Andhra Pradesh AP Board 3rd Class Telugu Solutions 2nd Lesson మర్యాద చేద్దాం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Telugu Solutions Chapter 2 మర్యాద చేద్దాం
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడాండి ?
జవాబు:
నిండా నీటితో ప్రవహించే కాలువ. ఆ కాలువ దాటడానికి దాని మీద నిర్మించిన వంతెన ఉన్నది. కాలువకు ఇటు ప్రక్కన పెద్ద చెట్టు. ఆ చెట్టు కొమ్మమీద ఒకవ్యక్తి కూర్చున్నాడు. ఆవ్యక్తి చేతిలో ఒక గోడ్డలి ఉంది. ఆ గొడ్డలితో కొమ్మ నరుకుతున్నాడు. ఆ కొమ్మ తనుకూర్చున్న కోమ్మే!…అంటే తను కూర్చున్న కొమ్మను- తానే నరుక్కుంటున్నాడు అమాయకుడు, అజ్ఞాని.
ఇక కాలువకు అటుప్రక్క దారి. దారి వెంట గుఱ్ఱం మీద ఒక వ్యక్తి వెళ్తున్నాడు. అతని నెత్తిమీద కట్టెల మోపు ఉంది. ఆ కట్టెల మోపు పడిపోకుండా తన రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. ఆ గుఱ్ఱం వేగంగా నోటి నుండి నురగలు కక్కుతూ వెల్తోంది. ఆ గుఱ్ఱపు కళ్ళెం తన నడుంకు కట్టుకున్నాడు. తన రెండు చేతులతో కట్టెల మోపు పడిపోతుందేమో అనే భయంతో పట్టుకున్నాడు కాని – తాను పడిపోతాననే ఆలోచన లేని అమాయకుడు, అజ్ఞాని.
ప్రశ్న 2.
చిత్రంలో వారు చేస్తున్న పనులు సరైనవేనా! ఎందుకు?
జవాబు:
సరైనవి కావు – ఎందుకంటే
(అ) కొమ్మ నరుకుతున్న వ్యక్తి – తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుతున్నాడు. నరికిన కొమ్మతో పాటు తాను కూడా పడిపోతాడు. అది తెలియని అమాయకత్వం, అవివేకం అతనిది. అందుకని ఆ పని సరైనది కాదు.
(ఆ) గుఱ్ఱం మీద వేగంగా వెళ్తున్న వ్యక్తి – తన రెండు చేతులతో గుజ్జం కళ్ళెం పట్టుకోకుండా- నెత్తి మీద ఉన్న కట్టెల మోపును పడిపోకుండా పట్టుకున్నాడు. కట్టెల మోపు పడిపోతుందేమో అనే ఆలోచన తప్ప, తాను పడిపోతానన్న ఆలోచన లేని అమాయకుడు, అవివేకి – అందుకని ఈ పని కూడా సరికాదు.
ప్రశ్న 3.
ఇలాంటి సంఘటనలు మీరెప్పుడైనా చూశారా! వాటి గురించి మాట్లాడండి.
జవాబు:
ఇలాంటి సంఘటనలు నేను రెండు చూశాను:
ఒకసారి నేనూ, అమ్మ, నాన్న -నా బుల్లి తమ్ముడు కలిసి కారులో షికారు కెళ్తున్నాము. నాన్న కారు నడుపుతున్నాడు. మా కారు ప్రక్కనుండి ఒకాయన బండి మీద చాలా వేగంగా వెళ్తూ – ఒకచేత్తో సెల్ మాట్లాడుతూ ఒక చేత్తో డ్రైవ్ చేస్తున్నాడు. వచ్చేపోయే వాహనాలతో బాగా రద్దీగా ఉంది కూడా, నేను అతడినే చూస్తున్నాను.
నాన్న కూడ అద్దం దించి- ఆ వ్యక్తికి తప్పని కూడా చెప్పారు. కాని వినిపించుకోలేదు. మమ్మల్ని దాటి కొంచెం ముందుకు వెళ్ళాడు. ఇంతలో- ఒక చేత్తో అదుపు చేసుకోలేక కింద పడిపోయాడు. చాలా బాధ కలిగింది. అందుకనే- బండి మీద వెళ్తూ సెల్ మాట్లాడకూడదు. ఒక చేత్తో డ్రైవ్ చేయకూడదు.
