AP Board 3rd Class EVS Solutions 10th Lesson ఆటలు – వినోదం

Andhra Pradesh AP Board 3rd Class EVS Solutions 10th Lesson ఆటలు – వినోదం Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 3rd Class EVS Solutions Lesson 10 ఆటలు – వినోదం

I. విషయావగాహన:

ప్రశ్న 1.
నీవు ఇష్టపడే ఏవైనా ఐదు ఔట్ డోర్ గేమ్స్ రాయుము.
జవాబు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్, టెన్నికాయిట్, బాస్కెట్ బాల్ నేను ఇష్టపడే ఔట్ డోర్ గేమ్స్.

ప్రశ్న 2.
ఏదైనా నీకు తెలిసిన ఆట నియమాలు చెప్పు.
జవాబు.

  1. క్రికెట్ ఆట ప్రతిటీమ్ లో 11 మంది ఆటగాళ్ళతో రెండు టీమ్ ల మధ్య జరిగే ఆట.
  2. ప్రతి టీమ్ కు ఆటలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కు అవకాశం ఉంటుంది.
  3. ఫిల్డింగ్ టీమ్ లోని సభ్యులు బ్యాటింగ్ చేసే వారికి బౌలింగ్ చేస్తారు.

II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:

ప్రశ్న 3.
రోజూ ఇంటి వద్ద ఆటలు ఆడే నీ స్నేహితుల పేర్లు చెప్పు.
జవాబు.
సరళ, సారిక, భిభూతి, విగ్నేష్, పూజిత, వైష్ణవి, సాయి, కిరణ్, సూర్య ప్రతిరోజూ ఇంటి వద్ద ఆటలు ఆడే నా స్నేహితుల పేర్లు.

AP Board 3rd Class EVS Solutions 10th Lesson ఆటలు - వినోదం

III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:

ప్రశ్న 4.
పాఠ్యపుస్తకంలో సూచించిన ఏదైనా ఒక స్థానిక ఆట ఆడి మీ అనుభవాలు చెప్పండి.
జవాబు.
నేను మా ఊరిలోని మిత్రులతో కలిసి ఆడే స్థానిక ఆట ఏడు పెంకులాట’. ఈ ఆట ఆడటం ద్వారా నేను ఉత్సాహాన్ని, శక్తిని పొందుతాను. ఇలాంటి ఆటలు ఆడటం ద్వారా క్రీడా స్పూర్తి, జట్టుతో పని చేయడానికి సంసిద్ధత, పెంపొందుతాయి.. ఆప జయాన్ని అంగీకరించడం, విజయాన్ని ఆనందించటం వంటి నైపుణ్యాలు అలవడతాయి.

IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:

ప్రశ్న 5.
నీ స్నేహితులని అడిగి వారికి ఇష్టమైన ఆటలు వివరాలు క్రింద ఇచ్చి పట్టికలో రాయండి.

AP Board 3rd Class Maths Solutions 10th Lesson ఆటలు - వినోదం 2

జవాబు.
విద్యార్థి కృత్యము

V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:

ప్రశ్న 6.
మట్టిని ఉపయోగించి ఆట వస్తువులు బాలు, బ్యాట్, టెన్ని కాయిట్, టెన్నిస్ ర్యాకెట్, షటిల్ కాక్ మొదలైనవి తయారు చేసి మీ తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.

AP Board 3rd Class EVS Solutions 10th Lesson ఆటలు - వినోదం

VI. ప్రశంస:

ప్రశ్న 7.
నీ స్నేహితుడు పాఠశాలలో జరిగే, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలో బహుమతి గెల్చుకున్నాడు. తన బహమతిని నీకు చూపించాడు. నీవు ఏ విధంగా అభినందిస్తావు?
జవాబు.
నా మిత్రుడు ఆగష్టు 15న స్కూలులో నిర్వహించిన పోటీలలో బహుమతిని పొంది దానిని చూపగా నేను ఎంతో సంతోషడ్డాను. నేను నా మిత్రుడిలోని నైపుణ్యాని మరింత వృద్ధి చేసుకుని భవిష్యత్తులో మరింత విజయం సాధించుటకు, కృషి చేస్తాను.

