Andhra Pradesh AP Board 3rd Class Telugu Solutions 1st Lesson తెలుగు తల్లి Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Telugu Solutions Chapter 1 తెలుగు తల్లి
Textbook Page No. 1
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి ?
జవాబు:
చిత్రంలో పిల్లలు వారి తరగతి గదిని చక్కగా అలంకరించుకుంటున్నారు. పిల్లలందరిని ఉపాధ్యాయురాలు మంచి సలహాలతో, సూచనలతో ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తున్నది.
పిల్లలు వారి వారి సందేహాలు తీర్చు కుంటున్నారు. అందరూ ‘మాతృబాషా దినోత్సవానికి” తరగతిగది ముస్తాబు చేస్తున్నారు. ఇద్దరు ” మా ఇల్లు” అని రంగులద్దుతూ – ఇంటిని బొమ్మగీస్తున్నారు. ఇద్దరు చక్కని పూల కుండీలతో అలంకరిస్తున్నారు.
ఇద్దరు ఉ పాధ్యయురాలికి వారు తయారు చేసిన వాటిని చూపిస్తూ మెప్పు పొందుతున్నారు. ఒక పిల్లవాడు నల్లబల్ల పైన తెలుగు తల్లి గీతాన్ని చక్కగా గుండ్రని దస్తూరితో వ్రాసి ప్రదర్శిస్తున్నాడు. మరోక పిల్లాడు పెద్ద రంగు కాగితం పైన అందంగా “మాతృ భాషా దినోత్సవం ” అని వ్రాసి దానిని ప్రదర్శనకు అనుకూలంగా తయారుచేస్తున్నాడు
ప్రశ్న 2.
పాఠశాలలో ఏంజరుగుతున్నది? ఎవరెవరు ఏం చేస్తున్నారు ?
జవాబు:
పాఠశాలలో ‘మాతృభాషాదినోత్సవం జరుగుతున్నది. చిత్రంలో పిల్లలు వారి తరగతి గదిని చక్కగా అలంకరించుకుంటున్నారు. పిల్లలందరిని ఉపాధ్యాయురాలు మంచి సలహాలతో, సూచనలతో ఉత్సాహపరుస్తూ ముందుకు నడిపిస్తున్నది.
పిల్లలు వారి వారి సందేహాలు తీర్చుకుంటున్నారు. అందరు ‘మాతృభాషా దినోత్సవానికి “తరగతిగది ముస్తాబు చేస్తున్నారు. ఇద్దరు ‘మా ఇల్లు అని రంగులద్దుతూ – ఇంటిని బొమ్మగీస్తున్నారు. ఇద్దరు చక్కని పూల కుండీలతో అలంకరిస్తున్నారు.
ఇద్దరు ఉ పాధ్యయురాలికి వారు తయారు చేసిన వాటిని చూపిస్తూ మెప్పు పొందుతున్నారు. ఒక పిల్లవాడు నల్లబల్ల పైన తెలుగు తల్లి గీతాన్ని చక్కగా గుండ్రని దస్తూరితో వ్రాసి ప్రదర్శిస్తున్నాడు. మరోక పిల్లాడు పెద్ద రంగు కాగితం పైన అందంగా “మాతృ భాషాదినోత్సవం” అని వ్రాసి దానిని ప్రదర్శనకు అనుకూలంగా తయారుచేస్తున్నాడు.
ప్రశ్న 3.
మీ రెప్పుడైనా పాఠశాలలో జరిగే కార్యక్రమాలలో పాల్గొన్నారా? చెప్పండి?
జవాబు:
మేము మా పాఠశాలలో జరిగే చాలా కార్యక్రమాలలో పాల్గొన్నాము.
- ఆగస్ట్ – 15 స్వాతంత్ర దినోత్సవం కార్యక్రమం.
- నవంబర్ – 14 బాలలదినోత్సవం (జవహర్ లాల్ నెహ్రు పుట్టిన రోజు)
- జనవరి – 26 గణతంత్ర దినోత్సవం.
- పాఠశాల వార్షికోత్సవం.
- అక్టోబర్ – 2 గాంధీ జయంతి. మొదలగు కార్యక్రమాలలో పాల్గొన్నాము.
