Andhra Pradesh AP Board 3rd Class Telugu Solutions 8th Lesson మా వూరి ఏరు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Telugu Solutions Chapter 8 మా వూరి ఏరు
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి ?
జవాబు:
చిత్రంలో – తూరుపు కొండల చాటునుండి సూర్యుడు ఉదయిస్తున్నాడు. రైతులు ఉదయాన్నే పొలంలో దిగి – కొత్త పంటల కోసం నారు పోస్తున్నారు. ఆడవాళ్ళు వంగి సమమైన కొలతలో వరుస ప్రకారం నాట్లు వేస్తున్నారు. మగవారు అందుకు సరిపోయోల! మట్టిని నీటిని సర్దుతున్నారు. అందులో
ప్రశ్న 2.
చిత్రంలో ఎవరెవరు ఏం చేస్తున్నారో చెప్పండి.
జవాబు:
చిత్రంలో – తూరుపు కొండల చాటునుండి సూర్యుడు ఉదయిస్తున్నాడు. రైతులు ఉదయాన్నే పొలంలో దిగి – కొత్త పంటల కోసం నారు పోస్తున్నారు. ఆడవాళ్ళు వంగి సమమైన కొలతలో వరుస ప్రకారం నాట్లు వేస్తున్నారు. మగవారు అందుకు సరిపోయోల! మట్టిని నీటిని సర్దుతున్నారు.
ప్రశ్న 3.
మీరుండే ప్రాంతంలో నదులు గానీ చెరువులు గానీ ఉన్నాయా! వాటి గురించి చెప్పండి.
జవాబు:
నాగావళి : మేముండే ప్రాంతంలో ఉన్న నది ‘నాగావళి’. మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులలో ‘నాగావళి’ ముఖ్యమైనది. ఇది ఒడిషా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. నాగావళి నది మీద తోటపల్లి నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు. శ్రీకాకుళం దగ్గరలోని కళ్ళేపల్లి వద్ద నాగావళి బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈనది వలన తాగునీటి అవసరాలు తీరుతాయి.
పిల్లలూ! పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి:
జవాబు:
- పొలం
- నీరు
- నారు
- రైతులు
- ఆడవాళ్లు
- సూర్యుడు
- కొండలు
- కొబ్బరి చెట్లు
- కుక్క
- భోజన పాత్రలు
- పశువులు (ఆవులు)
- రహదారి
- మోటారు వాహనం
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
గేయాన్ని రాగయుక్తంగా పాడండి. అభినయం చేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం
ప్రశ్న 2.
ఈ గేయం చదివితే మీకేమనిపించింది?
జవాబు:
ముందుగా ఏరు అంటే ఏంటో తెలిసింది. ప్రవహించే ఏరు ఎంత అందంగా ఉంటుందో తెలిసింది. ఏరు ఎండిపోతే…. ఆ ప్రదేశం ఎలా ఉంటుందో తెలిసింది. ఏరు ప్రవాహం ఎంత వయ్యారంగా ఉంటుందో, ఏటికి అటు – ఇటూ ఎలా ఉంటుందో, ఆ సన్నివేశాలు ఒక్కసారి చూడాలనిపించింది. ఈ గేయం చదువుతుంటే – ఒక్కమాటలో చెప్పాలంటే మా ఊరి ప్రక్కన ఏరు నా కళ్ళముందుకు వచ్చింది.
ప్రశ్న 3.
ఈ గేయంలో ఏరు ఎలా ప్రవహిస్తుందో మీ సొంతమాటల్లో చెప్పండి?
జవాబు:
ఏడాదికి ఒక్కసారి ప్రవహించినా కూడా, చాలా అందంగా చక్కగా ఉంటుంది ఈ ఏరు. . ఏటిలో మధ్యలో నల్లని గుండ్రని రాళ్ళు – ఉన్నాయి. ఏటికి అటూ ఇటూ మొగలి పొదలు. ఆ మొగలిపూల వాసనలు నలుదిక్కులా వెదజల్లుతుంటాయి. వానలు బాగా కురిసినప్పుడు చెరువులు నిండిపోయోలా ప్రవహిస్తుంది. అలా ఉప్పొంగి హోరు హోరుమనే శబ్దంతో ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం మూడునాళ్ళ ముచ్చటగా ప్రవహిస్తుంది. ఆ తరువాత ఏమైపోతుందో గాని ఆశ్చర్యం కనపడదు.
