SCERT AP 10th Class Physical Science Guide 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Physical Science 12th Lesson Questions and Answers కార్బన్ – దాని సమ్మేళనాలు
10th Class Physical Science 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
ఒక సాధారణ హైడ్రోకార్బన్ పేరు చెప్పండి. (AS1)
జవాబు:
సాధారణ హైడ్రోకార్బన్ మీథేన్ (CH4).
ప్రశ్న 2.
ఆల్కేన్లు, ఆల్కీన్లు, ఆల్కైల సాధారణ అణు ఫార్ములా ఏమిటి? (AS1)
జవాబు:
ఆల్కేనులు, ఆల్కీనులు, ఆల్కెనుల సాధారణ అణు సాంకేతికములు :
- ఆల్కేనులు – CnH2n+2
- ఆల్కీనులు – CnH2n
- ఆల్కైనులు – CnH2n-2
ప్రశ్న 3.
ఇథనాలను గాలిలో దహనం చేసినపుడు నీరుతో పాటుగా ఏర్పడే ఇతర ఉత్పన్నమేమిటి? (AS1)
(లేదా)
ఇథనాలను గాలిలో మండించినపుడు నీటితో పాటుగా విడుదలగు వాయువు ఏది?
జవాబు:
ఇథనాల్ ను గాలిలో మండించినపుడు నీటితో పాటు ఏర్పడే మరొక ఉత్పన్నం కార్బన్ డై ఆక్సైడ్ (CO2).
ప్రశ్న 4.
ఈ క్రింది సమ్మేళనాల యొక్క IUPAC పేర్లు రాయండి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ సమ్మేళనాలు వస్తే వాటి అన్నిటి పేర్లను రాయండి. (AS1)
i) ఈథేన్ నుండి ఏర్పడిన ఆల్డిహైడ్
ii) బ్యూటేన్ నుండి పొందిన కీటోన్
iii) ప్రొపేన్ నుండి ఏర్పడిన క్లోరైడ్
iv) పెంటేన్ నుండి ఏర్పడిన ఆల్కహాల్
జవాబు:
i) ఈథేన్ నుంచి ఏర్పడిన ఆల్డిహైడ్ ఇథనాల్ (CH3CHO).
ii) బ్యూటేన్ నుండి పొందిన కీటోన్ బ్యూటనోన్ లేదా బ్యూటాన్-2 – ఓన్ (CH3COCH2CH3).
iii) ప్రొపేన్ నుండి ఏర్పడిన క్లోరైడ్ 2 రకాలు :
iv) పెంటేస్ నుంచి వచ్చే ఆల్కహాలు మూడు రకాలు. అవి :
1) 1 – పెంటనోల్ : CH3CH2CH2CH2CH2OH
2) 2 – పెంటనోల్ : CH3CH2CH2CH (OH) CH3 లేదా పెంటాన్- 2 – ఓల్
3) 3 – పెంటనోల్ లేదా పెంటాస్ – 3 – ఓల్. CH3CH2CH (OH) CH2CH3
ప్రశ్న 5.
ఒక సాధారణ కీటోన్ పేర్కొని, దాని అణుఫార్ములా రాయండి. (AS1)
(లేదా)
ఏదైనా సాధారణ కీటోన్ ను ఉదహరించి, దాని అణుఫార్ములాను వ్రాయుము.
జవాబు:
సాధారణ కీటోన్ : డై మిథైల్ కీటోన్ లేదా ప్రొపనోన్.
దీని ఫార్ములా : CH3COCH3.
ప్రశ్న 6.
కార్బన్ పరమాణువు మరొక కార్బన్ పరమాణువుతో కలిసి బంధాలనేర్పరచుకునే ధర్మాన్ని ఏమంటారు? (AS1)
జవాబు:
కర్బన పరమాణువులు ఒకదానితో మరొకటి స్వయంగా కలిసి, గొలుసు వంటి పెద్ద అణువును ఏర్పరచే ధర్మాన్ని కాటనేషన్ లేక శృంఖల ధర్మం అంటారు.
ప్రశ్న 7.
ఇథనోలను 443Kల వద్ద గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం (H2SO4)తో కలిపి వేడిచేయుట వలన ఏర్పడే సమ్మేళనం పేరు ఏమిటి? (AS1)
జవాబు:
ఇథనోలను 443K వద్ద అధిక గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపితే నిర్జలీకరణ చర్య జరిగి ఇథిలీన్ లేదా ఈథేన్ ఏర్పడుతుంది.
ప్రశ్న 8.
ఎస్టరిఫికేషన్ చర్యకు ఒక ఉదాహరణ ఇవ్వండి. (AS1)
(లేదా)
ఎస్టరీకరణముపై లఘు వ్యాఖ్య వ్రాయుము.
జవాబు:
కార్బాక్సిలిక్ ఆమ్లం, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో ఆల్కహాల్ తో చర్య జరిపి తియ్యని వాసన గల ఎస్టర్ అనే సమ్మేళనాన్ని ఏర్పరచే చర్యను ఎస్టరీకరణ చర్య అంటారు.
ఉదా :
ఎసిటిక్ ఆమ్లం (ఇథనోయిక్ ఆమ్లం) గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లం సమక్షంలో ఇథైల్ ఆల్కహాల్ (ఇథనోల్) తో చర్య జరిపి ఇథైల్ ఎసిటేట్ (ఇథైల్ ఇథియోనేట్) ను ఏర్పరుస్తుంది.
ప్రశ్న 9.
ఈథేన్ నుండి ఇథనాల్ ను తయారుచేసే చర్యను చూపే రసాయన సమీకరణాన్ని రాయండి. (AS1)
(లేదా)
ఇథనాలను, ఈథేన్ నుండి తయారుచేయుటను సూచించు రసాయన సమీకరణమును వ్రాయుము.
జవాబు:
ఈథేన్ ను గాలి లేకుండా వేడిచేస్తే ఈ థీన్ లేక ఇథిలీన్ ఏర్పడుతుంది. దీనిని P2O5 లేక టంగ్స్టన్ ఆక్సెడ్ ఉత్ర్పేరక సమక్షంలో అధిక ఉష్ణోగ్రత పీడనాలకు గురిచేసి నీటిఆవిరితో చర్య జరపడం ద్వారా ఇథనోల్ ఏర్పడుతుంది.
ప్రశ్న 10.
కర్బన సమ్మేళనాల సమజాత శ్రేణులను నిర్వచించండి. సమజాత శ్రేణుల ఏవేని రెండు లక్షణాలను తెల్పండి. (AS1)
జవాబు:
ఒకే ప్రమేయ సమూహాలున్న కర్బన సమ్మేళనాలను సమజాతీయ శ్రేణులు అంటారు.
ఉదా : ఆల్కేనులు, ఆల్కీనులు, ఆల్కెనులు, హాలో ఆల్కేనులు మొదలైనవి.
లక్షణాలు :
- ఇవి ఒకే సాధారణ ఫార్ములా కలిగి ఉంటాయి.
ఉదా : ఆల్కేనుల సాధారణ ఫార్ములా CnH2n+2 - వరుస సమ్మేళనాల మధ్య తేడా -CH2 ఉంటుంది.
- ఒకే ప్రమేయ సమూహాన్ని కలిగి ఉండటం వలన ఒకే రసాయన ధర్మాలు కలిగి ఉంటాయి.
- భౌతిక ధర్మాలలో ఒక క్రమపద్ధతిలో పెరుగుదల కనబడుతుంది.
ప్రశ్న 11.
క్రింది ప్రమేయ సమూహాల పేర్లను రాయండి. (AS1)
(a) -CHO (b) -C=0
(లేదా)
ఇవ్వబడిన ప్రమేయ సమూహాలను కలిగి ఉన్న కర్బన సమ్మేళనాలను ఉదహరించుము.
జవాబు:
a) -CHO ప్రమేయ సమూహం పేర్లు ఆల్డిహైడ్.
b) – C = O ప్రమేయ సమూహం పేరు కీటోన్.
ప్రశ్న 12.
కార్బన్ ప్రధానంగా సమయోజనీయ బంధాలను ఎందుకు ఏర్పరుస్తుంది? (AS1)
జవాబు:
- కార్బన్ నవీన ఆవర్తన పట్టికలోని IVA లేదా 14వ గ్రూప్ కు చెందిన మూలకం.
- కార్బన్ C6 యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం 1s²2s²2p². ఇది ‘తన సమీప జడవాయువైన నియాన్ విన్యాసం పొందుటకు 4 ఎలక్ట్రానులు స్వీకరించాలి లేదా హీలియం విన్యాసం పొందుటకు 4 ఎలక్ట్రానులను కోల్పోవాలి.
