Andhra Pradesh AP Board 4th Class EVS Solutions 6th Lesson నీరు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class EVS Solutions Lesson 6 నీరు
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మనకు చెరువుల అవసరమేమిటి ?
జవాబు.
- చెరువులు ముఖ్యంగా వ్యవసాయం మరియు త్రాగునీటి అవసరాల కోసం ఉపయోగిస్తాము.
- పశువులకు చెరువులు తాగునీటి వనరుగా ఉంటాయి.
- భూగర్భ జలాలు పెరగడానికి కూడా చెరువులు ఉపయోగపడతాయి.
ప్రశ్న 2.
చెరువులు ఎందుకు, ఎలా కలుషితం అవుతున్నాయి?
జవాబు.
చెరువులు ఈ క్రింది కారణాల వల్ల కలుషితం అవుతున్నాయి.
- ప్రజలు చెరువులోనే స్నానం చేయడం, బట్టలు ఉతకడం, పశువులను, వాహనాలను కడగడం వల్ల.
- ఇళ్ళలోని వ్యర్థాలను, చనిపోయిన జంతువుల కళేబరాలను చెరువులోనికి విసరడం వల్ల.
- చెరువు గట్లపై మల విసర్జన చేయడం వల్ల.
- గణేష్ విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేయడం వల్ల వాటి రంగులలోని విషపదార్థాలు చెరువుని కలుషితం చేస్తున్నాయి.
- కర్మాగారాల నుండి వెలువడే రసాయనిక వ్యర్థాలు కూడా చెరువులను కలుషితం చేస్తున్నాయి.
ప్రశ్న 3.
మనం చెరువులను ఎలా సంరక్షించుకోవాలి ?
జవాబు.
- చెరువులోని పూడికలను తొలగించాలి.
- చెరువులో పెరిగె గుర్రపు డెక్క, శైవలాలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
- చెరువులోని మట్టి నిక్షేపాలను తొలగించడం ద్వారా, చెరువులోని నీటి మట్టాన్ని పెంచవచ్చు.
- వర్షపు నీటిని చెరువులోకి పంపి భూగర్భ జలాలను పెంచాలి.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
చెరువులు ఎండిపోతే ఏమవుతుందో మీ ఉపాధ్యాయుడిని అడగండి.
జవాబు.
- అన్ని చెరువులు ఎండిపోతే ఏమి జరుగుతుంది?
- త్రాగడానికి మనకు నీరు ఎక్కడి నుండి లభిస్తుంది?
- చెరువులన్నీ ఎండిపోతే, త్రాగునీటికి ఇంకా ఏయే వనరులు ఉన్నాయి?
- చెరువులన్నీ ఎండిపోతే, భూగర్భ జలాలు ఉంటాయా?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
మీ ఉపాధ్యాయుని సహాయంతో ఒక పంట పొలాన్ని సందర్శించి దానికి గల నీటి వనరులను గుర్తించండి. ఒక నమూనా బొమ్మ గీయండి.
జవాబు.
- చెరువులు రెండు వైపులా కాలువలు అనుసంధానం. చేసి ఉన్నాయి.
- ఆ కాలువలు ద్వారా వచ్చే నీటిని పొలాలలోకి వదులుతున్నారు.
- ప్రతి రైతు చిన్న కాలువల నుండి తన పొలంలోనికి నీటిని పంపడానికి కాలువలకు రంధ్రాలు చేసుకుంటున్నాడు.
- పొలం నిండిన తర్వాత, ఆ రంధ్రాన్ని మూసివేస్తున్నారు.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టులు:
ప్రశ్న 6.
మీ గ్రామంలోని ఒక చెరువు గురించిన సమాచారాన్ని సేకరించి దాని చరిత్రను రాయండి.
జవాబు.