ప్రశ్న 4.
ఈ గేయం సారాంశం చెప్పండి.
జవాబు:
మా ఊరి ఏరు చాలా అందంగా వుంటుంది. అది యేడాదికి ఒకసారే పారుతుంది. ఏటి మధ్యలో గుండ్రని నల్లని రాళ్ళు వున్నాయి. ఏటికి ఇరువైపుల మొగలి పొదలు వున్నాయి. ఆ పొదల మధ్యలో మొగలి పూలు మంచి వాసన నలుదిక్కులా వెదజల్లుతుంటాయి. వానలు బాగా కురిసినపుడు చెరువులు నిండి వరదలు వస్తాయి.
ఆ సమయంలో వేగంగా ఉప్పొంగి మా ఏరు ప్రవహిస్తుంది. హోరు హోరుమనే శబ్దంతో ఏరు ప్రవహిస్తుంటే ఆ అందం మాటలలో చెప్పలేము. ఏటి వరద మూడునాళ్ళ ముచ్చటై ఆ తరువాత ఏమౌతుందో గాని ఆశ్చర్యంగా మాయమైపోతుంది. నీరు ఇంకిపోయినా, నీటిలో వుండే ఇసుక తిన్నెలు ఎంతో అందంగా కనిపిస్తాయి. మా వూరి ఏరు మాకొక అందమైన పూలతోట.
చదవడం – వ్యక్త పరచడం
అ) కింది వాక్యాలకు సరిపోయే గేయపంక్తులు గుర్తించి రాయండి.
ప్రశ్న 1.
ఇసుక తిన్నెలు కన్నుల పండుగగా ఉంటాయి.
జవాబు:
ఇసుక తిన్నెలు కనుల పండుగై యుండు
ప్రశ్న 2.
తియ్యనైన పరిమాళాలను దిక్కులకు చల్లుతాయి.
జవాబు:
మధుర సుగంధమ్ము దిక్కులను జల్లు
ప్రశ్న 3.
సంవత్సరానికి ఒకసారి అందంగా ప్రవహిస్తుంది.
జవాబు:
ఏడాదికొకసారి ముచ్చటగ పారు.
ప్రశ్న 4.
ప్రవాహం మూడు రోజుల పండుగలా ఉంటుంది.
జవాబు:
ముణాళ్ళ తిరుణాల మా ఏటి వరద.
ఆ) కింది పేరాను చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
తెలుగువారు కృష్ణవేణి అనీ, కృష్ణమ్మా అనీ ఆప్యాయంగా పిలిచే నది కృష్ణానది. ఇది పడమటి కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. అక్కడి నుండి కృష్ణమ్మ కొండలు కోనలు దాటి శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలం చేస్తుంది. దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. చివరికి హంసలదీవి వద్ద రెండు పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది.
ప్రశ్న 1.
కష్ణానది ఎక్కడ పుట్టింది ?
జవాబు:
పడమటి కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది.
ప్రశ్న 2.
కృష్ణమ్మను ఏయే పేర్లతో పిలుస్తారు ?
జవాబు:
కృష్ణవేణీ, కృష్ణమ్మ, కృష్ణ
ప్రశ్న 3.
కృష్ణమ్మ ఎలా ప్రవహిస్తుంది ?
జవాబు:
కొండ కోనలు దాటి గలగలా బిరబిరా ప్రవహిస్తున్నది.
ప్రశ్న 4.
పై పేరాకు శీర్షిక పెట్టండి ?
జవాబు:
‘ కృష్ణవేణీ ‘
‘అ’ అభ్యాసంలో ఇచ్చిన పేరా ఆధారంగా కింది వాక్యాలు తప్పు (✗), ఒప్పు (✓)లను గుర్తించండి.