- కార్బన్ కేంద్రకంలో 6 ప్రోటానులు ఉంటాయి. కాబట్టి అదనంగా 4 ఎలక్ట్రానులను స్వీకరిస్తే 6 ప్రోటానులు, 10 ఎలక్ట్రానులను బంధించవలసి వస్తుంది. కాబట్టి C4- సాధారణంగా ఏర్పడదు.
- ఇదే విధంగా 4 ఎలక్ట్రానులను కోల్పోతే C4+ అయాన్ ఏర్పడుతుంది. ఇలా ఏర్పడుటకు అధిక మోతాదులో శక్తి అవసరం. కాబట్టి ఇది కూడా దాదాపుగా ఏర్పడదు.
- కాబట్టి కార్బన్ తన చతుస్సంయోజకతను ఎలక్ట్రాన్ జంటను పంచుకోవడం ద్వారా సంతృప్తపరుచుకోవాలి.
- కాబట్టి కార్బన్ ఇతర కార్బన్ పరమాణువులతోకాని, ఇతర మూలకాల పరమాణువులతో కాని నాలుగు సంయోజనీయ బంధాలు ఏర్పరుస్తుంది.
ప్రశ్న 13.
ఇథనోల్ నుండి సోడియం ఇథాక్సెడ్ ఎలా తయారుచేయబడుతుంది? రసాయన సమీకరణంతో వివరించండి. (AS1)
జవాబు:
ఇథనోల్, సోడియం లోహంతో చర్య జరిపి సోడియం ఇథాక్సెడ్ ను ఏర్పరుస్తుంది. ఈ చర్యలో హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది.
ప్రశ్న 14.
ఇథనాల్ నుంచి ఇథనోయిక్ ఆమ్లం ఏ విధంగా ఏర్పడుతుందో రసాయన సమీకరణము ద్వారా వర్ణించండి. (AS1)
జవాబు:
క్షారీకృత పొటాషియం పర్మాంగనేట్ లేదా ఆఫీకృత పొటాషియం డై క్రోమేట్ సమక్షంలో ఆల్కహాలు ఆక్సీకరణానికి గురి అయ్యి కార్బాక్సిలిక్ ఆమ్లములను ఏర్పరుస్తాయి.
ఉదాహరణకు ఇథనాల్ లేదా ఇథైల్ ఆల్కహాల్ ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ లేదా ఆమీకృత పొటాషియం డై క్రోమేట్ నుంచి ఆక్సిజన్‌ను గ్రహించి, ఆక్సీకరణ ప్రక్రియ ద్వారా ఇథనోయిక్ ఆమ్లం లేదా ఎసిటిక్ ఆమ్లంను ఏర్పరుస్తుంది.
ప్రశ్న 15.
సబ్బు యొక్క శుభ్రపరిచే చర్యను వివరించండి. (AS1)
(లేదా)
బట్టలను శుభ్రపరచుటలో సబ్బు యొక్క పనితీరును వివరించుము.
(లేదా)
బట్టలను సబ్బుతో శుభ్రపరచే క్రమములో మిసిలి యొక్క పాత్రను పట సహాయంతో వివరించుము.
జవాబు:
1) సబ్బులు, డిటర్జెంట్లు బట్టలలో ఉన్న నూనె మరియు మలినాలను నీటిలోకి వచ్చేటట్లు చేస్తాయి. దానివలన బట్టలు శుభ్రపరచబడతాయి.
2) సబ్బుకు ఒక వైపు కార్బాక్సల్ (ధృవ) కొన, మరొక వైపు హైడ్రోకార్బన్ గొలుసు (అధృవ) కొన ఉంటాయి.
3) ధృవపు చివర హైడ్రోఫిలిక్ గా ఉంటుంది. అనగా ఇది నీటిని ఆకర్షిస్తుంది.
4) అధృవపు చివర హైడ్రో- బిక్ గా ఉంటుంది. కాబట్టి బట్టలలోని గ్రీజు లేదా నూనెను ఆకర్షిస్తుంది. కాని నీటిని ఆకర్పించదు.
5) సబ్బును నీటిలో కరిగించినపుడు హైడ్రోఫోబిక్ చివర తనంతటతాను మలినాలతో కలిసిపోయి బట్టలలోని మలినాలను తొలగిస్తుంది. దీనిని పక్కన ఇవ్వబడ్డ పటంలో గమనించవచ్చు.
6) సబ్బులోని హైడ్రోఫోబిక్ ‘చివర మలినాలు లేక గ్రీజువైపుకు ఆకర్షించబడుతుంది.
7) హైడ్రోఫోబిక్ చివర మలినాలతో కలిసిపోయి మలిన కణాలను బట్టల నుంచి బయటకు లాగటానికి ప్రయత్నిస్తాయి.
8) సబ్బు అణువులు మలిన కణాల చుట్టూ చేరి ఒక గోళాకృత నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనిని మిసిలి అంటారు.
9) ఈ మిసిలిలు కొల్లాయిడల్ ద్రావణంలోని కణాల లాగ నీటి అడుగున ఉండిపోతాయి.
10) వివిధ రకాల మిసిలిలు ఒకదానితో ఒకటి అయాన్-అయాన్ బలాలచే వికర్షించబడటం వలన అవక్షేపాన్ని ఏర్పరచవు.
11) కాబట్టి మిసిలిలలో ఉన్న మలిన పదార్థాలను ఉతకటం ద్వారా తేలికగా తొలగించవచ్చు.
12) ఈ విధంగా సబ్బు మిసిలిలు నీటిలో కరిగి బట్టలలోని మలినాలను తొలగిస్తాయి.
ప్రశ్న 16.
కార్బన్ సమ్మేళనాల ఎస్టరిఫికేషన్ మరియు సపోనిఫికేషన్ చర్యల మధ్య భేదాన్ని వివరించండి. (AS1)
(లేదా)
కర్బన సమ్మేళనాల యొక్క ఎస్టరిఫికేషన్ మరియు సఫోనిఫికేషన్ చర్యల మధ్యగల భేదంను వివరించుము.
జవాబు:
ప్రశ్న 17.
గ్రాఫైట్ నిర్మాణాన్ని బంధాలు ఏర్పడుట దృష్ట్యా వివరించండి. దాని నిర్మాణంపై ఆధారపడిన ఒక ధర్మాన్ని తెల్పండి. (AS1)
జవాబు:
- గ్రాఫైట్ ద్విమితీయ పొరల నిర్మాణాన్ని C – C బంధాలు అను ఈ పొరలలోనే కలిగి ఉంటుంది. ఈ పొరల మధ్య , బలహీన బలాలు పనిచేస్తాయి.
- ఈ పొరలు సమతల త్రిభుజీకరణ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి.
- ఈ పొరలలో ప్రతి కార్బన్ sp² సంకరీకరణాన్ని కలిగి ఉంటుంది.
- ఈ sp² ఆర్బిటాళ్ళు అతిపాతం చెందడం వల్ల C- C బంధాలు ఏర్పడతాయి.
- ప్రతి కార్బన్ పరమాణువులో సంకరీకరణంలో పాల్గొనని ఒక p ఆర్బిటాల్ మిగిలిపోతుంది.
- ఈ అసంకరీకరణ p ఆర్బిటాళ్ళు ఒకదానితో ఒకటి అతిపాతం చెంది మొత్తం పొరపై కేంద్రీకృతమయ్యే π వ్యవస్థను ఏర్పరుస్తాయి.
- రెండు పొరల. మధ్య బలహీన ఆకర్షణ బలాలు లేక వాండర్ వాల్ బలాలు 3.35Å దూరంతో వేరుచేయబడతాయి.
- ఈ బలాలు నీటి సమక్షంలో మరింత బలహీనపడతాయి. కాబట్టి గ్రాఫైట్ లోని బలాలు విచ్ఛిన్నం చేయుట తేలిక.
- అందువలన గ్రాఫైట్ ను కందెనగాను మరియు పెన్సిల్ లో లెడ్ గాను ఉపయోగిస్తున్నారు.
ప్రశ్న 18.
వెనిగర్ లో ఉండే ఆమ్లం పేరు ఏమిటి? (AS1)
(లేదా)
వెనిగర్ కలిగి ఉండు ఆమ్లంను తెలుపుము.
జవాబు:
- 5 – 8% ఎసిటిక్ ఆమ్ల ద్రావణాన్ని వెనిగర్ అంటారు.
- కాబట్టి వెనిగర్ లో ఉన్న ఆమ్లం ఇథనోయిక్ లేదా ఎసిటిక్ ఆమ్లం (CH3COOH).
ప్రశ్న 19.
ఇథనోల్ లో చిన్న సోడియం ముక్కను వేస్తే ఏమి జరుగుతుంది? (AS2)
(లేదా)
సోడియంను ఇథనోలకు కల్పిన ఏమగును?
జవాబు:
ఇథనోల్ లో సోడియం ముక్కను వేస్తే బుసలు పొంగుతూ హైడ్రోజన్ వాయువు వెలువడుతుంది మరియు ఈ ప్రక్రియలో సోడియం ఇథాక్సెడ్ కూడా ఏర్పడుతుంది.
