Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 3rd Lesson మన చుట్టూ ఉన్న జంతువులు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class EVS Solutions Lesson 3 మన చుట్టూ ఉన్న జంతువులు
I. విషయావగాహన:
ప్రశ్న 1.
చర్మంపైన దట్టమైన వెంటుక్రలను కలిగి ఉండే జంతువులకు కొన్ని ఉదాహరణలివ్వండి.
జవాబు.
గొర్రె, ఎలుగుబంటి, కుక్కలు మరియు పిల్లులు మొదలైన జంతువులు చర్మం పైన దట్టమైన వెంట్రుకలను కలిగి ఉంటాయి.
ప్రశ్న 2.
కోడిని అండోత్పాదకము అని ఎందుకంటారు?
జవాబు.
కోడి గుడ్డ పెట్టి వాటిని పొదిగి పిల్లలకు జన్మనిస్తుంది. కాబట్టి కోడిని అండోత్పాదకము అని అంటారు.
ప్రశ్న 3.
బాతు, మొసలి ఒకే సమూహానికి చెందినవని శరత్ చెప్పాడు? నువ్వు ఏకీభవిస్తావా? ఎందుకని?
జవాబు.
లేదు, నేను ఏకీభవించను, ఎందుకంటే
- బాతు ఒక ఉభయాహారి. ఇది చిన్న చిన్న చేపలను, కీటకాలను, నీటి మొక్కలను గింజలను తింటుంది.
- మొసలి మాంసాహారి. అది ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకుంటుంది.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
కాకులు లేకపోతే ఏమవుతుంది?
జవాబు.
కాకులు చనిపోయిన జంతువుల మాంసాన్ని తింటూ మన పర్యావరణాన్ని రోగాల నుండి కాపాడతాయి. కాకులు లేకపోతే చనిపోయిన జంతువుల కళేబరాలు కుళ్ళిపోయి వాటి వల్ల వ్యాధులు పెరుగుతాయి.
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
కుక్క కోడి కాళ్ళను పరిశీలించి, వాటిని గురించి రాయండి.
జవాబు.
కుక్క యొక్క కాళ్ళు :-
కుక్కకు నాలుగు కాళ్ళు ఉంటాయి. అవి పొడవుగా కోడి కాళ్ళ కన్నా వెడల్పుగా ఉంటాయి. కుక్క తన కాళ్ళను పరుగెత్తడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి ఉపయోగిస్తుంది.
కోడి యొక్క కాళ్ళు :-
కోడికి రెండు కాళ్ళు ఉంటాయి. కోడి తన కాళ్ళతో నేలను తవ్వి తన ఆహారాన్ని పొందుతుంది.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
శాకాహారులు, మాంసాహారులు, ఉభయహారులు చిత్రాలను సేకరించి, పుకు తయారు చేయండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
నీకు బాగా ఇష్టమైన జంతువుల బొమ్మను గీసి, రంగులు దిద్దండి.
జవాబు.
విద్యార్థి కృత్యము.
VI. ప్రశంస:
ప్రశ్న 8.
పక్షలను సంరక్షించడానికి ఏయే చర్యలను చేపట్టాలనుకుంటున్నావు?
జవాబు.
- పక్షుల కోసం నీటిని, ఆహారాన్ని ఉంచుతాను.
- విషపూరిత పెస్టిసైడ్లను ఫెర్టిలైజర్లను వాడకూడదు.
- పక్షి గూడులను సంరక్షించాలి.
- మన పెంపుడు పిల్లుల, కుక్కల నుండి పక్షులను కాపాడాలి.
- ఆహారం ఉన్న ప్లాస్టిక్ కవర్లను, వల లాంటి పాకింగ్ ను బయట వేయకూడదు. దాని వల్ల పక్షులకు హాని కలుగుతుంది.
- సెల్ టవర్లు, T.V. టవర్లు ద్వారా వచ్చే రేడియేషనను తగ్గించాలి.
కృత్యం 1: (TextBook Page No.21)
కింద ఇవ్వబడిన జంతువులను సరైన చెవులతో కలపండి.
