AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

These AP 9th Class Social Important Questions 19th Lesson విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం will help students prepare well for the exams.

AP Board 9th Class Social 19th Lesson Important Questions and Answers విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

9th Class Social 19th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
లిబియాలో ఉద్యమం ఎవరి ఆధ్వర్యంలో నడిచింది?
జవాబు:
సైన్యంలోని 12 మంది సభ్యులతో కూడిన ‘రివల్యుషనరీ కమాండ్ కౌన్సిల్’ (RCC) నేతృత్వంలో ఈ ఉద్యమం నడిచింది.

ప్రశ్న 2.
లిబియాలో కొత్త ప్రభుత్వం చేపట్టిన పనులేవి?
జవాబు:
కొత్త ప్రభుత్వం, చమురు వనరులను జాతీయం చేసింది, సంచార జీవనాన్ని అంతం చేయటానికి పేద ప్రజలకు నీటివసతి ఉన్న భూములను ఇచ్చింది, సాగు విస్తీర్ణాన్ని పెంచే కార్యక్రమం చేపట్టింది.. మహిళలతో సహా అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్య సేవలు, చమురు నుంచి వచ్చిన లాభాలలో కొంత ప్రజలందరికీ పంచటం, గృహవసతి వంటివి చేపట్టింది.

ప్రశ్న 3.
అరబ్బు వసంతంగా ప్రఖ్యాతి గాంచినది ఏది?
జవాబు:
2010 డిసెంబరులో మొదలైన అరబ్బు ప్రపంచంలోని నిరసనలు, ప్రదర్శనలు, యుద్ధాల విప్లవ తరంగం ‘అరబ్బు వసంతం’గా ప్రఖ్యాతి గాంచింది.

ప్రశ్న 4.
బర్మాను పాలించిన సైన్యాధిపతులు ఎదుర్కొన్న ఆరోపణలు ఏవి?
జవాబు:
బర్మాని పాలించిన సైన్యాధిపతులు మానవ హక్కులను ఉల్లంవించారని, పౌరులను బలవంతంగా స్థానచలనానికి గురిచేశారని, పిల్లలతో సహా ప్రజలతో బలవంతంగా వెట్టిచాకిరి చేయించుకున్నారని అనేక తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 5.
NLD ని విస్తరించండి.
జవాబు:
నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ NLD.

ప్రశ్న 6.
కమ్యూని నమ్మకం ఏమిటి?
జవాబు:
‘శ్రామిక వర్గ నియంతృత్వాన్ని’ ఏర్పాటు చేయటం ద్వారా మాత్రమే. కార్మికుల ప్రయోజనాలను కాపాడగలమని , వాళ్లు (కమ్యూనిస్టు) నమ్మారు.

ప్రశ్న 7.
కమ్యూనిస్టుల విశ్వాసం ఏమిటి?
జవాబు:
ఇంగ్లాండులో మాదిరి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం దేశాన్ని నియంత్రించటంలో ధనిక పెట్టుబడిదారులకు మాత్రమే ఉపయోగపడుతుందని, పేద శ్రామిక ప్రజల నిజమైన ప్రయోజనాలకు అది ప్రాతినిధ్యం వహించ లేదని కమ్యూనిస్టు విశ్వసించారు.

ప్రశ్న 8.
అంతర్యుద్ధం అనగానేమి
జవాబు:
వివిధ వర్గాలు లేదా ప్రాంతాల మధ్య ఒక దేశంలో చెలరేగే యుద్ధం.

ప్రశ్న 9.
స్వయం ప్రతిపత్తి అనగానేమి?
జవాబు:
ఒక దేశం లేదా ప్రాంతం లేదా సంస్థ తనను తాను స్వతంత్రంగా నిర్వహించుకునే స్వేచ్ఛనే ‘స్వయం ప్రతిపత్తి’ అంటారు.

