Students can go through AP Board 9th Class Social Notes 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 14th Lesson 19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు
→ జాతీయతావాదం : యూరప్ సామ్రాజ్యాలుగా, చిన్న చిన్న రాజ్యాలుగా విభజింపబడి, ఉమ్మడి చరిత్ర, సంస్కృతి, ఆర్థిక జీవనంపై బలమైన దేశాలు ఏర్పాటు చేయడానికి ఏర్పడినది జాతీయతావాదం.
→ జాకోబిన్ రాజ్యాంగం : ప్రజలందరికీ ఓటు హక్కు, తిరుగుబాటు హక్కు కల్పించేది. ప్రజలకు పని లేదా జీవనోపాధి కల్పించాలని చూసే మేధావులతో కూడినది.
→ సెర్ఫ్‌లు : ఒక భూస్వామి భూములకు కట్టుబడి ఉన్నవాళ్ళు. అతడి అనుమతి లేకుండా వేరే చోటుకి వెళ్ళటానికి వీలులేని వారు.
→ సఫ్రేజ్ : సర్వజనీన ఓటు హక్కు.
→ యంగ్ ఇటలీ : ఇటలీ ఏకీకరణలో భాగంగా గిస్సెప్పి మాజిని దీనిని ఏర్పరిచాడు.
→ తిరుగుబాట్లు : యూరప్లో ఒక సంప్రదాయవాదులు, మరో ప్రక్క ఉదారవాద ప్రజాస్వామ్య వాదులతో జరిగిన తిరుగుబాట్లు, తమ హక్కుల సంక్షేమానికై జరిగినవి.
→ నిరంకుశత్వం : ప్రజాసంక్షేమాన్ని విస్మరించి, స్వప్రయోజనానికి ప్రాధాన్యతనిచ్చే రాచరికపు పాలన
→ జాతీయతావాదం : తమ దేశ సంస్కృతి, చరిత్ర ఆర్థిక ప్రయోజనాలను కాపాడుతూ దేశ ఐక్యతకు పాటుపడటం.
→ ఉదారవాదం : నిరంకుశత్వానికి, రాచరికానికి, చర్చి ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఏర్పడిన ప్రజాస్వామ్య విధానం.
→ పాలనా యంత్రాంగం : ప్రజాసంక్షేమానికి వివిధ స్థాయిలలో పాటు పడే ప్రభుత్వ అధికారులతో పరిపాలన జరిపేది.
→ కాల్పనికవాదం : సాంస్కృతిక ఉద్యమం, ఉద్వేగాలు, సహజక జ్ఞానం, మహిమలు వంటి భావనలపై దృష్టి కేంద్రీకరించారు.
→ కొత్త మధ్యతరగతి : వ్యాపార వాణిజ్యాలలో ముందున్నవారు. ఆచార్యులు, పాఠశాల ఉపాధ్యాయులు, గుమాస్తాలు, న్యాయవాదులు ఉన్నారు.
→ వ్యక్తీకరణ : చెప్పడం