AP 9th Class Social Notes Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

Students can go through AP Board 9th Class Social Notes 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 13th Lesson 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

AP 9th Class Social Notes Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 1
→ లివర్లు : ఫ్రాన్స్ లో ద్రవ్య కొలమానం (కరెన్సీ) 1794 నుండి నిలిపివేయబడింది.

→ మతాధిపతులు : చర్చిలో ప్రత్యేక విధులతో సంబంధం ఉన్న వ్యక్తుల బృందం.

→ టిధే : చర్చి విధించిన పన్ను. దీని ప్రకారం వ్యవసాయ ఉత్పత్తిలో పదవ వంతు చర్చికి చెల్లించాలి.

→ టెయిలే : ప్రభుత్వానికి నేరుగా కట్టే పన్ను.

→ మానర్ : ప్రభువు భూములు, అతడి ఇల్లు ఉన్న ప్రాంతం.

AP 9th Class Social Notes Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

→ ఛాటూ : రాజు లేదా కులీన వ్యక్తికి చెందిన కోట లేదా ప్రాసాదం.

మానవ పౌర హక్కుల ప్రకటన

→ మానవులు స్వేచ్ఛా జీవులుగా పుట్టారు. అలాగే ఉంటారు. హక్కులు అందరికీ సమానంగా వర్తిస్తాయి.

→ మనిషి సహజ, విడదీయరాని హక్కులైన స్వేచ్ఛ, ఆస్తి, భద్రత, అణిచివేతలకు ప్రతిఘటన ప్రతి రాజకీయ సంఘ ఉద్దేశం కావాలి.

→ సార్వభౌమత్వ మూలాలు దేశంలో ఉంటాయి. ప్రజల నుంచి సంక్రమించని అధికారాన్ని ఏ వ్యక్తి, బృందం కలిగి ఉండకూడదు.

→ స్వేచ్ఛ అంటే ఇతరులకు లేని హాని కలిగించని ఏదైనా చేసే అధికారం.

→ సమాజానికి హాని కలిగించే చర్యలను మాత్రమే నిషేధించే అధికారం చట్టానికి ఉంటుంది.

→ చట్టం ప్రజల అభీష్టాన్ని వ్యక్తపరుస్తుంది. దాని తయారీలో పౌరులందరూ ప్రత్యక్షంగా కానీ, లేదా తమ ప్రతినిధుల ద్వారాగాని పాల్గొనవచ్చు. దానిముందు పౌరులందరూ సమానమే.

→ ప్రతి పౌరునికి స్వేచ్ఛగా మాట్లాడే, రాసే, ప్రచురించే హక్కు ఉంది. చట్టం నిర్ణయించిన ప్రకారం ఇటువంటి స్వేచ్ఛను దుర్వినియోగ పరిచినందుకు అతడు బాధ్యత వహించాలి.

→ పరిపాలన వ్యవస్థ ఖర్చులకు, ప్రజాసైన్యాన్ని నిర్వహించడానికి అందరికీ వర్తించే పన్నులు విధించడం తప్పనిసరి. వాళ్ళకున్న ఆస్తుల నిష్పత్తిలో వాటిని పౌరులందరికీ వర్తింపచేయాలి.

AP 9th Class Social Notes Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

→ ఆస్తి పవిత్రమైన, ఉల్లంఘించగూడని హక్కు కాబట్టి చట్టబద్ధంగా నిర్ణయించిన ప్రజా ప్రయోజనాలకు అవసరమైనప్పుడు తప్పించి దానిని తీసుకోకూడదు. అటువంటి సందర్భాలలో న్యాయమైన నష్ట పరిహారాన్ని ముందుగా చెల్లించాలి.

→ మహోన్నత విప్లవం : తుపాకీ గుండు పేలకుండా, ఒక రక్తం బొట్టు చిందకుండా అధికారం అప్పగించడం.

→ దైవదత్త హక్కు : దేవుని ద్వారా సంక్రమించిన హక్కు.

→ కులీన వర్గ పాలన : రాచరికం ద్వారా రాజు ఆధీనంలోని పాలన.

→ రాచరికం : రాజు ప్రభువుగా, వంశ పారంపర్యంగా పాలించే విధానం.

→ డైరెక్టరీ : ఫ్రాన్స్ లో అయిదుగురు, సభ్యులు గల కార్యనిర్వాహక వర్గం

→ సౌభ్రాతృత్వం : సోదర భావం.

→ జాతీయ శాసన సభ : 1789, జూన్ 20న జాతీయ శాసనసభ ప్రకటించబడింది. ఇందులో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనే మూడు విభాగాలు ఉన్నాయి.

→ అభీష్టం : కోరిక.

→ ఛాటూ : రాజు కోట లేదా ప్రసాదం.

AP 9th Class Social Notes Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు

→ అంతర్యుద్ధం : ఒక దేశంలోని వివిధ వర్గాల మధ్య జరిగే యుద్ధం.

AP 9th Class Social Notes Chapter 13 17, 18వ శతాబ్దాలలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు 2