SCERT AP 10th Class Biology Guide Pdf Download 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Biology 5th Lesson Questions and Answers నియంత్రణ – సమన్వయ వ్యవస్థ
10th Class Biology 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
సమతాస్థితి, సమన్వయం అవసరమయ్యే కొన్ని పనులను చెప్పండి.
జవాబు:
మన శరీరంలో అనేక వ్యవస్థలు కలిసి పనిచేయడం వలననే అన్ని క్రియలు సక్రమంగా జరుగుతున్నాయి.
ప్రశ్న 2.
కండరాలలో కదలికలకు ప్రేరణ కలిగించేవి ఏమిటి?
జవాబు:
మన శరీరంలో ఉండే అవయవాలు, కణజాలాలు, కణాలు ఒక పద్ధతి ప్రకారం పని చేస్తాయి. ఇవన్నీ పరిసరాల నుండి సంకేతాలను గ్రహించి దానికనుగుణంగా ప్రతిస్పందిస్తాయి. ఈ ప్రతిస్పందనలే శరీరంలోనూ, శరీరం ద్వారానూ అనేక పనులు జరగటానికి ప్రేరణనిస్తాయి.
ప్రశ్న 3.
ఈ క్రింది ఖాళీలలో సరైన సమాచారాన్ని రాయండి. (AS1)
జవాబు:
ప్రశ్న 4.
జట్టుగా పనిచేయడం వలన మన శరీరం వివిధ విధులను నిర్వహించగలుగుతుందని మీరు అనుకుంటున్నారా? అయితే ఉదాహరణతో వివరించండి. (AS1)
జవాబు:
జట్టుగా పనిచేయటం వలన మన శరీరం వివిధ విధులను నిర్వహించగలుగుతుంది.
ఉదాహరణకు
చదవటం :
పుస్తకంలోని వాక్యాలను కళ్ళు గుర్తించి, సమాచారాన్ని మెదడుకు పంపుతాయి. మెదడు వాటిని నాలుకకు పంపుట వలన నోటితో మనం చదవగలుగుతున్నాము. అంటే మనం చదివే ప్రక్రియలో కళ్ళు – మెదడు – నోరు కలిసి పనిచేస్తున్నాయి.
వ్రాయటం :
తరగతి గదిలో టీచర్ నోట్స్ చెపుతున్నప్పుడు విద్యార్థి చెవుల ద్వారా వింటాడు. విన్న సమాచారం మెదడుకు చేరి సందేశాలను చేతికి పంపుతుంది. కావున విద్యార్థి నోట్స్ రాయగలుగుతున్నాడు. ఈ ప్రక్రియలో చెవి-మెదడు-చెయ్యి కలిసి పనిచేస్తున్నాయి.
నడవటం :
కళ్ళు దానిని గమనించి మెదడుకు సందేశాలు పంపగా మెదడు ఆదేశాలను కాళ్ళకు పంపుతుంది. కావున మనం నడవగలుగుతున్నాము. ఈ ప్రక్రియలో కళ్ళు -మెదడు-కాళ్ళు కలిసి పనిచేస్తున్నాయి.
ఆడటం :
ఆడటంలో కాళ్ళు, చేతులు, నడుం వంటి భాగాలు మెదడు ఆదేశాల మేరకు సమన్వయంగా పనిచేయటం వలన మనం రకరకాల ఆటలు ఆడగలుగుతున్నాము. ఇలా మన శరీరంలోని అవయవాలన్నీ కలిసి జట్టుగా పనిచేయటం వలన వివిధ పనులు నిర్వహించగలుగుతున్నాము. వాస్తవానికి ఏ అవయవం ఒంటరిగా పనిని నిర్వహించలేదు. అవయవముల జట్టు ఫలితంగానే అన్ని పనులు నిర్వహించగలుగుతున్నాము.
ప్రశ్న 5.
మీ శరీరం అంతస్రావ్య వ్యవస్థ మరియు నాడీవ్యవస్థతో సమన్వయంగా పనిచేస్తుందనడానికి కొన్ని ఉదాహరణ లివ్వండి. (AS1)
జవాబు:
- మన శరీరంలో అంతస్రావ్య వ్యవస్థ మరియు నాడీవ్యవస్థ సమన్వయంగా పనిచేస్తాయి.
- ఆందోళన, ఆ ప్రమాదకర పరిస్థితులలో అభివృక్క గ్రంథి వల్కలం నుండి ఎడ్రినలిన్, నారడ్రినలిన్ హార్మోన్స్ స్రవించబడతాయి. ఇవి నాడీవ్యవస్థ నుండి వచ్చే ప్రచోదనాల వలన జరుగుతుంది.
- హైపోథాలమస్ మరియు పీయూషగ్రంథి స్రావాలు నాడీవ్యవస్థ అధీనంలో ఉంటాయి. అందుకే వీటి రసాయనాలను ‘న్యూరోహార్మోన్స్’ అంటారు.
- పీయూష గ్రంథి పరలంభికను ‘Neurohypophysis’ అంటారు. ఇది నాడీ కణజాలం కలిగి ఉండి, వినాళగ్రంథిగా పనిచేస్తుంది.
- నాడీ ప్రచోదనాలలో కీలకపాత్ర వహించే న్యూరోట్రాన్స్ మీటర్స్ నాడీ రసాయన సమన్వయానికి ఉదాహరణ.
ఉదా: ఎసిటైల్ కొలిన్.
నిజ జీవిత నిదర్శనాలు:
- తల్లి బిడ్డకు పాలు ఇచ్చే సందర్భంలో చనుమొనలు (Nipple) చప్పరించటం వలన ఉద్దీపన జ్ఞాననాడి ద్వారా మెదడుకు చేరుతుంది. మెదడు ఆదేశం అనుసరించి పిట్యూటరీ గ్రంథి ‘ఆక్సిటాసిన్’ను ఉత్పత్తి చేస్తుంది. ఇది క్షీర గ్రంథులను ప్రేరేపించి పాలు విడుదల అవుతాయి. ఈ ప్రక్రియలో నాడీ రసాయనిక వ్యవస్థలు సమన్వయంగా పనిచేస్తాయి.
- లైంగిక ఉద్రేకాలలో గ్రాహకాల నుండి మెదడుకు సమాచారం చేరవేయటం వలన మెదడు ప్రతిస్పందించి ఆదేశాలు ఇస్తుంది. మెదడు ఆదేశాల మేరకు ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్స్ స్రవించబడి ప్రతిచర్యలు చూపుతాయి.
ప్రశ్న 6.
మీరు చెత్త ప్రోగు చేసే ప్రదేశం గుండా వెళ్తున్నారనుకోండి. మీరు వెంటనే ముక్కు మూసుకుంటారు. ఈ క్రియలో జరిగే సంఘటనలను 1-5 వరకు అవి జరిగే క్రమంలో అమర్చండి. (AS1)
ఎ) ఏక్సాన్ చివర విద్యుత్ ప్రచోదనాలు, రసాయనాలను విడుదల చేస్తాయి.
బి) డెండ్రైట్ కణాలపై చేరిన ఉద్దీపనాలు, రసాయనిక చర్యలు విద్యుత్ ప్రచోదనాలను ఉత్పత్తి చేస్తాయి.
సి) విద్యుత్ ప్రచోదనాలు కణదేహం ఏక్సాన్ ద్వారా పంపిస్తాయి.
డి) రసాయనాలు సినాప్ను దాటి తరువాత న్యూరాను చేరతాయి. అదే విధంగా అనేక విద్యుత్ ప్రచోదనాలు అనేక న్యూరాన్లను దాటుతాయి.
ఇ) చివరగా న్యూరాన్ నుండి విడుదలైన ప్రచోదనం గ్రంథి వైపు చేరడం వలన చెడువాసనను గుర్తించడానికి మరియు కండర కణాలు ముక్కును మూసుకోవడానికి ఉపయోగపడతాయి.
జవాబు:
చెత్తను ప్రోగుచేసే ప్రదేశం గుండా వెళుతున్నప్పుడు వెంటనే మనం ముక్కు మూసుకుంటాము. ఈ సంఘటనలోని చర్యలు ఈ క్రింది విధంగా వరుస క్రమంలో ఉంటాయి.
ఎ) డెండ్రైట్స్ కణాలపై చేరిన ఉద్దీపనాలు, రసాయనిక చర్యల ద్వారా విద్యుత్ ప్రచోదనాలను ఉత్పత్తి చేస్తాయి.
బి) విద్యుత్ ప్రచోదనాలు కణదేహం ఎక్సాన్ ద్వారా పంపిస్తాయి.
సి) ఏక్సాన్ చివర విద్యుత్ ప్రచోదనాలు, రసాయనాలను విడుదల చేస్తాయి.
డి) రసాయనాలు సైనాన్సు దాటిన తరువాత న్యూరాన్‌కు చేరతాయి. అదే విధంగా అనేక విద్యుత్ ప్రచోదనాలు అనేక న్యూరాన్లను దాటుతాయి.
ఇ) చివరిగా న్యూరాన్ నుండి విడుదలైన ప్రచోదనం గ్రంథి వైపు చేరడం వలన చెడువాసనను గుర్తించడానికి మరియు కండర కణాలు ముక్కును మూసుకోవడానికి ఉపయోగపడతాయి.
ప్రశ్న 7.
