Andhra Pradesh AP Board 5th Class Telugu Solutions 10th Lesson మంచి బహుమతి Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Telugu Solutions Chapter 10 మంచి బహుమతి
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
చిత్రంలో ఏం జరుగుతున్నది?
జవాబు:
పుస్తక ప్రదర్శన జరుగుచున్నది.
ప్రశ్న 2.
ఎవరెవరు ఉన్నారు? ఏం చేస్తున్నారు?
జవాబు:
పుస్తకాలు అమ్మేవారు; కొనే పిల్లలు ఉన్నారు.
ప్రశ్న 3.
ఇలాంటి ప్రదర్శనకు వీవు వెళితే ఎలాంటి పుస్తకాలు కొంటావు?
జవాబు:
పిల్లల పజిల్స్ బుక్స్,కథల పుస్తకాలు, సైన్స్ పుస్తకాలు దేశనాయకుల పుస్తకాలు, రామాయణ, భారత భాగవత కథల పుస్తకాలు; శతక పద్యాల పుస్తకాలు- కొంటాను.
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
పుస్తకాలను ఎందుకు చదవాలి?
జవాబు:
పుస్తకాలు వినోదం కోసం, మంచి బోలెడు విషయాలు తెలుసుకోవడం కోసం, జ్ఞానం కోసం, విజ్ఞానం కోసం, అభివృద్ధి కోసం చదవాలి.
ప్రశ్న 2.
మీరు ఏమేమి పుస్తకాలు చదివారు? పుస్తకాలు చదివేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది?
జవాబు:
నేను ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు చదివాను. అంతే కాకుండా దేశంలోని అనేక ప్రదేశాల చరిత్ర పుట్టు పుర్వోత్తరాలు పుస్తకాలు చదివాను. సైన్స్ పుస్తకాలు చదివాను.
అవి చదువుతున్నప్పుడు- ఆ ప్రముఖ వ్యక్తి కష్టపడి సాధించిన గొప్పదనాన్ని- పేరు ప్రతిష్ఠలను నేను కూడా పొందాలనిపించేది. ‘చరిత్ర’ చదువుతున్నప్పుడు – ఆ ప్రదేశాన్ని చూడాలి అక్కడి విశేషాలు కళ్ళారా చూసి- నేను కూడా ‘నా యాత్ర విషయాలు” అని పుస్తకం రాయాలి అనిపించింది.
ప్రశ్న 3.
మీకు నచ్చిన పుస్తకం గురించి చెప్పండి.
జవాబు:
నాకు నచ్చిన పుస్తకం – రామాయణం. పిల్లల బొమ్మల రామాయణం’ – అనే పుస్తకం కొని చదివాను. ఎంతో ఆనందం కలిగింది. అంత మంచి పుస్తకం చదివినందుకు గొప్పగా భావించాను. రామాయణంలోని అన్ని పాత్రలు, సన్నివేశాలు మనస్సును ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రాముని పాత్ర. నాకు చాలా ఇష్టం.
- శ్రీరాముడు ఆచరించిన ధర్మం నాకు నచ్చింది.
- శ్రీరాముని గురుభక్తి నాకు నచ్చింది
- శ్రీరాముని పిత్రు భక్తి నాకు నచ్చింది.
- శ్రీరాముని ప్రజాపరిపాలన విధానం నాకు నచ్చింది.
- శ్రీరాముని సోదర ప్రేమ నాకు నచ్చింది.
- శ్రీరాముని క్షమా గుణం నాకు నచ్చింది.
- శ్రీరాముని పరాక్రమం నాకు నచ్చింది.
ఈ పుస్తకం చదివి నేను నా ప్రవర్తన మార్చుకున్నాను – మాట తీరు మార్చుకున్నాను.
చదవడం – వ్యక్త పరచడం
అ) పాఠం చదివారు కదా! పాఠం ఆధారంగా కింది మాటలు ఎవరివో రాయండి.
ప్రశ్న 1.
తన ఆలోచనలను పుస్తకాలే ప్రభావితం చేసాయని అయన చెప్పేవారు?
జవాబు:
ఈ మాటలు గాంధీజీవి.
ప్రశ్న 2.