ప్రశ్న 10.
పట్టణీకరణ అనగానేమి?
జవాబు:
గ్రామీణ ప్రాంత ప్రజలు వివిధ వృత్తులరీత్యా పట్టణాలకు వచ్చి స్థిరపడటాన్ని, పట్టణ జనాభా పెరగడాన్ని ‘పట్టణీకరణ’ అంటారు.

ప్రశ్న 11.
కింది పటంలో 1900 మరియు 1950 మధ్య కాలం నాటి ప్రజాస్వామ్య దేశాలను నలుపుచే గుర్తించడమైనది.
ప్రశ్న : పటంలో చూపిన ఏవేని రెండు ప్రజాస్వామ్య దేశాల పేర్లు రాయండి.
జవాబు:
అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కెనడా, గ్రేట్ బ్రిటన్, చిలీ, పెరూ, అలస్కా మొదలైనవి.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 12.
క్రింది పటంలో “A” తో గుర్తించబడిన దేశం ఏది?
జవాబు:
రష్యా

9th Class Social 19th Lesson 4 Marks Important Questions and Answers in Telugu Medium

ప్రశ్న 1.
19వ శతాబ్దం నాటి ఇటలీ ఏకీకరణ ప్రక్రియను వివరించండి.
జవాబు:
19వ శతాబ్దం నాటి ఇటలీ ఏకీకరణ ప్రక్రియ :

  1. 19వ శతాబ్దం మధ్య కాలానికి ఇటలీ అనేక చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడింది.
  2. 1830 లలో మాజినీ ఇటలీ ఏకీకరణకు ఒక ప్రణాళికను రూపొందించాడు.
  3. తన భావాలను ప్రచారం చేయుటకు, ఇటలీ ఏకీకరణ దిశగా ప్రయాణానికి యంగ్ ఇటలీ అనే రహస్య సంస్థను స్థాపించాడు.
  4. తరువాత 1831, 1848లలో జరిగిన తిరుగుబాట్లు విఫలం కావడంతో యుద్ధాల ద్వారా అయినా ఇటలీ ఏకీకరణను సాధించవలసిన బాధ్యత రాజు విక్టర్ ఇమ్మాన్యుయెల్ – II మీద పడింది.
  5. అధికారంలో ఉన్న ఇతర రాజ కుటుంబీకులు కూడా ఏకీకరణ ద్వారానే ఇటలీ ఆర్థిక ప్రగతి సాధ్యం అని భావించారు.
  6. ఫ్రాన్స్ తో కవూర్ నడిపిన దౌత్యం ఫలితంగా సార్డీనియా – పీడ్మంబు ఆస్ట్రియా సేనలను ఓడించగలిగాయి.
  7. 1860 లో సైన్యంతో పాటు గారిబార్లీ నాయకత్వంలో సాయుధ సేనలు సిసిలీ లోనికి ప్రవేశించి అక్కడ ఉన్న స్పెయిన్ పాలకులను తరిమివేశాయి. దానితో అన్ని దేశాలూ రాజు పాలన క్రిందకి వచ్చి ఇటలీ ఏకీకరణ ముగిసింది.
  8. 1871 లో, విక్టర్ ఇమ్మాన్యుయెల్ – II ఏకీకృత ఇటలీకి రాజుగా ప్రకటించబడ్డాడు.

