AP State Syllabus 10th Class Physical Science 6th Lesson Questions and Answers పరమాణు నిర్మాణం
10th Class Physical Science 6th Lesson పరమాణు నిర్మాణం Textbook Questions and Answers
అభ్యసనాన్ని మెరుగుపరుచుకోండి
ప్రశ్న 1.
పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం నుండి లభించే సమాచారం ఏమిటి? (AS1)
(లేదా)
ఎలక్ట్రాన్ విన్యాసంను ఒక ఉదాహరణతో వివరించుము.
జవాబు:
ఎలక్ట్రాన్ విన్యాసం :
పరమాణువులోని కర్పరాలు, ఉపకర్పరాలు మరియు ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్ల పంపిణీని “ఎలక్ట్రాన్ విన్యాసం” అంటారు.
ఎలక్ట్రాన్ విన్యాసం రాయటానికి రెండు పద్ధతులు కలవు.
అవి : 1) nlx పద్ధతి
2) బ్లాక్ డయాగ్రం పద్ధతి
1) ఎలక్ట్రాన్ విన్యాసాన్ని సూచించే మొదటి పద్ధతి అయిన nlx పద్ధతిలో n – ప్రధాన శక్తి స్థాయిని సూచించును. l విలువ ఉపశక్తి స్థాయిలను సూచించును. x విలువ ఉపశక్తి స్థాయిలలోని ఆర్బిటాళ్లలో ఉన్న ఎలక్ట్రాన్ల సంఖ్యను సూచించును.
ఉదా : హైడ్రోజన్ పరమాణువు , ¹1H ———– 1s¹ (nlx)
దీని ద్వారా n = 1 అనేది ప్రధాన క్వాంటం సంఖ్యను తెలియజేయును. S అనేది కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్యను తెలియజేయును. x = 1 అనేది S ఉపస్థాయిలోని ఆర్బిటాల్ లో ఉన్న ఎలక్ట్రాన్ సంఖ్యను తెలియజేయును.
2) ఎలక్ట్రాన్ విన్యాసంలో రెండవ పద్ధతి బ్లాక్ డయాగ్రం పద్ధతిలో ఎలక్ట్రాన్ యొక్క ఆత్మభ్రమణాన్ని తెలియజేయును.
3) 1s ఉపస్థాయిలోని ఆర్బిటాల్ లో నిండిన ఎలక్ట్రాన్ సవ్యదిశలో ఆత్మభ్రమణం చేయును.
4) ఎక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లు కలిగిన పరమాణువుల లక్షణాలను ఎలక్ట్రాన్ విన్యాసంతో తెలుసుకొనవచ్చు.
5) ఎలక్ట్రాన్ విన్యాసాల ద్వారా పరమాణువుల యొక్క క్రియాశీలతను తెలుసుకొనవచ్చు.
6) ఎలక్ట్రాన్ విన్యాసాల ద్వారా పరమాణువుల సంయోజకతలను తెలుసుకొనవచ్చు.
7) ఎలక్ట్రాన్ విన్యాసాల ద్వారా ఎటువంటి రసాయన బంధాలు ఏర్పరచగలదో తెలుసుకొనవచ్చును.
ప్రశ్న 2.
a) ఒక ప్రధాన శక్తి కర్పరంలో ఇమడగలిగే గరిష్ఠ ఎలక్ట్రానుల సంఖ్య ఎంత? (AS1)
జవాబు:
2n²
b) ఒక ఉపకర్పరంలో ఇమడగలిగే గరిష్ఠ ఎలక్ట్రానులు ఎన్ని?
జవాబు:
2(2 (l)+1)
c) ఒక ఆర్బిటాల్ నందు అమర్చగలిగే గరిష్ఠ ఎలక్ట్రానులు ఎన్ని?
జవాబు:
2
d) ఒక ప్రధాన శక్తి స్థాయిలో ఎన్ని ఉపకర్పరాలు ఉంటాయి?
జవాబు:
ప్రధాన శక్తి స్థాయి సంఖ్యకు సమాన సంఖ్యలో ఉపకర్పరాలు ఉంటాయి.
e) ఒక ఆర్బిటాల్ లోని ఎలక్ట్రాను ఎన్ని రకాల స్పిన్ దిగ్విన్యాసాలు సాధ్యమవుతాయి?
జవాబు:
ఎలక్ట్రానుకు 2 దిగ్విన్యాసాలు సాధ్యమగును.
ప్రశ్న 3.
ఒక పరమాణువులోని M – కర్పరంలో ఎలక్ట్రానులు K మరియు L కర్పరంలోని ఎలక్ట్రానుల సంఖ్యకు సమానం అయిన ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలివ్వండి. (AS1)
a) బాహ్యకర్పరం ఏది?
b) దాని బాహ్యకర్పరంలో ఎన్ని ఎలక్ట్రానులు ఉంటాయి?
c) ఆ పరమాణు సంఖ్య ఎంత?
d) ఆ మూలకానికి ఎలక్ట్రాన్ విన్యాసం రాయండి.
జవాబు:
a) N కక్ష్య.
b) రెండు.
c) 22
ప్రశ్న 4.
ఇంద్రధనుస్సు ఒక అవిచ్ఛిన్న వర్ణపటానికి ఉదాహరణ – వివరించండి. (AS1)
(లేదా)
ఏ విధముగా ఇంద్రధనుస్సు ఒక అవిచ్ఛిన్న వర్ణపటంకు ఉదాహరణ అగును? వివరించుము.
జవాబు:
వర్ణపటం : తరంగదైర్ఘ్యాల లేదా పౌనఃపున్యాల సముదాయాన్ని “వర్ణపటం” అంటారు.
వర్ణపటం రెండు రకాలు. అవి :
1) అవిచ్చిన్న వర్ణపటం,
2) పరమాణు రేఖా వర్ణపటం.
- వర్షం పడినప్పుడు వాతావరణంలో నీటి బిందువులు అధికంగా ఉండును. ఈ నీటి బిందువులపై సూర్యుని కాంతి పడితే నీటి బిందువు పట్టకంలా పనిచేసి కాంతిని పరిక్షేపణం చెందించును.
- దీనివలన ఇంద్రధనుస్సు ఏర్పడును. దీనినే VIBGYOR అంటారు.
- వీటిలోని ఏడు రంగులకు తరంగదైర్యం, పౌనఃపున్యాలు వేరుగా ఉన్నప్పటికీ ప్రతిరంగు తరువాతి రంగుతో కలసిపోయి అవిచ్చిన్నంగా గల రంగుల పట్టీ రూపంలో ఏర్పడును.
- ప్రతి రంగు తీవ్రత ఒక బిందువు నుండి మరొక బిందువుకు మారును.