ఉరి తీసేముందు పుస్తకాన్ని చదవటానికి కాస్త సమయం ఇవ్వమని అడిగాడు?
జవాబు:
ఈ మాటలు భగత్ సింగ్ వి
ప్రశ్న 3.
చదివేటప్పుడు సందేహాలు వస్తే వెంటనే ఇంట్లో వాళ్ళను, టీచర్లను అడిగి తెలుసుకునే దాకా ఉరుకునేదే కాదట?
జవాబు:
ఈ మాటలు సరోజనీనాయుడు గారివి.
ప్రశ్న 4.
ఆయన రోజూ రాత్రి 2.00 గంటల వరకు పుస్తకాలు చదివేవారు?
జవాబు:
ఈ మాటలు డా|| బి.ఆర్. అంబేద్కర్ మాటలు.
ఆ) కింది పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు వ్రాయండి.
మనిషి పుట్టిన చాలా కాలానికి భాష పుట్టింది. సైగల రూపంలో ఉండే భాష కాలక్రమంలో వాగ్రూపం ధరించింది. ఆ తర్వాత బొమ్మల రూపంలో, అక్షరాల రూపంలో లిపి ఏర్పడింది. లిపి ఏర్పడిన తరువాత ప్రాచీన మనవులు రాళ్ళపైన గోడల పైన సమాచారాన్ని చెక్కేవారు. ఆ తరువాత చాలా కాలానికి తాటాకులమీద ఘంటంతో రాసేవారు. వాటిని ‘తాళపత్ర గ్రంథాలు’ అనేవారు.
పురాణాలు, ఇతిహాసాలు వాటి పైనే రాసేవారు. ఆ తరువాత కాలంలో రాగిరేకుల పై రాసారు. ఆ తరువాత ఎన్నో అన్వేషణలు చేసి కాగితాన్ని కనుగొన్నారు. కాగితం కనుక్కోవడం ఒక మైలురాయి. అయితే క్రీ.శ.1440 సంవత్సరంలో జాన్ గూటెన్బర్గ్ అచ్చుయంత్రాన్ని కనుగొనడం మరో మైలురాయి. అలా రకరకాల బొమ్మలతో, రంగులతో అక్షరాలతో రూపుదిద్దుకొంది.
ప్రశ్న 1.
మొట్టమొదట భాష ఏ రూపంలో ఉండేది?
జవాబు:
సైగల రూపంలో ఉండేది.
ప్రశ్న 2.
ప్రాచీన మానవుడు సమాచారాన్ని ఎలా చెప్పేవాడు?
జవాబు:
లిపి ఏర్పడిన తర్వాత ప్రాచీన మానవులు రాళ్ళ పైన, గోడల పైన సమాచారాన్ని చెక్కి చెప్పేవాడు.
ప్రశ్న 3.
తాళపత్ర గ్రంథాలు అంటే ఏమిటి?
జవాబు:
తాటాకుల మీద ఘంటాలతో వ్రాసేవాటిని తాళపత్ర గ్రంధాలు అంటారు.
ప్రశ్న 4.
అచ్చు యంత్రాన్ని ఎవరు కనుగొన్నారు?
జవాబు:
అచ్చు యంత్రాన్ని కీ||శ|| 1440లో జాగూటెన్ బర్గ్’ కనుగొన్నాడు.
ప్రశ్న 5.
కాగితం కనుక్కోవడానికి ముందు ఏఏ విధంగా సమాచారాన్ని నిక్షిప్తం చేసేవారో వరుస క్రమంలో రాయండి.
జవాబు:
కాగితం కనుక్కోవడానికి పూర్వం సమాచారాన్ని – ప్రాచీన మానవులు రాళ్ళ పైన, గోడల పైన చెక్కైవారు. ఆ తరువాత ‘తాళపత్ర గంథం’ మీద ఆతరువాత రాగి రేకుల మీద చెక్కి నిక్షిప్తం చేసేవారు.
ఇ) కింది పేరా చదవండి. వీలైనన్ని ప్రశ్నలు రాయండి.