- కృష్ణానది 1500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ( )
- కృష్ణానది పడమటి కనుమలలో పుట్టింది. ( )
- నాగార్జునసాగర్ ఆనకట్ట కృష్ణానదిపై ఉంది. ( )
- కృష్ణమ్మ బంగాళాఖాతంలో కలుస్తుంది. ( )
జవాబు:
- కృష్ణానది 1500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ( ✗ )
- కృష్ణానది పడమటి కనుమలలో పుట్టింది. ( ✓ )
- నాగార్జునసాగర్ ఆనకట్ట కృష్ణానదిపై ఉంది. ( ✓ )
- కృష్ణమ్మ బంగాళాఖాతంలో కలుస్తుంది. ( ✓ )
కింది పదాలను చదవండి. ‘ఆ’ అభ్యాసంలో ఇచ్చిన పేరాలో గుర్తించండి. వాటితో సొంతవాక్యాలు రాయండి.
ఉదా : సస్యశ్యామలం : మా ఊరు పాడిపంటలతో సస్యశ్యామలంగా ఉంటుంది.
ప్రశ్న 1.
అప్యాయంగా
జవాబు:
కృష్ణానదిని మేము ఆప్యాయంగా ‘కృష్ణమ్మ’ అని పిలుచుకుంటాము.
ప్రశ్న 2.
ప్రయాణం
జవాబు:
మొన్న సెలవలకు మా కుటుంబమంతా ఎంతో దూరం కారు ప్రయాణం చేశాం.
ప్రశ్న 3.
పుట్టింది
జవాబు:
మొన్ననే మా గోమాతకు దూడ పుట్టింది.
ప్రశ్న 4.
పాయలు
జవాబు:
ఉదయాన్నే నా జడపాయలు చిక్కు తీసి చక్కగా అల్లుతుంది అమ్మ
పదజాలం
అ) పటంలో నల్లనిగుండ్లు – పొదరిండ్లు లాంటి ప్రాసపదాలు ఉన్నాయి కదా! అలాంటి పదాలను కొన్ని రాయండి.
ఉదా : కట్టుకుంది – ఆడుకుంది
జవాబు:
ఏరు – పారు
మొగలి మొగ్గలు – దిక్కులను జల్లు
హోరు – హొయలు
ఆట – పాట
అంటుంది – వింటుంది
ఆ) కింద గీత గీసిన పదాలకు సమాన అర్థాలు గల పదాలతో వాక్యాలు తిరిగి రాయండి.
ఉదా :
ప్రశ్న 1.
బాటకు ఇరువైపులా పూల మొక్కలు ఉన్నాయి.
జవాబు:
బాటకు రెండువైపులా పూల మొక్కలు ఉన్నాయి.
ప్రశ్న 2.
మా గ్రామంలో ఎడాదికి ఒకరోజు జాతర జరుగుతుంది.
జవాబు:
మా గ్రామంలో సంవత్సరానికి ఒకరోజు జాతర జరుగుతుంది.
ప్రశ్న 3.
గాలిపటం వినువీథిలో ఎగురుతుంది.
జవాబు:
గాలిపటం ఆకాశం లో ఎగురుతుంది.
స్వీయరచన
కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
ఇచ్చిన ఆధారాలతో మీ ప్రాంతంలో ఉన్న ఏరు / నది / చెరువు కాలువ గురించి నాలుగు వాక్యాలు రాయండి.
జవాబు:
- బుడమేరు వేగంగా ప్రవహిస్తుంది.
- బుడమేరు ఏడాది పొడవునా ప్రవహించదు.
- బుడమేరు ఎల్ల వేళలా కనిపించదు.
- బుడమేరు. వానా కాలంలో ఉప్పొంగి ప్రవహిస్తుంది.
ప్రశ్న 2.