పిల్లలూ! పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి:
జవాబు:
- మాతృభాషాదినోత్సవం
- ఉపాధ్యాయురాలు
- విద్యార్థినులు
- విద్యార్థులు
- చిలుకలు
- పూలకుండీలు
- రంగులద్దే కుంచెలు
- ఇల్లు బొమ్మ
- జాతీయ జెండ
- తెలుగు తల్లి
- కుర్చీ( పోడవు కాళ్ళపీట)
- గోడ పత్రిక ( దేశభషలందు తెలుగు లెస్స)
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
గేయాన్ని రాగయుక్తంగా పాడండి. అభనయం చేయండి?
జవాబు:
విద్యార్థి కృతము
ప్రశ్న 2.
ఈ గేయం ఎవరిని గురించి చెబుతోందో చెప్పండి?
జవాబు:
తెలుగు తల్లిని గురించి, తెలుగు నేలను గురించి, తెలుగు వారిని గురించి చెబుతోంది.
ప్రశ్న 3.
తెలుగు తల్లిని గూర్చి కవి ఏమని వివరించారో చెప్పండి?
జవాబు:
తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిదని, మన కోర్కెలు తీర్చి ఆనందాల నిస్తుందని వివరించారు.
ప్రశ్న 4.
తెలుగు తల్లిని అందాల నిండు జాబిల్లి అన్నారు గదా! నిండు జాబిల్లిని చూస్తే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి?
జవాబు:
ఆనందం కలుగుతుంది. ఆ వెన్నెలలో ఆడుకోవాలనిపిస్తుంది. అమ్మచేతితో అన్నం తినాలనిపిస్తుంది. వెన్నెల జాబిలి మీద పాటలు పాడాలి-వినాలి అనిపిస్తుంది. జాబిలి కథలను వినాలనిపిస్తుంది. వెన్నెల్లో జాబిలిని చూస్తూ ఉయ్యాల ఊగాలని పిస్తుంది. తెలుగు మాటలు – తెలుగు పాటలు – తెలుగు కథలు వింటూ.. అమ్మ ఒడిలో నిద్రపోవాలని పిస్తుంది.
తెలుగు తల్లి
అదెవో తెలుగుతల్లి
అందాల నిండు జాబిల్లి
ఆనందాల కల్పవల్లి
అదే నీ తెలుగుతల్లి
పదవోయి తెలుగోడా
అదె నీ తెలుగు మేడ
సంకెళ్ళు లేని నేల
సంతోష చంద్రశాల
కనువోయి తెనుంగు రేడా
అదే నీ అనుంగు నేల
అదిగో సుదూర నేల
చనవోయ్ తెలుగు వీరా!
పదవోయ్ నిర్భయంగా
పదవోయి నిశ్చయంగా
కదలవోయ్ ఆంధ్ర కుమారా
నిద్ర వదలవోయ్ నవ యుగం
నిర్మింపగ సాగవోయ్
కదలవోయ్ ఆంధ్ర కుమారా!
కవి పరిచయం :
కవి : శ్రీరంగం శ్రీనివాసరావు
కాలము : 14-04-1910 – 15-06-1983
రచించిన గ్రంథాలు : ‘మరో ప్రస్తానం’, ‘ఖడ్గసృష్టి , అయన ఇతర రచనలు ‘అనం స్వీయ చరిత్ర.
విశేషాంశాలు : ‘శ్రీశ్రీ’ గా ప్రసిద్ది చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు మహాకవి. అభ్యుదయ యుగకర్త, కథకులు, నాటకకర్త, విమర్శకులు, అనువాదుకులు. మహాప్రస్థానం’ తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పిన రచన.
గేయసారాంశం
మన తెలుగు తల్లి అందమైన నిండు చందమామ వంటిది. మనం కోరిన కోరికలు తీర్చి, అనందాల నిచ్చేమన తెలుగుతల్లి.
ఓ తెలుగువాడా! ముందుకు నడు. ఈ తెలుగు నేల అందమైన మేడ వంటిది. ఇది స్వేచ్ఛా, స్వాతంత్ర్యాల విచ్చే చక్కని నేల. సంతోషాలనిచ్చే చలువరాతి మేడ వంటిది మన తెలుగు నేల. అదే నీ ప్రియమైన నేల.
