AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

SCERT AP 10th Class Biology Study Material 7th Lesson జీవక్రియలలో సమన్వయం Textbook Questions and Answers.

AP State Syllabus 10th Class Biology 7th Lesson Questions and Answers జీవక్రియలలో సమన్వయం

10th Class Biology 7th Lesson జీవక్రియలలో సమన్వయం Textbook Questions and Answers

అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి

ప్రశ్న 1.
నోరు నుండి పాయువు వరకు వ్యాపించి ఉన్న ఆహారనాళంలో ఆహారం ఏ ఏ భాగాల గుండా ప్రయాణిస్తుందో రాయండి.
జవాబు:
ఆహారం ఆహారనాళంలో ఈ క్రింది మార్గంలో ప్రయాణిస్తుంది.
ఆహారం → నోరు → ఆస్యకుహరం → గ్రసని → ఆహారవాహిక → జీర్ణాశయం → ఆంత్రమూలం → చిన్న ప్రేగు → పెద్దప్రేగు → పురీషనాళం → పాయువు

ప్రశ్న 2.
జీర్ణాశయంలో ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో ఏ జీవక్రియ తోద్పడుతుంది?
జవాబు:
ఆహారాన్ని విచ్ఛిన్నం చేయటంలో జీర్ణక్రియ తోడ్పడుతుంది.

ప్రశ్న 3.
జీవక్రియలలోని ఏ ఒక్క జీవక్రియ అయినా పనిచేయటంలో విఫలమైతే, శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
జవాబు:
జీవక్రియలన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి పనిచేస్తాయి. వీటి మధ్య పూర్తి సమన్వయం ఉంటుంది. ఏ ఒక్క జీవక్రియ పనిచేయకపోయినా అది జీవి మరణానికి దారితీస్తుంది.

ప్రశ్న 4.
ఆకలి కోరిక అంటే ఏమిటి? (AS1)
జవాబు:

  1. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గిపోతే వెంటనే మనకు ఆకలి వేస్తున్నట్లుగా అనిపిస్తుంది.
  2. అలాగే జీర్ణాశయం ఖాళీ అయినప్పుడు అందులో స్రవించబడే ప్రోటీన్ శ్రేణులతో కూడిన ‘గ్రీలిన్’ అనే హార్మోన్ స్రవిస్తుంది.
  3. జీర్ణాశయ గోడల్లోని కొన్ని కణాలు ‘గ్రీలిన్’ (Ghrelin) ను స్రవిస్తాయి.
  4. జీర్ణకోశంలో ఈ హార్మోన్ స్రవించడం వల్ల ఆకలి సంకేతాలు ఉత్పత్తి అవుతాయి.
  5. జీర్ణకోశం నుండి మెదడుకు ఆకలి సంకేతాలు చేరగానే ఆకలి కోరికలు జీర్ణాశయంలో మొదలవుతాయి.
  6. ముందు మెదడులోని డైయన్ సెఫలాన్ మరియు వేగస్ నాడి (10వ కపాలనాడి) ఈ సంకేతాలను చేరవేయడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ‘ఆకలి కోరికలు’ దాదాపు 30-45 నిమిషాల వరకు కొనసాగుతాయి.
  7. గ్రీలిన్ స్థాయి పెరిగినపుడు ఆకలి ప్రచోదనాలతో పాటూ ఆహారం తినాలనే ఉద్దీపన భావన కలుగుతుంది.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 5.
మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయటానికి శరీరంలో ఏయే వ్యవస్థలు తోడ్పడతాయి? (AS1)
జవాబు:

  1. శరీరంలో జరిగే జీవక్రియలలో అనేక వ్యవస్థలు సమన్వయంగా పనిచేస్తాయి.
  2. ఆహారం జీర్ణం చేయటానికి ఒక్క జీర్ణవ్యవస్థనే కాకుండా, నాడీవ్యవస్థ, అంతఃస్రావవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ సమన్వయంతో వ్యవహరిస్తాయి.
  3. అంతస్రావీ వ్యవస్థ స్రవించే గ్రీలిన్, లెప్టిన్ వంటి హార్మోన్లు, ఆకలి సంకేతాలను ఏర్పర్చటంతో పాటు, ఆకలిని నియంత్రించటంలో తోడ్పడతాయి.
  4. ఆకలి సంకేతాలు, నాడుల ద్వారా మెదడుకు చేరి సంబంధిత ఆదేశాలు ఇవ్వబడతాయి.
  5. చిన్నప్రేగులో జీర్ణమైన ఆహారం రక్తప్రసరణ వ్యవస్థలోనికి శోషణం చెందుతుంది.

ప్రశ్న 6.
ఆహారపదార్థాల వాసన ఆకలిని పెంచుతుందని రఫి అన్నాడు. అతని వ్యాఖ్య సరైనదేనా? ఎలా? (AS1)
జవాబు:

  1. ఆహారపదార్థాల వాసన ఆకలిని పెంచుతుందన్న వాదనతో నేను ఏకీభవిస్తాను.
  2. రుచి, వాసన బాగా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి.
  3. ఆహారం మంచి వాసన కలిగి ఉండటం వలన, ఘ్రాణ గ్రాహకాలు ప్రతిస్పందించి వార్తలను మెదడుకు పంపుతాయి.
  4. మంచివాసన వలన తినాలనే కోరిక మరింత పెరిగి ఎక్కువగా తింటాము. కావున మంచివాసన ఆకలిని పెంచుతుందని నిర్ధారించవచ్చు.
  5. దీనికి వ్యతిరేక సందర్భం కూడమనకు అనుభవమే. ఆహారం రుచిగా ఉన్నా, చెడువాసన వస్తే దానిని మనం తినలేము.

ప్రశ్న 7.
పెరిస్టాలిసిస్ మరియు సంవరిణీ కండరాల గురించి రాయండి. (AS1)
జవాబు:
పెరిస్టాల్స స్ :

  1. ఆహార వాహికలో ఆహార ముద్ద ప్రయాణిస్తున్నపుడు, ఏర్పడే అలల వంటి చలనాన్ని “పెరిస్టాలటిక్ చలనం” అంటారు. ఈ ప్రక్రియను “పెరిస్టాల్సస్” అంటాం.
  2. నోటిలో ఆహారం నమలబడిన తరువాత ముద్దగా మారుతుంది. మ్రింగుట అనే ప్రక్రియ వలన ఆహార ముద్ద ఆహారవాహికలోనికి ప్రవేశిస్తుంది.
  3. ఆహారవాహికలోని స్తంభాకార కండరాల సడలింపు వలన, బోలస్ ముందు భాగం పొడవు తగ్గి గొట్టం వెడల్పు అవుతుంది.
  4. ఇదే సందర్భంలో ఆహార ముద్ద (బోలస్) పైన ఉన్న వలయ కండరాలు సంకోచం చెందటం వలన బోలస్ క్రిందకు నెట్టబడుతుంది.
  5. ఇలా ఆహారవాహికలో కండరాల సంకోచ సడలింపు వలన తరంగం వంటి చలనం ఏర్పడి బోలస్ ఆహారవాహికను చేరుతుంది. ఈ ప్రక్రియనే “పెరిస్టాలిసిస్” అంటారు.

సంవరణి కండరము:

  1. జీర్ణాశయం యొక్క పరభాగంలో, స్వయం నియంత్రిత కండరం ఉంటుంది. దీనిని “జఠర సంవరిణి” (Pyloric sphincter) అంటారు.
  2. ఇది ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారాన్ని నియంత్రిస్తుంది.
  3. జీరాశయంలోని ఆహారం ఆమగుణం కలిగి పాక్షికంగా జీర్ణమైన తరువాత, ఈ కండరం తెరుచుకొంటుంది.
  4. అందువలన జీర్ణాశయంలోని ఆహారం కొంచెం కొంచెంగా ఆంత్రమూలం చేరుతుంది.
  5. ఆంత్రమూలంలో చేరిన ఆహారం ఆధారంగా ఈ కండరం మూసుకుపోతుంది..
  6. దీనివలన నిర్దిష్ట పరిమాణంలో ఆహారం ఆంత్రమూలానికి చేరి, పూర్తిగా జీర్ణమౌతుంది.

ప్రశ్న 8.
కింద ఇచ్చిన జీర్ణవ్యవస్థలోని భాగాన్ని పరిశీలించండి. ఇది ఏమిటి? ఇది నిర్వర్తించే పనులను రాయండి. (AS1)
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 2
జవాబు:

  1. పటంలో చూపబడిన బొమ్మ మానవ జీర్ణ వ్యవస్థలోని జీర్ణాశయం.
  2. జీర్ణాశయం జీర్ణవ్యవస్థలో ఆహారవాహిక తరువాత భాగం. ఇది పెద్దదిగా సంచివలె ఉండే కండర నిర్మాణం.
  3. జీర్ణాశయ పూర్వభాగాన్ని హార్దిక జీర్ణాశయం అని, పరభాగాన్ని జఠర జీర్ణాశయం అని పిలుస్తారు.
  4. జీర్ణాశయ గోడలు, మందంగా ఉండి జఠర గ్రంథులను కలిగి ఉంటాయి. ఇవి జఠర రసాన్ని స్రవిస్తాయి.
  5. జీర్ణాశయం యొక్క పరభాగం ‘U’ ఆకారంలో వంపు తిరిగి ఆంత్రమూలంగా మారుతుంది.

జీర్ణాశయ విధులు :

  1. జీర్ణాశయం ప్రధానంగా, ఆహారనిల్వకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఆహారం 4 గంటల నుండి 5 గంటల వరకు నిల్వ ఉంటుంది.
  2. జఠర రసం హైడ్రోక్లోరిక్ ఆమ్లమును కలిగి ఉంటుంది. ఇది ఆహారంతో పాటు ప్రవేశించిన సూక్ష్మ కస్తా
  3. జీర్ణాశయ కండరాలు వలయ, ఆయత, వాలు కండరాలను కలిగి ఆహారాన్ని బాగా చిలుకుతుంది. ఆ గువలన జీర్ణరసాలతో ఆహారం బాగా కలిసి పోతుంది.
  4. జఠర రసం, లాలాజలంతో క్షారయుతమైన ఆహారాన్ని తటస్థం చేయటం వలన జీర్ణక్రియ ప్రక్రియ వేగవంతమవుతుంది.
  5. జఠర రసంలో లైపేజ్, రెనిన్, అమిలాప్సిన్ వంటి జీర్ణ ఎంజైమ్స్ ఉండి ఆహార పదార్థాలను జీర్ణం చేస్తాం.
  6. ఈ ఎంజైమ్స్ వలన జీర్ణాశయంలో ఆహారం పాక్షికంగా జీర్ణమవుతుంది. దీనిని ‘క్రైమ్’ అంటారు.

ప్రశ్న 9.
క్రింది వానికి తగిన కారణాలు తెలపండి. (AS1)
ఎ) నాలుకతో అంగిలిని నొక్కి పట్టుట ద్వారా రుచిని త్వరగా తెలుసుకోగలం.
బి) ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు రుచి తెలియదు.
సి) రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినపుడు మనకు ఆకలి వేస్తుంది.
ది) చిన్న ప్రేగు చుట్టుకొని ఉన్న పైపు మాదిరిగా ఉంటుంది.
జవాబు:
ఎ) నాలుకతో అంగిలిని నొక్కి పట్టుట ద్వారా రుచిని త్వరగా తెలుసుకోగలం.
నోటిలో ఆహారం, లాలాజలంలో కరిగి ద్రవస్థితికి మారుతుంది. నాలుకతో అంగిలిని నొక్కటం నెలన ఈ ద్రవ ఆహారం నాలుక మీద ఉన్న రుచి మొగ్గలలోనికి ప్రయాణిస్తుంది. రుచి మొగ్గలలోని రుచి గ్రాహక కణాలు ఆహార రుచిని గ్రహించి మెదడుకు సందేశాలు పంపుతుంది.

బి) ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు రుచి తెలియదు.
నాలుక మీద ఉన్న రుచి మొగ్గలు, ఆహారం రుచిని గుర్తిస్తాయి. ఈ రుచి మొగ్గలు, శరీర ఉగ్రతకు దగ్గరగా ఉన్న ఆహారపదార్థాల రుచిని సులువుగా గుర్తిస్తాయి. పదార్థం బాగా వేడిగా ఉన్నప్పుడు రుచి మొగ్గలలోని గ్రాహక కణాలు రుచిని సరిగా గుర్తించలేవు. అందువలన ఆహారం వేడిగా ఉన్నప్పుడు రుచి తెలియదు.

సి) రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినపుడు మనకు ఆకలి వేస్తుంది.

  1. ఆకలి శరీరానికి ఆహార అవసరం తెలిపే సంకేతం.
  2. జీర్ణమైన ఆహారం రక్తంలోనికి గ్లూకోజ్ రూపంలో శోషణ చెంది శరీర కణాలకు సరఫరా చేయబడుతుంది.
  3. రక్తంలోని గ్లూకోజు, కణజాలం వినియోగించుకోవటం వలన రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది.
  4. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినపుడు జీర్ణాశయ గోడలు గ్రీలిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి.
  5. ఈ హార్మోన్ జీర్ణాశయంలో ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేస్తుంది.