ప్రశ్న 2.
“సమకాలీన ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి మరియు ప్రజలందరికి స్వేచ్ఛను మరియు హక్కులను గౌరవించేందుకు ప్రజాస్వామ్యమే ఉత్తమ పరిష్కారం”. – ఈ విషయంతో మీరు ఏకీభవిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని సమర్థించుకొనండి.
(లేదా)
“అత్యంత పేద ప్రజలు, బలహీనవర్గాలు కూడా తమ గొంతుక వినిపించి, ప్రభుత్వ విధానాలను ప్రభావితం చేయగల, అందరికీ న్యాయం, శాంతిని అందించగల నూతన ప్రజాస్వామిక విధానాన్ని రూపొందించటానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నం జరుగుతోంది.”
“ప్రజాస్వామ్యమే అత్యుత్తమ పరిపాలన విధానం” వ్యాఖ్యానించండి.
జవాబు:
ప్రస్తుతం ప్రపంచ సమస్యలకు ఒక పరిస్కారం ప్రజాస్వామ్యం అనడాన్ని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే ప్రజాస్వామ్యం లేని దేశాల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణ : తమ పాలకులను ఎన్నుకునే స్వేచ్ఛ లేకపోవడం, ప్రజలు సంఘాలను, సంస్థలను ఏర్పాటుచెయడానికి స్వేచ్ఛ లేకపోవడం, పాలకులకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడానికి అవకాశం లేకపోవడం, ఆయా దేశాలలో పౌర హక్కులకు, మానవ హక్కులకు రక్షణ లేకపోవడం వంటివి.

మరోవైపు ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిన ప్రతినిధులను, తమ పాలకులను ఎన్నుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారు. వాక్ స్వాతంత్ర్యాన్ని, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, ప్రభుత్వ నిర్ణయాల పట్ల నిరసనను తెలియచేసే అవకాశాన్ని, ప్రజలు పార్టీలను, సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారు.

ప్రజాస్వామ్యం పౌరులందరి మానవ హక్కులను రక్షిస్తుంది. సమన్యాయ పాలనలో భాగంగా చట్టం ముందు అందరూ సమానులే. చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయి.

ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజల అవసరాలకు అనుగుణంగా స్పందించాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనం కలిగి ఉంటుంది.

ప్రజాస్వామ్యం రాజకీయ సమానత్వం అనే సూత్రంపై ఆధారపడి ఉంది. ఇక్కడ పేదలు, నిరక్షరాస్యులు సైతం ధనికులు, అత్యంత విద్యావంతులతో సమానమైన హోదాను పొందుతారు. భిన్నత్వాలు గల సమాజంలో వివిధ వ్యక్తులు వివిధ ఆలోచనలు, ఆసక్తులు కలిగి ఉంటారు. అందరి అభిప్రాయాలకు, ఆలోచనలకు విలువనివ్వడం ప్రజాస్వామ్య లక్షణం.

ప్రజాస్వామ్యాన్ని అత్యంత ఉత్తమమైన ప్రభుత్వ వ్యవస్థ అనడంలో సందేహం లేదు.

ప్రశ్న 1.
లిబియా ఏ దేశ వలస పాలనలో ఉండేది?
జవాబు:
ఇటలీ

ప్రశ్న 2.
లిబియాకు ఎప్పుడు స్వాతంత్ర్యం లభించింది?
జవాబు:
లిబియాకు 1951లో స్వాతంత్ర్యం లభించింది.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 3.
లిబియా ప్రజల జీవనాధారం ఏమిటి?
జవాబు:
లిబియా ప్రజలు వ్యవసాయం, ఎడారులలో పశువుల పాలన పై ఆధారపడి జీవనం సాగించేవారు.

ప్రశ్న 4.
లిబియా అతి తక్కువ కాలంలో సంపన్నదేశమవ్వడానికి గల కారణం?
జవాబు:
1959 సంవత్సరంలో లిబియాలో విస్తారమైన ముడిచమురు నిధులను కనుగొన్నారు.. చమురు అమ్మకంతో దేశంలోకి సంపద ప్రవహింపసాగింది. సంపన్నదేశమైంది.

ప్రశ్న 5.
లిబియా అభివృద్ధి కొరకు, సంక్షేమం కొరకు ఏయే కార్యక్రమాలు అమలుచేయాలని యువత కోరింది?
జవాబు:

  1. ప్రజాసంక్షేమం కోసం పనిచేసే ఆధునిక ప్రభుత్వాలు ఏర్పాటుచేయాలని యువత కోరింది.
  2. మహిళలపై అణచివేతను అంతం చేయాలని, వివిధ జాతుల మధ్య నిరంతర యుద్ధాలకు స్వస్తి పలకాలని, ఐక్యత, శాంతిని స్థాపించాలని యువత రాజు ఇద్రిస్ ని కోరింది.