- కాబట్టి అవిచ్ఛిన్న వర్ణపటానికి ఉదాహరణ ఇంద్రధనుస్సు, పరమాణు రేఖా వర్ణపటానికి ఉదాహరణ హైడ్రోజన్ వర్ణపటం.
ప్రశ్న 5.
బోర్ 3వ కక్ష్యకు సోమర్ ఫెల్డ్ ఎన్ని దీర్ఘవృత్తాకార కక్ష్యలను జత చేసినాడు? ఈ దీర్ఘవృత్తాలను జత చేయడానికి గల కారణాలు ఏమిటి? (AS1)
(లేదా)
బోర్ కక్ష్యలకు సోమర్ ఫెల్డ్ ఎన్ని దీర్ఘవృత్తాకార కక్ష్యలను కలిపాడు? ఈ విషయం బోర్ సిద్ధాంతంకు ఏ విధంగా ఉపయోగపడింది?
జవాబు:
సోమర్ ఫెల్డ్ 3వ కక్ష్యకు రెండు దీర్ఘవృత్తాకార కక్ష్యలను జత చేశాడు.
కారణాలు :
- బోర్ నమూనా హైడ్రోజన్ పరమాణువుకు సంబంధించి రేఖా వర్ణపటాన్ని వివరించుటకు ఒక విజయవంతమైన నమూనా.
- కానీ హైడ్రోజన్ రేఖా వర్ణపటాన్ని అధిక సామర్థ్యం గల వర్ణపటదర్శినితో పరిశీలించినపుడు కొన్ని ఉపరేఖల సమూహాలు కనిపించాయి.
- రేఖా వర్ణపటంలోని రేఖలు ఉపరేఖలుగా విడిపోవటాన్ని బోర్ నమూనా విశదీకరించలేకపోయింది.
- రేఖా వర్ణపటంలో ఉపరేఖలను వివరించటానికి సోమర్ ఫెల్డ్ దీర్ఘవృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టాడు.
- బోర్ ప్రతిపాదించిన వృత్తాకార కక్ష్యలను అలాగే ఉంచుతూ, సోమర్ ఫెల్డ్ రెండవ కక్ష్యకు ఒక దీర్ఘవృత్తాకార కక్ష్యను, మూడవ కక్ష్యకు రెండు దీర్ఘవృత్తాకార కక్ష్యలను కలిపాడు.
- కేంద్రం యొక్క ఆకర్షణ బలానికి లోనైన ఆవర్తన చలనంలో ఉన్న కణం దీర్ఘవృత్తాకార కక్ష్యల ఏర్పాటుకు దారితీస్తుందనే విషయం ఆధారంగా దీర్ఘవృత్తాకార కక్ష్యలను ప్రతిపాదించాడు.
ప్రశ్న 6.
శోషణ వర్ణపటం అనగానేమి?
జవాబు:
తక్కువ శక్తి కర్పరం నుండి ఎక్కువ శక్తి కర్పరానికి ఎలక్ట్రాన్ దూకినప్పుడు గ్రహించబడిన శక్తివలన ఏర్పడిన వర్ణపటాన్ని ‘శోషణ వర్ణపటం’ అంటారు. ఈ వర్ణపటం కాంతివంతమైన ప్రదేశంపై నల్లటి రేఖలను కలిగి ఉంటుంది.
ప్రశ్న 7.
ఆర్బిటాల్ అనగానేమి? బోర్ యొక్క కక్ష్య(orbit)తో పోల్చినపుడు ఇది ఏవిధంగా భిన్నమైనది? (AS1)
(లేదా)
ఆర్బిట్ మరియు ఆర్బిటాళ్ళ మధ్య భేదాలను వ్రాయుము.
జవాబు:
ఆర్బిటాల్ | ఆర్బిట్ (కక్ష్య) |
1) కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత అధికంగా గల ప్రదేశాన్ని ఆర్బిటాల్ అంటారు. | 1) కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే మార్గాన్ని ఆర్బిట్ లేదా కక్ష్య అంటారు. |
2) అయస్కాంత క్వాంటం సంఖ్య ఆర్బిటాలను తెల్పుతుంది. | 2) ప్రధాన క్వాంటం సంఖ్య ఆర్బిట్ ను తెల్పుతుంది. |
3) దీనిని s, p, d, f లతో సూచిస్తారు. | 3) దీనిని n తో సూచిస్తారు. n = 1 = K, n = 2 = L, n = 3 = M, n = 4 = N |
4) ఆర్బిటాల్ త్రిమితీయంగా ఉంటుంది. | 4) కక్ష్య ద్విమితీయంగా ఉంటుంది. |
ప్రశ్న 8.
ఒక పరమాణువులో ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని అంచనా వేయటానికి మూడు క్వాంటం సంఖ్యలు ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించండి. (AS1)
(లేదా)
పరమాణు నిర్మాణంను అవగాహన చేసుకొనుటకు క్వాంటం సంఖ్యలు ఏ విధంగా ఉపయోగపడతాయి?
జవాబు:
- పరమాణువు ప్రధాన శక్తిస్థాయి లేదా కర్పరాలను కలిగి ఉండును.
- ప్రధాన శక్తి స్థాయిలు ఉప శక్తి స్థాయిలను కలిగి ఉండును.
- ఉప శక్తిస్థాయిలు ఆర్బిటాళ్ళను కలిగి ఉండును.
- ఆర్బిటాళ్లలో నిండిన ఎలక్ట్రానులను గుర్తించటానికి స్పష్టమైన సమాచారం కావలెను.
- పరమాణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానులు ఉన్న ప్రాంతాన్ని గురించి, వాటి శక్తుల గురించి సమాచారాన్ని తెలిపే వాటిని “క్వాంటం సంఖ్యలు” అంటారు.
- ముఖ్యంగా క్వాంటం సంఖ్యలు 3 రకాలు. అవి :
1) ప్రధాన క్వాంటం సంఖ్య,
2) కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య,
3) అయస్కాంత క్వాంటం సంఖ్య
1. ప్రధాన క్వాంటం సంఖ్య :
1) ప్రధాన క్వాంటం సంఖ్యను నీల్స్ బోర్ ప్రవేశపెట్టాడు.
2) దీనిని n తో సూచిస్తారు.
3) n విలువ 1, 2, 3, 4, …… ∞
ధన పూర్ణాంక విలువను కలిగి ఉండును.
4) n విలువ పెరిగితే కేంద్రకానికి, ఎలక్ట్రాన్ కు మధ్య దూరం పెరుగును.
5) n విలువ పెరిగితే కక్ష్య పరిమాణం, శక్తి పెరుగును.
2. కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య :
1) దీనిని సోమర్ ఫెల్డ్ ప్రతిపాదించాడు.
2) దీనిని 1 తో సూచిస్తారు.
3) ప్రతి కక్ష్యలో 1 విలువలు 0 నుండి n – 1 వరకు ఉంటాయి. అనగా 1 విలువ nపై ఆధారపడి ఉండును.
4) 1 విలువను s, p, d, f సంకేతాలతో సూచిస్తారు.
5) ఇది ఆర్బిటాళ్ల ఆకృతిని, ఆర్బిటాళ్ల ఆకారాన్ని తెలియజేయును.
3.ఎ) అయస్కాంత క్వాంటం సంఖ్య :
1) దీనిని “లాండే” ప్రతిపాదించాడు.
2) దీనిని ml తో సూచిస్తారు.
3) ml విలువ l విలువపై ఆధారపడుతుంది.
4) m విలువ -l, 0, +l వరకు ఉండును.
5) ఒక నిర్దిష్ట l విలువకు అయస్కాంత క్వాంటం సంఖ్య (ml) విలువలు (2 (l) + 1) కలిగి ఉండును.
6) ఇది పరమాణువులో గల ఆర్బిటాళ్ల ప్రాదేశిక దృగ్విన్యాసాన్ని తెలుపుతుంది.
3. బి) స్పిన్ క్వాంటం సంఖ్య :
1) దీనిని ఉలెన్ బెక్, గౌడ్ స్మిత్ ప్రవేశపెట్టారు.
2) దీనిని m తో సూచిస్తారు.
3) ఈ క్వాంటం సంఖ్య ఎలక్ట్రానులకు రెండు రకాల దిగ్విన్యాసాలను సూచిస్తుంది.
4) మొదటి ఎలక్ట్రాన్ సవ్యదిశలో తిరిగితే
ప్రశ్న 9.
nlx పద్ధతి అంటే ఏమిటి? ఇది ఎలా ఉపయోగపడుతుంది? (AS1)
(లేదా)
nlx పద్ధతిని నిర్వచించి, దాని ఉపయోగంను వ్రాయుము.
జవాబు:
పరమాణువుల యొక్క ఎలక్ట్రాన్ విన్యాసాలను సూచించే సంక్షిప్త రూపాన్ని nlx పద్ధతి అంటారు.
- ఈ సంక్షిప్త రూపంలో n ప్రధాన క్వాంటం సంఖ్యను సూచిస్తుంది. లేదా కక్ష్యల సంఖ్యను సూచిస్తుంది.
n = 1, 2, 3, 4, ……… ∞. - l కక్ష్యలోని ఉప శక్తిస్థాయిలు లేదా ఉపకర్పరాలను తెలియజేస్తుంది.
- వీటిని S, p, d, f లలో తెలియజేస్తారు.
- x అనేది ఉపస్థాయిలోని ఆర్బిటాళ్లలో ప్రవేశించే ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలియజేస్తుంది. ఉదా : హైడ్రోజన్.
1H ఎలక్ట్రాన్ విన్యాసం 1s¹ (nlx) - హైడ్రోజన్ కేంద్రకం చుట్టూ ఒకే ప్రధాన శక్తిస్థాయి లేదా కర్పరం ఉండును. దీనిని n = 1 తో సూచిస్తారు.
- ఈ కర్పరానికి ఒకే ఒక ఉపస్థాయి ఉండును. దీనిని ‘S’ తో సూచిస్తారు.
- ‘S’ ఉపస్థాయిలో ఒకే ఒక ఆర్బిటాల్ ఉండును. ఆర్బిటాల్ లోనికి ఒక ఎలక్ట్రాన్ ప్రవేశించును. దీనిని x = 1 తో సూచిస్తారు.
ప్రశ్న 10.
క్రింది ఆర్బిటాల్ రేఖాచిత్రం నైట్రోజన్ పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం సూచిస్తుంది. ఇది ఏ నియమానికి వ్యతిరేకం? ఎందుకు? (AS1)
(లేదా)
హుండ్ నియమం ప్రకారం నైట్రోజన్ పరమాణువుకు ఎలక్ట్రాన్ విన్యాసంను వ్రాయుము.
జవాబు:
పై రేఖాచిత్రంలోని ఎలక్ట్రాన్ విన్యాసం హుండ్ నియమానికి వ్యతిరేకం.
కారణం :
- నైట్రోజన్ యొక్క పరమాణువుల సంఖ్య = 7 (z=7N).
- నైట్రోజన్ పరమాణువులో మొదటి, రెండవ ఎలక్ట్రానులు ఆఫ్ భౌ నియమం ఆధారంగా తక్కువ శక్తిగల 1s ఆర్బిటాల్ లోనికి ప్రవేశించును.
- మూడవ, నాలుగవ ఎలక్ట్రానులు 2s ఆర్బిటాల్ లోనికి ప్రవేశించును.
- 2px, 2py, 2pz ఆర్బిటాళ్లలను “సమశక్తి గల ఆర్బిటాళ్లు” అంటారు. లేదా “డీజనరేట్ ఆర్బిటాళ్లు” అంటారు.
- సమశక్తి గల ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్లను నింపాల్సి వచ్చినప్పుడు హుండ్ నియమాన్ని పాటించవలెను.
హుండ్ నియమం : సమశక్తి గల ఆర్బిటాళ్ళలో ఎలక్ట్రాన్లు నింపవలసి వచ్చినపుడు అన్ని ఆర్బిటాళ్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కూడటం జరుగును. - 2px, 2py, 2pz సమశక్తి గల ఆర్బిటాళ్లు కాబట్టి 5వ ఎలక్ట్రాన్ 2px లోనికి ప్రవేశించాలి.
- 6వ ఎలక్ట్రాన్ 2py లోనికి ప్రవేశించాలి.
- 7వ ఎలక్ట్రాన్ 2pz లోనికి ప్రవేశించాలి.
- ఈ విధంగా హుండ్ నియమాన్ని పాటిస్తూ ఎలక్ట్రానులను నింపవలెను.
- హుండ్ నియమం ప్రకారం నైట్రోజన్ పరమాణువులో రేఖాచిత్ర పట ఎలక్ట్రాన్ విన్యాసం ఈ క్రింది విధంగా ఉండాలి.
ప్రశ్న 11.
1s°2s²2p4 అనే ఎలక్ట్రాన్ విన్యాసం ఏ నియమాన్ని ఉల్లంఘించింది? ఎలా? (AS1)
(లేదా)
ఇవ్వబడిన 1s°2s²2p4 అను ఎలక్ట్రాన్ విన్యాసంను ఆఫ్ బౌ నియమం ప్రకారం సవరించుము.