సినాప్స్ అంటే ఏమిటి? సమాచార ప్రసారంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? (AS1)
జవాబు:
కొన్ని ఎక్సాన్లు నిర్వాహక అంగాలైన కండరాలు, గ్రంథులు కణాలతోటి సంబంధం పెట్టుకుంటాయి. ఈ భాగాన్ని సినాప్స్ అంటారు. సినాప్స్ వద్ద నాడీ అంత్యాల త్వచాలు, నిర్వాహక అంగాల కణాలు ఒకదాని నుండి మరొకటి వేరుగా ఉంటాయి. వీటికి మధ్య ఖాళీ ప్రదేశం ఉంటుంది.
నాడీకణం, సైనాప్స్ మధ్య సంబంధం :
రెండు నాడీకణాల మధ్య విధిని నిర్వహించే ప్రాంతమే సైనాప్స్. ఇక్కడ ఒక నాడీకణం నుండి మరొక నాడీకణానికి సమాచారం బదలాయింపు జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఎటువంటి జీవ పదార్థ సంబంధం లేక చిన్న ఖాళీ ప్రదేశం లేకపోయినప్పటికీ సమాచారం రసాయనికంగా గాని లేక విద్యుత్ సంకేతాలు లేక రెండు విధాలుగా ప్రసారమవుతుంది. మెదడుపైన గాని, వెన్నుపాము పైన గాని మరియు వెన్నుపాము చుట్టూ సైనాలు ఉంటాయి. వీటి తరువాత వెన్నుపాము synopse లు ప్రాంతం నుండి ఏక్సాన్లు సంకేతాలను మన శరీరంలోని ప్రత్యేక భాగాలకు తీసుకుని వెళ్తాయి.
ప్రశ్న 8.
కింది వాటి మధ్యగల తేడాలను రాయండి. (AS1)
అ) ఉద్దీపన మరియు ప్రతిస్పందన
ఆ) అపవాహక మరియు అభివాహక నాడులు
ఇ) కేంద్రీయ నాడీవ్యవస్థ మరియు పరిధీయ నాడీవ్యవస్థ.
ఈ) గ్రాహకం మరియు ప్రభావకం
జవాబు:
అ) ఉద్దీపన మరియు ప్రతిస్పందన :
ఉద్దీపన | ప్రతిస్పందన |
1. జీవులలో ప్రతిస్పందనను కలిగించే కారకాలను ఉద్దీపనాలు అంటారు. | 1. ఉద్దీపనాలకు జీవులు చూపించే ప్రతిచర్యలను ప్రతిస్పందనలు అంటారు. |
2. ఉద్దీపన ప్రతిస్పందన కారకము. | 2. ఉద్దీపన ఫలితము ప్రతిస్పందన. |
3. ఉద్దీపనలు అన్ని ప్రతిస్పందనను కలిగిస్తాయి. | 3. అన్ని ఉద్దీపనలకు ప్రతిస్పందన ఒకే విధంగా ఉండదు. |
4. ఉదా: గిచ్చటం (Pinching) | 4. ఉదా : ప్రక్కకు జరగటం, కోప్పడటం. |
ఆ) అపవాహక మరియు అభివాహక నాడులు :
అపవాహక నాడులు | అభివాహక నాడులు |
1. వార్తలను కేంద్రనాడీ వ్యవస్థ నుండి నిర్వాహక అంగాలకు చేర్చుతాయి. | 1. జ్ఞానేంద్రియాల నుండి వార్తలను కేంద్రనాడీ వ్యవస్థకు చేర్చుతాయి. |
2. వీటిని చాలక నాడులు అని కూడా అంటారు. | 2. వీటిని జ్ఞాననాడులు అని కూడా అంటారు. |
3. ఇవి కేంద్ర నాడీవ్యవస్థ నుండి బయలుదేరుతాయి. | 3. ఇవి జ్ఞానేంద్రియాల నుండి ప్రారంభమవుతాయి. |
4. నిర్వాహక అంగాలకు చేరతాయి. | 4. కేంద్రనాడీ వ్యవస్థకు చేరతాయి. |
ఇ) కేంద్రీయ నాడీవ్యవస్థ మరియు పరిధీయ నాడీవ్యవస్థ :
కేంద్రీయ నాడీవ్యవస్థ | పరిధీయ నాడీవ్యవస్థ |
1. మెదడు, వెన్నుపామును కలిపి కేంద్రీయ నాడీవ్యవస్థ అంటారు. | 1. కపాలనాడులు, వెన్నునాడులను కలిపి పరిధీయ నాడీవ్యవస్థ అంటారు. |
2. ఇవి శరీరంలో మధ్య (కేంద్ర) ప్రాంతంలో అమరి ఉంటాయి. | 2. ఇవి శరీర మధ్య ప్రాంతం నుండి ప్రక్కలకు విస్తరిస్తాయి. |
3. ఇవి నాడీవ్యవస్థలో కీలకమైనవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. | 3. ఇవి కేంద్రీయ నాడీవ్యవస్థకు అనుబంధంగా సహాయకంగా పనిచేస్తాయి. |
4. సమాచార విశ్లేషణకు, ప్రతిచర్యల ఆదేశాలకు ప్రాధాన్యత నిస్తాయి. | 4. సమాచార రవాణాలో ప్రధానంగా పాల్గొంటాయి. |
ఈ) గ్రాహకం మరియు ప్రభావకం :
గ్రాహకం | ప్రభావకం |
1. శరీరం లోపల మరియు బయట జరిగే మార్పులను గ్రహించే కణాలను గ్రాహకాలు అంటారు. | 1. మెదడు పంపిన ఆదేశాలను నిర్వహించే అవయవాలు లేదా కణజాలాన్ని ప్రభావకం లేదా నిర్వాహక కణజాలం అంటారు. |
2. ఇవి మార్పులను గ్రహించి ప్రచోదనాలను ఉత్పత్తి చేస్తాయి. | 2. మెదడు నుండి వచ్చిన ఆదేశాలను అమలు పరుస్తుంది. |
3. జ్ఞాననాడులతో సంబంధం కలిగి ఉంటాయి. | 3. చాలక నాడులతో సంబంధం కలిగి ఉంటాయి. |
4. జ్ఞానేంద్రియాలు గ్రాహక కణాలను కలిగి ఉంటాయి. | 4. శరీరంలోని కండర కణజాలం, అవయవాలు ప్రభావకాలుగా వ్యవహరిస్తాయి. |
5. ఉదా : కన్ను, చెవి. | 5. ఉదా : కాళ్ళు , చేతులు. |
ప్రశ్న 9.
మొక్కలలో కాంతి అనువర్తనం ఎలా జరుగుతుంది? (AS1)
జవాబు:
- మొక్కలు కాంతికి ప్రతిస్పందించడాన్ని కాంతి అనువర్తనం అంటారు.
- మొక్కలలో కాండము కాంతి అనువర్తనాన్ని ప్రదర్శిస్తుంది.
- మొక్కలపై కాంతి పడినపుడు కాండాగ్రంలోని విభాజ్య కణజాలం ఆక్సిన్స్ అనే ఫైటో హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- ఆక్సిన్ ప్రభావం వలన కణాలు విభజన చెంది కాంతివైపుకు వంగుతాయి. దీనినే కాంతి అనువర్తనం’ అంటారు.
ప్రశ్న 10.
మొక్కలు ఉద్దీపనలకు ఎలా ప్రతిస్పందిస్తాయో ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:
జంతువుల వలె మొక్కలు కూడా ఉద్దీపనలకు ప్రతిస్పందిస్తాయి. ఉదాహరణకు.
- వేసవి కాలంలో అధిక వేడికి నీటినష్టాన్ని తగ్గించటానికి ఆకులు రాల్చుతాయి.
- వర్షాలు కురిసి నీరు పుష్కలంగా ఉన్నప్పుడు వేగంగా పెరుగుతాయి.
- ఆకులు వేయటం, పుష్పించటం, కాయలు కాయటం కూడా మొక్కలలో వాతావరణానికి ప్రతిస్పందనలే.
- కాండాలు కాంతి వైపుకు పెరుగుతూ కాంతికి ప్రతిస్పందిస్తాయి. దీనిని కాంతి అనువర్తనం అంటారు.
- వేర్లు గురుత్వాకర్షణకు ప్రతిస్పందించి ఆ వైపుకు పెరుగుతాయి. దీనిని గురుత్వానువర్తనం అంటారు.
- అత్తిపత్తి వంటి మొక్కలు తాకినపుడు ముడుచుకుపోతాయి. దీనిని ‘థిగో ట్రాపిజం’ అంటారు.
- దోస, కాకర వంటి బలహీన కాండాలు నులితీగలను కలిగి ఉండి ఆధారం దొరకగానే వాటిని చుట్టుకొని ఎగబ్రాకుతాయి.
- ప్రొద్దుతిరుగుడులోని పుష్పం కాంతికి అనువర్తనం చూపుతూ ప్రతిస్పందన చూపుతుంది.
ప్రశ్న 11.
మొక్కలలో వేరు కాంతికి వ్యతిరేకంగా పెరుగుతాయనే విషయాన్ని చూపించటానికి ఒక ప్రయోగాన్ని సూచించండి. (AS1)
జవాబు:
- ఒక గాజు జాడీని తీసుకొని మట్టితో నింపాను. జాడీ గోడ భాగాన చిక్కుడు విత్తనం నాటాను.
- 4 నుండి 5 రోజులకు విత్తనం మొలకెత్తటం గమనించాను.
- జాడీని సూర్యరశ్మిలో ఉంచాను. కాండం కాంతి వైపుకు పెరుగుతుంటే వేరు దానికి వ్యతిరేకంగా పెరగటం గమనించాను.
