాదు
జవాబు:
A) మొదటి నియమం
12. ఒక వస్తువుపై పనిచేయు ఫలిత బలం శూన్యం అయిన, ఆ వస్తువు ………….. గా ఉండును.
A) చలనము
B) నిశ్చలము
C) సమతుల్యం
D) ఏదీకాదు
జవాబు:
C) సమతుల్యం
13. ఒక వస్తువు యొక్క “గమన రాశి”ని తెల్పునది
A) ద్రవ్యరాశి
B) వేగము
C) ద్రవ్యవేగం
D) న్యూటన్
జవాబు:
C) ద్రవ్యవేగం
14. ఒక వస్తువుపై పనిచేయు శూన్యేతర. ఫలిత బలము వస్తువు …………. స్థితిని మార్చును.
A) సమతాస్థితి
B) చలన
C) నిశ్చల
D) ఏదీకాదు
జవాబు:
A) సమతాస్థితి
15. ఒక వస్తువు పై పనిచేయు శూన్యేతర ఫలిత బలం యొక్క ప్రభావమును వివరించునది.
A) న్యూటన్ మొదటి గమన నియమం
B) న్యూటన్ రెండవ గమన నియమము
C) న్యూటన్ మూడవ గమన నియమం
D) ద్రవ్యవేగ నిత్యత్వ నియమము
జవాబు:
B) న్యూటన్ రెండవ గమన నియమము
16. ద్రవ్యరాశి మరియు వేగముల లబ్దమును ………………. అంటారు.
A) సమతాస్థితి
B) ద్రవ్యవేగం
C) జడత్వం
D) బలం
జవాబు:
B) ద్రవ్యవేగం
17. ద్రవ్యవేగము ఒక ………… రాశి.
A) అదిశ
B) సదిశ
C) రేఖీయ
D) చలన
జవాబు:
B) సదిశ
18. దిశాజధత్వం తెలుపు దిశ ………. వైపు ఉందును.
A) ద్రవ్యరాశి
B) బలం
C) వేగము
D) చలనం
జవాబు:
C) వేగము
19. వస్తు త్వరణము దీనికి అనులోమానుపాతంలో ఉండును.
A) ద్రవ్యరాశి
B) వేగము
C) ద్రవ్యవేగము
D) బలము
జవాబు:
D) బలము
20. వస్తు త్వరణము దీనికి విలోమానుపాతంలో ఉండును.
A) ద్రవ్యరాశి
B) వేగము
C) ద్రవ్యవేగము
D) బలము
జవాబు:
A) ద్రవ్యరాశి
21. ఫలిత బలము, ద్రవ్యవేగంలోని మార్పు రేటుకు అనులోమానుపాతంలో ఉండును. దీనిని …………. అంటారు.
A) న్యూటన్ మొదటి గమన నియమం
B) న్యూటన్ రెండవ గమన నియమము
C) న్యూటన్ మూడవ గమన నియమం
D) ద్రవ్యవేగ నిత్యత్వ నియమము
జవాబు:
B) న్యూటన్ రెండవ గమన నియమము
22. 1 కేజి . మీ/సె² = 2
A) 1 డైను
B) 1 హెర్ట్
C) 1 న్యూటను
D) 1 ఓల్టు
జవాబు:
C) 1 న్యూటను
23. శూన్య ఫలిత బల ప్రభావం వల్ల ఒక వస్తువు ప్రవర్తనను వివరించు గమన సూత్రము ………….. ( )
A) 1వది
B) 2వది
C) 3వది
D) గురుత్వత్వరణం.
జవాబు:
A) 1వది
24. ఫలిత బలం మరియు బలప్రభావ కాలముల లబ్దమును ………… అంటారు.
A) ద్రవ్యవేగము.
B) త్వరణము
C) పరిక్షేపణము
D) ప్రచోదనము
జవాబు:
D) ప్రచోదనము
25. ద్రవ్యవేగంలోని మార్పు దీనిపై ఆధారపడును.
A) బల పరిమాణము
B) కాలము
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
C) A మరియు B
26. ఫలిత బలం శూన్యంగా గల ఈ వ్యవస్థలో మొత్తం ద్రవ్యవేగం స్థిరంగా ఉంటుంది.
