AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా…

Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 4th Class Telugu Solutions Chapter 3 దేశమును ప్రేమించుమన్నా…

Textbook Page No. 15

చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.

AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 1

ప్రశ్న 1.
చిత్రంలో ఏమేమి ఉన్నాయి? ఎవరెవరు ఉన్నారు ?
జవాబు:

  1. ప్రాధమిక పాఠశాల,
  2. జెండా కర్ర
  3. మొక్కలు,
  4. జెండా,
  5. రంగులు,
  6. పూల కుండీలు ఉన్నాయి. నలుగురు పిల్లలు (విద్యార్థినులు) ఉన్నారు.

ప్రశ్న 2.
జెండా ఎప్పుడు ఎగర వేస్తారు ?
జవాబు:
ఆగస్ట్ – 15 స్వాతంత్ర దినోత్సవం నాడు
జనవరి – 26 గణతంత్ర దినోత్సవం నాడు ఎగరవేస్తారు.

ప్రశ్న 3.
మన జాతీయ జెండా గొప్పతనం గూర్చి చెప్ప౦డి?
జవాబు:

  1. మన జాతీయ జెండా రూపశిల్పి శ్రీ పింగళి వెంకయ్యగారు. మన తెలుగు వాడు.
  2. మన జెండా మూడు రంగుల జెండా. అవి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ.
  3. మధ్యలో అశోకుని ధర్మచక్రం కలిగి ఉంటుంది.
  4. హిమాలయాల నుండి రామేశ్వరం దగ్గర ఉన్న వారధి వరకు భరత జాతి గొప్పతనాన్ని మన జెండా తెలుపుతుంది.
  5. శత్రు సైన్యాలను ఓడించిన వీరుల త్యాగాలకు గుర్తు మన జెండా.
  6. మన జెండా అందమైన జెండాగా ప్రపంచఖ్యాతిని పొందింది.

Textbook Page No. 16

AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 2

దేశమును ప్రేమించుమన్నా
మంచి అన్నది పెంచుమన్నా!
ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్
గట్టి మేల్ తల పెట్టవోయి.

దేశాభిమానం నాకు కద్దని
ఒట్టి గొప్పలు చెప్పుకోకోయి,
పూని యేదైనాను ఒకమేల్
కూర్చి జనులకు చూపవోయి!

పాడిపంటలు పొంగిపొర్లే
దారిలో నువు పాటుపడవోయ్
తిండి కలిగితే కండ కలదోయ్
కండ కలవాడేను మనిషోయ్!

AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా…

సొంత లాభం కొంత మానుకు
పొరుగు వాడికి తోడుపడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్!

చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడవవలెనోయి
అన్నదమ్ముల వలెను జాతులు
మతములన్నీ మెలగవలెనోయ్!

Textbook Page No. 18

ఇవి చేయండి

వినడం – ఆలోచించి మాట్లాడటం

ప్రశ్న 1.
గేయంలో దేశాన్ని ప్రేమించాలి అన్నారుకదా! దేశాన్ని ప్రేమించాలంటే మీరు ఏం చేస్తారు?
జవాబు:
మంచిని ప్రోత్సహిస్తాను. కాలం వృధా చేయకుండా, ఉపయోగ పడే పనులు చేస్తాను. మనం దేశం పాడిపంటలతో సశ్యశ్యామలంగా ఉండేలా కృషి చేస్తాను. అందరు అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. జనులకు ఏదైనా ఒక మేలు చేసి చూపిస్తాను. సొంత పనులు కొన్ని మానుకునైనా ఇతరులకు సాయపడతాను. దేశమంటే మనుషుల సమూహమని తెలుసుకుని కలసి కట్టుగా నడుస్తాను.
జాతిమత భేదాలను వదిలి అందరితోను ఒకే మాటగా ఒకే బాటగా నడుస్తాను.

తన మాతృ దేశం పట్ల భక్తి కలిగి ఉండడం అంటే దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడం, గౌరవించడం, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌవించడం. దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం, దేశ ఔనత్యాన్ని కాపాడడం. దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండడం. కన్నతల్లి వంటి జన్మభూమిని ఎప్పుడు గౌరవించాలి. ఎందుకంటే – జననీ జన్మ భూమిశ్చ సర్గాదపి గరీయసి.