- జాడీని కదిపి మొక్కను సమాంతరంగా ఉండేటట్లు చేశాను.
- తరువాత పరిశీలనలో కాండం పైకి కాంతివైపుకు, వేరు క్రిందకు పెరగటం గమనించాను.
ప్రశ్న 12.
మీ శరీరంలోని హార్మోన్ల ప్రభావం వలన కనబడే మార్పులకు ఉదాహరణలివ్వండి. (AS1)
జవాబు:
- మగవారిలో ముష్కాలు ‘టెస్టోస్టిరాన్’ అనే లైంగిక హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రభావం వలన మగవారిలో గడ్డం, మీసం పెరుగుదల, కండరాల అభివృద్ధి, శబ్ద తీవ్రత పెరుగుదల, లైంగిక అవయవాల వృద్ధి వంటి మార్పులు కనిపిస్తాయి.
- ఆడవారిలో స్త్రీ బీజకోశం ఆయిస్ట్రాయిడల్ అనే హార్మోను ఉత్పత్తి చేస్తుంది. దీని వలన ఆడవారిలో ద్వితీయ లైంగిక లక్షణాలు అయిన వక్షోజాల వృద్ధి, కటివలయం పెరుగుదల, ఋతుచక్రం, చర్మం కోమలంగా నిగారింపుగా మారటం, మొటిమలు వంటి మార్పులు కనిపిస్తాయి.
ప్రశ్న 13.
నిర్మాణరీత్యా నాడీకణం, సాధారణ కణం కంటే ఏ విధంగా భిన్నమైనది? వివరించండి. (AS1)
జవాబు:
- నాడీకణ నిర్మాణం సాధారణ కణం కంటే చాలా విభిన్నంగా ఉంటుంది.
- నాడీకణాలు చాలా పొడవుగా ఉండి, మైలిన్ తొడుగుతో కప్పబడి ఉంటాయి.
- కణదేహం విస్తరించి, డెండ్రాలను ఏర్పరుస్తుంది.
- ఒక నాడీకణం మరొక నాడీకణంతో సంబంధం పెట్టుకోవటానికి అనువుగా టెలీడెండైట్స్ మరియు డెండ్రైట్స్ ఉంటాయి.
- ‘నాడీకణాలు విద్యుత్ ప్రచోదనానికి అణువుగా ఉంటాయి.
- నాడీకణాలు అన్ని ఒక వలవలె శరీరం అంతా విస్తరించి సంబంధం కలిగి ఉంటాయి.
- సమాచార విశ్లేషణ ప్రతిస్పందన సామర్థ్యాలు నాడీకణాలకు మాత్రమే సాధ్యం.
- నాడీకణాలు రక్షణ కొరకు పోషణ కొరకు ప్రత్యేక గ్లియల్ కణాలు కలిగి ఉంటాయి.
- ఏ ఇతర కణాలలో లేని విధంగా నాడీకణం జీవ పదార్థంలో నిస్సల్ కణికలు ఉంటాయి. నిస్సల్ కణికలు నాడీకణ ప్రత్యేకత.
- నాడీకణాలు నిర్మాణాత్మకంగా విభిన్నత కలిగి ఉంటాయి. కొన్ని మైలిన్ సహితంగా మరికొన్ని మైలీన్ రహితంగా ఉంటాయి.
- కొన్ని నాడీకణాలు ఏక ధృవంగా మరికొన్ని ద్విధృవంగా ఉంటాయి.
- క్రియాత్మకంగా కూడా నాడీకణాలు విభిన్నంగా ఉంటాయి. కొన్ని జ్ఞాననాడులుగా వ్యవహరిస్తూ మరికొన్ని చాలక నాడులుగా, మరికొన్ని మిశ్రమ నాడులుగా పనిచేస్తాయి.
ప్రశ్న 14.
నాదీకణ నిర్మాణం ప్రచోదనాల ప్రసారానికి అనువుగా ఉందా? విశ్లేషించండి. (AS1)
జవాబు:
నాడీకణం యొక్క ప్రధాన విధి సమాచార రవాణా, ఇది నాడీ ప్రచోదనాల ఆధారంగా జరుగుతుంది. కావున నాడీ ప్రచోదనాల రవాణాకు నాడికణం నిర్మాణం అనువుగా ఉంటుంది. అవి :
- శరీర కణజాలంలో నాడీకణం పొడవైన కణం. దీనివలన నాడీ ప్రచోదనాలను ఎక్కువ దూరం రవాణా చేయవచ్చు.
- నాడీకణాలు శాఖల వంటి డెండ్రైట్ను కలిగి ఉండి ఒకదానితో ఒకటి సంబంధం ఏర్పరుచుకొని వల వంటి నిర్మాణంగా మారతాయి. ఈ సంబంధం వలన ప్రచోదనాలు అన్ని భాగాలకు రవాణా అవుతాయి.
- ఆగ్జానను మైలీన్ తొడుగు కలిగి ఉండి ప్రచోదనాల విద్యుదావేశం క్షీణత చెందకుండా నిరోధిస్తుంది.
- మైలీన్ తొడుగులో ఉండే ర్వర్ కణుపులు నాడీ ప్రచోదన వేగాన్ని పెంచుతాయి.
- నాడీ అంత్యాలు సైనా ను కలిగి ఉండి, రసాయన సమాచారాన్ని నాడీ ప్రచోదనాలుగా మార్చుకుంటాయి.
ప్రశ్న 15.
మానవుడు తెలివైన జంతువు. ఈ విధమైన నిర్ణయానికి రావడానికి గల కారణాలు చర్చించండి. (AS1)
జవాబు:
- ఈ అనంత విశ్వంలో జీవం కలిగిన ఏకైక గ్రహం. భూమి అయితే దానిలో అత్యంత తెలివైన జీవి మనిషి, భూమిమీద అనేక కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ వాటికి లేని అనేక ప్రత్యేకతలు, సామర్థ్యాలు మనిషికి ఉన్నాయి.
- విషయాన్ని విశ్లేషించటం, తార్కికత, జ్ఞాపకశక్తి, ఊహించటం, సమస్వా సాధన వంటి అద్భుత మానసిక ప్రక్రియలు మనిషిలో అత్యున్నతంగా ఉన్నాయి. వీటి వలనే జంతు రాజ్యంలో మనిషి అగ్రస్థానంలో నిలబడగలిగినాడు.
- శబ్దాలను భాషగా మార్చి సమాచారాన్ని అత్యంత సమర్థంగా అందచేయగల జీవి కూడా మనిషే.
- భాషకు లిపిని ఏర్పర్చి సమాచారాన్ని గ్రంథస్థం చేసి తరువాత తరాలకు అందించటం వలన మనిషి విశేష జ్ఞానాన్ని సముపార్థించగలిగాడు.
- అన్ని జీవులు ప్రకృతికి లోబడి జీవిస్తుంటే మనిషి మాత్రమే, ప్రకృతి సత్యాలను అన్వేషించి నూతన ఆవిష్కరణలు చేసి తన జీవితాన్ని సుఖమయం చేసుకొన్నాడు.
- తన మేధాశక్తితో ప్రకృతి పదార్థాలను మేళవించి, చక్రం నుండి అంతరిక్ష ‘రోవర్’ వరకు అనేక నూతన వస్తువులను తయారుచేసుకొన్నాడు.
ఈ అంశాల ఆధారంగా మనిషి తెలివైన జీవిగా నిర్ధారించవచ్చు.
ప్రశ్న 16.
చేతిలో ఉండే నాడీకణ ఆక్సాన్, కాలిలో ఉండే నాడీకణ ఆక్సాన్ కన్నా చిన్నది. దీనిని నీవు ఎలా సమర్థిస్తావు? (AS1)
జవాబు:
- నాడీకణంలోని పొడవైన నిర్మాణాన్ని ఆగ్జాన్ అంటారు. కొన్ని ఆగ్దాన్లు కలసి నాడులను ఏర్పరుస్తాయి. ఇవి చాలా పొడవుగా విస్తరించి శరీరమంతా వ్యాపించి ఉంటాయి.
- చేతితో పోల్చితే కాళ్ళు ఎక్కువ పొడవుగా ఉంటాయి. కావున కాళ్ళులోని నాడీకణాలు పొడవైన ఆగ్దాన్లు కల్గి, ఉంటాయి.
- అందుచేత చేతిలో ఉండి నాడీకణ ఆక్సాన్, కాలిలో ఉండే నాడీకణ ఆక్సాన్ కన్న చిన్నవిగా ఉంటాయి.
ప్రశ్న 17.
అనేక ప్రచోదనాలకు సెకనులో పదో వంతులోనే ప్రతీకార చర్యలు చూపుతాం. మన శరీరంలో గల ఈ అద్భుతమైన నియంత్రిత వ్యవస్థ గురించి నీవు ఏమనుకుంటున్నావు? (AS1)
జవాబు:
- మన శరీరంలోని నాడీవ్యవస్థ, వేగం ఆశ్చర్యకరంగా ఉంటుంది.
- గ్రాహకాలు, ఉద్దీపనులకు ప్రచోదనాలు ఉత్పత్తి చేయటం, అవి మెదడును చేరి విశ్లేషించబడటం, మెదడు ఆజ్ఞలు తిరిగి నిర్వాహక అంగాలు నిర్వహించటం – ఈ క్రియలన్నీ సెకన్లలో జరగటం అద్భుతంగా అనిపిస్తుంది.