ప్రశ్న 20.
A, B అనే రెండు కర్బన సమ్మేళనాల అణుఫార్ములాలు వరుసగా C3H8 మరియు C3H6 అయితే ఆ రెండింటిలో ఏది సంకలన చర్యలను ప్రదర్శిస్తుంది? మీ సమాధానాన్ని ఎలా సమర్థించుకుంటారు? (AS2)
జవాబు:
a) C3H8 అనేది ఆల్కేనుల సమజాత శ్రేణికి చెందిన సమ్మేళనము. కాబట్టి ఇది ఒక సంతృప్త హైడ్రోకార్బన్ కాబట్టి సంకలన చర్యలో పాల్గొనదు.
b) C3H6 అనగా ఇది ఆల్కీనుల సమజాత శ్రేణికి చెందిన సమ్మేళనము. ఇది ఒక ద్విబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అసంతృప్త హైడ్రోకార్బన్. కావున ఇది సంకలన చర్యలో పాల్గొని ఆల్కేనులను ఏర్పరుస్తుంది
ప్రశ్న 21.
నీటి కాఠిన్యతను పరిశీలించుటకు ఏదైన ఒక పరీక్షను సూచించండి మరియు దానిని సోదాహరణంగా వివరించండి. (AS3)
(లేదా)
నీటి యొక్క కఠినత్వంను తెలుసుకొనుటకు ఒక సాధారణ కృత్యంను వివరించుము.
జవాబు:
నీటి యొక్క కాఠిన్యతను ఒక నాణ్యమైన సబ్బు ద్వారా పరీక్షించవచ్చు.
పరీక్ష విధానము:
- సాలుగు పరీక్షనాళికలు తీసుకొని వాటికి A, B, C, D అనే లేబుల్స్ అంటించవలెను.
- వీటిలో ఒక్కొక్క దాంట్లో 50 మి.లీల చొప్పున వరుసగా కుళాయి, బావి, సరస్సు, చెరువు, నదిలోని నీటిని తీసుకొనవలెను.
- ఒక్కొక్క పరీక్ష నాళికలో 1 గ్రా. చొప్పున నాణ్యమైన సబ్బును కలపండి.
- పరీక్షనాళికలను బిరడాలతో బిగించండి.
- A పరీక్షనాళికను 15 సెకండ్ల పాటు తీవ్రంగా కుదిపి 30 సెకండ్ల పాటు కదలకుండా ఉంచాలి. నురగ ఎత్తును కొలవాలి. దానిని నోట్ బుక్ లో నమోదు చేసుకోవాలి.
- ఇదే పరీక్షను ప్రతి పరీక్షనాళికలోని నీటితో చేసి పరిశీలనలను నోట్ బుక్ లో నమోదుచేసుకోవాలి. ఏ పరీక్షనాళికలోని నీరు తక్కువ నురగ ఎత్తును ఇస్తుందో అది కఠిన నీరు.
ప్రశ్న 22.
‘X’ అనే ఒక సమ్మేళనం C2H6O అనే అణుఫార్ములాను కలిగి ఉండి KMnO4 ఆమ్ల సమక్షంలో ఆక్సీకరణ చర్యలో పాల్గొని ‘Y’ అనే సమ్మేళనాన్ని ఏర్పరిచింది. దాని అణుఫార్ములా C2H4O2 అయినా
a) X మరియు Y ని కనుక్కోండి. (AS3)
b) ‘X’అనే సమ్మేళనం ‘Y’ తో చర్య జరిపినపుడు ఏర్పడే సమ్మేళనం పచ్చళ్ళ నిల్వకోసం ఉపయోగించేది. అయితే ఏర్పడే సమ్మేళనంకు సంబంధించిన మీ పరిశీలనలను నమోదు చేయండి.
జవాబు:
a) X: C2H6O – ఇథనోల్
Y: C2H4O2
ఇథనోయిక్ ఆమ్లం. ఇథనోలను క్షారీకృత KMnO4 తో ఆక్సీకరణం చెందిస్తే ఇథనోయిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
ఇథనోయిక్ ఆమ్లంను ఊరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి ఉపయోగిస్తారు.
b) ఇథనోల్ (X)ను గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో ఇథనోయిక్ (Y) ఆమ్లంతో చర్య జరిపితే మంచి సువాసన గల ఇథైల్ విసిటేట్ (ఎస్టర్) అనే సమ్మేళనం ఏర్పడుతుంది.
ప్రశ్న 23.
పండ్లను కృత్రిమంగా పక్వం చేయుటకు ఇథిలీన్ ఉపయోగించటం గురించిన సమాచారాన్ని సేకరించండి. ఒక నివేదిక తయారు చేయండి. (AS4)
(లేదా)
కృత్రిమముగా మనము నిజ జీవితంలో వాడు పండ్లను పక్వము చెందించుటకు ఇథిలీస్ ఏ విధంగా ఉపయోగపడునో, సమాచారాన్ని సేకరించుము.
జవాబు:
మొదటి పద్ధతి :
- కాయలను పెద్ద పెద్ద చెక్క పెట్టెలలో (క్రేట్) భద్రపరుస్తారు. ఈ పెట్టెలను మండుతున్న వంట చెరుకుపైన ఏర్పాటు చేస్తారు.
- ఈ పొగలో ఇథిలీన్ మరియు ఎసిటిలీన్ వాయువులు ఉంటాయి. ఇవి కాయలు పండ్లుగా మారడానికి ఉపయోగపడతాయి.
రెండవ పద్ధతి :
- కాయలను ఇథిలీన్ లేదా ఎసిటిలీన్ వాయువులు ఉన్న గదిలో ఉంచుతారు.
- వాటివల్ల కాయలు కృత్రిమంగా పళ్లవలే మారుతాయి.
మూడవ పద్ధతి :
ఈ పద్ధతిలో కాయలపై కాల్షియం కార్బైడ్ ను రాస్తారు. ఇది గాలిలోని తేమతో చర్య పొంది ఎసిటిలీన్ వాయువును విడుదల చేస్తుంది. అది కాయలు కృత్రిమంగా పండ్లుగా మారుటకు తోడ్పడుతుంది.
ప్రశ్న 24.
ఈథేన్ అణువు యొక్క ఎలక్ట్రాన్ బిందు నిర్మాణాన్ని గీయండి. (AS5)
జవాబు:
ప్రశ్న 25.
C2H4O2 అణుఫార్ములా కలిగిన ఒక కర్బన సమ్మేళనం, సోడియం కార్బొనేట్/బైకార్బోనేట్ కలయికతో మంచి సువాసన గల వాయువును ఇస్తుంది. కింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి.
a) ఆ కర్బన సమ్మేళనం ఏమై ఉంటుంది? (AS1)
జవాబు:
ఆ కర్బన సమ్మేళనం ఇథనోయిక్ ఆమ్లం (CH3COOH).
b) వెలువడిన వాయువు పేరేమిటి? (AS1)
జవాబు:
విడుదలయిన వాయువు కార్బన్ డై ఆక్సెడ్ (CO2).
c) వెలువడిన వాయువును ఎలా పరీక్షిస్తారు? (AS2)
జవాబు:
1) విడుదలయిన వాయువును సున్నపుతేట గుండా పంపితే అది తెల్లని పాలవలె మారుతుంది.
2) ఒక మండుతున్న అగ్గిపుల్లను ఈ వాయువు వద్దకు తీసుకొని వస్తే అది దానిని ఆర్పివేస్తుంది.
d) పై చర్యకు తగిన సమీకరణం వ్రాయండి. (AS3)
జవాబు:
2CH3COOH + Na2CO3 → 2CH3COONa + H2O + CO2
CH3COOH + NaHCO3 → CH3COONa + H2O + CO2
e) పై కర్బన సమ్మేళనం యొక్క రెండు ముఖ్యమైన ఉపయోగాలు రాయండి. (AS1)
జవాబు:
- ఊరగాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఇథనోయిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు.
- దీనిని శుభ్రపరిచే కారకంగా కూడా ఉపయోగిస్తారు.
ప్రశ్న 26.
నిల్వచేయుటకు ఉపయోగించే కార్బాక్సిలికామ్లము పేరు ఏమిటి? (AS1)
(లేదా)
ఆహార నిల్వకై ఉపయోగించు ఆమ్లమును వ్రాయుము.
జవాబు:
ఆహారం నిల్వ చేయడంలో ఉపయోగపడే ఆమ్లం ఎసిటిక్ ఆమ్లం (ఇథనోయిక్ ఆమ్లం).
ప్రశ్న 27.