జవాబు:
1s°2s²2p4 సూచించిన ఎలక్ట్రాన్ విన్యాసం ఆఫ్ బౌ నియమాన్ని ఉల్లంఘించింది.
ఆఫ్ భౌ నియమం :
ఎలక్ట్రానులు మొదట తక్కువ శక్తి గల ఆర్బిటాల్ లో నిండిన తర్వాతనే ఎక్కువ శక్తి గల ఆర్బిటాల్ లోనికి ప్రవేశిస్తాయి.
1) ఆర్బిటాళ్ళ శక్తులను n + l విలువలతో లెక్కగడతారు.
2) n + l విలువ 1s ఆర్బిటాలకు తక్కువ కాబట్టి మొదటి, రెండవ ఎలక్ట్రాన్లు 1s లోనికి ప్రవేశించాలి. కానీ పై విన్యాసం అలా జరగలేదు.
3) మూడవ, నాలుగవ ఎలక్ట్రాన్లు 25 లోనికి ప్రవేశించాలి.
4) తర్వాత ఆర్బిటాళ్లు సమ శక్తిగల ఆర్బిటాళ్లు కాబట్టి హుండ్ నియమాన్ని పాటిస్తూ ఎలక్ట్రానులను నింపాలి.
5) పరమాణువు సంఖ్య 6 గల కార్బన్ పరమాణువు ఎలక్ట్రాన్ విన్యాసం ఈ క్రింది విధంగా, ఉండాలి.
1s² 2s²2p²
6) రేఖా చిత్ర పద్ధతిలో ఈ క్రింది విధంగా ఉండవలెను.
ప్రశ్న 12.
సోడియం (Na) పరమాణువులో చివరగా చేరే ఎలక్ట్రాన్ యొక్క నాలుగు క్వాంటం సంఖ్యలను రాయండి. (AS1)
జవాబు:
1) 11Na పరమాణువు యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం : 1s² 2s² 2p63s¹
2) బ్లాక్ డయాగ్రం పద్ధతిలో ఈ విధంగా ఉండును.
3) సోడియంలో చివరి ఎలక్ట్రాన్ 3S లో చేరింది. 3వ ఆర్బిటాల్ లోని ఎలక్ట్రాన్ యొక్క నాలుగు క్వాంటం సంఖ్యలు ఈ క్రింది విధంగా ఉన్నవి.
ప్రశ్న 13.
ఉద్గార వర్ణపటం అనగానేమి?
జవాబు:
ఎక్కువ శక్తి కర్పరం నుండి తక్కువ శక్తి కర్పరానికి ఎలక్ట్రాన్ దూకినపుడు వెలువడిన శక్తివలన ఏర్పడిన వర్ణపటాన్ని ‘ఉద్గార వర్ణపటం’ అంటారు. ఈ వర్ణపటం నల్లని ప్రదేశం పై కాంతివంతమైన రేఖలను కలిగి ఉంటుంది.
ప్రశ్న 14.
క్రోమియం మరియు రాగి ఎలక్ట్రాన్ విన్యాసాలు రాసేటప్పుడు మినహాయింపులు ఎందుకు ఉన్నాయి? (AS1)
జవాబు:
1) పరమాణువు యొక్క బాహ్యస్థాయిలోని సమశక్తి గల ఆర్బిటాళ్ళు సగం నిండినపుడు గానీ, పూర్తిగా నిండినపుడు గానీ పరమాణువుకు అధిక స్థిరత్వం వచ్చును.
2) కాపర్ (Cu), క్రోమియం (Cr) పరమాణువులు అధిక స్థిరత్వం కోసం సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం నియమాలను అతిక్రమిస్తాయి.
ప్రశ్న 15.
i) ఒక పరమాణువులోని ఒక ఎలక్ట్రానుకు సంబంధించిన నాలుగు క్వాంటం సంఖ్యలు క్రింది పట్టికలో ఇవ్వబడినాయి. ఆ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాలకు చెందినదో తెల్పండి. (AS2)
జవాబు:
- ప్రధాన క్వాంటం సంఖ్య విలువ n = 2 కాబట్టి రెండవ కక్ష్య.
- కోణీయ ద్రవ్యవేగం క్వాంటం సంఖ్య విలువ l = 0, కాబట్టి దీని సంకేతం – s ఉపస్థాయి.
- అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ ml = 0, కాబట్టి ఒక ఆర్బిటాల్ మాత్రమే ఉండును.
- స్పిన్ క్వాంటం సంఖ్య విలువ ms = + ½, కాబట్టి ఆర్బిటాల్ లోని ఎలక్ట్రాన్ సవ్యదిశలో ఆత్మభ్రమణం చెందును.
- కాబట్టి పై సమాచారాన్ని బట్టి 2s¹ తో సూచిస్తాం.
ii) 1s¹ అనే సంక్షిప్త సంకేతంతో చూపబడిన ఎలక్ట్రాన్ యొక్క నాలుగు క్వాంటం సంఖ్యలు రాయండి. (AS1)
జవాబు:
1s¹
ప్రశ్న 16.
K మరియు L ఎలక్ట్రానిక్ కర్పరాలలో అధిక శక్తి స్థాయిలో ఉన్న కర్పరం ఏది? (ASs)
(లేదా)
L కర్పరం యొక్క శక్తి K కర్పరం కన్నా ఎందుకు ఎక్కువ? వివరించుము.
జవాబు:
- పై పట్టికను అనుసరించి K కర్పరం యొక్క n విలువ = 1.
- L కర్పరం యొక్క n విలువ = 2.
- ఏ కర్పరం యొక్క n విలువ అధికంగా ఉండునో ఆ కర్పరం యొక్క పరిమాణం, శక్తి ఎక్కువగా ఉండును.
- కాబట్టి L కర్పరం యొక్క శక్తి K కర్పరం కంటే ఎక్కువగా ఉండును.
ప్రశ్న 17.
ప్రాథమిక రంగులైన ఎరుపు, నీలం, ఆకుపచ్చల గురించిన తరంగదైర్ఘ్యం, వాని పౌనఃపున్యాల సమాచారం సేకరించండి. (AS4)
జవాబు:
రంగు | పౌనఃపున్యం | తరంగదైర్ఘ్యం |
నీలము | 606-668 T Hz | 450 – 495 nm |
ఆకుపచ్చ | 526 – 606 T Hz | 495-570 nm |
ఎరుపు | 400 – 484 T Hz | 1620 -750 mm |
ప్రశ్న 18.
