These AP 9th Physical Science Important Questions and Answers 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా? will help students prepare well for the exams.
AP Board 9th Class Physical Science 3rd Lesson Important Questions and Answers మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా?
9th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా? 1 Mark Important Questions and Answers
ప్రశ్న 1.
క్రొమటోగ్రఫి ప్రయోగం చేయునపుడు తీసుకోవలసిన ఏదైన ఒక జాగ్రత్తను రాయండి.
జవాబు:
వడపోత కాగితం మీద గీసిన మార్కర్ గీత నీటికి అంటుకోకుండా, నీటి తరానికి కొంచెం పైన ఉంచాలి.
ప్రశ్న 2.
ఇనుపరజను, ఇసుక మిశ్రమం నుండి ఇనుపరజను ఏ పద్ధతిని ఉపయోగించి వేరుచేయగలవు?
జవాబు:
- ఇనుపరజను, ఇసుక మిశ్రమాన్ని అయస్కాంత పద్ధతి ద్వారా వేరు చేయవచ్చును.
- ఒక అయస్కాంతాన్ని మిశ్రమంలో ఉంచి, ఇనుపరజనను తీసివేయవచ్చును.
ప్రశ్న 3.
శుద్ధపదార్థం అనగానేమి?
జవాబు:
మన దైనందిన భాషలో శుద్ధపదార్థం అనగా ఎటువంటి కత్తీ లేని పదార్థం.
ప్రశ్న 4.
మిశ్రమపదార్థం అనగానేమి?
జవాబు:
సాధారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల అనుఘటకాల కలయిక ద్వారా ఏర్పడిన దానిని ‘మిశ్రమం’ అంటారు.
ప్రశ్న 5.
సజాతీయ మిశ్రమం అనగానేమి? ఉదాహరణనిమ్ను.
జవాబు:
మిశ్రమంలో ఉండే అనుఘటకాలు ఆ మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించి ఉంటే ఆ మిశ్రమాన్ని ‘సజాతీయ మిశ్రమం’ అంటారు.
ఉదా : నిమ్మకాయ రసం, చక్కెర ద్రావణం మొదలగునవి.
ప్రశ్న 6.
విజాతీయ మిశ్రమం అనగానేమి? ఉదాహరణనిమ్ము.
జవాబు:
ఒక మిశ్రమంలో భిన్న పదార్థాలు లేక భిన్న స్థితులలో ఉండే ఒకే పదార్ధ భాగాలు కలిసినట్లయితే ఆ మిశ్రమాన్ని – ‘విజాతీయ మిశ్రమం’ అంటారు.
ఉదా : నీరు, నూనెల మిశ్రమం, నాఫ్తలీన్, నీరుల మిశ్రమం మొదలగునవి.
ప్రశ్న 7.
కరిగే ప్రక్రియను ప్రభావితం చేసే అంశాలేమిటి?
జవాబు:
కరిగే ప్రక్రియను ప్రభావితం చేసే అంశాలు
- ద్రావణి ఉష్ణోగ్రత,
- ద్రావిత కణాల పరిమాణం,
- కలియబెట్టు పద్ధతి.
ప్రశ్న 8.
విలీన ద్రావణం అని ఎప్పుడు అంటారు?
జవాబు:
ఒక ద్రావణంలో ద్రావిత పరిమాణం ద్రావణీయత కన్నా తక్కువ ఉంటే ఆ ద్రావణాన్ని విలీన ద్రావణం అంటారు.
ప్రశ్న 9.
గాఢ ద్రావణం అని ఎప్పుడు అంటారు?
జవాబు:
ఒక ద్రావణంలో ద్రావితం పరిమాణం ఎక్కువ ఉంటే ఆ ద్రావణాన్ని గాఢ ద్రావణం అంటారు.
ప్రశ్న 10.
‘అవలంబనం’ అనగానేమి? ఉదాహరణలిమ్ము.
జవాబు:
ఒక ద్రావణంలో కరగకుండా ఉండి మన కంటితో చూడగలిగే పదార్థాల కణాలతో ‘అవలంబనాలు’ ఏర్పడతాయి. ఇవి విజాతీయ మిశ్రమాలు.
ఉదా : నీటిలో కలిపిన సుద్ధ పొడి మిశ్రమం, నీరు, ఇసుకల మిశ్రమం మొదలైనవి.
ప్రశ్న 11.
‘ఎమర్జెన్’లు అనగానేమి? ఉదాహరణలిమ్ము.
జవాబు:
పరస్పరం కలవని రెండు ద్రవాలు గల మిశ్రమాలను ‘ఎమల్లన్’లు అంటారు.
ఉదా : సిరట్లు, నీరు, నూనెల మిశ్రమం మొదలైనవి.
ప్రశ్న 12.
కాంజికాభకణ ద్రావణాలు (కొలాయిడ్లు) అనగానేమి? ఉదాహరణలిమ్ము.
జవాబు:
కొలాయిలు లేదా కాంజికాభకణ ద్రావణాలు విజాతీయ మిశ్రమాలు. వీటి లవణాల పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పటికీ కాంతి పుంజాలను పరిక్షేపించగలిగేంతగా ఉంటాయి. ఉదా : పాలు, వెన్న, జున్ను, షూ పాలిష్ మొదలైనవి.
ప్రశ్న 13.
టిందాల్ ప్రభావము అనగానేమి?
జవాబు:
కణాలు దృశ్య కాంతి పుంజమును వివర్తనం చెందించడాన్ని టిండాల్ ప్రభావము అంటారు.
ప్రశ్న 14.
క్రొమటోగ్రఫీ అనగానేమి?
జవాబు:
క్రొమటోగ్రఫీ అనేది రంగులోగల అనుఘటకాలను వేరుచేయడానికి ఉపయోగించే ఒక ప్రయోగశాల పద్ధతి.
ప్రశ్న 15.
మిశ్రణీయ ద్రవాల మిశ్రమాన్ని వేరుచేయుటకు, అంశిక స్వేదన ప్రక్రియను ఎప్పుడు వాడతారు?
జవాబు:
మిశ్రణీయ ద్రవాల మిశ్రమంలో, ద్రవాల బాష్పీభవన స్థానాలలో వ్యత్యాసం 25° C కన్నా తక్కువగా ఉంటే, ఆ రకమైన ద్రవాలను వేరు చేయడానికి అంశిక స్వేదన ప్రక్రియను వాడతారు.
ప్రశ్న 16.
‘మూలకం’ అనే దానికి లెవోయిజర్ ఇచ్చిన నిర్వచనమేది?
జవాబు:
‘మూలకం’ అనేది పదార్థం యొక్క మూలరూపం. ఇది రసాయన చర్యలలో మరికొన్ని కణాలుగా విడిపోదు అని లెవోయిజర్ నిర్వచించాడు.
ప్రశ్న 17.
వేర్పాటు గరాటునుపయోగించి అమిశ్రణీయ ద్రవాలను వేరుచేయుటలో ఇమిడియున్న సూత్రం ఏమిటి?
జవాబు:
‘అమిశ్రణీయ ద్రవాలలోని అనుఘటకాలను వాటి సాంద్రతల ఆధారంగా వేరుచేయవచ్చు’. ఇదే వేర్పాటు గరాటునుపయోగించి అమిశ్రణీయ ద్రవాలను వేరుచేయుటలో ఇమిడియున్న సూత్రం.
ప్రశ్న 18.
ద్రావణము అనగానేమి?
జవాబు:
రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ‘ద్రావణం’ అంటాం.
ప్రశ్న 19.
ద్రావణి అనగానేమి?
జవాబు:
ద్రావణంలో ఎక్కువ పరిమాణంలో ఉండి, కరిగించుకొనే పదార్థాన్ని ‘ద్రావణి’ అంటారు.
ప్రశ్న 20.
ద్రావితమును నిర్వచించుము.
జవాబు:
ద్రావణంలో తక్కువ పరిమాణంలో ఉండి, కరిగే పదార్థాన్ని ‘ద్రావితం’ అంటారు.
ప్రశ్న 21.
ద్రావణీయతను నిర్వచించుము.
జవాబు:
నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్త ద్రావణంలో కరిగియున్న ద్రావిత పరిమాణంను ఆ ఉష్ణోగ్రత వద్ద దాని ‘ద్రావణీయత’ అంటారు.
ప్రశ్న 22.
సంతృప్త ద్రావణంను నిర్వచించుము.
జవాబు:
ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరగగలదో అంతే ద్రావితాన్ని కలిగియున్న ద్రావణంను “సంతృప్త ద్రావణం” అంటారు.
ప్రశ్న 23.
అసంతృప్త ద్రావణంను నిర్వచించుము.
జవాబు:
ఒక ద్రావణంలో గరిష్ఠంగా కరగగలిగే ద్రావిత పరిమాణం కంటే తక్కువ ద్రావితం కరిగి ఉంటే ఆ ద్రావణాన్ని ‘అసంతృప్త ద్రావణం’ అంటారు.
ప్రశ్న 24.
గాఢతను నిర్వచించుము.
జవాబు:
నిర్దిష్ట ఘనపరిమాణం గల ద్రావణంలో కరిగియున్న ద్రావిత ఘనపరిమాణం (ద్రవ్యరాశి) లేదా నిర్దిష్ట ఘనపరిమాణం గల ఒక ద్రావణం కలిగి ఉన్న ద్రావిత పరిమాణంను ఆ ద్రావణ ‘గాథత’ అంటాం.