- మన మెదడు చురుకుదనం, పనితీరు, విశ్లేషణా వేగం అబ్బురపరిచే విధంగా ఉంది.
- నాడీ ప్రచోదనం నిముషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. కొన్ని ప్రతీకార చర్యలు సెకన్లో పదోవంతులోనే పూర్తి అవటం, నాడీవ్యవస్థ సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనం.
ప్రశ్న 18.
కిందివానిలో నియంత్రిత ప్రతీకార చర్య, అభ్యసిత ప్రతీకార చర్యలను గుర్తించండి. (AS1)
ఎ) కళ్ళు ఆర్పడం
బి) టేబులు తుడవడం
సి) కీబోర్డు వాయించడం
డి) నోటిలో ఆహారం పెట్టుకోగానే లాలాజలం ఊరటం
ఇ) విపరీతమైన శబ్దం విన్నపుడు చెవులు మూసుకోవడం.
జవాబు:
ఎ) కళ్ళు ఆర్పడం : ఇది మన ప్రమేయం లేకుండా నిరంతరం జరిగే స్వతంత్ర ప్రక్రియ. ఇది ఒక ప్రతీకార చర్య,
బి) టేబులు తుడవడం : మన అధీనంలో జరిగే ఒక నియంత్రిత చర్య.
సి) కీబోర్డు వాయించడం : ఇది నియంత్రిత చర్య. మెదడు ఆదేశాలను అనుసరించి జరిగే నియంత్రిత చర్య.
డి) నోటిలో ఆహారం పెట్టుకోగానే లాలాజలం ఊరటం : ఇది ఒక నిబంధన సహిత ప్రతిచర్య,
ఇ) విపరీతమైన శబ్దం విన్నపుడు చెవులు మూసుకోడం : ఇది ఒక ప్రతీకార చర్య,
ప్రశ్న 19.
ఒక కుండీలోని మొక్కను మీ గదిలోని కిటికీ పక్కన ఉంచితే ఏం జరుగుతుంది? (AS2)
జవాబు:
- కాంతి కిటికీ నుండి గదిలోనికి ప్రవేశించి మొక్కపై పడుతుంది.
- మొక్కలో కాండం కాంతి అనువర్తనాన్ని కలిగి ఉంటుంది.
- అంటే మొక్కలు కాంతి వైపుకు పెరుగుదలను చూపుతాయి.
- కావున కుండీలో మొక్క కిటికీ నుండి బయటకు కాంతి వైపుకు పెరుగుతుంది.
ప్రశ్న 20.
మన శరీరంలోని చర్యలన్నింటినీ మెదడు చేత నియంత్రిస్తే ఏం జరుగుతుంది? (AS2)
జవాబు:
- మెదడు చేత నియంత్రించబడే ప్రతిచర్యలలో ప్రచోదనం ఎక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది.
- అందువలన ఆకస్మికంగా జరిగే అపాయాల నుండి మెదడు శరీరానికి రక్షణ కల్పించలేదు.
- ఆకస్మికంగా జరిగే ప్రమాదాల నుండి రక్షించటానికి మన శరీరంలో అసంకల్పిత ప్రతీకార చర్యావ్యవస్థ ఉంది.
- ఇది మెదడుతో ప్రమేయం లేకుండా పనిచేస్తుంది.
- కావున అన్ని క్రియలు మెదడు చేత నియంత్రించబడకూడదు.
ప్రశ్న 21.
డాక్టర్‌ను కలిసినపుడు క్లోమగ్రంథిని గూర్చి ఎటువంటి సందేహాలు అడుగుతావు? (AS2)
(లేదా)
మీ పాఠశాలకు పిల్లల ఆరోగ్యం పరీక్షించడానికి వచ్చిన డాక్టర్ గారిని క్లోమగ్రంథిని గురించి తెలుసుకోవడానికి నీవు ఎలాంటి ప్రశ్నలడుగుతావు?
జవాబు:
- శరీరంలో క్లోమం యొక్క ప్రాధాన్యత ఏమిటి?
- క్లోమ గ్రంథిని మిశ్రమ గ్రంథి అని అంటారు ఎందుకు?
- క్లోమానికి తరచుగా వచ్చే వ్యాధులు ఏమిటి?
- క్లోమ గ్రంథి సక్రమంగా పనిచేయటానికి మనం తీసుకునే ఆహార అలవాట్లలో మార్పు అవసరమా?
- శారీరక వ్యాయామం, క్లోమగ్రంథి పని తీరుపై ప్రభావం చూపుతుందా?
- చక్కెర వ్యాధికి, క్లోమగ్రంథికి గల సంబంధం ఏమిటి?
ప్రశ్న 22.
కుండీలో ఉన్న మొక్క మూలంలో మట్టి పడిపోకుండా ఏర్పాటుచేసి, దానిని తలకిందులుగా వేలాడదీయండి. మీ పరిశీలనల ద్వారా ఫోటోట్రోపిజమ్ ను వివరించండి. (AS3)
జవాబు:
ప్రయోగం:
- కుండీలో పెరుగుతున్న చిన్న మొక్కను తీసుకుని దాని ఆధారం గట్టిగా కట్టాను.
- తరువాత మొక్కను తలక్రిందులుగా వ్రేలాడదీసాను.
- ఒక వారం తరువాత మొక్కలోని మార్పులను గమనించాను.
పరిశీలనలు :
1. వ్రేలాడుతున్న మొక్క కొమ్మలు, నేరుగా క్రిందికి పెరగకుండా, వంపు తిరిగి, పైకి పెరగటం గమనించాను.
నిర్ధారణ :
- మొక్క తలక్రిందులుగా ఉన్న కాండం కొనలు, కాంతి వైపుకు వంగి పైకి పెరుగుతున్నాయి.
- కాంతివైపుకు మొక్కలు పెరిగే ఈ ధర్మాన్నే కాంతి అనువర్తనం అంటారు.
ప్రశ్న 23.
పక్షి ఈకను తీసుకుని మీ శరీరంలో వివిధ భాగాలను దానితో తాకండి. మీ శరీరంలో అత్యంత సున్నితమైన భాగాన్ని గుర్తించండి. నిద్రించే సమయంలో కూడా ఇదే విధంగా ఉంటుందా? (AS3)
జవాబు:
కోడి ఈకతో శరీరంలోని వివిధ ప్రాంతాలను తాకి చూచినపుడు
- శరీర ఇతర భాగాల కంటే ముఖం ఎక్కువ సున్నితంగా ఉన్నట్లు గుర్తించాను.
- పెదవులు, ముక్కుకొన, చెవి లోపలి భాగాలు అధిక స్పర్శజ్ఞానం కలిగి ఉన్నాయి.
- నిద్రపోతున్నప్పుడు కూడా ఈ ఫలితాలు ఇదే విధంగా ఉన్నాయి.
ప్రశ్న 24.
మొక్క అగ్రభాగంలో ఉత్పత్తి అయ్యే హార్మోనుల గురించి అధ్యయనం చేయడానికి నీవు ఏ పద్ధతి అనుసరిస్తావు? (AS3)
(లేదా)
కాండం కొనమీద ఫైటోహార్మోన్ ప్రభావం తెలుసుకోవటానికి నీవు ఏ ప్రయోగం నిర్వహిస్తావు?
(లేదా)
వెంట్ ప్రయోగాన్ని వివరించండి. ఈ ప్రయోగం ద్వారా వెంట్ ఏమని నిర్ధారించాడు ?
జవాబు:
ప్రయోగం :
1926లో డచ్ వృక్ష శరీర ధర్మ శాస్త్రవేత్తలు వెంట్ మొక్క ద్వారా ఉత్పత్తి అయిన ఒక ప్రభావాన్ని ఏర్పరచడంలో సఫలీకృతులయ్యారు. ఓటు ధాన్యపు అంకురం యొక్క ప్రాంకురం కవచాన్ని కత్తిరించాడు. కాండం కొన పైన ఆగార్ ఆగార్ ముక్కకు పెట్టి గంటసేపు అలాగే ఉంచాడు. ఆగారు చిన్న చిన్న పెట్టెలుగా కత్తిరించి ప్రతి పెట్టె వంటి ఆగారిని తొడుగు కత్తిరించిన మొక్క కాండంపైన పెట్టాడు. వాటిని చీకటిలో ఉంచాడు. గంటలోపల నిర్దిష్టమైన వంపును ఆగార్ పెట్టిన భాగం నుండి వెంట్ ప్రయోగం దూరంగా కనబడింది.
పరిశీలన :
ప్రాంకుర కవచంతో సంబంధంలేని ఆగార్ కాండం కొనభాగం ఎటువంటి వంపును ప్రదర్శించలేదు. ఆగార్ ముక్క ఉంచిన భాగం వైపు కొద్దిగా వంపు కనబడింది.
నిర్ధారణ :
ఈ ప్రయోగం ఆధారంగా వెంట్ ఊహించిందేమిటంటే ప్రాంకుర కవచం కొనభాగం ప్రభావం రసాయనిక ఉదీపన వలన జరిగిందని ఈ రసాయనిక ఉద్దీపనలకు ఆక్సిన్లు అని పేరు పెట్టాడు. ఈ విధంగా వెంట్ ఆక్సిన్ అనే మొట్టమొదటి మొక్క హార్మోను కనుగొనగలిగారు.
ప్రశ్న 25.
వెన్నుపాము నియంత్రించే చర్యల గురించి మీ పాఠశాల గ్రంథాలయం నుండి వివరాలు సేకరించండి. (AS4)
జవాబు:
- వెన్నుపాము శరీర భాగాల నుండి వచ్చే సమాచారాన్ని మెదడుకు పంపుతుంది.