వెల్డింగ్ చేయుటకు ఇథైన్, ఆక్సిజన్స్ మిశ్రమాన్ని మండిస్తారు. ఇజైన్ మరియు గాలిని ఎందుకు ఉపయోగించరో చెప్పగలరా? (AS1)
(లేదా)
వెల్డింగ్ చేయుటలో ఇథైన్ మరియు ఆక్సిజన్లను మాత్రమే ఉపయోగించుటకు గల కారణమేమి?
జవాబు:
- ఇథైన్ ను మండించడం ఒక దహనచర్యకు ఉదాహరణ. అనగా ఇది ఆక్సిజన్ సమక్షంలో జరుగుతుంది.
- కాని గాలి N2, CO2, O2 వంటి అనేక వాయువుల మిశ్రమం.
- కాబట్టి ఈ వాయువుల మిశ్రమ సమక్షంలో దహనచర్య సరిగా జరగకపోవడం వల్ల విడుదలయ్యే ఉష్ణశక్తి తక్కువగా ఉంటుంది.
- కావున వెల్డింగ్ నందు ఇథైన్ ను ఆక్సిజన్ సమక్షంలో మండిస్తారు.
ప్రశ్న 28.
వనస్పతి తయారీలో సంకలన చర్యను ఎలా ఉపయోగిస్తారో రసాయన సమీకరణం సహాయంతో వివరించండి. (AS1)
(లేదా)
వనస్పతి తయారీలో హైడ్రోజనీకరణం ఏ విధముగా ఉపయోగపడునో, రసాయన సమీకరణం ద్వారా వివరింపుము.
జవాబు:
నికెల్ ఉత్ప్రేరక సమక్షంలో అసంతృప్త నూనెలను హైడ్రోజన్ వాయువుతో సంకలన చర్యకు గురిచేయడం ద్వారా వనస్పతిని తయారు చేస్తారు.
ప్రశ్న 29.
A) ఒక సమ్మేళనం అణుఫార్ములా C3H6O. ఈ అణుఫార్ములాతో రాయగలిగిన వివిధ నిర్మాణాలను రాయండి. (AS1)
B) మీరు రాసిన సమ్మేళనాల IUPAC పేర్లను సూచించండి.
C) ఈ సమ్మేళనాలలోని పోలికలు ఏమిటి?
జవాబు:
A) C3H6O అణుఫార్ములాకు సంబంధించిన వివిధ నిర్మాణాత్మక ఫార్ములాలు : –
1) CH3CH2CHO
2) CH3COCH3
B) పైన తెల్పిన సమ్మేళనాల IUPAC పేర్లు మరియు వాటి నిర్మాణాలు.
C) ఈ రెండు సమ్మేళనాల అణుఫార్ములా ఒకటే.
ప్రశ్న 30.
క్రోమిక్ ఎన్ హైడ్రైడ్ లేదా ఆమీకృత పొటాషియం పర్మాంగనేట్ లలో ఏదేని ఒకదానితో ఇథనాల్ ను ఆక్సీకరణ చెందిస్తే ఏర్పడే ఉత్పన్నం ఏమిటి? (AS1)
జవాబు:
ఇథనోల్ ను క్రోమిక్ ఎన్ హైడ్రైడ్ లేక ఆల్కలైన్ పొటాషియం పర్మాంగనేట్ సమక్షంలో ఆక్సీకరణం చెందిస్తే మొదట. ఇథనాల్ లేదా ఎసిటాల్డి హైడ్ ఏర్పడుతుంది. చివరకు ఎసిటిక్ ఆమ్లం లేదా ఇథనోయిక్ ఆమ్లం ఏర్పడుతుంది.
ప్రశ్న 31.
సమజాత శ్రేణిలో CH3OHCH2CH3 కి తరువాత వచ్చే సమ్మేళనం యొక్క IUPAC పేరును రాయండి. (AS1)
జవాబు:
CH3OHCH2CH3 అనగా 2-ప్రొపనోల్ లేదా ప్రొపాన్-2-ఓల్. దీని తరువాత వచ్చే సమజాతీయ సమ్మేళనం CH3CH2OHCH2CH3. దీని IUPAC పేరు 2-బ్యుటనోల్ లేదా బ్యూటాన్-2-ఓల్.
ప్రశ్న 32.
మూలకాలు, సమ్మేళనాలు లేదా మిశ్రమాలు ఏవి రూపాంతరత అనే ధర్మాన్ని చూపుతాయి ? సరైన ఉదాహరణలతో వివరించండి. (AS1)
(లేదా)
కర్బన సమ్మేళనాలలో రూపాంతరత ధర్మం యొక్క ప్రాధాన్యతను ఉదహరించుము.
జవాబు:
రూపాంతరతను మూలకాలు ప్రదర్శిస్తాయి.
రూపాంతరత :
ఒక మూలకం వివిధ రూపాలలో లభ్యమవుతూ దాదాపు ఒకే రసాయన ధర్మాలను ప్రదర్శిస్తూ, వేరువేరు భౌతిక, ధర్మాలను కలిగి ఉండడాన్ని రూపాంతరత అంటారు. కార్బన్ అనేక రూపాంతరాలను కలిగి ఉంటుంది.
1) అస్ఫటిక రూపం : కోక్, కోల్, కొయ్యబొగ్గు.
2) స్ఫటిక రూపం : వజ్రం, గ్రాఫైట్, బక్ మిస్టర్ ఫుల్లరిన్, నానోట్యూబులు.
ప్రశ్న 33.
ఇథనోల్ మరియు ఇథనోయిక్ ఆమ్లాల మధ్య భేదాన్ని చూపించే ఒక రసాయన చర్యను వర్ణించండి. (AS3)
జవాబు:
- రెండు వేరు వేరు పరీక్షనాళికలలో ఇథనోల్ మరియు ఇథనోయిక్ ఆమ్లములను తీసుకొనండి.
- ఈ రెండు పరీక్షనాళికలకు సుమారు 18 గ్రాముల సోడియం బై కార్బోనేట్ (NaHCO3) ను కలపండి.
- ఇథనోయిక్ ఆమ్లం ఉన్న పరీక్షనాళికలో అసంఖ్యాకమైన బుడగలు మరియు నురగను గమనించవచ్చు. ఎందువలన అనగా దీనిలో CO2 వాయువు వెలువడింది.
NaHCO3 + CH3COOH → CH3COONa + H2O + CO2↑ - ఇథనోల్ ఉన్న పరీక్షనాళికలో ఎటువంటి నురగ, బుడగలు ఏర్పడవు. కారణం ఇథనోల్ సోడియం బై కార్బోనేట్ తో చర్య పొందదు.
ఈ విధంగా ఇథనోల్, ఇథనోయిక్ ఆమ్లంను వేరుచేయవచ్చు.
ప్రశ్న 34.
మీథేన్, ఈథేన్, ఈథేన్ మరియు ఈథైన్ అణువుల నమూనాలను బంకమట్టి మరియు అగ్గిపుల్లలతో తయారు చేయండి. (AS4)
జవాబు:
విద్యార్థులు తమ సొంత నమూనాలను ఈ విధంగా తయారు చేసుకోవచ్చు.
- బంకమన్ను, బంతులను కర్బన పరమాణువులకు ఉపయోగించవచ్చు.
- అగ్గిపుల్లలోని పుల్లను బంధాన్ని సూచించుటకు, తలను హైడ్రోజన్ పరమాణువులను సూచించుటకు ఉపయోగిస్తారు.
ప్రశ్న 35.
రోజువారీ జీవితంలో ఎస్టర్ల పాత్రను నీవు ఎలా ప్రశంసిస్తావు? (AS6)
(లేదా)
నిజ జీవితంలో మనము ఎస్టర్లను ఏ విధంగా వినియోగిస్తామో ప్రశంసించుము.
జవాబు:
ఎస్టర్లు ప్రత్యేక సువాసన కలిగిన సమ్మేళనాలు. కాబట్టి వీటిని
- సెంట్లు, సబ్బులు, నెయిల్ పాలిష్ మొదలైన సౌందర్యాత్మక సాధనాలలో ఉపయోగిస్తారు.
- ఆల్కహాళ్ళు, ఫాటీ ఆమ్లాల తయారీలో ఉపయోగిస్తారు.
- పువ్వులు, పండ్లు ప్రత్యేక వాసన కలిగి ఉండడానికి వాటిలోని ఎస్టర్లు తోడ్పడుతున్నాయి.
- ఎస్టర్లను కొన్ని ప్రత్యామ్నాయ మందులుగాను, విటమిన్లలోను ఉపయోగిస్తున్నారు.
ఈ విధంగా అనేక నిత్యజీవిత అంశాలలో ఎస్టర్లు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. కాబట్టి వాటి పాత్ర ఎంతో అభినందనీయం.
ప్రశ్న 36.
సమాజంలో కొంతమంది ఆల్కహాల్ త్రాగడాన్ని ఒక అలవాటుగా కలిగి ఉంటారు. దీనిని నీవు ఎలా ఖండిస్తావు? (AS7)
(లేదా)
“మద్యం సేవనం ఒక దుర్వ్యసనము” నీవు దీనిని ఎలా సమర్థిస్తావు?