డి) చిన్నప్రేగు చుట్టుకొని ఉన్న పైపు మాదిరిగా ఉంటుంది.
చిన్న ప్రేగు ప్రధానవిధి శోషణ. జీర్ణమైన ఆహారం రక్తంలోనికి ప్రవేశించే ప్రక్రియను శోషణ అంటారు. శోషణ ప్రక్రియ జరగటానికి, ఎక్కువ ఉపరితలం అవసరం. అందువలన చిన్నప్రేగు పొడవుగా ఉంటుంది. పొడవైన చిన్నప్రేగు కొద్ది స్థలంలో అమరటానికి అనువుగా అనేక మడతలు పడి చుట్టుకొని ఉంటుంది. దీని వలన పొడవైన – చిన్నప్రేగు కొద్ది తలంలో అమరిపోతుంది. శోషణాతలం వైశాల్యం పెంచటానికి చిన్న ప్రేగు లోపలి గోడలు ముడతలు పడి ఆంత్రచూషకాలుగా మారతాయి. ఇవి జీర్ణమైన ఆహారాన్ని ‘శోషించుకొని రక్తంలోనికి చేర్చుతాయి.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 10.
కింది వాని మధ్యలో ఉండే భేదాలు రాయండి. (AS1)
ఎ) బోలస్ – కైమ్
బి) చిన్నప్రేగు – పెద్దప్రేగు
సి) మాస్టికేషన్-రుమినేషన్
డి) మొదటి మెదడు – రెండవ మెదడు
జవాబు:
ఎ) బోలస్ – కైమ్ :

బోలస్ క్రైమ్
1. నోటిలో ఏర్పడిన ముద్దను “బోలస్” అంటారు. 1. పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని “క్రైమ్” అంటారు.
2. ఇవి లాలాజలంతో కలిసి ఏర్పడుతుంది. 2. ఇది జీర్ణరసాల చర్య వలన ఏర్పడుతుంది.
3. ఘనస్థితిలో ఉండే ముద్ద వంటి నిర్మాణము. 3. ద్రవస్థితిలో ఉండే ఆహారపదార్ధం.
4. ఆహార వాహిక ద్వారా జీర్ణాశయం చేరుతుంది. 4. సంవరిణీ కండరము ద్వారా ఆంత్రమూలాన్ని చేరుతుంది.
5. లాలాజల ప్రభావం వలన క్షారయుతంగా ఉంటుంది. 5. జఠర రస ప్రభావం వలన ఆమ్లయుతంగా ఉంటుంది.

బి) చిన్నప్రేగు – పెద్ద ప్రేగు :

చిన్నపేగు పెద్దప్రేగు
1. జీర్ణాశయం తరువాత భాగం. 1. జీర్ణవ్యవస్థలో చిన్నపేగు, పెద్ద ప్రేగుగా కొనసాగించబడుతుంది.
2. పరిమాణం చిన్నదిగా ఉంటుంది. 2. పరిమాణం పెద్దదిగా ఉంటుంది.
3. ఎక్కువ పొడవు కలిగి ఉంటుంది. 3. పొడవు తక్కువగా ఉంటుంది.
4. మెలి తిరిగి చుట్టుకొని ఉంటుంది. 4. చతురస్రాకారంలో అమరి ఉంటుంది.
5. పాక్షిక జీర్ణక్రియ జరుగుతుంది. 5. జీర్ణక్రియ జరగదు.
6. ఆహార పదార్థాల శోషణ దీని ప్రధానవిధి. 6. నీటి పునఃశోషణ దీని ప్రధానవిధి.
7. కీర్ణం కాని పదార్థాలను పెద్ద ప్రేగుకు చేర్చుతుంది. 7. జీర్ణం కాని పదార్థాలను మలం రూపంలో విసర్జిస్తుంది.

సి) మాస్టికేషన్ – రుమినేషన్ :

మాస్టికేషన్ రుమినేషన్
1. నోటిలో ఆహారాన్ని ముక్కలుగా చేసే ప్రక్రియను “మాసికేషన్” అంటారు. 1. జీర్ణాశయం నుండి ఆహారాన్ని తిరిగి నోటిలోనికి తెచ్చుకొని ననులడాన్ని “రుమినేషన్” అంటారు.
2. ఆహార సేకరణలో ఇది ప్రాథమిక ప్రక్రియ. 2. మాస్టికేషన్ జరిగిన తరువాత రుమినేషన్ జరుగుతుంది.
3. దాదాపు అన్ని జంతువులలో మాస్టికేషన్ ఉంటుంది. 3. నెమరు వేయు జంతువులలో మాత్రమే రుమినేషన్ ఉంటుంది.
4. మాస్టికేషన్ తరువాత ఆహారం ఆహారవాహిక ద్వారా జీర్ణాశయం చేరుతుంది. 4. రుమినేషన్లో ఆహారం జీర్ణాశయం నుండి ఆహార వాహిక ద్వారా నోటిలోనికి చేరుతుంది.

డి) మొదటి మెదడు – రెండవ మెదడు :

మొదటి మెదడు రెండవ మెదడు
1. తల ప్రాంతంలో ఉండే నాడీవ్యవస్థలోని ప్రధానభాగం. 1. ఉదర భాగంలో ఉండే జీర్ణవ్యవస్థ అనుసంధాన నాడీకణజాలాన్ని రెండవ మెదడు అంటారు.
2. పరిమాణంలో పెద్దది. 2. పరిమాణంలో చిన్నది.
3. తెలివితేటలు, ఆలోచించటం, నిర్ణయాలు తీసుకోవటం చేయగలదు. 3. తెలివితేటలు, ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవటం చేయలేదు.
4. 350 గ్రాముల పరిమాణం కల్గి ఉంటుంది. 4. ఇది 9 మీటర్ల పొడవు గలిగిన జీర్ణనాడీవ్యవస్థ.

ప్రశ్న 11.
మీ నోరు ఒక నమిలే యంత్రం అని ఎలా చెప్పగలవు? (AS1)
జవాబు:

  1. జీర్ణవ్యవస్థ మొదటి భాగం నోరు. ఇది ఆహారాన్ని ముక్కలుగా చేసి లాలాజలంతో కలుపుతుంది.
  2. నోటిలో ఆహారాన్ని ముక్కలుగా చేయటానికి రెండు దవడల మీద దంతాలు అమరి ఉంటాయి.
  3. నోటిలో ఉండే దంతాలు నాలుగు రకాలు. ఇవి వివిధ పనులను నిర్వహిస్తాయి.
  4. కుంతకాలు కొరకటానికి, రదనికలు చీల్చటానికి, ముందుచర్వణకాలు నమలడానికి, చర్వణకాలు విసరడానికి తోడ్పడతాయి.
  5. ఈ నాలుగు రకాల దంతాలు ఆహారాన్ని ముక్కలుగా చేయటం వలన దీనిని నమిలే యంత్రంగా పరిగణించవచ్చు.
  6. నోటిలో నమలబడిన ఆహారం లాలాజలంతో కలిసి ఆహారం ముద్దగా మారుతుంది. దీనిని “బోలస్” అంటారు.

ప్రశ్న 12.
మాస్టికేషన్ అంటే ఏమిటి? అందుకు తోడ్పడే వివిధ రకాల దంతాలను గురించి వివరించండి. (AS1)
జవాబు:
నోటిలో ఆహారం నమలబడి చూర్ణం చేయడాన్ని ‘మాస్టికేషన్’ అంటారు. ఈ ప్రక్రియకు నోటిలో నాలుగు రకాల దంతాలు తోడ్పడతాయి. అవి
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 1

ప్రశ్న 13.
ఆహార పదార్థాలు నోటి నుండి ఆహారవాహిక ద్వారా జీర్ణాశయాన్ని చేరే మార్గంలో కందర వ్యవస్థ నియంత్రణ ఏ విధంగా పనిచేస్తుంది? (AS1)
జవాబు:

  1. జీర్ణవ్యవస్థలో ఆహార పదార్థాల కదలిక కండర వ్వవసచే నియంత్రించబడుతుంది.
  2. నోటిలో నమలబడిన ఆహారం ముద్దగా మారుతుంది. దీనిని “బోలస్” అంటారు.
  3. మ్రింగుట అనే ప్రక్రియ వలన బోలస్ ఆహారవాహికలోకి నెట్టబడుతుంది.
  4. ఆహారవాహికలో అలలవంటి తరంగచలనం వలన, ఆహారం జీర్ణాశయం చేరుతుంది. ఈ చలనాన్ని “పెరిస్టాలిటిక్ చలనం” అంటారు.
  5. పెరిస్టాలిటిక్ చలనంలో బోలస్ పైన ఉన్న వలయ కండరాలు సంకోచం చెంది ఆహారాన్ని క్రిందకు నెడతాయి.
  6. అదే సమయంలో బోలస్ క్రింద ఉన్న ఆయత కండరాలు సడలి ఆహారం క్రిందకు జారటానికి మార్గం సుగమం చేస్తాయి.
  7. ఈ కండర సంకోచ సడలింపులు ఏకాంతరంగా జరుగుతూ ఆహారవాహికలో అలవంటి చలనాన్ని ఏర్పర్చి ఆహారాన్ని జీర్ణాశయంలోకి చేర్చుతాయి.

ప్రశ్న 14.
చిన్నప్రేగు చుట్టుకొని అనేక ముడుతలుగా ఉండటానికి గల కారణం ఏమైనా ఉందా? జీర్ణక్రియకు అది ఏ విధంగా తోడ్పడుతుంది? (AS1)
జవాబు:

  1. జీర్ణవ్యవస్థలో చిన్నప్రేగు కీలకపాత్రను పోషిస్తుంది. ఇది అంత్యజీర్ణక్రియను సమర్ధవంతంగా నిర్వహించటంతో పాటు శోషణ ప్రక్రియను నిర్వహిస్తుంది.
  2. జీర్ణమైన ఆహారం, రక్తంలోనికి పీల్చుకోబడటాన్ని ‘శోషణం’ అంటారు.
  3. శోషణాతలం వైశాల్యం పెంచటానికి చిన్న ప్రేగు పొడవుగా ఉంటుంది. పొడవైన చిన్న ప్రేగు తక్కువ విస్తీర్ణంలో అమరటం కోసం అనేక మడతలుగా చుట్టుకొని ఉంటుంది.
  4. చిన్నప్రేగు లోపలి తలం ముడతలు పడి ఆంత్రచూషకాలుగా ఏర్పడి ఉంటుంది. దీని వలన శోషణాతలం వైశాల్యం పెరుగుతుంది.
  5. చిన్న ప్రేగు శోషణతోపాటు, జీర్ణక్రియను కూడ నిర్వహిస్తుంది. చిన్న ప్రేగు గోడలలోని ఆంత్ర గ్రంథులు ఆంత్రరసాన్ని స్రవిస్తాయి.
  6. ఆంత్రరసంలోని ఎంజైమ్స్ అంత్య జీర్ణక్రియను పూర్తిచేస్తాయి.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 15.
కింది భాగాలలో పెరిస్టాలిసిస్ విధులను తెలపండి. (AS1)
ఎ) ఆహారవాహిక బి) జీర్ణాశయం సి) చిన్నప్రేగు డి) పెద్దప్రేగు
జవాబు:
ఎ) ఆహారవాహిక :
ఆహారవాహికలోని ‘పెరిస్టాల్ సిస్’ చలనం వలన ఆహారం నోటి నుండి జీర్ణాశయంకు చేరుతుంది.

బి) జీర్ణాశయం :
జీర్ణాశయంలోని పెరిస్టాల్ సిస్ చలనం వలన ఆహారం జఠర రసంతో బాగా కలపబడి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఆహారాన్ని చిలకటానికి, కదపటానికి జీర్ణాశయంలో ‘పెరిస్టాలిసిస్’ తోడ్పడుతుంది.

సి) చిన్నప్రేగు :
చిన్న ప్రేగులో పెరిస్టాల్ సిస్ వలన ఆహారం నెమ్మదిగా ముందుకు కదిలి పెద్ద ప్రేగును చేరుతుంది.

డి) పెద్దప్రేగు :
పెద్ద ప్రేగులో పునఃశోషణ జరిగిన పిదప, వ్యర్ధపదార్థాలు క్రమేణా ముందుకు జరిగి పాయువు ద్వారా విసర్జింపబడతాయి.

ప్రశ్న 16.
జీర్ణనాడీ వ్యవస్థను రెండవ మెదడుగా పరిగణించటం ఎంతవరకు సమంజసం? (AS1)
జవాబు:

  1. జీర్ణనాళంలోని నాడీవ్యవస్థ నాడీకణాలతో కూడిన ఎంతో సంక్లిష్టమైన వలయాన్ని కలిగి ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ వ్యవస్థను రెండవ మెదడుగా పిలుస్తారు.
  2. జీరనాళంలోని నాడీకణజాల సముదాయం కేవలం జీర్ణక్రియ జరపటం లేదా అప్పుడప్పుడు ఆకలి కోరికలు సంకేతాలు పంపడం వరకే పరిమితం కాకుండా ముఖ్యమైన సమాచారాన్ని పంపే న్యూరోట్రాన్స్ మీటర్లో నిక్షిప్తమై ఉంటుంది.
  3. శరీరం దిగువ భాగంలో ఉంటూ రెండవ మెదడుగా పిలువబడే జీర్ణ మండలంలోని నాడీవ్యవస్థ కపాలంలోని పెద్ద మెదడుతో సంధించబడి ఉంటుంది.
  4. ఈ నాడీవ్యవస్థ కొంత వరకు మానసిక స్థాయిని నిర్ణయించడంతోపాటు, శరీరంలోని కొన్ని వ్యాధులను నియంత్రించటంలో కీలకపాత్ర వహిస్తుంది.
  5. మానసిక వత్తిడి కలిగినపుడు విరోచనాలు కావటం దీనికి ఉదాహరణ.
  6. సమాచార సంకేతాలను పంపటంతో పాటు, మానసిక స్థాయిని నియంత్రించే ఈ నాడీమండలాన్ని రెండవ మెదడుగా పరిగణించటం సమంజసం.

