Students can go through AP Board 9th Class Social Notes 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 17th Lesson లాటిన్ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలలో వలసవాదం
→ డచ్‌వారు : హాలెండ్ దేశప్రజలను డచ్ వారంటారు. నేడు దాని అధికారిక నామం నెదర్లాండ్స్
→ ఆఫ్రికాకై ఉరుకులాట : ఆఫ్రికా ప్రాంతాలపై తమ ఆధిపత్యం కోసం యూరప్ దేశాలు చేసిన ప్రయత్నాలు.
→ దక్షిణాఫ్రికా సమాఖ్య : ప్రస్తుతం దక్షిణ ఆఫ్రికాగా పిలువబడుతున్న అధిక ప్రాంతంపై నియంత్రణ సాధించటానికి ఇంగ్లాండ్ రెండు యుద్ధాలు చేసింది. ఈ యుద్ధాలు ముగిసిన దక్షిణ ఆఫ్రికాలోని అన్ని ప్రాంతాలను దక్షిణ ఆఫ్రికా సమాఖ్యగా బ్రిటిషు ఏకీకరణ చేసింది.
→ లాటిన్ అమెరికన్ దేశాలు : మధ్య, దక్షిణ అమెరికాలలో అధిక భాగం స్పెయిన్, పోర్చుగీసు ఆధీనంలోకి వచ్చింది. స్పెయిన్, పోర్చుగీసు భాషలు లాటిన్ నుండి పుట్టాయి కాబట్టి ఈ దేశాలు లాటిన్ అమెరికా దేశాలు.
→ వలసవాదం : ధనార్జన, సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఇతర ఖండాల నూతన ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం.
→ లాటిన్ అమెరికా స్పెయిన్, పోర్చుగీసు భాషలు లాటిన్ నుంచి పుట్టాయి కాబట్టి ఆ దేశాలే లాటిన్ అమెరికా దేశాలు.
→ ఒట్టోమన్ సామ్రాజ్యం : యూరప్, ఆసియాల మధ్య చాలావరకు వ్యాపార మార్గాలను ముస్లిం రాజ్యాలు నియంత్రించసాగాయి. ప్రత్యేకించి ఒట్టోమన్ సామ్రాజ్యం యూరప్ క్రైస్తవ శక్తులతో నిరంతరం యుద్ధాలు చేస్తుండేది.
→ అన్వేషణలు : వలసవాదం వ్యాప్తి చేయడానికి నూతన ప్రదేశాలు, దేశాలలో వర్తక వాణిజ్యాలు అభివృద్ధి చేయడానికి వివిధ దేశాలకు చెందిన నావికులు, ఓడలు, పడవలు ద్వారా కొత్త ప్రదేశాలు కనుగొనుట.
→ జాతి వివక్షత : పౌరహక్కులు, స్వేచ్ఛగా సంచరించే హక్కు, సంఘాలుగా ఏర్పడే హక్కులేని అధికశాతంపై చూపే ఈ వివక్షతే జాతి వివక్షత.
→ హసియండాలు : విశాలమైన భూభాగాలు వేల కొలది ఎకరాలలో విస్తరించినవి. స్పెయిన్ నుంచి వచ్చి స్థిరపడిన భూస్వాములవి.
→ మన్రో సిద్ధాంతం : అమెరికా అధ్యక్షుడు జేమ్స్ మన్రో రూపొందించిన పథకం. ఇతర ఖండాలవారు తమ ఖండంలో వలస ప్రాంతాలు స్థాపించబడకుండుట, దానికి ప్రతిగా యూరప్లో తమఖండం వలసవాదం స్థాపించదని తెలిపే విధానం.
→ నల్లమందు యుద్ధాలు : ఇంగ్లాండు, చైనాల మధ్య 1840 – 42 ల మధ్య జరిగింది.
→ నావికులు : సముద్ర ప్రయాణం చేసేవారు.
→ సహృదయులు : మంచి మనస్సు, దయగల హృదయం గలవారు.
→ హతమార్చుట : చంపుట.
→ వ్యవసాయ క్షేత్రం : పంటలు పండించే భూములు.
→ మైత్రి : స్నేహం.
→ పశుపోషకులు ఆవు, గేదెలు, మేకలు మేపుతూ వాటి ఆదాయంపై జీవించేవారు.
→ అమానవీయ : మానవత్వం, సంస్కారం లేకపోవడం.