జవాబు:
- ఆల్కహాల్ ను వివిధ పానీయాలుగా సేవించడం ఆరోగ్యానికి హానికరం.
- అది రక్త ప్రసరణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
- ఆల్కహాల్ కు బానిస కావడం వలన గుండెకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా కాలేయం పాడయిపోతుంది.
- చిన్న ప్రేగులలో ఆమ్లత్వం పెరగడం వల్ల పుండ్లు ఏర్పడతాయి. జీర్ణవ్యవస్థను దెబ్బ తీస్తుంది.
- కొన్ని ప్రాంతాలలో మిథైల్ ఆల్కహాల్ సేవించుట వలన గుడ్డితనం ఏర్పడటమే కాక ప్రాణాలకు కూడా హాని ఏర్పడుతుంది.
- కాబట్టి ఆల్కహాల్ వినియోగాన్ని ప్రతి ఒక్కరు అరికట్టవలసి ఉన్నది. ఎందువలన అనగా దాని ప్రభావం సమాజంపై తీవ్రస్థాయిలో ఉన్నది.
ప్రశ్న 37.
1మి.లీ గ్లేసియల్ ఎసిటిక్ ఆమ్లము మరియు 1 మి.లీ. ఇథనాలను ఒక పరీక్ష నాళికలో తీసుకొని, దానికి కొన్ని చుక్కల గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లమును కలిపి ఆ మిశ్రమాన్ని వెచ్చటి నీటిలో 5 నిమిషాల పాటు ఉంచారు.
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెల్పండి.
ఎ) చర్యానంతరం ఏర్పడే ఫలిత సమ్మేళనం ఏమిటి? (AS2)
జవాబు:
ఏర్పడే ఫలిత సమ్మేళనం పేరు ఇథైల్ ఎసిటేట్ (CH3COOC2H5).
బి) పై చర్యను రసాయన సమీకరణంతో సూచించండి. (AS1)
జవాబు:
సి) పై చర్యను పోలిన చర్యలను సూచించుటకు ఉపయోగించే పదమేమిటి? (AS1)
జవాబు:
పైన ఏర్పడ్డ చర్యను, ఎస్టరీకరణం అంటారు.
డి) ఏర్పడిన సమ్మేళనమునకు ఉండే ప్రత్యేక లక్షణాలేమిటి? (AS1)
జవాబు:
ఏర్పడే సమ్మేళనం తియ్యని వాసనను కలిగి ఉంటుంది.
ఖాళీలను పూరించండి
1. ద్విబంధం మరియు త్రిబంధాలను కలిగి ఉండే కర్బన సమ్మేళనాలను ………….. అంటారు. (అసంతృప్త హైడ్రోకార్బన్లు)
2. దగ్గుటానిలో ముఖ్య అనుఘటకంగా ఉండే సమ్మేళనం ……………… (ఇథనోల్)
3. ఇథనోయిక్ ఆమ్లం యొక్క చాలా విలీనపరచిన ద్రావణం …………. (వెనిగర్)
4. ఆల్కహాల్, కార్బాక్సిలిక్ ఆమ్లాల చర్య వలన ఏర్పడే తియ్యని వాసన గల పదార్థం ……………… (ఎస్టర్)
5. ఇథనాల్ లో సోడియం లోహాన్ని జారవిడిస్తే ………… వాయువు వెలువడుతుంది. (హైడ్రోజన్)
6. మిథనాల్ లోని ప్రమేయ సమూహం ……………… (ఆల్కహాల్)
7. 3 కర్బన పరమాణువులను కలిగి ఉన్న ఆల్కేన్ యొక్క IUPAC నామము ………… (ప్రొపీన్)
8. ఆలైన్ సమజాతశ్రేణిలోని మొదటి సమ్మేళనం ………. (ఇథైన్)
9. గాఢ సల్ఫ్యూరికామ్లంలో ఇథనాల్ యొక్క నిర్జలీకరణ చర్య కారణంగా …….. ఏర్పడుతుంది. (ఈథేన్)
10. అమ్మోనియాలోని ఏక సమయోజనీయ బంధాల సంఖ్య ……………. (3)
11. ఆల్కేన్లు ………… చర్యలలో పాల్గొంటాయి. (ప్రతిక్షేపణ చర్యలు)
సరైన సమాధానాన్ని ఎన్నుకోండి
1. విలీన ఎసిటికామ్లాన్ని కింది రసాయనాలను కలిగి ఉన్న 4 పరీక్షనాళికలలో కలిపారు.
i) KOH
ii) NaHCO3
iii) K2CO3
iv) NaCl
ఏ పరీక్షనాళికలో సువాసనగల వాయువు ఏర్పడుతుంది?
A) i & ii
B) ii & iii
C) i & iv
D) ii &.in
జవాబు:
B) ii & iii
2. కింది సూచించిన శాతాలలో ఏ శాతపు ఎసిటికామ్లాన్ని నీటితో కలిపి పచ్చళ్ళను నిల్వచేసే వెనిగర్ వాడుతారు?
A) 5-10%
B) 10-15%
C) 20-130%
D) 100%
జవాబు:
A) 5-10%
3. ఆల్డిహైడ్ పేరును రాయడానికి ఉపయోగించే పరపదం ఏమిటి?
A) ఓల్ – ol
B) ఆల్ – al
C) ఓన్ – one
D) ఈన్ – ene
జవాబు:
B) ఆల్ – al
4. ఎసిటికామ్లాన్ని నీటిలో కలిపినపుడు అది ద్విగతంగా అయాలుగా విడిపోతుంది. ఎందుకంటే అది ఒక
A) బలహీన ఆమ్లం
B) బలమైన ఆమ్లం
C) బలహీన క్షారం
D) బలమైన క్షారం
జవాబు:
A) బలహీన ఆమ్లం
5. కింది ఏ హైడ్రోకార్బన్ అణు సాదృశ్యాన్ని ప్రదర్శిస్తుంది?
A) C2H4
B) C2H6
C) C3H8
D) C4H10
జవాబు:
D) C4H10
6. సాధారణంగా హైడ్రోకార్బన్ల దహనంతో పాటు సాధారణంగా ఏర్పడునవి ……….
A) వేడి
B) కాంతి
C) వేడి, కాంతి రెండూ
D) విద్చుచ్ఛక్తి
జవాబు:
C) వేడి, కాంతి రెండూ
7. A, B, C అనే మూడు పరీక్షనాళికలను తీసుకొని, 2 మి.లీ. ఇథనోయిక్ ఆమ్లాన్ని ప్రతిదాంట్లోనూ తీసుకొని వాటికి 2 మి.లీ., 4 మి.లీ. మరియు 8 మి.లీ. నీటిని కలిపారు. ఏ పరీక్షనాళికల్లో స్పష్టమైన ద్రావణం (Clear Solution) ఏర్పడుతుంది?
A) పరీక్షనాళిక Aలో మాత్రమే
B) పరీక్షనాళికలు A, B లలో మాత్రమే
C) పరీక్షనాళికలు B, C లలో మాత్రమే
D) అన్ని పరీక్ష నాళికలలో
జవాబు:
D) అన్ని పరీక్ష నాళికలలో
8. 5 మి.లీ. నీటికి 2 మి.లీ. ఎసిటికామ్లాన్ని చుక్కలు చుక్కలుగా కలిపినపుడు దీనిని గమనించవచ్చు.
A) నీటి పైన ఒక ప్రత్యేక పొరగా ఆమ్లం ఏర్పడడం
B) నీరు, ఆమ్లంపైన ఒక ప్రత్యేక పొరగా ఏర్పడడం
C) స్పష్టమైన సజాతీయ ద్రావణం ఏర్పడడం
D) పింక్ రంగులోనున్న స్పష్టమైన ద్రావణం ఏర్పడడం
జవాబు:
C) స్పష్టమైన సజాతీయ ద్రావణం ఏర్పడడం
9. ఘన సోడియం కార్బోనేట్ కు కొన్ని చుక్కల ఇథనోయిక్ ఆమ్లాన్ని కలిపినపుడు కింది చర్య జరుగుతుంది.
A) వేగంగా బుడగలుగా వాయువు వెలువడుతుంది.
B) గోధుమ రంగు పొగలు వెలువడుతాయి.
C) సువాసనగల వాయువు వెలువడుతుంది.
D) కుళ్ళిన వాసనగల వాయువు వెలువడుతుంది.
జవాబు:
A) వేగంగా బుడగలుగా వాయువు వెలువడుతుంది.
10. ఎసిటికామ్లం , ఇథైల్ ఆల్కహాల్ తో చర్య జరుపునపుడు దానికి గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంగా కలుపుతాం. అది ……. వలె ఉపయోగపడుతుంది. ఈ ప్రక్రియను …………….. అంటాం.