ఒక రేడియో తరంగం యొక్క తరంగదైర్ఘ్యం 1 మీ. అయిన దాని పౌనఃపున్యం కనుగొనండి. (AS7)
జవాబు:
ఖాళీలను పూరించండి
1. n = 1 అయిన, దాని కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య (l) = ………. (0)
2. ఒక ఉపకర్పరంను ‘2p’ చే సూచించినచో దాని అయస్కాంత క్వాంటం సంఖ్య విలువ …….. (-1, 0, +1)
3. M – కర్పరంలో గరిష్ఠంగా ఉండే ఎలక్ట్రానుల సంఖ్య …………. (18)
4. ‘n’ యొక్క కనిష్ఠ విలువ ……… మరియు గరిష్ఠ విలువ …………. (1, ∞)
5. ‘I’ యొక్క కనిష్ట విలువ …………. మరియు గరిష్ఠ విలువ ………. (0, n – 1)
6. ‘m’ యొక్క కనిష్ఠ విలువ ………. మరియు గరిష్ఠ విలువ ……………. (-1, +1)
7. సవ్యదిశలో స్పిన్ చేస్తున్న ఎలక్ట్రాన్ యొక్క ‘ms‘ విలువ ………….. మరియు అపసవ్య దిశలో దాని ‘ms‘ విలువ ………………..(+½, -½)
సరైన సమాధానాన్ని ఎన్నుకోండి
1. ఉద్గార వర్ణపటంలో చీకటి ప్రాంతంలో కాంతివంతమైన వర్ణరేఖలు కనిపిస్తాయి. ఈ కాంతివంతమైన వర్ణరేఖలు దీనిని సూచించవు.
A) ఉద్గార వికిరణపు పౌనఃపున్యం
B) ఉద్గార వికిరణపు తరంగదైర్ఘ్యం
C) ఉద్గార వికిరణపు శక్తి
D) కాంతివేగం
జవాబు:
A) ఉద్గార వికిరణపు పౌనఃపున్యం
2. ఒక పరమాణువులోని కర్పరం L నందు ఇమడగలిగే గరిష్ఠ ఎలక్ట్రానుల సంఖ్య
A) 2
B) 4
C) 8
D) 16
జవాబు:
C) 8
3. ఒక పరమాణువులో l = 1 అయిన, దాని ఉపకర్పరంలోని ఆర్బిటాళ్ళ సంఖ్య
A) 1
B) 2
C) 3
D) 0
జవాబు:
C) 3
4. కక్ష్య యొక్క పరిమాణాన్ని, శక్తిని వివరించే క్వాంటం సంఖ్య ………
A) n
B) l
C) ml
D) ms
జవాబు:
A) n
10th Class Physical Science 6th Lesson పరమాణు నిర్మాణం Textbook InText Questions and Answers
10th Class Physical Science Textbook Page No. 115
ప్రశ్న 1.
పరమాణువులోపల, ఉపపరమాణు కణాలను మీరు నేర్చుకున్న విధంగా కాకుండా మరో విధంగా అమర్చగలరా?
జవాబు:
పరమాణువు లోపల ఉపపరమాణు కణాలను మేము నేర్చుకున్న విధంగా కాకుండా ఎన్నో విధాలుగా అమర్చవచ్చు. కానీ ఏ విధానం ప్రస్తుత ఆధునిక పరమాణు నమూనా లాగా పరమాణు స్థిరత్వాన్ని వివరించలేదు.
ప్రశ్న 2.
అన్ని పరమాణువులు ఒకే ఉపపరమాణు కణాలను కలిగి ఉంటాయా?
జవాబు:
అన్ని పరమాణువులలో కేంద్రకం ఉండును. కేంద్రకంలో ప్రోటాన్, న్యూట్రాన్ అనే ఉపపరమాణు కణాలు ఉండును. కేంద్రకం బయట ఎలక్ట్రాన్ నిరంతరం తిరుగుతూ ఉండును.
10th Class Physical Science Textbook Page No. 116
ప్రశ్న 3.
ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి?
జవాబు:
ఇంద్రధనుస్సులో వరుసగా 7 రంగులు ఉంటాయి. దీనిని VIBGYOR తో సూచిస్తాం. V = ఊదా, I = నీలిమందు రంగు, B = నీలం, G = ఆకుపచ్చ, Y = పసుపు, O = నారింజ రంగు మరియు R = ఎరుపు.
ప్రశ్న 4.
విద్యుత్ అయస్కాంత తరంగం ఏ లక్షణాలను కలిగి ఉంటుంది?
జవాబు:
విద్యుత్ అయస్కాంత తరంగం తిర్యక్ తరంగ లక్షణాలను కలిగి ఉండును. కాంతివేగంతో ప్రయాణించును.
10th Class Physical Science Textbook Page No. 117
ప్రశ్న 5.
λ ∝ 1/υ లేదా c = υλ సమీకరణాన్ని ధ్వని తరంగానికి అనువర్తింపచేయవచ్చా?
జవాబు:
λ ∝ 1/υ లేదా c = υλ. సమీకరణాన్ని ధ్వని తరంగానికి అనువర్తింపచేయవచ్చును.
10th Class Physical Science Textbook Page No. 118
ప్రశ్న 6.
ఇనుప కడ్డీని వేడిచేసేటప్పుడు దాని నుండి ఒక రంగు వెలువడుతున్న సమయంలోనే మరేవైనా రంగులు వెలువడటాన్ని నీవు గమనించావా?
జవాబు:
ఇనుప కడ్డీని అధిక ఉష్ణోగ్రత వద్ద వేడిచేసినపుడు మిగిలిన రంగులు కూడా వెలువడతాయి. కాని ఎరుపు రంగు అధిక తీవ్రత కలిగి ఉండుట వలన మిగిలిన రంగులు కనిపించవు.
ప్రశ్న 7.
క్యూట్రిక్ క్లోరైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్లం మిశ్రమాన్ని వేడిచేస్తే ఏ రంగును గమనిస్తారు?
జవాబు:
క్యూప్రిక్ క్లోరైడ్, హైడ్రోక్లోరిక్ ఆమ్ల మిశ్రమాన్ని ముద్దగా చేసి ప్లాటినం తీగపై వేడిచేస్తే ఆకుపచ్చని రంగు మంటను ఇస్తుంది.
ప్రశ్న 8.
పసుపు రంగులో వెలుగుతున్న వీధి దీపాలను మీరు చూశారా?
జవాబు:
వీధి దీపాలలో సోడియం లోహం యొక్క ఆవిరి (Sodium vapour lamp) తో తయారైన దీపాలను చూశాను. ఇవి పసుపు వర్ణంతో వెలుగుతూ, అధిక కాంతిని అందిస్తాయి. వీటి వలన రాత్రిపూట నగరాలు (cities) ఎంతో అందంగా మెరిసిపోతుంటాయి.