- మెదడు ఇచ్చే ఆదేశాలు వెన్నుపాము ద్వారానే నాడులకు చేరతాయి.
- వెన్నుపాము మధ్యస్థ నాడీకణం కలిగి ఉండి అసంకల్పిత ప్రతీకార చర్యలలో పాల్గొంటుంది.
- అసంకల్పిత ప్రతీకార చర్యలు మెదడుతో ప్రమేయం లేకుండా వెన్నుపాము నియంత్రణలో ఉంటాయి.
- అసంకల్పిత ప్రతీకార చర్యలు వెన్నుపాము ఆధీనంలో ఉండుట వలన ప్రతిచర్యా మార్గం ప్రయాణం తగ్గి, ప్రమాదాల నుండి రక్షణ ఇస్తుంది.
- ఉదా : 1. వేడిగా ఉన్న వస్తువులను తాకినపుడు చేతిని వెనక్కు తీసుకోవటం,
2. కళ్ళ మీద కాంతి పడినప్పుడు కళ్ళుమూసుకోవటం.
3. నాశికలోనికి ధూళి ప్రవేశిస్తే తుమ్మటం.
ప్రశ్న 26.
కింది వాక్యాలను చదవండి. వినాళగ్రంథుల పనులతో పోల్చండి. (AS4)
ఎ) జీవులు ఫెరమోన్లనే రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి.
బి) ఇవి నాళగ్రంథుల నుండి స్రావాలు వెలువడడానికి సిగ్నల్ గా పనిచేస్తాయి.
సి) కొన్ని జాతులలో ఇవి రసాయన వార్తాహరులు
డి) తేనెటీగలు ఆహారం లభ్యమయ్యే ప్రదేశానికి ఇతర తేనెటీగలను ఆకర్షించడానికి ఫెరమాన్లను ఉపయోగిస్తారు.
జవాబు:
హార్మోన్స్ అవే జీవులలో ఉత్పత్తి కాబడే రసాయన పదార్థాలు. ఇవి వినాళ గ్రంథులచే ఉత్పత్తి కాబడి, నేరుగా రక్తంలోనికి విడుదల అవుతాయి. ఇవి రక్తం ద్వారా ప్రయాణించి నిర్దిష్ట అవయవాలను ప్రేరేపించి నియంత్రణ – సమన్వయంలో పాల్గొంటాయి. మన శరీరంలో అనేక రకాల వినాళ గ్రంథులు ఉన్నాయి. ఇవి నిర్దిష్ట హార్మోన్స్ ఉత్పత్తి చేస్తాయి. ప్రతి హార్మోన్ నిర్దిష్ట విధిని నిర్వహిస్తుంది.
ప్రశ్న 27.
మీ పాఠశాల గ్రంథాలయం నుండి లేదా అంతర్జాలం నుండి కపాలనాడులు మరియు వెన్నునాదులకు సంబంధించిన సమాచారం సేకరించండి. (AS4)
జవాబు:
మన శరీరంలో కపాలనాడులు, కశేరునాడులు కలిసి పరిధీయ నాడీవ్యవస్థగా రూపొందుతాయి.
కపాలనాడులు :
- మెదడు నుండి ఏర్పడే నాడులను కపాలనాడులు అంటారు.
- వీటి సంఖ్య 12 జతలు
కపాల నాడి | రకము | పని |
1. ఝణ నాడి | జ్ఞాన నాడి | వాసన సమాచారాన్ని పంపిస్తుంది. |
2. దృక్ నాడి | జ్ఞాన నాడి | దృష్టి సమాచారాన్ని మెదడుకు పంపుతుంది. |
3. నేత్రియ చాలక నాడి | చాలక నాడి | కనుగుడ్లను నలువైపులా తిప్పటానికి |
4. టోక్లియల్ నాడి | చాలక నాడి | కనుగుడ్లను లోపలికి లాగడానికి |
5. త్రిధారనాడి | మిశ్రమ నాడి | నమిలే కండరాలను ఉత్తేజపరుస్తుంది. |
6. ఆబ్దుసెన్స్ నాడి | చాలక నాడి | కంటిని తిప్పటానికి |
7. ఆస్యనాడి | మిశ్రమ నాడి | ముఖ వ్యక్తీకరణకు తోడ్పడే కండరాల ఉత్తేజం |
8. శ్రవణనాడి | జ్ఞాన నాడి | శబ్దము, భ్రమణము, గురుత్వాకర్షణ అనుభూతులు |
9. జిహ్వగ్రసని నాడి | మిశ్రమ నాడి | నాలుక నుండి రుచికి సంబంధించిన అనుభూతులు |
10. వేగాస్ నాడి | మిశ్రమ నాడి | ఊపిరితిత్తుల కండరాలు, హృదయకండరాల నియంత్రణ |
11. అనుబంధ నాడి | చాలక నాడి | మెడలోని కండరాలు పని చేయటానికి |
12. అధోజిహ్వ నాడి | చాలక నాడి | నాలుక కండరాలకు సంకేతం పంపటం |
కశేరునాడులు :
- వెన్నుపాము నుండి ఏర్పడే నాడులను కశేరు నాడులు అంటారు.
- వీటి సంఖ్య 31 జతలు.
- ఇవి వెన్నుపాము పృష్టమూలం జ్ఞాననాడిని, ఉదర మూలం చాలకనాడిని కలిగి ఉండుట వలన ఏర్పడతాయి.
- కశేరు నాడులను జ్ఞాన, చాలక నాడీ తంతువులను కలిగి ఉండుటవలన ఇవన్నీ మిశ్రమ నాడులు.
- వీటిని ప్రధానంగా 5 రకాలుగా విభజిస్తారు. అవి :
1. గ్రీవ కశేరు నాడులు – (8)
2. ఉరః కశేరు నాడులు – (12)
3. కటి కశేరు నాడులు – (5)
4. త్రిక కశేరు నాడులు – (5)
5. పుచ్చ కశేరు నాడి – (1)
ప్రశ్న 28.
తంత్రికాక్షం – డెండ్రైట్, డెండ్రైట్ – డెండ్రైట్ మధ్య అనుసంధానం చేసే పటాన్ని గీయంది. ఇవి ఈ విధంగా ఎందుకు అనుసంధానం చేయబడి ఉంటాయి? (AS5)
జవాబు:
- నాడీకణాలు ఇతర నాడీకణాలతో సంబంధం కలిగి ఉంటాయి.
- ఈ సంబంధం రెండు కణదేహాల మధ్య గాని, ఒక నాడీ కణ ఆర్గాన్ మరొక కణదేహంలో గాని సంబంధం కలిగి ఉంటుంది.
- నాడీ అంత్యాలు దగ్గరగా అమరి మధ్య చిన్న ఖాళీ ప్రదేశం కలిగి ఉంటుంది. దీనిని సైనాప్స్ అంటారు.
- సైనాప్స్ వద్ద ప్రచోదనం, రసాయనికంగా గాని విద్యుత్ రూపంలో గాని దూకి వేరే డెండ్రైటు అందుతుంది.
- కావున డెండ్రైట్స్ సంబంధాల మధ్య సైనాప్స్ ఉంటుంది.
ప్రశ్న 29.
మెదడు పటం గీసి, భాగాలు గుర్తించి, మెదడు ఎలా రక్షించబడుతుందో వివరించండి. (AS1)
(లేదా)
మెదడు పటం గీచి భాగాలను గుర్తించండి.
జవాబు:
శరీరంలోని ముఖ్యమైన అవయవాలలో మెదడు ఒకటి. దీనిని రక్షిస్తూ క్రింది భాగాలు ఉంటాయి.
1. కపాలం :
మెదడును భద్రపరిచి రక్షణ ఇచ్చే కార్పస్ కల్లో జమ్ ఎముకల పెట్టె.
2. మెనింజస్ :
మెదడును చుట్టి ఉండే పొరలు. ఇవి మెదడుకు రక్షణ ఇస్తాయి.
3. మస్తిష్క మేరుద్రవం :
మెదడులోని బాహ్య మరియు మధ్య త్వచాల మధ్య మస్తిష్క మేరుద్రవం ఉండి మెదడుకు రక్షణ ఇస్తుంది.
ప్రశ్న 30.
నీవు రద్దీగా ఉండే వీధిలో నడుస్తున్నపుడు అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. ఈ పరిస్థితిలో నీ శరీరంలోని అవయవాల మధ్య ఏ విధంగా సమన్వయం జరుగుతుంది? ఈ సందర్భాన్ని వివరించే రేఖాచిత్రాన్ని గీయండి. (AS5)
జవాబు:
1. నేను ట్రాఫిక్ లో ఉన్నప్పుడు పెద్ద శబ్దం వినిపిస్తే, ఆకస్మికంగా ఉలిక్కిపడి పక్కకు జరుగుతాను.
ప్రశ్న 31.
నాడీకణం మోడలను సరైన పదార్థాలను ఉపయోగించి తయారుచేయండి. (AS5)
జవాబు:
- ఒక చిన్న గాజును తీసుకుని అట్టపై అంటించాను. ఇది ఎరుపు రంగులో ఉండి కేంద్రకాన్ని సూచిస్తుంది.
- దీనిచుట్టూ కొంచెం దూరంగా మట్టిగాజు ముక్కలను ‘C’ ఆకారంగా విరిచి అంటించాను. ఇది కణదేహాన్ని సూచిస్తుంది.