జవాబు.
కృత్యం 2: (TextBook Page No.21)
చెవులు కనిపించే తీరును బట్టి క్రింద ఇవ్వబడిన జంతువులను వర్గీకరిచండి.
జవాబు.
చెవులు బయటకు కనిపిస్తాయి | చెవులు బయటకు కనిపించవు |
జింక | కప్ప |
ఏనుగు | చేప |
పులి | కోడి |
గేదె | కాకి |
పిల్లి | బాతు |
జిరాఫీ | పిచుక |
పంది | పాము |
కృత్యం 3: (TextBook Page No.22)
చిత్రంలో ఇవ్వబడిన జంతువులను వాటి చర్మంతో కలపండి.
జవాబు.
కింది పట్టికను పూరించండి: (TextBook Page No.23)
జవాబు.
పిల్లలను కనే జంతువులు: ఆవు, పులి, కుక్క, పిల్లి.
గుడ్లు పెట్టే జంతువులు: కోడి, పిచ్చుక, కాకి, బాతు.
కృత్యం 4: (TextBook Page No.24)
కింది పట్టికను గుర్తించి, పట్టిక ఆధారంగా వర్గీకరించండి.
జవాబు.
శాఖాహారులు | మాంసాహారులు | ఉభయహారులు |
కుందేలు, కంగారూ. | పులి, పాము, కప్ప, పిల్లి. | కుక్క, బల్లి, కోతి , ఉడుత, కాకి |
అదనపు ప్రశ్నలు:
ప్రశ్న 1.
గొర్రె వెంట్రుకలను మనం ఎలా ఉపయోగిస్తాము ?
జవాబు.
గొర్రె చర్మం పై ఉండే దట్టమైన వెంట్రుకలను స్వెట్టర్లు, కోట్లు తయారులో ఉపయోగిస్తారు.
ప్రశ్న 2.
అండోత్పాదకాలు, శిరోత్పాదకాలు అంటే ఏమిటి? ఉదాహరణలు రాయండి.
జవాబు.
అండోత్పాదకాలు :
గుడ్లు పెట్టి, వాటిని పొదిగి పిల్లలకు జన్మనిచ్చే జంతువులును అండోత్పాదకాలు అంటారు.
ఉదా : కోడి, కాకి, బాతు, బల్లి జంతువులు.
శిశోత్పాదకాలు :
పిల్లలకు జన్మనిచ్చి, పాలిచ్చి పెంచే జంతువులను శిశోత్పాదకాలు అంటారు.
ఉదా : ఆవు, మానవుడు, పులి, ఏనుగు.
ప్రశ్న 3.
డాల్ఫిన్లు అండోత్పాదకాలా? శిశోత్పాదకాలా?
జవాబు.
డాల్ఫిన్లు పిల్లలను కని పాలిచ్చే పెంచుతాయి. కావున అవి శిశోత్పాదకాలు.
ప్రశ్న 4.
తీసుకునే ఆహారాన్ని బట్టి జంతువులను ఏ రకంగా విభజించారు?
జవాబు.
- శాఖాహారులు
- మాంసాహారులు
- ఉభయహారులుగా విభజించారు.
ప్రశ్న 5.
శాఖాహారులు అంటే ఏమిటి? ఉదాహరణలు ఇవ్వండి.
జవాబు.
మొక్కలు లేదా మొక్కల నుండి లభించే పదార్థాలను ఆహారంగా తీసుకునే జంతువులను ‘ శాఖాహారులు’ అంటారు.
ఉదా : గేదె, ఆవు, మేక, జీబ్రా, జింక, గుర్రం, మొదలైనవి.
ప్రశ్న 6.
మాంసాహారులు అని వేనిని అంటారు?
జవాబు.
ఇతర జంతువుల మాంసాన్ని ఆహారంగా తీసుకునే జంతువులను ‘మాంసాహారులు’ అంటారు.
ఉదా : పులి, సింహం, రాబందు, చిరుత మొదలైనవి.
ప్రశ్న 7.
