Andhra Pradesh AP Board 3rd Class EVS Solutions 11th Lesson దిక్కులు మూలాలు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class EVS Solutions Lesson 11 దిక్కులు మూలాలు
I. విషయావగాహన:
ప్రశ్న 1.
నాలుగు దిక్కుల పేర్లు చెప్పండి.
జవాబు.
నాల్గు దిక్కుల పేర్లు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.
ప్రశ్న 2.
నీ పాఠశాల నాలుగు దిక్కులలో నీవేమి చూస్తావు.
తూర్పున ………………….
పడమర ………………….
ఉత్తరాన ………………….
దక్షిణాన ………………….
జవాబు.
విద్యార్థికృత్యము.
ప్రశ్న 3.
మీ గ్రామం లేదా నగరం చిరునామా తెలుసుకోవడానికి ఉపయోగపడేవి ఏవి ?
జవాబు.
ఏదైనా’ బాగా తెలిసిన ప్రాంతం సమీపంలోని చిరునామాను సులువుగా కనుక్కోవచ్చు. అట్టి ప్రదేశాలను మైలురాళ్ళు అంటారు.
ఉదా :- పాఠశాల, వైద్యశాల, పంచాయితీ కార్యాలయం మొ||నవి.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
గుర్తులను ఉపయోగించి మీ గ్రామ పటాన్ని గీయుటకు మీ ఉపాధ్యాయునికి ఏ ప్రశ్నలను నీవు అడుగుతావు?
జవాబు.
గుర్తులను ఉపయోగించి మా గ్రామ పటాన్ని గీయుటకు నేను ఉపాధ్యాయుడిని క్రింది ప్రశ్నలు అడుగుతాను.
- గుర్తులు అనగానేమి?
- పాఠశాలలు, వైద్యశాలలు, గుడి, కార్యాలయాలకు మనం ఎలాంటి విభిన్నగుర్తులను వాడాలి?
- మా గ్రామానికి దిక్కులు ఏవి?
- పటం అనగానేమి?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
మీ పాఠశాల ప్రక్కన ఉన్న మీ గ్రామంలో తెలిసిన ప్రదేశాలు దర్శిచండి.
జవాబు.
విద్యార్థికృత్యము.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
మీకు దగ్గరలో ఉన్న ఇంటిని సందర్శించి మీరు గమనించిన విషయాలను కింది’ పట్టికలో పూరించండి.
జవాబు.
విద్యార్థికృత్యము.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
మీ ఇంటి బొమ్మ గీయండి. ఉత్తరాన్ని ఎరుపు రంగులో, దక్షిణాన్ని నీలం రంగులో, తూర్పును నారింజ రంగులో, పడమరను ఆకుపచ్చ రంగులో నింపండి.
జవాబు.
విద్యార్థికృత్యము.
ప్రశ్న 8.
మీ పాఠశాల బొమ్మను గీయండి. మీ పాఠశాల భవనం ముఖ్య గదులను అందులో గీయండి.
జవాబు.
విద్యార్థికృత్యము.
ప్రశ్న 9.
ఎప్పుడైనా, ఎవరికైనా వారి గమ్యం చేరడానికి దారి చూపించావా? నీకేమనిపించింది?
జవాబు.
అవును, నేను మా ఊరికి ఎలక్షన్ డ్యూటీకి వచ్చిన వారికి మా పాఠశాలకు సంబంధించిన మైలు రాళ్ళు చెప్పటం ద్వారా సహాయపడ్డాను. అప్పుడు నాకు చాలా సంతోషం వేసింది.
ప్రశ్న 10.
సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూసినప్పుడు నీకేమనిపిస్తుంది.
జవాబు.
సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూసినప్పుడు చాలా సంతోషం కల్గుతుంది. ఎందుకంటే ఆ దృశ్యాలు చాలా అందంగా ఉంటాయి. నేను మా నాన్నగారి ఫోన్లో వాటిని • ఫోటోలు తీసుకుంటాను.
అదనపు ప్రశ్నలు – జవాబులు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
సమీప ప్రాంతం అనగానేమి? మీ సమీప ప్రాంతంలో ఏమేమి ఉన్నాయి?
జవాబు.
మన ఇంటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని “సమీప ప్రాంతం” అంటారు. మా సమీప ప్రాంతంలో కాలేజీలు, స్బ్యే క్స్ కార్యాలయం మరియు హోటల్స్ ఉన్నాయి.