ప్రశ్న 17.
ఆహార పదార్థాలను చూసిన వెంటనే రాజేష్ ఆకలిగా ఉందన్నాడు. షీలా తనకు ఆకలిగా లేదన్నది. దేని వలన రాజేషకు ఆకలివేయటం, షీలాకు ఆకలి వేయకపోవటం జరిగింది? (AS2)
జవాబు:
రాజేష్ చూచిన ఆహార పదార్థం తనకు బాగా ఇష్టమైనది అయి ఉంటుంది. కావున దానిని చూసిన వెంటనే తనకు తినాలనే కోరిక కలిగింది. ఆహారం తినాలనే తపన మెదడు నుండి జీర్ణాశయానికి సంకేతాలు పంపిస్తుంది. అందువలన జీర్ణాశయంలో గ్రీలిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అయి ఆకలి వేసింది.

షీలా చూసిన ఆహారం తనకు ఇష్టము లేనిది అయి ఉంటుంది. అందువలన దానిని తినాలనే ఆసక్తి షీలాకు లేదు. అందువలన షీలాకు ఆకలి వేయలేదు.

దీనినిబట్టి ఆకలి, రుచి, వాసనలను బట్టి ప్రభావితం అవుతుందని నిర్ధారించవచ్చు.

ప్రశ్న 18.
రుచి మరియు వాసన ఏ విధంగా సంబంధం కల్లి ఉన్నాయి? (AS2)
జవాబు:

  1. ఆహారం యొక్క రుచి, వాసన మీద ఆధారపడి ఉంటుంది.
  2. ఒక పదార్థం రుచిగా ఉన్నప్పటికి సరైన వాసన లేకుంటే మనం తినలేము.
  3. వాసనను బట్టి పదార్ధం యొక్క రుచిని అంచనా వేయవచ్చు.
  4. మంచి వాసన ఉన్న పదార్థాలు రుచిగా ఉండటం మన నిత్యజీవిత అనుభవం.
  5. దీనిని బట్టి రుచికి వాసనకు సంబంధం ఉందని నిర్ధారించవచ్చు.

ప్రశ్న 19.
ఆహార పదార్థాల చలనంలో మీరు పరిశీలించిన కండర సంవరిణీలు ఏమిటి? వాటి గురించి క్లుప్తంగా వివరించండి. (AS1)
జవాబు:

  1. ఆహారవాహిక ప్రారంభంలో ఒక సంవరిణీ కండరం ఉంటుంది. ‘మ్రింగుట’ వలన ఆహారం ఈ కండరాన్ని దాటి ఆహారవాహికలోనికి ప్రవేశిస్తుంది.
  2. జీర్ణవ్యవస్థలో రెండవ సంవరిణీ కండరం జీర్ణాశయం పరభాగంలో ఉంది. దీనిని జఠర సంవరిణీ కండరం అంటారు.
  3. ఇది జీర్ణాశయం నుండి ఆంత్రమూలంలోనికి ప్రవేశించే ఆహారాన్ని నియంత్రిస్తుంది. ఆహార పదార్థాల ఆమ్లత్వం మరియు ఆంత్రమూలంలోని ఆహార పరిమాణం ఆధారంగా ఇది నియంత్రించబడుతుంది.
  4. ఆహార నాళ చివరి భాగంలో పాయువు సంవరిణీ కండరం (Anal sphincter) ఉంటుంది. దీని లోపలి సంవరిణీ కండరం అనియంత్రితంగాను, బాహ్య సంవరిణీ కండరం నియంత్రితంగాను పనిచేస్తుంది.
  5. ఈ కండరం మల విసర్జనను నియంత్రిస్తుంది.

ప్రశ్న 20.
లాలాజల గ్రంథుల నాళాలు మూసుకొనిపోతే ఏమవుతుంది? (AS2)
జవాబు:

  1. లాలాజల గ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలంలోని ఎమైలేజ్ ఎంజైమ్ పిండి పదార్థాలపై చర్య జరిపి చక్కెరగా మార్చుతుంది.
  2. లాలాజల గ్రంథులు మూసుకొని పోతే నోటిలోనికి లాలాజలం స్రవించబడదు. దీని వలన
    a) ఆహారం ముద్దగా మారి బోలను ఏర్పర్చలేదు. అందువలన ఆహారం మ్రింగటం కష్టమౌతుంది.
    b) ఆహారం కరిగి ఉన్నప్పుడు మాత్రమే నాలుకలోని రసాయన గ్రాహకాలు రుచిని గ్రహిస్తాయి. లాలాజలం లేకుంటే మనకు ఆహార రుచి తెలియదు.
    c) లాలాజలంలోని ఎంజైమ్ పిండి పదార్థాలను జీర్ణం చేస్తుంది. లాలాజలం లేకుంటే వాటిలో జీర్ణక్రియ జరగదు. పిండి పదార్థాలు చక్కెరగా మారవు.

ప్రశ్న 21.
జీర్ణక్రియలో ఇమిడి ఉన్న నాడుల సమన్వయాన్ని అర్ధం చేసుకోవటానికి ఒక ప్రశ్నావళిని తయారుచేయండి. (AS2)
జవాబు:

  1. జీర్ణక్రియలోని గ్రంథులు ఎలా ప్రేరేపించబడతాయి?
  2. జీర్ణక్రియ స్రావాలు ఎప్పుడు నిలిపివేయబడతాయి?
  3. గ్రంథుల పనికి, నాడీవ్యవస్థకు మధ్యగల సంబంధం ఏమిటి?
  4. జీర్ణ మండల నాడీవ్యవస్థ స్వతంత్రంగా పనిచేస్తుందని నీవు భావిస్తున్నావా?
  5. న్యూరోట్రాన్స్ మీటర్స్ అంటే ఏమిటి? జీర్ణక్రియలో వాటి పాత్ర ఏమిటి?
  6. మానవ శరీరంలో రెండవ మెదడుగా దేనిని పరిగణిస్తున్నారు? ఎందుకు?

ప్రశ్న 22.
చిన్న ప్రేగుల ఆకారం, పొడవు ఆహారనాళం మాదిరిగానే ఉంటే ఏం జరుగుతుంది? (AS2)
జవాబు:

  1. చిన్నప్రేగుల ప్రధాన విధి శోషణ. ఇది జీర్ణమైన ఆహారాన్ని రక్తంలోనికి పీల్చుకొంటుంది.
  2. శోషణ సమర్థవంతంగా జరగటానికి అది బాగా పొడవు ఉండి, మెలితిరిగి ఉంటుంది.
  3. లోపలి తలం ముడతలు పడి ఉండుట వలన శోషణకు ఉపరితల వైశాల్యం పెరుగుతుంది.
  4. చిన్నప్రేగుల ఆకారం, పొడవు ఆహారనాళం మాదిరిగా ఉంటే.
    a) చిన్నప్రేగు పొడవు తగ్గుతుంది.
    b) చిన్నప్రేగులో శోషణాతల వైశాల్యం తగ్గుతుంది.
    c) అందువలన శోషణ ప్రక్రియ సమర్థవంతంగా జరగదు.
    d) జీర్ణక్రియ యొక్క ప్రధాన ఉద్దేశల నెరవేరదు.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 23.
లాలాజలం యొక్క చర్యను అర్థం చేసుకోవటానికి పిండిపై ఎలాంటి ప్రయోగం చేశారు? ప్రయోగ పద్దతిని మరియు పరికరాలను గురించి వివరించండి. (AS3)
జవాబు:
ఉద్దేశం :
పిండిపదార్థాలపై లాలాజల చర్యను అర్థం చేసుకోవటం.

పరికరాలు :
పిండిపదార్థం, అయోడిన్, లాలాజలం, పరీక్షనాళిక, నీరు.

విధానం :

  1. ఒక పరీక్షనాళికలో సగం వరకు నీటిని తీసుకొని, పిండి పదార్థాన్ని కలపటం వలన పిండి ద్రావణం ఏర్పడినది.
  2. దీనిని వాగ్లాస్లో తీసుకొని అయోడిన్ కలపటం వలన పిండి ద్రావణం నీలిరంగుకు మారింది.
  3. నీలిరంగు పిండి ద్రావణాన్ని రెండు సమభాగాలుగా చేసి రెండు పరీక్షనాళికలలో తీసుకొన్నాను.
  4. ఒక పరీక్ష నాళికలో ఒక టీ స్పూన్ లాలాజలం కలిపాను. రెండవ పరీక్షనాళికలో ఏమీ కలపలేదు.
  5. రెండు పరీక్షనాళికలను 45 నిమిషాలపాటు స్థిరంగా ఉంచి పరిశీలించాను.

పరిశీలన :
లాలాజలం కలిపిన పరీక్షనాళికలోని పిండి ద్రావణం రంగును కోల్పోయింది. దీనికి ఒక చుక్క సజల టింక్చర్ అయోడిన్ కలిపినా నీలిరంగు ఏర్పడలేదు.

వివరణ :
మొదటి పరీక్షనాళికలోని అయోడిన్ నీలిరంగుగా మారలేదంటే, పిండి పదార్థం లేదని అర్థం. కలిపిన లాలాజలం పిండి పదార్థంపై పనిచేయుట వలన పిండి పదార్థం చక్కెరగా మారింది. అందువలన ద్రావణం నీలిరంగుకు మారలేదు.

నిరూపణ :
లాలాజలం పిండి పదార్థంపై పనిచేసి దానిని చక్కెరగా మార్చుతుంది.

ప్రశ్న 24.
రుచిని గుర్తించుటలో అంగిలి యొక్క పాత్రను నిర్ధారించేలా ఒక చిన్న ప్రయోగాన్ని సూచించండి. (AS3)
జవాబు:
ఉద్దేశం : రుచిని గుర్తించటంలో అంగిలి పాత్రను నిర్ధారించుట.

పరికరాలు :
చక్కెర గుళికలు, చక్కెర ద్రావణం, సాహెచ్

విధానం :

  1. కొంచెం చక్కెరను నాలుకపై ఉంచుకొని నోరు తెరిచే ఉంచాను. నాలుక అంగిలిని, తాకకుండా జాగ్రత్త పడ్డాను. స్టాప్ వాచ్ ఉపయోగించి, నాలుకపై ఉంచిన చక్కెర గుళికల రుచి ఎంగసేపటికి తెలిసిందో గమనించి సమయం నమోదు చేశాను.
  2. రెండవ సందర్భంలో నోటిలో చక్కెరను అంతే పరిమాణంలో ఉంచి, నోరు మూసుకొన్నాను. ఈ సందర్భంలో నాలుక అంగిలిని తాకింది. స్టాప్ వాచ్ ఉపయోగించి నాలుక రుచిని గుర్తించటానికి పట్టే సమయం గుర్తించాను.

పరిశీలన :
నోరు తెరిచి ఉన్నప్పటికంటే, నోరు మూసి, అంగిలి నాలుకకు తగిలిన సందర్భంలో తక్కువ సమయంలో చక్కెర రుచిని గుర్తించగలిగాను.

వివరణ :
నోరు మూసినపుడు, అంగిలి ఆహార పదార్థాలను రుచి మొగ్గలలోనికి నెట్టటం వలన రుచిని త్వరగా గుర్తించగలిగాను. దీనినిబట్టి రుచిని గుర్తించటంలో అంగిరి ప్రధానపాత్ర వహిస్తుందని అర్ధమైంది. నిరూపణ : రుచిని గుర్తించటంలో అంగిలి కీలకపాత్ర వహిస్తుంది.

ప్రశ్న 25.
మీ పాఠశాల గ్రంథాలయం నుండి ఆకలికి సంబంధించిన సమాచారాన్ని మరియు చిత్రాలను సేకరించి ఒక నివేదిక తయారుచేయండి. (AS4)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 3 AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 4

  1. ఆకలి జంతువుల యొక్క సహజ స్వభావం. ఇది శరీరం పోషకాలను కోరుకొనే స్థితి.
  2. జీర్ణాశయంలోని గ్రీలిన్ హార్మోన్ వలన ఆకలి సంకేతాలు మెదడుకు చేరతాయి.
  3. మెదడులోని డైయన్ సెఫలాన్ (ద్వారగోర్లం) ఆకలిని నియంత్రిస్తుంది.
  4. ఆకలి సంకేతాలు మెదడుకు 10 వ కపాలనాడి (వేగన్నడి) ద్వారా చేరతాయి.
  5. ఆకలి కోరికలు 30 నుండి 45 నిమిషాల పాటు జరుగుతాయి.
  6. ఆకలి కోరికను నియంత్రించటానికి లెఫ్టిన్ హార్మోన్ స్రవించబడుతుంది. ఇది ఆకలిని అణిచివేస్తుంది.
  7. ఆకలి, పదార్థం యొక్క రుచి, వాసన అలవాట్లపైన కూడ ఆధారపడి ఉంటుంది.
  8. మానవులలో ఆకలివేయటం ఒక నిబంధన సహిత ప్రతిచర్య. కావున మనకు రోజు నిర్దిష్ట సమయానికి ఆకలి వేస్తూ ఉంటుంది.
  9. ఆకలి సమయానికి ఆహారం తీసుకోకపోయినా, ఆహారం లభించని పరిస్థితులలో శరీరంలో నిల్వ ఉన్న ఆహారం వినియోగించబడుతుంది.
  10. జీవులు సుప్తావస్థలో ఉన్నప్పుడు, ఆకలి జీర్ణక్రియ ప్రక్రియలు అత్యంత కనిష్టంగా జరుగుతాయి.