- కణదేహం మూల వద్ద నూలు దారపు ముక్కలు అంటించాను. ఇది డెండ్రైట్ను సూచిస్తుంది.
- కణదేహానికి క్రింద అమర్చిన పొడవైన నూలుదారం ఆగ్దానను సూచిస్తుంది.
- కణదేహంలో అమర్చిన నీలిరంగు మెరుపులు జీవపదార్థాన్ని తెలుపగా, దానిలో ఉంచిన గుండ్రని గింజలు నిస్సల్ కణికలను సూచిస్తాయి.
ఈ విధంగా నేను నాడీకణం నమూనాను నిర్మించాను.
ప్రశ్న 32.
మీ సహాధ్యాయి తరగతి గదిలో చేసే పనులను 45 నిమిషాలు గమనించండి. ఆ పనులలో నియంత్రిత చర్యలు, అనియంత్రిత చర్యలు ఏవి? (AS5)
జవాబు:
నియంత్రిత చర్యలు :
(i) నిలబడటం (ii) కూర్చోవడం (iii) నవ్వడం (iv) త్రాగడం (v) కదలడం (vi) చప్పట్లు కొట్టడం (vii) పుస్తకాలు, మోయడం (viii) చదవడం (ix) వ్రాయడం (x) మాట్లాడటం
అనియంత్రిత చర్యలు :
(i) కళ్ళు ఆర్పడం (ii) ఆవలించడం (iii) శ్వాసపీల్చడం (iv) వినడం (v) మింగడం
ప్రశ్న 33.
నులితీగలు ఆధారానికి చుట్టుకొని తీగపైకి పాకటం గమనించడం ఉత్సాహంగా ఉంటాయి. ఈ అంశాల్ని నీవు ఎలా అభినందిస్తావు? (AS6)
జవాబు:
- ప్రాకే మొక్కలు బలహీన కాండాలు కలిగి ఉంటాయి.
- ఇవి పైకి ఎగబ్రాకటానికి నులితీగలు తోడ్పడతాయి.
- ఇవి సున్నితంగా ఉండి ఆధారానికి స్ప్రింగ్వలె చుట్టుకుపోవటం ఆసక్తికరంగా ఉంటుంది.
- నులితీగలు ఆధారం దొరికినపుడు వేగంగా పెరిగి చుట్టుకోవటం ఆశ్చర్యంగా ఉంది.
- మెత్తగా ఉండే నులితీగలు కాండం భారం మోయటం కూడా అద్భుతంగా అనిపించింది.
- నులితీగలు ఆధారాన్ని గట్టిగా చుట్టుకోవటం నాకు మరింత ఆశ్చర్యం కలిగించాయి. వాటిని లాగినపుడు తెగిపోతాయి తప్ప ఊడిరావు. ఇది నాకు ఆశ్చర్యంగా అనిపించింది.
ప్రశ్న 34.
హార్మోన్లు నిర్దిష్టమైన ప్రదేశంలో, నిర్దిష్టమైన పనిని నిర్వహించడానికి విడుదలవుతాయి. దీనిపై చక్కని వ్యాఖ్యానం రాయండి. (AS7)
జవాబు:
ప్రశ్న 35.
సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మెదడు – కలల గురించి చేసిన పరిశోధనలపై సమాచారం సేకరించి సైన్స్ క్లబ్ సమావేశంలో చర్చించండి. (AS7)
జవాబు:
- సిగ్మండ్ ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశానికి చెందిన మనో విశ్లేషణా శాస్త్రవేత్త.
- మానసిక విశ్లేషణ ద్వారా, మానసిక ఋగ్మతలను నివారించవచ్చని నిరూపించాడు. మానసిక విశ్లేషణనే ‘మాటల వైద్యం’గా కూడా పరిగణిస్తారు.
- ఫ్రాయిడ్ మనస్సు వివరిస్తూ ‘ట్రోపోగ్రాఫికల్’ (Tropographical) నమూనాను ప్రతిపాదించాడు. దీని ప్రకారం మనస్సును నీటి పైన తేలుతున్న మంచుపర్వతంతో పోల్చాడు. పైకి కనిపించే కొంచెం భాగం చేతనగా (Conscious mind), పైకి కనిపించని పెద్ద భాగాన్ని అచేతనంగా (Unconscious mind) పిలిచాడు.
- 1923లో అభివృద్ధి చేసిన నిర్మాణాత్మక నమూనాలో మనస్సును 1) ఇడ్ 2) ఈగో 3) సూపర్ ఈగోగా అభివర్ణించాడు.
- ఫ్రాయిడ్ కలలను విశ్లేషిస్తూ ఇది అచేతనానికి రాజమార్గాలుగా చెప్పాడు.
- మనిషి ప్రవర్తనలో అచేతనం కీలకపాత్ర వహిస్తుందని ఫ్రాయిడ్ భావన.
- ఇడ్ స్వార్థాన్ని, ఈగో వాస్తవాన్ని, సూపర్ ఈగో నైతికతను ప్రతిబింబిస్తాయని తెలిపాడు.
10th Class Biology 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ Textbook InText Questions and Answers
10th Class Biology Textbook Page No. 101
ప్రశ్న 1.
ఉద్దీపనలకు ప్రతిస్పందన చూపటానికి సహాయం చేసే వ్యవస్థ ఏది?
జవాబు:
ఉద్దీపనలను గ్రహించి ప్రతిస్పందన చూపటానికి సహాయం చేసే వ్యవస్థ నాడీవ్యవస్థ.
ప్రశ్న 2.
ఉద్దీపనలకు ప్రతిస్పందన ద్వారా సంకేతాలు ఇచ్చే వ్యవస్థ ఏది?
జవాబు:
నాడీ వ్యవస్థ.
ప్రశ్న 3.
సజీవులు ఈ సంకేతాలకే ఎందుకు ప్రతిస్పందిస్తాయి?
జవాబు:
సజీవులు ప్రతిస్పందనకు నిర్దిష్టమైన సమన్వయ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. వీటి వలన సజీవులు ప్రతిస్పందనను చూపుతున్నాయి.
10th Class Biology Textbook Page No. 102
ప్రశ్న 4.
మన శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని గాలన్ అభిప్రాయానికి రావడానికి కారణం ఏమిటి?
జవాబు:
మెడపై దెబ్బ తగిలిన రోగి తన చేతి స్పర్శను కోల్పోయాడు. కానీ అతని చేతి కదలికలు మామూలుగానే ఉన్నాయి. దీనినిబట్టి మన శరీరంలో రెండు రకాల నాడులు ఉంటాయని వాటిలో ఒకటి జ్ఞానానికి సంబంధించిందని, రెండవది చర్యకు సంబంధించిందని గాలన్ నిర్ణయానికి వచ్చాడు. ఈ రోగి విషయంలో జ్ఞాననాడులు దెబ్బతిన్నాయని, చర్యకు సంబంధించిన నాడులు మామూలుగానే ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు.
10th Class Biology Textbook Page No. 106
ప్రశ్న 5.
ప్రతీకార చర్యల సందర్భంలో ఇంకా ఎటువంటి ఇతర అవయవాలు నిర్వాహకాంగాలుగా పనిచేస్తాయి?
జవాబు:
ప్రతీకార చర్యలలో కాళ్ళు, చేతులు, కళ్ళు, ఊపిరితిత్తులు నిర్వాహక అంగాలుగా పనిచేస్తాయి.
ఉదా : వేడి వస్తువు తాకినపుడు, కాళ్ళు, చేతులను వెనుకకు తీసుకొంటాయి. ఎక్కువ కాంతి పడినపుడు కళ్ళు మూసుకొంటాం. దుమ్ము, గాలి పీల్చినపుడు తుమ్ముతాము.
ప్రశ్న 6.
నాడుల మధ్య సమన్వయం గురించి ఇది ఏమి తెలియజేస్తుంది?
జవాబు:
మన శరీరంలోని నాడులు సమన్వయంతో పనిచేస్తున్నాయని, దానివలనే మనకు ప్రతీకార చర్యల ద్వారా రక్షణ లభిస్తుందని గ్రహించాను.
ప్రశ్న 7.
ఏదైనా ఒక పనిని దృష్టిలో ఉంచుకొని ప్రతీకార చర్యాచాపాన్ని గీయండి.
జవాబు:
10th Class Biology Textbook Page No. 109
ప్రశ్న 8.
వెన్నుపాము ఏ ఏ విధులను నిర్వర్తిస్తుందని నీవు భావిస్తున్నావు?
జవాబు:
వెన్నుపాము విధులు:
- వెన్నుపాము వార్తలను మెదడుకు చేరవేస్తుంది.
- మెదడు నుండి ఆదేశాలను నిర్వాహక అంగాలకు చేరవేస్తుంది.
- అసంకల్పిత ప్రతీకార చర్యలో కీలకపాత్ర వహిస్తుంది.
ప్రశ్న 9.
మన శరీరం నిర్వహించే అన్ని విధులు నేరుగా మెదడు, వెన్నుపాము మాత్రమే నియంత్రిస్తాయని మీరు అనుకుంటున్నారా? ఎందుకు?
జవాబు:
- శరీరంలోని నియంత్రిత చర్యలన్నీ మెదడు అధీనంలో ఉంటాయి.
- రోజువారి జీవితంలోని అనేక పనులను మెదడు సమన్వయపరుస్తుంది.
- అసంకల్పిత ప్రతీకార చర్యలలో వెన్నుపాము కీలకపాత్ర వహించి ప్రమాదాల నుండి రక్షిస్తుంది.
