Andhra Pradesh AP Board 3rd Class EVS Solutions 6th Lesson నీరు – ప్రకృతి వరం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class EVS Solutions Lesson 6 నీరు – ప్రకృతి వరం
I. విషయావగాహన:
ప్రశ్న 1.
నిత్య జీవితంలో నీటి ఉపయోగాలు తెలపండి ?
జవాబు.
నిత్య జీవితంలో నీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తాము. అవి త్రాగటానికి, గిన్నెలు శభ్రపరచుటకు, బట్టలు ఉతకటానికి స్నానానికి, వంటచేయుటకు, మొక్కలకు ఉపయోగిస్తాము.
నీటిని మంటలు ఆర్పుటకు, వ్యవసాయానికి, చేపల సాగుకు, నిర్మాణ రంగంలోనూ ఉపయోగిస్తాము.
ప్రశ్న 2.
నీరు లేకపోతే ఏమి జరుగుతుంది?
జవాబు.
- నీరు లేకపోతే భూమి పై జీవం ఉండదు. నీరు అతి ముఖ్యమైన జీవన ఆధారము. నీరు మనకు అనేక రకాలుగా ఉపయోగపడును.
- నీరు లేకపోతే మొక్కలు, జంతువులు చనిపోతాయి.
- నీరు లేకపోతే పంటలు కూడా సరిగా పండవు.
ప్రశ్న 3.
నీరు లభించే వనరులకు కొన్ని ఉదాహరణ లివ్వండి.
జవాబు.
నీటి వనరులకు ఉదాహరణ :-
సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు చెలమలు, నీరు దొరికే సహజమైన వనరులు.
బావులు, గొట్టపు బావులు, డామ్ లు వంటివి మానవ నిర్మిత నీటి వనరులు.
ప్రశ్న 4.
మీరు నీటిని ఎలా ఆదా చేయగలరు. ” నీటిని క్రింది విధంగా ఆదా చేయాలి.
జవాబు.
- త్రాగటానికి చిన్న గ్లాసును ఉపయోగించాలి.
- పండ్లు, కూరగాయలను పారే నీటి క్రింద కాకుండా పాత్రలో నీరువేసి కడగాలి.
- బకెట్ నిండి నీరు పొర్లిపోయేలా చేయరాదు.
- నీటి ట్యాంకులు నిండిన వెంటనే విద్యుత్ మోటార్‌ను ఆపి వేయాలి.
- నీటి గొట్టాలలో లీకులు లేకుండా చూడాలి.
- బ్రష్ చేయునప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, స్నానం చేసేటప్పుడు నీరు వాడటం ఐన వెంటనే కుళాయి కట్టేయాలి.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 5.
పాత రోజుల్లో ఉండే నీటి వనరుల గురించి మీ తల్లిదండ్రులను ఏయే ప్రశ్నలు అడుగుతావు?
జవాబు.
పాత రోజుల్లో ఉండే నీటి వనరుల గురించి మీ తల్లిదండ్రులను క్రింది ప్రశ్నలు అడుగుతాను. .
- పాతకాలంలో ప్రజలకు మంచినీరు ఎలా లభ్యమయ్యేది.
- పాతకాలం నాటి నీటి సరఫరా పద్దతులేవి?
- పాతకాలంలో నీటిని ఎలా ఉపయోగించేవారు?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 6.
మీ గ్రామంలో రక్షిత నీటి సరఫరా పథకం కేంద్రాన్ని సందర్శించి ఏయే పద్ధతుల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారో పరిశీలించండి. నీటిని సరఫరా చేయుటలో దశలను తెల్పండి.
జవాబు.
- మా గ్రామంలోని రక్షిత నీటి సరఫరా కేంద్రంలో నీటిని శుభ్రపరచటం, క్రిములను నాశనం చేయుటకు క్లోరినేషన్ చేయటం వంటి పద్ధతులను పాటిస్తారు.
- నీరు కొలనులనుంచి, నదుల నుంచి, సరస్సుల నుంచి పై పద్ధతుల్లో శుభ్రపరచి సరఫరా చేస్తారు.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 7.
మీ స్నేహితులు నీటిని ఎలా ఆదా చేస్తున్నారో వారి నుంచి సమాచారాన్ని సేకరించండి?
జవాబు.
విద్యార్థి కృత్యము.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 8.
బాటిల్ బ్రష్ చిత్రాన్ని గీయండి? దీనిని ఎలా ఉపయోగిస్తారో చెప్పండి?
జవాబు.
వాటర్ బాటిళ్ళను తీసుకుని అందులో చిటికెడు ఉప్పు వేసి, కొన్ని వేడినీళ్ళు పోసి, పటంలో చూపిన విధంగా బ్రష్ ను పైకి, క్రిందకు కదుపుతూ శభ్రం చేయాలి. అలా చేయటం వల్ల రోగ కారక క్రిములు నశిస్తాయి.
VI. ప్రశంస:
ప్రశ్న 9.
ఒకరోజు దేవి తన స్నేహితుల ఇంటికి ఆడుకోవటానికి బయలు దేరింది. దారిలో కొంతమంది పిల్లలు పంపు దగ్గర నీటిని వృథా చేయటం గమనించింది. ఆదేవి వారితో ఏమి చెప్పి ఉంటుందని నీవు అనుకుంటున్నావు? ఆ స్థానంలో నీవే ఉంటే ఏం చేస్తావు ?
జవాబు.
- దేవి నీటి ప్రాముఖ్యతను వారికి వివరించి, నీటిని వృధా చేయరాదని చెప్పి ఉంటుంది.
- నేను ఆ స్థానంలో ఉన్నా వారికి నీటి ప్రాముఖ్యతను వివరించేదాన్ని.