” పుస్తకాలు లేని గది ఆత్మలేని శరీరం వంటిది” అన్నాడొక మహనీయుడు. శరీర పోషణకు తిండి ఎంత అవసరమో బుద్ధిని వికసింపజేయడానికి పుస్తకాలు చదవడం అంతే అవసరం. పుస్తకాలు చదవడం వల్ల మంచి చెడులు తెలుస్తాయి, తెలివితేటలు పెరుగుతాయి. పుస్తకాలు మిమ్మల్ని ఒక అద్భుత ప్రపంచంలోకి తీసుకువెళతాయి.
మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. మిమ్మల్ని ఆలోచింప చేస్తాయి. మీ మెదడుకు పదును పెడతాయి. పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో పదజాలం నేర్చుకోవడమే కాకుండా ఎందరి ఆలోచనలో తెలుసుకుంటారు. విజ్ఞానం, వినోదం తో బాటు ఎలా జీవించాలో పుస్తకాలు నేర్పుతాయి. అందుకే పుస్తకాలు నేస్తాలు.
జవాబు:
ప్రశ్నలు :
- పుస్తకాలు లేని గది ఎటువంటిది?
- శరీర పోషణకు ఏది అవసరం?
- బుద్ధి వికాసానికి ఏది అవసరం?
- పుస్తకాలు చదవడం వల్ల ఏం తెలుస్తాయి?
- పుస్తకాలు ఎటు వంటివి?
పదజాలం
ఆ) పుస్తకాలు చదవడం వల్ల మీరు ఏమేమి పొందుతారో రాయండి.
జవాబు:
- పుస్తకాలు చదవడం వల్ల – బుద్ధి వికాసం పొందుతాం
- పుస్తకాలు చదవడం వల్ల – మంచి చెడులు తెలుసుకుంటాం
- పుస్తకాలు చదవడం వల్ల – తెలివి తేటలు పెంచుకుంటాం
- పుస్తకాలు చదవడం వల్ల – ఆనందం పొందుతాం
- పుస్తకాలు చదవడం వల్ల – ఆలోచన పెంచుకుంటాం
- పుస్తకాలు చదవడం వల్ల – గొప్ప గొప్ప పదజాలం నేర్చుకుంటాం
- పుస్తకాలు చదవడం వల్ల – విజ్ఞానం పొందుతాం
- పుస్తకాలు చదవడం వల్ల – ఎలా జీవించాలో నేర్చుకుంటాం.
ఆ) పుస్తకాలు వివిధ ప్రక్రియలలో ఉంటాయి. వాటిలో కింది ప్రక్రియలు చూడండి. మీరు ఏయే ప్రక్రియల పుస్తకాలు చదివారో వాటికి ‘O ‘చుట్టండి.
జవాబు:
ఇ) కింది వాక్యాలు చదవండి. అవును, లేదు రాయండి.
1. మీ పాఠ్యపుస్తకాలు కాకుండా మీరు ఇతర పుస్తకాలు చదివారా? ( )
2. కథల పుస్తకాలు చదవడానికి ప్రత్యేక సమయాన్ని కేటయించారా? ( )
3. కథల పుస్తకాలు చదివిన తర్వాత మీకు అనందం వేసిందా? ( )
4. టి.వి. చూడడానికన్నా పుస్తకాలు చదవడానికి మీరు ఇష్టపడతారా? ( )
5. ఇతర పుస్తకాలు చదవడం వల్ల అదనపు సమాచారం తెలుస్తుందా? ( )
జవాబు:
1. మీ పాఠ్యపుస్తకాలు కాకుండా మీరు ఇతర పుస్తకాలు చదివారా? ( అవును )
2. కథల పుస్తకాలు చదవడానికి ప్రత్యేక సమయాన్ని కేటయించారా? ( అవును )
3. కథల పుస్తకాలు చదివిన తర్వాత మీకు అనందం వేసిందా? (అవును)
4. టి.వి. చూడడానికన్నా పుస్తకాలు చదవడానికి మీరు ఇష్టపడతారా? ( అవును )
5. ఇతర పుస్తకాలు చదవడం వల్ల అదనపు సమాచారం తెలుస్తుందా? ( అవును )
ఈ) కింది సంభాషణ చదవండి. దీనిలో చెప్పిన తమాషా పదాలవంటి వాటిని మీరు మరికొన్ని తయారు చేయండి.
