Students can go through AP Board 9th Class Social Notes 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 18th Lesson భారతదేశంపై వలసవాద ప్రభావం
→ ప్రభుత్వం మొదటి కర్మాగారాల చట్టాన్ని 1881 లో చేసింది. దాని ద్వారా ప్రత్యేకించి పనిచేసే పిల్లల సంక్షేమం కోసం ఈ దిగువ పేర్కొన్న నియమాలు చేసింది.
* ఏడు సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాలలో నియమించకూడదు. 7-12 సంవత్సరాల పిల్లలతో రోజుకి 9 గంటల కంటే ఎక్కువ పనిచేయించకూడదు. రోజులో ఒక గంట విరామం ఇవ్వాలి. వాళ్ళకి నెలలో 4 రోజులు సెలవులు ఇవ్వాలి.
→ 1891 మహిళా కార్మికుల సంక్షేమం కోసం చట్టాలు చేశారు. వాటి ప్రకారం –
- మహిళా కార్మికులతో రోజుకి 11 గంటలకు మించి పని చేయించకూడదు.
- మహిళా కార్మికులకు రోజుకి గంటన్నర విరామం ఇవ్వాలి.
- పిల్లల పని గంటలను రోజుకి 9 నుంచి 7కి తగ్గించారు. తొమ్మిది సంవత్సరాలలోపు పిల్లలను కర్మాగార యజమానులు పనిలో పెట్టుకోకుండా నిషేధించారు.
→ పరిశ్రమలలో పురుషులు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. అయితే వాళ్ళ సంక్షేమం కోసం 1911 వరకు ఎటువంటి చట్టాలూ చేయలేదు. 1911 కర్మాగారాల చట్టం ప్రకారం –
- వయోజన పురుష కార్మికులతో రోజుకి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదు.
- ఆరు గంటలు పని తర్వాత అరగంట విరామం ఉండాలి.
→ ఆదివాసీ తిరుగుబాటు : అడవి హక్కుల నుండి దూరం చేశాక అటవీ గిరిజనులు, ఆదివాసీలు తమ ఫల సాయాలకై ప్రభుత్వంపై చేసిన తిరుగుబాటు.
→ రిజర్వ్ అడవి : ప్రభుత్వ అధీనంలో, అటవీశాఖి నియంత్రణలో గలది.
→ రక్షిత అడవులు : కలప, విలువైన జంతు చర్మాలు, దంతాలు అపహరించకుండా అటవీశాఖ పర్యవేక్షణలో ఉన్నవి.
→ వేలం వేయడం : ప్రభుత్వం ఆదాయం పొందుటకుగాను ఎక్కువ మొత్తంలో నిధులు రాబట్టడానికి నిర్వహించు విధానం.
→ సామాజిక కార్యకర్త : సమాజాన్ని, ప్రజలను చైతన్యపరుస్తూ, ప్రజల బాగు కొరకు పాటుపడేవాడు.
→ పారిశ్రామికవేత్త : పరిశ్రమలను స్థాపించి వస్తూత్పత్తి విధానంలో నియంత్రణ గలవాడు, ధనవంతుడు.
→ మార్వాడి వ్యాపారులు : ఇతర ప్రాంతాల నుంచి వచ్చి లాభార్జన ధ్యేయంతో వ్యాపారం చేసేవారు.
→ సమ్మె : కార్మికులు పని చేయకుండా, వస్తువుల ఉత్పత్తి జరపకుండా నిరసన తెలియచేసి పనిని స్తంభింపచేయడం.
→ కార్మిక సంఘాలు : కార్మికుల సంక్షేమం కోసం పాటుపడే సంఘాలు.
→ పారిశ్రామిక పట్టణాలు : పరిశ్రమలు ఎక్కువగా నెలకొల్పబడే పట్టణాలు.
→ కార్మిక వాడలు పు : కార్మికులు నివసించే ప్రదేశాలు.
→ కార్మిక ఒప్పందాలు : పరిశ్రమల యాజమాన్యం లేదా ప్రభుత్వం కార్మికులతో చేసుకొనే ఒప్పందాలు.