ప్రశ్న 25.
కొలాయిడల్ ద్రావణాల యొక్క విక్షేపణ ప్రావస్థ, విక్షేపణ యానకం అనగానేమి?
జవాబు:
విక్షేపణ ప్రావస్థ :
విక్షేపణ ప్రావస్థ అనేది కొలాయిడ్ యానకంలో తక్కువ నిష్పత్తిలో కలిసి ఉన్న పదార్థం మరియు ఇందులో ఉండే కొలాయిడ్ కణాల పరిమాణాలు 1 నుండి 100 మి.మీ వరకు ఉంటాయి.
విక్షేపణ యానకం :
విక్షేపణ యానకం కొలాయిడ్ కణాలు విస్తరించి ఉన్న ఒక యానకం.
ప్రశ్న 26.
క్రొమటోగ్రఫీ అనగానేమి? దాని ఉపయోగాలేవి?
జవాబు:
క్రొమటోగ్రఫీ అనేది ఒక ప్రయోగశాల ప్రక్రియ. దీని ద్వారా ఒక మిశ్రమంలో గల భిన్న అనుఘటకాలను వేరుచేయవచ్చు.
ప్రశ్న 27.
మిశ్రణీయ ద్రవాలు అనగానేమి?
జవాబు:
మిశ్రణీయ ద్రవాలు :
ఒక ద్రవం మరొక ద్రవంలో పూర్తిగా కలిసిపోతే వాటిని ‘మిశ్రణీయ ద్రవాలు’ అంటారు.
ఉదా : ఆల్కహాల్ నీటిలో పూర్తిగా కరుగుతుంది.
ప్రశ్న 28.
అమిశ్రణీయ ద్రవాలు అనగానేమి?
జవాబు:
అమిశ్రణీయ ద్రవాలు :
ఒక ద్రవం మరొక ద్రవంలో పూర్తిగా కలవకుండా ఒకదానిపై మరొకటి పొరలుగా ఏర్పడి సులువుగా వేరుచేయగలిగే ద్రవాలను ‘అమిశ్రణీయ ద్రవాలు’ అంటారు.
ఉదా : నీరు, నూనెల మిశ్రమము.
ప్రశ్న 29.
స్వేదన గదిలో గాజుపూసల ఉపయోగమేమి?
జవాబు:
స్వేదన గది అనేది గాజుపూసలు నింపబడిన ఒక నాళిక. ఈ గాజుపూసలు బాష్ప వాయువులు నిరంతరంగా చల్లబడడానికి, ఘనీభవించడానికి అవసరమైనంత ఉపరితల వైశాల్యాన్ని కల్పిస్తాయి.
ప్రశ్న 30.
మూలకాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
మూలకం :
మూలకం అనేది పదార్థం యొక్క మూలరూపం. ఇది రసాయన చర్యలలో మరికొన్ని కణాలుగా విడిపోదు.
ఉదా : ఇనుము, బంగారం, వెండి, సోడియం, మెగ్నీషియం మొదలగునవి.
ప్రశ్న 31.
సంయోగపదార్థాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
సంయోగపదార్థం :
సంయోగ పదార్థాలను “శుద్ధ పదార్థాలు”గా చెప్పవచ్చు. వీటిని రసాయన చర్య ద్వారా మాత్రమే రెండు లేదా అంతకన్నా ఎక్కువ అనుఘటకాలుగా విడగొట్టగలుగుతాం. ఉదా : కాపర్ సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్ మొదలగునవి.
9th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా? 2 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
“సజాతీయ మిశ్రమం ” ను అవగాహన చేసుకోవడానికి రెండు ప్రశ్నలు అడగండి.
జవాబు:
- సజాతీయ మిశ్రమంలో అనుఘటకాలను చూడగలవా?
- సజాతీయ మరియు విజాతీయ మిశ్రమాలలో, దేనిలో అనుఘటకాలు ఏకరీతిగా మిశ్రమం అంతా ఉంటాయి?
ప్రశ్న 2.
అపకేంద్ర యంత్రం అనగానేమి? దాని ఉపయోగాలేమిటి?
జవాబు:
ఒక మిశ్రమంలోని అధిక భారమున్న పదార్థాలను, అల్ప భారమున్న పదార్థాలను వేరుచేయడానికి అపకేంద్రయంత్రాన్ని ఉపయోగిస్తారు. ఉపయోగాలు :
- పాల నుండి వెన్నను వేరుచేస్తారు.
- వైద్యశాలలో రక్త, మూత్ర నమూనాలను పరీక్షించవచ్చు.
- బట్టలు ఉతికే యంత్రంలోని డ్రయర్ దీని అనువర్తనమే.
ప్రశ్న 3.
‘మిశ్రమం’ అనగానేమి? దాని ధర్మాలేవి?
జవాబు:
మిశ్రమం :
సాధారణంగా రెండు లేదా అంతకంటే ఎక్కువ రకాల అనుఘటకాల కలయిక (సంయోగం) ద్వారా ఏర్పడిన దానిని ‘మిశ్రమం’ అంటారు. ఒక మిశ్రమంలోని పదార్థాల కలయిక భౌతిక కలయికే కాని, రసాయన కలయిక కాదు.
ధర్మాలు :
- మిశ్రమంలోనున్న అనుఘటకాలు వాటి ధర్మాలను కోల్పోవు.
- మిశ్రమంలోనున్న అనుఘటకాలను భౌతిక ప్రక్రియల ద్వారా వేరుచేయవచ్చు.
ప్రశ్న 4.
సజాతీయ, విజాతీయ మిశ్రమాలు అనగానేమి? ఉదాహరణలిమ్ము.
జవాబు:
సజాతీయ మిశ్రమం :
మిశ్రమంలో ఉండే అనుఘటకాలు ఆ మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించి ఉంటే ఆ మిశ్రమాన్ని ‘సజాతీయ మిశ్రమం’ అంటారు.
ఉదా : నిమ్మకాయ రసం, చక్కెర ద్రావణం మొదలగునవి.
విజాతీయ మిశ్రమం :
ఒక మిశ్రమంలో భిన్న పదార్థాలు లేక భిన్న స్థితులలో ఉండే ఒకే పదార్ధ భాగాలు కలిసినట్లయితే ఆ మిశ్రమాన్ని ‘విజాతీయ మిశ్రమం’ అంటారు.
ఉదా : నీరు, నూనెల మిశ్రమం: నాఫ్తలీన్, నీరుల మిశ్రమము మొదలగునవి.
ప్రశ్న 5.
ద్రావణం, ద్రావణి, ద్రావితములను నిర్వచించుము.
జవాబు:
ద్రావణం :
రెండు లేదా అంతకంటే ఎక్కువ పదార్థాల సజాతీయ మిశ్రమాన్ని ‘ద్రావణం’ అంటాం.
ద్రావణి :
ద్రావణంలో ఎక్కువ పరిమాణంలో ఉండి, కరిగించుకొనే పదార్థాన్ని ద్రావణి అంటారు.
ద్రావితం :
ద్రావణంలో తక్కువ పరిమాణంలో ఉండి, కరిగే పదార్థాన్ని ద్రావితం అంటారు.
ప్రశ్న 6.
ద్రావణం యొక్క ధర్మాలను పేర్కొనుము.
జవాబు:
- ద్రావణంలో ఉన్న కణాలు మన కంటితో చూడలేనంత తక్కువ పరిమాణమును కలిగి ఉంటాయి.
- ద్రావణాలు తమగుండా ప్రసరించే కాంతికిరణ పుంజాలను వివర్తనం చెందించలేవు.
- ద్రావణంను కదిలించకుండా స్థిరంగా ఉంచినా సరే, అందులో ఉండే ద్రావిత కణాలు అడుగుభాగానికి చేరవు.
ప్రశ్న 7.
మూలకాలు, సంయోగపదార్థాలు అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు:
మూలకం :
మూలకం అనేది పదార్థం యొక్క మూలరూపం. ఇది రసాయన చర్యలలో మరికొన్ని కణాలుగా విడిపోదు.
ఉదా : ఇనుము, బంగారం, వెండి, సోడియం, మెగ్నీషియం మొదలగునవి.
సంయోగపదార్థం :
సంయోగ పదార్థాలను “శుద్ధ పదార్థాలు”గా చెప్పవచ్చు. వీటిని రసాయన చర్య ద్వారా మాత్రమే రెండు లేదా అంతకన్నా ఎక్కువ అనుఘటకాలుగా విడగొట్టగలుగుతాం.
ఉదా : కాపర్ సల్ఫేట్, అమ్మోనియం క్లోరైడ్ మొదలగునవి.
ప్రశ్న 8.
కవ్వము మరియు కవ్వంతో చిలికే ప్రక్రియను చూపు పటము గీయుము.
జవాబు:
ప్రశ్న 9.
మూలకాలను కనిపెట్టిన శాస్త్రవేత్తల కృషిని నీవెలా అభినందిస్తావు?
జవాబు:
- సాధారణంగా మూలకాలు వాటి ఖనిజాల రూపంలో ప్రకృతిలో లేదా భూమిలో దొరుకుతాయి.
- నాగరికత ప్రారంభం నుండి మూలకాల వినియోగం ఉంది. ఇనుము, సీసం, రాగి మొదలగునవి నాగరికత అభివృద్ధికి ఎంతో తోడ్పడ్డాయి.