కవి ఈ గేయంలో ఇసుకతిన్నెల గురించి ఏం చెప్పాడో రాయండి
జవాబు:
ఇంకి పోయిన నేమి మా ఏటిలోన
ఇసుక తిన్నెలు కనుల పండుగై యుండు
నీరు ఇంకిపోయినా, ఏటిలో ఉండే ఇసుక తిన్నెలు ఎంతో అందంగా కనిపిస్తాయి. అని చెప్పాడు.
ప్రశ్న 3.
వర్షం కురిసేటప్పుడు మీకు ఏమనిపిస్తుందో రాయండి.
జవాబు:
వాతావరణం చల్లగా హాయిగా, ఆహ్లాదకరంగా మారుతుంది. చెట్ల ఆకుల మీద నుంచి రాలుతున్న అ నీటి చుక్కలను తాకాలని – వాటితో ఆడుకోవాలి. వానలో తడుస్తూ ఆడుకోవాలనిపిస్తుంది. దూరంగా కొండల పై నుండి ప్రయాణం చేస్తున్న మేఘాలను చూస్తూ ఉండాలనిపిస్తుంది. తడిసిపోయిన చెట్ల కొమ్మల ఆకుల చాటున ఉ ండి అరుస్తున్న పిట్టలను చూడాలనిపిస్తుంది. కురుస్తున్న వానను చూస్తూ…. వసారాలో కూర్చొని అమ్మ పెట్టిన వేడి వేడి పకోడి తినాలనిపిస్తుంది. అమ్మతో-నాన్నతో, చెల్లాయితో మట్లాడుతూ ఆనందంగా గడపాలనిపిస్తుంది.
ప్రశ్న 4.
మొగలి పూలు మంచివాసనలు ఇస్తాయిగదా! అలాంటి మరికొన్ని పువ్వుల పేర్లు రాయండి.
జవాబు:
మల్లె పూలు, (జాజులు), సన్నజాజులు, విరజాజులు, లిల్లీ పూలు, గులాబీలు, కనకాంబరాలు, మరువం, చామంతులు, డిసెంబరాలు.
సృజనాత్మకత
కింది చిత్రానికి రంగులు వేయండి. నాలుగు వాక్యాలు రాయండి.
జవాబు:
రంగులు వేయడం విద్యార్థి కృత్యం
- ఏటి ఒడ్డున ఇల్లు
- ఇంటిని అనుకుని పెద్ద చెట్టు
- ఏటిలో పడవ
- దూరాన కొండలు
- కొండలు నడుమ సూర్యుడు
ప్రశంస
మీ ప్రాంతంలో ప్రవహించే నదికి / చెరువు / ఏటికి సంబంధించిన విశేషాలను తెలుసుకొని మీ తరగతి గదిలో మాట్లాడండి.
జవాబు:
నాగావళి :
మేముండే ప్రాంతంలో ఉన్న నది ‘నాగావళి’. మన రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రవహిస్తున్న నదులలో ‘నాగావళి’ ముఖ్యమైనది. ఇది ఒడిషా రాష్ట్రంలో ప్రారంభమవుతుంది. నాగావళి నది మీద తోటపల్లి నారాయణపురం వద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించారు. శ్రీకాకుళం దగ్గరలోని కళ్ళేపల్లి వద్ద నాగావళి బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీకాకుళం పట్టణ ప్రజలకు ఈనది వలన తాగునీటి అవసరాలు తీరుతాయి.
ప్రాజెక్టుపని
దిప పత్రికలలో వచ్చిన నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టల చిత్రాలను సేకరించి చార్ట్ పై అతికించి తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యం
భాషాంశాలు
పిల్లలూ! కింది సంభాషణ చదవండి. . . ! ? గుర్తులను సరియేవ చోట ఉంచండి.
చిటుకు : ఏమోయ్ లటుకూ, నేనూ! నా మిత్రుడు బుడుగు విశాఖపట్నం వస్తాం. దేని మీద వస్తమో తెలుసా?
లటుకు : బస్సు మీదా !
చిటుకు : కాదు !
లటుకు : కారు మీదా !
చిటుకు : కాదు !
లటుకు : రైలు మీదా !