ప్రశ్న 2.
గేయ సారాంశాన్ని మీ సొంత మాటల్లో చెప్ప౦డి?
జవాబు:

  1. దేశము నాదని ప్రేమించు. మంచిని ప్రోత్సహించు. మాటలతో కాలం వృధా చేయకుండా. ఉపయోగపడే పనులు చేయ్యి.
  2. మనదేశం పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండేలా ‘ కృషి చేయాలి. అప్పుడు దేశంలో ఉన్నవారందరికీ ఆహారం లభిస్తుంది. పౌష్టిక ఆహారం తిన్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడు .
  3. నాకు దేశం మీద గౌరవం అని ఎక్కువ గొప్పలు చెప్పవద్దు. జనులకు ఏదైనా ఒక మేలు చేసి చూపించు.
  4. సొంత పనులు కొన్ని మానుకొనైనా సరే ఇతరులకు సహాయపడాలి. దేశం అంటే కేవలం రాళ్ళు రప్పలే కాదు, దేశం అంటే జన సమూహం అని తెలుసుకో.
  5. సుఖ దుఃఖాలలో అందరూ కలసికట్టుగా నడవాలి. దేశ ప్రజలందరూ మతాలు, జాతులూ వేరైనా అన్నదమ్ములలాగా కలిసి ‘ఒకే మాట ఒకే బాట’గా నడవాలి.

AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా…

ప్రశ్న 3.
ఈ గేయం ఆధారంగా దేశభక్తిని గురించి మీ భావాలు తెలపండి?
జవాబు:
దేశ భక్తి అంటే… మంచిని ప్రోత్సహించడం. కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చేయడం. దేశం సశ్యశ్యామలంగా పాడిపంటలతో ఉండేలా కృషి చేయడం. ప్రజలందరూ ఆహారం కలిగి ఉన్నప్పుడే ఆరోగ్యంతో ఉండేది. కనుక అందరిక్షేమం కోరి ఉండడం. దేశం మీద నాకు గౌరవం ఉందని గొప్పలు చెప్పడం మానేసి జనులకు ఏదైనా ఒక మేలు చేసి చూపడం. సొంతపనులు కొన్ని మానుకునైనా ఇతరులకు సాయపడడం. దేశమంటే మనుషుల సమూహమని తెలుసుకుని జాతి,మత భేదాలు వదలి కలసి కట్టుగా అందరితోనూ ఒకే మాటగా, ఒకే బాటగా నడవడం.

Textbook Page No. 19

చదవడం – వ్యక్త పరచడం

అ) పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి:

ప్రశ్న 1.
గట్టి మేలు తల పెట్టాలంటే మనం ఏమి చేయాలి?
జవాబు:
దేశము నాదని ప్రేమించాలి. మంచిని ప్రోత్సహించలి. మాటలతో కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చేయాలి.

ప్రశ్న 2.
మంచిని పెంచడమంటే ఏమిటి?
జవాబు:
సొంతలాభం కొంతైనా మానుకుని అందరికీ మేలు చేయడం. అందరితోనూ కలసి తను కట్టుగా – ఒకే మాటగా ఒకే బాటగా నడవడం.

ఆ) కింది వాక్యాలు చదవండి. వీటికి సంబందించిన గేయ పాదాలను పాఠంలో గుర్తించండి:

ప్రశ్న 1.
పాడి పంటలు సమృద్ధిగా పండించే దారిలో నువ్వు కృషిచెయ్యి ?
జవాబు:
పాటి పంటలు పొంగి పోర్లే దారిలో నువు పాటుపడవోయ్.

ప్రశ్న 2.
నాకు దేశాభిమానం ఉన్నది ?
జవాబు:
దేశాభిమానం నాకు కద్దని.

ప్రశ్న 3.
దేశమంటే మట్టి కాదు, మనుషులు?
జవాబు:
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్.

