Students can go through AP Board 9th Class Social Notes 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 16th Lesson సామాజిక నిరసనోద్యమాలు
→ కారల్ మార్క్స్ : సామ్యవాదానికి కొత్త సిద్ధాంతాన్ని అందించారు. ఫ్యూడల్ శక్తులను, రాజులను తరిమి వేసినట్లే కార్మికులు సంఘటితమై, పెట్టుబడిదారులు లేకుండా చేయాలని మార్క్స్ వాదించాడు. కర్మాగారాలలో, ఉత్పత్తి చేసే కార్మికులకు ఎటువంటి ఆస్తి లేదు. కాని ఉత్పత్తి జరగడానికి వాళ్ళు కీలకం.
→ ఫ్రెడరిక్ ఏంగెల్స్ : పెట్టుబడిదారీ విధానం చరిత్రలో ప్రగతిశీల అంశమని, అదే సమయంలో ఇది పెట్టుబడిదారులను, కార్మికులను తమ నిజమైన మానవత్వం నుండి దూరం చేసే దోపిడీపూరిత విధానమని వాదించెను.
→ సేంట్ సైమన్ : తొలి సామ్యవాద మేధావులలో ఫ్రాన్స్ కి చెందిన సేంట్ సైమన్ ఒకరు. సామాజిక అవసరాలను శాస్త్రజ్ఞులు, పారిశ్రామికవేత్తలు, ఇంజనీర్లు అంచనా వేసి వాటిని తీర్చేలా, ఆస్తుల నియంత్రణ సమాజం చేతిలో ఉండాలని ప్రతిపాదించెను.
→ ఓవెన్ : కార్మికుల దుర్భర పరిస్థితులు, పెట్టుబడిదారుల సంపద చూసిన ఓవెన్ చిన్న పారిశ్రామికవేత్త. సహకార గ్రామాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.
→ జనరల్ నెడ్‌లుద్ద్ : జనాకర్షక నాయకుడు. యంత్రాలపై దాడితో నిరసనలు, కార్మికులకు కనీస వేతనం, మహిళల, పిల్లల పనిభారం తగ్గించాలన్నవాడు. కార్మిక సంఘాల ద్వారా కోర్కెలు నెరవేరతాయన్న తీవ్రవాద నాయకుడు.
→ ప్లాటో : సామ్యవాద భావనలు విరివిగా ప్రచారం చేసిన రాజకీయ శాస్త్రవేత్త, ఫ్రెంచి విప్లవాలతో ఏకీభవించినవాడు. గణతంత్ర, పార్లమెంటరీ ఏర్పాటు ముఖ్యమన్నవాడు.
→ బాబెఫ్ : స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్న ఆదర్శాలను ఫ్రెంచి విప్లవం సాధించలేక పోయిందని భావించారు. “విలువైన సమానత్వం” అన్న సిద్ధాంతాన్ని సాధించాలంటే వ్యక్తిగత ఆస్తిని రద్దు చేసి భూమి, దాని ఫలాలు ఉమ్మడిగా అనుభవించాలని బాబెఫ్ వాదించెను.
→ సామ్యవాదం : ఉత్పత్తి సాధనాలు, ప్రకృతి వనరులు ప్రజల ఆధీనంలో ఉండాలనే సిద్ధాంతం
→ లుద్దిజం : జనరల్ నెల్లుడ్జ్ ఆధీనంలో గల యజమానులపై నిరసనోద్యమం.
→ ప్రాచ్య పండితులు : తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా దేశాలకు చెందిన భాషలు, సంస్కృతులను అధ్యయనం చేయు మేధావులు.
→ స్త్రీ వాదం : స్త్రీలు అన్ని రంగాలలో ముందుండాలనే వాదం.
→ పెట్టుబడిదారీ విధానం : సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమై, లాభాపేక్ష గల విధానం.
→ విప్లవకారులు : ప్రజా సమస్యలను సాధించడానికి, అనుకున్న లక్ష్యాలను సాధించడానికి, ఎంచుకొనే విప్లవ మార్గం గలవారు.
→ అణచివేత : ఆపడం
→ నిత్యావసరాలు : రోజూ ఉపయోగించేవి
→ నిస్పృహ : ఏమీ చేయలేకపోవడం
→ ఉత్పత్తి సాధకాలు : వస్తు ఉత్పత్తికి దోహదపడేవి.
→ వర్ధిల్లడం : వృద్ధి చెందడం, ప్రకాశించడం
→ సమసమాజం : పేద, ధనిక భేదం లేకుండా అందరూ సమానంగా ఉండాలనే నైజం
→ సంఘటితం : ఐక్యం
→ స్వేచ్ఛా జీవులు : స్వతంత్రులు