చిటుకు : కాదోయ్ !
లటుకు : మరి విమానం మీదా!
చిటుకు : అబ్బే !
లటుకు : మరి పడవ మీదా!
చిటుకు : కాదు బాబూ,
లటుకు : అయితే నీ మొహం, మరి దేని మీద రాదలిచారు
చిటుకు : దేని మీదనా ! మేము రోడ్డు మీద వస్తాము
లటుకు : ఓహో అలాగా !
గేయసారాంశం
మా ఊరి ఏరు చాలా అందంగా వుంటుంది. అది యేడాదికి ఒకసారే పారుతుంది. ఏటి మధ్యలో గుండ్రని నల్లని రాళ్ళు వున్నాయి. ఏటికి ఇరువైపుల మొగలి పొదలు వున్నాయి. ఆ పొదల మధ్యలో మొగలి పూలు మంచి వాసన నలుదిక్కులా వెదజల్లుతుంటాయి. వానలు బాగా కురిసినపుడు చెరువులు నిండి వరదలు వస్తాయి.
ఆ సమయంలో వేగంగా ఉప్పొంగి మా ఏరు ప్రవహిస్తుంది. హోరు హోరుమనే శబ్దంతో ఏరు ప్రవహిస్తుంటే ఆ అందం మాటలలో చెప్పలేము. ఏటి వరద మూడునాళ్ళ ముచ్చటై ఆ తరువాత ఏమౌతుందో గాని ఆశ్చర్యంగా మాయమైపోతుంది. నీరు ఇంకిపోయినా, నీటిలో వుండే ఇసుక తిన్నెలు ఎంతో అందంగా కనిపిస్తాయి. మా వూరి ఏరు మాకొక అందమైన పూలతోట.
కవి పరిచయం :
కవి : మథురాంతకం రాజారాం
కాలము : (5.10.1930 – 1.4.1999)
విశేషాలు : సుప్రసిద్ధ కథకులు, రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400లకు పైగా కథలు రాశారు. మానవ సంబంధాల్లోని సున్నిత పార్శ్వాలను చిత్రించారు. ఉత్తమ ఉపాధ్యాయులు. కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నారు.
పదాలు – అర్థాలు
ఏడాది = సంవత్సరం
ముచ్చటగ = చక్కగా
పారు = ప్రవహించు
గుండ్లు = గుండ్రని రాళ్ళు
పొదరిండ్లు = దట్టమైన పొదలు
సుగంధము = మంచి వాసన, సువాసన
వరద = ఎక్కువ నీటి ప్రవాహం
రొదలు = శబ్దాలు
వినువీథి = ఆకాశం
హొయలు = వయ్యారంగా
తిరునాళ్లు = ఊరి పండుగ; వేడుక
పొంగు = ప్రవాహం పెరుగు
ఇంకిపోవడం = కనిపించకుండా నేలలోకి వెళ్లిపోవడం
ఇసుక తిన్నెలు = ఇసుక మేటలు
కొరత = తక్కువ
ఉద్యానవనం = పూల తోట
ప్రారంభించు = మొదలు పెట్టు
ఏరు = నది
ఈ మాసపు పాట
పంట చేలు
పంటచేల గట్ల మీద నడవాలి
ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి
మా ఊరు ఒక్కసారి పోయి రావాలి
జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి ॥పంటచేల॥
ఒయ్యారి నడకలతో ఆ ఏరు
ఆ ఏరు దాటితే మా ఊరు
ఊరి మధ్య కోవెలా,
కోనేరు ఒక్కసారి చూస్తిరా, తిరిగి పోలేరు ॥పంటచేల॥
పచ్చని పచ్చిక పైనా మేను వాల్చాలి
పైరగాలి వచ్చి నన్ను కౌగిలించాలి
ఏరుదాటి తోట తోపు తిరగాలి
ఎవరెవరో వచ్చి నన్ను పలకరించాలి ॥పంటచేల॥
చిన్ననాటి నేస్తాలు చుట్టూ చేరాలి
మనసువిప్పి మాట్లాడే మనుషులు కలవాలి
ఒకరొకరు అప్యాయతలొలక బొయ్యాలి
ఆగలేక నా కన్నులు చెమ్మగిల్లాలి ॥పంటచేల॥
కవి పరిచయం :
కవి : పాలగుమ్మి విశ్వనాథం
కాలము : (1-6-1919 – 25-10-2012)
విశేషాలు : పాలగుమ్మి విశ్వనాథం ఆకాశవాణిలో పనిచేశారు. లలిత సంగీతానికి ప్రచారం కల్పించారు. వేలాది పాటలకు సంగీతం కూర్చారు. గీతకర్త.