A) ఏకాంక వ్యవస్థ
B) ద్రవ్య వ్యవస్థ
C) పరిక్షేపణ వ్యవస్థ
D) జడత్వ వ్యవస్థ
జవాబు:
A) ఏకాంక వ్యవస్థ
27. న్యూటన్ గమన నియమాలు
A) 1 వ నియమం
B) 2వ నియమం
C) 3వ నియమం
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ
28. వస్తువు గమనాన్ని వ్యతిరేకించే బలము
A) జడత్వం
B) ద్రవ్యవేగనిత్యత్వ నియమం
C) ఘర్షణ బలం
D) భారము
జవాబు:
C) ఘర్షణ బలం
29. న్యూటన్ మొదటి గమన నియమమును ……..
A) ఘర్షణ నియమము
B) బల నియమము
C) జడత్వ నియమము
D) ద్రవ్యవేగ నిత్యత్వ నియమము
జవాబు:
C) జడత్వ నియమము
30. ఒక వస్తువు పనిచేయు ఫలిత బలం విలువ శూన్యమైన ఆ వస్తువు ………. ఉండును.
A) చలనంలో
B) నిశ్చలంగా
C) త్వరణంలో
D) A మరియు B
జవాబు:
D) A మరియు B
31. వస్తువు యొక్క …………… ను జడత్వ ప్రమాణంగా లెక్కిస్తారు.
A) ఘనపరిమాణం
B) పీడనం
C) సాంద్రత
D) ద్రవ్యరాశి
జవాబు:
D) ద్రవ్యరాశి
32. ద్రవ్యరాశికి SI ప్రమాణము
A) కేజీ
B) గ్రాము
C) న్యూటన్
D) మిల్లీ గ్రాము
జవాబు:
A) కేజీ
33. ఒక వస్తువుకి ఉండే ద్రవ్యరాశి, ఆ వస్తువు ఎంత ……. ను కల్గి ఉంటుందో నిర్ణయించును.
A) దృఢత్వం
B) ప్రవాహత్వం
C) జడత్వం
D) విస్తరణ
జవాబు:
C) జడత్వం
34. వస్తువు పై పనిచేయు శూన్యేతర ఫలిత బలంను మార్చు ఫలితము
A) నిశ్చలము
B) చలనము
C) రెండునూ
D) ఏదీకాదు
జవాబు:
C) రెండునూ
35. న్యూటన్ ద్రవ్యవేగమును దీనికి ప్రత్యామ్నాయంగా వాడెను.
A) నిశ్చల ద్రవ్యరాశి
B) స్థిర ద్రవ్యరాశి
C) చలన ద్రవ్యరాశి
D) ఏదీకాదు
జవాబు:
C) చలన ద్రవ్యరాశి
36. దిశా ద్రవ్యవేగము ………….. యొక్క దిశను తెలుపును.
A) వేగం
B) వడి
C) త్వరణం
D) బలం
జవాబు:
B) వడి
37. ద్రవ్యవేగం యొక్క SI ప్రమాణము
A) kg.m/s²
B) kg-m/s
C) N.Sec
D) B మరియు C
జవాబు:
D) B మరియు C
38. త్వరణం విలువ ………… తో పాటు పెరుగును.
A) ద్రవ్యరాశి
B) పీడనం
C) ఘనపరిమాణం
D) ఫలిత బలం
జవాబు:
D) ఫలిత బలం
39. త్వరణం విలువ ………….. తో పాటు తగ్గును.
A) ద్రవ్యరాశి
B) పీడనం
C) ఘనపరిమాణం
D) ఫలిత బలం అని అంటారు.
జవాబు:
A) ద్రవ్యరాశి
40. బలం యొక్క ప్రమాణము
A) న్యూటను
B) N. S
C) N\s
D) N.m
జవాబు:
A) న్యూటను
41. బలం (F) =
జవాబు:
D) A మరియు B
42. ఒక వస్తువు, మరొక వస్తువుపై పనిచేయు బలంను వివరించుటకు వాడు నియమము ……….
A) న్యూటన్ మొదటి గమన నియమం
B) న్యూటన్ రెండవ గమన నియమము
C) న్యూటన్ మూడవ గమన నియమం
D) ఏదీకాదు
జవాబు:
C) న్యూటన్ మూడవ గమన నియమం
43. న్యూటను మూడవ గమన నియమంలో పనిచేయు బలాల జత
A) క్రియాజనక, క్రియాజన్యాలు
B) చర్యా, ప్రతిచర్య
C) బలం, రుణ బలం
D) ఏదీకాదు
జవాబు:
B) చర్యా, ప్రతిచర్య
44. ఒక వ్యవస్థపై పనిచేయు ఫలితబలం శూన్యమైన ఆ వ్యవస్థను ………… అంటారు.