ప్రశ్న 26.
ఆహార పదార్థాల నుండి రుచి సంవేదన మెదడుకు చేరే క్రమాన్ని బ్లాక్ చిత్రం గీసి చూపండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 5

ప్రశ్న 27.
ఆహారవాహికలో పెరిస్టాల్టిక్ కదలికలను చూపే చిత్రం గీసి, భాగాలు గుర్తించండి. ఆహారవాహిక లోపలి తలంలోని శ్లేష్మస్తరం యొక్క ఆవశ్యకతను వివరించండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 6

  1. నోటిలోని ఆహారం, ఆహారవాహిక ద్వారా జీర్ణాశయం చేరుతుంది.
  2. ఆహారవాహికలోని ‘పెరిస్టాల్టిక్’ కదలికల వలన ఆహారం క్రిందకు జరుగుతుంది.
  3. ఆహారనాళపు గోడలు జారుడు గుణం గల జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిని శ్లేష్మం (Mucus) అంటారు.
  4. ఆహారనాళంలో ఆహారం సులువుగా కదలటానికి శ్లేష్మం తోడ్పడుతుంది.
  5. శ్లేష్మం చమురులా పనిచేస్తూ ఆహారవాహిక గోడలకు హాని జరగకుండా కాపాడుతుంది.
  6. దీనివలన ఆహార బోలస్ ఆహారవాహికలో సులభంగా కదులుతూ, కిందికి జరుగుతుంది.

ప్రశ్న 28.
చిన్నప్రేగులోని ఆంత్రచూషకాల నిర్మాణాన్ని తెలిపే చిత్రం గీయండి. జీర్ణవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థలలో గల సహ సంబంధాన్ని వివరించండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 7

  1. శరీరంలో జీర్ణవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థ సమన్వయంగా పనిచేస్తుంటాయి.
  2. జీర్ణక్రియ వలన జీర్ణమైన ఆహారం చిన్న ప్రేగులోనికి చేరుతుంది.
  3. చిన్న ప్రేగు లోపలి తలం అనేక ముడతలు పడి, వ్రేళ్ళ వంటి ఆంత్రచూషకాలను ఏర్పరుస్తుంది.
  4. ఈ ఆంత్రచూషకాలలో రక్తకేశనాళికలు, లింఫ్ గ్రంథులు విస్తరించి ఉంటాయి.
  5. జీర్ణమైన సరళ పదార్థాలు ఆంత్రచూషకంలోని రక్తంలోనికి విసరణ చెందుతాయి.
  6. రక్తంలోనికి చేరిన ఆహారపదార్థాలు శరీరమంతా సరఫరా చేయబడతాయి.

ప్రశ్న 29.
ఆహారపదార్థాల వాసన లేదా వాటిని చూసిన వెంటనే ఆకలి ప్రేరేపింపబడుతుంది. దీనిని సూచిరిచే చిత్రాన్ని గీయండి. (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 8

ప్రశ్న 30.
నోటి నుండి జీర్ణాశయం వరకు ఆహారపదార్థాల కదలికలను చూపే పటాన్ని గీయండి. ఆహార కదలికలకు ఏ ఏ నాడులు, కండరాలు తోడ్పడతాయి? (AS5)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 6

  1. ఆహారం ఆస్యకుహరంలోనికి ,నెట్టడానికి 5వ కపాల నాడి దవడలోని అంతర కండరాలను నియంత్రిస్తుంది.
  2. నోటిలో ఉండే వలయాకారపు కండరాలు ఆహారాన్ని నోటి కుహరంలో నెట్టడంలోనూ మరియు నోటిలో చుట్టూ కదిలించడంలోనూ సహాయపడతాయి.
  3. ఆహారాన్ని నేరుగా మింగడం సాధ్యం కాదు. కాబట్టి దంతాలు ఆహారాన్ని విసిరి, నమిలి, చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి. ఈ విధానాన్ని నమలడం ద్వారా చూర్ణం చేయడం (Mastication) అంటారు.
  4. ఈ పనికోసం దవడలోని ఉపరితల కండరాలు ఆహారాన్ని దంతాల కిందికి నెట్టి కొరకడం మరియు నమలడం క్రియలను నిర్వహిస్తాయి.
  5. దవడలోని అంతర కండరాలు ఆహారం నమిలేటప్పుడు దవడను పైకి, కిందకు, ముందుకు, వెనుకకు కదిలించడంలో తోడ్పడతాయి.
  6. ఆహారవాహికలో ఆహారం పెరిస్టాల్ సిస్ వలన క్రిందకు నెట్టబడి జీర్ణాశయం చేరుతుంది.
  7. పెరిస్టాల్సిస్ ప్రక్రియలో ఆహారవాహికలోని వలయ కండరాలు, నిలువు కండరాలు ఏకాంతరంగా సంకోచసడలింపులు జరుపుతాయి.

ప్రశ్న 31.
పాషాప్ ప్రయోగాన్ని ప్రతిబింబించేలా ఒక కార్టూన్ గీసి, దానికి సరిపోయేలా ఒక నినాదాన్ని రాయండి. (AS6)
జవాబు:
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 9

ప్రశ్న 32.
విసిరే యంత్రమైన జీర్ణాశయాన్ని మీరు ఎలా అభినందిస్తారు? ఈ ప్రక్రియ ఎలా సమన్వయం చేయబడుతుంది? (AS6)
జవాబు:

  1. జీర్ణాశయం జీర్ణవ్యవస్థలో పెద్ద భాగం. ఇది ఆహారాన్ని కొన్ని గంటల పాటు నిల్వ చేస్తుంది. ఈ మార్కులు
  2. జీర్ణాశయం గోడలు, పెరిస్టాల్‌ సిస్ కదలికను జరిపి ఆహారాన్ని కదపటం ద్వారా బాగా చిలకబడుతుంది.
  3. జీర్ణాశయం లేకపోతే ఆహారం మనం నిల్వ చేసుకోలేము. జీర్ణక్రియను సమర్థవంతంగా నిర్వర్తించుకోలేము.
  4. జీర్ణాశయంలోని జఠర రసము, ఆహారాన్ని పాక్షికంగా జీర్ణం చేసి ద్రవస్థితికి తీసుకువస్తుంది. దీనిని కైమ్ అంటారు.
  5. వాస్తవానికి జీర్ణాశయం రుబ్బు రోలు వంటి నిర్మాణం. ఇది కండర మరియు నాడీవ్యవస్థల సమన్వయంతో కదలికలను నిర్వహిస్తుంది.
  6. జీర్ణవ్యవస్థలో కీలకపాత్ర వహించే జీర్ణాశయం అద్భుతమైనది. దాని సేవలు అభినందనీయం.

ప్రశ్న 33.
ఎంతో వైవిధ్యంతో కూడిన జీవ ప్రక్రియలను గురించిన మీ భావాలతో ఒక కవితను రాయంది. (AS7)
జవాబు:
అద్భుతమైనది ప్రకృతి
ఇంకెంతో అద్భుతమైనది మానవ జీవి
అన్ని జీవుల కంటే మెరుగైనది
తెలివితేటలలో ముందున్నది

జీవక్రియలన్ని సంక్లిష్టము
అయినా అన్నింటి మధ్య సమన్వయం
కలిసికట్టుగా పనిచేస్తాయి
జట్టుగా జీవక్రియలను నిర్వహిస్తాయి

కలిసి పనిచేస్తే కలుగు విజయం
ఐకమత్యమే మహాబలం
ఇది శరీరధర్మ శాస్త్ర చక్కని సూత్రం
ఆచరిస్తే మన అభివృద్ధి ఖాయం

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 34.
ప్రస్తుత పాఠ్యాంశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆహారం తీసుకొనే సమయంలో అలవాటు చేసుకోవాల్సిన ఏ రెండు అంశాలను గురించి మీ మిత్రునికి సలహా ఇస్తారు? (AS7)
జవాబు:

  1. ఆహారం తీసుకొనే సమయంలో ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. ఆత్రుతగా, గబగబా మింగరాదు. నోటితో ఆహారం బాగా నమలటం వలన జీర్ణాశయంపై ఒత్తిడి తగ్గుతుంది. కావున భోజనానికి సమయం కేటాయించుకొని నెమ్మదిగా తినాలి.
  2. రోజు నిర్దిష్ట వేళకు భోజనం చేయటం అలవాటు చేసుకోవాలి. దీనివలన జీర్ణరసాలు నిర్దిష్టంగా పనిచేస్తాయి. ఆహార సమయంలో మార్పు జీర్ణవ్యవస్థను ఇబ్బందికి గురి చేస్తుంది.
  3. ఆహారం తినేటప్పుడు మాట్లాడుతూ తినటం కంటే, మౌనంగా తినటం మంచిది.

10th Class Biology 7th Lesson జీవక్రియలలో సమన్వయం Textbook InText Questions and Answers

10th Class Biology Textbook Page No. 154

ప్రశ్న 1.
మనకు ఆహారం అవసరం అని ఎలా తెలుస్తుంది?
జవాబు:
రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గితే వెంటనే మనకు ఆకలి వేసినట్లు అనిపిస్తుంది. అలాగే జీర్ణాశయం ఖాళీ అయినపుడు, జీర్ణాశయ గోడలలోని కొన్ని కణాలు ‘గ్రీలిన్’ అనే హార్మోను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేసి మెదడుకు పంపుతుంది. మెదడుకు సంకేతాలు చేరగానే ఆకలి కోరికలు జీర్ణాశయంలో మొదలవుతాయి.

ప్రశ్న 2.
కేంద్రీయ లేదా పరిధీయ నాడీవ్యవస్థలలో ఏ నాడీవ్యవస్థ ఆకలి ప్రచోదనాలను నియంత్రిస్తుంది?
జవాబు:
పరిధీయ నాడీవ్యవస్థలోని స్వయంచోదిత నాడీవ్యవస్థ ఆకలి ప్రచోదనాలను నియంత్రిస్తుంది.

ప్రశ్న 3.
ఎలాంటి నియంత్రణలు ఆకలి ప్రచోదనాలపై ప్రభావం చూపుతాయి? అవి హార్మోన్ల సంబంధమైనవా లేదా నాడీ సంబంధమైనవా లేదా రెండూనా?
జవాబు:
ఆకలి నియంత్రణ పై హార్మోన్స్, నాడీవ్యవస్థ సమన్వయంగా పనిచేస్తాయి. జీర్ణాశయం ఖాళీ అయినపుడు ‘గ్రీలిన్ అనే హార్మోన్ స్రవించబడి, ఆకలి సందేశాలను నాడీ మార్గం ద్వారా మెదడుకు పంపుతుంది.

శరీరంలోని స్వయంచోదిత నాడీవ్యవస్థ ఆకలి కోరికలను నియంత్రిస్తుంది. మెదడులోని డైయన్ సెఫలాన్ మరియు వేగస్ నాడీ ఈ సంకేతాలను చేరవేయటంలో కీలకపాత్ర వహిస్తాయి.

10th Class Biology Textbook Page No. 155

ప్రశ్న 4.
ఆకలి ప్రచోదనాలను ఉత్పత్తి చేసే క్రియలో పాలుపంచుకొనే ఏవైనా నాలుగు వ్యవస్థలను సూచించండి.
జవాబు:
ఆకలి ప్రచోదనాలను ఉత్పత్తి చేయటంలో 1. అంతఃస్రావీ వ్యవస్థ 2. నాడీవ్యవస్థ పాల్గొనగా వాటి ఆదేశాలను నిర్వహించటంలో 3. జీర్ణవ్యవస్థ 4. రక్తప్రసరణ వ్యవస్థ పాల్గొంటాయి.

ప్రశ్న 5.
చెడిపోయిన ఆహారాన్ని గుర్తించడంలో ప్రధానపాత్ర పోషించే భాగమేది?
జవాబు:
చెడిపోయిన ఆహారం దుర్గంధం వేస్తుంది. వాసన ద్వారా ముక్కు చెడిపోయిన ఆహారాన్ని గుర్తిస్తుంది. పాడైపోయిన ఆహారం రుచి సరిగా ఉండదు. కావున నాలుక కూడా చెడిపోయిన ఆహారం గుర్తిస్తుంది.

ప్రశ్న 6.
రుచికరమైన భోజనం చేస్తున్నప్పుడు అందులోని సువాసన ఆకలిని పెంచుతుందని భావిస్తున్నారా?
జవాబు:
రుచి ఆహార వాసనపై ఆధారపడి ఉంటుంది. ఆహారంలోని సువాసన ముక్కు ద్వారా గ్రహించబడి మెదడుకు సందేశాలు పంపించటం వలన, తినాలనే కోరిక పెరుగుతుంది. కావున భోజనం చేస్తున్నప్పుడు అందులోని సువాసన ఆకలిని పెంచుతుందని భావిస్తున్నాను.

