SCERT AP 10th Class Social Study Material Pdf 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు Textbook Questions and Answers.
AP State Syllabus 10th Class Social Solutions 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు
10th Class Social Studies 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు Textbook Questions and Answers
Improve your learning (మీ అభ్యసనాన్ని మెరుగుపడుచుకోండి)
ప్రశ్న 1.
పశ్చిమాన ఉన్న గుజరాత్ లో కంటె అరుణాచల్ ప్రదేశ్ లో సూర్యోదయం రెండు గంటల ముందు అవుతుంది. కానీ, గడియారాలు ఒకే సమయం చూపిస్తాయి. ఎందుకని? (AS1)
జవాబు:
సూర్యుడు తూర్పున ఉదయించి, పడమరన అస్తమిస్తాడు. ఒక్కో రేఖాంశం పశ్చిమం నుండి తూర్పునకు తిరగటానికి ‘4’ నిమిషాలు పడుతుంది. గుజరాత్ లోని కచ్ 68°7′ తూర్పు రేఖాంశం వద్ద, అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు ప్రాంతం 97°25′ తూర్పు రేఖాంశం వద్ద కలదు. అంటే దాదాపు 30 డిగ్రీల మేర విస్తరించి ఉంది. కావున, రెండు ప్రదేశాల మధ్య రెండు గంటలు (30 x 40 ని = 120 ని||) తేడా ఉంటుంది.
కానీ భారత స్థానిక కాలరేఖగా 82° 30′ తూర్పు రేఖాంశం తీసుకోవటం జరిగింది. దేశంలో వివిధ ప్రదేశాల స్థానిక కాలాల్లోని భేదాన్ని తొలగించడానికిగాను దీనివద్ద కాలాన్ని లెక్కించి, దానినే భారతదేశ ప్రామాణిక కాలం (IST- Indian Standard Time) గా వ్యవహరిస్తున్నారు. కావున సూర్యుడు తూర్పున, పశ్చిమం కన్నా రెండు గంటలు ముందుగా ఉదయించినా గడియారాలు ఒకే సమయం చూపిస్తాయి.
ప్రశ్న 2.
హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే భారత ఉపఖండ శీతోష్ణస్థితులు ఎలా ఉండేవి? (AS1)
(లేదా)
భౌగోళికంగా భారతీయ శీతోష్ణస్థితి హిమాలయ పర్వతాల వల్ల ఏ విధంగా ప్రభావితమౌతున్నది?
జవాబు:
హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేనట్లయితే భారత ఉపఖండ శీతోష్ణస్థితులు ఇలా ఉండేవి –
- హిమాలయాల వల్ల శీతోష్ణస్థితి అనేక విధాలుగా ప్రభావితం అవుతుంది.
- భారతదేశ ఉత్తర సరిహద్దులో రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటిగాలులను అడ్డుకుంటాయి. ఇవే లేనట్లయితే తీవ్ర చలిగాలులు వీస్తాయి.
- వేసవిలో వర్షాలకు, పశ్చిమ కనుమలు దాటిన తరువాత ప్రాంతంలో ఋతుపవన తరహా శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. ఇవే లేకపోతే ఉత్తర ప్రాంతం పొడిగా ఉండేది. ఋతుపవన శీతోష్ణస్థితి లేనట్లయితే భారతదేశం ఉష్ణమండల ఎడారిగా మారి ఉండేది.
- హిమాలయాలలోని సతతహరిత అరణ్యాలు ఆవరణ సమతౌల్యతను కాపాడటానికి దోహదం చేస్తున్నాయి.
ప్రశ్న 3.
ఇక్కడ పేర్కొన్న వాటిల్లో ఏ ఏ రాష్ట్రాలలోనికి హిమాలయాలు విస్తరించి లేవు? (AS1)
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, ఉత్తరాంచల్,
జవాబు:
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలలోనికి హిమాలయాలు విస్తరించి లేవు.
ప్రశ్న 4.