A) ఆక్సీకారిణి, సఫోనిఫికేషన్
B) నిర్జలీకారిణి, ఎస్టరిఫికేషన్
C) క్షయకారిణి, ఎస్టరిఫికేషన్
D) ఆమ్లం, ఎస్టరిఫికేషన్
జవాబు:
B) నిర్జలీకారిణి, ఎస్టరిఫికేషన్
10th Class Physical Science 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు Textbook InText Questions and Answers
10th Class Physical Science Textbook Page No. 287
ప్రశ్న 1.
జంతు సంబంధమైన కొవ్వులను వంటకు ఉపయోగించకూడదంటారు ఎందుకు?
జవాబు:
- జంతువుల కొవ్వు సంతృప్త ఫాటీ ఆమ్లాలను కలిగి ఉంటుంది. అవి హృద్రోగాలకు కారణం అవుతున్నాయి.
- జంతువుల కొవ్వు అధికంగా స్వీకరించడం వలన ఊబకాయం కూడా ఏర్పడుతుంది.
ప్రశ్న 2.
వంట చేయుటకు ఏ నూనెలు మంచివి? ఎందుకు?
జవాబు:
- కనోల మొక్క యొక్క విత్తనాలను పిండి చేయగా కనోల నూనె తయారగును.
- ఇది అన్నింటికన్నా ఆరోగ్యవంతమైన వంటనూనెగా పరిగణించబడుతున్నది. దీనికి కారణం ఇది తక్కువ సంతృప్త ఫాటీ ఆమ్లాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా మోనోసాచురేటెడ్ కొవ్వు మరియు ఎక్కువ ఒమేగా – 3 మరియు ఒమేగా కొవ్వులను కలిగి ఉంటుంది.
- కాబట్టి కనోల నూనెను వంట చేయుటకు ఉపయోగించుట ఉత్తమం.
10th Class Physical Science Textbook Page No. 261
ప్రశ్న 3.
కార్బన్ తన బాహ్య క్యలో నాలుగు ఎలక్ట్రాన్లను కోల్పోయి, హీలియం ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొందగలదా?
జవాబు:
- కార్బన్ బాహ్య కర్పరం నాలుగు ఎలక్ట్రానులను కోల్పోతే అది C4+ ఏర్పరచాలి.
- కాని దీనికి అధిక మొత్తంలో శక్తి అవసరం. కాని సాధారణ పరిస్థితులలో ఈ శక్తి అందుబాటులో ఉండదు.
- కాబట్టి C4+ ఏర్పడటం దాదాపు అసంభవం.
కాబట్టి కార్బన్ C4+ అయాన్లను ఏర్పరచదు.
10th Class Physical Science Textbook Page No. 262
ప్రశ్న 4.
కార్బన్ పరమాణువులు పైన సూచించిన విధంగా అనేక రకాల బంధాలను ఏవిధంగా ఏర్పరచగలుగుతాయి?
జవాబు:
వేలన్సీ బంధ సిద్ధాంతం ప్రకారం కార్బన్ యొక్క నాలుగు సంయోజక ఎలక్ట్రానులు (ఒంటరి ఎలక్ట్రానులు) కార్బన్ పరమాణువులు వివిధ రకాల బంధాలు ఏర్పరచడానికి కారణం.
10th Class Physical Science Textbook Page No. 263
ప్రశ్న 5.
ఎలక్ట్రాన్ ను ఉత్తేజపరిచే ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది?
జవాబు:
- సాధారణంగా కార్బన్ పరమాణువు భూస్థాయిలోనే ఉంటుంది.
- కాని వేరే పరమాణువులతో బంధమేర్పరచాలనుకొన్నప్పుడు ఉత్తేజిత స్థాయికి చేరడానికి కావలసిన శక్తిని కార్బన్ మరియు ఇతర పరమాణువుల మధ్య బంధం ఏర్పడినపుడు విడుదలయ్యే శక్తిని వినియోగించుకొంటుంది.
10th Class Physical Science Textbook Page No. 264
ప్రశ్న 6.
కార్బన్ యొక్క నాలుగు ఒంటరి ఎలక్ట్రాన్లను కలిగి ఉన్న ఆర్బిటాళ్ళు, శక్తి రీత్యా సమానంగా మారుతాయని ఎలా వివరించగలం?
జవాబు:
‘సంకరీకరణం’ అనే దృగ్విషయం ద్వారా దీనిని వివరించవచ్చు.
10th Class Physical Science Textbook Page No. 267
ప్రశ్న 7.
CH4, C2H4 మరియు C2H2 అణువులలోని \(\text { HĈH }\) బంధ కోణములు ఎంతెంత?
జవాబు:
CH4 లోని \(\text { HĈH }\) బంధ కోణం 109.5°. C2H4 లోని \(\text { HĈH }\) బంధ కోణం 120°.
C2H4 లోని \(\text { HĈH }\) బంధ కోణం 180°.
10th Class Physical Science Textbook Page No. 273
ప్రశ్న 8.
హైడ్రోకార్బన్లు అంటే ఏమిటి?
జవాబు:
కార్బన్, హైడ్రోజన్లను మాత్రమే కలిగియున్న సమ్మేళనాలను హైడ్రోకార్బన్లు అంటారు.
10th Class Physical Science Textbook Page No. 274
ప్రశ్న 9.
అన్ని కర్బన సమ్మేళనాలలో సమాన సంఖ్యలో కార్బన్ (C) మరియు హైడ్రోజన్ (H) పరమాణువులు కలిగి ఉన్నాయా?
జవాబు:
ఉండవు.
10th Class Physical Science Textbook Page No. 277
ప్రశ్న 10.
కార్బన్ ఇతర మూలకాలతో బంధాన్ని ఏర్పరచగలదా?
జవాబు:
కార్బన్ ఇతర మూలక పరమాణువులైన హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, పాస్ఫరస్, హాలోజన్లతో బంధాలు ఏర్పరుస్తుంది.
10th Class Physical Science Textbook Page No. 287
ప్రశ్న 11.
ఉత్ప్రేరకం అంటే ఏమిటో తెలుసా?
జవాబు:
రసాయన చర్యలో పాల్గొనకుండా రసాయన చర్యా వేగాన్ని నియంత్రించే పదార్థాలను ఉత్ప్రేరకాలు అంటారు.
10th Class Physical Science Textbook Page No. 290
ప్రశ్న 12.
ఎస్టర్లు అంటే ఏమిటి?
జవాబు:
ప్రమేయ సమూహం కలిగిన సమ్మేళనాలను ఎస్టర్లు అంటారు.
వీటి సాధారణ ఫార్ములా. R – COO – R’
10th Class Physical Science Textbook Page No. 292
ప్రశ్న 13.
నిజ ద్రావణం (true solution) అంటే ఏమిటి?
జవాబు:
1nm కంటే తక్కువ వ్యాసం గల ద్రావిత కణాలు ద్రావణంలో విక్షేపణం చెందడం వల్ల ఏర్పడే ద్రావణాన్ని నిజ ద్రావణం అంటారు.
10th Class Physical Science Textbook Page No. 262
ప్రశ్న 14.
కార్బన్ పరమాణువు యొక్క ఉత్తేజస్థితిలోని జతకూడని 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయి?
జవాబు:
10th Class Physical Science Textbook Page No. 263
ప్రశ్న 15.
మీథేన్ అణువు (CH4) లో కార్బన్ – హైడ్రోజన్ బంధాలు నాలుగూ ఒకేరకమైనవి మరియు \(\text { HĈH }\) బంధకోణం 109°28′. దీనిని మనం ఎలా వివరించగలం?
జవాబు:
కార్బన్ ఉత్తేజిత స్థాయిలో p- ఆర్బిటాల్ లో మూడు ఒంటరి ఎలక్ట్రానులు మరియు S- ఆర్బిటాల్ లో ఒక ఒంటరి ఎలక్ట్రానను కలిగి ఉంటుంది. ఈ నాలుగు వేలన్సీ ఆర్బిటాళ్ళు వివిధ శక్తులను కలిగి ఉంటాయి. కాబట్టి ఈ ఆర్బిటాళ్ళు సంకరీకరణం చెంది నాలుగు సర్వసమాన ఆర్బిటాళ్లను ఏర్పరుస్తాయి. నాలుగు హైడ్రోజన్ పరమాణువులు కార్బతో కలిసి నాలుగు సర్వసమాన C – H బంధాలను ఏర్పరుస్తాయి. మరియు ఈ బంధాల మధ్య బంధకోణం 109°28′ ఉంటుంది. (అత్యల్ప వికర్షణ కొరకు)
ప్రశ్న 16.
మీథేన్ అణువులో శక్తిరీత్యా అసమానమైన సంయోజనీయత గల ఎలక్ట్రాన్లు సమానమైన నాలుగు సమయోజనీయతా బంధాలను ఏ విధంగా ఏర్పరుస్తాయి? ఇది ఎలా జరుగుతుంది?