- కొన్ని వేల సంవత్సరాల నుండి రసవాదులు మొదలుకొని హెన్నింగ్ బ్రాండ్, సర్ హంప్రీదేవి, సర్ ఐజాక్ న్యూటన్ వంటి శాస్త్రవేత్తలు కొత్త మూలకాలను కనుగొనే ప్రయత్నం చేశారు. వీరంతా అభినందనీయులు.
- మూలకం అనే పదాన్ని మొట్టమొదట రాబర్ట్ బాయిల్ ఉపయోగించాడు. లెవోయిజర్ మూలకానికి ఉపయుక్తమైన నిర్వచనాన్ని ఇచ్చాడు. వీరి ప్రయత్నాలు మూలకాలు, సంయోగపదార్థాల ధర్మాలను అధ్యయనం చేయడానికి దోహదపడ్డాయి.
ప్రశ్న 10.
నిత్య జీవితంలో టిందాల్ ప్రభావాన్ని గమనించే సందర్భాలను పేర్కొనుము.
(లేదా)
“టిండాల్ ప్రభావము” అంటే ఏమిటీ ? టిండాల్ ప్రభావం యొక్క ఏవైనా రెండు అనువర్తనాలు రాయండి.
జవాబు:
టిందాల్ ప్రభావం :
కాంతిపుంజం వివర్తనం చెందించడాన్ని టిండాల్ ప్రభావము అంటారు.
నిత్యజీవిత అనుభవాలు :
- కిటికీ గుండా నేరుగా సూర్యకిరణాలు పడే గదిని ఎంచుకోండి. కిటీకీ తలుపులు పూర్తిగా మూసివేయకుండా వాటి తలుపుల మధ్య సన్నని చీలిక ఉండేటట్లు చూడండి. కాంతి కిరణపుంజం యొక్క మార్గం గమనించండి.
- రెండువైపులా దట్టమైన చెట్లు గల రోడ్డుపై మీరు నడుస్తున్నపుడు కూడా ఈ దృగ్విషయాన్ని గమనించవచ్చు. సూర్య కిరణాలు చెట్ల కొమ్మలు, ఆకుల మధ్య గల ఖాళీ ప్రదేశం గుండా ప్రసరించినపుడు కిరణపుంజ మార్గంలో దుమ్ము, ధూళి కణాలను మీరు చూడవచ్చు.
- వంటగదిలోని ఓవెన్ నుండి వచ్చే పొగపై సూర్యకాంతి పడినపుడు కూడా టిండాల్ ప్రభావాన్ని గమనించవచ్చు.
- సినిమా థియేటర్లలో ప్రొజెక్టర్ నుండి తెరపై కాంతిపుంజం పడినపుడు కూడా టిండాల్ ప్రభావాన్ని గమనించవచ్చు.
9th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా? 4 Marks Important Questions and Answers
ప్రశ్న 1.
మిశ్రమాలను వేరు చేయు ఒక పద్ధతి పటంలో చూపబడినది. ఈ పటం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానములు రాయండి.
i) ఇందులో ఇమిడి ఉన్న మిశ్రమాలను వేరు చేయు పద్ధతిని తెలపండి.
జవాబు:
ఉత్పతనం
ii) ఈ ఫటంలో ఏదైనా లోపించినదా ? అయితే అది ఏమిటి?
జవాబు:
వేడి చేయడానికి వినియోగించే బర్నర్ లేదా స్టవ్ పటంలో లోపించింది.
iii) ఇచ్చట ‘B’ అనునది అమ్మోనియం క్లోరైడ్ ను సూచించినచో, ‘A’ దేనిని సూచించునో తెలపండి.
జవాబు:
ఉప్పు + అమ్మోనియం క్లోరైడ్ మిశ్రమాన్ని ‘A’ సూచించును.
iv) ఈ పద్ధతి ద్వారా వేరు చేయగలిగే మరొక ఉదాహరణను తెలపండి.
జవాబు:
కర్పూరం + ఉప్పు మిశ్రమాన్ని ఉత్పతనం పద్ధతి ద్వారా వేరు చేయవచ్చును.
ప్రశ్న 2.
క్రొమటోగ్రఫీ ఉపయోగాలేవి?
జవాబు:
- సిరాలోని రంగులను వేరుచేయవచ్చు.
- మొక్కలలో ఉన్న రంగు వర్ణకాలను వేరుచేయడానికి ఉపయోగిస్తారు.
- వివిధ రసాయన పదార్థాల రసాయన సంయోగాలను కనుగొనడానికి ఉపయోగిస్తారు.
- నేర పరిశోధనలలో ఉపయోగిస్తారు.
- వైద్యశాలల్లో రోగి యొక్క రక్తంలోని ఆల్కహాల్ శాతాన్ని కనుగొనుటకు ఉపయోగిస్తారు.
- వివిధ పర్యావరణ సంస్థలు, నీటిలోని కాలుష్యకారకాల స్థాయిని తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.
- ఫార్మాసిస్టు ఔషధాలలోని వివిధ రసాయనాల స్థాయిని తెలుసుకొనుటకు ఉపయోగిస్తారు.
ప్రశ్న 3.
కింది పదాలను నిర్వచించండి.
ఎ) ద్రావణీయత బి) సంతృప్త ద్రావణం సి) అసంతృప్త ద్రావణం ది) గాధత
జవాబు:
ఎ) ద్రావణీయత :
నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్త ద్రావణంలో కరిగియున్న ద్రావిత పరిమాణంను ఆ ఉష్ణోగ్రత వద్ద దాని ‘ద్రావణీయత’ అంటారు.
బి) సంతృప్త ద్రావణం :
ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ద్రావణంలో ఎంత ద్రావితం కరగగలదో అంతే ద్రావితాన్ని కలిగియున్న ద్రావణంను “సంతృప్త ద్రావణం” అంటారు.
సి) అసంతృప్త ద్రావణం :
ఒక ద్రావణంలో గరిష్ఠంగా కరగగలిగే ద్రావిత పరిమాణం కంటే తక్కువ ద్రావితం కరిగి ఉంటే ఆ ద్రావణాన్ని ‘అసంతృప్త ద్రావణం’ అంటారు.
డి) గాఢత :
నిర్దిష్ట ఘనపరిమాణం గల ద్రావణంలో కరిగియున్న ద్రావిత పరిమాణం లేదా నిర్దిష్ట పరిమాణం గల ఒక ద్రావణి కలిగిఉన్న ద్రావిత పరిమాణంను ఆ ద్రావణ గాఢత అంటాం.
ప్రశ్న 4.
అవలంబన ద్రావణాలు, కొలాయిడ్ (కాంజికాభ) ద్రావణాల ధర్మాలను పోల్చుము.
జవాబు:
అవలంబన ద్రావణాలు | కొలాయిడ్ ద్రావణాలు |
ఇవి విజాతీయ మిశ్రమాలు. | ఇవి విజాతీయ మిశ్రమాలు |
అవలంబన కణాలను కంటితో చూడవచ్చు. | కొలాయిడ్ కణాలు చిన్నవి. వీటిని కంటితో చూడలేం. |
అవలంబన కణాల (Particles of suspension) ద్వారా కాంతి ప్రసరించినపుడు అది వివర్తనం (Scatter) చెంది దాని మార్గం మనకు కనిపిస్తుంది. | కొలాయిడ్ కణాల పరిమాణాలు తక్కువగా ఉన్నప్పటికీ అవి కాంతిపుంజంను వివర్తనం చెందించడం వలన వీటి గుండా కాంతి ప్రసరించినపుడు దాని మార్గం మనకు కనిపిస్తుంది. |
వీటిని కదిలించకుండా ఉంచితే ద్రావిత కణాలు మెల్లగా అడుగు భాగానికి చేరుతాయి. ఈ విధంగా కణాలు నెమ్మదిగా అడుగుభాగానికి చేరినపుడు అవలంబనం విడిపోయి కాంతిని ఇక ఏమాత్రం వివర్తనం చెందనీయదు. | ఈ ద్రావణాలు స్థిరమైనవి. వీటిని కదపకుండా ఉంచినా కూడా వీటి కణాలు అడుగు భాగానికి చేరవు. |
అవలంబనాలు అస్థిరమైనవి. వడపోత, తేర్చడం అనే ప్రక్రియల ద్వారా ఈ మిశ్రమాల నుండి వాని అనుఘటకాలను వేరుచేయవచ్చు. | వడపోత ప్రక్రియ ద్వారా ఈ మిశ్రమం నుండి దాని వీటిని వేరుచేయడానికి అనుఘటకాలను వేరుచేయవచ్చు. అపకేంద్రిత విధానంను ఉపయోగిస్తారు. |
ప్రశ్న 5.
ఐస్క్రీం తయారుచేయు విధానాన్ని వివరించుము.
జవాబు:
- ఐస్ క్రీంను పాలు, గుడ్డ, చక్కెర, రుచి-వాసననిచ్చు పదార్థాల మిశ్రమాన్ని గిలకరించి, నెమ్మదిగా శీతలీకరించడం ద్వారా తయారుచేస్తారు.
- గిలకరించడం వలన గాలి బుడగలు నురుగు ద్వారా మిశ్రమంలోనికి వ్యాపించి పెద్ద ఐస్ ముక్కలు చిన్నవిగా విఘటనం చెందుతాయి.