భారతదేశ ప్రధాన భౌగోళిక విభజనలు ఏవి? హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చండి. (AS1)
జవాబు:
A) భారతదేశ ప్రధాన భౌగోళిక విభజనలు :
i) హిమాలయాలు
ii) గంగా-సింధూనది మైదానం
iii) ద్వీపకల్ప పీఠభూమి
iv) తీరప్రాంత మైదానాలు
v) ఎడారి ప్రాంతం
vi) దీవులు
B) హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చుట :
హిమాలయ ప్రాంతం | ద్వీపకల్ప పీఠభూమి |
i) హిమాలయ పర్వతాలు ఒక చాపం వలె పడమర నుంచి తూర్పునకు విస్తరించి ఉన్నాయి. | i) ద్వీపకల్ప పీఠభూమి మెట్టపల్లాలతో, విడివిడి భాగాలుగా విస్తరించి ఉంది. |
ii) హిమాలయాలు నవీన ముడుత పర్వతాలు. ఇవి అవక్షేప శిలలతో ఏర్పడినవి. | ii) ద్వీపకల్ప పీఠభూమి ‘గోండ్వానా భూమి’లో భాగం. ఇది పురాతన స్ఫటికాకార, కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలతో కూడి ఉన్నది. |
iii) హిమాలయాలు సమాంతరంగా ఏర్పడిన శ్రేణులు. వీని మధ్య లోయలు (డూన్లు) ఉన్నాయి. | iii) ద్వీపకల్ప పీఠభూమి తూర్పువైపునకు కొద్దిగా వాలి ఉంది. నదులు, భ్రంశాలు మరియు నిట్ర వాలులు దీనిని వేరు చేస్తున్నాయి. |
iv) ఇక్కడ జీవనదులు ప్రవహిస్తున్నాయి. నిత్యం మంచుతో కప్పబడి ఉంటాయి. | iv) జీవనదులు లేవు. వర్షధార నదులే ఉన్నాయి. మంచుతో కప్పబడి అస్సలు ఉండవు. |
v) ఖనిజ వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. | v) లోహ, అలోహ ఖనిజాల వనరులు పెద్ద మొత్తంలో ఉన్నాయి. |
vi) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలకు హిమాలయాలు ప్రసిద్ధి. ఉదా : ఎవరెస్ట్, కాంచనజంగా, నందాదేవి, కైలాష్ మొదలగునవి. | vi) సాధారణ పర్వతాలు, కొండలకు మాత్రమే ప్రసిద్ధి. ఉదా : అనె ముడి, దొడబెట్ట, అరోమకొండ మొ॥వి. |
vii) ఎవరెస్ట్ (8848 మీ|| శిఖరం ప్రపంచంలో మరియు హిమాలయాల్లో ఎత్తైన శిఖరం | vii) అనైముడి (2695 మీII) శిఖరం దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం. |
viii) గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులకు జన్మస్థలం. | viii) నర్మదా, తపతి, గోదావరి, కృష్ణా, మహానదులు ప్రవహిస్తున్నాయి. |
ప్రశ్న 5.
భారతీయ వ్యవసాయాన్ని హిమాలయాలు ఏ రకంగా ప్రభావితం చేస్తున్నాయి? (AS1)
జవాబు:
భారతీయ వ్యవసాయాన్ని హిమాలయాలు ఎంతో ప్రభావితం చేస్తున్నాయి :
- భారతదేశ ఉత్తర సరిహద్దులో సహజ రక్షణ కవచాలుగా ఉండి తీవ్ర చలికాలంలో మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులను గంగా-సింధూ మైదానాలకు తగలకుండా అడ్డుకుంటున్నాయి. ఆ ప్రాంతంలోని పంటలకు నష్టం వాటిల్లకుండా చేస్తున్నాయి.
- రుతుపవన తరహా శీతోష్ణస్థితికి హిమాలయాలే కారణం. రుతుపవనాలే లేకపోతే భారతదేశం ఉష్ణమండల ఎడారిగా మారిపోయేది. ఏ పంటలు పండే అవకాశం ఉండేది కాదు.
- హిమనీనదాల నుంచి నీళ్లు అందటంతో హిమాలయ నదులు సం||రం పొడవునా నీళ్లు కలిగి ఉండి సంవత్సరంలో అన్ని పంటకాలాల్లో కూడా నీరు సమృద్ధిగా అందిస్తున్నాయి.
- హిమాలయ నదులు కొండల నుంచి కిందికి తెచ్చే ఒండ్రు మట్టి వల్ల, మైదాన ప్రాంతాలు చాలా సారవంతంగా మారి అధిక దిగుబడికి కారణమవుతున్నాయి.
ప్రశ్న 6.
గంగా-సింధూ నది మైదానంలో జనసాంద్రత ఎక్కువ. కారణాలను తెలపండి. (AS1)
జవాబు:
గంగా-సింధూ నది మైదానంలో జనసాంద్రత ఎక్కువగా ఉండుటకు కారణాలు :
- భారతదేశంలో సుమారు 70%. మందికి వ్యవసాయమే ప్రధాన వృత్తి. కావున అధిక ఉత్పత్తులనిచ్చే సారవంతమైన ‘ఒండ్రు మృత్తికలు’ కలిగి ఈ ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువ.