A) ఏకాంక ఉష్ణోగ్రత
B) స్థిరోష్ణకు
C) ఏకాంక
D) స్థిర పరిమాణ
జవాబు:
C) ఏకాంక
45. సగటు బలం మరియు బలం పనిచేయు కాలం లబ్దంను ………….. అంటారు.
A) ద్రవ్యవేగము
B) బలం
C) త్వరణం
D) ప్రచోదనము
జవాబు:
D) ప్రచోదనము
46. ఒక వస్తువు ద్రవ్యవేగములోని మార్పు …………. కి సమానం.
A) ద్రవ్యవేగం
B) యుగ్మము
C) ప్రచోదనము
D) టార్క్
జవాబు:
C) ప్రచోదనము
47. ద్రవ్యవేగములోని మార్పునకు అనుసంధానించబడు నియమము
A) మొదటి గమన
B) రెండవ గమన
C) మూడవ గమన
D) ఏదీకాదు
జవాబు:
B) రెండవ గమన
48. ద్రవ్యవేగ నిత్యత్వ నియమం యొక్క సమీకరణం
జవాబు:
C
49. Fఫలిత • ∆t అనునది …….. కు సూత్రము.
A) త్వరణము
B) బలం
C) ప్రచోదనము
D) ద్రవ్యవేగము
జవాబు:
C) ప్రచోదనము
50. ద్రవ్యవేగంను సూచించునది
జవాబు:
C
51. \(\frac{\Delta \mathbf{v}}{\Delta \mathbf{t}}\) ఒక = …………
A) బలం
B) ద్రవ్యవేగము
C) స్థానభ్రంశం
D) త్వరణం
జవాబు:
D) త్వరణం
52. వస్తువుపై ఫలిత బలం పనిచేయకపోవుటను చూపు నియమం
A) మొదటి చలన నియమం
B) రెండవ చలన నియమం
C) మూడవ చలన నియమం
D) ఏదీకాదు
జవాబు:
A) మొదటి చలన నియమం
53. ఒక వస్తువుపై పనిచేయు ఫలిత బలం యొక్క ప్రభావం
A) మొదటి చలన నియమం
B) రెండవ చలన నియమం
C) మూడవ చలన నియమం
D) ఏదీకాదు
జవాబు:
B) రెండవ చలన నియమం
54. A : ఒక బంతిని నేలపై దొర్లించిన, అది నిశ్చలస్థితికి చేరును.
R: ప్రతి వస్తువుపై ఫలిత బలం పనిచేయకపోతే అది నిశ్చల స్థితిలో వుండును.
A) A మరియు Rలు సత్యాలు Aకు R సరైన వివరణ
B) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ కాదు
C) A సత్యము మరియు R అసత్యము
D) A అసత్యము మరియు R సత్యము
జవాబు:
B) A మరియు Rలు సత్యాలు, Aకు R సరైన వివరణ కాదు
55. కింది వాటిలో సరికానిది?
a) స్థిర జడత్వం : నిశ్చలస్థితిలో వున్న వస్తువు బాహ్య బల ప్రమేయం వరకు అదే స్థితిలో ఉండు జడత్వం.
b) గతిక జడత్వం : గమన స్థితిలో వున్న వస్తువు బాహ్య బల ప్రమేయం వరకు అదే స్థితిలో ఉండు జడత్వం.
A) a
B) b
C) a మరియు b
D) ఏదీకాదు
జవాబు:
B) b
56. ఘర్షణ లేకున్నట్లయితే చలనంలో వున్న బంతి
A) నిశ్చలస్థితికి వచ్చును
B) సమచలనంలో కదులును
C) క్రమేపి వేగం పెరుగును
D) మాయమగును
జవాబు:
B) సమచలనంలో కదులును
57. సైకిలను కారు కంటే సులభంగా నెట్టగలం. దీనికి కారణము
A) సైకిల్ ద్రవ్యరాశి > కారు ద్రవ్యరాశి
B) కారు ద్రవ్యరాశి > సైకిలు ద్రవ్యరాశి
C) కారు ద్రవ్యవేగము > సైకిలు ద్రవ్యవేగము
D) సైకిలు ద్రవ్యవేగము > కారు ద్రవ్యవేగము
జవాబు:
B) కారు ద్రవ్యరాశి > సైకిలు ద్రవ్యరాశి
58. ఒక వస్తువు దాని సమతాస్థితిని మార్చగలదు. దీనికి కారణము
A) శూన్యేతర బలం దానిపై పనిచేయుచున్నది
B) శూన్య ఫలిత బలం దానిపై పని చేయుచున్నది
C) A లేక B
D) ఏదీకాదు
జవాబు:
A) శూన్యేతర బలం దానిపై పనిచేయుచున్నది
59. బలం : ma : : ద్రవ్యవేగం : …….