ప్రశ్న 4.
అన్నదమ్ముల వలె కలిసి మెలసి ఉండాలి?
జవాబు:
అన్నదమ్ముల వలెను జాతులు, మతములన్నీ మెలగ వలెనోయ్.

ఇ) గేయంలో ప్రాస పదాలను గుర్తించి రాయండి:

ఉదా॥ ప్రేమించుమన్నా – పెంచుమన్నా
____________ ____________
____________ ____________
____________ ____________
జవాబు:
1. కట్టి పెట్టోయ్ – తల పెట్టవోయ్
2. కలదోయ్ – మనిషోయ్
3. కాదోయ్ – ‘మనుషులోయ్
4. నడవ వలెనోయ్ – మెలగవలెనోయ్

ఈ) కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయండి:

బాల శివాజీని తండ్రి శంభోజీ బీజాపూరు సుల్తాన్ కొలువుకు తీసుకొని వెళ్ళాడు. ఆ సుల్తానుకు ఎలా వందనం చేయాలో తండ్రి శివాజీకి తర్ఫీదు ఇచ్చాడు. దేశభక్తి మెండుగా గల్గిన శివాజీ ‘విదేశీయునికి శిరస్సువంచను’ అని తనలో తాను అనుకున్నాడు. సుల్తాను కొలువుకు వెళ్ళిన తరువాత శంభోజీ ఆయనకు నమాస్కారం చేసి, కొడుకు వంక చూసాడు. శివాజీ శిరస్సు వంచి నమస్కరించకుండ ఠీవిగా నిల్చున్నాడు. సుల్తానుకు కోపం వచ్చింది. అక్కడే ఉన్న మురారి పంతులు.“చిన్న పిల్లవాడు ఇంకా మర్యాదలు తెలియనివాడు”అని సుల్తానుకు సర్దిచెప్పాడు. శంభోజీ తరువాత శివాజీని మందలించబోగా “తండ్రీ ! నేను జీవించి ఉండగా పరాయి పాలకుల ముందు తలవంచను ఆత్మాభిమానంతో జీవిస్తాను” అని బదులు ఇచ్చాడు.
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 5

Textbook Page No. 20

ప్రశ్న 1.
శివాజీని చిన్నతనంలో తండ్రి ఎక్కడికి తీసుకొని వెళ్ళాడు?
జవాబు:
బీజాపూర్ సుల్తాన్ కొలువుకు తీసుకోని వెళ్ళాడు.

ప్రశ్న 2.
సుల్తాను ఎదురైతే ఏం చేయాలని శివాజీకి తండ్రి చెప్పాడు ?
జవాబు:
సుల్తాన్ కు ఎలా వందనం చేయాలో చెప్పాడు.

AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా…

ప్రశ్న3.
శివాజీ సుల్తాను కొలువులో ఎలా ప్రవర్తించాడు?
జవాబు:
శివాజీ సుల్తాన్ కొలువులో, శిరస్సు వంచి నమస్కరించకుండా ఠీవిగా నిల్చున్నాడు.

ప్రశ్న 4.
ఆత్మాభిమానంతో జీవించడం అంటే ఏమిటి?
జవాబు:
పరాయి పాలకుల ముందు తలవంచకుండా జీవించడం.

ప్రశ్న 5.
పై పేరా ఆధారంగా నీవు గ్రహించినది ఏమిటి?
జవాబు:
జీవించినంత కాలం ఆత్మాభిమానంతో బ్రతకాలని గ్రహించాను.

ఉ) కింది పదాలను చదవండి. గేయం ఆధారంగా వాటిని జతపరచి రాయండి:
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 6
జవాబు:
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 7
1. తిండి కలిగితే కండకలదోయ్
2. ఒట్టి మాటాలు కట్టి పెట్టోయ్
3. ఒట్టి గొప్పలు చెప్పుకోకోయ్
4. పొరుగు వారికి తోడుపడవోయ్
5. చెట్ట పట్టాల్ పట్టుకొని

పదజాలం

అ) గేయంలో కింది వత్తులు ఉన్న పదాలను గుర్తించి రాయండి.
AP Board 4th Class Telugu Solutions 4th Lesson పరివర్తన 8
ఉదా : పెంచుమన్నా మతములన్నీ, ____, _______
_____ ______ ______ _____
జవాబు:
1. ప్రేమించు,
2. ఒట్టి,
3. పోర్లే,
4. గొప్పలు
5. మట్టి
6. కూర్చి

Textbook Page No. 21

ఆ) గేయం ఆధారంగా పట్టికను పూరించండి.

AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 9
జవాబు:
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 10

ఇ) కింది గళ్ళలో పాఠంలోని పదాలు దాగి ఉన్నాయి. వాటిని గుర్తించి రాయండి. వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి.
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 11
జవాబు:
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 12
పదాలు సొంతవాక్యాలు
దేశము : భారతదేశం అతి ప్రాచీన దేశం ట్టి పొం గొప్పలు
మతము . : మతము అంటే అభిప్రాయము
పొరుగు : పొరుగు వారితో స్నేహంగా ఉండాలి
దేశము గొప్పలు : గొప్పలు చెప్పకూడదు, చెప్పించుకోవాలి
ఒట్టి మాటలు : ఒట్టి మాటలు గౌరవం కాదు
పొంగి పొర్లే : పాడి పంటలు పొంగి పోర్లే దేశం నా దేశం.

ఈ) కింది పదాలు చదవండి :
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 13
జవాబు:
‘విద్యార్ధికృత్యం

Textbook Page No. 22

ఉ) కింది ఖాళీలను సరైన పదంతో నింపండి:
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 14
జవాబు:
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 15

ఊ) మీ పాఠశాలలో జరుపుకునే ఉత్సవాలు రాయండి. ఆ ఉత్సవాలను తెలిపే పదాలతో వాక్యాలు రాయండి:

1. స్వాతంత్ర్యదినోత్సవం
మా పాఠశాలలో ఆగష్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరుపుకుంటాము.

2. _________________
_____________________________
జవాబు:
గణతంత్ర దినోత్సవం :
మా పాఠశాలలో జనవరి 26న గణతంత్ర దినోత్సవం గొప్పగా జరుపుకుంటాము.

3. ________________
_____________________________
జవాబు:
గురుపూజోత్సవం :
మా పాఠశాలలో సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా అద్భుతంగా జరుపుకుంటాము.

AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా…

4. _____________
________________________
జవాబు:
బాలలదినోత్సవం :
మా పాఠశాలలో నవంబర్ 14న బాలలదినోత్సవం జవహర్‌లాల్ నెహ్రు పుట్టిన రోజు సందర్భంగా ఘనంగా జరుపు కుంటాము.

5. ___________
______________________
జవాబు:
వార్షికోత్సవం : ప్రతి సంవత్సరం మా పాఠశాల వార్షికోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటాము.

స్వీయరచన

ప్రశ్న 1.
దేశభక్తిని ఎలా చాటాలి ?
జవాబు:
దేశ భక్తి అంటే… మంచిని ప్రోత్సహించడం. కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చేయడం.దేశం సశ్య శ్యామలంగా పాడిపంటలతో ఉండేలా కృషి చేయడం. ప్రజలందరూ ఆహారం కలిగి ఉన్నప్పుడే. ఆరోగ్యంతో ఉండేది, కనుక అందరి క్షేమం కోరి ఉండడం. శేశనంమీద నాకు గౌరవం ఉందని గొప్పలు చెప్పడం మానేసి జనులకు ఏదైనా ఒక మేలు చేసి చూపడం. సొంతపనులు కొన్ని మానుకునైనా ఇతరులకు సాయపడడం. దేశమంటే మనుషుల సమూహమని తెలుసుకుని జాతి, మత భేదాలు వదలి కలసి కట్టుగా అందరితోనూ ఒకే మాటగా, ఒకే బాటగా నడవడం.” నడవడం ద్వారా దేశభక్తిని చాటాలి.

తన మాతృ దేశం పట్ల భక్తి కలిగి ఉండడం అంటే, దేశ సార్వభౌమాధికారాన్ని కపాడడం, గౌరవించడం, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌవించడం. దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం దేశ ఔనత్యాన్ని కాపాడడం. దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించడానికి సిద్ధంగా ఉండడం. కన్నతల్లి వంటి జన్మభూమిని ఎప్పుడు గౌరవించాలి.
ఎందుకంటే – జననీ జన్మ భూమిశ్చ సర్గాదపి గరీయసి.