- మైదాన ప్రాంతాలు ‘ప్రాచీన కాలం నుండి’ (సింధూ నాగరికత) మానవ ఆవాసాలకు నిలయం.
- ఆ మైదాన ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందిన ‘నగరాలకు’ ప్రసిద్ధి.
ఉదా : చండీగఢ్, లక్నో, పాట్నా, 4) మైదాన ప్రాంతం బాగా అభివృద్ధి చెందిన ‘సాగునీరు, తాగునీరు’ వసతులు కలిగి ఉంది.
ప్రశ్న 7.
భారతదేశ సరిహద్దులను చూపించే పటంలో కింది వాటిని గుర్తించండి. (AS5)
i) కొండలు, పర్వత శ్రేణులు – కారకోరం, జస్కార్, పాట్ కాయ్, జైంతియా, వింధ్య పర్వతాలు, ఆరావళి, కార్డమం కొండలు.
ii) శిఖరాలు – K2, కాంచనగంగ, నంగ పర్వతం, అనైముడి.
iii) పీఠభూములు – చోటానాగ్ పూర్, మాల్వా.
iv) భారత ఎడారి, పశ్చిమ కనుమలు, లక్షద్వీప దీవులు.
జవాబు:
ప్రశ్న 8.
అట్లాసు ఉపయోగించి కింది వాటిని గుర్తించండి. (AS5)
i) అగ్నిపర్వతాల విస్ఫోటనం వల్ల ఏర్పడిన దీవులు
ii) భారత ఉపఖండంలోని దేశాలు
iii) కర్కటరేఖ పోయే రాష్ట్రాలు
iv) భారత భూభాగంలో అన్నిటికంటే ఉత్తరాన ఉన్న అక్షాంశం, డిగ్రీలలో
v) భారత భూభాగంలో అన్నిటికంటే దక్షిణాన ఉన్న అక్షాంశం, డిగ్రీలలో
vi) అన్నిటికంటే తూర్పున, పడమరన ఉన్న రేఖాంశాలు, డిగ్రీలలో
vii) మూడు సముద్రాలు ఉన్న ప్రదేశం
viii) భారతదేశం నుండి శ్రీలంకను వేరుచేస్తున్న జలసంధి
ix) భారతదేశ కేంద్రపాలిత రాష్ట్రాలు
జవాబు:
i) అండమాన్, నికోబార్ దీవులు
ii) భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక, మాల్దీవులు.
iii) గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, త్రిపుర, మిజోరం, రాజస్థాన్.
iv) 37°6
v) 8°4
vi) 97°25′ మరియు 68°7′
vii) కన్యాకుమారి
viii) పాక్ జలసంధి
ix) ఢిల్లీ, చండీగఢ్, పాండిచ్చేరి, అండమాన్ & నికోబార్, లక్షద్వీప్, డామన్ & డయ్యు, దాద్రానగర్ హవేలి.
ప్రశ్న 9.
తూర్పు మైదాన ప్రాంతాలు, పడమటి మైదాన ప్రాంతాల మధ్య పోలికలు, తేడాలు ఏమిటి ? (AS1)
జవాబు:
తూర్పు మైదాన ప్రాంతాలు, పడమటి మైదాన ప్రాంతాల మధ్య పోలికలు, తేడాలు :
తూర్పు తీరమైదాన ప్రాంతాలు | పడమటి తీరమైదాన ప్రాంతాలు |
1) తూర్పు కనుమలకు, బంగాళాఖాతానికి మధ్య తీరం వెంబడి ఉన్నాయి. | 1) పశ్చిమ కనుమలకు, అరేబియా సముద్రానికి మధ్య తీరం వెంబడి ఉన్నాయి. |
2) మహానది డెల్టా నుండి కావేరి డెల్టా వరకు విస్తరించి ఉన్నాయి. | 2) రాణ్ ఆఫ్ కచ్ నుండి కన్యాకుమారి వరకు విస్తరించి ఉన్నాయి. |
3) ఇవి వెడల్పుగా, బల్ల పరుపుగా ఉన్నాయి. | 3) ఇవి సన్నగా, అసమానంగా ఉన్నాయి. |
4) ఇవి చాలా సారవంతమైనవి, డెల్టాలు ఉన్నాయి. | 4) ఇవి అంత సారవంతమైనవి కావు, డెల్టాలు ఎక్కువ లేవు. |
5) ఇక్కడ గోదావరి, కృష్ణ, మహానది మొ|| వదులు ప్రవహిస్తున్నాయి. | 5) ఇక్కడ పెద్ద నదులు ప్రవహించడం లేదు. |
6) చిల్కా కొల్లేరు, పులికాట్ లాంటి సరస్సులు ఉన్నాయి. | 6) ఈ తీర మైదానంలో సరస్సులు లేవు. లాగూన్లు, వెనుక జలాలు కలిగి ఉన్నాయి. |
7) ఉత్కళ్ తీరం, సర్కార్ తీరం, కోరమండల్ తీరం అని పిలుస్తారు. | 7) కొంకణ్ తీరం, కెనరా తీరం, మలబార్ తీరాలుగా విభజించారు. |
ప్రశ్న 10.