ఈ తెలుగు నేల విశాలమైనది. ఓ తెలుగు వీరుడా! కొత్తలోకం నిర్మించడానికి నడుం బిగించి ముందుకు సాగిపో. భయం లేకుండా ముందుకు వెళ్ళు, నీదే విజయం.
పదాలు – అర్థాలు :
కల్పవల్లి = కోరిన కోర్కెలు తీర్చేది
జాబిల్లి = చందమామ
తెనుంగు = తెలుగు
చంద్రశాల = చలువరాతి మేడ
కనవోయి = చూడవోయి
రేడు = రాజు
అనుంగు = ప్రియమైన
సుదూరం = చాలా దూరం
చనవోయ్ = వెళ్ళవోయి
నవ యుగం = కొత్త కాలం
నిర్భయంగా = భయం లేకుండా
నిశ్చయంగా = నమ్మకంగా, తప్పనిసరిగా
ఈ మాసపు పాట
తల్లి భారతి వందనము
పల్లవి : తల్లీ భారతి వందనము
నీ ఇల్లే మా వందనము
మేమంతా నీ పిల్లలమూ
నీ చల్లని ఒడిలో మల్లెలమూ
॥తల్లీ భారతి॥
చరణం : చదువులు బాగా చదివెదమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా
తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళలా కొలిచెదమమ్మా
॥తల్లీ భారతి॥
చరణం : కుల మత భేదం మరిచెదము
కలతలు మాని మెలిగెదము
మానవులంతా సమానమంటూ
మమతను సమతను పంచెదము
॥తల్లీ భారతి॥
చరణం : తెలుగు జాతికి అభ్యుదయం
నవ భారతికి నవోదయం
భావి పౌరులం మనం మనం
భారత జనులకు జయం జయం
||తల్లీ భారతి||
కవి పరిచయం :
కవి : దాశరథి కృష్ణమాచార్య
కాలము : 22.7.1925 – 5.11.1987
రచనలు : అగ్నిధార, రుద్రవీణ, మహాంద్రోదయం, తిమిరంతో సమరం.
విశేషాలు : నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి. నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచన మేలు కొలుపు పాడారు. ‘యాత్రాస్ప్కతి’ వీరి స్వీయ చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అస్థాన కవిగా ఉన్నారు.
ఈ మాసపు కథ
ఐకమత్యం
రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు. వారు చినప్పుడు కలిసిమెలిసి పెరిగారు. కాని పెద్దవాళ్ళయ్యే కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలు పెట్టారు. తండ్రి కలిసిమెలసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు. అయినా వాళ్ళలో మార్పు రాలేదు. వాళ్ళలో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు. ఒక రోజు వాళ్ళతో కొన్ని పుల్లలు తెప్పించాడు. వాటిని కట్టగా కట్టమని చెప్పాడు.
మొదటి కొడుకును పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను విరవలేకపోయాడు. రెండవ కొడుకుని పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. అతను కూడా విరవలేకపోయాడు. చివరిగా మూడవ కొడుకుని పిలిచాడు. పుల్లల కట్టను విరవమన్నాడు. పుల్లలకట్టను విరవడం అతనివల్ల కూడా కాలేదు.
తండ్రి ముగ్గురు కొడుకులను దగ్గరకు పిలిచాడు. పుల్లల కట్టను విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరచమని చెప్పాడు. వాళ్ళు అవలీలగా విరిచేశారు. అప్పుడు తండ్రి కొడుకులవైపు చూసి అడిగాడు. “మీకు ఏమర్థమైంది?”
“నాన్నా ! కలిసివుంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. విడిపోతే బలహీనులమైపోతాం. నాన్నా! ఇక కలిసి వుంటాం. ఎప్పుడూ కలహించం” అన్నారు కొడుకులు.
తండ్రి సంతృప్తి చెందాడు.
కవి పరిచయం
కవి : లియో టాల్ స్టాయ్
కాలము : 9-9-1828 – 20-11-1910
రచనలు : “ సమరం-శాంతి, అనాకెరినినా’
విశేషాలు : లియో టాల్‌స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్