10th Class Biology Textbook Page No. 156

ప్రశ్న 7.
ఆహార పదార్థాలను నోటిలో వేసుకొన్నప్పుడు ఏమవుతుంది?
జవాబు:

  1. ఆహార పదార్థాలను నోటిలో వేసుకొన్నప్పుడు అవి నోటిలోని లాలాజలంలో కరుగుతాయి.
  2. కరిగిన ఆహారం నాలుక మీద ఉన్న రుచి మొగ్గలలోనికి చేరుతుంది.
  3. రుచి మొగ్గలలోని రసాయన గ్రాహకాలు రుచిని గుర్తిస్తాయి.

ప్రశ్న 8.
రుచిని తెలుసుకోవటానికి ఉపయోగపడే నోటి భాగాలు ఏవి?
జవాబు:
రుచిని తెలుసుకోవటానికి నోటిలోని లాలాజలం, నాలుక మీది రుచి మొగ్గలు ప్రధానపాత్ర వహిస్తాయి.

10th Class Biology Textbook Page No. 157

ప్రశ్న 9.
రుచిపై ప్రభావం చూపే మరేవైనా ఇతర ఉద్దీపనలు ఉన్నాయా?
జవాబు:

  1. రుచిపై ప్రభావం చూపే కారకాలలో వాసన ముఖ్యమైనది. జలుబు చేసినపుడు ముక్కు సరిగా వాసన గ్రహించక పోవటం వలన మనకు పదార్థాలు చప్పగా ఉంటాయి.
  2. అతివేడి, అతి చల్లని పదార్థాల రుచిని కూడ మనం గుర్తించలేము. అంటే రుచి పదార్ధ ఉష్ణోగ్రత పై కూడ ఆధారపడి ఉంటుంది.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 10.
బాగా వేడిగా ఉన్న పాలు లేదా టీ తాగినపుడు రుచి స్పందన ఏమవుతుంది?
జవాబు:
బాగా వేడిగా ఉన్న పాలు లేదా టీ తాగినపుడు నాలుక వాటి రుచిని సరిగా గుర్తించలేదు. రుచి మొగ్గలు శరీర ఉష్ణోగ్రత నగరగా ఉండే పదార్థాల రుచిని సరిగ్గా గుర్తించగలుగుతాయి. కాని కొన్ని పదార్థాలు కొంచెం వేడిగా ఉన్నప్పు. ఎకరంగా ఉంటాయి. ఉదా : పాలు, టీ, వేడి కూరలు కొన్ని పదార్థాలు చల్లగా ఉన్నప్పుడు రుచికరంగా ఉంటాయి.
ఉదా : ఐస్ క్రీం, పుచ్చకాయ

ప్రశ్న 11.
ఏ ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు పదార్థాలు రుచికరంగా ఉంటాయని నీవు భావిస్తున్నావు?
జవాబు:
శరీర ఉష్ణోగ్రతలకు, ఇంచుమించు దగ్గరగా ఉన్న పదార్థాలు రుచికరంగా ఉంటాయని నేను భావిస్తున్నాను. అంటే 35°C నుండి 40°C మధ్య పదార్థాలు రుచిగా ఉంటాయి.

10th Class Biology Textbook Page No. 158

ప్రశ్న 12.
కింది ఫ్లోచార్టు రుచి జ్ఞానానికి సంబంధించి ఎలాంటి మార్గాన్ని నిర్దేశిస్తుంది?
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 17
జవాబు:

  1. ఫ్లోచార్టు ఆధారంగా రుచి, ముక్కు, నోరు, నాలుక పనితీరుపై ఆధారపడుతుందని తెలుస్తుంది.
  2. ముక్కులోని వాసన గ్రాహకాలు, నోటిలోని లాలాజల గ్రంథులు, నాలుక మీద రుచిగ్రాహకాలు కలిసి రుచిని గుర్తించటంలో తోడ్పడతాయి.
  3. జలుబు చేసినపుడు రుచిని సరిగా గుర్తించకపోవటం, వాసన గ్రాహకాలు సరిగా పనిచేయకపోవటం వలన జరుగుతుంది.
  4. అదే విధంగా నోరు తడి ఆరినపుడు, రుచిని గ్రహించలేము.
  5. ఆహారాన్ని అంగిలి రుచి మొగ్గలలోనికి నొక్కినపుడు మనం రుచిని గ్రహించగల్గుతున్నాము.

ప్రశ్న 13.
నోటిలో లాలాజల గ్రంథులు పనిచేయకపోతే ఏం జరుగుతుంది?
జవాబు:

  1. నోటిలో లాలాజల గ్రంథులు పనిచేయకపోతే, ఆహారం మెత్తగా నమలబడదు.
  2. ఆహారం బోలగా మారదు కావున మ్రింగటం కష్టమవుతుంది.
  3. ఆహారం కరగదు కావున, రుచిని గుర్తించలేము.

ప్రశ్న 14.
రుచిగ్రాహకాలు పనిచేయకపోతే మనం తీసుకొనే ఆహారంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది?
జవాబు:

  1. రుచిగ్రాహకాలు పనిచేయకపోతే, మనం ఆహారం రుచిని గుర్తించలేము.
  2. రుచిలేని ఆహారాన్ని ఇష్టముగా తినలేము.

10th Class Biology Textbook Page No. 159

ప్రశ్న 15.
నోట్లో యాంత్రికంగా ముక్కలు చేసే ప్రక్రియ ఎలా జరుగుతుంది?
జవాబు:
మన నోటిలో దవడల మీద నాలుగు రకాల దంతాలు ఉంటాయి. ఇవి ఆహారాన్ని ముక్కలు చేయటంతో పాటు చూర్ణం చేస్తాయి. ఈ ప్రక్రియలో ఆహారాన్ని దంతాల మధ్యకు చేర్చటానికి నాలుక సహాయపడుతుంది.

ప్రశ్న 16.
ఆహారాన్ని ముక్కలు చేయటానికి నోటిలోని ఏ భాగాలు తోడ్పడతాయి?
జవాబు:
ఆహారాన్ని ముక్కలు చేయటానికి 1. దంతాలు 2. నాలుక 3. లాలాజల గ్రంథులు తోడ్పడతాయి.

ప్రశ్న 17.
ఆహారాన్ని ముక్కలు చేయటంలో ఏయే వ్యవస్థలు ఈ ప్రక్రియలో భాగమవుతాయి?
జవాబు:
ఆహారాన్ని ముక్కలు చేయటంలో 1. జీర్ణవ్యవస్థ 2. కండర వ్యవస్థ (నాలుక, దంతాల కదలిక) 3. నాడీవ్యవస్థ (ఆదేశాలు) పాల్గొంటాయి.

10th Class Biology Textbook Page No. 160

ప్రశ్న 18.
నోటిలో ఆహారం ఉన్నప్పుడు లాలాజలం స్రవించే స్థాయి పెరుగుతుందా?
జవాబు:
నోటిలో ఆహారం ఉన్నప్పుడు లాలాజలం అధికంగా స్రవించబడుతుంది. దీనివలన ఆహారం బాగా నమలటంతోపాటు ‘ ‘బోలస్’ ఏర్పడటం సులభమౌతుంది.

ప్రశ్న 19.
లాలాజలం లేకుండా ఆహారం నమిలే ప్రక్రియ జరుగుతుందా?
జవాబు:
లాలాజల గ్రంథులు, దవడ మరియు నాలుక క్రిందనే ఉంటాయి. నమిలేటప్పుడు దవడ కదలిక వలన లాలాజలం అధికంగా స్రవించబడుతుంది. లాలాజలం లేకుండా ఆహారం నమిలే ప్రక్రియ జరగదు.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 20.
లాలాజలం నిర్వహించే ఇతర విధులు ఏమైనా ఉన్నాయా?
జవాబు:

  1. లాలాజలం ఎమైలేజ్ (టైలిన్) ఎంజైమ్ ను కలిగి ఉండి పిండి పదార్థాలను చక్కెరగా మార్చును.
  2. ఆహారం మెత్తగా నమలటంలో లాలాజలం తోడ్పడుతుంది.
  3. నమిలిన ఆహారం ముద్దగా (బోలస్) మారటానికి లాలాజలం అవసరం.
  4. ఆహారము ఆహారనాళంలో సులువుగా జారటానికి లాలాజలం తోడ్పడుతుంది.

10th Class Biology Textbook Page No. 161

ప్రశ్న 21.
ఆహారపదార్థపు ఉపరితల పరిమాణం పెరగటం వల్ల లాభం ఏమిటి?
జవాబు:
ఆహారపదారపు ఉపరితల పరిమాణం పెరగటం వలన, ఎంజైమ్స్ పని చేసే స్థలం పెరుగుతుంది. అందువలన ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.

ప్రశ్న 22.
ఆహారాన్ని నమలకుండా మింగితే ఏం జరుగుతుంది?
జవాబు:
ఆహారాన్ని నమలకుండా మింగితే, ఆహార పరిమాణం తగ్గి ఎంజైమ్స్ పని చేసే విస్తీర్ణం తగ్గుతుంది. అందువలన ఆహారం త్వరగా జీర్ణమవ్వదు.

ప్రశ్న 23.
లాలాజల ఎమైలేజ్ ఆహారంపై చర్య జరపటానికి మాధ్యమ స్వభావం ఎలా ఉండాలి?
జవాబు:
లాలాజలం ఎమైలేజ్ ఆహారంపై చర్య జరపటానికి మాధ్యమ స్వభావం క్షారయుతంగా ఉండాలి.

ప్రశ్న 24.
నోటిలో pH మారుతూ ఉంటుందని నీవు అభిప్రాయపడుతున్నావా?
జవాబు:
తినే ఆహార స్వభావం బట్టి, ఆహారం తినే సమయంలో నోటిలో pH మారుతూ ఉంటుంది.

ప్రశ్న 25.
నోటిలో జరిగే జీర్ణక్రియలో తోడ్పడే వివిధ వ్యవస్థలేవి?
జవాబు:
నోటిలో జరిగే జీర్ణక్రియలో కండర వ్యవస్థ, నాడీవ్యవస్థ కూడ పనిచేస్తాయి.

ప్రశ్న 26.
నోటిలోని జీర్ణప్రక్రియ తరువాత ఆహారం ఎక్కడికి వెళుతుంది?
జవాబు:
నోటిలోని జీర్ణక్రియ తరువాత ఆహారం ముద్దగా మార్చబడి ఆహారవాహికలోనికి నెట్టబడుతుంది. ఆహారవాహిక ద్వారా ఆహారం జీర్ణాశయం చేరుతుంది.

10th Class Biology Textbook Page No. 162

ప్రశ్న 27.
కింది రేఖాపటం ఆహారవాహిక యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక లక్షణాలను వివరిస్తుంది. పటాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 18
1. ఈ సమాచార రేఖాచిత్రం ఆహారవాహిక గురించి ఏమి తెలియజేస్తోంది?
జవాబు:
ఆహారవాహిక, పొడవైన గొట్టంవలె ఉండి, గ్రసని జీర్ణాశయాన్ని కలుపుతుంది. ఇది పెరిస్టాలసిస్ చలనం ద్వారా ఆహారాన్ని జీర్ణాశయం చేర్చుతుంది. ఇది స్థితిస్థాపక కండరాలను కలిగి, శ్లేష్మాన్ని స్రవిస్తుంది.

2. ఆహారవాహిక ఏ విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది?
జవాబు:
ఆహారవాహిక పొడవైన గొట్టం వంటి నిర్మాణం కలిగి ఉంది.

3. ఆహారవాహికలో ఆహారం ప్రయాణించడానికి శ్లేష్మసరం ఎలా ఉపయోగపడుతుంది?
జవాబు:
ఆహారవాహికలో శ్లేష్మం జారుడు పొరవలె పనిచేసి ఆహారాన్ని క్రిందకు జార్చుతుంది.

4. బంగాళాదుంపలు గొట్టం గుందా కదలడానికి నూనె ఎలా సహాయపడుతుంది?
జవాబు:
సూనె జారుడు పదార్థంగా పనిచేసి బంగాళదుంపలు క్రిందికి జారేలా చేస్తుంది.

10th Class Biology Textbook Page No. 163

ప్రశ్న 28.
ఆహారవాహికలో ఆహార ముద్ద స్థానంలో మార్పు ఎలా సంభవిస్తుంది?
జవాబు:
ఆహారవాహికలోని వలయ కండరాలు సంకోచం వలన ఆహార ముద్ద క్రిందకు జారుతుంది. ఇదే సందర్భంలో నిలువు కండరాల సడలింపు వలన ఆహారవాహిక మార్గం వెడల్పై ఆహారం సులువుగా క్రిందకు జారుతుంది.

ప్రశ్న 29.
బంగాళదుంప కదిలే ప్రయోగానికి, ఆహారవాహికలోని ఆహార చలనానికి మధ్య పోలికలు మీరు గమనించారా? అవి ఏమిటి?
జవాబు:
నెకిట్యూబ్ లో బంగాళదుంప కదలిక ఆహారవాహికలోని ఆహార ముద్ద కదలికను పోలి ఉంటుంది. ఈ ప్రక్రియలో సైకి ట్యూట్ ను ఆహారవాహికతోనూ, బంగాళదుంపను ఆహార ముద్దతోనూ, ట్యూబ్ కు రాసిన నూనెను, లాలాజలంతోనూ పోల్చవచ్చు.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 30.
ఆహారవాహికలో ఆహార బోలన్ సులభంగా కదలడానికి సహాయపదేదేమిటి?
జవాబు:
ఆహారవాహికలో ఆహారం సులభంగా కదలడానికి లాలాజలం సహాయపడుతుంది. ఇది ఆహారం సులువుగా జారటానికి తోడ్పడుతుంది.

