These AP 9th Class Social Important Questions 20th Lesson ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన will help students prepare well for the exams.
AP Board 9th Class Social 20th Lesson Important Questions and Answers ప్రజాస్వామ్యం – రూపుదిద్దుకుంటున్న భావన
9th Class Social 20th Lesson 1 Mark Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
ప్రజాస్వామ్యం ఏ సూత్రంపై ఆధారపడి ఉంది?
జవాబు:
రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవటం అన్న మౌలిక సూత్రంపై ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంది.
ప్రశ్న 2.
1980 నుండి జింబాబ్వే స్థితి ఏమిటి?
జవాబు:
అల్పసంఖ్యాక శ్వేత జాతీయుల పాలన నుంచి జింబాబ్వే 1980లో స్వాతంత్ర్యం పొందింది. అప్పటినుంచి దేశ స్వాతంత్ర్య .. ఉద్యమానికి నేతృత్వం వహించిన జాను-పీఎఫ్ అన్న పార్టీయే దేశాన్ని పాలిస్తోంది. ఈ పార్టీ నాయకుడు రాబర్ట్ ముగాబే స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి అధ్యక్షుడిగా ఉన్నాడు.
ప్రశ్న 3.
ఎన్నికలు ఎలా జరగాలి?
జవాబు:
ఒకదేశ ప్రజలు ప్రభుత్వంలో తమకు నిజంగా ప్రాతినిధ్యం వహించే సరైన వ్యక్తులను, లేదా పార్టీలను ఎంచుకోవాలంటే ఎన్నికలు స్వేచ్ఛగా, ఎటువంటి భయంలేని వాతావరణంలో నిర్వహించబడటం ఎంతో ముఖ్యం.
ప్రశ్న 4.
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎలా ఉండాలి?
జవాబు:
ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చట్టాలను గౌరవించాలి. చట్టాలలో పేర్కొన్న న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయటాన్ని అనుమతించాలి.
ప్రశ్న 5.
బెల్జియంలో ప్రజలు ఏ భాషలు మాట్లాడతారు?
జవాబు:
యూరప్ ఖండంలో ఒక చిన్న దేశం ‘బెల్జియం’. ఆ దేశ జనాభాలో 59% మంది ఫ్లెమిస్ ప్రాంతానికి చెందిన ‘డచ్’ భాష మాట్లాడే ప్రజలు. మిగిలిన 40% మంది వలోనియా ప్రాంతానికి చెందిన ‘ఫ్రెంచ్’ మాట్లాడే ప్రజలు. మిగిలిన ఒక్కశాతం ‘జర్మన్’ భాష మాట్లాడే ప్రజలు.
ప్రశ్న 6.
బెల్జియం అనుసరించిన విధానాలు ఏవి?
జవాబు:
బెల్జియం అనుసరించిన విధానాలు – ఏ ఒక్క సమూహమూ (భాష) ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోలేదు, కేంద్ర ప్రభుత్వ అధీనంలో రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయవు, బ్రస్సెల్స్ కి ప్రత్యేక ప్రభుత్వం (ఇందులో రెండు సమూహాలకు సమాన ప్రాతినిధ్యం) మొదలైనవి.
ప్రశ్న 7.
బెల్జియం నాయకులు ఏమి గుర్తించారు?
జవాబు:
వివిధ ప్రాంతాల ప్రజల ప్రయోజనాలు, భావనలను మన్నించినపుడే దేశం ఐక్యంగా ఉంటుందని ‘బెల్జియం’ నాయకులు గుర్తించారు.
9th Class Social 20th Lesson 2 Marks Important Questions and Answers in Telugu Medium
ప్రశ్న 1.
ప్రజాస్వామ్యంలో ‘ఓటు వేయడం’ మరియు “ప్రతినిధులను ఎన్నుకోవడం” ఎందుకు అత్యంత ముఖ్యమైనవి?
జవాబు:
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ఓటింగ్ ప్రక్రియపై పూర్తిగా ఆధారపడి ఉంది.
- ఓటు హక్కు పౌరులు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి అవకాశం కల్పిస్తుంది.