- దీని ఫలితంగా ఘన పదార్థాలు (కొవ్వులు, ప్రోటీన్లు), ద్రవాలు (నీరు), వాయువులు (గాలి బుడగలు) కలిసిపోయి ఒక సంక్లిష్ట పదార్థం ఏర్పడుతుంది.
- దీనినే ఐస్ క్రీం అంటారు. ఐస్ క్రీం ఒక కొలాయిడ్.
ప్రశ్న 6.
గాలిలోని అనుఘటకాలను వేరుచేసే ప్రక్రియను క్లుప్తంగా వివరించుము.
జవాబు:
- మనకు గాలిలోని ఆక్సిజన్ కావాలంటే, దానిలోని ఇతర వాయువులన్నింటిని వేరుపర్చాలి.
- పీడనం పెంచుతూ గాలిని సంపీడ్యం చెందించాలి.
- తర్వాత ఉష్ణోగ్రతను తగ్గించి చల్లబరచాలి.
- అప్పుడు గాలి చల్లబడి ద్రవరూపంలోకి మారుతుంది.
- ద్రవరూపంలో ఉన్న వాయువును స్వేదన గదిలో వెచ్చబరిచినట్లయితే వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద వాయువులు వాటి మరుగు స్థానాలను అనుసరించి వేరవుతాయి.
ప్రశ్న 7.
మిశ్రమాలు మరియు సంయోగ పదార్థాల ధర్మాలను పోల్చుము.
జవాబు:
మిశ్రమ పదార్థాలు | సంయోగ పదార్థాలు |
1) మూలకాలు లేదా పదార్థాల కలయిక ద్వారా మిశ్రమాలు ఏర్పడతాయి, కాని క్రొత్త పదార్థాలు ఏర్పడవు. | 1) మూలకాల రసాయన చర్య వలన సంయోగ పదార్థాలు (కొత్త పదార్థాలు) ఏర్పడతాయి. |
2) మిశ్రమాలలో భిన్న అనుఘటకాలు ఉంటాయి. | 2) ఈ పదార్థంలో ఒకే ఒక సమ్మేళనం ఉంటుంది. |
3) మిశ్రమం, దాని అనుఘటక పదార్థాల ధర్మాలను చూపుతుంది. | 3) కొత్త పదార్థం, పూర్తిగా భిన్న ధర్మాలను కలిగి ఉంటుంది. |
4) మిశ్రమంలోని అనుఘటకాలను భౌతిక ప్రక్రియల ద్వారా వేరుచేయవచ్చును. | 4) అంశీభూతాలను రసాయన ప్రక్రియ ద్వారా లేదా విద్యుత్ రసాయన చర్యల ద్వారా మాత్రమే వేరుచేయగలుగుతాం. |
ప్రశ్న 8.
గాలిలోని అనుఘటకాలను వేరుచేసే ప్రక్రియను చూపే ఫ్లో చార్టును గీయంది.
జవాబు:
- గాలి ఒక సజాతీయ మిశ్రమమని మనకు తెలుసు.
- దానిలోని అనుఘటకాలను మనం వేరుచేయగలము.
- గాలిలోని అనుఘటకాలను వేరుచేసే ప్రక్రియలోని వివిధ దశలను చూపే ఫ్లోచార్టును పరిశీలించండి.
ప్రశ్న 9.
పదార్థం యొక్క భౌతిక, రసాయన స్వభావాలను తెలియజేసే ఫ్లోచార్టును గీయండి.
జవాబు:
ప్రశ్న 10.
ఉత్పతనము ద్వారా మిశ్రమాలను వేరుచేయు పద్దతికి పరికరాల అమరికను చూపు పటము గీయుము.
జవాబు:
ప్రశ్న 11.
బాష్పీభవనం ద్వారా మిశ్రమాలను వేరుచేయు పద్ధతికి పరికరాల అమరికను చూపు పటము గీయుము.
జవాబు:
ప్రశ్న 12.
కాగితపు క్రొమటోగ్రఫీని పటం ద్వారా చూపుము.
జవాబు:
ప్రశ్న 13.
వేర్పాటు గరాటు పటము గీయుము.
(లేదా)
అమిశ్రణీయ ద్రవాలను వేరుపరుచుటకు ఉపయోగించు పరికరం ఏది? కిరోసిన్, నీరు మిశ్రమం నుండి నీరు, కిరోసిన్లను వేరుచేయు పటం గీయండి.
జవాబు:
అమిశ్రణీయ ద్రవాలను వేరు పరుచుటకు ఉపయోగించు పరికరం పేరు ‘వేర్పాటు గరాటు’.
ప్రశ్న 14.
గాలిలోని అనుఘటకాలను వేరుచేసే ప్రక్రియలోని వివిధ దశలను చూపే పటం గీయుము.
జవాబు:
9th Class Physical Science 3rd Lesson మన చుట్టూ ఉన్న పదార్థం శుద్ధమేనా? 1 Mark Bits Questions and Answers
1. P : టిండాల్ ప్రభావము అవలంబనాలలో గమనించగలము.
Q: టిండాల్ ప్రభావము కొలాయిడల్ ద్రావణంలో గమనించగలము.
A) P మరియు Q సత్యం
B) P మరియు Q అసత్యం
C) P సత్యం, Q అసత్యం
D) P అసత్యం, Q సత్యం
జవాబు:
D) P అసత్యం, Q సత్యం
2. క్రింది వానిలో సరిగా జతపరిచినదానిని ఎన్నుకొనుము.
i) హైడ్రోజన్ | p) అవలంబనం |
ii) నీరు | q) ద్రావణము |
iii) నిమ్మరసము | r) మూలకము |
iv) దగ్గు సిరప్ | s) సంయోగ పదార్థము |
A) i – r, ii – s, iii – q, iv – p
B) i – s, ii – q, iii – p, iv – r
C) i – q, ii – p, iii – r, iv – s
D) i – p, ii – r, iii – s, iv – q
జవాబు:
A) i – r, ii – s, iii – q, iv – p
3. ఇసుకతో కలిసిపోయినపుడు క్రింది వానిలో దేనిని ఉత్పతనము ద్వారా వేరు చేయలేము.
A) ఉప్పు
B) అమ్మోనియం క్లోరైడు
C) కర్పూరం
D) అయోడిన్
జవాబు:
A) ఉప్పు
4. రాము : ఉప్పు ఒక సంయోగపదార్థము
రాజ్ : ఉప్పు ఒక మిశ్రమము. వీరిలో ఎవరు సరిగా చెప్పారు?
A) రామ్
B) రాజ్
C) ఇరువురు
D) ఎవరుకాదు.
జవాబు:
A) రామ్
5. కిరోసిన్ మరియు ఆముదంబు అమిశ్రణీయ ద్రవాలు అమిశ్రణీయ ద్రవాలను వేరుపరచుటకు వాడే పరికరము
A) వడపోత కాగితం
B) గరాటు
C) వేర్పాటు గరాటు
D) స్వేదన పరికరము
జవాబు:
D) స్వేదన పరికరము
6. గోధుమపిండి నుండి తవుడును వేరు చేయు పదవిని …….. అంటారు.
A) జల్లించడం
B) ఏరివేయడం
C) వడపోయడం
D) స్వేదనము
జవాబు:
A) జల్లించడం
7. స్నేహ : ఒక మిశ్రమంలో భిన్న అనుఘటకాలు ఉంటాయి.
గౌతమ్ : ఒక సంయోగ పదార్థంలో ఒకే ఒక సమ్మేళనం ఉంటుంది.
A) స్నేహ, గౌతమ్ ఇద్దరు ఒప్పు
B) స్నేహ, గౌతమ్ ఇద్దరు తప్పు
C) స్నేహ ఒప్పు, గౌతమ్ తప్పు
D) స్నేహ తప్పు, గౌతమ్ ఒప్పు
జవాబు:
A) స్నేహ, గౌతమ్ ఇద్దరు ఒప్పు
8. 150గ్రా|| నీటిలో 50గ్రా. సాధారణ ఉప్పు కరిగివున్నది. ఆ ద్రావణపు ద్రవ్యరాశి శాతం
A) 33.3%
B) 300%
C) 25%
D) 20%
జవాబు:
C) 25%
9. పదార్థం ఘన స్థితి నుండి నేరుగా వాయు స్థితిలోకి మారడాన్ని ఇలా అంటారు.
A) వ్యాపనం
B) ఉత్పతనం
C) ఇగురుట
D) మరుగుట
జవాబు:
B) ఉత్పతనం
10. కింది వానిలో టిండాల్ ప్రభావాన్ని చూపునది
A) షూ-పాలిష్
B) ఉప్పునీరు
C) కాపర్ సల్ఫేటు ద్రావణం
D) కాఫీ
జవాబు:
A) షూ-పాలిష్
11. కాగితపు క్రొమటోగ్రఫి కృత్యంలో ఉపయోగించనిది ఏది?
A) బీకరు
B) వేర్పాటు గరాటు
C) పెన్సిల్
D) మార్కర్ పెన్
జవాబు:
B) వేర్పాటు గరాటు
12. పాలు …….