ప్రశ్న 31.
సాధారణంగా ఆహారాన్ని నమలకుందా మింగకూడదని లేదా తొందరపడి త్వరత్వరగా తినవద్దని సలహాలిస్తుంటారు. ఎందుకని? ఆలోచించండి.
జవాబు:
ఆహారాన్ని నమలకుండా మింగటం వలన జీర్ణక్రియ ఎంజైమ్స్ సరిగా పనిచేయలేవు. అందువలన ఆహారం జీర్ణమవటం కష్టమవుతుంది. ఆహారాన్ని బాగా నమిలినపుడు లాలాజలం ఎక్కువగా చేరి జీర్ణక్రియకు తోడ్పడుతుంది. అందువలన తొందరపడి త్వరత్వరగా తినవద్దని సలహాలిస్తుంటారు.

10th Class Biology Textbook Page No. 164

ప్రశ్న 32.
ఆహారనాళం మాదిరిగా జీర్ణాశయం ఒక గొట్టంలా కాకుండా సంచిలా ఎందుకు నిర్మితమై ఉంది?
జవాబు:
ఆహారాన్ని నిల్వ చేయటం జీర్ణాశయం యొక్క ప్రధాన విధి. ఆహార నిల్వకు జీర్ణాశయ పరిమాణం పెద్దదిగా ఉండాలి. అందువలన జీర్ణాశయం గొట్టంలా కాకుండా సంచిలా ఉంది.

ప్రశ్న 38.
జీర్ణాశయంలో ఈ ప్రక్రియలు ఎలా జరుగుతాయి?
జవాబు:

  1. జీర్ణాశయంలో 3 నుండి 4 గంటల పాటు ఆహారం నిల్వ చేయబడుతుంది.
  2. నిల్వ చేయబడిన ఆహారం జీర్ణాశయ గోడలచే చిలకబడుతుంది.
  3. జీర్ణాశయ గోడలు స్రవించే జఠర రసం ఆహారాన్ని జీర్ణం చేస్తుంది.

ప్రశ్న 34.
జీర్ణాశయపు కండరాలు చర్య జరిపేలా ఉత్తేజపరిచే అంశం ఏమిటి?
జవాబు:
ఆహారం జీర్ణాశయాన్ని చేరినపుడు, జీర్ణాశయ గోడలు హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని స్రవిస్తుంది. దీనివలన నాడీవ్యవస్థ ఉత్తేజితమై, జీర్ణాశయ గోడలలో సంకోచ సడలికలు జరుపుతుంది.

ప్రశ్న 35.
కలుపుట మరియు చిలుకుట ప్రక్రియలను జీర్ణాశయం ఎందుకు నిర్వహిస్తుంది?
జవాబు:
జీర్ణాశయంలో ఆహారం కలపటం, చిలకటం వలన ఆహారం జీర్ణరసాలతో బాగా కలిసిపోయి, జీర్ణక్రియ సమర్ధవంతంగా జరుగుతుంది.

ప్రశ్న 36.
అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారం స్వల్ప మోతాదులో జీర్ణాశయం నుండి ఆంత్రమూలంలోనికి ఎందుకు చేరుతుంది?
జవాబు:

  1. జీర్ణాశయం తరువాత, ఆహారం తరువాత భాగమైన ఆంత్రమూలంలోనికి చేరుతుంది.
  2. ఆంత్రమూలం చిన్నదిగా ఉండే వంపు తిరిగిన భాగం.
  3. ఈ ప్రాంతంలో ముఖ్యమైన కాలేయం, క్లోమం వంటి జీర్ణ గ్రంథులు తమ జీర్ణరసాన్ని స్రవిస్తాయి.
  4. ఆంత్రమూలంలో ఆహారం పూర్తిగా జీర్ణం కావలసి ఉంటుంది.
  5. కావున జీర్ణాశయం నుండి స్వల్ప మోతాదులో ఆహారం ఆంత్రమూలంలోనికి చేరుతుంది.

10th Class Biology Textbook Page No. 165

ప్రశ్న 37.
పెరిస్టాల్ సిస్ చర్య జరగటంలో ఏ ఏ భాగాలు ఇమిడి ఉంటాయి?
జవాబు:
పెరిస్టాల్ సిస్ చర్య జరగటంలో వలయకండరాలు, నిలువు కండరాలు, ఏకాతరంగా సంకోచ సడలింపులు జరుపుతాయి.

ప్రశ్న 38.
పెరిస్టాల్సస్ ఏ దిశలో జరుగుతుంది? (ఆహారనాళంలోని ఏ చివర నుండి మొదలవుతుంది?)
జవాబు:
పెరిస్టాల్సస్ నోటివైపు నుండి క్రిందకు జీర్ణాశయం వైపు జరుగుతుంది.

ప్రశ్న 39.
పెరిస్టాలిసిస్ అపసవ్యదిశలో జరిగితే ఏమి జరుగుతుంది?
జవాబు:
పెరిస్టాల్సస్ అపసవ్యదిశలో జరిగితే, జీర్ణాశయంలోని ఆహారం బయటకు వస్తుంది. దీనినే ‘వాంతి’ అంటారు.

10th Class Biology Textbook Page No. 167

ప్రశ్న 40.
చిన్నప్రేగు ఎందుకు పొడవుగా మెలికలు తిరిగి చుట్టలా ఉంటుంది?
జవాబు:

  1. జీర్ణమైన ఆహారాన్ని రక్తంలోనికి పీల్చుకోవడాన్ని శోషణ అంటారు. ఇది చిన్న ప్రేగులో జరుగుతుంది.
  2. శోషణాతల వైశాల్యం పెంచటానికి అనువుగా చిన్నప్రేగు పొడవుగా మెలికలు తిరిగి ఉంటుంది.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 41.
చిన్నప్రేగులో శోషణ ఎలా జరుగుతుంది?
జవాబు:
చిన్న ప్రేగు గోడల లోపలి తలంలో వేల సంఖ్యలో వేళ్ళవంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని ఆంత్రచూషకాలు (villi) అంటారు. వీటిలో ఉండే రక్తనాళాలు, శోషనాళాలు జీర్ణమైన ఆహారాన్ని గ్రహిస్తాయి. దీనినే “శోషణ” అంటారు.

10th Class Biology Textbook Page No. 168

ప్రశ్న 42.
మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు విరేచనాలు కావటం లాంటి పరిస్థితులు మీరు అనుభవించే ఉంటారు. ఇది మనకు ఏమి తెలుపుతుంది?
జవాబు:

  1. మానసిక ఒత్తిడికి లోనైనపుడు విరోచనాలు కావటం మనం అనుభవించే ఉంటాము.
  2. దీనినిబట్టి నాడీవ్యవస్థ, జీర్ణవ్యవస్థ, అంతఃస్రావీ వ్యవస్థలు ఒక దానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయని చెప్పవచ్చు.

10th Class Biology Textbook Page No. 169

ప్రశ్న 43.
చిన్నప్రేగుల్లోంచి బయటకు ఏమి కదులుతుంది?
జవాబు:
జీర్ణమైన ఆహారం చిన్నప్రేగులలోకి పీల్చుకోబడుతుంది. మిగిలిన జీర్ణంకాని ఆహారం చిన్న ప్రేగు నుండి పెద్ద ప్రేగుకు చేరుతుంది. పెద్ద ప్రేగులో జీర్ణంకాని ఆహారం నుండి నీరు పీల్చుకోబడి మలం ఏర్పడుతుంది. ఇది మల విసర్జన ద్వారా శరీరం నుండి పాయువు ద్వారా బయటకు విసర్జించబడుతుంది.

ప్రశ్న 44.
వ్యర్థాల విసర్జన యొక్క రెండు ప్రధాన మార్గదర్శకాలు పైన చూపబడ్డాయి. రెండింటిలో కేవలం ప్రేగుల ద్వారా జరిగే ప్రక్రియ ఏది?
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 19
జవాబు:
జీర్ణంకాని ఆహారం మలం రూపంలో ప్రేగుల ద్వారా విసర్జింపబడుతుంది.

ప్రశ్న 45.
మల విసర్జనాన్ని శరీరంలోని ఏ భాగం నియంత్రిస్తుంది? ఈ చర్య నియంత్రితమా? అనియంత్రితమా? ఎందుకు?
జవాబు:

  1. మల విసర్జన పాయువు ద్వారా జరుగుతుంది. పాయువు రెండు సంవరిణీ కండరాలు (Anal sphincter) కలిగి మల విసర్జనను నియంత్రిస్తుంది. వీటిలో లోపలి సంవరిణీ కండరం అనియంత్రితంగాను, బాహ్య సంవరిణీ కండరం నియంత్రితంగాను పనిచేస్తుంది.
  2. నిర్ణీత స్థాయి వరకు మల విసర్జన నియంత్రిత చర్యగా ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇది పూర్తిగా అనియంత్రితంగా ఉండి పెరిగే కొలది, నియంత్రితంగా మారుతుంది.

10th Class Biology Textbook Page No. 170

ప్రశ్న 46.
ఆహారనాళంలో ఎక్కడైనా సంవరిణీ కండరాలు ఉన్నాయా? ఎక్కడ?
జవాబు:

  1. ఆహారనాళం ప్రారంభంలో గ్రసని వద్ద ఒక సంవరిణీ కండరం ఉంటుంది. ఆహారం మ్రింగడాన్ని ఇది నియంత్రిస్తుంది.
  2. జీర్ణాశయం, ఆంత్రమూలం మధ్యన ‘సంవరణీ కండరం’ ఉంటుంది. ఇది ఆంత్రమూలంలో ప్రవేశించే ఆహారాన్ని నియంత్రిస్తుంది.
  3. ఆహారనాళం చివరి భాగాన పురీషనాళం పాయు సంవరణీ కండరం కల్గి ఉంటుంది. ఇది మల విసర్జనను నియంత్రిస్తుంది.

ప్రశ్న 47.
ఒక వేళ వ్యక్తి తన శరీరానికి కావాల్సిన పరిమాణం కన్నా ఎక్కువ ద్రవాలను తీసుకున్నాడనుకుందాం. అప్పుడు ఎక్కువగా ఉన్న ద్రవం శరీరం నుండి ఏ విధంగా తొలగించబడుతుంది?
జవాబు:
ఎక్కువగా తీసుకొన్న నీరు చిన్నప్రేగు, పెద్దప్రేగు ద్వారా రక్తంలోనికి పీల్చుకొనబడుతుంది. ఈ నీరు మూత్రపిండాలను చేరినపుడు వడపోతకు గురై, అధికంగా ఉన్న నీరు రక్తం నుండి వేరు చేయబడుతుంది. ఈ నీరు మూత్రపిండాల నుండి మూత్రం రూపంలో విసర్జించబడుతుంది. అధికంగా నీరు త్రాగినపుడు మూత్రవిసర్జన కూడా అధికంగా ఉంటుంది.

ప్రశ్న 48.
జీవక్రియ ప్రక్రియలు సజావుగా సాగడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుండి సమకూరుస్తుంది?
జవాబు:
జీవక్రియలకు కావలసిన శక్తి శ్వాసక్రియ నుండి సమకూరుతుంది. ఆహారపదార్థాలను ఆక్సీకరణం చెందించి, శ్వాసక్రియ, మిగిలిన జీవక్రియలకు కావాల్సిన శక్తిని అందిస్తుంది.

ప్రశ్న 49.
ప్రేగుల నుండి రక్తంలోకి చేరిన జీర్ణమైన ఆహార పదార్థాలు ఏమవుతాయి?
జవాబు:
ప్రేగుల నుండి రక్తంలోకి చేరిన జీర్ణమైన ఆహారపదార్థాలు కణాలకు అందించబడతాయి. ఈ పదార్థాలు కణ శ్వాసక్రియ చెంది కణానికి కావలసిన శక్తిని అందిస్తాయి.

ప్రశ్న 50.
విడుదలైన శక్తి కణాలలో ఎక్కడ నిలవ ఉంటుంది?
జవాబు:
విడుదలైన శక్తి కణాలలో ATP (ఎడినోసిన్ ట్రై ఫాస్ఫేట్) రూపంలో నిలువ ఉంటుంది. దీనిని ఎనర్జీ కరెన్సీ అంటారు. కణం తన జీవక్రియల కొరకు దీనిని ఉపయోగించుకొంటుంది.

ప్రశ్న 51.
మన శరీరంలో ఎక్కువగా ఉన్న లవణాలను బయటకు పంపే వ్యవస్థ ఏది?
జవాబు:
శరీరంలో ఎక్కువగా ఉన్న లవణాలు రక్తంలో చేరి, మూత్రపిండాలలో వడపోతకులోనై వేరు చేయబడతాయి. ఇలా తొలగించిన లవణాలు మూత్రం రూపంలో విసర్జింపబడతాయి. మరికొన్ని లవణాలు స్వేదగ్రంథుల ద్వారా చెమట రూపంలో విసర్జింపబడతాయి.

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

ప్రశ్న 52.
శరీరం నుండి లవణాలు ఏ మార్గం ద్వారా బయటకు వస్తాయి?
జవాబు:
శరీరం నుండి లవణాలు, మూత్రం ద్వారా బయటకు వస్తాయి. మరికొన్ని చెమట రూపంలో విసర్జింపబడతాయి.