ప్రశ్న 2.
“సరిహద్దులు” అనగానేమి? సరిహద్దులను ఎలా తెలుసుకుంటావు?
జవాబు.
ఒక ప్రాంతం, భవనం లేదా ఊరి యొక్క హద్దులను “సరిహద్దులు” అంటారు. ఈ సరిహద్దులను గురించి తెలుసుకోవడానికి దిక్కులతో పాటు మూలలు తెలుసుకోవాలి. రెండు దిక్కుల మధ్య ప్రాంతాన్ని మూల అంటారు.
ప్రశ్న 3.
మనం మ్యాప్ తయారీకి వాడే కొన్ని గుర్తులను సూచించండి.
జవాబు.
ప్రశ్న 4.
పాత కాలంలో, నేడు దిక్కులను ఎలా కనుగొంటారు?
జవాబు.
పురాతన కాలంలో నావికులు సూర్యుడు, నక్షత్రాలు, పవనాల దిశలను బట్టి దిక్కులను కనుగొనేవారు. నేటి కాలంలో మనం దిక్చూచి, GPS (Global Positioning System) లను ఉపయోగించి దిక్కులను కనుక్కొంటున్నాం.
II. పరిశీలనలు:
మీ గ్రామానికి కొన్ని దిక్కులలో, మూలల్లో ఏమి ఉన్నాయో తెల్పండి?
జవాబు.
తూర్పు ……………………..
నైరుతీ ……………………..
పడమర ……………………..
వాయువ్యం ……………………..
ఉత్తరం ……………………..
ఆగ్నేయం ……………………..
తూర్పు ……………………..
నైరుతీ ……………………..
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
ప్రశ్న 1.
సూర్యుడు ____________ న ఉదయించును.
A) పడమర
B) తూర్పు
C) ఉత్తరం
D) దక్షిణం
జవాబు.
B) తూర్పు
ప్రశ్న 2.
సూర్యుడు ____________ న అస్తమించును.
A) పడమర
B) తూర్పు
C) ఉత్తరం
D) దక్షిణం
జవాబు.
A) పడమర
ప్రశ్న 3.
ఊరి యొక్క హద్దులను ____________ అంటారు.
A) దిక్కులు
B) మూలలు
C) సరిహద్దులు
D) ఏదీకాదు
జవాబు.
C) సరిహద్దులు
ప్రశ్న 4.
అన్ని దిక్కులు స్థిరంగా ఉంటాయి. మరియు ____________ నుంచి లెక్కించబడతాయి.
A) తూర్పు
B) పడమర
C) ఉత్తరం
D) దక్షిణం
జవాబు.
C) ఉత్తరం
ప్రశ్న 5.
నీవు తూర్పునకు ముఖం పెట్టి నిల్చుంటే, నీకు ఎడమ వైపున ____________ ఉంటుంది. ( A )
A) ఉత్తరం
B) దక్షిణం
C) తూర్పు
D) పడమర
జవాబు.
A) ఉత్తరం
ప్రశ్న 6.
వైద్యశాల గుర్తు ____________
A)
B)
C)
D) ఏదీకాదు
జవాబు.
A)
ప్రశ్న 7.
గుర్తులతో కూడిన పటాన్ని ____________ అంటారు.
A) స్కేలు
B) మ్యాప్
C) చార్ట్
D) ఏదీకాదు
జవాబు.
B) మ్యాప్
ప్రశ్న 8.
నీ చుట్టు ప్రక్కల నివశించేవారిని ____________ అంటారు.
A) ఇరుగు పొరుగు
B) అతిధులు
C) అద్దెవారు
D) ఏదీకాదు
జవాబు.
A) ఇరుగు పొరుగు
ప్రశ్న 9.
రెండు దిక్కుల మధ్య ప్రాంతాన్ని ____________ అంటారు.
A) దిక్కులు
B) మూలలు
C) ప్రక్కలు
D) ఏదీకాదు
జవాబు.
B) మూలలు
ప్రశ్న 10.
గుర్తులు ____________ ను సూచిస్తాయి.
A) మైలురాళ్ళు
B) వస్తువులు
C) ప్రదేశాలు
D) అన్నీ
జవాబు.
D) అన్నీ