Andhra Pradesh AP Board 3rd Class Telugu Solutions 4th Lesson నా బాల్యం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 3rd Class Telugu Solutions Chapter 4 నా బాల్యం
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి ?
జవాబు:
చిత్రంలో చక్కటి నాటక ప్రదర్శన జరుగుతోంది. అందులో ప్రధాన పాత్రధారి గదను బుజాన పెట్టుకుని నటిస్తున్నాడు. ప్రక్కన ఇద్దరు సహ పాత్రధారులున్నారు. ఈ విధమైన సన్నివేశాన్ని కుటుంబమంతా చూస్తున్నారు. నాటక కళను ఆదరిస్తున్నారు.
ప్రశ్న 2.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఏం చేస్తున్నారు ?
జవాబు:
వేదిక మీద ముగ్గురు పాత్రధారులు నటిస్తున్నారు. వేదిక కింద నలుగురు వ్యక్తులు ఆ నాటికను చూస్తున్నారు.
ప్రశ్న 3.
మీరు ఇలాంటి సన్నివేశాలు ఎప్పుడైనా చూశారా! దాని గురించి మాట్లాడండి.
జవాబు:
ఇలాంటి సన్నివేశాలు నేను చూసాను. మా ఊరిలోని కళామందిరం లో నాటక సమాజం వారు వచ్చి ప్రదర్శించినప్పుడు చూసాను. అమ్మ, నాన్న, నన్ను తీసికెళ్ళారు. అందరం కలసి చూసాము. అంతే కాకుండా ! మా పాఠశాల వార్షికోత్సవంలో కూడా చూసాను.
పిల్లలూ! పై చిత్రం నుండి మీరు రాయగలిగినన్ని పదాలు రాయండి:
జవాబు:
- ఇద్దరు కుటుంబ సభ్యులు
- ఆడవాళ్ళు ఇద్దరు
- మొగవాళ్ళు ఇద్దరు
- నాటికలో పాత్రధారులు
- గద
- కత్తి
- వేదిక
- వేదిక ముందర తెర
- వేదిక వెనుక తెర
- కుర్చీలు
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
మీ తరగతిలో బాగా పాటలు పాడే వారి గురించి చెప్పండి.
జవాబు:
మా తరగతిలో బాగా పాటలు పాడే వారు ఇద్దరున్నారు… ఒకరు ‘సౌమ్య’ ఇంకొకరు ‘తేజ’ వీళ్ళిద్దరూ చాలా చక్కగా పాడతారు. వీళ్ళు సంగీతం నేర్చుకుంటున్నారు. పాఠశాలలో ఏ పోటీలు నిర్వహించినా వీళ్ళకు బహుమతులు రావలిసిందే. అప్పుడప్పుడు మా ఉపాధ్యాయురాలు తరగతిలో కూడా వీళ్ళచేత పాడిస్తారు. దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు ఆలపిస్తారు.
ప్రశ్న 2.
నాజర్ ఏ కళాకారునిగా పేరు పొందారు?
జవాబు:
నాజర్ బుర్రకథ కళాకారునిగా పేరు పొందారు.
ప్రశ్న 3.
పాఠశాల వార్షికోత్సవంలో మీరు ఏయే ప్రదర్శనలు చేస్తారు?
జవాబు:
జానపద నృత్యాలు, కోయ నృత్యం, బాల రామాయణం నాటిక, ఏకపాత్రాభినయం భూమిని కాలుష్యం నుండి కాపాడే మూగాభినయాలు; సందేశాత్మక నాటికలు దేశభక్తిని పెంపొందించే అంశాలు ప్రదర్శనలుగా చేస్తాం.
ప్రశ్న 4.
నాజర్ గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి.
జవాబు:
- షేక్ నాజర్ నిరుపేద కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తీదీన జన్మించారు.
- నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ.
- తల్లిదండ్రుల, గుదువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు.
- పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతి వృత్తాలలో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు.
- నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
- నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు.
చదవడం – వ్యక్త పరచడం
అ) కింది పట్టిక చదవండి. పాఠం ఆధారంగా నాజర్‌ను ఎవరు ఎలా పిలిచేవారో తెలుపుతూ వాక్యాలు రాయండి.