ప్రశ్న 6.
మువమ్మర్ గఢాఫి లిబియా అధికారం ఎప్పుడు చేజిక్కించుకున్నాడు?
జవాబు:
మువమ్మర్ గఢాఫి 70 యువ సైనిక అధికారుల బృందం, తమను తాము స్వేచ్ఛ అధికారుల ఉద్యమంగా పేర్కొని 1969లో లిబియా అధికారాన్ని కైవసం చేసుకున్నాడు.

ప్రశ్న 7.
లిబియాలో అధిక ప్రజల మతమేది?
జవాబు:
లిబియాలో అధిక ప్రజల మతం ఇస్లాం.

ప్రశ్న 8.
లిబియా దేశం ఎదుర్కొను సమస్యలేవి?
జవాబు:
లిబియాలో అధికశాతం ప్రజలు పేదవారు. పశుపాలనలో సంచార జీవనం గడుపుతుండేవాళ్ళు. నిరక్షరాస్యత అధికం. మహిళలకు పరదా పద్ధతి అమలులో ఉండేది.

ప్రశ్న 9.
గఫి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం ఏయే సంస్కరణలు అమలుచేసింది?
జవాబు:
కొత్త ప్రభుత్వం అనేక కొత్త సంస్కరణలు అమలుచేసి లిబియాను ప్రగతిపథంలో నిలిపింది.

  1. చమురు వనరులను జాతీయం చేసింది.
  2. సంచార జీవనం నాశనం చేయ తలంచింది.
  3. పేద ప్రజలకు నీటి వసతి ఉన్న భూములను ఉచితంగా అందజేసింది.
  4. సాగు విస్తీర్ణ పద్ధతులు అమలుచేసింది.
  5. అందరికీ విద్య, అందరికీ వైద్యం ఉచితంగా అందజేసింది.
  6. మహిళలకు, స్వేచ్ఛ, సమాన సదా.
  7. చమురు నుండి వచ్చే ఆదాయంలో కొంత ప్రజలకు పంచడం వంటి సంస్కరణలతో లిబియా సామాజిక సంక్షేమంలో అత్యున్నత స్థానం పొందింది.

ప్రశ్న 10.
ప్రజాస్వామిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి అరబ్ ప్రపంచంలో 2010లో ఏయే దేశాలలో ఉద్యమాలు జరిగాయి?
జవాబు:
ట్యునీసియా, ఈజిప్టు, లిబియా, ఎమెన్, బబ్రాన్, సిరియా వంటి దేశాలలో ఉద్యమం మొదలైంది.

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 11.
లిబియా తిరుగుబాటులో ఏయే వర్గాలు వారు ప్రాతినిధ్యం వహించారు?
జవాబు:
తిరుగుబాటు బృందాలలో సైన్యం నుంచి బయటకు వచ్చిన కొంతమంది సైనికులు. అధికశాతం మంది న్యాయవాదులు, కార్మికులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు సామాన్య ప్రజలు.

ప్రశ్న 12.
లిబియా తిరుగుబాటుదారులకు ప్రపంచంలోని చాలా దేశాలు ఎందుకు మద్దతు ఇచ్చాయి?
జవాబు:
ప్రపంచంలోని అమెరికా వంటి దేశాల నుండి లిబియాలోని తిరుగుబాటుదారులకు మద్దతు లభించింది. ఎందుకంటే దీని వెనుక లిబియాలోని అపార చమురు నిల్వలను చేజిక్కించుకోవాలన్న కోరిక ఉంది. ఐక్యరాజ్యసమితి సైతం తిరుగుబాటుదారులకు మద్దతు పలికి లిబియాని విమానాలు ఎగరగూడని ప్రాంతంగా ప్రకటించింది.

