AP 9th Class Physical Science Notes 11th Lesson ధ్వని

Students can go through AP Board 9th Class Physical Science Notes 11th Lesson ధ్వని to understand and remember the concept easily.

AP Board 9th Class Physical Science Notes 11th Lesson ధ్వని

→ ధ్వని ఒక శక్తి స్వరూపము.

→ ధ్వని గ్రహణ సంవేదనను కలుగజేస్తుంది.

→ ధ్వని గాలిలో అణువులు ముందుకు, వెనుకకు కదలడం ద్వారా ప్రయాణించి చెవిని చేరి గ్రహణ సంవేదనను కలిగించును. – పైథాగరస్

→ న్యూటన్ మొట్టమొదటగా గాలిలో ధ్వని ప్రసారాన్ని పూర్తిగా వివరించాడు.

→ కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి.

→ శృతిదండం ఒక శబ్ద అనునాదకము.

→ శృతిదండమును “జాన్ఫోర్” అనే సంగీత విద్వాంసుడు కనుగొన్నాడు.

AP 9th Class Physical Science Notes 11th Lesson ధ్వని

→ ధ్వని ప్రసారం జరిగే మాధ్యమాన్ని యానకం అంటాము.

→ ధ్వని యానకంలో అనుదైర్ఘ్య తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది.

→ అనుదైర్య తరంగంలో వరుసగా సంపీడన, విరళీకరణాలు ఏర్పడతాయి.

→ యానకంలో కణాలు తరంగ చలనదిశలోనే కంపిస్తే అనగా తరంగ చలనదిశకు సమాంతరంగా కంపిస్తే ఆ తరంగాలను అనుదైర్ఘ్య తరంగాలు అంటారు.

→ అనుదైర్ఘ్య తరంగాలు యానకం సాంద్రతలో మార్పునకు కారణమవుతాయి.

→ యానకంలో కణాలు తరంగ చలనదిశకు లంబంగా కంపిస్తే ఆ తరంగాలను తిర్యక్ తరంగాలు అంటారు.

→ తిర్యక్ తరంగాలు యానకపు ఆకృతిలో మార్పునకు కారణమవుతాయి. ఒక తరంగ స్వభావాన్ని వివరించుటలో తరంగ దైర్ఘ్యం, కంపన పరిమితి, పౌనఃపున్యము మరియు తరంగ వేగాలు ముఖ్య పాత్ర వహిస్తాయి.

→ తిర్యక్ తరంగంలో ఒకదాని తర్వాత ఒకటిగా శృంగము, ద్రోణులు ఏర్పడతాయి.

→ రెండు వరుస సంపీడనాల లేదా విరళీకరణాల మధ్య దూరాన్ని ధ్వని తరంగపు తరంగ దైర్యం అంటాము.

→ సాంద్రత-దూరం గ్రాలో రెండు వరుస శృంగాల లేదా ద్రోణుల మధ్య దూరంను తరంగ దైర్ఘ్యం అంటారు.

→ తరంగ దైర్యానికి S.I ప్రమాణం మీటరు. యానకంలో తరంగం ప్రయాణించేటప్పుడు యానకం సాంద్రత (లేదా) పీడనంలో కలిగిన అత్యధిక మార్పును కంపన పరిమితి అంటారు.

→ కంపన పరిమితికి ప్రమాణాలు – కి.గ్రా/మీ³, పాస్కల్, మీటరు.

AP 9th Class Physical Science Notes 11th Lesson ధ్వని

→ యానకం సాంద్రత లేదా పీడనం ఒక డోలనం చేయడానికి పట్టే కాలాన్ని ధ్వని తరంగపు ఆవర్తన కాలం అంటారు.

→ ప్రమాణ కాలంలో యానకపు సాంద్రత, ఒక నిర్దిష్ట ప్రదేశంలో చేసే డోలనాల సంఖ్యను పౌనఃపున్యం అంటారు.

→ పౌనఃపున్యంకు ప్రమాణాలు హెర్ట్.

→ ఒక తరంగంపై గల ఏదైనా ఒక బిందువు (అనగా సంపీడన లేదా విరళీకరణాల వంటి) ప్రమాణ కాలంలో ప్రయాణించిన దూరాన్ని తరంగ వేగం అంటారు.

→ ధ్వనివేగం, పౌనఃపున్యం, తరంగ పొడవుల మధ్య సంబంధం v = ηλ.

→ 20°C వద్ద పొడిగాలిలో ధ్వ నివేగం 343.2 మీ/సె. లేదా 1236 కి.మీ/గం.

→ ధ్వని వాయువుల్లో కంటే ద్రవపదార్థాలలో మరియు ఘనపదార్థాలలో ఎక్కువ వేగంగా ప్రయాణించును.