A) అవలంభనం
B) ఎమల్సన్
C) కొల్లాయిడ్
D) జెల్
జవాబు:
C) కొల్లాయిడ్
13. దట్టమైన అడవుల ఉపరితలం నుండి సూర్యకిరణాలు కిందకి ప్రసరించినపుడు కనిపించే ప్రభావం
A) కాంతి విద్యుత్ ఫలితం
B) రామన్ ఫలితం
C) టిండాల్ ఫలితం
D) క్రాంప్టన్ ఫలితం
జవాబు:
C) టిండాల్ ఫలితం
14. క్రొమటోగ్రఫీ ప్రయోగశాల కృత్యంలో కింది వాటిలో ఉండాల్సిన పరికరం
A) థర్మామీటర్
B) లిట్మస్ పేపర్
C) మార్కర్ పెన్
D) కిరోసిన్
జవాబు:
C) మార్కర్ పెన్
15. కింది వాటిలో శుద్ధ పదార్ధము …….
A) సోడియం క్లోరైడ్
B) కాపర్ సల్ఫేట్
C) బంగారం
D) గాలి
జవాబు:
C) బంగారం
16. ద్రావణంలోని అనుఘటకాలు ……….
A) ద్రావితము
B) ద్రావణి
C) A మరియు B
D) అనుఘటకాలు ఉండవు
జవాబు:
C) A మరియు B
17. సంతృప్త స్థితికన్నా తక్కువ పరిమాణంలో ద్రావితాన్ని కలిగియున్న ద్రావణాన్ని ….. అంటారు.
A) సంతృప్త ద్రావణం
B) అసంతృప్త ద్రావణం
C) అతి సంతృప్త ద్రావణం
D) విజాతీయ ద్రావణం
జవాబు:
B) అసంతృప్త ద్రావణం
18. కరిగే రేటును ప్రభావితం చేయు అంశాలు
A) ద్రావణి యొక్క ఉష్ణోగ్రత
B) ద్రావిత కణాల పరిమాణం
C) కలియబెట్టు విధానం
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ
19. ఒక ద్రావణిలో కరగగల ద్రావిత పరిమాణమునే దాని …….. అంటారు.
A) ద్రావణీయత
B) విలీనం
C) గాఢత
D) సంతృప్తత
జవాబు:
A) ద్రావణీయత
20. కింది వాటిలో ఎమర్జెన్ ……….
A) ఉప్పు ద్రావణం
B) నీరు, నూనెల మిశ్రమం
C) గోళ్ళ పాలిష్
D) జున్ను
జవాబు:
B) నీరు, నూనెల మిశ్రమం
21. కింది వాటిలో అవలంబనం ……………
A) ఉప్పు ద్రావణం
B) నీరు, నూనెల మిశ్రమం
C) గోళ్ళ పాలిష్
D) జున్ను
జవాబు:
C) గోళ్ళ పాలిష్
22. కింది వాటిలో కొలాయిడ్ …….
A) ఉప్పు ద్రావణం
B) నీరు, నూనెల మిశ్రమం
C) గోళ్ళ పాలిష్
D) జున్ను
జవాబు:
D) జున్ను
23. కింది వాటిలో మిశ్రణీయ ద్రావణం
A) నీటిలో కలిపిన ఇసుక
B) నీరు, ఆల్కహాల మిశ్రమం
C) నీరు, నూనెల మిశ్రమం
D) ఏదీకాదు
జవాబు:
B) నీరు, ఆల్కహాల మిశ్రమం
24. అమిశ్రణీయ ద్రావణాలను వేరుచేయుటకు వాడు పద్ధతి
A) వేర్పాటు గరాటు
B) అపకేంద్ర యంత్రం
C) అంశిక స్వేదన గొట్టం
D) వడపోత కాగితం
జవాబు:
A) వేర్పాటు గరాటు
25. సంయోగ పదార్థానికి ఉదాహరణ
A) పాదరసం
B) కాపర్ సల్ఫేట్
C) అల్యూమినియం
D) బోరాన్
జవాబు:
B) కాపర్ సల్ఫేట్
26. ఎట్టి మలినాలు లేనట్టి పదార్థమును పదార్థాలు అంటారు.
A) శుద్ధ
B) ప్రేరణ
C) ప్రత్యేక
D) సాధారణ
జవాబు:
A) శుద్ధ
27. మిశ్రమ ద్రావణాలను బాగా కలియబెట్టుట వలన ……….. పదార్థాలు పైకి తేలును. ఈ నియమాన్ని ……… అంటారు.
A) బరువైన, చెరుగుట
B) తేలికైన, చెరుగుట
C) బరువైన, కలుపుట
D) తేలికైన, మిశ్రమము
జవాబు:
B) తేలికైన, చెరుగుట
28. మిశ్రమంలో ఉండే అనుఘటకాలు ఆ మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించి ఉంటే, ఆ మిశ్రమాన్ని ………. మిశ్రమం అంటారు.
A) సజాతీయ
B) విజాతీయ
C) జల
D) సర్దుబాటు
జవాబు:
A) సజాతీయ
29. మిశ్రమంలో ఉండే అనుఘటకాలు ఆ మిశ్రమం అంతటా ఏకరీతిగా విస్తరించి ఉండకపోతే, ఆ మిశ్రమాన్ని ……………… అంటారు.
A) సజాతీయ
B) విజాతీయ
C) జల
D) సర్దుబాటు
జవాబు:
B) విజాతీయ
30. ఒక ద్రావణంలో కరిగించుకునే పదార్థాన్ని ……….. అంటారు.
A) ద్రావణం
B) ద్రావణి
C) ద్రావితం
D) ద్రావణీయత
జవాబు:
B) ద్రావణి
31. ఒక ద్రావణంలో కరిగే పదార్థాన్ని ………. అంటారు.
A) ద్రావణం
B) ద్రావణి
C) ద్రావితం
D) ద్రావణీయత
జవాబు:
C) ద్రావితం
32. ఘన ద్రావణానికి ఉదాహరణ …………
A) మిశ్రమం
B) ఆక్సీకరణ ద్రావణం
C) పాదరసం
D) ఉప్పు ద్రావణం
జవాబు:
A) మిశ్రమం
33. నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద ఒక సంతృప్త ద్రావణంలో కరిగి ఉన్న ద్రావిత పరిమాణంను, ఆ ఉష్ణోగ్రత వద్ద దాన్ని …………… అంటారు.
A) ద్రావణం
B) ద్రావణీయత
C) గాఢత
D) ఏదీకాదు
జవాబు:
B) ద్రావణీయత
34. ఒక ద్రావణిలో ద్రావిత పరిమాణం తక్కువగా ఉంటే ఆ ద్రావణంను …………… అంటారు.
A) ద్రావణం
B) గాఢ ద్రావణం
C) జలయుత ద్రావణం
D) ఏదీకాదు
జవాబు:
A) ద్రావణం
35. ఒక ద్రావణిలో ద్రావిత పరిమాణం ఎక్కువగా ఉంటే ఆ ద్రావణంను …………… అంటారు.
A) సజల ద్రావణం
B) గాఢ ద్రావణం
C) జలయుత ద్రావణం
D) ఏదీకాదు
జవాబు:
B) గాఢ ద్రావణం
36. నిర్దిష్ట పరిమాణం గల ఒక ద్రావణి కలిగియున్న ద్రావిత పరిమాణంను …………… అంటారు.
A) సజల
B) ద్రావణీయత
C) గాఢత
D) ఏదీకాదు
జవాబు:
C) గాఢత
37. ద్రావణం యొక్క భారశాతం = ……….
జవాబు:
A
38. పరస్పరం కలవని రెండు ద్రవాలను కలిగియుంది, మిశ్రమాన్ని కదపకుండా ఒకచోట ఉంచినపుడు రెండు పొరలుగా నిలిచిపోయే ద్రవాలను …………… అంటారు.
A) ద్రావణం
B) తేలియాడునవి
C) ఎమర్జెన్
D) ఏదీకాదు
జవాబు:
C) ఎమర్జెన్
39. ద్రావణిలో ద్రావిత కణాలు కరగకుండా ఉంది, వీటిని మన కంటితో చూడగలిగిన విజాతీయ మిశ్రమాన్ని …………… అంటారు.
A) ద్రావణం
B) తేలియాడునవి
C) ఎమర్జెన్
D) ఏదీకాదు
జవాబు:
B) తేలియాడునవి
40. మొక్కలలో ఉన్న రంగు వర్ణకాలను వేరుచేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు.
A) స్వేదనం
B) ఇగుర్చుట
C) అంశిక స్వేదనం
D) క్రొమటోగ్రఫీ
జవాబు:
D) క్రొమటోగ్రఫీ
41. ఒక ద్రవం, మరొక ద్రవంలో పూర్తిగా కలిసిపోతే వాటిని …………… ద్రవాలంటారు.
A) మిశ్రణీయ
B) అమిశ్రణీయ
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) మిశ్రణీయ
42. ఒక ద్రవం, మరొక ద్రవంలో పూర్తిగా కలవకపోతే వాటిని …………… ద్రవాలంటారు.
A) మిశ్రణీయ
B) అమిశ్రణీయ
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) అమిశ్రణీయ
43. రెండు లేదా అంతకంటే ఎక్కువ మిశ్రణీయ ద్రవాల యొక్క బాష్పీభవన స్థానాలలో వ్యత్యాసం 25°C కంటే ఎక్కువగా ఉంటే ఆ రకమైన ద్రవాలను వేరుచేయడానికి …………… ను ఉపయోగిస్తారు.
A) స్వేదనము
B) ఆంశిక స్వేదనము
C) వేర్పాటు గరాటు
D) ఇగురుట
జవాబు:
A) స్వేదనము
44. ప్రవచనం – I : గాలి అనేక మిశ్రమాల సమ్మేళనం.