- తమ ప్రాంత వివిధ ప్రజల ఆకాంక్షలను, సమస్యలను వ్యక్తం చేసే తమ ప్రతినిధిని ఎన్నుకోవటానికి ఓటు, వీలు కల్పిస్తుంది.
- ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఒక మార్గం ఓటు.
- ప్రజాస్వామ్య విజయం ఆ దేశ ఓటర్లు క్రియాశీలకంగా పాల్గొనడం, చైతన్యవంతులుగా ఉండటంపై ఆధారపడి ఉంటుంది.
ప్రశ్న 1.
ప్రజాస్వామ్యం అంటే?
జవాబు:
ప్రజాస్వామ్యం అంటే బాధ్యతాయుతమైన ప్రభుత్వం ప్రజలతో ఎన్నుకోబడి, ప్రజలకు జవాబుదారిగా ఉండే ప్రభుత్వం.
ప్రశ్న 2.
లిబియాలో అంతిమ అధికారం ఎవరికి ఉంది?
జవాబు:
లిబియాలో అంతిమ అధికారం రివల్యూషనరీ కమాండ్ కౌన్సిల్ (ఆర్.సి.సి) కి ఉంది.
ప్రశ్న 3.
సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం ఏది?
జవాబు:
సార్వజనీన ఓటు హక్కు కల్పించిన తొలి పెద్ద దేశం సంయుక్త సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ (రష్యా).
ప్రశ్న 4.
ప్రజాస్వామ్యం దేని మీద ఆధారపడి ఉంది?
జవాబు:
ప్రజాస్వామ్యం రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకోవడం అన్న మౌలిక సూత్రంపై ఆధారపడి ఉంది.
ప్రశ్న 5.
ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం ఎలా సాధ్యమవుతుంది?
జవాబు:
ప్రజలందరూ బహిరంగంగా పాల్గొని తమ అవసరాలు, అభిప్రాయాలు స్పష్టంగా పేర్కొనెలా బహిరంగ చర్చలు జరిపిన తరువాత చట్టాలు, విధానాలు రూపొందించినపుడు ఇది సాధ్యమవుతుంది.
ప్రశ్న 6.
ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛాయుత ఎన్నికలు ఎంత ముఖ్యం?
జవాబు:
ఒక దేశ ప్రజలు ప్రభుత్వంలో తమకు నిజంగా ప్రాతినిధ్యం వహించే సరైన వ్యక్తులను లేదా పార్టీలను ఎంచుకోవాలంటే ఎన్నికలు స్వేచ్చగా, ఎటువంటి భయంలేని వాతావరణంలో నిర్వహించడం ఎంతో ముఖ్యం. ఎన్నికలలో ఏ ఒక్క పార్టీకి ప్రత్యేక అవకాశాలు ఉండవు. ఏ పార్టీయైన ఏ వ్యక్తులైన అందులో పాల్గొనగలుగుతారు.
ప్రశ్న 7.
ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటే దేనిని పరిశీలించుట ముఖ్యం?
జవాబు:
ప్రజాస్వామ్యాన్ని అంచనా వేయాలంటే ఎన్నికలను పరిశీలించుట ముఖ్యం.
ప్రశ్న 8.
ప్రజాస్వామ్యం దేనిని రక్షణగా ఉండాలి?
జవాబు:
ప్రజలలో అధిక శాతానికి భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులను ప్రజాస్వామ్యం రక్షణగా ఉండాలి.
ప్రశ్న 9.
ప్రజాస్వామ్యం దేనికి లోబడి పని చేయాలి?
జవాబు:
ప్రజాస్వామ్యం రాజ్యాంగ చట్టం, పౌరుల హక్కుల పరిమితులకు లోబడి పని చేయాలి.
ప్రశ్న 10.
ప్రజాస్వామ్యంలో పౌరుల గౌరవం, స్వేచ్ఛ గూర్చి వ్రాయుము.
జవాబు:
వ్యక్తి గౌరవాన్ని, స్వేచ్ఛని కాపాడటంలో వివిధ రకాల ప్రభుత్వాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం మెరుగైనది. గౌరవం, స్వేచ్ఛలపట్ల నిబద్ధతే ప్రజాస్వామ్యానికి పునాది.