A) m.f
B) mg
C) mv
D) ½mv²
జవాబు:
C) mv
60. ఒక మెత్తని దిండుపై గుడ్డును వదిలిన
A) అల్ప ప్రచోదనం వలన అది పగలదు
B) అధిక ప్రచోదనం వలన పగులును
C) A లేక B
D) అధిక ప్రచోదనం వలన అది పగులును
జవాబు:
A) అల్ప ప్రచోదనం వలన అది పగలదు
61. సమచలనంలోని వస్తువుపై ఫలిత బలం పనిచేయుచున్న ఏమగును?
A) దాని త్వరణం పెరుగును
B) దాని ఋణత్వరణం పెరుగును
C) A లేక B
D) A మరియు B
జవాబు:
C) A లేక B
62. a= b × c అను సూత్రము ఒక వస్తువుపై బల కాదు ప్రయోగదిశలో ఏర్పడిన త్వరణం ఫలితబలాన్ని ఇచ్చును. దీనిలో a, b మరియు c లు భౌతిక రాశులైనవి
A) Fఫలిత, ద్రవ్యరాశి, వేగము
B) Fఫలిత, ద్రవ్యరాశి, త్వరణం
C) త్వరణం, ద్రవ్యరాశి, ఘర్షణ
D) ద్రవ్యరాశి, Fఫలిత, గురుత్వ త్వరణం
జవాబు:
B) Fఫలిత, ద్రవ్యరాశి, త్వరణం
63.
A) బలం
B) త్వరణం
C) ద్రవ్యవేగం
D) ఏదీకాదు
జవాబు:
C) ద్రవ్యవేగం
64. ఈ ప్రయోగంలో ఏమి జరుగును?
A) పరీక్ష నాళిక మరియు కార్క్ మూత ఒకే దిశలో కదులును.
B) పరీక్ష నాళిక మరియు కార్క్ మూత వేర్వేరు దిశలలో కదులును.
C) తాడులో తన్యత తగ్గును.
D) కా మూత పరీక్ష నాళికలో పడుతుంది.
జవాబు:
B) పరీక్ష నాళిక మరియు కార్క్ మూత వేర్వేరు దిశలలో కదులును.
65. వేగంగా కదులుతున్న కారు యొక్క అద్దాన్ని ఒక ఈగ గుద్దుకుంటే
a) కారు మీద, ఈగ మీద ఒకే బలం ప్రయోగించబడును
b) గుద్దుకున్న తర్వాత కారు, ఈగ ఒకే త్వరణాన్ని కలిగి ఉంటాయి
A) a సత్యం
B) b సత్యం
C) a, b రెండూ సత్యం
D) ఏదీకాదు
జవాబు:
A) a సత్యం
66. గమనంలో వున్న విమానంను ఒక పక్షి గుద్దినట్లయితే
A) పక్షి వేగంగా గుద్దును
B) విమానం దెబ్బతినును
C) విమానం ఆగిపోవును.
D) A మరియు B.
జవాబు:
D) A మరియు B.
67. ఒక గోళీ ఏటవాలుతనముపై వేగంగా దొరుటకు గల కారణము
A) సాధారణ బలం
B) ఘర్షణ బలం
C) తన్యత
D) గురుత్వబలం
జవాబు:
D) గురుత్వబలం
68. ఒక వస్తువు ఏటవాలు తలంపైకి ఎక్కుచున్న దాని వేగము
A) పెరుగను
B) తగ్గును
C) మారదు
D) ఏదీకాదు
జవాబు:
B) తగ్గును
69. ప్రయోగశాలలో స్థితిక ఘర్షణను చూపుటకు అవసరమైన సామాగ్రి
A) బాటిల్, పేపర్, స్కేలు
B) గ్లాసు, చెక్క ప్లాంక్, స్టాండు
C) బాటిల్, పేపర్, పెన్నుమూత
D) పరీక్షనాళిక, కార్క్ నీరు
జవాబు:
C) బాటిల్, పేపర్, పెన్నుమూత
70. ఇవ్వబడిన ప్రయోగం యొక్క ఫలితం
A) వస్తువు జడత్వం, ద్రవ్యరాశిపై ఆధారపడును
B) వస్తువు జడత్వం. ఆకారంపై ఆధారపడును
C) ద్రవ్యరాశి మరియు జడత్వంల మధ్య ఎటువంటి సంబంధం లేదు
D) పైవేవీ కావు
జవాబు:
A) వస్తువు జడత్వం, ద్రవ్యరాశిపై ఆధారపడును
71. ఈ ప్రయోగం దీని నిరూపణను తెల్పును.