జవాబు:
ఉదా :
- పెదనాన్నలు, చిన్నాన్నలు నాజర్ అని పిలచేవారు.
- గారపాడు తాత ‘అబ్దుల్ అజీజ్’ అని పిలిచేవారట.
- మామలూ, అత్తలూ ‘అబ్దుల్ అజీజ్’ అని పిలచేవారట
- నాన్నగారు ‘నాజర్’ అని పిలిచేవారు.
ఆ) కింది పేరామ చదివి ఇ, ఈ ప్రశ్నలకు జవాబులు రాయండి.
హార్మోనిస్టు ఖాదర్ ఒకరోజు మా ఇంటికొచ్చి, మస్తాన్ గారూ మన కుర్రోడు మంచి తెలివిగలవాడు శ్రుతి, లయ, గానం, మంచి కఠం కలవాడు. నాతో పంపండి. చదువు, సంగీతం నేర్పించి గొప్పవాడ్ని
చేస్తాను అన్నాడు.
ఇ) కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
ప్రశ్న 1.
నాజర్ నాన్న పేరేమిటి?
జవాబు:
తండ్రి షేక్ మస్తాన్ ; తల్లి బినాబీ
ప్రశ్న 2.
“వాతో పంపండి” ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు?
జవాబు:
హార్మోనిస్టు ‘ఖాదర్’ గారు నాజర్ తండ్రి మస్తాన్ గారితో అన్నారు.
ప్రశ్న 3.
నాజర్ గురించి ఖాదర్ ఏమన్నాడు?
జవాబు:
కుర్రాడు మంచి తెలివి కలవాడు. శ్రుతి, లయ, గానం, మంచి కంఠం కలవాడు అన్నాడు.
ఈ) కింది వాక్యాలలో తప్పు (✗), ఒప్పు(✓) లను గుర్తించండి.
అ) అజీజ్ నాజరకు చదువు, సంగీతం నేర్పుతానన్నాడు. ( )
ఆ) మస్తాన్ కుమారుడు నాజర్ ( )
ఇ) ఖాదర్ వయోలిన్ విద్యాంసుడు ( )
ఈ) నాజర్ మంచి తెలివిగలవాడు ( )
జవాబు:
అ) అజీజ్ నాజరకు చదువు, సంగీతం నేర్పుతానన్నాడు. (✗)
ఆ) మస్తాన్ కుమారుడు నాజర్ (✓)
ఇ) ఖాదర్ వయోలిన్ విద్యాంసుడు (✗)
ఈ) నాజర్ మంచి తెలివిగలవాడు (✓)
ఉ) పిల్లలూ! కొండపల్లి బొమ్మల ఆత్మకథను చదవండి. ప్రశ్నలకు జవాబులు రాయండి.
పిల్లలూ! నేను మీ కొండపల్లి బొమ్మను. రంగురంగుల్లో అందంగా ఉంటానని అందరూ నన్ను దాచుకుంటారు. నేను ఏనుగు అంబారీ, దశావతారాలు, తాటిచెట్టు వంటి రూపాలలో ఉంటాను. నన్ను పొణికి కర్రతో తయారుచేస్తారని మీకు తెలుసా! కర్రను బొమ్మగా మలచడంలో ఎంతో కష్టం ఉంటుంది. మా పూర్వికులు రాజస్థాన్ నుండి వచ్చారట. ప్రస్తుతం మేము మన రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, కొండపల్లిలో స్థిరపడిపోయాం.
ప్రశ్న 1.
కొండపల్లి బొమ్మలు తయారు చేసేవారి పూర్వికులు ఎక్కడి నుండి వచ్చారు?
జవాబు:
రాజస్థాన్ నుండి వచ్చారట.
ప్రశ్న 2.
కొండపల్లి ఏ జిల్లాలో ఉంది ?
జవాబు:
కృష్ణా జిల్లాలో ఉంది.
ప్రశ్న 3.
కొండపల్లి బొమ్మలను ఏ కర్రతో తయారు చేస్తారు?
జవాబు:
‘పొణికి’ కర్రతో తయారు చేస్తారు.
