Students can go through AP Inter 2nd Year Zoology Notes Lesson 1(a) జీర్ణక్రియ, శోషణం will help students in revising the entire concepts quickly.
AP Inter 2nd Year Zoology Notes Lesson 1(a) జీర్ణక్రియ, శోషణం
→ స్థూల ఆహార పదార్థాలు, సరళ శోషింపదగిన రూపంలోకి మార్చే ప్రక్రియనే జీర్ణక్రియ అంటారు.
→ జీర్ణక్రియ యాంత్రిక, జీవరసాయన ప్రక్రియల ద్వారా జరుగుతుంది.
→ మానవ జీర్ణవ్యవస్థలో ఆహారనాళం, అనుబంధ గ్రంథులు ఉంటాయి.
→ మానవ ఆహారనాళం పూర్వభాగంలో నోటితో మొదలై పర భాగంలో పాయువుతో అంతమవుతుంది.
→ ఆహారనాళంలో నోటికి పాయువుకు మధ్యన వరుసగా ఆస్యకుహరం, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు ఉంటాయి.
→ మానవుని ప్రౌఢదశలో 32 శాశ్వతదంతాలుంటాయి. ఇవి నాలుగు రకాలు అవి. కుంతకాలు, రదనికలు, అగ్రచర్వణకాలు మరియు చర్వణకాలు.
→ మానవుని ప్రౌఢదశలో దంత ఫార్ములా \(\frac{2123}{2123}\) = 32
→ నాలుక పళ్ళని శుభ్రపరచడానికి, లాలాజలాన్ని ఆహారముతో కలపడానికి, రుచిని గుర్తించడానికి, మింగడానికి, మాట్లాడటానికి సహాయపడుతుంది.
→ జీర్ణాశయం వెడల్పయిన, సీతి చెందగల కండరయుత సంచిలాంటి ‘J’ ఆకారపు నిర్మాణం. ఇది మూడు ముఖ్య భాగాలను కలిగి ఉంటుంది. అవి హార్దిక భాగం, ఫండిక్ భాగం మరియు పర జఠరనిర్గమ భాగం.
→ ఆహారనాళంలో చిన్న పేగు చాలా పొడవుగా ఉండే భాగం. దీనిలో వరుసగా మూడు భాగాలను గుర్తించవచ్చు. అవి ఆంత్రమూలం, జెజునం మరియు శేషాంత్రికం.
→ అంధనాళం నుండి పొడుచుకొని వచ్చే సన్నటి, వేలులాంటి నాళికాయుత నిర్మాణాన్ని క్రిమిరూప ఉండూకం అంటారు.
→ మానవుడిలో మూడుజతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అవి పెరోటిడ్ గ్రంథులు, అధో జంబికా గ్రంథులు మరియు అధో జిహ్వికాగ్రంథులు.
→ లాలాజలగ్రంథులు లాలాజలాన్ని స్రవిస్తాయి. లాలాజలంలో నీరు, విద్యుత్ విశ్లేష్యకాలు, శ్లేష్మం, ఎన్జైమ్ లైన లాలాజల ఎమైలేజ్ మరియు లైసోజైములు ఉంటాయి.
→ జఠర గ్రంథులు మూడు రకాలు అవి హర్దిక గ్రంథులు, జఠర నిర్గమ గ్రంథులు మరియు ఫండిక్/ఆక్సింటిక్ గ్రంథులు,
→ జఠర రసంతో ప్రోఎన్జైములను పెప్సినోజన్, ప్రోరెనిన్లు (శిశువులలో) ఉంటాయి.
→ జఠర రసం pH 0.9 నుంచి 1.8 వరకు ఉంటుంది.
→ ఆంత్ర గ్రంథులు రెండు రకాలు అవి (బన్నర్ గ్రందులు) మరియు లీబర్ కూన్ గుహికలు. ఇవి ఆంత్రరసాన్ని స్రవిస్తాయి.
→ ఆంత్ర రసంలో ట్రై మరియు డైపెప్టిడేజ్లు మరియు డైశాకరైడేజ్లు మొదలైనవి ఉంటాయి.
→ కాలేయం దేహంలోని అతిపెద్ద గ్రంథి. ఇది పైత్యరసాన్ని స్రవిస్తుంది.
→ పైత్యరసం, కొవ్వు పదార్థాల జీర్ణక్రియలో ముఖ్యపాత్ర వహిస్తుంది.
→ క్లోమం మానవ దేహంలోని రెండో అతి పెద్ద గ్రంథి. క్లోమంలోని నాళ గ్రంథి భాగం ఎసినైతో ఏర్పడి క్షారయుత క్లోమరసాన్ని స్రవిస్తుంది.
→ క్లోమరసంలో సోడియం బైకార్బనేట్, ప్రోఎన్జైములైన ట్రిప్సినోజన్, కైమోట్రిప్సినోజన్ మరియు ప్రోఎన్జైమైన కార్బాక్సిపెప్టిడేజ్లు, స్టియాప్సిన్, α- ఎమైలేజ్ మరియు న్యూక్లియేజ్లు ఉంటాయి.
→ జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమై, ఆమ్ల లక్షణాలున్న ఆహారాన్ని కైమ్ అంటారు.
→ జీర్ణాశయం కుడ్యంలోని ఉపకళా కణాలు గాస్ట్రిన్ను స్రవిస్తాయి. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని పెప్సినోజన్ స్రావాన్ని ప్రేరేపిస్తుంది.
→ ఆంత్రమూలంలోని ఉపకళా కణాలు, సెక్రిటిన్ ను స్రవిస్తాయి. ఇది క్లోమ ఎసినైని ప్రేరేపించి, నీరు, బైకార్బోనేట్లు కలిగిన క్లోమరసాన్ని స్రవించేటట్లు చేస్తుంది.
→ కొలెసిస్టోకైనిన్, ఆంత్రమూల శ్లేష్మస్తరం నుంచి స్రవించబడుతుంది. ఇది క్లోమంపై పనిచేసి క్లోమరసాన్ని పిత్తాశయం సంకోచింపజేసి పైత్యరసాన్ని విడుదల చేయిస్తుంది.
→ ఆంత్రచూషకాలు విల్లికైనిన్ను స్రవిస్తాయి. ఇది చూషకాల కదలికలను ప్రేరేపించి శోషణను అధికం చేస్తాయి.