AP 9th Class Social Important Questions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

These AP 9th Class Social Important Questions 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 18th Lesson Important Questions and Answers భారతదేశంపై వలసవాద ప్రభావం

9th Class Social 18th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
తిరుగుబాటు ఆదివాసీలు ఎవరు?
జవాబు:
1856లో జార్ఖండ్ సంతాల్ ఆదివాసీలు, 1880, 1992లో ఆంధ్రప్రదేశ్ లో కోయ ఆదివాసీలు, 1910లో బస్తర్ లోని ” మరియా, మురియా ఆదివాసీలు, 1940లలో గోండ్, కోలం ఆదివాసీలు తిరుగుబాటు చేశారు.

ప్రశ్న 2.
సీతారామరాజు దాడిచేసిన పోలీసు స్టేషన్లు ఏవి?
జవాబు:
బెంగాలీ విప్లవకారుల దేశభక్తితో స్ఫూర్తి పొంది చింతపల్లి, రంపచోడవరం, దమ్మనపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, నర్సీపట్నం, అన్నవరం వంటి ప్రాంతాల్లో పోలీసు స్టేషన్ల పై రాజు దాడులు చేశాడు.

ప్రశ్న 3.
నిజాం ప్రభుత్వం అడవిలో వసూలు చేసిన పన్నులేవి?
జవాబు:
అడవిలో పశువులను, మేపినందుకు, వంటకి కట్టెపుల్లలు సేకరించినందుకు నిజాం ప్రభుత్వం ‘బంబ్ రాం’, ‘దూప పెట్టి’ ” అన్న పేరుతో పన్ను వసూలు చేయసాగింది.

AP 9th Class Social Important Questions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 4.
బ్రిటిషు కాలంలో ఏర్పడిన పారిశ్రామిక వేత్తల సంఘాలలో ముఖ్యమైనది ఏది?
జవాబు:
భారత పరిశ్రమల ప్రయోజనాల కోసం బ్రిటిషు కాలంలోనే పారిశ్రామికవేత్తలతో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. వీటిల్లో ముఖ్యమైనది ‘వ్యాపార, పరిశ్రమల భారతీయ సమాఖ్య’ (FICCI – ఫిక్కీ).

ప్రశ్న 5.
కార్మిక సంఘాలు అని వేటిని అంటారు?
జవాబు:
సమ్మె సమయాల్లో కొంతమంది విద్యావంతుల సహాయంతో కార్మికులు తమ సొంత సంఘాలను ఏర్పరచుకున్నారు. వీటిని ‘కార్మిక సంఘాలు’ అంటారు.

ప్రశ్న 6.
కార్మిక సంఘాల పని ఏమి?
జవాబు:
ఈ కార్మిక సంఘాలు సమ్మేలు నిర్వహించేవి, మిల్లు యజమానులతో ఒప్పందాలు కుదుర్చుకునేవి. క్రమంగా ఈ సంఘాలు సమ్మెకాలంలోనే కాకుండా కార్మికుల సంక్షేమం, హక్కుల కోసం సంవత్సరం పొడవునా పని చేయసాగాయి.

ప్రశ్న 7.
గాంధీజీ ప్రభావంతో ఏర్పడిన కార్మికసంఘం ఏది?
జవాబు:
అహ్మదాబాదులో గాంధీజీ ప్రభావంతో ‘మజూర్ మహాజన్’ అన్న శక్తివంతమైన కార్మిక సంఘం ఏర్పడింది.

ప్రశ్న 8.
రక్షిత మార్కెట్ అనగానేమి?
జవాబు:
ఎగుమతులు, దిగుమతులపై ఆంక్షలతో కూడిన వాణిజ్య పద్ధతిని ‘రక్షిత మార్కెట్’ అని అంటారు.

ప్రశ్న 9.
రిజర్వ్ అడవి అనగానేమి?
జవాబు:
ప్రభుత్వ అధీనంలో, అటవీశాఖ నియంత్రణలో ఉండే అడవిని ‘రిజర్వ్ అడవి’ అంటారు.

AP 9th Class Social Important Questions Chapter 18 భారతదేశంపై వలసవాద ప్రభావం

ప్రశ్న 10.
ఆదివాసీలకు కొమరం భీం ఇచ్చిన పిలుపు ఏమిటి?
జవాబు:
కొమరం భీం ఆదివాసీలకు “జల్, జంగల్, జమీన్’ అనే పిలుపునిచ్చారు.