A) న్యూటన్ 1వ నియమం
B) న్యూటన్ 2వ నియమం
C) న్యూటన్ 3వ నియమం
D) న్యూటన్ గురుత్వ నియమం
జవాబు:
C) న్యూటన్ 3వ నియమం
72. పై పటంను గమనించగా, మనము ఒక స్ప్రింగు త్రాసును లాగిన, మరొక స్పింగు త్రాసులో రీడింగు విలువ
A) పెరుగును
B) తగ్గును
C) మారదు
D) చెప్పలేము
జవాబు:
A) పెరుగును
73. న్యూటన్ మూడవ గమన నియమం నిరూపణకు కావలసిన పరికరాలు
A) రెండు భారాలు
B) రెండు పరీక్ష నాళికలు
C) రెండు స్కేలులు
D) రెండు స్ప్రింగు త్రాసులు
జవాబు:
D) రెండు స్ప్రింగు త్రాసులు
74. భూమిపై ఉండు ఏ వస్తువుకైనా ఉండే సహజస్థితి నిశ్చల స్థితి అని ఆలోచించినవారు
A) గెలీలియో
B) అరిస్టాటిల్
C) న్యూటను
D) ఐన్ స్టీన్
జవాబు:
B) అరిస్టాటిల్
75. ప్రవచనం : గమనంలో వస్తువు బాహ్యబల ప్రమేయం చేసే వరకు అదే స్థితిలో వుండును అని చెప్పినవారు
A) గెలీలియో
B) అరిస్టాటిల్
C) న్యూటను
D) ఐన్‌స్టీన్
జవాబు:
A) గెలీలియో
76. గమన నియయాలు ప్రతిపాదించిన వారు
A) గెలీలియో
B) అరిస్టాటిల్
C) న్యూటను
D) ఐన్ స్టీన్
జవాబు:
C) న్యూటను
77. బలం మరియు గమనంలోని మార్పును వివరించిన
A) కెప్లెర్
B) న్యూటన్
C) ఫారడే
D) ఏదీకాదు
జవాబు:
B) న్యూటన్
78. ఒక వస్తువు విషయంలో Fఫలిత = 0, అను దత్తాంశములో వస్తు వేగము
A) శూన్యం
B) స్థిరము
C) A లేక B
D) A మరియు B
జవాబు:
C) A లేక B
79. వస్తువు తిన్నగా కదులుచున్నది. అయిన ఘర్షణ విలువ
A) శూన్యం
B) 10 N
C) 10 × 9.8 N
D) ఏదీకాదు
జవాబు:
B) 10 N
80. అటవుడ్ యంత్రంలో తన్యత \(\frac{2 m_{1} m_{2} 8}{m_{1}+m_{2}}\) మంది m1 = m2
ఈ దత్తాంశంలో తన్యత దీనికి సమానం.
A) భారము
B) ద్రవ్యరాశి
C) గురుత్వం
D) భారం/2
జవాబు:
A) భారము
81. FAB = – FBA ఈ దత్తాంశంకు సరికాని ప్రవచనం
A) రుణ గుర్తు అల్ప బలంను తెల్పును
B) FAB చర్యాబలంను తెల్పును
C) ఏకీకృత బలం సాధ్యపడదు
D) మూడవ గమన నియమపు ఫలితము
జవాబు:
A) రుణ గుర్తు అల్ప బలంను తెల్పును
82. దత్త పటము దీనికి ఉదాహరణ
A) న్యూటన్ 1వ నియమం
B) న్యూటన్ 2వ నియమం
C) న్యూటన్ 3వ నియమం
D) ఏదీకాదు
జవాబు:
C) న్యూటన్ 3వ నియమం
83. పటంలో వాడిన వ్యవస్థ పేరు
A) అటవుడ్ యంత్రం
B) గొలుసు వ్యవస్థ
C) ద్రవ్యవేగము
D) ఏదీకాదు
జవాబు:
A) అటవుడ్ యంత్రం
84. పై వ్యవస్థ ఉపయోగం
A) న్యూటన్ నియమాల నిరూపణకు
B) త్వరణం కనుగొనేందుకు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) న్యూటన్ నియమాల నిరూపణకు
85. బల్లపైన గల పుస్తకంపై పనిచేయు బలాలను చూపు వారు FBD పటంను గుర్తించుము.
జవాబు:
B
86. ఒక బల్లపైన ‘m’ ద్రవ్యరాశి గల వస్తువుపై 10 N బలం పనిచేయుచున్న అది క్షితిజంగా కదులుచున్న దాని FBD పటంను గుర్తించుము.