ప్రవచనం – II : ఈ మిశ్రమాలను అంశిక స్వేదనాల
ద్వారా వేరు పరుస్తారు.
A) I, II లు సత్యాలు
B) I – సత్యం, II – అసత్యం
C) I – అసత్యం , II – సత్యం ద్రావిత భారం
D) రెండూ అసత్యాలు
జవాబు:
A) I, II లు సత్యాలు
45. రసాయనిక చర్య ద్వారా రెండు లేక అంతకన్నా ఎక్కువ అనువుటకాలుగా విడగొట్టగలిగిన పదార్థాలను …………… అంటారు.
A) మూలకాలు
B) మిశ్రమాలు
C) సంయోగ పదార్థాలు
D) ఏదీకాదు
జవాబు:
C) సంయోగ పదార్థాలు
46. …………… అనేది పదార్థం యొక్క మూలరూపం. ఇది రసాయన చర్యలలో మరికొన్ని కణాలుగా విడిపోదు.
A) మూలకం
B) మిశ్రమం
C) అణువు
D) ఏదీకాదు
జవాబు:
A) మూలకం
47. మూలకం అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించిన శాస్త్రవేత్త ……………
A) రాబర్ట్ బాయిల్
B) హెన్నింగ్ బ్రాండ్
C) లెవోయిజర్
D) బెర్జిలియస్
జవాబు:
A) రాబర్ట్ బాయిల్
48. కొన్ని ద్రవాలు సులభంగా ఏ అనుపాతంలోనైనా పూర్తిగా కలిసిపోయే ధర్మాన్ని కలిగి ఉండడం వలన సజాతీయ ద్రావణాన్ని ఏర్పరుస్తాయి. దీనినే ………….. అంటారు.
A) మిశ్రణీయత
B) ద్రావణీయత
C) అమిశ్రణీయం
D) ఏదీకాదు
జవాబు:
A) మిశ్రణీయత
49. ‘అమిశ్రణీయ ద్రావణాలను వేరుచేయుటలో ఉపయోగపడే అనుఘటకాల ధర్మం ……..
A) పీడనం
B) ఘనపరిమాణం
C) సాంద్రత
D) ద్రవ్యరాశి
జవాబు:
C) సాంద్రత
50. కణాల పరిమాణం చాలా తక్కువగా ఉన్నప్పటికీ, మన కంటితో చూడగలిగి, కాంతిపుంజంను పరిక్షేపించగలి గేంతగా ఉన్న విజాతీయ మిశ్రమాన్ని ………….. అంటారు.
A) అవలంబనము
B) ద్రావణం
C) కొల్లాయిడ్
D) ఏదీకాదు
జవాబు:
C) కొల్లాయిడ్
51. గాలి ఒక …………….
A) మిశ్రమం
B) కొల్లాయిడ్
C) ద్రావణం
D) ఏదీకాదు
జవాబు:
C) ద్రావణం
52. గోళ్ళరంగు ఒక ……
A) ద్రావణం
B) కొల్లాయిడ్
C) అవలంబనం
D) ఏదీకాదు
జవాబు:
C) అవలంబనం
53. సోడియం ఒక …….
A) మూలకం
B) సమ్మేళనం
C) అవలంబనం
D) ఎమల్షన్
జవాబు:
A) మూలకం
54. మీథేన్ ఒక ……
A) మూలకం
B) సమ్మేళనం
C) అవలంబనం
D) ఎమర్జెన్
జవాబు:
B) సమ్మేళనం
55. స్టీలు ఒక …………. ద్రావణం.
A) ఘన
B) ద్రవ
C) వాయు
D) ఉప్పు
జవాబు:
A) ఘన
56. కోల్డ్ క్రీము ఒక ………………
A) మూలకం
B) సమ్మేళనం
C) అవలంబనం
D) ఎమల్లన్
జవాబు:
D) ఎమల్లన్
57. A: గాలి మిశ్రమ పదార్థము.
R: గాలిలోని వాయువులను రసాయనిక చర్యల ద్వారా అనుఘటకాలుగా వేరు చేయగలము.
A) A, Rలు సత్యాలు
B) A, Rలు అసత్యాలు
C) A సత్యం, R అసత్యం
D) A అసత్యం, R సత్యం
జవాబు:
B) A, Rలు అసత్యాలు
58. అన్ని ద్రావణాలు ‘X’ లే కానీ, అన్ని ద్రావణాలు ‘X’ లు కాదు, X’ ను ఊహించుము
A) శుద్ధ పదార్ధం
B) మిశ్రమం
C) పరమాణువు
D) ద్రావణము
జవాబు:
B) మిశ్రమం
59. ఒక ద్రావణము సజలమైన, దానిగుండా ప్రసరించు కాంతి పుంజము
A) కన్పించును
B) కన్పించదు
C) పలుచగా కన్పించును
D) అప్పుడప్పుడు కన్పించును
జవాబు:
B) కన్పించదు
60. ‘A’ ఒక మిశ్రమము. ఆ మిశ్రమమును కొంత సేపు కదల్చకుండా వుంచిన దానిలోని కణాలు సెటిల్ కావు. ఈ మిశ్రమం గుండా కాంతి ప్రసారం కన్పించిన, ‘A’ ను ఊహించుము.
A) ద్రావణం
B) కొల్లాయిడ్
C) అవలంబనం
D) A లేక B
జవాబు:
B) కొల్లాయిడ్
61. ఒక బీకరులో కొంత గాఢ CuSO4, ద్రావణంను తీసుకొనుము. దానిలోనికి ఒక అల్యూమినియం రేకుముక్కను వుంచినట్లయితే
A) అల్యూమినియం రేకుపై కాపర్ పూత ఏర్పడును.
B) అల్యూమినియం కరుగును
C) రంగులేని ద్రావణం ఏర్పడును
D) A మరియు C
జవాబు:
D) A మరియు C
62. భౌతిక పద్ధతుల ద్వారా CuSO4, ద్రావణం నుండి కాపరను వేరుచేయలేము కనుక ఇది ఒక …………..
A) మిశ్రమం
B) సమ్మేళనం
C) A లేక B
D) కొల్లాయిడ్
జవాబు:
B) సమ్మేళనం
63. నీరు మరియు చక్కెరల మిశ్రమం ……….
A) అవలంబనం
B) కొల్లాయిడ్
C) సజాతీయ మిశ్రమం
D) విజాతీయ మిశ్రమం
జవాబు:
C) సజాతీయ మిశ్రమం
64. టింక్చర్ అయోడిన్ ద్రావణంలో, ఆల్కహాల్ …………..
A) ద్రావణం
B) ద్రావణి
C) ద్రావితం
D) ఉండదు
జవాబు:
B) ద్రావణి
65. కర్పూరం, నీరుల మిశ్రమాన్ని వేరుచేయుటకు వాడు పద్ధతి
A) స్వేదనము
B) అంశిక స్వేదనము
C) ఉత్పతనము
D) చేతితో ఏరివేయుట
జవాబు:
C) ఉత్పతనము
66. భాష్పీభవన స్థానాలలో భేదం 25°C కంటే తక్కువ ఉన్న రెండు ద్రవాల మిశ్రణీయ మిశ్రమాన్ని వేరు చేయడానికి వాడు పద్ధతి
A) వేర్పాటు గరాటు
B) స్వేదనము
C) అంశిక స్వేదనము
D) ఇగుర్చుట
జవాబు:
C) అంశిక స్వేదనము
67. కొల్లాయిడల్ ద్రావణం గుండా ప్రసరించు కాంతి విక్షేపణం చెందుటను ……………. ప్రభావమంటారు.
A) రామన్
B) క్రాంప్టన్
C) విద్యుత్ కాంతి
D) టిండాల్
జవాబు:
D) టిండాల్
68. సిరాలోనున్న రంగును వేరుచేయుటకు వాడు పద్ధతి
A) స్వేదనం
B) ఇగురుట
C) అంశిక స్వేదనం
D) క్రొమటోగ్రఫీ
జవాబు:
B) ఇగురుట
69. యూరినను వేడిచేసి ఫాస్పరసన్ను పొందినవారు పరీక్షించుటకు వాడు పరికరము
A) రాబర్ట్ బాయిల్
B) హెన్నింగ్ బ్రాండ్
C) లెవోయిజర్
D) బెరీలియస్
జవాబు:
B) హెన్నింగ్ బ్రాండ్
70. ఎసిటోన్ మరియు నీరులను వేరుచేయుటకు వాడు పద్దతి
A) స్వేదనం
B) క్రొమటోగ్రఫీ
C) అవలంబనం
D) అంశిక స్వేదన ప్రక్రియ
జవాబు:
A) స్వేదనం
71. కిరోసిన్ మరియు నీరులను వేరుచేయు ప్రక్రియ
A) స్వేదనం
B) వేర్పాటు గరాటు
C) అవలంబనం
D) అంశిక స్వేదనం
జవాబు:
B) వేర్పాటు గరాటు
72. పరికల్పన (A) : నీరు + చక్కెరల ద్రావణం.
కారణం (R) : ఈ మిశ్రమం గుండా కాంతిని ప్రసరించిన అది పరిక్షేపణం చెందును.
A) A, Rలు సత్యాలు
B) A, లు అసత్యాలు
C) A సత్యం, కాని R అసత్యం
D) A అసత్యం, కాని R సత్యం
జవాబు:
C) A సత్యం, కాని R అసత్యం
73. రెండు పరీక్ష నాళికలను తీసుకొని వాటిలో ఒక దానిలో ఉప్పు చూర్ణంను, మరొక దానిలో స్పటిక ఉప్పును వేసి పరీక్షించగా, నీ పరిశీలనతో ద్రావణీయత ఆధారపడు అంశంను గుర్తించుము.