భారతదేశంలోని మైదాన ప్రాంతాలు వ్యవసాయానికి దోహదపడినంతగా పీఠభూమి ప్రాంతాలు తోడ్పడవు – దీనికి కారణాలు ఏమిటి ? (AS3)
జవాబు:
భారతదేశంలోని మైదాన ప్రాంతాలు వ్యవసాయానికి దోహదపడినంతగా పీఠభూమి ప్రాంతాలు తోడ్పడవు – దీనికి కారణాలు :
- పీఠభూమి ప్రాంతాలు మైదాన ప్రాంతాలంత సారవంతమైనవి కావు. మైదాన ప్రాంతాల్లోని ఒండ్రునేలలు అధిక దిగుబడికి, భూసారానికి పెట్టింది పేరు.
- పీఠభూమి ప్రాంతాలలోని నదులు జీవనదులు కావు. గంగా మైదాన ప్రాంతంలోని నదులు జీవనదులు కావటం వలన సంవత్సరమంతా సాగునీరు అందుతుంది. వ్యవసాయానికి అనుకూలం.
- మైదాన ప్రాంతాలు నదులు తీసుకువచ్చిన మెత్తని, సారవంతమైన మట్టితో ఏర్పడినవి. పీఠభూములు అగ్నిపర్వత శిలలతో ఏర్పడినవి.
10th Class Social Studies 1st Lesson భారతదేశం: భౌగోళిక స్వరూపాలు InText Questions and Answers
10th Class Social Textbook Page No.2
ప్రశ్న 1.
అట్లాసులో ‘ఇందిరా పాయింటీ’ ని గుర్తించండి. దీని ప్రత్యేకత ఏమిటి?
జవాబు:
అట్లాసులో, భారతదేశ పటంలో ఇందిరా పాయింట్ ని గుర్తించాము. దీని ప్రత్యేకత : ఇది భారతదేశపు దక్షిణ అంచు, -నికోబార్ దీవుల్లో ఉంది. 2004లో సంభవించిన సునామీలో ఇది ముంపునకు గురి అయ్యింది.
10th Class Social Textbook Page No.2
ప్రశ్న 2.
ఆంధ్రప్రదేశ్ ……. ఉత్తర అక్షాంశాల మధ్య, …….. తూర్పు రేఖాంశాల మధ్య ఉంది.
జవాబు:
12°41′ – 19°07′ ఉత్తర అక్షాంశాలు,
77° – 84°40′ తూర్పు రేఖాంశాలు
10th Class Social Textbook Page No.2
ప్రశ్న 3.
మీ అట్లాసులో ఇచ్చిన స్కేలు ఆధారంగా ఆంధ్రప్రదేశ్ తీర పొడవును కనుక్కోండి.
జవాబు:
దాదాపు 970 కి.మీ.
10th Class Social Textbook Page No.4
ప్రశ్న 4.
హిమాలయాలు ఎ) ……. కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడగా, వేట- సేకరణపై ఆధారపడిన తొలి మానవులు బి) ………. లక్షల సం||రాల క్రితం భూమి మీద ఆవిర్భవించారు.
జవాబు:
ఎ) 20
బి) 5
10th Class Social Textbook Page No.1 & 2
ప్రశ్న 5.
ఒక ప్రదేశాన్ని లేదా ప్రాంతాన్ని ఖచ్చితంగా సూచించటానికి అక్షాంశ, రేఖాంశాలను ఉపయోగిస్తారు. అట్లాసు ఉపయోగించి కింది వాక్యాన్ని సరిచేయండి.
“భారతదేశం చాలా విశాలమైన దేశం, ఇది పూర్తిగా దక్షిణార్ధ గోళంలో ఉంది. దేశం 8° – 50° ఉత్తర రేఖాంశాల మధ్య 68° – 9° తూర్పు అక్షాంశాల మధ్య ఉంది.”
