Students can go through AP Board 9th Class Social Notes 6th Lesson భారతదేశంలో వ్యవసాయం to understand and remember the concept easily.
AP Board 9th Class Social Notes 6th Lesson భారతదేశంలో వ్యవసాయం
→ భారతదేశంలో వ్యవసాయం ఒక పురాతనమైన ఆర్థిక కార్యకలాపం.
→ వాణిజ్య వ్యవసాయం కంటే జీవనాధార వ్యవసాయం భిన్నమైనది.
→ జీవనాధార వ్యవసాయం నందు రెండు రకాల వ్యవసాయ పద్ధతులున్నాయి. అవి:
- సాధారణ జీవనాధార వ్యవసాయం
- సాంద్ర జీవనాధార వ్యవసాయం
→ సాధారణ జీవనాధార వ్యవసాయం అంటే చిన్న కమతాలలో, పురాతన పనిముట్లు అయిన పొర, గుల్లకర్ర సహాయంతో చేసే సేద్యం.
→ సాంద్ర జీవనాధార వ్యవసాయం అంటే అధికంగా వ్యవసాయ శ్రామికులను, అత్యధిక జీవరసాయనిక ఎరువులను, నీటి పారుదలను ఉపయోగించుకొని అధిక దిగుబడి సాధించే వ్యవసాయ విధానం.
→ వాణిజ్య వ్యవసాయం : అధిక దిగుబడి కొరకు ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం.
→ భారతదేశంలో మూడు పంట కాలాలు ఉన్నాయి. అవి
- ఖరీప్
- రబీ
- జయాద్
→ రబీ పంట కాలం : అక్టోబర్ నుండి డిసెంబర్ మధ్య కాలంలో విత్తనాలను విత్తుతారు. ఏప్రిల్ నుండి జూన్ మధ్యకాలంలో పంటను కోస్తారు.
→ రబీపంటలు : గోధుమ, బార్లీ, బఠాణి, శనగలు.
→ ఖరీప్ పంటకాలం : నైరుతి ఋతుపవనాల రాకతో ప్రారంభమై సెప్టెంబర్ నుండి అక్టోబర్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమగును.
→ ఖరీప్ ప్రధాన పంటలు: వరి, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, ప్రత్తి, జనుము, వేరుశనగ, సోయాబీన్
→ ఖరీఫ్, రబీ పంటకాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట రుతువును “జయాద్” అంటారు.
→ జయాద్ ప్రధాన పంటలు : పుచ్చకాయలు, కరూజ, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత
→ మన దేశంలో అత్యధికులు వినియోగించే ముఖ్య ఆహారం – వరి
→ ప్రపంచంలో చైనా తరువాత భారతదేశంలోనే అత్యధికంగా వరిని పండిస్తున్నారు.
→ వరి తరువాత 2వ ముఖ్యమైన తృణ ధాన్యం గోధుమ.
→ ఆహారంగానూ, పశువుల దాణాగానూ ఉపయోగపడే పంట – మొక్కజొన్న
→ భారతదేశంలో పండే ప్రధాన చిరుధాన్యాలు – జొన్న, సజ్జ, రాగులు
→ చిరుధాన్యాలకు మరోపేరు – ముతక ధాన్యాలు.
→ జొన్న ఉత్పత్తిలో, విస్తీర్ణంలోనూ ప్రపంచంలో భారతదేశం 3 వ స్థానంలో ఉంది.
→ మహారాష్ట్ర అత్యధికంగా జొన్నను పండిస్తున్న రాష్ట్రం.
→ ప్రపంచంలో పప్పుధాన్యాల ఉత్పత్తితోనూ, వినియోగంలోనూ భారతదేశం ప్రథమస్థానంలో ఉంది.
→ ప్రపంచంలో నూనె గింజలు అత్యధికంగా మన దేశంలోనే.పండిస్తున్నారు.
→ ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4% భారతదేశంలోనే పండుతున్నది.
→ పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో ప్రథమ స్థానం కలిగి ఉంది.
→ ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మన దేశం 5 వ స్థానంలో కలదు.
→ మన దేశంలో ముఖ్యమైన నార పంటలు : ప్రత్తి, జనుము, గంజాయి, సహజ పట్టు
→ పట్టు పురుగులను పెంచడాన్ని “సెరికల్చర్” అంటారు.
→ ప్రపంచలోనే మొట్టమొదట ప్రత్తిని సాగుచేసిన దేశం భారతదేశం.
→ బంగారు పీచుగా ప్రసిద్ధి చెందినది – జనుము.
→ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసే మొదటి దశలో భాగంగా నీటిపారుదల సౌకర్యాల అభివృద్ధి, ఆనకట్టల నిర్మాణం చేశారు.
→ ప్రధాన బహుళార్థసాధక ప్రాజెక్టులు – అవి నెలకొని యున్న రాష్ట్రాలు:
- భాక్రానంగల్ – పంజాబ్
- దామోదర్ లోయ పథకం – పశ్చిమబెంగాల్
- హీరాకుడ్ – ఒడిశా
- నాగార్జున సాగర్ – ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ
- గాంధీసాగర్ – మధ్యప్రదేశ్
→ రెండవ దశలో పరిశోధనా కేంద్రాలను, విదేశాలలో ఆవిష్కరించిన నూతన విత్తనాలను ప్రభుత్వం వ్యవసాయరంగంలో ప్రవేశపెట్టింది.
→ భారతదేశం మొత్తం సాగుభూమిలో 40% భూమికి నీటి పారుదల వసతి కలదు.
→ భారత ఆహార సంస్థ ద్వారా భారత ప్రభుత్వం గిడ్డంగులలో భారీగా ఆహారధాన్యాలను నిల్వ చేస్తుంది.
→ పంజాబ్ లోని 12 జిల్లాల్లో 9 జిల్లాలు భూగర్భ జల సమస్యను ఎదుర్కొంటున్నాయి.
→ వ్యవసాయ సంస్కరణలకు 3 వ దశలో ప్రాధాన్యతనిస్తున్నారు.
→ భారతీయ రైతులు కూరగాయలు, పండ్లు, పంచదార, బెల్లాన్ని ఎగుమతి చేయగలుగుతున్నారు.
→ విదేశీ వ్యాపారం వల్ల రైతుల ఆదాయం ఎక్కువ ఒడిదుడుకులకు లోనవుతుంది.
→ రసాయనిక ఎరువులు : రసాయనిక పదార్థాలను ఉపయోగించి తయారు చేసి ఎరువులు.
→ హరిత విప్లవం :
- హరితవిప్లవంలో భాగంగా, అధిక దిగుబడి విత్తనాలు ప్రవేశపెట్టుట.
- రసాయనిక ఎరువుల వినియోగం తం
- ట్రాక్టర్ మొదలైన యంత్రాల వినియోగం
- నీటి పారుదల సదుపాయాలను కల్పించడం
- రైతులకు ఋణసదుపాయాన్ని అందించడం.
- క్రిమిసంహారక మందులు ప్రవేశపెట్టడం, వాటిని ఉపయోగించి వ్యవసాయం చేయటం.
→ సేంద్రియ పదార్థం : పేడ, హ్యూమస్ వంటి పదార్థాలను “సేంద్రియ పదార్థాలు” అంటారు.
→ వర్షాధార వ్యవసాయం : వర్షం మీద ఆధారపడి వ్యవసాయం చేయడం.
→ ఆధునిక వ్యవసాయ పద్ధతులు : అధిక దిగుబడి నిచ్చే విత్తనాలు, యంత్రాలు, యంత్ర పరికరాలు ఉపయోగించి చేసే వ్యవసాయం.
→ విదేశీ వాణిజ్య విధానం : విదేశీ వ్యాపారపరంగా వచ్చిన మార్పుల కనుగుణంగా పంటల క్రయవిక్రయాలు అంతర్జాతీయంగా జరపడం.