ప్రశ్న 13.
బర్మా ప్రపంచదేశాలకు ఏయే వస్తువులకు, ఆహారపదార్థాలకు సరఫరాదారుగా ఉండేది?
జవాబు:
టేకు, కలప, బియ్యం వంటి ఆహారధాన్యాలు, తగరం వంటి ఖనిజాలు, కెంపులు, నీలాలు వంటి విలువైన రాళ్ళకు బర్మా ప్రధాన సరఫరాదారుగా ఉండేది.

ప్రశ్న 14.
వివిధ రాజకీయ పార్టీలు పోటీ చేసిన ఎన్నికలు బర్మాలో ఏయే సంవత్సరాలలో జరిగాయి?
జవాబు:
1951, 1956, 1960లలో ఎన్నికలు జరిగాయి.

ప్రశ్న 15.
1947లో బర్మాకి స్వాతంత్ర్యం సాధించి తెచ్చినవాడు?
జవాబు:
బర్మాకి స్వాతంత్ర్యం తెచ్చినవాడు టర్మన్ జాతి నాయకుడు ఆంగ్ సాన్ (ప్రస్తుత ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీకి తండ్రి).

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 16.
బర్మాలో సైన్యాధిపతుల పాలకులు ఎటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు?
జవాబు:

  1. బర్మా సైన్యాధిపతుల పాలనలో పేద దేశంగానే ఉండిపోయింది.
  2. దేశ వనరులన్నీ సైన్యాధిపతుల అధీనంలోకి వెళ్ళాయి.
  3. రైతాంగం తమ పిల్లలను సైన్యానికి అమ్ముకోవలసి వచ్చింది.
  4. పేద ప్రజలు బానిసల మాదిరి గనులలో పనిచేయవలసి వచ్చేది.
  5. బర్మాని పాలించిన సైన్యాధిపతులు మానవహక్కులను ఉల్లంఘించారు.
  6. పిల్లలతో సహ ప్రజలతో బలవంతంగా వెట్టిచాకిరి చేయించుకున్నారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు.

ప్రశ్న 17.
బర్మాలో ప్రజాస్వామ్యం నెలకొల్పటానికి జరుగుతున్న పోరాటాలు, నిరసనలకు ఆనాటి నుంచి నేటి వరకు కేంద్ర బిందువు ఎవరు?
జవాబు:
ఆంగ్ సాన్ సూకి.

ప్రశ్న 18.
ఆంగ్ సాన్ సూకి ఆధ్వర్యంలో గల కూటమి పేరేమి?
జవాబు:
జాతీయ ప్రజాస్వామ్య కూటమి (నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసి) (NLD)

ప్రశ్న 19.
“ఆర్థిక దిగ్బంధం” అంటే ఏమిటి?
జవాబు:
ప్రపంచంలోని దేశాలు ఎగుమతులు, దిగుమతులు ఏవీ జరపకుండా, బర్మాని వాణిజ్యపరంగా ఏకాకిని చేయడం.

ప్రశ్న 20.
బర్మాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటానికి ప్రజల అభిప్రాయ సేకరణ (రిఫరెండం) ఎప్పుడు నిర్వహించారు?
జవాబు:
2008లో దేశం పేరుని ప్రజాస్వామిక గణతంత్రంగా మార్చారు.

ప్రశ్న 21.
ఆంగ్ సాన్ సూకీకి నోబెల్ శాంతి బహుమతి ఎప్పుడు లభించింది?
జవాబు:
1991లో

AP 9th Class Social Important Questions Chapter 19 విస్తరిస్తున్న ప్రజాస్వామ్యం

ప్రశ్న 22.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య భావనకు అనుకూలించే పరిస్థితులు ఏవి కల్పించాయి?
జవాబు:
పారిశ్రామికీకరణ, వలస వాదాలు.