జవాబు:
- బంధాలు ఎక్కువ ఏర్పడే కొద్ది శక్తి ఎక్కువ అవడం వలన ఆ అణువు స్థిరంగా ఉంటుంది.
- కార్బన్ నాలుగు బంధాలను ఏర్పరిస్తే రెండు బంధాలు ఏర్పడటం కంటే ఎక్కువ శక్తి విడుదలవ్వడం వలన అధిక స్థిరత్వం పొందుతుంది.
- 28 ఆర్బిటాల్ మరియు 2p ఆర్బిటాలకు మధ్య శక్తి తేడా తక్కువగా ఉంటుంది. కార్బన్ బంధాన్ని ఏర్పరచాలనుకొన్నపుడు బంధ శక్తి నుంచి లభించే కొద్దిగా శక్తి 28 లోని ఎలక్ట్రాన ను 2p లోకి పంపిస్తుంది. ఈ విధంగా నాలుగు ఒంటరి ఎలక్ట్రానులు ఏర్పడతాయి.
- ఈ S మరియు p ఆర్బిటాళ్ళు సంకరీకరణం చెంది నాలుగు సర్వసమాన ఆర్బిటాళ్ళను ఏర్పరుస్తాయి. కాబట్టి వివిధ శక్తులు కలిగిన వేలన్సీ ఎలక్ట్రానులు సంకరీకరణం వలన నాలుగు సర్వసమాన బంధాలను మీథేన్ లో ఏర్పరుస్తాయి.
10th Class Physical Science Textbook Page No. 269
ప్రశ్న 17.
పెన్సిల్ లో పేపర్ పై చేసే గుర్తులను (రాతను) మీరు ఏవిధంగా అర్థం చేసుకొంటారు?
జవాబు:
- పేపర్ పై పెన్సిల్ తో రాసినపుడు గ్రాఫైట్లో గల లోపలి పొరల మధ్య ఆకర్షణ బలాలు విచ్ఛిన్నం అవుతాయి. కాబట్టి విడిపడిన గ్రాఫైట్ పొరలు పేపర్‌పై ఉండిపోతాయి.
- అంతేకాకుండా ఈ పెన్సిల్ మార్కింగ్ లను ఎరేజర్ ద్వారా తేలికగా తొలగించవచ్చు. ఎందువలన అనగా గ్రాఫైట్ పొరలు పేపరును గట్టిగా అంటిపెట్టుకొని ఉండవు.
10th Class Physical Science Textbook Page No. 272
ప్రశ్న 18.
రసాయన శాస్త్రంలో కార్బన్, దాని సంయోగ పదార్థాలకు ప్రత్యేకంగా ఒక శాఖను కేటాయించడం సమంజసమేనా? మరే విధమైన మూలకానికి ఇటువంటి ప్రత్యేక శాఖ కేటాయించబడలేదు. దీనిని ఎలా సమర్థిస్తావు?
జవాబు:
- మనము జీవించడానికి అవసరమయ్యే పదార్థాలయిన కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాలు, లిపిడ్లు, హార్మోన్లు మరియు విటమిన్లు అన్నీ కార్బనను కలిగి ఉన్నాయి.
- మన శరీరంలో జరిగే జీవక్రియలలో కూడా కర్బన సమ్మేళనాలు ప్రధానపాత్ర వహిస్తున్నాయి.
- మనకు ప్రకృతి నుంచి లభించే ఆహారము; అనేక మందులు, నూలు, ఉన్ని వంటి వస్త్రాలు, పెట్రోలియం, సహజ వాయువు వంటి ఇంధనాలు అన్నీ కర్బన సమ్మేళనాలు.
- కృత్రిమ వస్త్రాలు, ప్లాస్టిక్ లు, కృత్రిమ రబ్బరు అన్నీ కర్బన సమ్మేళనాలు.
- ఈ విధంగా ఇన్ని రంగాలలో ఉపయోగపడుతున్న కార్బన్ సమ్మేళనాలకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పరచుట ఖచ్చితంగా సరియైన నిర్ణయం
10th Class Physical Science Textbook Page No. 276
ప్రశ్న 19.
కింద ఇవ్వబడిన రెండు. హైడ్రోకార్బన్స్ నిర్మాణాలను పరిశీలించండి.
i) పై నిర్మాణాలలో ఏం తేడాను గమనించారు?
జవాబు:
ఆ రెండు వేరు వేరు సమ్మేళనాలు. (a) బ్యూటేన్ (b) 2-మిథైల్ ప్రోపేన్ లేదా ఐసో బ్యూటేన్.
ii) (a) మరియు (b) నిర్మాణాలలో ఎన్ని కార్బన్, హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయి ?
జవాబు:
(a) మరియు (b) నిర్మాణాలలో నాలుగు కార్బన్, పది హైడ్రోజన్ పరమాణువులు కలవు.
iii) (a) మరియు (b) ల అణుఫార్ములా రాయండి. అవి ఒకే విధంగా ఉన్నాయా?
జవాబు:
C4H10 అవును. ఒకే విధంగా ఉన్నాయి.
10th Class Physical Science Textbook Page No. 285
ప్రశ్న 20.
ఏదేని సమ్మేళనం పేరును చెబితే, దాని నిర్మాణాన్ని మనం గీయగలమా?
జవాబు:
- రూట్ పదం నుంచి ప్రధాన గొలుసులో కర్బన పరమాణువులను రాసుకోవాలి.
- ఇచ్చిన పేరు ఆధారంగా ఎడమ నుంచిగాని కుడి నుంచి గాని కర్బన పరమాణువులను లెక్కించాలి.
- ప్రతిక్షేపకాలను పేరులో ఇచ్చిన విధంగా కర్బన పరమాణువులపై ప్రతిక్షేపించుకోవాలి.
- ప్రమేయ సమూహం ఫార్ములాలు ఇచ్చిన పేరు బట్టి రాసుకోవాలి.
- కార్బన్ యొక్క చతుర సంయోజకత దృష్టిలో పెట్టుకొని వాటి యొక్క సంయోజకతను హైడ్రోజన్లతో సంతృప్తి పరచాలి.
10th Class Physical Science Textbook Page No. 286
ప్రశ్న 21.
అప్పుడప్పుడు గ్యాసు లేదా కిరోసిన్ స్టవ్ పైన వంట చేస్తున్నప్పుడు వంట పాత్రలపై నల్లని మసి ఏర్పడుతుంది. ఎందుకు?
జవాబు:
బర్నర్ లేదా స్టవ్ కు సంబంధించిన గాలి రంధ్రాలు మలినాలతో మూసుకొని పోవడం వలన ఇంధన వాయువులు పూర్తిగా మండవు. అందువలన పూర్తిగా మండని కార్బన్ వంట పాత్రలపై ఏర్పడటం వలన వంటపాత్రలు నల్లగా అవుతాయి.
10th Class Physical Science Textbook Page No. 288
ప్రశ్న 22.
వాహనాలు నడిపే వ్యక్తులు మద్యం తీసుకొన్నారా లేదా అని పోలీసులు ఎలా కనుగొంటారో మీకు తెలుసా?
జవాబు:
- పోలీస్ అధికారి అనుమానిత డ్రైవర్‌ను పొటాషియం డై క్రోమేట్ (K2Cr2O7) స్ఫటికాలు కలిగిఉన్న ఒక ప్లాస్టిక్ సంచిలోకి, ఒక గుర్తించగల పరికరం యొక్క మౌత్ పీస్ ద్వారా ఊదమంటారు.
- అతను ఊదిన గాలిలో ఇథనోల్ ఉంటే అది K2Cr2O7 మంచి ఆక్సీకరణి అవుటచే వెంటనే ఇథనాల్ మరియు ఇథనోయిక్ ఆమ్లంగా మారిపోతుంది.
- అంతేకాకుండా నారింజరంగులోని Cr2O72- అయాన్ ఈ ఆక్సీకరణ ప్రక్రియ వలన ఆకుపచ్చని Cr3+ అయాన్లుగా మారుతుంది.
- గొట్టంలో ఎంతభాగం ఆకుపచ్చని రంగులో మారుతుందో దాని ఆధారంగా సేవించిన ఆల్కహాల్ పరిమాణాన్ని లెక్కిస్తారు.
- ఇంతేకాకుండా పోలీసులు IR వర్ణపటాల ద్వారా C – OH, C – H మరియు CH3 – CH2 – OH బంధాలను లెక్కించడం ద్వారా కూడా ఆల్కహాల్ పరిమాణాన్ని కనుగొంటారు.
10th Class Physical Science Textbook Page No. 266
ప్రశ్న 23.
ఒక ఏకబంధం మరియు ఒక త్రిబంధం ఏర్పరచగల కార్బన్ సామర్థ్యాన్ని మీరేవిధంగా వివరిస్తారు?