పదజాలం
అ) పిల్లలూ! కొండపల్లి బొమ్మ తనమ దేవితో తయారు చేస్తారో చెప్పింది కదా! మరి కింది వస్తువులను వేటితో తయారుచేస్తారో జతపరచండి. వాటిని వాక్యాలుగా రాయండి.
జవాబు:
ఉదా :
- కుండలు మట్టితో తయారు చేస్తారు.
- అద్దం గాజుతో తయారు చేస్తారు.
- బుట్ట వెదురుతో తయారు చేస్తారు.
- గునపం గాజుతో తయారు చేస్తారు.
పిల్లలూ ! పాఠంలో ఉన్న కింది పదాలను మన రాష్ట్రంలోని పలు ప్రాతాలలో ఇలా కూడా అంటారని తెలుసుకోండి.
- గంజ : రాట, నిట్టాడు, స్తంభం
- చిన్నాన్న : బాబాయి, పినతండ్రి, చిన్నబ్బ, చిన్నాయన
- బువ్వ : అన్నం, కూడు, మెతుకులు
ఉపాధ్యాయులకు సూచన : ఇలాంటివి మరికొన్ని పదాలను పరిచయం చేయండి.
స్వీయరచన
అ) కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి.
ప్రశ్న 1.
‘నాజర్ ‘ము ఎవరెవరు ఎలా పిలుస్తారో తెలుసుకున్నారు కదా! మిమ్మల్ని ఎవరెవరు ఎలా పిలుస్తారో రాయండి.
జవాబు:
విద్యార్థి కృత్యం.
ప్రశ్న 2.
వాజర్ తమ అమ్మా నాన్నల గురించి ఏం చెప్పారో రాయండి.
జవాబు:
అమ్మా నాన్న ఆరుగాలం ఎండనకా వాననకా అలుపు సొలుపు లేకుండా కష్టపడేవారని చెప్పాడు.
ప్రశ్న 3.
ఖాదర్, నాజరకు సంగీతం ఎలా నేర్పించాడో రాయండి.
జవాబు:
గోగుపుల్ల గొట్టంతో నీళ్ళ చెంబులో వూదిస్తూ, శ్రుతి గుక్క నేర్పించేవాడు. ఏడ్వడం, నవ్వడం, కోపంగా మాట్లాడడం చూడడం, మూతి ముడవడం, కళ్ళురమడం, లాంటివి నేర్పించాడు. కళ్ళలో కొబ్బరి నూనె వేసి, లైటు వంక చూసి నీరు కారుతుంటే ఏడుపు డైలాగులు చెప్పించేవాడు.
సృజనాత్మకత
పిల్లలూ! కింది బుర్రకథను ఉపాధ్యాయుని సహాయంతో నేర్చుకోండి. మీ స్నేహితులతో కలసి ప్రదర్శించండి.
పల్లవి : వినరా భారత కుమార
విజయం మనదేరా – తందాన తాన
వినరా వీరకుమారా
ఝాన్సీలక్షి కథనూ – తందాన తాన
పల్లవి : చదువులు చక్కగ నేర్చెరా – సై
యుద్ధ విద్యలే నేర్చెరా – సై
శత్రు మూకనే చీల్చెరా – సై
ప్రజలను ప్రేమగ చూసిందా…
వీరనారిగా వెలిసిందా…
భళానంటి భాయి తమ్ముడా.
మేల్ భళానోయ్ తందానా….
తరిగిట ఝంతరి తోం
ప్రశంస
నాజర్ బుర్రకథ చెప్పడంలో మంచి పేరు పొందాడు కదా! ఇలాంటి కళలను గురించి తెలుసుకొని తరగతి గదిలో మాట్లాడండి.
జవాబు:
బుర్రకథ లాంటి మరొక జానపద కళ “కోలాటం”
గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్యకృత్యాలలోని అలసటను మరిచిపోయేందుకు ఉపయోగించే కళారూపం ఈకోలాటం. కోలాటం ఆటలో కళాకారులు రెండు చేతులతో కోలలు ధరించి వాటిని తాకిస్తూ కోలాటం ఆడతారు. ఇందులో ఏక కోలాటం, జంటకోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం వంటివి ఎన్నో ఉన్నాయి. కోలాటం నృత్యంలో సుమారు 16 మంది నుండి 40 మంది వరకు పాల్గొనవచ్చు.
