AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి

Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 4th Class Telugu Solutions Chapter 6 ముగ్గుల్లో సంక్రాంతి

Textbook Page No. 48

చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.

AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి 1

ప్రశ్నలకు జవాబులు చెప్ప౦డి.

ప్రశ్న 1.
చిత్రంలో ఏమేమి ఉన్నాయి?
జవాబు:
చిత్రంలో క్రిస్మస్ చెట్టు, బుద్ధుడి విగ్రహం, నెలవంక, చుక్కలు గాలి పటాలు ఉన్నాయి.

ప్రశ్న 2.
చిత్రంలో ఎవరెవరున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు?
జవాబు:
మొదటి చిత్రంలో : క్రిస్మస్ చెట్టు దగ్గర క్రిస్మస్ తాత పిల్లలకు బహుమతులిస్తూ మిఠాయిలు పంచుతున్నాడు.
రెండవ చిత్రంలో : బౌద్ధగురువులు బుద్ధుని ముందు ప్రార్థన చేస్తుంటే అనేక మంది. పర్యాటకులు, భక్తులు సమస్కరిస్తున్నారు.
మూడవ చిత్రంలో : మహమదీయులు రంజాన్ వేడుక జరుపుకుంటున్నారు.
నాలుగవ చిత్రంలో : పిల్లలు వేడుకగా గాలి పటాలు ఎగరవేస్తున్నారు.

AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి

ప్రశ్న 3.
మీరు జరుపుకునే పండుగల గూర్చి చెప్ప౦డి?
జవాబు:
వినాయక చవితి, దసరా పండుగ, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి, క్రిస్మస్, రంజాన్.

Textbook Page No. 54

ఇవి చేయండి

వినడం – ఆలోచించి మాట్లాడటం

ప్రశ్న 1.
ముగ్గుల పోటీలు ఏయే సందార్భాలలో నిర్వహిస్తారు ?
జవాబు:
ముగ్గుల పోటీలు సంక్రాంతి పండుగ సమయాలలో – నిర్వహిస్తారు. అంతేకాకుండా – నవంబరు-14, బాలల దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ – 15, స్వాంతంత్ర దినోత్సవం సందర్భంగా, బాలలకు పోటీలుగా నిర్వహిస్తారు.

ప్రశ్న 2.
భోగిమంటలో ఏయే వస్తువులు వేయవచ్చు? ఏయే వస్తువులు వేయకూడదు?
జవాబు:
ఆవు పేడ పిడకలు, పాత కర్రసామాను, ఎండు కట్టెలు, పిడకల దండలు భోగిమంటల్లో వేస్తారు. ఇవికాక ఇంకేమీ వేయకూడదు.

ప్రశ్న 3.
మీ ప్రాంతంలో సంక్రాంతి పండుగ ఎలా జరుపుకుంటారు ?
జవాబు:
మా ప్రాంతంలో సంక్రాంతి పండుగ చాలా గొప్పగా, వైభవంగా జరుపుకుంటాము. సంక్రాంతికి నిలవ పిండివంటగా- అరిసెలు చేసుకుంటాము. పెద్దలు ఎడ్ల పందాలు, బండరాయి లాగుడు పందాలు, కోళ్ళ పందాలు ఆడతారు. వీధుల్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసి ఒకరి ముగ్గు మరొకరి ముగ్గుతో కలిపి సమైక్యతా భావాన్ని చూపుతారు. గంగిరెద్దుల వాళ్ళు ఆడతారు. హరిదాసు వచ్చి పాటలు పాడి దీవెనలు ఇస్తాడు. ముగ్గుల పోటీలు జరుగుతాయి. పాడి పంటలతో దేశం కళకళలాడాలని పశువులకు పూజలు చేస్తారు. ఇంటిలోని పెద్దలకు బట్టలు పెట్టి ఆశీస్సులు పొందుతారు.

ప్రశ్న 4.
మీ ప్రాంతంలో సంక్రాంతికి ఏయే పోటీలు నిర్వహిస్తారు?
జవాబు:
ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాలు, కోడి పందాలు, కుస్తీ పోటీలు, కావిడి పందాలు, పరుగు పందాలు, మొదలైనవి నిర్వహిస్తారు.

చదవడం – వ్యక్త పరచడం

అ) కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

“ ఈ ఎద్దుల ముగ్గులో కొమ్ములకు ఎంత చక్కని రంగులు వేశారో చూడండి! గొబ్బిళ్ళు, దీపాలు, పూర్ణకలశాలతో ముగ్గులను అందంగా అలంకరించారు. మనకు ఆహారాన్ని అందించే పశువులను కనుమ పండుగ నాడు ఇలాగే పూజిస్తారు. జానపద కళారూపాలు ప్రదర్శించిన వారికి ధాన్యం, బట్టలు, కూరగాయలు, డబ్బులు మొదలైనవి గ్రామస్తులు బహూకరిస్తారు”
AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి 2

ప్రశ్న 1.
ముగ్గులను వేటితో అలంకరించారు?
జవాబు:
గొబ్బిళ్ళు, దీపాలు, పూర్ణకలశాలతో ముగ్గులను అలంకరిస్తారు.