మాది కృష్ణా జిల్లాలోని చిక్కవరం గ్రామం. మా గ్రామంలో బ్రహ్మయ్య లింగం చెరువ ఉంది. మా చెరువు 1,000 ఎకరాలలో విస్తరించి ఉంది. దీనిని చోళ రాజులు నిర్మించారు. ఈ చెరువు 6 గ్రామాలకు తాగునీటిని, పంటలకు నీటిని అందిస్తుంది. ఇది వర్షపు నీటితో నిండుతుంది. ప్రస్తుతం దీనిని పోలవరం కాలువ ద్వారా వచ్చే నీటితో నింపే ప్రయత్నం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసే యోచనలో ఉంది.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
జల చక్రం చూపే చార్టును తయారు చేయండి.
జవాబు.
VI. ప్రశంస:
ప్రశ్న 8.
నీటి కాలుష్యం నివారణ కొరకు కొన్ని నినాదాలు రాయండి.
జవాబు.
- నీరు అనేది త్రాగటం కోసం — కలుషితం చేయడానికి కాదు
- శుద్ధమైన నీరు — ఆరోగ్యకరమైన జీవితం
- పచ్చదనం — పరిశుభ్ర నీటికి నాంది.
- నీటి కాలుష్యం — జీవితానికి ప్రమాదం.
- మన నీరు — మన భవిష్యత్తు.
ఆలోచించండి – చర్చించండి: (TextBook Page No.50, 52)
ప్రశ్న 1.
చెరువులోని నీటి కాలుష్యాన్ని ఆపడానికి నీవు ఏం చేస్తావు?
జవాబు.
చెరువులోని నీటి కాలుష్యాన్ని ఆపడానికి…
- చెరువులోని గుర్రపుడెక్క మొక్కలు మరియు శైవలాలను ఎప్పటికప్పుడు తొలగించాలి.
- చెరువులలో స్నానం చేయడం, బట్టలు ఉతకడం, వాహనాలు, జంతువులను కడగడం చేయకూడదు.
- ఇళ్ళలోని మురుగును, వ్యర్ధాలను, మృత కళేబరాలను చెరువులోకి విసరకూడదు.
- కర్మాగారాల నుండి వెలువడే రసాయనిక వ్యర్ధాలను చెరువులోకి వదలకూడదు.
ప్రశ్న 2.
తక్కువ వర్షపాతం, నీటి దారులు మూసివేయడం చెరువులు ఎండిపోవడానికి ముఖ్య కారణం, చెరువులు ఎండిపోవడానికి గల ఇతర కారణాలను చర్చించండి.
జవాబు.
- చెరువుల నుండి ఎక్కువ కాలువల ద్వారా నీటిని తోడి వేయడం.
- డామ్ లు కట్టడం వల్ల చెరువులోని నీరు తగ్గిపోతుంది.
- చెరువులలో పూడికలను తీయకపోవడం వల్ల చెరువుల నిల్వ సామర్థ్యం తగ్గి చెరువులు ఎండిపోతున్నాయి.
కృత్యం: (TextBook Page No.53)
ఆరు గ్లాసులను తీసుకొని వాటిని నీటితో నింపండి. అన్ని గ్లాసులలో నీరు సమానంగా ఉండేటట్లు చూసుకోండి. ఇప్పుడు ఒక్కో గ్లాసులో ఒక్కో పదార్ధాన్ని వేసి ఒక గరిటెతో కలపండి. మీరు గమనించిన విషయాలను కింది పట్టికలో (✓) సూచించండి.
జవాబు.
అదనపు ప్రశ్నలు:
ప్రశ్న 1.
మీ గ్రామంలో ఎన్ని రకాల నీటి వనరులు ఉన్నాయి ?
జవాబు.
- బోరు బావి
- కుళాయి
- నదినీరు మరియు మినరల్ వాటర్ ప్లాంట్లు
మా గ్రామంలో వివిధ రకాల నీటి వనరులు ఉన్నాయి.
ప్రశ్న 2.
నీటి చెరువును ఎలా నిర్మిస్తారు ?