- ఇంకా నీటి వృధాను అరికట్టుటకు నినాదాలతో కూడిన స్టిక్కర్లను అంటించేదాన్ని.
అదనపు ప్రశ్నలు – జవాబులు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
నీటి సహజ వనరులను పేర్కొ నండి ?
జవాబు.
వర్షం, సముద్రాలు, నదులు, కొలనులు, ప్రవాహాలు, చెలమలు సహజ నీటి వనరులు. వర్షం వీటన్నింటికీ మూలాధారం.
ప్రశ్న 2.
“మానవ నిర్మిత నీటి వనరుల”ను పేర్కొనండి. ఉదాహరణలివ్వండి.
జవాబు.
సహజ వనరుల నుంచి లభ్యమైన నీటిని ‘ అందుబాటులోనికి తెచ్చు కొనుటకు మానవులు చేయు నిర్మాణాలు “మానవ నిర్మిత నీటి వనరులు”.
ఉదా : డామ్లు , బావులు, గొట్టపు బావులు, చేతి పంపులు, కాలువలు మొదలైనవి.
ప్రశ్న 3.
నీరు కలుషితం ఎలా అగును? నీటిని ఎలా శుభ్రపరుస్తారు?
జవాబు.
- నీరు, మానవ కార్యకలాపాలైన గిన్నెలు, బట్టలు శుభ్రపరచటం, పశువులను శుభ్రపరచటం, వంటి పనుల వల్ల కలుషితమగును.
- నీటిని శుభ్రపరచుటకు మరిగించి చల్లార్చిన నీటిని త్రాగాలి.
- ఇంకా నీటిని శుభ్రపరచుటకు ఫిల్టర్స్, క్లోరినేషన్ వంటి పద్ధతులు ఉపయోగిస్తారు.
ప్రశ్న 4.
ప్రస్తుత పాఠశాలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “నీటిగంట” కార్యక్రమం ముఖ్య లక్ష్యం ఏమిటి?
జవాబు.
“నీటి గంట” కార్యక్రమం క్రింద ప్రస్తుతం పాఠశాలలో రోజుకి 3సార్లు నీటి గంటను మ్రోగిస్తారు. ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం విద్యార్థులలో నీరు ఎక్కువ త్రాగే అలవాటు చేయటం ద్వారా వారిని ఆరోగ్యంగానూ, శరీరం డీ హైడ్రేషన్‌కు లోను కాకుండా ఉంచడమే.
ప్రశ్న 5.
“నీటిని కాపాడుటకు” స్లోగన్ లను వ్రాయండి. ”
జవాబు.
” నీటిని కాపాడండి – మీ భవిష్యత్తును కాపాడుకోండి”
“ నీరే జీవితం, కావున నీటిని కొట్టకండి ” . .
ప్రశ్న 6.
నీరు వృధాను ఆపుటకు మనం ఏం చేయాలి?
జవాబు.
- నీరు వృధా కాకుండుటకు అవగాహన కల్పించాలి.
- నీరు వృధాను అరికట్టుటకు నినాదాలు వ్రాయాలి.
- నీరు వృధాగా పోకుండా చూడాలి.
- పాత్రలు నిండిన వెంటనే కుళాయిలు కట్టేయాలి.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
ప్రశ్న 1.
నీటి ముఖ్య వనరు _____________
A) చెట్లు
B) వర్షం
C) నదులు
D) ఏదీకాదు
జవాబు.
B) వర్షం
ప్రశ్న 2.
భూమిలో _____________ భాగం నీటితో నిండి ఉంది. .
A) మూడువంతులు
B) రెండు వంతులు
C) నాల్గు వంతులు :
D) ఏదీకాదు
జవాబు.
A) మూడువంతులు
ప్రశ్న 3.
అంతర్జాతీయ నీటి దినోత్సవం _____________
A) 22 మార్చి
B) జూన్ 5
C) జనవరి 22
D) ఏదీకాదు
జవాబు.
A) 22 మార్చి
ప్రశ్న 4.
‘వాటర్ బెల్’ రోజులో _____________ సార్లు మ్రోగును.
A) ఒకసారి
B) రెండు సార్లు
C) మూడు సార్లు
D) ఏదీకాదు
జవాబు.
C) మూడు సార్లు
ప్రశ్న 5.
సముద్రాలు, నదులు, కొలనులు నీటి యొక్క _____________ వనరులు.
A) మానవనిర్మిత
B) సహజ
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు.
B) సహజ
ప్రశ్న 6.
నీటి కాలుష్య కారకాలు _____________
A) ప్రకృతి
B) మానవ కార్యకలాపాలు
C) చెట్లు
D) ఏదీకాదు
జవాబు.
B) మానవ కార్యకలాపాలు
ప్రశ్న 7.
క్రింది వాటిలో నీటిని శుభ్రపరచు పద్ధతులు _____________
(D)
A) మరిగించటం
B) వడపోత
C) క్లోరినేషన్
D) పైవన్నీ
జవాబు.
D) పైవన్నీ
ప్రశ్న 8.
_____________ నీరు మాత్రమే త్రాగాలి.
A) శుభ్రమైన
B) కలుషిత
C) డిస్టిల్డ్
D) ఏదీకాదు.
జవాబు.
A) శుభ్రమైన
ప్రశ్న 9.
_____________ మంచినీటి వనరులు.
A) నదులు
B) కొలనులు
C) భూగర్భనీరు
D) అన్నీ
జవాబు.
D) అన్నీ
ప్రశ్న 10.
క్రింది వానిలో మానవ నిర్మిత నీటి వనరులు _____________
A) డామ్ లు
B) బావులు
C) A మరియు B
D) ఏదీకాదు
జవాబు.
C) A మరియు B