అలాగే మేము ఇంకొంచెం ముందు కెళ్ళాక – నాన్న కారును పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కోసం ఆపి దిగారు. ఇంతలో మా ప్రక్కనే ఒకయాన తన బండిలో పెట్రోల్ పొయించుకుంటూ- సెల్ మోగితే తీసి మాట్లాడుతున్నాడు. వెంటనే నాన్న అతనితో అలా చేయడం తప్పని చెప్పాడు. నాన్నతో పాటు అక్కడే మిగతా వాళ్ళు కూడా – ఆ వ్యక్తితో……బాబూ! నువ్వు చేసే తప్పు వలన నీకు కూడా ఇబ్బంది కదా! అని మందలించారు.
ఈ రకంగా – మనం చేసే చిన్న తప్పులు మనకీ హాని కలిగిస్తాయి. మన వలన ఇతరులకు కూడా హాని కలిగిస్తాయి. అందుకనే తెలివితో ఉండి, వివేకం కలిగి ఉండాలి.
పిల్లలూ! పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి:
జవాబు:
- పెద్ద చెట్టు |
- కొమ్మలు
- కొమ్మమీద మనిషి
- వంతెన
- కాలువ
- గుఱ్ఱం
- గుఱ్ఱం మీద మనిషి
- నెత్తిమీద కట్టెల మోపు
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
పాఠంలోని చిత్రాల గురించి మాట్లాడండి.
జవాబు:
మొదటి చిత్రంలో : తమ గురువుగారిని ” ఓయ్” ఓరేయ్! అంటూ కేకలు వేస్తూ ఇంట్లోకి వచ్చన పెద్దమనిషి పైన కోపం వచ్చిన పరమానందయ్య శిష్యులు ఆయన్ను స్తంభానికి కట్టేశారు. కొద్దిసేపటికి పరమానందయ్యగారు – ఆయన భార్య ఇంటికి వచ్చి జరిగినది తెలుసుకుని తన మిత్రుని విడిపించి- శిష్యులను క్షమించమని – వారు అమాయకులని ఆ పెద్ద మనిషిని కోరాడు.
రెండవ చిత్రంలో : పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చిన ముగ్గురు దొంగలు. వారిని గౌరవించి మర్యాదలు చేస్తున్నారు పరమానందయ్య గారి శిష్యులు. దొంగలను చక్కగా కూర్చోబెట్టి – కుండలతో నీరు పోశారు ఇద్దరు శిష్యులు. అసలే చలికాలం అవడం వలన వణికి పోయారు దొంగలు. మరో ఇద్దరు శిష్యులు, పసుపు, కుంకుమలు ముఖానికి పూసారు.
ఆ పసుపు, కుంకుమ కళ్ళల్లోకి ముక్కుల్లోకి పోయి మండిపోయి మూల్గుతున్నారు. మరో ఇద్దరు శిష్యులు, సాంబ్రాణి పొగ వేశారు. ఆ పోగలు ఎక్కువై ఇంట్లో నుండి కిటికీల గుండా బైటకు వస్తుంటేఅటుగా వెళ్తున్న రాజుగారి సైనికులు చూసి – లోపలికి వచ్చి – జరుగుతున్న తంతుచూసి అర్ధం చేసుకుని – ఆ దొంగలను రాజుగారి దగ్గరకు తీసుకెళ్ళారు.
ప్రశ్న 2.
పాఠంలో మీకు బాగా వచ్చిన సన్నివేశం గురించి మాట్లాడండి :–
జవాబు:
పాఠంలో నాకు బాగా నచ్చిన సన్నివేశం ఇంటికి వచ్చిన దొంగలను పెద్ద మనుషులుగా భావించి, అర్థరాత్రి వారికి మర్యాదలు చేసి గౌరవించే సన్నివేశం.
పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి వచ్చిన ముగ్గురు దొంగలు. వారిని గౌరవించి మర్యాదలు చేస్తున్నారు పరమానందయ్య గారి శిష్యులు. దొంగలను చక్కగా కూర్చోబెట్టి – కుండలతో నీరు పోశారు ఇద్దరు శిష్యులు. అసలే చలికాలం అవడం వలన వణికి పోయారు దొంగలు. మరో ఇద్దరు శిష్యులు, పసుపు, కుంకుమలు ముఖానికి పూసారు.
ఆ పసుపు, కుంకుమ కళ్ళల్లోకి ముక్కుల్లోకి పోయి మండిపోయి మూల్గుతున్నారు. మరో ఇద్దరు శిష్యులు, సాంబ్రాణి పొగ వేశారు. ఆ పోగలు ఎక్కువై ఇంట్లో నుండి కిటికీల గుండా బైటకు వస్తుంటే- అటుగా వెళ్తున్న రాజుగారి సైనికులు చూసి – లోపలికి వచ్చి – జరుగుతున్న తంతుచూసి అర్ధం చేసుకుని – ఆ దొంగలను రాజుగారి దగ్గరకు తీసుకెళ్ళారు.
ప్రశ్న 3.
పరమానందయ్య శిష్యులు ఎలాంటి వారో చెప్పండి!
జవాబు:
పరమానందయ్య గారి శిష్యులు మహా పండితులు. కానీ శాపవాశాత్తు అమాయకులుగా మారారు. వారు అమాయకత్వంతో చేసే ప్రతి పని చివరకు మంచిగానే పరిణమిస్తుంది. అందరికీ మేలే చేస్తుంది. చెప్పిన విషయం తెలివిగా అర్ధం చేసుకోలేని అమాయకత్వం వారిది. కానీ వారి అమాయకత్వపు చేష్టలే అందరికీ చివరిలో మేలు చేశాయి.
ప్రశ్న 4.
నీకు తెలిసిన ఏదైనా ఒక హాస్యకథ చెప్పండి.
జవాబు:
ఒకసారి పరమానందయ్య గారి ఇంట్లో శుభకార్యం జరుగుతోంది. పరమానందయ్య గారు – ఆయన భార్య కలిసి ఇల్లంతా శుభ్రం చేసుకుంటున్నారు. అది చూసి శిష్యులకు బాధ కలిగి – మనకు ఏ పని చెప్పకుండా మొత్తం ఆయనే చేసుకుంటున్నారు. అని బాధపడుతూ… గురువుగారి వద్దకు వెళ్ళి గురువుగారు….. మేం కూడా ఏదేనా పని చేస్తాం. మీరొక్కరే పని చేస్తుంటే మాకు బాధగా వుంది.
అని ఒకటే రొద పెట్ట సాగారు. ఇహ వారిని వదిలించు కోవటం కష్టమనిపించి – పరమానందయ్య గారు శిష్యులతో….. శిష్యులారా! మీరు ఇక్కడేమి చేయక్కర్లేదు – బైట కెళ్ళి బంధువులోచ్చే లోపు ‘ముందింటికి సున్నం వేయండి’ సరేనా! గొడవ పడకుండా నేర్పుగా ఈ పని చేయండి. అని చెప్పారు.
కొద్ది సేపటికి – గురువుగారికి అనుమానమొచ్చింది. చడి – చప్పుడు లేదు. వీరు ఏం చేస్తున్నారు?… అని సందేహం కలిగి బైటకు వెళ్ళి చూసి ఖంగుతిన్నాడు. వాళ్ళు చేస్తున్న పనికి కోపం వచ్చి- ఒరే నేను చెప్పింది ఏంటి? మీరు చేస్తున్న పనేంటి? అని అడిగాడు – గురువు గారు మీరు ‘ముందింటికి సున్నం వేయమన్నారు? మేము అదే చేస్తున్నాము అన్నారు.