లటుకు : ఒరే చిటుకూ! మన తెలుగుభాషలో అన్నిటికన్నా పెద్ద మాట, పొడుగాటి మాట ఏదో చెప్పగలవా?
చిటుకు : ఓ! ” అమందానందకందళితహృదయారవిందుడు”.
లటుకు : అబ్బే! అది చాలా చిన్నది. నేను చెప్పనా? ” గజానన”.
చిటుకు : అదెలాగా?
లటుకు : “గజానన” పదంలో మొదటి అక్షరానికి, ఆఖరు అక్షరానికి మధ్ ‘జాన’ వుంది. జాన అంటే 9 అంగుళాలన్న మాట.
చిటుకు : అయితే కాచుకో. నేను అంతకన్నా పెద్దమాట చెప్పగలను. “దిగ్గజములు” ఇందులో మధ్యలో ఒక గజము వుంది తెలుసా?
లటుకు : ఓస్! అయితే ఇది విను, “ప్రయోజనం” ఇందులో ‘యోజనం’ దూరం ఉంది తెలుసా?
చిటుకు : అయితే అంతకన్నా పెద్దమాట చూడు! “అఖండంగా!” ఒక ఖండం మధ్యనుంది. ఔనా!
లటుకు : అయితే అన్నిటికన్నా పొడుగుమాట “ ఖగోళంలో ” ఉంది.
పై గీత గీసిన పదాలలో ఇంకో పదం దాగి ఉంది కదా! అలాంటి పదాలు మీరు తెలుసుకొని రాయండి.
జవాబు:
- పావురాలు
- ఒక్క పలుకు
- వాలిపోయెను
- ప్రముఖం
- మందారం
- మైలవరం
ఉ) మీ పాఠశాల గ్రంథాలయంలో ఏమేమి పుస్తకాలు ఉన్నాయో చూడండి. వాటి పేర్లు రాయండి. ఏ పుస్తకం ఎవరు రశారో పట్టికలో నింపండి.
జవాబు:
స్వీయరచన
అ) కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
భగత్ సింగ్ ఏ కోరిక కోరాడు ?
జవాబు:
భగత్ సింగ్ తనకిష్టమైన లెనిన్ రచించిన ‘రాజ్యం -విప్లవం’ అనే పుస్తకం చదవాలని చివరగా కోరాడు.
ప్రశ్న 2.
మీరు చదివేటప్పుడు సందేహం వస్తే ఏం చేస్తారు?
జవాబు:
మేము చదివేటప్పుడు సందేహం వస్తే- ఉపాధ్యాయులను లేదా తల్లిదండ్రులను అడిగి తెలుసుకుంటాం- తోటి స్నేహితులను కూడా అడిగి తెలుసుకుంటాం లేదా! సంబంధించిన పుస్తకాలు చదివి తెలుసుకుంటాం.
ప్రశ్న 3.
పుస్తకాలు చదవడం ద్వారా గొప్పవారైన వారి గురించి తెలుసుకున్నారు కదా! పుస్తకాలు చదవడం వల్ల మనకు కలిగే లాభాలేంటి?
జవాబు:
- పుస్తకాలు చదవడం వల్ల – బుద్ధి వికాసం పొందుతాం
- పుస్తకాలు చదవడం వల్ల – మంచి చెడులు తెలుసుకుంటాం
- పుస్తకాలు చదవడం వల్ల – తెలివి తేటలు పెంచుకుంటాం
- పుస్తకాలు చదవడం వల్ల – ఆనందం పొందుతాం
- పుస్తకాలు చదవడం వల్ల – ఆలోచన పెంచుకుంటాం
- పుస్తకాలు చదవడం వల్ల – గొప్ప గొప్ప పదజాలం నేర్చుకుంటాం
- పుస్తకాలు చదవడం వల్ల – విజ్ఞానం పొందుతాం
- పుస్తకాలు చదవడం వల్ల – ఎలా జీవించాలో నేర్చుకుంటాం.
ప్రశ్న 4.
మీరు చదివిన పుస్తకం గురించి, అది మీకు ఎందుకు నచ్చిందో రాయండి?