జవాబు:
భారతదేశం చాలా విశాలమైన దేశం, ఇది పూర్తిగా ‘ఉత్తరార్ధ’ గోళంలో ఉంది. 8° – 4′ ‘ఉత్తర అక్షాంశాల’ మధ్య 68° -7′ తూర్పు రేఖాంశాల మధ్య ఉంది.
10th Class Social Textbook Page No.2
ప్రశ్న 6.
“భారతదేశ ద్వీపకల్పం” అన్న పదాన్ని తరచుగా ఎందుకు ఉపయోగిస్తాం?
జవాబు:
భారతదేశానికి తూర్పున బంగాళాఖాతం, పడమరన అరేబియా సముద్రం మరియు దక్షిణం వైపున హిందూ మహాసముద్రం ఉన్నాయి. మూడువైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉన్న భూభాగాన్ని “ద్వీపకల్పం” అంటారు. భారతదేశానికి మూడువైపులా సముద్రాలు (నీరు) ఉన్నాయి కాబట్టి భారతదేశ ద్వీపకల్పం అన్న పదాన్ని తరచుగా (దక్షిణ భారతదేశాన్ని ఉద్దేశించి) ఉపయోగిస్తారు.
10th Class Social Textbook Page No.2
ప్రశ్న 7.
కింద ఇచ్చిన పరిశీలనలలో అహ్మదాబాద్, ఇంఫాల్ సూర్యోదయ, సూర్యాస్తమయాలను తెలిపేవి ఏవి ? కారణాలను వివరించండి.
జవాబు:
ప్రదేశం : ఇంఫాల్ ప్రదేశం : అహ్మదాబాద్
కారణాలు :
- ఇంఫాల్ భారతదేశానికి తూర్పుగా, అహ్మదాబాద్ పశ్చిమంగా ఉన్నాయి.
- ఇంఫాల్ 93°54′ తూర్పు రేఖాంశంపై, అహ్మదాబాద్ 72° 36′ తూర్పు రేఖాంశంపై ఉన్నాయి. ముందుగా 93°54 తూ.రే. పై సూర్యోదయం జరుగుతుంది. తర్వాత 72° 36′ పై సూర్యోదయం అవుతుంది.
(లేదా)
- భూమి పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. కనుక సూర్యోదయం భూగోళానికి తూర్పున, సూర్యాస్తమయం పడమర అవుతుంది.
- భారతదేశానికి తూర్పున ఉన్న ఇంఫాల్ లో పడమర ఉన్న అహ్మదాబాద్ కంటే ముందుగా సూర్యోదయం అవుతుంది. అలాగే సూర్యాస్తమయం ఇంఫాల్ లో ముందుగాను, అహ్మదాబాయ్ తరువాత అవుతుంది.
10th Class Social Textbook Page No.4
ప్రశ్న 8.
భారతదేశ ఉత్తర మైదానాల ఏర్పాటుకు దోహదపడిన హిమాలయ, ద్వీపకల్ప నదులను పేర్కొనండి.
జవాబు:
భారతదేశ ఉత్తర మైదానాల ఏర్పాటుకు దోహదపడిన నదులు :
1) హిమాలయ నదులు : గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులు మరియు వాటి ఉపనదులు.
2) ద్వీపకల్ప నదులు : నర్మదా, మహానది మొ||వి.
10th Class Social Textbook Page No.1
ప్రశ్న 9.
పైన ఇచ్చిన ప్రపంచ పటాన్ని పరిశీలించి భారతదేశ ఉనికిని గురించి కొన్ని వాక్యాలు రాయండి.
జవాబు:
భారతదేశం ఆసియా ఖండంలో దక్షిణభాగాన ఉంది.
- భారతదేశం ఉత్తరార్ధ, పూర్వార్ధ గోళాలలో పాక్షికంగా విస్తరించి ఉంది.
- భౌగోళికంగా 8°4′ – 37°6′ ఉత్తర అక్షాంశాల మధ్య, 68°7′ – 97°25′ తూర్పు రేఖాంశాలకు మధ్యన ఉంది.
- అక్షాంశాల పరంగా ఉత్తర, దక్షిణాలుగా 30 డిగ్రీల పొడవున, రేఖాంశాల పరంగా కూడా తూర్పు, పడమరలుగా అన్నే డిగ్రీల వెడల్పున వ్యాపించి ఉంది.
- భూగోళంపై భారత ఉపఖండం హెచ్చు భూభాగ విస్తీర్ణంతో వ్యాపించి ఉంది.