ప్రశ్న 2.
“తిండి కలిగితె కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్” ? గేయ పాదం ద్వారా మీరేమి తెలుసుకున్నారు?
జవాబు:
ఆరోగ్యమే మహాభాగ్యం కనుక దేశంలోని ప్రతి ఒక్కరు పౌష్టికాహారం తీసుకుని ధృడంగా ఆరోగ్యంగా ఉంటే అదే దేశ సౌభాగ్యానికి కారణమవుతుందని తెలుసుకున్నాను. అటువంటి పౌష్ఠిక ఆహారం అందరికీ అభించేలా దేశం పాడిపంటలతో సశ్యశ్యామలంగా ఉండేలా. అందరూ కృషి చేయాలని తెలుసుకున్నాను.

ప్రశ్న 3.
భారతావనిలో ప్రజలందరూ సోదర భావంతో ఉండాలనే భావాన్ని తెలుపుతూ కొన్ని వాక్యాలు రాయండి?
జవాబు:

  1. మనుషులందరు ఒక్కటే.
  2. విభేదాలు మాని ఒక్కటిగా జీవించాలి.
  3. వసుధైక కుటుంబకమ్ ( వసుధ అంతా ఒకే కుటుంబము).
  4. భిన్నత్వంలో ఏకత్వం.
  5. జాతి, మత, కుల, భాషా భేదాలు మరచి ఒక్కటిగా జీవించాలి.
  6. మనందరం భరత మాత బిడ్డలం.

Textbook Page No. 23

సృజనాత్మకత

అ) కింది గేయాన్ని పొడిగించండి

వందనం వందనం
గాంధీ తాతకు వందనం
వందనం వందనం
చాచా నెహ్రూకు వందనం
________________
________________
________________
________________
________________
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 16
జవాబు:
వందనం వందనం
గాంధీ తాతకు వందనం
వందనం వందనం
చాచా నెహ్రూకు వందనం
వందనం వందనం
సుభష్ చంద్రునకు వందనం
వందనం వందనం
లాల్ బహుదూర శాస్త్రి కి
వందనం వందనం
పఠేల్ వందనం, పఠాభికి వందనం
టంగుటూరి కి వందనం

పింగళి వెంకయ్యకు వందనం.
వందనం వందనం
తివర్ణ పతాకానికి వందనం
వందనం వందనం వందనం
దేశనాయకులకు వందనం.
వందనం వందనం
భరత మాతకు వందనం.
వందనం వందనం
తెలుగు తల్లికి వందనం.
తెలుగు భాషకు వందనం
వందనం వందనం.

ఆ) గేయం ఆధారంగా కొన్ని నినాదాలు రాయండి:
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 17
జవాబు:
1. దేశంలో ప్రజలంతా అన్నదమ్ముల్లా ఉండాలి.
2. మాటలకన్నా చేతలు మిన్నగా ఉండాలి.
3. మంచిని పెంచు – చెడును తుంచు.
4. ఆరోగ్య మే మహాభాగ్యం
5. స్వార్ధ పరత్త్యము కంటే – చావు మేలు
6. గొప్పలు చెప్పకు – తిప్పలు పడకు.
7. అందరూ బాగుండాలి అందులో మనముండాలి.
8. అందరిలో దేవుని చూద్దాం – కొందరికైన సాయం చేద్దాం.