జవాబు:
నాకు నచ్చిన పుస్తకం – రామాయణం. ‘పిల్లల బొమ్మల రామాయణం’ – అనే పుస్తకం కొని చదివాను. ఎంతో ఆనందం కలిగింది. అంత మంచి పుస్తకం చదివినందుకు గొప్పగా భావించాను. రామాయణంలోని అన్ని పాత్రలు, సన్నివేశాలు మనస్సును ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా రాముని పాత్ర. నాకు చాలా ఇష్టం.
- శ్రీరాముడు ఆచరించిన ధర్మం నాకు నచ్చింది.
- శ్రీరాముని గురుభక్తి నాకు నచ్చింది ,
- శ్రీరాముని పిత్రు భక్తి నాకు నచ్చింది.
- శ్రీరాముని ప్రజాపరిపాలన విధానం నాకు నచ్చింది.
- శ్రీరాముని సోదర ప్రేమ నాకు నచ్చింది.
- శ్రీరాముని క్షమా గుణం నాకు నచ్చింది.
- శ్రీరాముని పరాక్రమం నాకు నచ్చింది.
ఈ పుస్తకం చదివి నేను నా ప్రవర్తన మార్చుకున్నాను – మాట తీరు మార్చుకున్నాను.
సృజనాత్మకత
“పుస్తకం హస్త భూషణం” అంటే చేతికి పుస్తకమే ఒక అలంకరణ. ఇది ఒక సూక్తి, ఇలాంటి సూక్తులు కింద మరికొన్ని ఉన్నాయి. చదవండి. ఇలాంటి సూక్తులను సేకరించి రాయండి.
జవాబు:
- పుస్తకం నోరు విప్పని మహావక్త
- మంచి పుస్తకం తెరచి ఉంచిన దేవాలయం
- పుస్తకం హస్త భూషణం
- పుస్తకాలు నిజమైన నేస్తాలు
- పుస్తకాలు లేని గది ఆత్మలేని శరీరం వంటిది
- పుస్తకాలు శాశ్వత స్నేహితులు
- మంచి పుస్తకమే – మంచి స్నేహితుడు
- చిరిగిన చొక్కా తొడుక్కో- కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో.
- పుస్తకం – విజ్ఞాన సూచిక
- పుస్తకం- చక్కని మార్గ దర్శి
భాషాంశాలు
అ) కింది వాక్యాలను చదవండి..
- ‘ఆహా! ఆ బంగారు లేడి ఎంత బాగున్నది!’ అని సీత రాముడితో అన్నది.
- అయ్యో! పడిపోయావా.
- కవి ప్రతిభను ఔరా! అని మెచ్చుకున్నారు.
- భళా! ఈ వినోదం అందరికీ అవసరం.
- ‘అమ్మో!’ ఆ కుక్క కరుస్తుంది.
ఆ) కింది వాక్యాలను చదవండి. ‘అవ్యయము”లను గుర్తించండి.
- ‘ఆహా! ఈ భవనము ఎంత సుందరముగా ఉన్నది?
- ఔరా! ఎంత పని చేశావు?
- అరె! అలా ఎందుకు జరిగింది?
- అయ్యో! నేను చెప్పేది వినవా?
- ఏమీ! నేను రాకుండానే వెళ్తారా?
జవాబు:
- ‘ఆహా! ఈ భవనము ఎంత సుందరముగా ఉన్నది?
- ఔరా! ఎంత పని చేశావు?
- అరె! అలా ఎందుకు జరిగింది?
- అయ్యో! నేను చెప్పేది వినవా?
- ఏమీ! నేను రాకుండానే వెళ్తారా?
ఇ) ముందు పాఠాల ఆధారంగా కింద పట్టికను పూరిచండి.
జవాబు:
ధారణ చేద్దాం
ఊ|| తనువు, రక్తంబు, జీవంబు ధారవోసి
ఋషి వతంసులు పెక్కు వేలేండ్లు తపము
సలిపి ఆర్జించినట్టి విజ్ఞాన ధనము
దాచి యుంచిన పేటి గ్రంథాలయమ్ము ?
భావం :
ఋషి శ్రేష్ఠులు వేల సంవత్సరాలు తపస్సు చేసి శరీరం రక్తం ధారపోసి జ్ఞానాన్ని సంపాదించారు. ఇలాంటి జ్ఞాన ధనాన్ని దాచి పెట్టిన పెట్టెలాంటిది గ్రంథాలయం.