10th Class Social Textbook Page No.2
ప్రశ్న 10.
పై పటం చూసి ఆర్కిటిక్ వృత్తంలో భారతదేశం ఉందని ఊహించుకోండి. అప్పుడు మీ జీవితంలో ఏ ఏ తేడాలు ఉంటాయి?
జవాబు:
భారతదేశం ఆర్కిటిక్ వృత్తంలో ఉందనుకుంటే మా జీవితంలో ఉండే తేడాలు :
1) ఆహారం : తీసుకునే ఆహారంలో తేడా ఉంటుంది. ధ్రువప్రాంత ప్రజలు ఎక్కువగా మాంసం, చేపలు తీసుకుంటారు. కనుక మేము కూడా అవే తీసుకోవాల్సి ఉంటుంది. (వరి, గోధుమ పంటలు పండవు కనుక)
2) ఆవాసం : ఆర్కిటిక్ ప్రాంతవాసులు మంచుతో నిర్మించిన ‘ఇగ్లూ’లలో, జంతుచర్మాలతో నిర్మించిన గుడారాలలో నివసిస్తారు. మేము ఇప్పటిలాగా డాబాల్లో ఉండలేము. కనుక ఆవాసంలో తేడా ఉంది.
3) దుస్తులు : ఆర్కిటిక్ ప్రాంతవాసులు చలి నుండి రక్షణకై జంతు చర్మాలతో తయారైన బట్టలను ధరిస్తారు. మనలాగా నూలు, సిల్కు దుస్తులు ధరించరు. కనుక వేసుకునే దుస్తులలో తేడా ఉంటుంది.
4) వృత్తి : ప్రస్తుతం మేము వ్యవసాయం, పరిశ్రమలు, వాణిజ్యం మొ||న వృత్తులలో ఉపాధి పొందుతున్నాం. కానీ ఆర్కిటిక్ ప్రాంతంలో వేట, చేపలు పట్టడమే ప్రధాన వృత్తులు. కాబట్టి ఎంచుకునే వృత్తిలో కూడా తేడా ఉంటుంది.
5) వినోదం : ఆర్కిటిక్ ప్రాంతంలో ఇక్కడిలా సినిమాలు, టీవీలూ, కంప్యూటర్లు, ఇంటర్నెట్లు లేవు. కావున వినోద సాధనాల్లో, వినోద కార్యక్రమాల్లో తేడా ఉంటుంది.
6) కాలాలు : ఇప్పటిలాగా వేసవి, వర్ష, చలికాలం వంటివి ఉండవు. ఆర్కిటిక్ ప్రాంతం 6 నెలలు వేసవి, 6 నెలలు శీతాకాలం. కావున కాలాల్లో కూడా తేడా ఉంటుంది.
7) రవాణా సాధనాలు : ఇప్పుడు మేము వాడుతున్న రవాణా సాధనాలు (కారు, బైక్, బస్సు, విమానం మొ||నవి) ఇవి అక్కడ అందుబాటులో ఉండవు. స్లెడ్జ్ బండ్లు లాంటివి తప్ప.
10th Class Social Textbook Page No.2
ప్రశ్న 11.
ఈ కింది పటాన్ని పరిశీలించండి. భారతదేశ సరిహద్దును గుర్తించండి. రంగులతో నింపండి.
పటంలో ఉన్న స్కేలు ఆధారంగా బంగ్లాదేశ్ తో భారతదేశ సరిహద్దు పొడవును అంచనా వేయండి.
జవాబు:
బంగ్లాదేశ్ తో భారతదేశ సరిహద్దు పొడవు సుమారు 4,096.70 కి. మీ.లు
10th Class Social Textbook Page No.3
ప్రశ్న 12.
పటం 2 ను, మీ పాఠశాలలోని ఉబ్బెత్తు నిమ్నోన్నత పటాన్ని చూడండి. మీ వేలితో కింద పేర్కొన్న వాటిని గుర్తించండి :
ఎ) దక్కను పీఠభూమి వాలు ఎటు ఉందో : తెలుసుకోటానికి గోదావరి, కృష్ణా నదుల ప్రవాహం వెంట మీ వేలు పోనివ్వండి.
బి) భూస్వరూపాలు, ఎత్తులు, దేశాలను పేర్కొంటూ బ్రహ్మపుత్ర నదీ మార్గం మొత్తాన్ని వర్ణించండి.
జవాబు:
ఎ) దక్కన్ పీఠభూమి కొద్దిగా తూర్పునకు వాలి ఉంది. గోదావరి, కృష్ణా నదులు పశ్చిమం నుండి తూర్పు వైపునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తున్నాయి.
బి) బ్రహ్మపుత్రానది టిబెట్ పీఠభూమి లోని ‘మానస సరోవరం’ (సరస్సు) దగ్గర కైలాస్ పర్వతాలలో జన్మించింది. (సింధు, సట్లెజ్ నదులు కూడా ఇక్కడే జన్మించాయి).
- టిబెట్లో బ్రహ్మపుత్రానదిని ‘సాంగ్ పో’ (Tsangpo) అంటారు.
- హిమాలయాలకు సమాంతరంగా తూర్పు వైపునకు ప్రవహిస్తుంది.
- అరుణాచల్ ప్రదేశ్ లో నైరుతి దిశగా పెద్దమలుపు తిరుగుతుంది. ఇక్కడ దీనిని “సియాంగ్” అనీ, “దిహాంగ్” అనీ అంటారు.
- తరువాత అసోం లోయలోకి వచ్చినపుడు దిబంగ్, లోహిత్ అనే రెండు ఉపనదులు కలుస్తున్నాయి.
- అసోం లోయ నుండి బంగ్లాదేశ్ లోకి ప్రవేశించి, పద్మానదితో కలిసి బంగాళాఖాతంలో కలుస్తుంది.
10th Class Social Textbook Page No.5
ప్రశ్న 13.
ఎ) మీ అట్లాసులో ఈ మూడు (హిమాద్రి, నిమ్న హిమాలయాలు, పిరే పంజాల్) పర్వతశ్రేణులను గుర్తించండి.
బి) ఉబ్బెత్తు పటంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను కొన్నింటిని గుర్తించండి.
జవాబు:
ఎ) 1) ఉన్నత హిమాలయాలు ( హిమాద్రి)
2) నిమ్న హిమాలయాలు ( హిమాచల్)
3) శివాలిక్ శ్రేణి
బి) ఎవరెస్ట్ శిఖరం, K2 శిఖరం, కాంచనగంగ, గౌరీశంకర్, నంగపర్బత్, ధవళగిరి మరియు నందాదేవి
10th Class Social Textbook Page No.5
ప్రశ్న 14.
ఎ) కింద పేర్కొన్న ప్రాంతాలపైన గోడ పటంలోనూ, ఉబ్బెత్తు నిమ్నోన్నత పటంలోనూ మీ వేలిని పోనివ్వండి.
బి) మీ అట్లాసులోని భారతదేశ భౌతిక పటంలో కింద పేర్కొన్న ప్రాంతాలను గుర్తించండి. సిమ్లా, ముస్సోరి, నైనిటాల్, రాణిఖేత్.
జవాబు:
ఎ) విద్యార్థి కృత్యము.
బి)
10th Class Social Textbook Page No.7
ప్రశ్న 15.
మీ అట్లాసులోని భారతదేశ భౌతిక పటంలో ఈ కింది వాటిని గుర్తించండి.
కొండలు | రాష్ట్రం / రాష్ట్రాలు |
పూర్వాంచల్ | |
పాట్ కాయ్ | |
నాగా కొండలు | |
మణిపురి కొండలు |
జవాబు:
కొండలు | రాష్ట్రం / రాష్ట్రాలు |
పూర్వాంచల్ | అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం |
పాట్ కాయ్ | అరుణాచల్ ప్రదేశ్ |
నాగా కొండలు | నాగాలాండ్ |
మణిపురి కొండలు | మణిపూర్ |
10th Class Social Textbook Page No.9
ప్రశ్న 16.
మీ అట్లాసులోని, భారతదేశ భౌతిక పటంలోనూ, ఉబ్బెత్తు నిమ్నోన్నత పటంలోనూ ఈ కిందివాటిని గుర్తించండి.
1. మాల్వా పీఠభూమి, 2. బుందేల్‌ఖండ్, 3. భాగేల్ ఖండ్, 4. రాజమహల్ కొండలు, 5. చోటానాగపూర్ పీఠభూమి.
జవాబు:
10th Class Social Textbook Page No.9
ప్రశ్న 17.
అట్లాసు సహాయంతో టిబెట్ పీఠభూమితో పోలిస్తే పైన పేర్కొన్న పీఠభూములు ఎంత ఎత్తులో ఉన్నాయో పేర్కొనండి.