10th Class Physical Science Textbook Page No. 119
ప్రశ్న 9.
హైడ్రోజన్ రేఖా వర్ణపటం పరమాణు నిర్మాణం గురించి మనకు ఏం తెలుపుతుంది?
జవాబు:
హైడ్రోజన్ రేఖావర్ణపటం పరమాణువులోని ఎలక్ట్రాన్లు శక్తిని గ్రహించినా, లేదా శక్తిని ఉద్గారం చేసినా ఆ శక్తి నిర్దిష్ట విలువలతో. ఉంటుందని తెలుపుతుంది. కనుక పరమాణువులో ఎలక్ట్రానులు నియమిత శక్తి స్థాయిలలో ఉంటాయని తెలియజేస్తుంది.
10th Class Physical Science Textbook Page No. 120
ప్రశ్న 10.
ఎలక్ట్రాన్ తాను గ్రహించిన శక్తిని ఎల్లప్పటికీ అలాగే నిలుపుకొని ఉంటుందా?
జవాబు:
ఎలక్ట్రాన్ తాను గ్రహించిన శక్తిని ఎల్లప్పటికీ అలాగే నిలుపుకోదు. అతి కొద్ది సమయంలోనే అది శక్తిని కోల్పోయి తక్కువ శక్తి స్థాయిలోకి దూకుతూ చివరగా భూస్థాయిని చేరుతుంది.
10th Class Physical Science Textbook Page No. 121
ప్రశ్న 11.
కేంద్రకం చుట్టూ ఎలక్ట్రానులు నిర్దిష్ట మార్గాలలో తిరుగుతూ ఉంటాయా?
జవాబు:
ఎలక్ట్రానులు కేంద్రకం చుట్టూ నిర్దిష్ట మార్గాలను అనుసరించవు. కాబట్టి పరమాణువుకు నిర్ణీతమైన సరిహద్దు అంటూ ఏమీ ఉండదు. ఎలక్ట్రాన్లు ఒక సమయంలో నిర్ణీత ప్రాంతంలో అధికంగా ఉంటాయి అని చెప్పవలసి ఉంటుంది. దీనినే “ఆర్బిటాల్” అంటారు.
ప్రశ్న 12.
ఎలక్ట్రాను యొక్క వేగం ఎంత?
జవాబు:
ఎలక్ట్రాన్లు అత్యధిక వేగంతో తిరుగుతాయి.
ప్రశ్న 13.
ఎలక్ట్రాను యొక్క కచ్చితమైన స్థానాన్ని కనుక్కోవటం సాధ్యమేనా?
జవాబు:
ఎలక్ట్రాన్లు అత్యధిక వేగంతో తిరుగుతారు. వీటి ఖచ్చితమైన స్థానాన్ని కనుగొనడం సాధ్యం కాదు. వాటి స్థానాన్ని అంచనా మాత్రం వేయగలం. ఎలక్ట్రాన్ ‘ఉండటానికి అవకాశం ఉన్న ప్రాంతాన్ని గుర్తించగలం. దీనినే “ఆర్బిటాల్” అంటారు.
ప్రశ్న 14.
బోర్ నమూనా ప్రతిపాదించినట్లు, పరమాణువులకి నిర్దిష్టమైన సరిహద్దు అంటూ ఉంటుందా?
జవాబు:
ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ నిర్దిష్టమైన మార్గాలను అనుసరించవు కాబట్టి పరమాణువుకు నిర్దిష్టమైన సరిహద్దు అంటూ ఏమీ ఉండదు.
10th Class Physical Science Textbook Page No. 122
ప్రశ్న 15.
ఒక నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రాన్లు ఉండే ప్రాంతాన్ని ఏమని పిలవవచ్చు?
జవాబు:
నిర్దిష్ట సమయంలో ఎలక్ట్రాన్లు ఉండే ప్రాంతాన్ని “ఆర్బిటాల్” అంటారు.
ప్రశ్న 16.
క్వాంటం సంఖ్యల వల్ల మనం ఏం సమాచారం పొందగలం?
జవాబు:
క్వాంటం సంఖ్యల నుండి పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు ఉన్న ప్రాంతం గురించి మరియు వాటి శక్తుల గురించి సమాచారాన్ని తెలియజేస్తాయి.
ప్రశ్న 17.
ఒక్కొక్క క్వాంటం సంఖ్య దేనిని వ్యక్తపరుస్తుంది?
జవాబు:
ప్రధాన క్వాంటం సంఖ్య – కర్పరాలను, కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య – ఉపకర్పరాలను, అయస్కాంత క్వాంటం సంఖ్య – ఆర్బిటాళ్లను, స్పిన్ క్వాంటం సంఖ్య ఎలక్ట్రాన్ల అభిలక్షణాలను తెలియజేస్తుంది.
10th Class Physical Science Textbook Page No. 123
ప్రశ్న 18.
n = 3 అయితే ! యొక్క గరిష్ఠ విలువ ఎంత? ఏ ఏ ఉపకర్పరాలు ఉంటాయి?
జవాబు:
l = n – 1
l = 3 – 1 = 2, l యొక్క గరిష్ఠ విలువ = 2.
ఈ కర్పరంలో s, p, d ఉపకర్పరాలు ఉంటాయి.
ప్రశ్న 19.
n = 4 అయినప్పుడు 1 కి ఎన్ని విలువలు ఉంటాయి ? ఏ ఏ ఉపకర్పరాలు ఉంటాయి?
జవాబు:
n = 4
l కు 4 విలువలు ఉంటాయి. అవి :
l = 0 – s; l = 1 – p; l = 2 – d; l = 3 – f
10th Class Physical Science Textbook Page No. 126
ప్రశ్న 20.
హీలియం (He) (Z = 2) లో గల రెండు ఎలక్ట్రానులు ఎలా అమరి ఉంటాయి?
జవాబు:
హీలియం పరమాణువులో రెండు ఎలక్ట్రానులు ఉంటాయి. మొదటి ఎలక్ట్రాన్ ‘1s’ ఆర్బిటాల్ ని ఆక్రమిస్తుంది. రెండవ ఎలక్ట్రాన్ 1s ఆర్బిటాల్ లో గల మొదటి ఎలక్ట్రాన్ తో జతగూడుతుంది. అంటే He యొక్క భూస్థాయి విన్యాసం 1s².
ప్రశ్న 21.
ఒక ఆర్బిటాల్ లో గరిష్ఠంగా ఎన్ని ఎలక్ట్రానులు ఉండవచ్చు?
జవాబు:
ఒక ఆర్బిటాల్ కి కేవలం రెండు m విలువలు మాత్రమే అనుమతించబడతాయి. కావున ప్రతి ఆర్బిటాల్ లో గరిష్ఠంగా వ్యతిరేక స్పిన్లు కలిగిన రెండు ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి.
