Students can go through AP Board 10th Class Social Notes 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు to understand and remember the concept easily.
AP Board 10th Class Social Notes 7th Lesson ప్రజలు – నివాస ప్రాంతాలు
→ ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతినే నివాస ప్రాంతం అంటాం.
→ నివాసప్రాంతంలో విద్య, మతపర, వాణిజ్యం వంటి విభిన్న కార్యక్రమాలు ఉంటాయి.
→ మానవులు సుమారుగా 1.8 లక్షల సంవత్సరాలపాటు వేటగాళ్లుగా గుంపులుగా జీవించారు. అప్పుడు వారు వ్యవసాయం చేసేవారు కాదు.
→ మానవుడు 10,000 సంవత్సరాల క్రిందట వ్యవసాయానికి, ఆహార ఉత్పత్తికి పూనుకున్నాడు. స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు.
→ వ్యవసాయం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రకృతిలోని రీతులను అర్థం చేసుకోవడం, ఆకాశంలో గ్రహాల కదలికలు వంటివి గమనించడానికి వాళ్లకు తీరికసమయం చిక్కింది. జనాభా కూడా పెరిగింది.
→ వృత్తి పనివారు వలసలు రావటంతో వ్యవసాయం చేయని ప్రజలు ఉండే ప్రాంతాలు పట్టణ ప్రాంతాలుగా అభివృద్ధి చెందాయి.
→ ప్రతి నగరానికి వివిధ రకాల ప్రాంతాలు రూపొందించడానికి, కేటాయించడానికి రూపొందించేదే మాస్టర్ ప్రణాళిక.
→ ఉపాధి కోసం నగరానికి వచ్చిన వారు భూమిని ఆక్రమించుకోవడం (నదీ తీరాలు, చెరువు గట్లు, ప్రభుత్వ భూములు మొదలగునవి), ఎవరి సహకారం లేకుండా, సదుపాయాలు లేకుండా నివాసాలు ఏర్పాటు చేసుకొనేవారు.
→ 19వ శతాబ్దంలో విశాఖపట్టణంపై ఆధిపత్యం కోసం బ్రిటిష్.. ఫ్రెంచ్ దేశాలు నావికా యుద్ధానికి దిగాయి.
→ గ్రామాలలో జరిగే వారం సంతలు ఇతర ప్రాంతాలతో సంబంధాలకు ముఖ్య వేదికలయ్యాయి.
→ నివాసప్రాంత లక్షణాలలో వైవిధ్యత పెరుగుతున్న కొద్దీ వాటిలోని సంక్లిష్టత పెరుగుతుంది.
→ భారతదేశంలో జనాభాలో మూడింట ఒక వంతు పట్టణాలు, నగరాలలో నివసిస్తున్నారు.
→ భారతదేశంలో కోటి జనాభా దాటిన నగరాలు ముంబై, ఢిల్లీ, కోల్కతా.
→ పట్టణీకరణ పెరుగుతున్నప్పటికీ ఇందుకు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించలేదు.
→ పట్టణ ప్రాంతాలలో పేదరికస్థాయి తక్కువగా ఉన్నప్పటికీ అధిక ఆదాయం , తక్కువ ఆదాయం, మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది.
→ భారతదేశంలో రూపుదిద్దుకుంటున్న విమానాశ్రయ నగరాలు – బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఢిల్లీ), రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాదు).
→ నివాస ప్రాంతం : ఒక ప్రదేశంలో మన నివాస స్థలాన్ని, మన జీవితాలను ఏర్పరచుకున్న పద్ధతినే ‘నివాస ప్రాంతం’ అంటాం.
→ స్థలం : స్థలం లేదా ప్రదేశం ఒక ప్రాంత లక్షణాలను తెలియజేస్తుంది. మిట్టపల్లాలు, సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉంది, నీటి లభ్యత, నేల రకాలు, భద్రత, ప్రకృతి శక్తుల నుండి రక్షణ వంటివి.
→ పరిస్థితి : ‘పరిస్థితి’ ఆ ప్రాంతానికి (గ్రామం/పట్టణం) ఇతర ప్రదేశాలతో సంబంధాన్ని తెలియజేస్తుంది.
→ పట్టణ : 5000 నుంచి ఒక లక్ష మధ్య గల జనాభా ఉన్న ప్రాంతాన్ని ‘పట్టణం’ అంటాం.
→ గ్రామీణ : 5000 కంటే తక్కువ జనాభా గల ప్రాంతం.
→ తరతమస్థాయి : ఇద్దరి మధ్య గాని ఎక్కువమంది మధ్యగాని ఉండే స్థాయీ భేదం.
→ మహానగరాలు : జనాభా కోటిని మించి గల నగరాలు
ఉదా : ముంబై, ఢిల్లీ, కోల్ కతా.
→ విమానాశ్రయ నగరాలు : పెద్ద విమానాశ్రయాల చుట్టూ ఏర్పడుతున్న కొత్తరకపు నివాస ప్రాంతాలను విమానాశ్రయ నగరాలు అంటాం.
→ పట్టణీకరణ : ప్రజలు ఎక్కువగా వ్యవసాయేతర పనులను చేపడుతూ నగరాలు, పట్టణాలలో నివాసం ఏర్పరచుకుంటున్నారు. దీనినే ‘పట్టణీకరణ’ అంటాం.
→ మెట్రోపాలిటన్ నగరం : పది లక్షలు నుండి కోటి మధ్య జనాభా ఉన్న నగరాలను మెట్రోపాలిటన్ నగరం అంటాం.
ఉదా : చెన్నై, హైదరాబాదు, అహ్మదాబాదు.
→ సాంప్రదాయ జీవనోపాధులు: ప్రజలు తరతరాలుగా జీవనం కోసం కొనసాగిస్తున్న వృత్తులను సంప్రదాయ జీవనోపాధులు అంటాం.
ఉదా : పాల కోసం గేదెలను పెంచడం, మట్టి కుండల తయారీ, వెదురుతో బుట్టలు అల్లడం మొదలగునవి.