ఏ జంతువులను ఉభయాహారులు అంటారు? ఉదాహరణ రాయండి?
జవాబు.
మొక్కలు, జంతువులను రెండింటిని ఆహారంగా తీసుకునే జంతువులను ఉభయాహారులు అంటారు.
ఉదా : ఎలుగుబంటి, మానవులు, బాతు మొదలైనవి.
ప్రశ్న 8.
శాఖాహారులు, మాంపాహారులు మరియి ఉభయాహారుల పళ్ళను పోల్చుతూ ఒక పట్టిక రాయండి?
జవాబు.
శాఖాహారులు | మాంసాహారులు | ఉభయాహారులు |
శాఖాహారులకు పదునైన కొరికే దంతాలు , బలమైన, నమిలే దంతాలు ఉంటాయి. | మాంసాహారులకు బలమైన చీల్చే దంతాలు ఉంటాయి. | ఉభయాహారులకు పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలతో పాటు ఉంటాయి. చీల్చే దంతాలు ఉంటాయి. |
ప్రశ్న 9.
కాకిని ఉభయాహారి అనవచ్చా? ఎందుకు?
జవాబు.
కాకి చనిపోయిన జంతువుల మాంసాన్ని తింటుంది. అలాగే చిన్న చిన్న కిటకాలను మరియు గింజలను, కూరగాయలను కూడా తిటుంది. కావున కాకిని ఉభయాహారి అనవచ్చు.
ప్రశ్న 10.
పక్షులు వాటి కాళ్ళను, గోళ్ళను ఏవిధంగా ఉపయోగించుకుంటాయి?
జవాబు.
పక్షులు నడవడానికి, చెట్లెక్కడానికి, ఈదడానికి ఎగరడానికి కాళ్ళను ఉపయోగిస్తాయి. ఆహారాన్ని పట్టుకోవడానికి, తమని తాము రక్షించుకోవడానికి పక్షులు తమ కాలి గోళ్ళను ఉపయోగిస్తాయి.
ప్రశ్న 11.
పక్షుల గూళ్ళు, వాటిని ఏ విధంగా కడతాయి అవే సమాచారాన్ని సేకరించి, ఒక పట్టిక రూపంలో రాయండి?
జవాబు.
పక్షులు రకరకాలైన గూళ్ళను కట్టుకుంటాయి. గుడ్లు పెట్టడానికి పక్షులు గూళ్ళ కట్టుకుంటాయి. సాధారణంగా మగ పక్షులు గూళ్ళను నిర్మిస్తాయి.
క్రమ సంఖ్య | పక్షి | గూడు కట్టి విధానం |
1. | కాకి | చిన్న చిన్న కొమ్మలు, ఎండుటాకులతో నిర్మిస్తుంది |
2. | గిజిగాడు | ఆకులు, గడ్డి, కొమ్మలు మరియు వేర్లతో అల్లుకుంటుంది. |
3. | ట్రైలర్ బర్డ్ | చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలుస్తుంది. |
4. | గద్ద | పొడవైన పుల్లలు, గడ్డి, చెట్ల కొమ్మలతో రాతి శిఖరాల పైన లేదా ఎతైన చెట్ట పైన కడుతుంది. |
ప్రశ్న 12.
మీ పరిసరాలలో మీతో పాటుగా జీవించే జంతువుల జాబితా రాయండి?
జవాబు.
ఆవు, గేదె, మేక, గొర్రె, కుక్క, పిల్లి, ఉడుత మొదలైన జంతువులు మనతో పాటు మన పరిసరాలలో జీవిస్తాయి.
ప్రశ్న 13.
వివిధ జంతువుల నివాస ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి పట్టిక రూపంలో రాయండి?
జవాబు.
జంతువు | నివాస ప్రాంతము |
పులులు, సింహాలు | గుహలు లేదా పొదలు. |
కోతి | చెట్టు. |
కుందేలు | బొరియలు. |
సాలీడు | తన గూడును తానే నిర్మించుకుంటుంది. |
ప్రశ్న 14.
