AP 9th Class Physical Science Notes 10th Lesson పని మరియు శక్తి

Students can go through AP Board 9th Class Physical Science Notes 10th Lesson పని మరియు శక్తి to understand and remember the concept easily.

AP Board 9th Class Physical Science Notes 10th Lesson పని మరియు శక్తి

→ ఒక వస్తువుపై పని జరిగింది అని చెప్పాలంటే రెండు నిబంధనలు పాటించాలి. అవి
ఎ) వస్తువుపై బలం ప్రయోగింపబడాలి.
బి) వస్తువు స్థానభ్రంశం చెందాలి.

→ ఒక బలం వలన వస్తువుపై జరిగిన పని ఆ బల పరిమాణం (F), వస్తువు స్థానభ్రంశం (s) ల లబ్దానికి సమానం. ఈ సూత్రం స్థానాంతర చలనంలో ఉన్న వస్తువులకు మాత్రమే సరిపోతుంది.

→ బలము, స్థానభ్రంశములు ఒకే దిశలో ఉంటే, పని (W) = బలము × స్థానభ్రంశము

→ పనికి పరిమాణం మాత్రం ఉంది కానీ దిశ లేదు. కాబట్టి పని ఒక అదిశరాశి.

→ పనికి ప్రమాణాలు : C.G.S పద్ధతిలో ఎర్గ్‌లు ; S.I పద్ధతిలో జౌల్‌లు.

AP 9th Class Physical Science Notes 10th Lesson పని మరియు శక్తి

→ జరిగిన పని కాలం మీద ఆధారపడదు.

→ జరిగిన పని వస్తువు పొందిన వేగంపై ఆధారపడదు.

→ ఒక వస్తువుపై ప్రయోగింపబడిన బలం, వస్తువు స్థానభ్రంశం ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఉంటే జరిగిన పనిని ఋణాత్మకంగా పరిగణిస్తాం.

→ పని ధనాత్మకంగా ఉంటే, ఏ వస్తువుపై అయితే పని జరిగిందో ఆ వస్తువు శక్తిని గ్రహిస్తుంది. పని ఋణాత్మకంగా – ఉంటే, ఏ వస్తువుపై అయితే పని జరిగిందో ఆ వస్తువు శక్తిని కోల్పోతుంది.

→ ఒక వస్తువు పని చేయగలిగే పటిమ లేదా ఆ వస్తువులోని శక్తి దాని స్థానం, స్థితులపై ఆధారపడి ఉంటుంది.

→ ఒక వస్తువుపై పని జరిగినపుడు ఆ వస్తువు శక్తి పెరగవచ్చు లేదా తగ్గవచ్చు.

→ సూర్యుడు ఒక పెద్ద సహజ శక్తి జనకం. అనేక ఇతర శక్తి జనకాలు దీనిపై ఆధారపడతాయి.

→ ఒక వస్తువుకు దాని చలనం వలన కలిగే శక్తిని గతిశక్తి అంటాం.

AP 9th Class Physical Science Notes 10th Lesson పని మరియు శక్తి

→ ఒక వస్తువు దాని స్థానం, ఆకారం వలన పొందే శక్తిని స్థితిశక్తి అంటాం.

→ ఒక వస్తువు యొక్క స్థితిశక్తి, గతిశక్తుల మొత్తాన్ని యాంత్రిక శక్తి అంటాం.

→ శక్తి సృష్టింపబడదు, నాశనం చెందదు. శక్తి ఒక రూపం నుండి మరొక రూపంలోకి మార్చబడుతుంది. దీనినే శక్తి నిత్యత్వ నియమం అంటాం.

→ పనిచేయు సామర్ధ్యమే శక్తి

→ శక్తి అదిశరాశి.

→ పని, శక్తులకు ఒకే ప్రమాణాలు ఉండును.

→ స్వేచ్ఛాపతన వస్తువునకు స్థితిశక్తి తగ్గుతూ, గతిశక్తి పెరుగుతూ ఉండును.

→ పనిచేయు రేటును సామర్ధ్యము అంటారు.

→ ఒక యంత్రము ‘t’ కాలములో ‘W’ పని చేస్తే దాని సామర్థ్యము (P) = పని / కాలము.

→ సామర్థ్యానికి ప్రమాణాలు వాట్‌.

AP 9th Class Physical Science Notes 10th Lesson పని మరియు శక్తి

→ ఒక సెకనులో ఒక జెల్ పనిచేయగల యంత్రము సామర్థ్యము ఒక వాటి అగును.

→ సామర్థ్యము యొక్క టన్నుల విలువలను కిలోవాట్లలో కొలుస్తారు.

→ 1 కిలో వాట్ kW = 1000 వాట్లు = 1000 జెల్/ సెకను.

→ పని : ఒక వస్తువు పై ప్రయోగించిన బలం, దాని స్థానభ్రంశాల లబ్ధము.

→ శక్తి : ఒక వ్యవస్థ యొక్క పనిచేయు సామర్థ్యాలను కొలిచేది.

→ శక్తి బదిలీ : ఒక రూపంలోని శక్తి మరొక రూపంలోకి మారుట.

→ శక్తి వనరులు : శక్తిని నిల్వచేసుకొని ఉన్నటువంటి వస్తువులు.

→ శక్తి నిత్యత్వం : వ్యవస్థ లోపల మార్పులు జరిగినా, మొత్తం మీద స్థిర విలువను కలిగి ఉండటం.

AP 9th Class Physical Science Notes 10th Lesson పని మరియు శక్తి

→ గతిశక్తి : వస్తువు చలనంలో మార్పు వలన పొందే శక్తి.

→ స్థితిశక్తి : వస్తువు స్థితి వలన పొందే శక్తి.

→ యాంత్రిక శక్తి : వస్తువు యొక్క స్థితి మరియు గతిశక్తుల మిళిత శక్తి.

→ సామర్థ్యం : పని చేయగల శక్తి (లేక) పని జరిగే రేటు (లేక) శక్తి బదిలీ రేటు.

→ గురుత్వ స్థితిశక్తి : ఒక వస్తువుపై గురుత్వాకర్షణ బలానికి వ్యతిరేకంగా పని జరగడం వలన ఆ వస్తువుకుండే స్థితిశక్తి.

AP 9th Class Physical Science Notes 10th Lesson పని మరియు శక్తి 2