ఈ మాసపు కథ
బుద్ది బలం
ఒకప్పుడు భాసురకం అనే పెద్ద సింహం ఉండేది. అది అడవికి రాజు. ప్రతిరోజూ ఎన్నో జంతువులను వేటాడి చంపేది. కాని దానికి రోజుకొక్క జంతువు చాలు. ఒక రోజు అడవిలో జంతువులన్నీ భాసురకం దగ్గరకు వెళ్లాయి, “ప్రభూ! రాజు కర్తవ్యం తన భృత్యుల్ని రక్షించడం, వాళ్లను నాశనం చేయడం కాదు. మీరు అనవసరంగా ఎన్నో జంతువులను చంపుతున్నారు. మీరు మీ గుహలోనే ఉంటే మేము మీకు ఆహారంగా రోజూ ఒక జంతువును పంపుతాం. మీరు దాన్ని చంపి తినవచ్చు” అన్నాయి.
సింహం ఒప్పుకుంది. కొంతకాలం ఈ ఏర్పాటు ప్రకారమే జరిగింది. ఒక రోజు ఒక కుందేలు వంతు వచ్చింది. అది సింహం గుహ వైపు మెల్లగా నడవడం ప్రారంభించింది. తోవలో పెద్ద బావి కనిపించింది. కూతూహలంతో ఆ బావిలోకి తొంగి చూసింది. తన ప్రతిబింబం కనిపించింది. దానికి మెరుపులాంటి ఆలోచన తోచింది. సాయంకాలం దాకా ఉండి అది సింహం గుహకు వెళ్లింది. సింహం ఆకలితో నకనకలాడుతూ ఉంది.
కోపంతో ఊగిపోతూ ఉంది. కుందేలు పై అరిచింది, “ నీవు నాకు సరిపోయేంత జంతువువి కాదు.
పైగా ఇంత ఆలస్యం చేశావు. జంతువులన్నిటినీ కూడా చంపుతాను”.
కుందేలు చెప్పింది, “మహారాజా! నామీద కోపగించకండి. జంతువులకు తెలుసు మేం చాలా చిన్న జంతువులమని. అందుకే నాతోపాటు మరో ముగ్గుర్ని పంపాయి. తోవలో మరొ సింహం ఎదురయింది. తను మీకంటే పెద్దదాన్ననీ, బలమైన దాన్ననీ చెప్పింది. తనే అడవికి నిజమైన రాజునని చెప్పింది. నాతో వచ్చిన మూడు కుందేళ్లనూ చంపి తిన్నది. ఈ విషయమంతా చెప్పడానికి నన్ను మీ వద్దకు పంపించింది”.
భాసురకానికి చాలా కోపం వచ్చింది. ఆ కొత్త సింహాన్ని చూడడానికి కుందేలుతో బయలు దేరింది. కుందేలు దాన్ని బావి దగ్గరకు తీసుకువెళ్లింది. సింహం నీళ్లలో తన నీడను చూసుకొంది. బావిలో మరోక సింహం ఉన్నట్లు భ్రమించింది. భయంకరంగా గర్జిస్తూ బావిలో దూకింది. దాంతో భాసురకం పని పూర్తయింది. కుందేలు సంతోషంగా ఈ వార్తను జంతువులన్నిటికీ చెప్పింది. అన్నీ కలిసి క్రూర సింహం పీడ విరగడయినందుకు పండగ చేసుకున్నాయి.