→ 20°C వద్ద నీటిలో ధ్వని వేగం గాలిలో ధ్వని వేగానికి 4.3 రెట్లు అధికము.

→ ఘనపదార్థాల (ఇనుము)లో ధ్వని వేగం గాలిలో కంటే 15 రెట్లు అధికంగా ఉంటుంది.

→ ధ్వనులను సంగీతస్వరాలు మరియు చప్పుళ్ళుగా విభజించవచ్చును.

→ వినుటకు ఇంపుగా ఉన్న శబ్దాలను సంగీతస్వరాలని, కఠోరంగా ఉన్న శబ్దాలను చప్పుళ్ళు అని అంటారు.

→ సంగీతస్వరంను నిర్ణయించే అభిలక్షణాలు :
i) పిచ్ (స్థాయి) ii) తీవ్రత iii) నాణ్యత

AP 9th Class Physical Science Notes 11th Lesson ధ్వని

→ కీచు, బొంగురు స్వరాల మధ్య తేడాను తెలిపే లక్షణాన్ని పిచ్ అంటారు.

→ చెవిపై కలిగించబడిన గ్రహణ సంవేదన స్థాయిని శబ్ద తీవ్రత అంటాము.

→ వివిధ సంగీతవాయిద్యాల నుండి ఉత్పత్తి అయిన స్వరాల మధ్య తేడాని గుర్తించుటకు మనకు ఉపయోగపడే శబ్బ లక్షణమే నాణ్యత.

→ శ్రోతకు అసలు ధ్వని వినబడిన 0.1 సెకన్లలోపు వినపడే పరావర్తన ధ్వనిని ప్రతినాదం అంటారు.

→ ధ్వని తరంగాల పౌనఃపున్య శ్రవ్య అవధి 20 Hz నుండి 20 KHz.

→ 20 Hz ల కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను పరశ్రావ్యాలు అంటాము.

→ 20 KHz ల కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను అతిధ్వనులు అంటాము.

→ సోనార్ అనగా సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్.

→ శృతిదండం : ఇది ఉక్కుతో చేయబడిన U-ఆకారపు శబ్ద అనునాదకపు కడ్డీ.

→ అనుదైర్ఘ్య తరంగం : ఒక యానకంలోని కణాలు తరంగ చలన దిశలోనే కంపించుట వలన ఏర్పడిన తరంగము.

→ తిర్యక్ తరంగం : ఒక యానకంలోని కణాలు తరంగ చలన దిశకు లంబంగా కంపించుట వలన ఏర్పడిన తరంగము.

→ సంపీడనం : ధ్వని తరంగ ప్రసారంలో అధిక సాంద్రతగల ప్రాంతము.

→ విరళీకరణం : ధ్వని తరంగ ప్రసారంలో అల్ప సాంద్రత గల ప్రాంతము.

→ శృంగము : తిర్యక్ తరంగ ప్రసారంలో ఉబ్బెత్తైన ప్రాంతము.

→ ద్రోణి : తిర్యక్ తరంగ ప్రసారంలో లోతైన ప్రాంతము.

AP 9th Class Physical Science Notes 11th Lesson ధ్వని

→ తరంగ దైర్ఘ్యం : రెండు వరుస సంపీడనాలు లేదా విరళీకరణాల మధ్యదూరం.

→ కంపన పరిమితి : యానకంలోని కణాల స్థానభ్రంశంలో ఏర్పడే అత్యధిక మార్పు.

→ పౌనఃపున్యం : ధ్వని తరంగపు యానకపు సాంద్రత ప్రమాణ కాలంలో చేసే డోలనాల సంఖ్య.

→ పిచ్ (కీచుదనం) : కీచు మరియు బొంగురు స్వరాల మధ్య భేదము.

→ ధ్వని తీవ్రత : చెవిపై కలిగించబడిన గ్రహణ సంవేదన స్థాయి.

→ ధ్వని వాణ్యత : వివిధ ధ్వనుల మధ్యగల స్వర భేదము.

→ ప్రతిధ్వని : పరావర్తనమయ్యే నిజధ్వని యొక్క రూపము.

→ ప్రతినాదం : ధ్వని స్థిరత కంటే తక్కువ సమయంలో పరావర్తనమయ్యే ధ్వని.

AP 9th Class Physical Science Notes 11th Lesson ధ్వని

→ శ్రవ్య అవధి : మానవుడు వినగలిగే ధ్వని హద్దులు.

→ పరశ్రావ్యాలు : శ్రవ్య అవధి కంటే తక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు.

→ అతిధ్వనులు : శ్రవ్య అవధి కంటే ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులు.

→ సోనార్ : సౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్.

AP 9th Class Physical Science Notes 11th Lesson ధ్వని 1