అదనపు ప్రశ్నలు – జవాబులు:

I. విషయావగాహన:

ప్రశ్న 1.
పిల్లలకు ఆటలు ఆడవలసిన ఆవశ్యకత ఏమిటి?
జవాబు.
పిల్లలు కష్టపడి చదువుతూ అభ్యసన కృత్యాలలో ఎల్లప్పుడూ నిమగ్నమై ఉంటారు. పిల్లలు ఏదైనా ఒకే పనిని మరలా చేయడం వల్ల విసుగు చెందుతారు. ఎప్పుడూ పని , చేయడం వల్ల తొందరగా అలసిపోయి విసుగు చెందుతారు. అప్పుడప్పుడూ కొంత విరామం, వినోదం వారికి చాలా అవసరం. కావున అట్టి విరామం, వినోదం పొందటం కోసం పిల్లలు ఆటలు ఆడాలి.

ప్రశ్న 2.
ఇండోర్ గేమ్స్ అనగానేమి? ఉదాహరణలివ్వండి.
జవాబు.
ఇంటి లోపల ఆడే ఆటలను “ఇండోర్ గేమ్స్” అంటారు. ఉదా :- లూడో, చైనీస్ చెక్కర్స్, టేబుల్ టెన్నిస్ మొదలైనవి.

ప్రశ్న 3.
వినోదం అనగానేమి? వినోదం కోసం చేసే కొన్ని క్రియలను పేర్కొనండి?
జవాబు.
ఆనందం, మన శరీరం తేలికగా ఉండటం కోసం చేసే క్రియనే వినోదం. అంటారు. వినోదాన్నిచ్చే కొన్ని క్రియలు :- చదవటం, ఆటలు, ఆడటం, సంగీతం వినడం, నృత్యం, టి.వి. చూడటం, తోటపని, ప్రయాణించటం పాలు, బీచ్లు వంటివి సందర్శించటం.

AP Board 3rd Class EVS Solutions 10th Lesson ఆటలు - వినోదం

ప్రశ్న 4.
“అవుట్ డోర్ గేమ్స్” అనగానేమి? ఉదాహరణలివ్వండి ?
జవాబు.
ఖాళీ ప్రదేశాల్లో క్రీడా మైదానంలో ఆడే ఆటలను “అవుట్ డోర్ గేమ్స్” అంటారు.
ఉదా:- ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టెన్సిస్, టెన్ని కాయిట్ మొదలైనవి.

ప్రశ్న 5.
ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా ఎలక్ట్రానిక్ పరికరాలతో (వీడియోగేమ్స్)తో కొలం గడుపుతున్నారు. అలా చేయడం వల్ల కలిగే దుష్ప భావాలు ఏమిటి?
జవాబు.
ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా, కంప్యూటర్లు, వీడియో గేమ్స్ వంటి వాటితో కాలం గడిపేస్తున్నారు. కానీ ఇలాంటివి చేయడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటుంది. కళ్ళపై
ప్రభావం చూపుతుంది. ఊబకాయం వస్తుంది.

ప్రశ్న 6.
పిల్లలు ఆడటం వల్ల ఉపయోగాలు ఏమిటి?
జవాబు.
పిల్లల ఆటల వల్ల ఉపయోగాలు :

  1. ఆనందం, ఆరోగ్యం పొందుతారు.
  2. పరస్పర సహకారం, ఐక్యత, పరస్పర అవగాహన, నాయకత్వ లక్షణాలు లాంటి ఉన్నత వ్యక్తిత్వ లక్షణాలు అభివృద్ధి చేసుకుంటారు.
  3. జట్టుతో పని చేయడానికి సంసిద్ధత.
  4. ఏకాగ్రత, సహనం అభివృద్ధి చేసుకుంటారు.
  5. ఆపజయాన్ని అంగీకరించటం, విజయాన్ని ఆనందించటం వంటి జీవన నైపుణ్యాలను అలవరుకుంటారు.
  6. తమ వంతు వచ్చే వరకు ఓపికగా ఎదురు చూడటం వంటివి అలవడతాయి.