10th Class Physical Science Textbook Page No. 115
ప్రశ్న 22.
ఒక మూలకం యొక్క పరమాణువు వేరే మూలకం యొక్క పరమాణువు కంటే ఎందుకు వేరుగా ఉంటుంది?
జవాబు:
- ప్రతి మూలకం యొక్క పరమాణువులో కేంద్రకం ఉండును.
- కేంద్రకంలో ప్రోటాన్ల సంఖ్య ఒక్కో మూలకానికి ఒక్కొక్క రకంగా ఉండును.
- ఏ రెండు మూలకాల ప్రోటానుల సంఖ్య ఒకే రకంగా ఉండదు. వేరు వేరు తటస్థ పరమాణువులలో ప్రోటానులతో పాటు ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా మారును.
- అందువల్ల పరమాణువులు వేరుగా ఉంటాయి.
ప్రశ్న 23.
పరమాణువు లోపలి ప్రదేశంలో ఎలక్ట్రానులు ఎలా అమర్చబడి ఉంటాయి?
జవాబు:
- పరమాణువు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు అమిత వేగంతో నిర్దిష్ట మార్గాలలో తిరుగుతాయి.
- కేంద్రకం నుండి నిర్దిష్ట దూరాలలో తిరుగుతూ ఉన్నంత సేపూ శక్తి గ్రహించడం గానీ, కోల్పోవడం గానీ జరగదు.
- ధనావేశం గల కేంద్రకం ఋణావేశం గల ఎలక్ట్రాన్ని స్థిర విద్యుత్ ఆకర్షణ బలంతో ఆకర్షిస్తుంది.
- ఈ ఆకర్షణ బలాన్ని తట్టుకోవటానికి ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ పరిభ్రమిస్తుంది.
10th Class Physical Science Textbook Page No. 116
ప్రశ్న 24.
విద్యుత్ ఆవేశం చుట్టూ కంపించే విద్యుత్ అయస్కాంత క్షేత్రాలు, శూన్యం గుండా ప్రయాణించే తరంగ రూపంలోకి ఎలా మారతాయి?
జవాబు:
విద్యుత్ ఆవేశం కంపిస్తుంటే తన చుట్టూ విద్యుత్ క్షేత్రంలో మార్పు సంభవిస్తుంది. మారుతున్న విద్యుత్ క్షేత్రం అయస్కాంత క్షేత్రంలో మార్పు తెస్తుంది. ఒకదానితో మరొకటి లంబంగా కంపిస్తూ ప్రసారదిశకు లంబదిశలో ఉండి, కాంతివేగంతో తరంగం రూపంలోకి మారి ప్రయాణిస్తాయి.
10th Class Physical Science Textbook Page No. 117
ప్రశ్న 25.
ఒక ఇనుప కడ్డీని వేడిచేస్తే ఏమి జరుగుతుంది? వేడిచేస్తున్న కొద్దీ కడ్డీ రంగులలో ఏమైనా మార్పులు సంభవిస్తాయా?
జవాబు:
ఏ వస్తువైనా కాంతిని విడుదల చెయ్యాలంటే దానిని వేడిచెయ్యాలి. వేడిచేస్తే పరమాణువులోని ఎలక్ట్రాన్లు శక్తిని పొంది భూస్థాయి నుండి ఉద్రిక్త స్థాయిలోనికిపోతాయి. కాని ఎలక్ట్రాన్లు ఎక్కువ కాలం ఉద్రిక్త స్థాయిలో ఉండలేవు. భూస్థాయికి చేరుకొనేటప్పుడు ఎలక్ట్రాన్లు కాంతిశక్తిని ఉద్గారం చేస్తాయి. ఇనుపకడ్డీని వేడిచేసినపుడు మొదట తక్కువ శక్తిగల ఎరుపురంగు కాంతి తరంగాలను విడుదల చేస్తాయి. క్రమేణా ఉష్ణోగ్రత పెంచిన కొలదీ నారింజ, పసుపు, నీలం లాంటి ఎక్కువ శక్తి గల కాంతి తరంగాలను విడుదల చేసి చివరకు తెల్లని రంగును ఉద్గారించును.
10th Class Physical Science Textbook Page No. 118
ప్రశ్న 26.
దీపావళినాడు కాల్చిన టపాసుల నుండి వివిధ రంగులు వెలువడటం మీరు గమనించే ఉంటారు కదా! కాలుతున్న టపాసుల నుండి ఈ రంగులు ఎలా ఏర్పడతాయి?
జవాబు:
పరమాణువులను వేడిచేస్తే ఎలక్ట్రాన్లు భూస్థాయి నుండి ఉద్రిక్త స్థాయిలోనికి ప్రవేశిస్తాయి. కొంతసేపటికి గ్రహించిన ఉష్ణశక్తిని, కాంతి శక్తిగా విడుదల చేస్తాయి. దీనినే దృగ్గోచర కాంతి అని అంటాం. అయితే ఒక్కొక్క మూలకపు పరమాణువు ఒక్కొక్క రంగును ఉద్గారించును. ఏ రెండు మూలకపు పరమాణువులు ఒకే రంగును ఉద్గారించవు. కాబట్టి టపాసులను రకరకాల మూలకాలను కలిపిన సమ్మేళనాలతో తయారు చేస్తారు. ఇవి రకరకాల రంగులను వెలువరిస్తాయి. వీటి వలన ఆనందం కలుగుతుంది.
10th Class Physical Science Textbook Page No. 119
ప్రశ్న 27.
వివిధ మూలకాలు ఒకే రకమైన జ్వాలపై మండుతున్నప్పుడు వేర్వేరు రంగులు ఏర్పడటానికి కారణం ఏమిటి?
జవాబు:
ఏ రెండు మూలక పరమాణువులకు ఒకే ప్రోటానుల సంఖ్య ఉండదు. తటస్థ పరమాణువులో ధనావేశం గల ప్రోటానులకు సమాన సంఖ్యలో ఋణావేశం గల ఎలక్ట్రానులు ఉండును. ఈ ఎలక్ట్రాన్లు వివిధ శక్తులు గల కక్ష్యలలో పరిభ్రమిస్తూ ఉండును. పరమాణువులను వేడిచేస్తే ఎలక్ట్రాన్లు శక్తిని గ్రహించి నిర్దిష్ట తరంగదైర్యం, పౌనఃపున్యం గల కాంతిని విడుదల చేయును. కాబట్టి ఏ రెండు పరమాణువులూ ఒకే రంగు గల కాంతిని విడుదల చేయవు.