జవాబు.
- నీటి చెరువు నిర్మాణమనేది ఒక సమిష్టి కార్యక్రమం.
- మొదటగా గ్రామస్తులు వరదనీటి వనరును, చెరువు నిర్మాణానికి తగిన స్థలమును గుర్తిస్తారు.
- వారు చెరువును తవ్వి దానికి మట్టితో గట్టు నిర్మిస్తారు.
- చెరువుకు నీరు ప్రవహించే ప్రాంతాల నుండి కాలువలను తవ్వుతారు.
- గట్టు నుండి బయటకు వదిలే దార్లు రెండు వైపులా ఉండాలి.
ప్రశ్న 3.
చెరువులకు బయటకు నీళ్ళు వదిలే దారులెందుకుంటాయి?
జవాబు.
- కొన్ని చెరువులు కాలువలతో అనుసంధానం చేయబడి ఉంటాయి. వర్షాకాలంలో నీరు ఒక చెరువు నుండి మరొక చెరువుకు ఈ కాలువల ద్వారా ప్రవహిస్తుంది.
- అదే విధంగా నదుల నీటితో చెరువులను నింపడానికి కూడా కాలువలు తవ్వుతారు.
ప్రశ్న 4.
మనం చెరువు నుండి తీసుకున్న నీటిని అలాగే తాగవచ్చా? అది సురక్షితమైనదేనా?
జవాబు.
- చెరువు నుండి తీసుకున్న నీటిని అలాగే తాగడం సురక్షితం కాదు.
- అటువంటి నీరు కలుషితమై ఉంటుంది.
- ఆ నీటిని నేరుగా తాగితే మనకు టైఫాయిడ్, కలరా మరియు నీళ్ళ విరేచనాలు వంటి వ్యాధులు వస్తాయి.
ప్రశ్న 5.
మీ గ్రామంలో తాగునీరు ఎలా సరఫరా చేయబడుతుంది?
జవాబు.
- గ్రామ పంచాయితీ వారు గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్చమైన త్రాగునీటిని అందించే బాధ్యతను తీసుకుంటారు.
- గ్రామీణ నీటి పథకాలలో భాగంగా ఓవర్ హెడ్ టాంక్లను నిర్మిస్తారు.
- శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీటిని ఇంటింటికీ అందిస్తారు.
ప్రశ్న 6.
నీటి శుద్ధి కేంద్రం యొక్క రేఖా చిత్రాన్ని గీయండి.
జవాబు.
ప్రశ్న 7.
క్లోరినేషన్ అంటే ఏమిటి దీని ఉపయోగం ఏమిటి?
జవాబు.
నీటికి బ్లీచింగ్ పౌడర్‌ను కలపడాన్ని క్లోరినేషన్ అంటారు. నీటిలోని సూక్ష్మజీవులను . చంపడానికి క్లోరినేషన్ ఉపయోగపడుతుంది.
ప్రశ్న 8.
తేర్చే తొట్టిలో ఏమి జరుగుతుంది?
జవాబు.
తేర్చే తొట్టిలో, నీటిలోని ఇసుక రేణువులు కిందికి చేరుతాయి. ఆకులు, చిన్న కొమ్మలు వంటివి కూడా తొలగించబడతాయి.
ప్రశ్న 9.
నీటి శుద్ధి ప్రక్రియలో వడపోత తొట్టిలో ఏమి జరుగుతుంది?
జవాబు.
వడపోత తొట్టిలో, నీటిలోని చిన్న చిన్న పదార్ధాలు తొలగించబడతాయి.
ప్రశ్న 10.
బాష్పీభవనం అంటే ఏమిటి?
జవాబు.
నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను బాష్పీభవనం అంటారు.
ప్రశ్న 11.
“జల చక్రం” అంటే ఏమిటి ?
జవాబు.