జవాబు:
1) ఈజైన్ ఎసిటిలీన్ (C2H2) అణువును ఉదాహరణ తీసుకొని ఒక ఏకబంధం మరియు ఒక త్రిబంధాన్ని కార్బన్ ఎలా ఏర్పరుస్తుందో వివరించవచ్చు.
2) ఎసిటిలీన్ అణువులోని రెండు కార్బన్ పరమాణువుల మధ్య ఒక త్రిబంధం ఉంటుంది.
3) పరమాణువు యొక్క చతుర సంయోజనీయతను సంతృప్తపరచడానికి ప్రతి కార్బన్ పరమాణువు ఒక హైడ్రోజన్ తో బంధాన్ని ఏర్పరుస్తుంది
(H – C ≡ C – H).
4) ఎసిటిలీన్ (C2H2) అణువులో రెండు కార్బన్, రెండు హైడ్రోజన్ పరమాణువులున్నాయి.
5) ఉత్తేజిత స్థితిలో ప్రతి కార్బన్ పరమాణువులో ఒక S – ఆర్బిటాల్ (2s) మరియు ఒక p – ఆర్బిటాల్ (2px) కలవటం వలన sp సంకరీకరణం జరిగి రెండు సర్వసమానమైన sp ఆర్బిటాళ్ళు ఏర్పడతాయి.
6) ప్రతి కార్బన్ పరమాణువు రెండు సంకరీకరణం చెందని p – ఆర్బిటాళ్ళు (2px, 2py) కలిగి ఉంటుంది.
7) ఒక కార్బన్ లోని sp సంకర ఆర్బిటాల్ మరో కార్బన్ లోని sp సంకర ఆర్బిటాల్ తో అతిపాతం చెందటం వలన sp – sp సిగ్మా బంధం ఏర్పడుతుంది.
8) కార్బన్లో గల మరో sp ఆర్బిటాల్, హైడ్రోజన్ పరమాణువు యొక్క S – ఆర్బిటాల్ లో అతిపాతం చెందడం వలన రెండు S – sp సిగ్మా బంధాలు ఏర్పడతాయి.
9) కార్బన్ పరమాణువులో ఉండే సంకరీకరణం చెందని p ఆర్బిటాల్, వేరొక కార్బన్ పరమాణువులోని p ఆర్బిటాల్ లో అతిపాతం చెందడం వలన రెండు π బంధాలు ఏర్పడతాయి. ( πpy – py మరియు πpz – pz).
10) అందుచేత ఈథేన్ పరమాణువు (H – C = C – H) లో 3 సిగ్మా బంధాలు, రెండు IT బంధాలు ఉంటాయి.
10th Class Physical Science Textbook Page No. 267
ప్రశ్న 24.
క్రమంలో కార్బన్ పరమాణు కేంద్రకాల మధ్యగల బంధ దూరాన్ని, బంధ శక్తులను ఊహించగలరా? వివరించండి.
జవాబు:
10th Class Physical Science Textbook Page No. 293
ప్రశ్న 25.
జిడ్డుగా నున్న బట్టపై సబ్బు కణాలు జరిపే చర్య ఏమిటి?
జవాబు:
- సబ్బు లేదా డిటర్జెంట్లు నూనె మరియు మలినాలను నీటిలోకి వచ్చేటట్లు చేస్తాయి. ఈ విధంగా బట్టలను శుభ్రపరుస్తాయి.
- సబ్బులో ఒక చివర ధృవంగా, మరొక చివర ధృవరహితంగాను ఉంటుంది.
- ధృవపు చివర హైడ్రోఫిలిక్ గాను, ధృవరహిత చివర హైడ్రోఫోబి గాను ఉంటుంది.
- ధృవరహిత చివర హైడ్రోఫోబిక్ గా ఉండటం వలన ఇది గ్రీజు లేదా నూనె చేత ఆకర్షించబడుతుంది.
- సబ్బుని నీటిలో కరిగిస్తే హైడ్రోఫోబిక్ చివర మలినాలు గ్రీజు లేక మలినాలను అతుక్కొని వాటిని నీటి నుంచి తొలగిస్తాయి.
- హైడ్రోఫోబిక్ చివర మరియు గ్రీజు కణాల వైపుకు కదులుతాయి.
- హైడ్రోఫోబిక్ చివర మలిన కణాలకు అతుక్కొని మలిన కణాలను బయటకు లాగడానికి ప్రదర్శిస్తాయి.
- సబ్బు అణువులు మలిన కణాల చుట్టూ చేరి గోళాకృత నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. దీనిని మిసిలి అంటారు.
- ఈ మిసిలిలు కొల్లాడయిల్ ద్రావణంలోని కణాలలాగ నీటి అడుగున ఉండి పోతాయి.
- వివిధ రకాల మిసిలిలు ఒకదానిలో ఒకటి అయాన్ – అయాన్ బలాల చేత వికర్షించబడటం వలన అవక్షేపాన్ని ఏర్పరచవు.
- కాబట్టి మిసిలిలో ఉన్న మలిన పదార్థాలను తేలికగా తొలగించవచ్చు.
- ఈ విధంగా సబ్బు మిసిలిలు నీటిలో కరిగి బట్టలలోని మలినాలను తొలగిస్తాయి.
పరికరాల జాబితా
పరీక్షనాళికలు, నీటి తొట్టె, బున్సెన్ బర్నర్, ఇథనోల్, ఎసిటికామ్లం , గాఢ సల్ఫ్యూరికామ్లం, బంతి-పుల్లల నమూనాలు
10th Class Physical Science 12th Lesson కార్బన్ – దాని సమ్మేళనాలు Textbook Activities
కృత్యములు
కృత్యం – 1
ప్రశ్న 1.
కింది నిర్మాణాత్మక ఫార్ములాలను పరిశీలించి, వాటి పేర్లను మీ నోట్ బుక్ లో రాయండి.
1) CH3 – CH2 – CH = CH2
జవాబు:
బ్యూట్-1-ఈన్
2)
జవాబు:
2-మిథైల్ బ్యూటేన్
3) CH3 – CH2 – CH2 – CH2 – CH2 – CH3
జవాబు:
హెక్సేన్
4)
జవాబు:
3-మిథైల్, బ్యూట్-1-ఈన్
5) CH3 – C ≡ CH
జవాబు:
ప్రొప్-1-ఐన్
కృత్యం – 2
ప్రశ్న 2.
కింది కర్బన సమ్మేళనాల పేర్లను చదివి, వాటి నిర్మాణాత్మక ఫార్ములాలను మీ నోటు పుస్తకంలో రాయండి.
కృత్యం – 3
ప్రశ్న 3.
ఎస్టరీకరణ చర్యను కృత్యం ద్వారా వివరించండి.
జవాబు:
- ఒక పరీక్షనాళికలో 1 మి.లీ ఇథనోలు (అబ్సల్యూట్ ఆల్కహాల్) మరియు 1 మి.లీ. గడ్డకట్టిన ఎసిటిక్ ఆమ్లం (glacial acetic acid) అలాగే కొన్ని చుక్కల గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని తీసుకోండి.
- నీటితొట్టిలో వేడి చేయండి లేదా వేడి నీటిని కలిగి ఉన్న బీకర్ లో కనీసం 5 నిమిషాలు పటంలో చూపిన విధంగా ఉంచండి.
- 20-50 మి.లీ. నీరుగల బీకరులోనికి వెచ్చగా ఉండే ఈ ద్రావణాన్ని కలపండి.
గమనించినది :
ఒక మంచి తియ్యని వాసనగల ద్రావణం ఏర్పడటం గమనించవచ్చు.
ఫలితం :
ఏర్పడిన పదార్థమే ఎస్టరు. ఈ చర్యనే ఎస్టరీకరణ చర్య అంటారు.
కృత్యం – 4
ప్రశ్న 4.
మిసిలీ తయారీ విధానమును వివరించుము.
జవాబు:
- 10 మి.లీ. ల చొప్పున నీటిని రెండు పరీక్షనాళికలలో తీసుకొనుము.
- రెండింటిలోను ఒక చుక్క వంటనూనెను కలిపి వాటికి A మరియు B అనే లేబుల్స్ అంటించవలెను.
- B పరీక్షనాళికకు కొన్ని చుక్కల సబ్బు ద్రావణాన్ని కలపవలెను.
- రెండు పరీక్షనాళికలను కొంత సమయం పాటు తీవ్రంగా కుదపవలెను.
- కుదపడం ఆపిన వెంటనే రెండు పరీక్షనాళికలలో నూనె, నీటి పొరలు ఏర్పడవు.
- కొంతసేపు పరీక్షనాళికలను కదపకుండా ప్రక్కన ఉంచండి.
- B పరీక్షనాళికలో నూనె పొర వేరు చేయబడుతుంది. దీనికి కారణం, దానిలో సబ్బు ద్రావణం ఉండటం.