10th Class Biology 7th Lesson జీవక్రియలలో సమన్వయం Textbook Activities (కృత్యములు)

కృత్యం – 1

→ కింది పట్టికను పరిశీలించండి. మీ దృష్టిలో ఆకలి వేయడానికి గల కారణాలను (✓) తో గుర్తించండి. మీ స్నేహితులతో చర్చించండి.
పట్టిక
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 10

1. ఏ ఏ కారకాలు ఆకలిని ఉత్తేజపరుస్తాయి?
జవాబు:
వాసన, రుచి, అలసట, నీరసం, ఆహార అవసరం వంటి కారకాలు ఆకలిని ఉత్తేజపరిచాయి.

2. ఆకలవుతోందని తెలిసేలా చేసే ఉద్దీపనల వలన ఫలితమేమిటి?
జవాబు:
ఆకలి ఉద్దీపనాల ఫలితంగా మనకు ఆహారం తీసుకోవాలనే కోరిక కల్గుతుంది. జీర్ణాశయంలో జీర్ణ ఎంజైమ్స్ స్రవించబడతాయి.

3. మనకు ఆకలి కలుగుతోందని తెలియజేయడానికి ఏ వ్యవస్థ సంకేతాలను పంపుతుంది?
జవాబు:
ఆకలి సంకేతాలు మెదడుకు పంపటానికి 10వ కపాల నాడి (వేగస్ నాడి) తోడ్పడుతుంది. నాడీవ్యవస్థ ద్వారా ఆకలి సంకేతాలు మనకు తెలుస్తాయి.

కృత్యం – 2

→ జీలకర్ర, సోంపు, ఆలుగడ్డ మరియు ఆపిలను నమలడం

ముందుగా వేళ్ళతో ముక్కు మూసుకోండి. కొంచెం జీలకర్రను నోటిలో వేసుకొని కాసేపు నమలండి. తరువాత కొన్ని సోంపు గింజలు నమలండి. వాటి రుచిని గుర్తించగలిగారా? రుచిని గుర్తించడానికి ఎంత సమయం తీసుకుంది? తరవాత నోటిని శుభ్రంగా కడిగి ఒక చిన్న ఆపిల్ ముక్కను నమలండి. తరువాత ఆలుగడ్డ ముక్కల్ని తీసుకొని నమలండి. అయితే నమిలేటపుడు ముక్కును మూసి ఉంచడం మాత్రం మరిచిపోవద్దు.
→ నీవు పరిశీలించిన అంశాలేమిటి?
జవాబు:

  1. ముక్కు మూసుకొన్నప్పుడు జీలకర్ర, సోంపు గింజల రుచిని సరిగా గుర్తించలేకపోయాను.
  2. రుచిని గుర్తించటానికి ముక్కు మూసుకొన్నప్పుడు ఎక్కువ సమయం పట్టింది.
  3. ముక్కును తెరిచి బంగాళదుంప, ఆపిల్ ముక్కలను నమిలినపుడు త్వరగా రుచిని గుర్తించగలిగాను.
  4. దీనినిబట్టి రుచిని గుర్తించటంలో నాలుక పాత్ర కూడా ఉందని నిర్ధారించవచ్చు.
  5. పదార్థం యొక్క రుచి వాసన మీద కూడ ఆధారపడుతుందని భావించవచ్చు.

→ రెండు పదార్థాల రుచులు విడివిడిగా గుర్తించగలిగారా? లేదా రెండింటి రుచి ఒకేలా ఉందా? కారణమేమిటి?
జవాబు:
రెండు పదార్థాల రుచులు విడివిడిగా గుర్తించగలం. రెండింటి రుచి ఒకేలాలేదు. రెండు పదార్థాలు వేరు వేరు రుచులను కలిగి ఉంటాయి.

కృత్యం – 3

→ చిటికెడు ఇంగువ లేదా వెల్లుల్లి తీసుకొని చేతిరుమాలు లేదా టిష్యూ పేపర్‌పై రుద్దండి. కళ్ళు మూసుకొని వాసన చూడండి. మీ స్నేహితుల సహాయంతో వివిధ ఆహార పదార్థాలను రుచి చూడంది.
→ ఆపిల్ కన్నా అల్లం వాసన ఘాటుగా ఉంటుందా? ఘాటైన వాసనలు రుచి స్పందనలపై ప్రభావం చూపిస్తాయని మీరు భావిస్తున్నారా?
జవాబు:
ఆపిల్ కన్నా అల్లం వాసన ఘాటుగా ఉంది. ఘాటైన వాసనలు రుచి పైన ప్రభావం చూపుతాయని నేను భావిస్తున్నాను.

→ మీరు ఎన్ని రకాల ఆహార పదార్థాలను సరిగ్గా గుర్తించగలిగారు?
జవాబు:
నేను దాదాపు 10 రకాల ఆహార పదార్థాల వాసనను సరిగ్గా గుర్తించగలిగాను.

→ వాసన మరియు రుచికి ఏదైనా సంబంధం ఉందని గ్రహించారా? అవి ఏమిటో రాయండి. కేవలం చూడడం ద్వారా ఆహారం రుచిగా ఉందని చెప్పగలరా?
జవాబు:
వాసనకు రుచికి మధ్య దగ్గర సంబంధం ఉంది. మనం రుచిని వాసన ద్వారా మరియు నాలుకతో గుర్తించగలము. కేవలం చూడటం ద్వారా ఆహారం రుచిగా ఉందని చెప్పలేము.

కృత్యం – 4 : నాలుక మీద చక్కెర గుళికలు

→ నాలుక పొడిగా ఉన్నపుడు రుచి తెలుస్తుందా?
జవాబు:
నాలుక పొడిగా ఉన్నప్పుడు రుచి తెలియలేదు.

→ ఏ విధానం త్వరగా రుచిని గ్రహించడంలో తోడ్పడింది? ఎందుకు?
జవాబు:
నాలుకను అంగిలితో నొక్కిపెట్టినపుడు రుచి త్వరగా గ్రహించబడినది. నాలుకను అంగిలి నొక్కినపుడు, ద్రవ ఆహారం, నాలుక మీద ఉన్న రుచి మొగ్గలలోనికి ప్రవేశించటం వలన రుచిని త్వరగా గుర్తించగల్గుతాము.

కృత్యం – 5

వెనిగర్లో ఉంచిన చాక్స్ ప్రయోగం ద్వారా మనం ఆహారాన్ని ఎందుకు నమలాలి? ఆహారం ఎలా విచ్చిన్నమవుతుందో తెలుసుకుందాం.

ఒక చాక్బస్ ముక్కను రెండు ముక్కలుగా చేయండి. ఒక ముక్కను చాలా చిన్న చిన్న ముక్కలుగా చేయండి. మరొక ముక్కను అలాగే ఉంచండి. రెండు బీకర్లు తీసుకోండి. లేదా రెండు మినరల్ వాటర్ బాటిళ్ళు తీసుకొని, పై భాగాన్ని కత్తిరించండి. ఇప్పుడు కింద మిగిలిన భాగాలను బీకర్లుగా ఉపయోగించుకోవచ్చు.

రెండు బీకర్లను సగం వరకు వెనిగర్ నింపండి. ఒక దానిలో చిన్న చిన్న ముక్కలుగా పొడిచేసిన చాక్సనను, మరొక దానిలో మిగిలిన చాక్బసన్ను వేయండి. మీ అమరికను కదపకుండా ఉంచండి. గంట తరువాత బీకర్లను పరిశీలించండి.
1. ఏ బీకరులోని చాక్బస్ త్వరగా కరిగింది? ముక్కలు చేసిన చాక్బస్ భాగమా? లేదా పూర్తిగా ఉన్న చాక్బస్ భాగమా?
జవాబు:
ముక్కలు చేసిన చాక్ పీస్ భాగం పూర్తిగా కరిగింది. చాక్ పీస్ ముక్కలు కావటం వలన వెనిగర్ దానిని త్వరగా కరిగించుకుంది.

కృత్యం – 6

దవడలో దంతాల అమరికను తెలిపే నమూనా లేదా పటాన్ని లేదా మీ స్నేహితుని నోటిలో గమనించండి. దంతాలన్నీ ఆకారం మరియు పరిమాణంలో ఒకేలా ఉన్నాయా? వాటి ఆకారానికి నిర్వహించే పనికి ఏదైనా సంబంధం ఉందా? దంత సూత్రం, దంతాల అమరిక విధానాన్ని వివరిస్తుంది. ఇచ్చిన పటం ఆధారంగా చర్వణకాలు ఏ పనులు నిర్వహిస్తాయో ఆలోచించండి. మీరు కింది తరగతులలో కుంతకాలు పదునైన అంచులు కలిగి ఉంటాయని రదనికలు కూసుగా ఉంటాయని చర్వణకాలు, అగ్ర చర్వణకాలు చదునుగా ఉంటాయని నేర్చుకున్నారు కదా!
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 11
1. కుంతకాలు ఏ విధంగా ఉపయోగపడతాయని మీరు భావిస్తున్నారు?
జవాబు:
కుంతకాలు ఆహారాన్ని కొరకటానికి తోడ్పడతాయి.

2. ఆహారాన్ని మెత్తగా నూరడానికి పనికివచ్చే దంతాలు ఏవి?
జవాబు:
ఆహారాన్ని మెత్తగా నూరడానికి, అగ్రచర్వణకాలు, చర్వణకాలు తోడ్పడతాయి.

3. ఆహారాన్ని చీల్చడానికి పనికివచ్చే దంతాలు ఏవి?
జవాబు:
ఆహారాన్ని చీల్చడానికి రదనికలు తోడ్పడతాయి.

4. దంత సూత్రం అంటే ఏమిటి? మీ దంత సూత్రాన్ని రాయండి.
జవాబు:
నోటిలో దంత రకాలను, వాటి సంఖ్యను, అమరికను తెలిపే సూత్రాన్ని దంత సూత్రం అంటారు.
మానవుని దంత సూతం : 2013
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 12

పటం ఆధారంగా కింది పట్టికను పూరించండి.
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 13

కృత్యం – 7 పిండిపై లాలాజలం యొక్క చర్య

ఒక పరీక్షనాళికను తీసుకొని సగం వరకు నీటితో నింపండి. దానికి చిటికెడు పిండి కలపండి. పిండి నీటిలో బాగా కలిసే వరకు పరీక్షనాళికను కదిలించండి. కొన్ని చుక్కల పిండి మిశ్రమాన్ని ఒక వాగ్లాస్లో తీసుకోండి. కొన్ని చుక్కల టింక్చర్ అయోడిన్ కలిపి పిండిపదార్థ పరీక్ష చేయండి. దానిలో ఏర్పడే నీలి – నలుపురంగు పిండి పదార్థాన్ని ధృవపరుస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా చేయండి. రెండు పరీక్షనాళికల్లో ద్రావణం సమానంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఒక పరీక్షనాళికలో ఒక టీ స్పూను లాలాజలం కలపండి. రెండవ పరీక్షనాళికలో ఏమీ కలపకుండా ఉంచండి. 45 నిముషాల తరువాత ఒక చుక్క సజల టింక్చర్ అయోడిన్ ద్రావణం పరీక్షనాళికల్లో కలపండి.

1. ద్రావణంలో ఏమైనా మార్పులు గమనించారా? ఈ మార్పు ఎందుకు జరిగింది?
జవాబు:
లాలాజలం కలిపిన పిండి ద్రావణానికి టింక్చర్ అయోడిన్ కలిపినపుడు అది నీలి రంగుకు మారలేదు. అంటే పిండి. పదార్థం లాలాజలంగా మార్చబడినది.

2. నోటిలో ఆహారం తీసుకున్నప్పుడు కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుందా?
జవాబు:
నోటిలో ఆహారం తీసుకొన్నప్పుడు లాలాజలం పిండి పదార్థంపై చర్యజరిపి దాని రూపాన్ని (చక్కెరగా) మారుస్తుందని నిర్ధారించవచ్చు.

కృత్యం – 8

గంట విరామంలో నోటిలోని pH ను పరీక్షించుట :

మీ రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడిని అడిగి ఒక pH కాగితాన్ని రంగుపట్టికతో సహా తీసుకోండి. (పటం చూడండి). ఒక చిన్న pH పేపర్ ముక్కను తీసుకొని నాలుకపై తాకించండి. దానిపైన ఏర్పడిన రంగును రంగుపట్టికలో జతచేసి చూడండి. pH విలువను గుర్తించండి. మధ్యాహ్న భోజనం తరువాత pH పేపరును నాలుక మీద ఉంచి పరీక్షించండి. మీ పరిశీలనలను నమోదు చేయండి. మీ పరిశీలనలను మీ స్నేహితుని పరిశీలనలతో పోల్చి చూడండి. కనీసం నాలుగు pH రీడింగులను గుర్తించండి.
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 14
1. నోటిలోని సాధారణ స్థాయి pH విలువ ఎంత? ఇది ఆమ్లయుతమా? క్షారయుతమా?
జవాబు:
నోటిలో సాధారణ స్థాయి pH విలువ 9 ఉన్నది. ఇది క్షారము.

2. pH లో ఏవైనా మార్పులు గమనించారా? ఆ మార్పు ఎలా వచ్చింది?
జవాబు:
భోజనం తరువాత pH విలువ వేరుగా ఉంది. pH విలువ 11 వరకు ఉంది. భోజనం చేయునపుడు అధిక లాలాజలం స్రవించబడుతుంది. కావున నోటిలో pH విలువ పెరుగుతుంది.