– నాళం కృష్ణారావు
జవాబు:
విద్యార్థి పద్యాన్ని – భావాన్ని పద విభాగంతో చదవటం నేర్చుకుని, భావయుక్తంగా, ఆర్థవంతంగా ధారణచేయాలి. అందుకు ఉపాధ్యాయులు సహకరించాలి. అందులోని నీతిని, విషయాన్ని వంటపట్టించుకోవాలి.
పదాలు – అర్థాలు
బహుమతి = కానుక,
సరోవరం = కొలను,చెరువు,
మాజీ = మునుపటి,
అహింస = హింసలేని,
నిర్మాత = తయారు చేసినవారు,
నేస్తాలు = స్నేహితులు
చదువు – అర్థం చేసుకో – ఆనందించు. పరీక్షల కోసం కాదు..
నవ్వులతాతయ్య చిలకమర్తి
గమ్మత్తుగా మాట్లాడితే నవ్వొస్తుంది. ఒక మాటకే రెండు అర్ధాలు వచ్చేటట్లు మాట్లాడితే నవ్వొస్తుంది. మాటలతో ఏడ్చేవాళ్ళను నవ్వించొచ్చు, నవ్వేవాళ్ళను ఏడ్పించవచ్చు. చిన్న పిల్లలు, పెద్దలు అందరూ నవ్వేటట్లు ఈ చిలకమర్తి లక్ష్మీ నరసింహం తాతయ్య చాలా కథలు రాశారు.
1890 సంవత్సరంలో ఒకరోజున “ఏమండీ ఒక పద్యం చెప్పరూ” అని ఒకళ్ళు అడిగారట. “నాయనా పూర్వం పద్యం చెపితే బంగారం, వెండి యిచ్చేవారు. ఇప్పుడు పకోడి అయినా యిచ్చేవాళ్ళు లేరు” : అని పకోడి మీద ఈ కింది పద్యం చెప్పారు.
ఆ కమ్మదనము నారుచి
యా కరకర యా ఘుమఘుమ యా పొంకములా
రాకలు పోకలు వడుపులు
నీకే దగు నెందులేవు నిజము పకోడీ.
మన దేశంలోను, మన వూళ్ళోను, మన యింట్లోనూ, మనలోను వుండే గమ్మత్తులన్నీ, వీరు కథల్లో, వ్రాశారు వాటిలో కొన్ని గమత్తులు చూడండి.
హరి : ఈ వీథి యెక్కడికి వెడుతుందండి?
శంకరం : ఈ వీథి ఎక్కడికీ వెళ్ళదు. నా చిన్నతనం నుండి. నేను చూస్తున్నాను. ఇది ఇక్కడనే ఉంటుంది.
హరి : మీ యింట్లో కూరలు యీ రోజున యేమి చేసినారండి?
శంకరం : ఏమి చేస్తాం – తిన్నాం
హరి : మీ వూళ్లో బడి సరిగా జరుగుతున్నదా?
శంకరం : ఒక్క అంగుళమయినా జరగటం లేదు.మునుపున్న చోటనే ఉన్నది.
హరి : మీరు ఈ రోజున యేమి యెక్కి వచ్చినారండీ?
శంకరం : ఏమెక్కి ? పొద్దెక్కి, ఎండెక్కి వచ్చాం.
హరి : మీరు ఏ నీళ్లు తాగుతారు? చెరువునీళ్లా? నూతినీళ్లా?
శంకరం : అదియేటో మాకు తెలియదు. మేము మంచినీళ్లు తాగుతాం
హరి : ఏ పాలు పుచ్చుకొంటే మనం చెడిపోతాం?
శంకరం : పాపాలు, కోపాలు
ఇంకా నవ్వుల తాతయ్య చిలకమర్తి గారి గయ్యాళి గంగమ్మ, ప్లీడరు తమాషా, పెండ్లి కొడుకు ధరలు, గొట్టాలమ్మ, కనకయ్య పంతులకంతి, ఆకాశరామన్ మొదలయినవి చదువుతుంటే కడుపు చెక్కలయ్యేటంత నవ్వు వస్తూ ఉంటుంది.