ప్రాజెక్టు పని

దేశనాయకుల చిత్రాలు సేకరించండి. వాటిని తరగతిగదిలో ప్రదర్శించండి:
జవాబు:
విద్యార్ధికృత్యం

భాషాంశాలు

అ) క్రింది వాక్యాలు చదవండి. (?) ఈ గుర్తుకు AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 18 చుట్టండి

1. ఆంధ్రా యూనివర్శిటీకి వెళ్ళాలంటే ఏ నెంబర్ జస్ ఎక్కాలి ?
జవాబు:
ఆంధ్రా యూనివర్శిటీకి వెళ్ళాలంటే ఏ నెంబర్ జస్ ఎక్కాలి AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 20

2. భీమిలి వెళ్ళే దారిలోనే రమకృష్ణ బీచ్ వస్తుందా ?
జవాబు:
భీమిలి వెళ్ళే దారిలోనే రమకృష్ణ బీచ్ వస్తుందా AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 20

3. లైట్ హౌసకు వెళ్ళాలంటే ఆటో ఎక్కడ దొరుకుతుంది ?
జవాబు:
లైట్ హౌసకు వెళ్ళాలంటే ఆటో ఎక్కడ దొరుకుతుంది AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 20

AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 19

4. విమానాశ్రయానికి చేరుకోవాలంటే బస్సులుంటాయా ?
జవాబు:
విమానాశ్రయానికి చేరుకోవాలంటే బస్సులుంటాయా AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 20

Textbook Page No. 24

5. విశాఖపట్నలో బస చేయటానికి అనువైన ప్రదేశం ఏది ?
జవాబు:
విశాఖపట్నలో బస చేయటానికి అనువైన ప్రదేశం ఏద AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 20

6. రైల్ నిలయంలో ‘రిజర్వేషన్ కౌంటర్’ ఎటువైపు ఉంటుంది?
జవాబు:
రైల్ నిలయంలో ‘రిజర్వేషన్ కౌంటర్’ ఎటువైపు ఉంటుంది? AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 20

” పిల్లలూ! ఈ గుర్తు (?) వాక్యంలో ఎక్కడ ఉందో గుర్తించారు కదా! ఈ గుర్తును (?) ప్రశ్నార్థక చిహ్నం’ అంటారు. అలాగే ఎప్పుడు, ఎక్కడ, ఏ, ఏది, ఎటువైపు లాంటి పదాలను కూడా ఉపయోగించాం. ఇలాంటి ప్రశ్నార్థక పదాలు, ప్రశ్నార్థక గుర్తు కలిగిన వాక్యాలను “ప్రశ్నార్థక వాక్యాలు” అంటారు.

అ) క్రింది వాక్యాలను గమనించండి. వీటిలో ప్రశ్నార్ధక పదాలను గుర్తించి గీత గీయండి.

ఉదా : నీ పేరు ఏమిటి ?

1. మీరు బడినుండి ఎప్పుడు వచ్చారు?
జవాబు:
మీరు బడినుండి ఎప్పుడు వచ్చారు?

AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా…

2. మీరు ఎట్లా చదువుతున్నారు?”
జవాబు:
మీరు ఎట్లా చదువుతున్నారు?”

3. మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి?
జవాబు:
మీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి?

4. మీరు ఏ ఊరిలో ఉంటున్నారు?
జవాబు:
మీరు ఊరిలో ఉంటున్నారు?

5. జాతీయ గీతం రాసినవారు ఎవరు?
జవాబు:
జాతీయ గీతం రాసినవారు ఎవరు?

ఇ) కింది ప్రశ్నార్థక పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి:

1. ఎవరు ? __________________
జవాబు:
మన ప్రస్థుత ప్రధాన మంత్రి ఎవరు?

2. ఏమిటి ? _____________
జవాబు:
రామూ ! నీ చేతిలోది ఏమిటి?

3. ఎలా? _________
జవాబు:
గెలవటం ఎలా?

4. ఎందుకు? ______
జవాబు:
అతను అలా మాట్లాడుతున్నాడు, ఎందుకు?

5. ఎప్పుడు? _______
జవాబు:
మొదటి ప్రపంచయుద్ధం ఎప్పుడు జరిగింది?

6. ఏది ? _______
జవాబు:
వాటిలో మొదటిది ఏది?

7. ఎన్ని? __________
జవాబు:
రాము దగెర ఎన్ని పండ్లు ఉన్నాయి?

8. ఎక్కడ ? _____________
జవాబు:
తాజ్ మహల్ ఎక్కడ ఉంది?

9. ఏ _________
జవాబు:
విజయవాడ ఏ జిల్లాలో ఉంది?

AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా…

కవి పరిచయం

కవి : గురజాడ వేంకట అప్పారావు కాలము
కాలము : 21-9-1862 నుండి 30-11-1915
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 3
విశేషాలు : ఆధునిక తెలుగు కవిత్వానికి సాహిత్యానికి మార్గదర్శకులు యుగకర్త, కవి, కథకులు, నాటక కర్త, చరిత్రకారులు, శాసన పరిశోధకులు. అన్నిటి కన్నా ముఖ్యంగా భాషావేత్త, తెలుగు సాహిత్యంలో వాడుకభాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. ‘కన్యాశుల్కం’ నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్ట రచన.

పదాలు – అర్థాలు

ఒట్టి = ఏమీ లేని
దేశాభిమానం = దేశం మీద ప్రేమ
తోడుపడు = సహాయపడు
కద్దు = కలదు,ఉన్నది
చెట్టపట్టాలు = ఒకరి చేతిని మరోకరు పట్టుకొనటం.

భావం

1. దేశము నాదని ప్రేమించు. మంచిని ప్రోత్సహించు. మాటలతో కాలం వృధా చేయకుండా ఉపయోగపడే పనులు చేయ్యి.
2. మనదేశం పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉండేలా కృషి చేయాలి. అప్పుడు దేశంలో ఉన్నవారందరికీ ఆహారం లభిస్తుంది. పౌష్టిక ఆహారం తిన్న మనిషి ఆరోగ్యంగా ఉంటాడు
3. నాకు దేశం మీద గౌరవం అని ఎక్కువ గొప్పలు చెప్పవద్దు. జనులకు ఏదైనా ఒక మేలు చేసి చూపించు.
4. సొంత పనులు కొన్ని మానుకొనైనా సరే ఇతరులకు సహాయపడాలి. దేశం అంటే కేవలం రాళ్ళు రప్పలే కాదు,దేశం అంటే జన సమూహం అని తెలుసుకో.
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 4
5. సుఖ దుఃఖాలలో అందరూ కలసికట్టుగా నడవాలి. దేశ ప్రజలందరూ మతాలు, జాతులూ వేరైనా అన్నదమ్ములలాగా కలిసి ‘ఒకే మాట ఒకే బాట’గా నడవాలి.

ఈ మాసపు గేయం

తెలుగు తల్లీ

తేనె పలుకుల తెలుగు తల్లీ!
రవల వెలుగు తెలుగు తల్లీ!
శాతవహన శకములోపల
శాంతి పాఠము నేర్పితమ్మా! |తేనె||
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 24
పూర్వ వేంగీ యుగములోపల
పుణ్యకవితల జెప్పితమ్మా!
కాకతీయుల కాలమందూ
ఖడ్గ పాండితి గరపితమ్మా! ||తేనె||

రెడ్డిరాయల రాజ్యమందూ
లలిత కళలను దేల్చితమ్మా!
గాంధి దేవుని యుగములోపల
సదయ హృదయుల గాంచితమ్మా!||తేనె ||

సర్వమానవ సమతగూర్పగ
భారతాంబకు యశమునింపగ
కదలిరమ్మో తెలుగుతల్లీ
బ్రోవరమ్మో తెలుగు తల్లీ ||తేనె||

కవి పరిచయం

కవి : పిల్లలమట్టి వేంకట హనుమంతరావు
కాలము : 7-05-1921 – 13-09-1989
రచనలు : ఏకాంకికలు, సాహత్యసంపద. ఆంద్రాభ్యుదయం,
విశేషాలు : పిల్లలమఱ్ఱ వేంకట హనుమంతరావు విమర్శకుడు, కవి. సాహిత్యవ్యాసాలు, కథలు, ఖండకావ్యాలు రచించారు. వీరి రచనలో కాపు పాటలు ముఖ్య మైనవి.

