AP 9th Class Social Notes Chapter 5 జీవావరణం

Students can go through AP Board 9th Class Social Notes 5th Lesson జీవావరణం to understand and remember the concept easily.

AP Board 9th Class Social Notes 5th Lesson జీవావరణం

→ జీవంతో కళకళలాడే ఏకైక గ్రహం భూమి.

→ భూ శాస్త్రజ్ఞులు జీవాన్ని ఒక ప్రత్యేక ఆవరణంగా పరిగణిస్తారు. దీనిని “జీవావరణం” అంటారు.

→ ఒక రకమైన జీవరూపం మరొక దానికి ఆహారం అవుతుంది. దీనినే “ఆహారపు గొలుసు” అంటారు.

→ మొక్కలు తయారు చేసిన ఆహారాన్ని శాకాహారులు అని పిలిచే జింక, ఆవు, మేక, ఏనుగు వంటి గడ్డి తినే జంతువులు తింటాయి.

→ శాకాహార జంతువులను తినేవాటిని మాంసాహార జంతువులంటారు.
ఉదా: కుక్క, పిల్లి, డేగ, పులి వంటివి.

→ పశువుల చికిత్సలో డైక్లో ఫెనాక్ అనే మందును వాడుతున్నారు.

AP 9th Class Social Notes Chapter 5 జీవావరణం

→ బాగా చలిగా ఉండే ప్రాంతాలలో పెరిగే నాచు, లిచెన్, చిన్న పొదలతో కూడిన మొక్కలను టండ్రా వృక్షజాలం అంటారు.

→ ఉష్ణమండల సతతహరిత అడవులలో రోజ్ వుడ్, ఎబొని, మహాగని వంటి గట్టి కలప నిచ్చే చెట్లు పెరుగుతాయి.

→ ఉష్ణమండల ఆకురాల్చే అడవులలో సాల్, టేకు, వేప, శీషం వంటి వృక్షాలు పెరుగుతాయి.

→ సమశీతోష్ణ సతత హరిత అడవులలో ఓక్, ఫైన్, నీలగిరి వంటి వృక్షాలు పెరుగుతాయి.

→ సమశీతోష్ణ ఆకురాల్చే అడవులలో ఓక్, యాష్, బిర్చ్ వంటి చెట్లు ఎక్కువగా ఉంటాయి.

→ మధ్యధరా వృక్షజాలంలో నారింజ వంటి నిమ్మజాతి చెట్లు, అంజూర, ఆలివ్, ద్రాక్ష వంటి పంటలను పండిస్తున్నారు.

→ ఉత్తరార్ధగోళంలో 50° నుంచి 70° అక్షాంశాల మధ్య అద్భుతమైన శృంగాకారపు అడవులు పెరుగుతాయి. వీటిని “టైగాలు” అని కూడా అంటారు.

→ శృంగాకారపు అడవులలో చిర్, పైన్, సెడార్ అనేవి ప్రధాన వృక్షజాతులు.

→ ఉష్ణమండల గడ్డిభూములలో ఏనుగులు, కంచరగాడిద, జిరాఫీ, జింక, చిరుత పులి వంటి జంతువులు ఉంటాయి.

→ సమశీతోష్ణ మండల గడ్డి భూములను “స్టెప్పీలు” అంటారు.

→ టండ్రా వృక్షజాలంగా నాచు, లిచెన్, చిన్న చిన్న పొదలను పేర్కొనవచ్చును.

→ టండ్రా ప్రాంతంలో పెరిగే జంతువులు సీల్, వాల్ రస్, మస్క్, ఆక్సెన్, ఆర్కిటిక్ గుడ్లగూబ, ధృవప్రాంత ఎలుగు, ధృవపునక్కలు ప్రధానమైనవి.

→ శిలాజ ఇంధనాలను ఉపయోగించటం వల్ల బొగ్గుపులుసు వాయువుతో పాటు నైట్రోజన్ ఆక్సైడ్, ఆవిరైపోయే కర్బన మూలకాలు భారలోహాలు వంటి ఇతర రసాయనాలు విడుదలవుతాయి.

→ వాతావరణంలోని ఆమ్ల రేణువులు వర్షబిందువులతో కలిసినప్పుడు వాన నీటిలో ఆమ్ల శాతం పెరుగుతుంది. దీనినే “ఆమ్ల వర్షం” అంటారు.

→ భూమి మీద ఉన్న ప్రాణులు అన్ని పర్యావరణం మీద ఆధారపడి ఉన్నాయి.

→ ఆహారపు గొలుసు : ఒక రకమైన జీవరూపం మరొక దానికి ఆహారం అవుతుంది.

→ కఠిన దారు వృక్షాలు : రోజ్ వుడ్, ఎబొని, మహాగని వంటి గట్టి కలపనిచ్చే చెట్లు.

→ ఆమ్ల వర్షాలు : గంధిక, కర్ణన, నత్రిత ఆమ్లాలు విడుదలై వాటి ఫలితంగా పడే వర్షాలను ఆమ్ల వర్షాలు అంటారు.

→ పర్యావరణ సంక్షోభం : మానవులు అభివృద్ధి, సంతోషం పేర్లతో ప్రకృతిని నాశనం చేయుట ద్వారా పర్యావరణ సంక్షోభం తలెత్తుతుంది.

→ టండ్రా : మంచు ప్రాంతం అనగా ధృవాల వద్ద ఉన్న ప్రాంతం.

AP 9th Class Social Notes Chapter 5 జీవావరణం

→ ప్రపంచం వేడెక్కడం : కాలుష్యాల వల్ల కొంతకాలానికి మన పర్యావరణం విషపూరితం అవుతోంది. మరొక ముఖ్యమైన మార్పు ప్రపంచ వ్యాప్తంగా శీతోష్ణస్థితులు మారటం. దీనినే ‘ప్రపంచం వేడెక్కటం’ (global warming) అంటున్నారు.

→ శిలాజ ఇంధనం : లక్షల సంవత్సరాల క్రితం అడవులు భూమిలోపలికి తిరగబడటం వల్ల ఇవి ఏర్పడ్డాయి, అందుకే వీటిని శిలాజ ఇంధనాలు అంటారు.

→ స్టెప్పీలు : సమశీతోష్ణ మండల గడ్డిభూములను “స్టెప్పీలు” అంటారు.

AP 9th Class Social Notes Chapter 5 జీవావరణం 1 AP 9th Class Social Notes Chapter 5 జీవావరణం 2