నీరు భూమి’ ఉపరితలం నుండి బాష్పీభవనం చెంది మేఘాలుగా ఏర్పడతాయి. . మేఘాలు చల్లబడి భూమి పై వర్షం రూపంలో చేరుకుంటాయి. ఈ నిరంతర ప్రక్రియను నీటి చక్రం లేదా “జల చక్రం” అంటారు.
ప్రశ్న 12.
నీటికి రుచి ఎలా వస్తుంది?
జవాబు.
నేలలోని కొన్ని పదార్ధాలు నీటిలో కరగడం వల్ల నీటికి రుచి వస్తుంది.
ప్రశ్న 13.
సాంద్రీకరణం అంటే ఏమిటి?
జవాబు.
నీటి ఆవిరి, నీరుగా మారే ప్రక్రియను సాంద్రీకరణం అంటారు.
బహుళైచ్ఛిక ప్రశ్నలు సూచన:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
నీరు, నీటి ఆవిరిగా మారే ప్రక్రియ ______________
A) బాష్పీభవనం
B) సాంద్రీకరణం
C) అవక్షేపం
D) జల చక్రం.
జవాబు.
A) బాష్పీభవనం
ప్రశ్న 2.
నీటి ఆవిరి, నీరుగా మారే ప్రక్రియ ______________
A) బాష్పీభవనం
B) సాంద్రీకరణం
C) అవక్షేపం
D) జలచక్రం
జవాబు.
B) సాంద్రీకరణం
ప్రశ్న 3.
ఏ టాంక్ లో ఇసుక రేణువులు కిందికి చేరుకుంటాయి ______________
A) వడపోత టాంక్
B) క్లోరినేషన్ టాంక్
C) తేర్చే టాంక్
D) ఏదీకాదు
జవాబు.
C) తేర్చే టాంక్
ప్రశ్న 4.
ఏ టాంక్ లో నీటికి బ్లీచింగ్ పౌడర్ కలుతారు.
A) వడపోత
B) క్లోరినేషన్
C) తేర్చే
D) ఏదీకాదు
జవాబు.
B) క్లోరినేషన్
ప్రశ్న 5.
గ్రామాలలో ఏ పధకం కింద ఓవర్ హెడ్ టాంక్లను నిర్మిస్తారు ______________
A) గ్రామీణ నీటి పధకం
B) పట్టణ నీటి పధకం
C) వ్యవసాయ పధకం
D) గ్రామ అభివృద్ధి
జవాబు.
A) గ్రామీణ నీటి పధకం
ప్రశ్న 6.
నీటి కాలుష్యానికి కారణమయ్యే ______________
A) కర్మాగారాల నుండి వచ్చే రసాయన వ్యర్థాలు అనంత
B) ఇళ్ళ నుండి వచ్చే మురుగు నీరు
C) వాహనాలను పశువులను కడగడం
D) పైవన్నీ
జవాబు.
D) పైవన్నీ
ప్రశ్న 7.
కలుషిత నీటిని తాగడం వల్ల క్రింది వ్యాధులు వస్తాయి.
A) టైఫాయిడ్
B) కలరా
C) నీళ్ళ విరేచనాలు
D) పైవన్నీ
జవాబు.
D) పైవన్నీ
ప్రశ్న 8.
మేఘాల నుండి నీటి చుక్కలు కిందికి రావడాన్ని ______________ అంటారు.
A) బాష్పీభవనం
B) సాంద్రీకరణం
C) వర్షం
D) జల చక్రం
జవాబు.
C) వర్షం
ప్రశ్న 9.
క్రింది వానిలో నీటిలో కరగనిది.
A) చక్కెర
B) నూనె
C) ఉప్పు
D) పాలు
జవాబు.
B) నూనె
ప్రశ్న 10.
క్రింది వానిలో నీటిలో కరిగేది. ______________
A) నూనె
B) పిండి
C) చక్కెర
D) చెక్క
జవాబు.
C) చక్కెర