A) ఉష్ణోగ్రత
B) ద్రావిత పరిమాణం
C) కలియబెట్టుట
D) పై అన్నియూ
జవాబు:
B) ద్రావిత పరిమాణం
74. సరైన ప్రక్రియను గుర్తించుము.
a) సజల ద్రావణంకు అధిక ద్రావితంను కలపాలి.
b) సజల ద్రావణంకు అధిక ద్రావణిని కలపాలి.
c) గాఢ ద్రావణంకు అధిక ద్రావితంను కలపాలి.
d) గాఢ ద్రావణంకు అధిక ద్రావణిని కలపాలి.
A) b, d
B) a, c
C) b, c
D) a, d
జవాబు:
D) a, d
75. కిరోసిన్ మరియు నీరుల మిశ్రమాన్ని వేరు చేయుటకు
A) కోనికల్ ప్లాస్కు
B) బ్యూరెట్టు
C) పిపెట్టు
D) పరీక్ష నాళిక
జవాబు:
B) బ్యూరెట్టు
76. కింది వాటి గుండా కాంతి ప్రసారం జరిగినపుడు టిండాల్ ప్రభావమును గమనించవచ్చును.
1) ఉప్పు ద్రావణం
2) పాలు
3) CuSO4 ద్రావణం
4) పిండి ద్రావణం
A) 2 మాత్రమే
B) 1, 4
C) 3 మాత్రమే
D) 2, 4
జవాబు:
A) 2 మాత్రమే
77. పాలు అనునవి కొల్లాయిడ్ ద్రావణమా? కాదా? అని
A) ఫిల్టర్ కాగితం
B) లేజర్ కాంతి
C) బర్నర్
D) A మరియు B
జవాబు:
B) లేజర్ కాంతి
78. పిండి ద్రావణము కొల్లాయిడ్ లేక అవలంబన ద్రావణమా? కాదా? అని పరీక్షించుటకు చేయు పరీక్షా రకము
A) కాంతి పుంజంను పంపుట
B) ద్రావణంను కొంతసేపు కదల్చకుండా వుంచుట
C) వేడి చేయుట
D) పై వాటిలో ఒకటి
జవాబు:
B) ద్రావణంను కొంతసేపు కదల్చకుండా వుంచుట
79. నీ ప్రయోగశాలలో మిశ్రణీయ ద్రావణాలను ఏ విధంగా పరీక్షించెదవు?
A) వేర్పాటు గరాటు ఏర్పరచుట వలన
B) స్వేదన ప్రక్రియ వలన
C) ఇగుర్చుట వలన
D) అవలంబన వలన
జవాబు:
B) స్వేదన ప్రక్రియ వలన
80. పాల నుండి ఏర్పడు క్రీమును వేరుచేయు పద్ధతి
A) అపకేంద్ర
B) స్వేదన
C) అంశిక స్వేదన
D) క్రొమటోగ్రఫీ
జవాబు:
A) అపకేంద్ర
81. టిండాల్ ప్రభావం ప్రదర్శించనివి
A) కొల్లాయిడ్లు
B) అవలంబనాలు
C) ఎమల్లన్లు
D) ద్రావణాలు
జవాబు:
D) ద్రావణాలు
82. కింది పదార్థాలలో అత్యధిక మరిగే స్థానము గల పదార్థము
A) నత్రజని
B) ఆర్గాన్
C) మీథేన్
D) ఆక్సిజన్
జవాబు:
C) మీథేన్
83. మూలకంకు మొదటి నిర్వచనము తెలిపినవారు
A) లేవోయిజర్
B) స్టన్నింగ్ బ్రాండ్
C) సర్ హంప్రీడావీ
D) రాబర్ట్ బాయిల్ వాడు పరికరము
జవాబు:
A) లేవోయిజర్
84. రంగురాళ్ళు దీనికి ఉదాహరణ
A) ద్రావణం
B) అవలంబనం
C) కొల్లాయిడ్
D) ఎమల్టన్
జవాబు:
C) కొల్లాయిడ్
85. సిరా అనునది నీరు, దీని మిశ్రమము.
A) రంజకము
B) ఉప్పు
C) చక్కెర
D) ఆమ్లం
జవాబు:
A) రంజకము
86. మూలకమను పదాన్ని మొదటగా వాడిన వారు
A) రాబర్ట్ బాయిల్
B) హెన్నింగ్ బ్రాండ్
C) లెవోయిజర్
D) బెర్జిలియస్
జవాబు:
A) రాబర్ట్ బాయిల్
87. గాలిలో ఆక్సిజన్ యొక్క ఘనపరిమాణ శాతం విలువ
A) 20.9%
B) 78.1%
C) 0.03%
D) 0.1%
జవాబు:
A) 20.9%
88. గాలిలో నత్రజని ఘనపరిమాణ శాతం విలువ
A) 20.9%
B) 78.1%
C) 0.03%
D) 0.1%
జవాబు:
B) 78.1%
89. గాలిలో ఆర్గాన్ ఘనపరిమాణ శాతం విలువ
A) 20.9%
B) 78.1%
C) 0.03%
D) 0.9%
జవాబు:
D) 0.9%
90. రక్త నమూనాలోని అనుఘటకాలను వేరుచేయు పద్ధతి
A) స్వేదనం
B) ఉత్పతనం
C) అంశిక స్వేదనం
D) అపకేంద్రిత
జవాబు:
D) అపకేంద్రిత
91. నీటిలోని నాఫ్తలీనను వేరుచేయు పద్ధతి
A) స్వేదనం
B) కొమటోగ్రఫీ
C) ఉత్పతనం
D) అపకేంద్రితం
జవాబు:
C) ఉత్పతనం
92. పెట్రో ఆధారిత రసాయనాలను వేరుచేయు పద్ధతి
A) అంశిక స్వేదనం
B) స్వేదనం
C) ఉత్పతనం
D) వేర్పాటు గరాటు
జవాబు:
A) అంశిక స్వేదనం
93. 1) కిరోసిన్ + ఉప్పు 2) నీరు + ఉప్పు 3) నీరు + పంచదార 4) ఉప్పు + చక్కెర
పై మిశ్రమాలలో విజాతీయ మిశ్రమాలు
A) 2, 3
B) 1, 2, 3
C) 1
D) 1, 4
జవాబు:
D) 1, 4
94. a) చక్కెర ద్రావణం
b) టింక్చర్ అయోడిన్
c) సోదానీరు
d) ఉప్పునీరు
పైన ఇచ్చిన మిశ్రమాలు ……….. మిశ్రమాలు.
A) సజాతీయ
B) విజాతీయ
C) ద్రావణాలు
D) A మరియు C
జవాబు:
D) A మరియు C
95.
మిశ్రమం | కాంతిపుంజ మార్గం | ద్రావితం అడుగుకు చేరును |
X | కన్పించును | అవును |
Y | కన్పించదు | కాదు |
ఇక్కడ X మరియు Y లు అనేవి
A) అవలంబనం మరియు ద్రావణం
B) అవలంబనం మరియు కొల్లాయిడ్
C) ద్రావణం మరియు అవలంబనం
D) కొల్లాయిడ్ మరియు అవలంబనం
జవాబు:
A) అవలంబనం మరియు ద్రావణం
96. పాలు, వెన్న, చీజ్, క్రీమ్, జెల్, బూటు పాలీష్ అనేవి
A) అవలంబనాలు
B) కొల్లాయిడ్లు
C) ద్రావణాలు
D) B మరియు C
జవాబు:
B) కొల్లాయిడ్లు
97.
మిశ్రమంలోని కణాల పరిమాణము | |
A | < nm |
B | lnm – 100nm |
C | > 100 nm |
ఇక్కడ పదార్థము ‘C’ అనేది
A) పాలు
B) ఉప్పునీరు
C) గాలి
D) మజ్జిగ
జవాబు:
D) మజ్జిగ
98. a) Set A : పొగమంచు, మేఘాలు, మంచు
b) Set B : నురుగు, రబ్బరు, స్పాంజి
c) Set C : జెల్లీ, జున్ను, వెన్న
పై వాటిలో వేటి యందు విక్షేపణ ప్రావస్థ యానకం వుండును?
A) b
B) c
C) a
D) b మరియు c
జవాబు:
D) b మరియు c
99.
పై వాటిలో శుద్ధ పదార్థము ఏది?
A) a, d
B) b, e
C) e
D) a, b, c
జవాబు:
C) e
100. దత్త పటము నుండి నీవు గ్రహించినది
A) శుద్ధ పదార్థాలు
B) మిశ్రమ పదార్థాలు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
A) శుద్ధ పదార్థాలు
101. దత్త పటం నుండి నీవు గ్రహించినది
A) శుద్ధ పదార్థాలు
B) మిశ్రమ పదార్థాలు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు:
B) మిశ్రమ పదార్థాలు
102. ఇవ్వబడిన పటం యొక్క అమరికను గుర్తించుము.
A) వేర్పాటు గరాటు
B) అంశిక స్వేదనము
C) గాలిలోని అంశీ భూతాలను వేరు చేయుట
D) ఏదీకాదు
జవాబు:
B) అంశిక స్వేదనము
103. పటంలోని అమరికను గుర్తించుము.