9th Class Social 18th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
బ్రిటిష్ పరిపాలనా కాలంలో అడవుల నరికివేతకు దారి తీసిన కారణాలను రాయండి.
జవాబు:
ఈ క్రింది కారణాల వలన బ్రిటిష్ వారు అడవులను నరికివేశారు. ముంబై, కోల్‌కతా వంటి పట్టణాలు అభివృద్ధి చెందడం, ప్రభుత్వం దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్లలో రైలు మార్గాలను నిర్మించడం, పెద్దపెద్ద ఓడలను తయారుచేయడం, గనుల తవ్వకం, వాటిన్నింటికి కలప కొరకు అడవుల వినియోగం జరిగింది.

రైలు మార్గాల కోసం కావలసిన చెక్క స్లీపర్లను హిమాలయ ప్రాంతముల నుండి సేకరించారు.

ఆ రోజులలో వర్తకం ఎక్కువగా జల మార్గాల ద్వారానే సాగేది కనుక భారీ ఓడల నిర్మాణానికి కూడా అడవులను నరికివేయడం తప్పనిసరి అయినది.

9th Class Social 18th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
తొలి దశలో మిల్లులలో పని ప్రతిరోజూ సూర్యోదయంతో మొదలయ్యి సూర్యాస్తమయం తరువాతే ముగిసేది. తెల్లవారకముందే నిద్ర లేచి మిల్లులకు బారులు తీరిన కార్మికులు – వీళ్లల్లో పురుషులతో పాటు స్త్రీలు, పిల్లలు కూడా ఉండేవాళ్లు. యంత్రాల మీద పని చేయటం మొదలు పెట్టిన తరువాత ఇక ఆపటం అంటూ లేదు. భోజనాలకు కూడా ఖచ్చితమైన విరామం ఉండేది కాదు. తోటి కార్మికుడికి పని అప్పగించి 15-20 నిమిషాలలో కార్మికులు భోజనం ముగించేవాళ్లు. తినటానికి ప్రత్యేకంగా వేరే చోటు ఉండేది కాదు.

కర్మాగారపు వేడి, తేమ, మోత, ధూళితో. రోజంతా గడిచేది. మిల్లు వాతావరణంలో సరిగా ఊపిరాడేది కాదు. సూర్యుడు అస్తమించిన తరువాత చీకటిలో చూడటం అసాధ్యమైనప్పుడు మాత్రమే యంత్రాలతో ఆ రోజుకి పని ఆగేది. ఇలా నెలల తరబడి జరిగేది. వారానికి ఒకరోజు సెలవు కూడా నియమాల్లో లేదు. సంవత్సరంలో ముఖ్యమైన పండుగలకు మాత్రమే మిల్లు యజమాని సెలవు ఇచ్చేవాడు.
ప్రశ్న : పారిశ్రామికీకరణ తొలి దశలో, మిల్లులలోని కార్మికుల పని పరిస్థితులపై వ్యాఖ్యానించండి.
జవాబు:
తొలిదశలో మిల్లులలోని కార్మికుల పరిస్థితి మరీ దుర్భరంగా ఉంది.

  1. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు పనిచేస్తే వారికి ఇచ్చే వేతనాలు చాలా తక్కువ.
  2. ఉత్పత్తి చేసే సమయంలో ఏదైనా అనర్థం జరిగితే యాజమాన్యం ఎలాంటి బాధ్యతలను కూడా వహించేది కాదు.
  3. ఉత్పత్తి చేసే వస్తువు డామేజ్ అయినా దాని ఖర్చు కార్మికుడి జీతం నుండి తీసుకునేవారు.
  4. కార్మికులు మురికివాడలలో నివసిస్తూ సరైన సదుపాయాలు లేక, వైద్య సదుపాయం లేక రోగాల బారిన పడి ఎంతో మంది మరణించారు.
  5. సెలవులు లేకపోవడం, ఒక దుర్భర పరిస్థితి.
  6. విశ్రాంతి లేకుండా పనిచేయడం వలన ఒళ్ళు నొప్పులతో కార్మికులు బాధపడుతూ దాని నుండి మరచిపోవడానికి మద్యానికి బానిసైపోయేవారు.

ఈ విధంగా వారి వేతనం కుటుంబ ఖర్చులకు చాలక దుర్భర దారిద్ర్య జీవితాన్ని అనుభవించారు.

తొలినాళ్లలో విద్యుత్ సౌకర్యం లేక రాత్రిపూట కార్మికులను వదిలివేశారు గాని లేకపోతే వారిని రాత్రిపూట కూడా పనికోసం హింసించేవారు.