ఈ మాసపు కథ

కందిరీగకిటుకు

అనగా అనగా ఓపెద్ద అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉన్నాయి. ఆ అడవికి ఓ సింహం రాజుగా ఉంటున్నది. నిజానికి ఆ సింహం చాలా మంచిది. తనను చూసి మిగిలిన జంతువులు భయపడడం ఆ సింహనికి ఇష్టం లేదు. ప్రతివారు తన దగ్గరకు రావాలనీ, వారి వారి బాధలు తనతో చెప్పుకోవాలనీ సింహం అభిప్రాయం. సింహం కూడా మారువేషంతో అప్పుడప్పుడు అడవిలో తిరుగుతూ ఉండేది.
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 22
అలా తిరగడంలో ఓ ఏనుగు తటస్థపడింది. ఈ ఏనుగు కూడా తెలివైనదే. కాని దాని గుణం అట్టే మంచి కాదు. మరోకరు సుఖంగా ఉండటం, హయిగా నవ్వుకోవడం ఆ ఏనుగుకు గిట్టదు.

వచ్చినప్పట్నించీ అది సింహంతో పొత్తు కలపాలని చూస్తూనే ఉన్నది? సింహం మారువేషంతో తిరుగుతున్నప్పుడు. ఏనుగు పసిగట్టి సింహంతో కబుర్లాడింది. మాటలు పెంచింది. స్నేహం చేసింది. ఆ స్నేహం బాగా పెంచేసింది కూడా. సింహం మంచిదనుకొన్నాం గదా! అంచేత దానికి ఎదుటివారి చెడ్డగుణాలు ఒకంతట తెలిసేవి కావు. అందరూ మంచివారే అనుకునేది సింహం. అందరి మాటలు నమ్మేది పాపం.

ఏనుగు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇతర జంతువుల మీద చాడీలు చెప్పేది. అబద్దాలాడేది. చివరికి సింహాన్ని తన చేతిలో చిక్కించుకొన్నది. సింహానికి ఏనుగు ఎంత చెబితే అంత! ఈ ఆసరా చూసుకొని ఏనుగు మిగిలిన జంతువులను వేధించుకు తినేది. భయపెట్టేది, బెదరకొట్టేది. జంతువులు చాలా కాలం ఈ బాధను భరించాయి. ఏం చేయడానికి వాటికి తోచలేదు. చివరికి అడవిని విడిచి వెడదామనుకొన్నాయి కూడా.

ఆ దశలో ఒక కందిరీగ, ఏనుగు పనేదో తాను చూస్తానన్నది. అని , మెల్లగా ఏనుగు దగ్గరకెళ్ళి చెవిలో దూరిపోయింది. ఈ కందిరీగను వదిలించుకోవడానికి ఏనుగు చాలా ప్రయత్నించింది. పెద్దగా ఘీంకరించింది. కోపంతో చెట్లను కొమ్మలను విరిచేసింది. చేతికందిన జంతువుల మీద విరుచుకు పడింది. కానీ కందిరీగ వదలలేదు.

ఆఖరుకు ఏనుగు విసుగెత్తిపోయి కందిరీగతో రాజీకి వచ్చింది. ఏనుగు ఈ అడవిని విడిచిపోతే, తను ఏనుగును విడిచిపోతానన్నది కందిరీగ. ఇక చేసేదేమీ లేక ఏనుగు ఆ అడవిని విడిచి వెళ్ళిపోయింది.

కవి పరిచయం

కవి : రావూరి భరద్వాజ
కాలము : ( 5.7.1927 – 18.10-2013)
రచనలు : ” విమల, అపరిచితులు, కథాసాగరము, ఉడుతమ్మ ఉపదేశం, కీలుగుర్రం, కరిమ్రింగిన వెలగపండు’, జలప్రళయం, పాకుడు రాళ్ళు.
AP Board 4th Class Telugu Solutions 3rd Lesson దేశమును ప్రేమించుమన్నా… 23
విశేషాలు ‘ : గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించాడు. జ్ఞానపీఠం, కళాప్రపూర్ణ, కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం, సోవియట్ భూమి, నెహ్రూ పురస్కారం రాజాలక్ష్మీ పౌండేషన్ అవార్డు, గోపిచంద్ జాతీయ సాహిత్య పురస్కారం, కళారత్న (ఆంధ్రప్రదేశ్), లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం లభించాయి.