Students can go through AP Board 9th Class Social Notes 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 15th Lesson పారిశ్రామికీకరణ, సామాజిక మార్పు
→ జేమ్స్ వాట్ : 1769లో ఆవిరి యంత్రంను కనిపెట్టెను. దీనివలన వస్తూత్పత్తి రంగంలో విప్లవాత్మక మార్పులు సంభవించెను.
→ జేమ్స్ హా గ్రీవ్స్ : 1770లో “స్పిన్నింగ్ జెన్ని” నూలు వడికే యంత్రంను కనిపెట్టెను.
→ ఎడ్మండ్ కార్డ్ రైట్ : 1785లో నీటి సహాయంతో నడిచే మర మగ్గాన్ని కనిపెట్టెను.
→ జార్జ్ స్టీఫెన్సన్ : 1814లో బొగ్గును గనుల నుండి రేవు పట్టణాలకు చేర్చుటకు, ఆవిరిశక్తితో నడిచే శకటాన్ని ఉపయోగించెను. ఇది ఈనాటి రైలుబండికి మార్గదర్శకం.
→ మొదటి అబ్రహాం డర్బీ (1677 – 1717) : 1709లో మొదటి అబ్రహాం డర్బీ బట్టీ (కొలిమి) కనుగొనెను. కోక్ (బొగ్గు నుంచి గంధకం, ఇతర కలుషితాలు తొలగించగా ఏర్పడేది) ని ఉపయోగించి, అధిక ఉష్ణోగ్రతలు సాధించ గలిగారు.
→ 2వ డర్బీ (1711 – 1768) : ముడి ఇనుము నుండి (తేలికగా విరిగిపోని) దుక్క ఇనుమును తయారుచేశాడు.
→ హెన్రీ కోర్ట్ (1740 – 1828). : కలబోత బట్టీని (దీంతో కరిగిన ఇనుములోని కలుషితాలు తొలగించవచ్చు), రోలింగ్ మిల్లుని (శుద్ధి చేసిన ఇనుముని ఆవిరితో నడిచే యంత్రంతో కడ్డీలుగా పోతపోయవచ్చు) కనుగొన్నాడు.
→ పారిశ్రామికీకరణ : పరిశ్రమలను ఎక్కువగా స్థాపించుట
→ స్మెల్టింగ్ : లోహాన్ని ఉత్పత్తి చేయడానికి ముతక ఖనిజంలోని మన్ను మొ॥నవి వేరుచేసి శుభ్రపరచుటకు కరిగించుట, మలినాలున్న లోహాన్ని కరిగించడం ద్వారా శుభ్రపరచుట
→ పారిశ్రామిక విప్లవం : వస్తూత్పత్తిలో విప్లవాత్మక మార్పులు
→ ఆవిరి శక్తి : ఆవిరి యంత్రం ద్వారా ఉత్పత్తిలో పెరుగుదల
→ జలశక్తి, : నీటి ద్వారా ఉత్పత్తిలో పెరుగుదల
→ యాంత్రీకరణ : పరిశ్రమలలో అధిక ఉత్పత్తి మరియు లాభాల కొరకు శ్రామిక శక్తిని తగ్గించి యంత్రాలను ప్రవేశపెట్టుట
→ మార్పు : ఒక స్థితి నుండి మరొక స్థితికి చేరడం
→ ఉత్పత్తిదారులు : వస్తువులను ఉత్పత్తి చేసేవారు
→ దీర్ఘకాలిక సమయం : ఎక్కువ కాలం
→ అనతి కాలం : తక్కువ కాలం
→ కర్మాగారాలు : పరిశ్రమలు
→ వలసపాలిత దేశాలు : పరిపాలనలో తమ అధీనంలోని దేశాలు
→ అల్లకల్లోలం : అనేక చిక్కులు / కష్టాలు
→ విచ్ఛిన్నమైన కుటుంబాలు : బ్రతకలేని కుటుంబాలు