- మొత్తం మీద మన శరీరం నిర్వహించే అన్ని విధులను మెదడు లేదా వెన్నుపాము నియంత్రిస్తాయి.
10th Class Biology Textbook Page No. 110
ప్రశ్న 10.
మీ అభిప్రాయం ప్రకారం వెన్నుపాములోని ఏ మూలం జ్ఞాన లేదా అభివాహినాడుల నుంచి సంకేతాలు పొందుతుంది?
జవాబు:
వెన్నుపాములోని పృష్ఠమూలం జ్ఞాన లేదా అభివాహినాడుల నుండి సంకేతం పొందుతుంది.
ప్రశ్న 11.
నాడీ అంత్యాలు కండర అంత్యాల వద్ద ఏ విధంగా పనిచేస్తాయని నీవు భావిస్తున్నావు?
జవాబు:
- నాడీ అంత్యాలు నిర్వాహక అంగాలైన కండర కణాలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి.
- నాడీ ప్రచోదనం డెండైట్స్ ద్వారా కండర కణానికి చేరతాయి.
- కండర కణాలలోని మైలిన్ తంతువులు, వీటికి ప్రతిస్పందిస్తాయి.
- అందువలన కండర కణాలు సంకోచించి ప్రతిచర్య చూపుతాయి.
ప్రశ్న 12.
పటంను పరిశీలించండి. కింది ప్రశ్నలకు సమాధానాలు ఆలోచించండి.
i) వెన్నెముకకు దగ్గరగా ఉన్న గాంగ్లియన్ల నుండి ఏర్పడిన నాడులు ఏ ఏ శరీర అవయవాలకు వెళతాయి?
జవాబు:
వెన్నుపాముకు దగ్గరగా ఉన్న గాంగ్లియన్ల నుండి ఏర్పడిన నాడులు. గర్భాశయం, మూత్రాశయం, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, రక్తనాళాలు, గుండె, ఊపిరితిత్తులు, నోరు, కళ్ళు వంటి శరీర అవయవాలకు వెళుతున్నాయి.
ii) మెదడు నుండి మొదలయ్యే నాడులు ఏ ఏ అవయవాలకు చేరుకుంటాయి?
జవాబు:
మెదడు నుండి వెలువడు నాడులను కపాలనాడులు అంటారు. ఇవి 12 జతలు ఉంటాయి. ఇవి కళ్ళు, ముక్కు చెవి, నాలుక, గుండె, క్లోమం, చర్మం, ఊపిరితిత్తులు, మెడ కండరాలకు చేరుకుంటాయి.
iii) సహానుభూత నాడీవ్యవస్థ ఏ ఏ అవయవాల విధులపై ప్రభావం చూపుతుంది?
జవాబు:
సహానుభూత నాడీవ్యవస్థ రక్తప్రసరణ, శ్వాసవ్యవస్థ, విసర్జన వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, నేత్రాల విధులపై తన ప్రభావాన్ని చూపుతుంది. ఈ వ్యవస్థను వివిధ అవయవ జీవక్రియల రేటును పెంచుతుంది.
iv) సహానుభూత పరనాడీవ్యవస్థ ఏ ఏ అవయవాల విధులపై ప్రభావం చూపుతుంది?
జవాబు:
సహానుభూత పరనాడీవ్యవస్థ కూడ గుండె, రక్తనాళాలు, జీర్ణాశయం, చిన్న ప్రేగులు, మూత్రాశయం, పెద్దపేగు, గర్భాశయం, ఊపిరితిత్తులు నాలుక, కళ్ళ వంటి అవయవాలపై ప్రభావం చూపుతుంది.
10th Class Biology Textbook Page No. 111
v) సహానుభూత నాడీవ్యవస్థ నిర్వహించే విధులను గురించి నీవు ఏమి అర్థం చేసుకున్నావు?
జవాబు:
సహానుభూత నాడీవ్యవస్థ వివిధ అవయవాల జీవక్రియారేటును పెంచి వేగవంతం చేస్తుంది.
vi) సహానుభూత పరనాడీవ్యవస్థ నిర్వహించే విధులను గురించి నీవు ఏమి అర్ధం చేసుకున్నావు?
జవాబు:
సహానుభూత పరనాడీవ్యవస్థ సహానుభూత నాడీవ్యవస్థ క్రియలకు వ్యతిరేకంగా పనిచేసి వాటి జీవక్రియా రేటును తగ్గించి సాధారణ స్థాయికి చేర్చుతుంది.
10th Class Biology Textbook Page No. 115
ప్రశ్న 13.
కోపం ఎంత సమయం ఉంటుందో గమనించారా?
జవాబు:
కోపం సందర్భాన్ని బట్టి కొన్ని నిముషాల పాటు ఉంటుంది.
ప్రశ్న 14.
కోపం ఎందుకు తగ్గుతుంది?
జవాబు:
రక్తంలో ఎడ్రినలిన్ స్థాయి తగ్గటం వలన కోపం తగ్గుతుంది. దీనికి శరీరంలోని పునఃశ్చరణ యాంత్రికం (Feedback mechanism) తోడ్పడుతుంది.
ప్రశ్న 15.
కోపం ఎక్కువ సమయం ఉంటే ఏమవుతుంది?
జవాబు:
రక్తంలో ఎడ్రినలిన్ ఎక్కువగా విడుదలైనప్పుడు, కోపం ఎక్కువవుతుంది. ఈ స్థాయి కొనసాగితే, జీవక్రియలపై ప్రభావం ఉంటుంది. గుండె పని తీరు కండర వ్యవస్థ దెబ్బతింటాయి. కావున శరీరంలో పునశ్చరణ యాంత్రికంగా పనిచేసి ఎడ్రినలిన్ స్థాయిని సాధారణ స్థితికి తెస్తుంది.
ప్రశ్న 16.
రక్తంలో ఎడ్రినలిన్ ఎక్కువగా విడుదలైతే, జీవక్రియలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
జవాబు:
రక్తంలో ఎడ్రినలిన్ స్థాయి పెరిగితే, కోపం వంటి మానసిక స్థితులు ఏర్పడతాయి. హృదయస్పందన రేటు పెరిగి రక్తపీడనం పెరుగుతుంది. జీవక్రియల రేటు పెరిగి, మనిషి ఉద్రిక్తస్థాయికి చేరతాడు.
10th Class Biology Textbook Page No. 116
ప్రశ్న 17.
ఉద్దీపనలకు ప్రతిస్పందనలు చూపే మొక్కలకు ఉదాహరణ ఇవ్వండి.
జవాబు:
- అత్తిపత్తి స్పర్శకు ప్రతిస్పందన చూపి ముడుచుకుపోతుంది.
- పొద్దు తిరుగుడు కాంతికి ప్రతిస్పందన చూపుతుంది.
- సౌర, కాకర వంటి బలహీన కాండం కలిగిన మొక్కలు నులితీగలతో ఆధారానికి చుట్టుకొని ప్రతిస్పందన చూపుతాయి.
10th Class Biology 5th Lesson నియంత్రణ – సమన్వయ వ్యవస్థ Textbook Activities (కృత్యములు)
కృత్యం – 1
కిందికి పడుతున్న కర్రను పట్టుకోడం.
పొడవైన స్కేలు లేదా అరమీటరు పొడవైన సన్నని కర్రను తీసుకోండి. మీ స్నేహితుడిని కర్ర ఒక చివర పటంలో చూపిన విధంగా బొటనవేలు, చూపుడువేళ్ళ మధ్య వేలాడే విధంగా పట్టుకోమనండి. మీరు కిందకు పడే కర్రను పట్టుకోవడానికి వీలుగా బొటనవేలు, చూపుడు వేళ్ళను కర్రను తాకకుండా దగ్గరగా ఉంచండి. ప్రస్తుతం మీ వేళ్ళ మధ్య ఉన్న కర్ర స్థానాన్ని పెన్సిలుతో గుర్తించండి. (స్థానం – ఎ) మీ స్నేహితుడిని కర్రను వదలమనండి. అదే సమయంలో మీరు దానిని పట్టుకోండి.
మీరు కర్రను ఎక్కడ పట్టుకున్నారో అక్కడ పెన్సిలుతో గుర్తు పెట్టండి. (స్థానం – బి)
1. మీరు కర్రను మొదట పెన్సిలుతో గుర్తించిన చోటే (స్థానం – ఎ) పట్టుకోగలిగారా?
జవాబు:
లేదు. కర్రను మొదట పెన్సిలుతో గుర్తించిన చోటు కంటే పైన పట్టుకొన్నాను.
2. మీరు కర్రను పట్టుకున్న ప్రదేశం (స్థానం – బి) మొదట గుర్తించిన ప్రదేశం (స్థానం – ఎ) కంటే ఎంత పైన ఉన్నది?
జవాబు:
నేను కర్రను పట్టుకొన్న ప్రదేశం మొదట గుర్తించిన ప్రదేశం కంటే దాదాపు 30 సెం.మీ. పైన ఉంది.
3. ఇలా ఎందుకు జరిగింది?
జవాబు:
కర్రను వదిలిన సమాచారం, కళ్ళు గ్రహించి, మెదడుకు పంపి, మెదడు సమాచారాన్ని విశ్లేషించి చేతికి పంపినపుడు చేయి పట్టుకొంది. ఈ ప్రక్రియ జరగటానికి కొంత సమయం పట్టడం వలన కర్రను మొదట స్థానంలో పట్టుకోలేకపోయాను.