జవాబు:
D
87. “చెట్టు కొమ్మపై ఒక కోతి వేలాడుచున్నది” దీనిని చూపు FBD పటంను గుర్తించుము.
జవాబు:
A
88. 11 km/s వేగముతో శూన్యంలో ప్రయాణిస్తున్న రాకెట్టు నుండి వేరు కాబడిన వస్తువు వేగము
A) 0 km/s
B) 11 km/s
C) 11 × 9.8 km/s
D) ఏదీకాదు
జవాబు:
B) 11 km/s
89. 40 km/hr వేగంతో కదులుతున్న బస్సులో గల నీరు, బయట వున్న పరిశీలకునికి గల వేగ వ్యత్యాసం
A) 0
B) 40 km/hr
C) 40 × 9.8 km/hr
D) ఏదీకాదు
జవాబు:
B) 40 km/hr
90. ఒక గోడను భారీ వాహనం మరియు సైకిలు గుద్దిన అధికంగా గోడను దామేజ్ (నాశనం) చేయునది.
A) భారీ వాహనం
B) సైకిల్
C) రెండూనూ
D) ఏమీ జరుగదు.
జవాబు:
A) భారీ వాహనం
91. నిన్ను ఒక బ్యాడ్మింటన్ బంతి మరియు క్రికెట్ బంతి ఒకే వేగంతో తాకిన, నిన్ను ఎక్కువ బాధించునది, ఎందుకు?
A) బ్యాడ్మింటన్ బంతి – అధిక ద్రవ్యవేగము
B) క్రికెట్ బంతి – అల్ప ద్రవ్యవేగము
C) బ్యాడ్మింటన్ బంతి – అల్ప ద్రవ్యవేగము
D) క్రికెట్ బంతి – అధిక ద్రవ్యవేగము
జవాబు:
D) క్రికెట్ బంతి – అధిక ద్రవ్యవేగము
92. “ద్రవ్యచలనము” బదులు ద్రవ్యవేగంగా వాడినవారు
A) గెలిలియో
B) అరిస్టాటిల్
C) న్యూటను
D) ఐన్ స్టీన్
జవాబు:
C) న్యూటను
93. m1 = 6.2 kg, m2 = 3.6 kg అయిన తన్యత విలువ
A) 44. 64 N
B) 63.24 N
C) 22.32 N
D) ఏదీకాదు
జవాబు:
A) 44. 64 N
94. కింది వాటిలో న్యూటన్ మూడవ గమన నియమం అనువర్తనం కానిది
A) ఎగురుచున్న పక్షి
B) ఈదుతున్న చేప
C) రోడ్డుపై నడుస్తున్న వ్యక్తి
D) ఏదీకాదు
జవాబు:
D) ఏదీకాదు
95. ఒక బంతిపై భూమి కల్గించు బలం 8N. అదే విధంగా బంతి భూమిపై కల్గించు బలం
A) 8 × 9.8N
B) 8N
C) 4N
D) 0N
జవాబు:
B) 8N
96. అగ్నిమాపక దళము యొక్క వ్యక్తి తన చేతిలో గల నీటి పంపును ఆపుటకు అధిక బలంను వాడును. దీనిలో ఇమిడి ఉన్న నియమం
A) న్యూటన్ 1వ నియమం
B) న్యూటన్ 2వ నియమం
C) న్యూటన్ 3వ నియమం
D) న్యూటన్ 4వ నియమం
జవాబు:
C) న్యూటన్ 3వ నియమం
97. వేగంగా వస్తున్న క్రికెట్ బంతిని ఆపే వ్యక్తి చేతులు వెనుకకు లాగుటకు గల కారణము. అది
a) అల్ప బలంను ప్రయోగించును
b) అధిక బలంను ప్రయోగించును
c) అల్ప కాలంను ప్రయోగించును
d) అధిక కాలంను ప్రయోగించును
A) a, c
B) b, d
C) a, d
D) b, d
జవాబు:
B) b, d
98. యాక్సిడెంట్ జరుగు సమయంలో వాహన డ్రైవరుపై పనిచేయు ప్రచోదన బలంను కలుగచేయునవి
A) వాహన బ్రేకులు
B) వాహనంలోని ఎయిర్ బ్యాగ్లు
C) కిటికీ అద్దాలు పగుల గొట్టడం
D) పవర్ స్టీరింగ్
జవాబు:
B) వాహనంలోని ఎయిర్ బ్యాగ్లు
99. అధిక ఎత్తు నుండి దూకుచున్న వ్యక్తిని “Safty ner” లు రక్షించుటలో దాగిన సూత్రం
A) అల్ప ప్రచోదనం