గురువుగారు వాళ్ళ అమాయకత్వానికి బాధపడి – ‘ముందింటికి’ అంటే – మన ఇంటికి ముందిల్లు కాదురా! – మాట వరసకు ముందుగా ఇంటికి సున్నం వేయమన్నాను. , “ని చెప్పి వాళ్ళను లోపలికి తీసుకువెళ్ళాడు.
పదాలు – అర్థాలు
పండితుడు = బాగా చదువుకున్నవాడు అన్నీ తెలిసినవాడు
అన్నీ తెలిసినవాడు
అమాయకత్వం = తెలియనితనం
పొరుగూరు = పక్క ఊరు
దంపతులు = భార్యాభర్తలు
అఘాయిత్యం = చేయకూడని పని
బావురుమను = బోరున ఏడవడం
బిక్కమొహం = ఏడుపు మొహం
అతిథులు = అనుకోకుండా ఇంటికి వచ్చేవారు.
జనులు = ప్రజలు
మర్యాద = గౌరవం
ಅಲಿಕಿಡಿ = శబ్దం
కుమ్మరించటం = ఒక్కసారిగా పొయ్యటం
చిత్రహింసలు = నానాబాధలు
బంధించి = కట్టివేసి
సన్మానిచటం = గౌరవించడం
ఘనంగా = గొప్పగా
ఈ మాసపు పాట
రేలా…. రేలా…..
– (జానపద గీతం)
పల్లవి : రేలా రేలా రేలా రేలా రేలారె
రేలా రేలా రేలా రేలా రేలారె
అడవి తల్లికి దండాలో – మా తల్లి అడవికి దండాలో…
అడవి చల్లంగుంటే – అన్నానికి కొదవే లేదు.
పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము.
చరణం :
చరణం : కొండలనుండి కోనలనుండి
గోదారమ్మ పరుగులు చూడు
గోదారమ్మ పరుగులు చూడు
ఒంపులు తిరుగుతు ఒయ్యారంగా
పెనుగంగమ్మ ఉరకలు చూడు
పెనుగంగమ్మ ఉరకలు చూడు
నీటిలోన ఊట చూడు
నీటిలోన సుడులు చూడు
అందరికీ అండగనిలిచె
అడవితల్లి అందం చూడు || రేలా ||
కిల కిల కిలకిల కిలకిలా
రామచిలుకల పలుకులు చూయ
రామచిలుకల పలుకులు చూడు
కుహూ కుహూ కుహూ కుహూ
కోయిలమ్మల పాటలు చూడు
కోయిలమ్మల పాటలు చూడు
పావురాల జంట చూడు
పాలపిట్ట పాట చూడు
అందరికీ అండగ నిలచె
అడవితల్లి అందం చూడు || రేలా ||
ఈ మాసపు కథ
జింక
జింక ఒకటి నీళ్లు తాగడానికి సెలయేటికి వెళ్లింది. నీళ్లలో తన ప్రతిబింబం చూసుకుంది. తన కొమ్ములు ఎంత పెద్దవో, ఎంత బాగా ఎదుగుతున్నాయో చూసి మురిసిపోయింది. తర్వాత కాళ్లు చూసుకుంది.
” … నా కాళ్ళు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి, ఏం బాగా లేవు” అనుకుంది.
ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీద దూకబోవటం చూసింది. జింక భయంతో రివ్వున దూసుకుపోయింది. అది అలా పారిపోతూ పారిపోతూ అడవిలో చెట్ల గుబురుల్లోకి వెళ్ళి పోయింది. దాని అందమైన కొమ్ములు కొమ్మలకు తగులకుని ఇరుక్కుపోయాయి. సింహం దగ్గరికి వచ్చేస్తోంది. జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసింది. అదృష్టవశాత్తు సింహం మీదపడే లోపలే కొమ్ములు బయటపడ్డాయి. బతుకు జీవుడా అని జింకా వేగంగా పారిపోయింది.
మళ్ళీ సెలయేటి దగ్గరికి వెళ్ళి ” ఎంత దద్దమ్మను నేను! బాగా లేవు అనుకున్న పుల్లలాంటి కాళ్ళు నన్ను కాపాడాయి. నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదికి తెచ్చి పెట్టాయి” అనుకుంది.