వలస వేళ్ళే పక్షుల గుంపు ‘V’ ఆకారలో ఏర్పడి ప్రయాణిస్తాయి. ఎందుకు?
జవాబు.
వలస వెళ్ళే పక్షులకు సుదూరాలకు ఎగిరి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఈ ప్రయాణంలో అవి. తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉంది. దీనిని నివారించుకోవడానికి ‘ .
‘V’ ఆకారంలో ఏర్పడి ప్రయాణిస్తాయి.
ప్రశ్న 15.
చీమలు ఇతర చీమలకు సమాచారాన్ని ఎలా అందిస్తాయి?
జవాబు.
చీమలు ఒక రసాయనాన్ని స్రవిస్తాయి. ఈ రసాయనం సహాయంతో ఒక దారిని ఏర్పరచి ఆహారానికి సంబంధించిన సమాచారాన్ని ఇతర చీమలకు అందిస్తాయి.
ప్రశ్న 16.
జంతువులను రక్షించడానికి ఏ సూచనలు ఇస్తారు ?
జవాబు.
- జంతువుల ఆవాసాలను నాశనం చేయకూడదు. వాటికి హాని చేయకూడదు.
- పెంపుడు జంతువులు అలాగే అడవిలో నివసించే జంతువులను సంరక్షించాలి.
- జంతువులను దూరంగా ఉండి చూడాలి.
- మనలాగే వాటికి కూడా భూమిపై జీవించే హక్కు ఉంటుంది.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
క్రింది వానిలో దేని చెవులు బయటకు కనిపిస్తాయి ______________
A) చేప
B) కప్ప
C) పంది
D) బాతు
జవాబు.
C) పంది
ప్రశ్న 2.
క్రింది వానిలో దేని చెవులు బయటకు కనిపించవు ______________
A) పాము
B) బాతు
C) కాకి
D) పై వన్ని
జవాబు.
D) పై వన్ని
ప్రశ్న 3.
గుడ్లు పెట్టే జీవులను ______________ అంటారు.
A) అండోత్పాదకాలు
B) శిశోత్పదకాలు
C) క్షీరదాలు
D) మాంసాహారులు
జవాబు.
A) అండోత్పాదకాలు
ప్రశ్న 4.
శిశోత్పా దకాలు అనేవి ______________
A) గుడ్లు పెడతాయి
B) పిల్లలకు జన్మనిస్తాయి
C) ఇతర జంతువుల మాంసాన్ని తింటాయి
D) మాంసాన్ని మొక్కలను రెండింటిని తింటాయి
జవాబు.
B) పిల్లలకు జన్మనిస్తాయి
ప్రశ్న 5.
క్రింది వానిలో శాఖాహారులు ______________
A) పులి
B) మానవుడు
C) ఆవు
D) ఎలుగుబంటి
జవాబు.
C) ఆవు
ప్రశ్న 6.
క్రింది వానిలో మాంసాహారిని గుర్తించండి
A) పులి
B) సింహం
C) రాబందు
D) అన్ని
జవాబు.
D) అన్ని
ప్రశ్న 7.
క్రింది వానిలో ఉభయాహారి ______________
A) ఆవు
B) మేక
C) చిరుత
D) ఎలుగుబంటి
జవాబు.
D) ఎలుగుబంటి
ప్రశ్న 8.
ఏనుగుల గుంపుకు నాయకత్వం వహించేది ______________
A) మగ ఏనుగు
B) పెద్ద ఆడ ఏనుగు
C) ఏనుగు పిల్ల
D) ఏదీకాదు
జవాబు.
B) పెద్ద ఆడ ఏనుగు
ప్రశ్న 9.
సాధారణంగా ______________ పక్షి గూడును నిర్మిస్తుంది.
A) మగ
B ) ఆడపక్షి
C) A మరియు B
D ) ఏదికాదు
జవాబు.
A) మగ
ప్రశ్న 10.
______________ ను సహజ పారిశుద్య కార్మికులు అంటారు.
A) ఆవు
B) కాకి
C) రామచిలుక
D) పంది
జవాబు.
B) కాకి