B) అధిక ప్రచోదనము
C) అల్ప జడత్వం
D) అధిక జడత్వం
జవాబు:
A) అల్ప ప్రచోదనం
100. నీ పాదముపై కర్రతో కొట్టిన, నీవు ఏ విధంగా అధిక ప్రచోదనము నీ చేతిపై కలుగకుండా తప్పించుకునెదవో గుర్తించుము
A) కర్ర కింది వైపు పాదంను కదుపుట వలన
B) కర్రపై వైపు పాదంను కదుపుట వలన
C) కర్రలో ఎట్టి కదలిక లేకుండా
D) కర్రను పాదంతో పట్టుకొనుట వలన
జవాబు:
A) కర్ర కింది వైపు పాదంను కదుపుట వలన
101. ∆P = Fఫలిత ∆T × (Fఫలిత అధికం) సూత్ర ఉపయోగంలేని సందర్భం
A) కాంక్రీటు నేలపై కోడిగుడ్డు
B) సైకిలుతో గుద్దుట
C) బంతిని క్యాచ్ పట్టడంలో చేతిని వెనుకకు లాగుట
D) సిమెంటు రోడ్డుపైకి దూకుట వలన
జవాబు:
C) బంతిని క్యాచ్ పట్టడంలో చేతిని వెనుకకు లాగుట
102. ∆P = Fఫలిత ∆T (అధికం ∆T వలన) అను సూత్ర ఉపయోగంలేని సందర్భం
A) కాంక్రీటు నేలపై కోడిగుడ్డు
B) సైకిలుతో గుద్దుట
C) గోడను కారు ఢీ కొను సమయంలో ఎయిర్ బ్యాగ్లు తెరచుకొనుట
D) మన శరీరంపై బంతి తాకుట
జవాబు:
D) మన శరీరంపై బంతి తాకుట
103. పారాచూట్లో దాగి ఉన్న సూత్రం
A) నేలను తాకు సమయం ఎక్కువ – అల్ప ప్రచోదనం
B) నేలను తాకు సమయం ఎక్కువ – అధిక ప్రచోదనం
C) నేలను తాకు సమయం తక్కువ – అల్ప ప్రచోదనం
D) నేలను తాకు సమయం ఎక్కువ – అధిక ప్రచోదనం
జవాబు:
A) నేలను తాకు సమయం ఎక్కువ – అల్ప ప్రచోదనం
104. కార్పెట్టును కర్రతో తాకిన దానిలోని దుమ్ము బయటకు వచ్చుటకు కారణం
A) ధూళి సైతిక ఘర్పణ
B) దుమ్ము సైతిక ఘర్షణ
C) దుమ్ము గతిక ఘర్షణ
D) ఏదీకాదు
జవాబు:
A) ధూళి సైతిక ఘర్పణ
105. బస్సుపైన కట్టబడిన లగేజి కింద పడుటకు కారణం
A) లగేజి యొక్క సైతిక జడత్వం
B) బస్సు యొక్క స్థితిక జడత్వం
C) A మరియు B
D) లగేజి యొక్క గతిక జడత్వం A
జవాబు:
A) లగేజి యొక్క సైతిక జడత్వం
106. క్రికెట్టులో ఫాస్ట్ బౌలరు, బౌలింగుకు అధిక దూరంను తీసుకొనుటకు కారణం
A) బంతికి సైతిక ఘర్షణను అందించుట
B) బంతికి గతిక ఘర్షణను అందించుట
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) బంతికి గతిక ఘర్షణను అందించుట
107. కింది వాటిలో అధిక జడత్వం గలది
A) 8 కేజీల రాయి
B) 25 కేజీల రాయి
C) 80 కేజీల రాయి
D) అన్నీ సమానమే
జవాబు:
C) 80 కేజీల రాయి
108. 6 కేజీల బంతి 3 m/s వేగంతో కదులుచున్న దాని ద్రవ్యవేగము విలువ
A) 6 kg m/se
B) 18 kg m/se
C) 2 kg m/se
D) 180 kg m/se
జవాబు:
B) 18 kg m/se
109. ఫలిత బలం ఎంత?
A) 350 N
B) 250 N
C) 50N
D) ఏదీకాదు
జవాబు:
B) 250 N
110. కదులుతున్న రైలులోని ప్రయాణికుడు టాన్ వాడినప్పుడు, కాయిన్ అతని వెనుక పడుటకు కారణము. ఆ రైలు …….. చలనంలో కలదని అర్థం.