10th Class Physical Science Textbook Page No. 126
ప్రశ్న 28.
1s ఆర్బిటాల్ లో గల ఈ రెండు ఎలక్ట్రాన్స్ స్పిన్లు ఎలా ఉంటాయి?
జవాబు:
హీలియం పరమాణువులో గల రెండు ఎలక్ట్రాన్లు 1s ఆర్బిటాల్ లోనే ఉన్నాయి. కాబట్టి వాటి n, l మరియు ml విలువలు సమానంగా ఉంటాయి. అంటే ms తప్పనిసరిగా వేరుగా ఉండాలి. అంటే He పరమాణువులో ఎలక్ట్రాన్ల స్పిన్లు జతగూడాలి.
జంట స్పిన్లు కలిగిన ఎలక్ట్రాన్లని ↑↓ తో సూచిస్తాం. ఒక ఎలక్ట్రాన్ యొక్క ms = +1/2 అయితే రెండవ ఎలక్ట్రాన్ యొక్క ms = -1/2 అవుతుంది. అనగా ఒకే ఆర్బిటాల్ లో గల రెండు ఎలక్ట్రాన్ స్పి న్లు వ్యతిరేక దిశలలో ఉంటాయి.
10th Class Physical Science Textbook Page No. 128
ప్రశ్న 29.
ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్ లో గల ఒంటరి ఎలక్ట్రాన్ తో జతగూడుతుందా? లేదా ఖాళీగా ఉన్న వేరొక p ఆర్బిటాల్ ని ఆక్రమిస్తుందా?
జవాబు:
కార్బన్ (C) (Z = 6) పరమాణు ఎలక్ట్రాన్ విన్యాసం 1s²2s²2p². ఇందులో మొదటి నాలుగు ఎలక్ట్రానులు 1s మరియు 2వ ఆర్బిటాళ్ళలోకి చేరుతాయి. తరువాతి రెండు ఎలక్ట్రానులు వేరువేరు p ఆర్బిటాళ్ళని ఆక్రమిస్తాయి. ఆ రెండు ఎలక్ట్రానుల స్పిన్ ఒకే విధంగా ఉంటుంది.
10th Class Physical Science 6th Lesson పరమాణు నిర్మాణం Textbook Activities
కృత్యములు
కృత్యం – 1
ప్రశ్న 1.
పరమాణు నిర్మాణం గురించి మీకు గల జ్ఞానం ఆధారంగా, ఒక పరమాణు నమూనాను తయారు చేయగలరా?
జవాబు:
- పదార్థం యొక్క అతి చిన్నభాగం పరమాణువు అని గుర్తించండి.
- పరమాణువు మధ్య భాగంలో గట్టిగా, ధృడంగా ఉన్న చిన్న భాగం ఉండును. దీనిని కేంద్రకంగా గుర్తించండి.
- కేంద్రకంలో ధనావేశాలు కలిగిన ప్రోటానులు ఉంటాయని తెలుసుకోండి.
- కేంద్రకంలో ధనావేశాలు వికర్షించుకోకుండా వాటి మధ్య ఆవేశం లేని న్యూట్రానులను గుర్తించండి.
- ప్రోటానులు, న్యూట్రానులను కలిపి కేంద్రక కణాలు లేదా న్యూక్లియాన్లుగా గుర్తించండి.
- కేంద్రకం బయట ఋణావేశం గల ఎలక్ట్రానులు అత్యధిక వేగంతో నిర్దిష్ట మార్గాలలో తిరుగును. ఈ మార్గాలను కక్ష్యలు అని అంటారు. ఈ కక్ష్యల పేర్లు, క్రమసంఖ్యలను గుర్తించండి.
- తటస్థ పరమాణువులో కేంద్రకంలోని ధనావేశం, కేంద్రకం బయట ఋణావేశాలు సమానం కనుక పరమాణువు యొక్క ఆవేశం తటస్థంగా తీసుకోండి.
కృత్యం – 2
ప్రశ్న 2.
వర్ణపట రేఖల సహాయంతో పరమాణువులను ఎలా గుర్తిస్తారు?
జవాబు:
- చిటికెడు క్యూప్రిక్ క్లోరైడ్ ను వా గ్లాస్ లో తీసుకోండి.
- ఈ సంయోగ పదార్థానికి గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపి ఒక గాజు కడ్డీ సహాయంతో ముద్దలా చేయండి.
- ఒక ప్లాటినం తీగను తీసుకొని మధ్య ప్రాంతంలో పిన్నీసు వెనుకవైపు ఉండునట్లు లూప్ తయారు చేయండి.
- ఈ లూప్ పై కొంత ముద్దను తీసుకోండి.
- ఈ లూప్ ను సన్నని జ్వా లపై కొంత సేపు వేడిచెయ్యండి.
- వెంటనే ముద్ద నుండి ఆకుపచ్చని రంగు మంట విడుదలగును.
- ఆకుపచ్చని కాంతిని కేవలం క్యూట్రిక్ క్లోరైడ్ మాత్రమే ఇవ్వగలదు.
- అదే విధంగా ప్లాటినం లూప్ పై స్ట్రాన్షియం క్లోరైడ్ తీసుకొని వేడిచెయ్యండి.
- కొంత సేపటికి సమ్మేళనం నుండి ప్రకాశవంతమైన ఎర్రని రంగు గల మంట వెలువడును.
- ఎరుపు రంగు మంటను ఇవ్వగలిగినది స్టాన్షియం క్లోరైడ్ మాత్రమే. అదే విధంగా సోడియం లోహాన్ని లూప్ పై తీసుకొని వేడిచేయగా పసుపురంగు కాంతిని వెలువరించును.
- దీనినిబట్టి ప్రతి మూలకం తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారించును.
- మానవులలో ఏ ఇద్దరికీ ఒకే వేలిముద్రలు ఉండవు.
- అలాగే ఏ రెండు మూలకాలూ వేడి చేసినపుడు ఒకే రంగుల కాంతులను విడుదల చేయవు.
- ఇలా మూలక పరమాణువులు వెలువరించిన కాంతి వర్ణపటంలో రంగుల రేకల వలె కనిపిస్తాయి. కావున ఆ వర్ణపటంలోని రేఖల రంగును బట్టి పరమాణువులను గుర్తించవచ్చు.
కృత్యం – 3
ప్రశ్న 3.
కింది ఇవ్వబడిన మూలకాల ఎలక్ట్రాన్ విన్యాసాలను పట్టికలో రాయండి. జ. క్ర.సం. మూలకం పరమాణు సంఖ్య (2) ఎలక్ట్రాన్ విన్యాసం nt* పద్ధతి బ్లాక్ డయాగ్రం పద్ధతి
జవాబు: