Andhra Pradesh AP Board 1st Class Telugu Solutions 3rd Lesson తకధిమితోం, అరక Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 1st Class Telugu Solutions Chapter 3 తకధిమితోం, అరక
Textbook Page No. 38
తకధిమి తోం
బ, ల
తోం తోం తకధిమి తోం
తధిగిణ తధిగిణ తకధిమి తోం
తబల దరువులు ధింతక మోగెను
పాటకు తంబుర శృతిగా కలిసెను
వీణ వయొలిన్ జతగా చేరెను
అందెల రవళులు సవ్వడి చేసెను
తోం తోం తకధిమి తోం
తధిగిణ తధిగిణ తకధిమి తోం
Textbook Page No. 39
వినండి – మాట్లాడండి.
అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.
ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:
చిత్రంలో ఒక అమ్మాయి నృత్యం చేస్తుంది. ఒక పాప వీణ, ఒక పాప వయొలిన్ వాయిస్తున్నారు. ఒక బాబు హార్మోనియం, ఒక అమ్మాయి తంబుర, ఒక బాబు తబలా వాయిస్తున్నారు. ఈ సంగీత పరికరాలకు తోడుగా అందెల రవళి (శబ్దములు) జతగా కలిసిపోయాయి.
ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
జవాబు:
సంగీతం చాలా సంతోషాన్నిస్తుంది. విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత (శక్తులను) బయటకు తీస్తుంది. అప్పుడు గొప్ప కళాకారులు అవుతారు. అభ్యాసము చేస్తే ‘విద్య’ ఏదైనా వస్తుంది. ప్రయత్నం చేస్తే ఏదైనా వస్తుంది.
చదవండి.
అ) గేయంలోని వాక్యాలలో “తబల” పదానికి చుట్టండి.
జవాబు:
గేయంలో చూడాలి.
ఆ) కింది వాక్యాలలో “తబల” పదానికి చుట్టండి.
జవాబు:
Textbook Page No. 40
ఇ) చిత్రం చూడండి. పదం చదవండి. వర్ణమాలలో గుర్తించండి.
ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
1వ అక్షరం ఏమిటి ?
జవాబు: త
2వ అక్షరం ఏమిటి ?
జవాబు: బ
3న అక్షరం ఏమిటి ?
జవాబు: ల
1, 3 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: తల
3, 2, 3, 2 అక్షరాలు కలిపి చదవండి.
జవాబు: లబలబ
ఉ) కింది బొమ్మలు బ, ల అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.
ఊ) పదాలను చదవండి. ‘బ’ అక్షరానికి చుట్టండి.
జవాబు:
Textbook Page No. 41
రాయండి.
అ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ
ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి. అక్షరాలు రాయండి.
జవాబు:
ఇ) కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి.
జవాబు:
సృజనాత్మకత:
పిల్లలూ ! చుక్కలు కలుపుతూ చిత్రం గీయండి. రంగులు వేయండి. పేరు రాయండి.
జవాబు:
తబల
Textbook Page No. 42
అరక
అరకు అరక ఇది మన అరక
కలపతో చేసిన చక్కని అరక
పొలమును చక్కగ దున్నే అరక
మిట్టను, మెట్టను దున్నే అరక
రైతుకు అండగ ఉండే అరక
అరకు అరకు ఇది మన అరక
వినండి మాట్లాడండి.
అ) గేయం పాడండి. అభినయించండి.
జవాబు:
గేయాన్ని పాడుట, అభినయించుట.
Textbook Page No. 31
ఆ) పాఠం చిత్రంలో ఎవరేం చేస్తున్నారో చెప్ప౦డి.
జవాబు:
రైతు అరకతో పొలం దున్నతున్నాడు. రైతు నాగలి భుజాన వేసుకొని వెళ్ళుతున్నాడు. పిల్లలు మోటారు పంపు దగ్గర నీళ్ళతో ఆడుతున్నారు. వాళ్ళ అమ్మ ఆ విషయం చూస్తున్నది. రైతుకు ఆహారం రైతు భార్య గంపలో తీసుకువెళుతున్నది. మోటారు పంపు ద్వారా నీరు వెళుతుంది.
ఇ) కింది చిత్రం ఆధారంగా మాట్లాడండి.
జవాబు:
ట్రాక్టరుతో వ్యవసాయం చేస్తే పంట బాగా పండుతుంది. దుక్కి దున్న వచ్చును. ఎరువును ట్రాక్టర్లు ట్రక్కు ద్వారా చేరవేస్తున్నారు. మోటారు పంపు ఏర్పాటు చేసి ఉంది. ఆధునిక వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తే మంచిది. బాగా దిగుబడి సాధించవచ్చును.
చదవండి.
అ) గేయంలోని వాక్యాలలో “అరక” పదానికి చుట్టండి.
జవాబు:
గేయం చూడాలి.
ఆ) కింది వాక్యాలలో “అరక” పదానికి చుట్టండి.
జవాబు:
Textbook Page No. 32
ఇ) చిత్రం చూడండి. పదం చదవండి. వర్ణమాలలో గుర్తించండి.
ఈ) కింది గళ్ళలో అక్షరాలు చెప్ప౦డి.
1వ అక్షరం ఏమిటి ? అ
2వ అక్షరం ఏమిటి ? ర
3వ అక్షరం ఏమిటి ? క
1, 2 అక్షరాలు కలిపి చదవండి. అర
3, 2, 3, 2 అక్షరాలు కలిపి చదవండి. కరకర
ఉ) కింది బొమ్మలు అ, ర, క అనే అక్షరాలతో మొదలవుతాయి. వాటి పేర్లు చెప్ప౦డి.
ఊ) పదాలను చదవండి. ‘అ’ ‘ర’, ‘క’ అక్షరాలకు చుట్టండి.
జవాబు:
Textbook Page No. 33
రాయండి.
అ) గుర్తుల ఆధారంగా చుక్కలను కలుపుతూ అక్షరాలు రాయండి.
ఆ) చుక్కలు కలుపుతూ గీతల్లో రాయండి.
జవాబు:
ఇ) కింది గళ్ళలోని అక్షరాలతో ఏర్పడే పదాలు రాయండి..
జవాబు:
సృజనాత్మకత:
పిల్లలూ ! చుక్కలు కలుపుతూ గీయండి. రంగులు వేయండి. పేరు రాయండి.
జవాబు:
అరక