4. ఈ క్రియ ఎంత వేగంగా జరిగిందని మీరు అనుకుంటున్నారు?
జవాబు:
ఈ క్రియ అంతా 0.2 సెకన్లో జరిగిందని భావిస్తున్నాను.
కృత్యం – 2 : నాడీకణ నిర్మాణం
నాడీకణ శాశ్వత స్లెడ్ ను సూక్ష్మదర్శినిలో పరిశీలించండి. పటం గీసి, భాగాలను గుర్తించండి. ఈ కింది బొమ్మతో పోల్చండి.
జవాబు:
- నేను పరిశీలించిన నాడీకణం స్లెడ్ బొమ్మను పూర్తిగా పోలి ఉంది.
- నాడికణంలోని కణదేహం ఆక్సాన్ స్పష్టంగా కనిపించాయి.
- ఆక్లాన్ పై ఉన్న కణుపులు గుర్తించాను. వీటిని రన్‌వీర్ కణుపులు అంటారు.
- నాడీ అంత్యాలు చిన్నవిగా అస్పష్టంగా ఉన్నాయి.
కృత్యం – 3
మోకాలిలో జరిగే ప్రతీకారచర్య (Knee jerk reflex)
ఒక కాలును మరొక కాలుపైన పెనవేసుకొని కూర్చోండి. దానివలన కాలు కింద భాగం వేలాడుతూ ఉంటుంది. మోకాలి చిప్ప కింద భాగాన్ని గట్టిగా కొట్టండి. తొడ ముందు భాగాన్ని మరొక చేతితో గట్టిగా పట్టుకొని తొడ కండరాలలో కలిగే మార్పును గమనించండి.
మనం చేతనావస్థలో (Conscious) ఉన్నప్పటికీ తొడ కండరాల సంకోచాన్ని ఆపలేము. అటువంటి ప్రతిచర్యలను ‘అనియంత్రిత చర్యలు అంటాం. మనం ఫుట్ బాలను తన్నినప్పుడు అదే తొద కందరం నియంత్రిత కండరంగా పనిచేస్తుంది.
మన శరీరంలో జరిగే క్రియలలో ఎక్కువభాగం అనియంత్రితంగా ఉంటాయనుకుంటున్నారా? ఎందుకు?
జవాబు:
- మన శరీరంలో చాలా క్రియలు మన అధీనం లేకుండా స్వతంత్రంగా జరుగుతుంటాయి.
- హృదయస్పందన రక్తసరఫరా మన అధీనంలో ఉండదు. సందర్భాన్ని బట్టి అనియంత్రంగా ఈ యంత్రాంగం పనిచేస్తుంది.
- శ్వాసరేటు, అనియంత్రితంగా జరిగిపోతూ ఉంటుంది.
- జీర్ణవ్యవస్థలోని, ఆహారవాహిక, జీర్ణాశయ ప్రేగులలోని చలనాలు అనియంత్రంగా జరుగుతుంటాయి.
- వినాళ గ్రంథుల స్రావాల సందర్భానుసారంగా అనియంత్రంగా జరుగుతుంటాయి. కావున మన శరీరంలో ఎక్కువ విధులు అనియంత్రంగా జరుగుతాయని భావిస్తున్నాను.
కృత్యం – 4
అత్తిపత్తి పత్రాలను ముట్టుకొని పత్రాలు ఎలా ప్రతిస్పందిస్తాయో చూడండి. మనం ముట్టుకున్నప్పుడు పత్రాలు , ముడుచుకున్నాయా? ఏ దిశలో ముడుచుకున్నాయి?
జవాబు:
మైమోసాప్యూడికా మొక్క అడుగు భాగంలో ఉబ్బెత్తుగానున్న మెత్తటి తల్పం వంటి నిర్మాణం ఉంటుంది. దీనిని పల్యైని అంటారు. వీటి కణాలలో ఎక్కువగా కణాంతర అవకాశాలు మరియు ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. నీటి పీడనం వలన పల్వైని ఆకును నిలువుగా ఉంచుతుంది. టచ్ మీ నాట్ మొక్క స్పర్శతో నాస్టిక్ చలనము (nastic movement) ను చూపిస్తుంది. దీనిని “థిగ్మో ట్రాపిజమ్” అంటారు. మనం ఆకులను ముట్టుకున్నప్పుడు విద్యుత్ ప్రచోదనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ ప్రచోదనాలు మొక్క హార్మోన్లపై ప్రభావాన్ని చూపుతాయి. ఈ హార్మోన్ల వలన పల్వైని కణాలు ఏవైతే ఆకు ఈనెలకు దగ్గరగా ఉన్నాయో కణం యొక్క వేరే భాగంవైపు వలస వెళ్ళడం వలన పల్వైని గట్టిదనాన్ని కోల్పోతుంది. దానీ ఫలితంగా ఆకు ముడుచుకొని పోతుంది. 20-30 నిమిషాల తరువాత పల్వైనిలోకి నీరు తిరిగి రావడం వలన అది గట్టిపడి ఆకులు తిరిగి నిలువుగా మారతాయి.
కృత్యం – 5
గాజు జాడీని తీసుకొని మట్టితో నింపండి. జాడి గోడ అంచు వెంబడే ఉండేలా చిక్కుడు విత్తనాన్ని నాటండి. ఇలా చేయడం వల్ల విత్తనం మొలకెత్తడాన్ని కాండం మరియు వేరు పెరుగుదలను చూడవచ్చు. 4-5 రోజుల తరువాత విత్తనాలు మొలకెత్తడాన్ని మనం గమనిస్తాం. జాదీని సూర్యరశ్మిలో పెట్టండి. కాండం, వేరు ఎలా పెరుగుతుందో పరిశీలించండి. మొక్కకు నాలుగైదు ఆకులు వచ్చిన తరువాత కుండీని అడ్డంగా పడుకోబెట్టినట్లుగా క్షితిజ సమాంతరంగా ఉంచండి. వారం రోజులపాటు వేరు మరియు కాండం పెరుగుదలను పరిశీలించండి.
1. కాండం వారం తరువాత సమాంతరంగానే పెరుగుతున్నదా?
జవాబు:
లేదు. కాండం సమాంతరంగా లేదు.
2. కాండం యొక్క ఏ భాగం బాగా పెరిగింది? ఏ భాగంలో పెరుగుదల లేదు ? ఈ మార్పు తీసుకొని వచ్చింది ఏమిటని నీవు భావిస్తున్నావు?
జవాబు:
కాండం యొక్క అగ్రభాగం, పైకి పెరిగింది. మొక్కకు నాలుగైదు ఆకులు వచ్చిన తరువాత కుండీని అడ్డంగా పడుకోబెట్టినట్లుగా.
క్రింది ఖాళీలను పూరించండి
1. మెదడులోని అతి పెద్ద భాగము (మస్తిష్కం)
2. రెండు నాడీకణాలు కలిసే భాగం ……… (సైనాప్స్)
3. మొక్క అంత్యాలలో (కాండాగ్రం, వేరు అగ్రం) కణాల పొడవు మరియు విభేదనములకు కారణమైన హార్మోను ………… (ఆక్సిన్)
4. థైరాక్సిన్ పని …………… (జీవక్రియరేటు పెరుగుదల)
5. జిబ్బరెల్లిస్ మరియు ఆక్సిన్లు మొక్క పెరుగుదలకు సహకరిస్తే, అబ్ సైసిక్ ఆమ్లం మొక్క పెరుగుదలను నిరోధిస్తుంది. కొన్ని సంఘటనలు ఈ కింద ఇవ్వబడ్డాయి. వీటికి ఏ హార్మోన్ అవసరమవుతుంది? ఎందుకు?
ఎ) తోటమాలి తన తోటలో పెద్ద పెద్ద ధాలియా మొక్కలను పెంచడానికి పోషకాలతోపాటు ……. హార్మోన్ వాడతాడు. (జిబ్బరెల్లిన్)
బి) పొట్టి మొక్కలలో కొమ్మలు మందంగా మారడానికి ……… హార్మోన్ వాడాలి. (జిబ్బరెల్లిన్)
సి) విత్తనాలను దీర్ఘకాలంగా నిల్వ చేయడానికి ……… హార్మోన్ వాడాలి. (అబ్ సైనిక్ ఆమ్లం)
డి) కాండం కొనభాగం కత్తిరించిన తరవాత పార్శ్వ మొగ్గలు పెరగడానికి ………….. హార్మోన్ వాడాలి. (ఆక్సిన్)
సరైన సమాధానాన్ని గుర్తించండి
1. ఒక వ్యక్తి తన భావావేశాలపై నియంత్రణ కోల్పోయాడు. మెదడులో ఏ భాగం పనిచేయటం లేదు?
A) మస్తిష్కం
B) ద్వారగోర్థం
C) మధ్య మెదడు
D) అనుమస్తిష్కం
జవాబు:
B) ద్వారగోర్థం
2. అత్తిపత్తిలో ఆకులు ముడుచుకోవడం వలన జరిగే లాభం
A) కిరణజన్యసంయోగక్రియ తగ్గడం
B) మేసే జంతువుల నుండి రక్షణ
C) మొక్క హార్మోనుల విడుదల
D) పెరుగుదల నియంత్రణ
జవాబు:
B) మేసే జంతువుల నుండి రక్షణ
3. మధుమేహానికి సంబంధించిన గ్రంథి
A) థైరాయిడ్
B) క్లోమం
C) అధివృక్క
D) పీయూష
జవాబు:
B) క్లోమం