3. ఎలాంటి pH లో ‘లాలాజల ఎమైలేజ్’ బాగా చర్య జరపగలదు?
జవాబు:
లాలాజలంలో ‘ఎమైలేజ్’ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది క్షార మాధ్యమంలో బాగా పనిచేస్తుంది.

4. వివిధ రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు నోటిలోని pH ఎలాంటి పాత్ర పోషిస్తుంది?
జవాబు:
వివిధ రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు నోటిలోనికి లాలాజలం స్రవించబడుతుంది. ఈ లాలాజలం ఆహారాన్ని క్షార మాధ్యమంలోకి మార్చడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా వివిధ రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు pH విలువ పెరగటం లేదా తగ్గటం జరుగుతుంది.

కృత్యం – 9

ఆహారవాహికలో ఆహారం (Food bolus) ఎలా ప్రయాణిస్తుందో గమనిద్దాం!
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 15

ఒక పాత సైకిల్ ట్యూబ్ ముక్కను తీసుకోండి. గొట్టం లోపలి భాగాన్ని నూనెతో పూత పూయండి. అలాగే రెండు బంగాళదుంపల్ని తీసుకొని శుభ్రంగా కడిగి, పొడిగా తుడిచి నూనెతో పూత పూయండి. తరువాత బంగాళదుంపలను సైకిలు ట్యూబ్లో ప్రవేశపెట్టండి. సెకీల్ ట్యూబ్ లో | గొట్టాన్ని పిసుకుతూ బంగాళదుంపను గొట్టంలో కదిలే లాగా చేయండి. బంగాళాదుంపలు బంగాళదుంప ల గొట్టంలో కదులుతున్న విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించంది.
1. గొట్టం గుండా బంగాళాదుంపలు కదలడానికి ఎలా నొక్కాలి? నూనె ఎలా పనిచేస్తుంది?
జవాబు:
గొట్టం గుండా బంగాళదుంపలు కదలడానికి దుంప పై భాగాన నొక్కాలి. నూనె జారుడు పదార్థంగా పనిచేసి బంగాళ దుంప క్రిందకు జారుతుంది.

2. ఆహారవాహికలో ఉండే కండరాలు కూడా ఆహారాన్ని కిందికి నెట్టడానికి ఇదే విధంగా పనిచేస్తాయా?
జవాబు:
ఆహారవాహికలో కండరాలు కూడా ఆహారం మీద ఇలానే పనిచేసి ఆహారాన్ని క్రిందకు నెడతాయి. బోలకు పైభాగాన వలయ కండరాలు క్రింది భాగాన నిలువు కండరాలు ఏకాంతరంగా పనిచేస్తాయి.

కృత్యం – 10

పేపర్ గొట్టం మరియు మడిచిన కాగితాలు:

10 × 20 సెం.మీ. కొలతలు గల ఒక చార్టు పేపరును తీసుకోండి. దానిని మడిచి రెండు చివరలు అంటించి గొట్టంలా చేయండి. ఇప్పుడూ 20 × 20 సెం.మీ. కొలతలు గల మరొక చార్లు పేపరు తీసుకోండి. దానిని కూడా పైన చెప్పినట్టుగా గొట్టంలా తయారుచేయండి. దానిని మొదటి గొట్టంలో దూర్చండి. దూర్చగలిగారా?
జవాబు:
లేదు.

ఇప్పుడు 20 × 20 సెం.మీ. కొలతలు గల మరొక పేపరును తీసుకోండి. దానిని పటంలో చూపినట్లు వీలైనన్ని మడతలు మడవండి. రెండు చివరలను అంటించి గొట్టంలా చేయండి. మీ మదతల గొట్టం తయారైందన్నమాట. దానిని మొదటి గొట్టంలో దూర్చండి. దూర్చగలిగారా?
జవాబు:
ఔను
AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం 16

1. రెండు గొట్టాలకు ఉపయోగించిన కాగితాల వైశాల్యాన్ని పోల్చి చూడండి. వైశాల్యంలో తేడా కనిపించిందా? ఒకవేళ పెరిగినట్లు గమనిస్తే కారణాలు తెలుసుకోండి.
జవాబు:
రెండు గొట్టాలకు ఉపయోగించిన కాగితాల వైశాల్యాన్ని పోల్చి చూశాము. రెండవ గొట్టం (20 × 20) మొదటి గొట్టం (10 × 20) కంటే ఎక్కువ వైశాల్యం కలిగి ఉంది.

కారణం :
రెండవ గొట్టం, ఎక్కువ వైశాల్యం కలిగి ఉండటానికి కారణం అది అనేక మడతలు పడి ఉంది. ఈ మడతల వలన ఎక్కువ వైశాల్యం కలిగిన కాగితం తక్కువ స్థలంలో అమరింది. జీర్ణవ్యవస్థలో చిన్నప్రేగు కూడ ఇలానే అమరి ఉంటుంది.

ప్రయోగశాల కృత్యం

కాగితపు గొట్టం ఆమ్లం మరియు పత్ర ప్రయోగం:
14 మార్కులు -మీ ఐడి తోట నుండి రెండు ఆకుపచ్చని పత్రాలు సేకరించండి. ఒక పత్రానికి పెట్రోలియం జెల్లీ లేదా వాజ్ లీస్ పూయంది. మరొకదాన్ని అలాగే వదిలేయండి. 1 లేదా 2 చుక్కల బలహీన ఆమ్లాన్ని రెండు పత్రాలపై వేయండి. అరగంట తరవాత పత్రాలను పరిశీలించండి. మీ పరిశీలనలను మీ నోట్ బుక్ లో రాయండి.
1. పత్రాలలో ఎలాంటి మార్పులు గమనించారు?
జవాబు:
ఒక పత్రం పాడైపోయింది.

2. ఏ పత్రంలో మార్పులు గమనించారు? ఏ పత్రంలో మార్పు జరగలేదు. కారణాలేమిటి?
జవాబు:
వాజ్ లీన్ పూసిన పత్రం ఆమ్ల ప్రభావానికి లోనుకాకుండా తాజాగా ఉంది. వాజ్ లీన్ పూయని పత్రం ఆమ్ల ప్రభావానికి దెబ్బతిన్నది.

3. ఆమ్ల ప్రభావం నుంచి ఆకును రక్షించినదేమిటి?
జవాబు:
ఆమ్ల ప్రభావం నుంచి వాజ్ లీన్ ఆకును రక్షించినది.

కింది ఖాళీలను పూరించండి

1. మన దంతాల అమరిక నిష్పత్తి 3:2:1:2 అయితే దీనిలో 1 దేనిని సూచిస్తుందంటే ……….. (అగ్రచర్వణకాలు)
2. మాంసకృత్తుల దీర్ఘ శృంఖలాలు జీర్ణవ్యవస్థ …………. భాగంలో విచ్చిన్నం చేయబడతాయి. (ఆంత్రమూలం)
3. జీర్ణక్రియలో స్రవించబడే బలమైన ఆమ్లం (HCI) ……………….. లో ఉండే ఝణ గ్రాహికలు మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి. (ముక్కు)
5. లాలాజలం యొక్క pH స్వభావం …………….. (క్షారస్వభావం)
6. కింది పేరా చదవండి.సరైన పదాలతో ఖాళీలు పూరించండి.
(1) …………….. హార్మోన్ స్థాయిలో హెచ్చుతగ్గుల ఫలితంగా ఆకలిలో భేదాలు మరియు ఆహార పదార్థాల వినియోగం ఆధారపడి ఉంటాయి. జీర్ణాశయం నిండి ఉన్న భావన ఉంటే మరి ఆహారం తీసుకోవాలని అనిపించదు. మరొక హార్మోన్. (2) ………… స్రవించబడితే ఆకలిని తగ్గించివేస్తుంది. మనం ఆహారాన్ని తీసుకొన్నప్పుడు నోటిలో చక్కగా నమలటం జరుగుతుంది. దీనికొరకు (3) ………. కండరాలు నమిలే ప్రక్రియకు తోడ్పడతాయి. అయితే (4) … దవడల కండరాలు, దవడలు పైకి, కిందకు ముందుకు, వెనుకకు కదలడానికి లేదా నమలడానికి (enteric nervous system) తోడ్పడతాయి. (5) ……………….. నాడులు దవడల కండరాల కదలికలను నియంత్రిస్తాయి. (6) ………….. నాడీవ్యవస్థ కారణంగా లాలాజలం ఉత్పత్తికావటం, లాలాజలంతో ఆహారాన్ని కలపటం, నమలటం మరియు సులువుగా మింగడం జరుగుతాయి. లాలాజలంలోని (7) …………..పిండిపదార్థాలను చక్కెరలుగా మార్చును. దాని ఫలితంగా ఆహారాన్ని నమలడం మరియు మింగడం వలన ఆహారవాహిక చేరటం (8) …………. మరియు (9) …………… వలన నియంత్రించబడతాయి. నాలుక రుచిగ్రాహకం కనుక రుచిని గ్రహించుటలో (10) …….. నాడి ముఖ్యమైనది.
జవాబు:
(1) లెఫ్టిన్, గ్రీలిన్, గాస్ట్రిన్, సిక్రిటిన్ (గ్రీలిన్)
(2) గ్రీలిన్, లెఫ్టిన్, సెక్రిటిన్, గాస్ట్రిన్ (లెప్టిన్)
(3) అంతర్గత కండరాలు, ఉపరితల కండరాలు, వలయకండరాలు, నిలువు కండరాలు. (ఉపరితల కండరాలు)
(4) ఉపరితల కండరాలు, అంతర్గత కండరాలు, మెడ కండరాలు, పొడవైన కండరాలు (అంతర్గత కండరాలు)
(5) 5వ కపాలనాడి, 2వ కపాలనాడి, 5వ ముఖనాడి, వెన్నునాడి (5వ కపాలనాడి)
(6) కేంద్రనాడీ వ్యవస్థ, ఉపరితల నాడీవ్యవస్థ, స్వతంత్ర నాడీ వ్యవస్థ (స్వతంత్ర నాడీ వ్యవస్థ)
(7) లైపేజ్, సుక్రేజ్, గాలక్రేజ్, అమైలేజ్ (అమైలేజ్)
(8) మెడుల్లా అబ్లాంగేటా, సెరిబ్రమ్, 8వ వెన్నునాడీ, కపాలనాడీ, 7వ కపాలనాడీ (మెడుల్లా అబ్లాంగేటా)
(9) మెదడు కాండం, మెడుల్లా అబ్లాంగేటా, మధ్యమెదడు, పాన్స్వెపోలి (మెదడుకాండం)
(10) 6వ కపాలనాడి, 5వ కపాలనాడి, 10వ కపాలనాడి, దృక్నడి (5వ కపాలనాడి)

సరైన సమాధానాన్ని గుర్తించండి

1. కింది ఏ సందర్భంలో అతిత్వరగా రుచి చూడగలుగుతావు?
A) నాలుకపై చక్కెర వేసుకొన్నపుడు
B) నాలుకపై చక్కెర ద్రావణాన్ని పోసినపుడు
C) నాలుకతో అంగిలి నొక్కిపట్టినపుడు
D) నమలకుండా, కదపకుండా వెంటనే మింగినపుడు
జవాబు:
C) నాలుకతో అంగిలి నొక్కిపట్టినపుడు

2. పెరిస్టాల్ సిస్ చలనం ఎందుకంటే
A) నిలువు కండరాల సంకోచం వలన
B) వలయం కండరాల సంకోచం వలన
C) స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణ వలన
D) జీర్ణరసాల ప్రభావం వలన
జవాబు:
C) స్వయంచోదిత నాడీవ్యవస్థ నియంత్రణ వలన

3. జీర్ణాశయం, ఆంత్రమూలంలోనికి తెరచుకునే చోట ఉండే సంవరిణీ కండరం
A) కార్డియాక్
B) పైలోరిక్
C) ఆనల్
D) గ్యాస్ట్రిక్
జవాబు:
B) పైలోరిక్

4. ఆంత్రచూషకాలలోని ఏ భాగం ద్వారా గ్లూకోజ్ మరియు అమైనో ఆమ్లాల శోషణ జరుగును?
A) ఎపిథీలియల్ కణాలు
B) రక్తకేశనాళికలు
C) శోషరస నాళాలు
D) పైవన్నీ
జవాబు:
D) పైవన్నీ

5. ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం
A) మెడుల్లా
B) డైయన్సె ఫలాన్
C) సెరిబ్రమ్
D) మధ్య మెదడు
జవాబు:
B) డైయన్సె ఫలాన్

AP Board 10th Class Biology Solutions 7th Lesson జీవక్రియలలో సమన్వయం

6. మానవులు “అంతర్గత దహన యంత్రం” వంటివారు. ఎందుకంటే
A) ఆహారపదార్థాలు జీర్ణమై శక్తి విడుదలవుతుంది
B) శ్వాసక్రియ ద్వారా CO2 వెలువరిస్తారు
C) జీర్ణక్రియ చివరి దశలో వ్యర్థాలను విసర్జిస్తారు
D) శక్తివంతమైన జీర్ణరసాలను స్రవిస్తాయి
జవాబు:
A) ఆహారపదార్థాలు జీర్ణమై శక్తి విడుదలవుతుంది