జవాబు:
టిబెట్ పీఠభూమి – 4950 మీటర్లు
మాల్వా పీఠభూమి – 300 – 600 మీ||
బుందేల్ ఖండ్ పీఠభూమి – 2 150 – 300 మీ||
భాగేఖండ్ పీఠభూమి – 300 – 600 మీ||
చోటానాగపూర్ – 600 – 900 మీ||
టిబెట్ పీఠభూమితో పోలిస్తే మిగతా పీఠభూములు అన్నీ తక్కువ ఎత్తులోనే ఉన్నాయి.
10th Class Social Textbook Page No.10
ప్రశ్న 18.
భారతదేశ ఉబ్బెత్తు నిమ్నోన్నత పటంలో తూర్పు, పశ్చిమ కనుమల ఎత్తులను టిబెటన్ పీఠభూమి, హిమాలయ శిఖరాలతో పోల్చండి.
జవాబు:
టిబెటన్, హిమాలయ శిఖరాలు | తూర్పు, పశ్చిమ కనుమల శిఖరాలు |
1) టిబెటన్, హిమాలయ శిఖరాలు హిమాలయ పర్వతాలకు ఉత్తరభాగంలో ఉన్నాయి. | 1) తూర్పు, పశ్చిమ కనుమల శిఖరాలు ద్వీపకల్ప పీఠభూమిలో తూర్పు, పశ్చిమంగా ఉన్నాయి. |
2) ఇవి సముద్రమట్టానికి 6000 మీ|| పైన ఎత్తు కలిగి ఉన్నాయి. | 2) వీటి ఎత్తు 3000 మీ|| దాటిలేదు. |
3) ఇవి ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటాయి. | 3) మంచుతో కప్పబడి (అస్సలు) ఉండవు. |
4) ఎవరెస్ట్, కాంచనజంగ, K2, నంగప్రభాత్, నందాదేవి, నామ్చాబార్వ మొ||న వాటితోపాటు ప్రధాన శిఖరాలు ఉన్నాయి. | 4) అనైముడి, (నీలగిరి) దొడబెట్ట, అరోమకొండ మొ||న ప్రధాన శిఖరాలు ఉన్నాయి. |
5) ఎవరెస్ట్ శిఖరం (8848 మీ.) హిమాలయాల్లోనూ మరియు ప్రపంచంలోనూ ఎత్తైన శిఖరం. | 5) అనైముడి (2695 మీ.) భారత ద్వీపకల్పంలో ఎత్తైన శిఖరం |
10th Class Social Textbook Page No.12
ప్రశ్న 19.
భారతదేశ భౌతిక పటంలో డెల్టా ప్రాంతాలను గుర్తించండి. వాటి ఎత్తులలో తేడాలు ఏమిటి ? గంగా-సింధూ మైదానాలతో వీటిని పోల్చండి.
జవాబు:
డెల్టా ప్రాంతాలన్నీ దాదాపు ఒకే ఎత్తులో ఉన్నాయి.
గంగా-సింధు మైదానాలతో డెల్టా ప్రాంతాలను పోల్చడం :
గంగా – సింధూ మైదానాలు | డెల్టా ప్రాంతాలు |
1) భారతదేశ ఉత్తర ప్రాంతంలో ఉన్నాయి. ద్వీపకల్ప పీఠభూమికి, హిమాలయాలకు మధ్యన ఉన్నాయి. | 1) ద్వీపకల్ప పీఠభూమికి తూర్పుగా ఉన్నాయి. బంగాళాఖాతానికి, తూర్పు కనుమలకు మధ్యన ఉన్నాయి. |
2) గంగా, సింధూ, బ్రహ్మపుత్ర నదుల వల్ల ఏర్పడ్డాయి. | 2) మహానది, గోదావరి, కృష్ణా, కావేరి నదుల వల్ల ఏర్పడ్డాయి. |
3) ఇవి చాలా సారవంతమైనవి మరియు వ్యవసాయానికి చాలా అనుకూలం. | 3) ఇవి కూడా చాలా సారవంతమైనవి. మరియు వ్యవసాయానికి అనుకూలం. |
4) భాబర్, భంగర్, ఖాదర్, టెరాయి లాంటి భూస్వరూపాలు ఉన్నాయి. | 4) చిల్కా, కొల్లేరు, పులికాట్ లాంటి సరస్సులు ఉన్నాయి. |
5) ఇవి చాలా విస్తారమైనటువంటివి. దాదాపు 7 లక్షలు చ.కి.మీ. విస్తరించి ఉన్నాయి. | 5) ఇవి అంత విశాలమైనవి కావు. |
6) వీనిలో జీవనదులు ప్రవహిస్తున్నాయి. | 6) వీనిలో జీవనదులు లేవు. |