A) వేర్పాటు గరాటు
B) అంశిక స్వేదనము
C) గాలిలోని అంశీ భూతాలను వేరు చేయుట
D) ఏదీకాదు
జవాబు:
A) వేర్పాటు గరాటు
104. పటంలోని అమరికను గుర్తించుము.
A) వేర్పాటు గరాటు
B) అంశిక స్వేదనము
C) గాలిలోని అంశీ భూతాలను వేరు చేయుట
D) ఏదీకాదు
జవాబు:
C) గాలిలోని అంశీ భూతాలను వేరు చేయుట
105. దత్తపటం సూచించునది
A) ఉత్పతనం
B) అంశిక స్వేదనం
C) క్రొమటోగ్రఫీ
D) ఇగురుట
జవాబు:
C) క్రొమటోగ్రఫీ
106. వేర్పాటు గరాటులో గుర్తించిన 1 మరియు 2 భాగాలు
A) అల్ప సాంద్రతర ద్రావణం, అధిక సాంద్రతర ద్రావణం
B) అల్ప సాంద్రతర వాయువు, అధిక సాంద్రతర ద్రావణం
C) అధిక సాంద్రతర ద్రావణం, అల్ప సాంద్రతర ద్రావణం
D) అధిక సాంద్రతర వాయువు, అల్ప సాంద్రతర ద్రావణం
జవాబు:
A) అల్ప సాంద్రతర ద్రావణం, అధిక సాంద్రతర ద్రావణం
107. ద్రవ మిశ్రమాలను కవ్వంతో వేగంగా చిలికినప్పుడు తేలికపాటి కణాలు ద్రవాలపై భాగాన్ని చేరతాయి. దీనిలో ఇమిడి వున్న యంత్రం
A) రిఫ్రిజిరేటర్లు
B) అపకేంద్ర యంత్రం
C) మైక్రోస్కోపు
D) రైస్ కుక్కర్లు
జవాబు:
B) అపకేంద్ర యంత్రం
108. సాధారణంగా ఘన ద్రావణాలు దొరుకు సితి
A) మిశ్రమాలు
B) రత్నాలు
C) గ్లాసులు
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ
109. 80మి.లీ.ల ద్రావణంలో 20 గ్రా||ల ద్రావితం కలదు.
దీని యొక్క ఘన పరిమాణ శాతము
A) 20%
B) 40%
C) 25%
D) 80%
జవాబు:
C) 25%
110. మనోభిరామ్ అతని దగ్గు మందు బాటిల్ పై “Shake well before use” అను లేబులను గమనించెను. ఆ మందు ఒక ……….. బీకరు.
A) ద్రావణము
B) కొల్లాయిడ్ మూర్కర్తో
C) అవలంబనం
D) అన్నియూ గీచిన గీత
జవాబు:
C) అవలంబనం
111. సోహన్, ఒక గది యొక్క పై కప్పుపైన గల చిన్న రంధ్రం నుండి కాంతి పుంజం ప్రసరించుటను గమనించెను. ఇది ఏర్పడుటకు గల కారణము
A) గాలి ఒక కొల్లాయిడ్
B) గాలి ఒక నిజ ద్రావణం
C) గాలి ఒక అవలంబనం
D) గాలి ఒక శుద్ధ పదార్ధం
జవాబు:
A) గాలి ఒక కొల్లాయిడ్
112. టిండాల్ ప్రభావమును వీటిలో గమనించవచ్చును.
A) కొల్లాయిడ్లు
B) ద్రావణాలు
C) అవలంబనాలు
D) శుద్ధ పదార్థాలు
జవాబు:
A) కొల్లాయిడ్లు
113. కింది వాటిలో ఏ మిశ్రమంను సాధారణ భౌతిక పద్ధతుల ద్వారా వేరుచేయలేము?
A) ధాన్యపు గింజల పొట్టు
B) బియ్యంలోని రాళ్ళు
C) పాలలోని వెన్న
D) నీటి నుండి ఆక్సిజన్
జవాబు:
D) నీటి నుండి ఆక్సిజన్
114. సముద్రపు నీటి నుండి ఉప్పును వేరుచేయుటకు సరైన పద్ధతి ఏది?
A) ఉత్పతనం
B) ఇగురుట
C) క్రొమటోగ్రఫీ
D) స్వేదనం
జవాబు:
B) ఇగురుట
115. పెట్రోలియంలోని అనుఘటకాలను వేరుచేయు పద్ధతి
A) కాంతి వికిరణం
B) టిండాల్ ప్రభావం
C) అవక్షేపణం
D) A మరియు C
జవాబు:
B) టిండాల్ ప్రభావం
116. సర్ హంప్రీడవేను అభినందించదగిన విషయం
A) Na, Mg, B, Cl మొ|| మూలకాలను కనుగొనుట వలన
B) మూలకానికి సరైన నిర్వచనం ఇవ్వటం వలన
C) గాలిలోని సంఘటనాలను వేరుచేయుట వలన
D) పైవన్నియూ
జవాబు:
A) Na, Mg, B, Cl మొ|| మూలకాలను కనుగొనుట వలన
117. 20 గ్రా||ల ఉప్పు అనునది, 100 గ్రా||ల ఉప్పు ద్రావణంలో వుండుట జరిగిన, దాని ద్రవ్య శాతము విలువ
A) 10%
B) 20%
C) 30%
D) 50%
జవాబు:
B) 20%
118. ఉప్పు ద్రావణం నుండి ఉప్పును వేరుచేయు పద్ధతి
A) అవలంబనం
B) సంకోచించటం
C) ఇగర్భటం
D) వడగట్టుట
జవాబు:
C) ఇగర్భటం
119. NaCI మరియు NH3Cl ల మిశ్రమం నుండి NH3Cl ను వేరుచేయు పద్ధతి
A) అవలంబనం
B) సంకోచించటం
C) ఇగర్చటం
D) వడగట్టుట
జవాబు:
A) అవలంబనం
120. కారు యొక్క ఇంజను ఆయిల్ లోని చిన్న ముక్కలను ఏ విధంగా వేరుచేయుట సాధ్యపడును?
A) అవలంబనం
B) క్రొమటోగ్రఫీ
C) ఇగర్చటం
D) స్వేదనం
జవాబు:
D) స్వేదనం
121. పూరేకుల నుండి వర్ణ ద్రవ్యములను ఏ విధంగా వేరు చేసెదరు?
A) అవలంబనం
B) క్రొమటోగ్రఫీ
C) ఇగర్చటం
D) స్వేదనం
జవాబు:
B) క్రొమటోగ్రఫీ
122. మీ ఇంట్లో పెరుగు నుండి వెన్నను ఏ విధంగా వేరుపరచెదవు?
A) ఇగుర్చుట
B) క్రొమటోగ్రఫీ
C) చిలుకుట
D) స్వేదనం
జవాబు:
C) చిలుకుట
123. జతపరుచుము.
వేరుపరచు | పద్ధతి మిశ్రమము |
a) అయస్కాంత | i) నీరు మరియు నూనె |
b) వేర్పాటు గరాటు | ii) తేనీరు నుండి తేయాకు |
C) వడకట్టుట | iii) ఇనుము మరియు ఇసుక |
A) a – iii, b – ii, c – i
B) a – ii, b – i, c – iii
C) a – i, b – ii, c – iii
D) a – iii, b – i, c – ii
జవాబు:
D) a – iii, b – i, c – ii
124. కొల్లాయిడ్ యొక్క ధర్మం కానిది
A) స్వేదనం
B) అంశిక స్వేదనం
C) ఇగురుట
D) వడకట్టుట
జవాబు:
C) ఇగురుట
125. మీ గృహంలోని కొన్ని కొల్లాయిడ్లు
1) జెల్
2) పాలు
3) నూనె
4) బూట్ పాలిష్
A) 1, 2
B) 1, 2, 4
C) 2, 3
D) 1, 2, 3
జవాబు:
C) 2, 3
126. మీ గృహంలోని కొన్ని శుద్ధ పదార్థాలు
a) మంచు
b) పాలు
c) ఇనుము
d) గాలి
e) నీరు
f) బంగారం
g) బొగ్గు
A) a, b, c, d
B) c, b, d. S
C) d, e, f, g
D) a, c, e, f, g
జవాబు:
D) a, c, e, f, g
127. ఐ స్క్రీమ్ ఒక
A) అవలంబనం
B) కొల్లాయిడ్
C) ఎమల్సన్
D) ద్రావణం
జవాబు:
B) కొల్లాయిడ్
128. ఐస్ క్రీమ్ లోని అనుఘటకాలు
A) పాలు
B) పంచదార
C) ఫ్లేవరులు
D) అన్నియూ
జవాబు:
D) అన్నియూ
129. షేవింగ్ క్రీము ……….. రకపు కొల్లాయిడ్.
A) ఫోమ్
B) ఎమలన్
C) ఏరోసల్
D) ద్రావణం
జవాబు:
A) ఫోమ్
130. ఆటోమొబైల్ వ్యర్థాలలో, వ్యాప్తి చెందు యానకపు రకం
A) ఘన
B) ద్రవ
C) వాయు
D) ద్రావణం
జవాబు:
C) వాయు
131. మేఘాలు ఒక …………
A) ద్రావణం
B) అవలంబనం
C) కొల్లాయిడ్
D) ఎమర్జెన్
జవాబు:
C) కొల్లాయిడ్