AP Board 3rd Class EVS Solutions 10th Lesson ఆటలు - వినోదం

ప్రశ్న 7.
ఈ క్రింది పొడుపు కథలను సరియైన చిత్రాలతో జతపరచండి. ఒకటి చేయబడింది.
జవాబు.

AP Board 3rd Class Maths Solutions 10th Lesson ఆటలు - వినోదం 1

VI. ప్రశంస:

ప్రశ్న 8.
నియమాలు అనగానేమి? మనం నియమాలను ఎందుకు పాటించాలి?
జవాబు.

  1. “నియమాలు” అనేవి. ఆటలోని సభ్యులందరూ పాటించవలసినవి.
  2. ఆటలలో అనవసర వాదనలు నివారించుటకు నియమాలు పాటించాలి.

AP Board 3rd Class EVS Solutions 10th Lesson ఆటలు - వినోదం

బహుళైచ్ఛిక ప్రశ్నలు:

ప్రశ్న 1.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ ___________
A) క్రికెట్
B) కబడ్డి
C) టెన్నిస్
D) ఏదీకాదు
జవాబు.
B) కబడ్డి

ప్రశ్న 2.
మన జాతీయ క్రీడ ___________
A) క్రికెట్
B) కబడ్డీ
C) హాకీ
D) టెన్సిస్
జవాబు.
C) హాకీ

ప్రశ్న 3.
ఆటలు ఆడటం అనేది ___________
A) విచారకరమైంది
B) ఆనందం
C) వినోదాత్మకమైనది
D) ఏదీకాదు
జవాబు.
C) వినోదాత్మకమైనది

AP Board 3rd Class EVS Solutions 10th Lesson ఆటలు - వినోదం

ప్రశ్న 4.
ఇంటి లోపల ఆడే ఆటలను ___________ అంటారు.
A) అవుట్డోర్ ఆటలు
B) ఇండోర్ ఆటలు
C) క్రీడలు
D) ఏదీకాదు
జవాబు.
B) ఇండోర్ ఆటలు

ప్రశ్న 5.
ఆటలు, క్రీడలు ఎలాంటి లక్షణాలను పెంపొందిస్తాయి. ___________
A) జట్టు భావన
B) ఏకాగ్రత
C) ఓపిక
D) పై అన్నీ
జవాబు.
D) పై అన్నీ

ప్రశ్న 6.
పిల్లలు ఆటలు ఆడుటకు మంచి సమయం. ___________
A) సాయంత్రం 4-6 గం||లకు
B) సాయంత్రం 5-7గం||లకు
C) మధ్యాహ్నం 12.00 గం||
D) ఏదీ కాదు.
జవాబు.
A) సాయంత్రం 4-6 గం||లకు

AP Board 3rd Class EVS Solutions 10th Lesson ఆటలు - వినోదం

ప్రశ్న 7.
క్రింది వానిలో వినోదాత్మకమైన చర్యలు ___________
A) ఆనందం
B) టి.వి. చూడటం
C) సంగీతం వినటం
D) పై అన్నీ
జవాబు.
D) పై అన్నీ

ప్రశ్న 8.
ఆనందం కోసం చేసే క్రియనే ___________ అంటారు.
A) ఆనందం
B) విచారం
C) వినోదం
D) ఏదీకాదు.
జవాబు.
C) వినోదం

ప్రశ్న 9.
కోతి కొమ్మచ్చి , ఏడు పెంకులాట, తొక్కుడు బిళ్ళ వంటివి. ___________ కు ఉదాహరణ.
A) ఇండోర్ ఆటలు
B) క్రీడలు
C) స్థానిక ఆటలు
D) ఏదీ కాదు.
జవాబు.
C) స్థానిక ఆటలు

AP Board 3rd Class EVS Solutions 10th Lesson ఆటలు - వినోదం

ప్రశ్న 10.
పరికరాలతో సంబంధం లేని ఆట ___________
A) కో, కో
B) పరుగు ఆట
C) A మరియు B
D) ఏదీ కాదు.
జవాబు.
C) A మరియు B