భాషాంశాలు
అ) కింది వాక్యాలను చదవండి. వాక్యం చివర ఉన్న ‘ ? ‘ గుర్తును గమనించండి.
- బాబూ! నీ పేరేమిటి?
- గీతా! మీ ఊరు ఏది?
- నీవు ఏ తరగతి చదువుతున్నావు?
- లతా! నీవు ఎక్కడికి వెళ్తున్నావు?
పై వాక్యాల చివర ‘?’ గుర్తు ఉంది కదా! దీనిని ప్రశ్నార్థకం అంటారు. ఈ ‘?’ గుర్తు ఉన్న వాక్యాలను ‘ప్రశ్నార్థక వాక్యాలు’ అంటారు.
“ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా ఎవరు” ఇలాంటి పదాలను ప్రశ్నార్థక పదాలు” అంటారు.
ఈ పదాలు వాక్యాలలో వచ్చినప్పుడు వాక్యానికి ప్రశ్నార్థకం (?) గుర్తు వస్తుంది.
ఆ) కింది పేరాను చదవండి. పేరాలో ఈ ‘ ! ‘ గుర్తును గమనించండి.
అబ్బో! జూ ఎంత అందంగా ఉందో! అందులో జిరాఫీ ఎంత ఎత్తుగా ఉందో! అమ్మో! సింహాన్ని చూడగానే ఎంత భయమేసిందో! అలాగే పక్షులను చూడగానే ఎంత ముచ్చట వేసిందో! అని ‘జూ’ లో చూసిన విశేషాలను కమల వనజతో చెప్పింది.
పై పేరాలో ‘!’ గుర్తును గమనించారు కదూ! ఇది ఆశ్చర్యాన్ని తెలిపేది. ఈ గుర్తునే ‘ఆశ్చర్యార్థకం’ అంటారు.
ఇ) పై పేరాలో ఆశ్చర్యార్థకం ‘!’ గుర్తు ఉన్న పదాలను గుర్తించి రాయండి.
జవాబు:
- అబ్బో !
- అమ్మో!
- ఎంత అందంగా ఉందో!
- ఎంత ముచ్చట వేసిందో
- ఎంత భయం వేసిందో!
- ఎంత ఎత్తుగా ఉందో!
నాజర్ జీవిత విశేషాలు
- షేక్ నాజర్ నిరు పేద కుటుంబంలో గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో 1920 ఫిబ్రవరి 5వ తీదీన జన్మించారు.
- నాజర్ తండ్రి షేక్ మస్తాన్, తల్లి బీనాబీ.
- తల్లిదండ్రుల, గురువుల ప్రోత్సాహంతో ప్రాచీన జానపద కళారూపమైన , బుర్రకథ ప్రక్రియకు నాజర్ కొత్త మెరుగులు దిద్దారు.
- పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు వంటి ఇతి వృత్తాలలో సమకాలీన అంశాలు జతచేసి నాజర్ బుర్రకథలు రూపొందించారు.
- నాజర్ చేసిన కృషిని గుర్తించి భారత ప్రభుత్వం 1986లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
- నాజర్ 1997 ఫిబ్రవరి 21వ తేదీన మరణించారు.
పదాలు – అర్థాలు
ఆశ = కోరిక
ఆరుగాలం = ఏడాది అంతా
దినచర్య = ప్రతిరోజూ చేసే పనులు
గురుదక్షిణ = గురువులకు ఇచ్చే కానుక
వార్షికోత్సవం = సంవత్సరం చివరన జరుపుకునే వేడుక
గుంజ = రాట
పామరులు = చదువుకోనివారు
కలి పరిచయం
షేక్ నాజర్ తన జీవితకథను తానే చెప్పుకున్నట్లుగా అంగడాల రమణమూర్తి అక్షరీకరించాడు. స్వీయ చరిత్రాత్మకమైన ఈ కథను ‘పింజారి’ అని పేరు పెట్టారు.