A) త్వరణ
B) సమ
C) ఋణత్వరణ
D) వృత్తాకార
జవాబు:
A) త్వరణ
111. ఒక కారు 20 m/s స్థిర వేగంతో పడమర వైపు కదులుచున్న, దానిపై పనిచేయు ఫలిత బలం విలువ?
A) 20 m/s
B) 20 × 9.8 m/s
C) 0
D) 10 m/s
జవాబు:
C) 0
112. 30 కి.గ్రాల ద్రవ్యరాశి గల దృఢమైన వ్యక్తి 450 Nల బలంను ప్రదర్శించు తాడు పట్టుకొని ఎక్కుచున్న, అతను జాగ్రత్తగా ఎక్కుటకు పట్టు గరిష్ట త్వరణం
A) 45 m/s²
B) 30 m/s²
C) 0
D) 15 m/s²
జవాబు:
D) 15 m/s²
113. 1500 కేజీల ద్రవ్యరాశి గల వాహనము, రోడ్డు పైన చలనంలో వున్నప్పుడు దానిని ఆపుటకు 1.7 మీ/సె² రుణత్వరణం వినియోగించిన, కావలసిన బలం
A) వాహన వ్యతిరేక దిశలో 25000 ల బలం పనిచేయుట
B) వాహన దిశలో 26000ల బలం పనిచేయుట 2.
C) వాహన లంబదిశలో 25000 ల బలం పనిచేయుట
D) వాహన క్షితిజ దిశలో 25000 ల బలం పనిచేయుట
జవాబు:
C) వాహన లంబదిశలో 25000 ల బలం పనిచేయుట
114. 20 m/s స్థిర వేగంతో కదులుతున్న ఒక ట్రక్కు ఒక ఇసుక తొట్టి కిందగా వెళ్ళుచున్న సమయంలో దానిపై 20 kg/s. రేటున ఇసుక పడిన, ట్రక్కుపై ఇసుక కలుగజేయు బలం
A) ట్రక్కు వ్యతిరేక దిశలో 40 N
B) ట్రక్కు వ్యతిరేక దిశలో 400 N
C) ట్రక్కు దిశలో 40N
D) ట్రక్కు దిశలో 400 N
జవాబు:
B) ట్రక్కు వ్యతిరేక దిశలో 400 N
115. 1 కేజి ద్రవ్యరాశి గల బంతి, 10kg ల ద్రవ్యంగా గల బ్యాట్ పై లంబంగా 5 m/s. వేగంతో కదులుచున్న 2 m/s వేగంతో తాకిన తర్వాత వ్యతిరేక దిశలో కదిలెను. ఆ బంతి తాకిన తర్వాత బ్యాట్ వేగము
A) 1 m/s
B) 2 m/s
C) 3m/s
D) శూన్యము
జవాబు:
A) 1 m/s
మీకు తెలుసా?
గెలీలియో గెలీలి 1564వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన ఇటలీలోని ‘పీసా’లో జన్మించారు.
1589వ సంవత్సరంలో ఆయన రచించిన అనేక వ్యాసాలలో వాలుతలాలపై పతన వస్తువుల చలనాన్ని గురించి ప్రస్తావించాడు.
గెలీలియో గొప్ప హస్తకళా నిపుణుడు. ఈయన రూపొందించిన టెలిస్కోప్ట్లు ఆ కాలంలో ఉన్న మిగతా టెలిస్కోపుల కంటే చాలా సమర్థవంతమైనవి.
1640 ప్రాంతంలో ఈయన తొలి లోలక గడియారాన్ని రూపొందించాడు. ఆయన రచించిన ‘Starry Messenger అనే గ్రంథంలో చంద్రునిలో పర్వతాలను, పాలపుంతలో గల చిన్న నక్షత్రాలను, గురు గ్రహం చుట్టూ తిరుగుతున్న నాలుగు చిన్న ఖగోళ వస్తువులను తాను చూసినట్లు తెలియజేశాడు. ‘Discourse on Floating Bodies’, ‘Letters on the Sunspot’ అనే తన రచనలలో సూర్యునిలో గల మచ్చల గురించి వివరించాడు.
ఆయన తన సొంతంగా తయారు చేసుకున్న టెలిస్కోపులతో శుక్ర, శని గ్రహాలను పరిశీలించి ఆ నాటి విశ్వాసాలకు వ్యతిరేకంగా గ్రహాలన్నీ భూమి చుట్టూ కాక సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తాయని వాదించాడు.
పునరాలోచన