ఈ మాసపు పాట
బంగారు పాప
ప॥ బంగారు పాపాయి బహుమతులు పొందాలి
పాపాయి చదవాలి మా మంచి చదువు ॥
చ॥ పలుసీమలకు పోయి, తెలివిగల పాపాయి
కళలన్ని చూపించి ఘనకీర్తి పొందాలి
ఘనకీర్తి పొందాలి ఘనకీర్తి తేవాలి
॥ బంగారు ॥
చ॥ మా పాప పలికితే మధువులే కురియాలి
పాపాయి పాడితే పాములే ఆడాలి ఏ దేశమేజాతి ఎవరింటిదీ పాప? ఎవ్వరీ పాపాయి అని ఎల్లరడగాలి
॥ బంగారు ॥
చ॥ తెనుగుదేశము నాది, తెనుగుపాపను నేను
అని పాప జగమంతా చాటి వెలయించాలి
మా నోములపుడు మా బాగా ఫలియించాలి
॥బంగారు ॥
కవి పరిచయం
కవి : మంచాళ జగన్నాథరావు
కాలము : (1921 – 1985 )
విశేషాలు : మంచాళ జగన్నాథరావు కవి, సంగీత విద్వాంసులు, ప్రసిద్ధ వాగ్గేయకారుల కృతులకు స్వర రచన చేసారు.
ఈ మాసపు కథ
బంగారు మొలక
అనగనగా ఒక రాజు . ఆ రాజు ప్రజలను చక్కగా పరిపాలించేవాడు. సమయం దొరికినప్పుడల్లా రాజ్యంలో పర్యటించేవాడు. ప్రజల కష్టసుఖాలను తెలుసుకొనేవాడు. ఎప్పటిలానే ఒక రోజు రాజు పర్యటనకు బయలుదేరాడు. ఒక గ్రామం పొలిమేరలో రాజుకి మామిడి మొక్కతో ఒక ముసలివాడు కనిపించాడు. రాజు ఆ వృద్ధుడిని గమనిస్తున్నాడు. అతను మామిడి మొక్కను నాటి దానికి నీరు పోయసాగాడు.
రాజు మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఈ మొక్క ఎప్పుడు చెట్టవుతుంది? కాయలు కాస్తుంది? ఈ ముసలివాడు ఎప్పుడు వాటిని తింటాడు? రాజుకు నవ్వు కూడా వచ్చింది. తాతను అడిగాడు.
” తాతా నీవు ఎంత అమాయకుడివి. ఇప్పుడు మామిడి మొక్క నాటుతున్నావు. ఇది పెరగాలి. పెద్దదవ్వాలి. దానికి కాయలు కాయాలి. ఇది ఎప్పటికి జరిగే పని అప్పటిదాకా నీవు బతికిఉంటావా?”
రాజు మాటలు విని ముసులివాడు బోసినోటితో నవ్వాడు. ” రాజా! ఈ మొక్కనాటేది నాకోసం కాదు. అప్పటివరకు బతికి ఉండనని నాకు తెలుసు. ఇది పిల్లలు తింటారు. జనం తింటారు.
ఎన్నడో మన తాతలు నాటిన మొక్కలే ఇప్పటికి చెట్లయి ఫలాలు ఇస్తున్నాయి. వాటినే మనం తింటున్నాంకదా! ఏపని అయినా మనకోసమే చేయవలసిన పనిలేదు. రేపటి కోసం కూడా చేయాలి ఎవరికోసం వారు ఆలోచించుకుంటే ఈ లోకం ఇంత దూరం వచ్చేదా! ఇంత అభివృద్ధి ఉండేదా!” అన్నాడు ముసలివాడు.
అ ” తాత మంచిమాట చెప్పాడు. తాత మనసు చాలా మంచిది” అనుకుని రాజు ముసలివాడికి పాతిక బంగారు నాణేలు అందించాడు. తాత ముఖం ఆనందంతో వికసించింది.
” చూశావా! రాజా! ఈ మొక్క నాటినరోజే బంగారు కాసులు కాసింది” అంటూ తాత సంబర పడిపోయాడు. అతని సంబరం చూసి రాజు కూడా ఆనందించాడు.