ప్రశ్న 2.
పశువులను ఎలా పూజిస్తారు?
జవాబు:
కొమ్ములకు చక్కని రంగులు వేసి, నుదుట బొట్టు పెట్టి, వీపున కొత్త వస్త్రాలు వేసి కాళ్ళ గిట్టలకు గజ్జలు తొడిగి, హారతులిచ్చి పూజిస్తారు.

AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి

ప్రశ్న 3.
జానపద కళాకారులకు గ్రామస్తులు ఏమి బహూకరిస్తారు?
జవాబు:
ధాన్యం, బట్టలు, కూరగాయలు, డబ్బులు మొ||వి బహుకరిస్తారు.

ఆ) పాఠం చదవండి. ఖాళీలలో రాయండి:

ప్రశ్న 1.
ఈ పాఠంలో ఉన్న పాత్రల పేర్లు.
జవాబు:

  1. అనూష.
  2. ఆదిత్య
  3. అత్తమ్మ

ప్రశ్న 2.
మీకు ఆశ్చర్యంగా అనిపించిన ముగ్గులు.
జవాబు:

  1. కోడిపుంజుల ముగ్గు
  2. ధనుస్సంక్రమణం ముగ్గు
  3. స్త్రీ శక్తి ముగ్గు
  4. ఓటు గొప్పదనాన్ని తెలిపే ముగ్గు
  5. రధం ముగ్గు
  6. సందేశాలిచ్చే ముగ్గులు.

ప్రశ్న 3.
రథం ముగ్గు దేనిని సూచిస్తుంది.
జవాబు:
దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి సూర్యుని ప్రయాణాన్ని తెలియజేస్తుంది.

ప్రశ్న 4.
స్త్రీశక్తి ముగ్గులో ఏమేమి ఉన్నాయి.
జవాబు:
స్త్రీ శక్తి ముగ్గులో – ఒక స్త్రీ పది చేతులతో, స్టెతస్కోపు పుస్తకం, చీపురు, గరిటి, తుపాకీ, రెంచి, చక్రం, కొడవలి, పూలదండ, టెన్నిస్ రాకెట్, పట్టుకొని మరో రెండు చేతులతో పసిపాపను ఎత్తుకుని, నల్లకోటు తొడుక్కొని ఉంది.

Textbook Page No. 55

ఇ) కింది పేరాను చదివి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

రంజాన్

ముస్లింలు జరుపుకునే పండుగలలో పవిత్రమైన పండుగ రంజాన్. దీన్ని “ఈద్” అని, ‘ఈద్-ఉల్-ఫితర్’ అని కూడా అంటారు. ఈ పండుగ ఇస్లాం కేలండర్ ప్రకారం రంజాన్ నెల మొదటి రోజున
ప్రారంభమవుతుంది. ఈ రోజు రాత్రి చంద్ర దర్శనం కాగానే మసీదుల్లో “తరావీ నమాజ్ ‘ అనే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి 3
రంజాన్ నెల అంతా ఉపవాసాలు ఉంటారు. తెల్లవారుఝామున నాలుగు గంటలకే నిద్ర లేస్తారు. సూర్యోదయానికి సుమారు గంటన్నరముందే భోజనం చేస్తారు. దీనిని ‘సహరి’ అంటారు. పగలంతా ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తరువాత ఉపవాసదీక్ష విరమిస్తారు. దీనిని ‘ఇఫ్తార్ ‘ అంటారు.
‘జకాత్ ‘ చేస్తారు. జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం , సంపద పై ఒక లెక్క ప్రకారం పేదలకు దానధర్మాలు చేయటం. రంజాన్ నెల చివరిరోజు చంద్రదర్శనంతో షవ్వాల్ ‘ నెల మొదలవుతుంది. ఆ మరునాడు పెద్దయెత్తున ‘ఈద్’ పండుగను జరుపుకుంటారు. అందరూ కొత్త బట్టలు ధరించి ‘ఈద్ గాహ్’కి వెళ్ళి సామూహిక ప్రార్ధనలు చేస్తారు. అనంతరం ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటారు.
సేమ్యా పాయసాన్ని ఇంటిల్లిపాదీ. ఆ రోజు ఉదయం సేవిస్తారు. ఆ సాయంత్రం మిత్రులను, బంధువులను ఇంటికి పిలిచి, విందు ఏర్పాటుచేస్తారు.

ప్రశ్న 1.
‘రంజాన్’ పండుగకున్న మరోక పేరు ఏమిటి?
జవాబు:
“ఈద్” లేదా, ‘ఈద్-ఉల్-ఫితర్’

ప్రశ్న 2.
సహరి అంటే ఏమిటి?
జవాబు:
రంజాన్ మాసంలో ఉపవాసాలుండి – తెల్లవారు ఝామున నాలుగు గంటలకే నిద్రలేచి – సూర్యోదయానికి సుమారు గంటన్నరముందే భోజనం చేస్తారు. దీనినే “సహరి” అంటారు.

AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి

ప్రశ్న 3.
జకాత్ గురించి చెప్ప౦డి?
జవాబు:
జకాత్ అంటే సంవత్సరానికి ఒకసారి వారి ఆదాయం, సంపద పై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయటం.

ప్రశ్న 4.
రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాస దీక్ష ఎలా చేస్తారు?
జవాబు:
పగలంతా ఉపవాసం ఉంటారు. సూర్యాస్తమయం తరువాత ఉపవాస దీక్ష విరమిస్తారు. దీనినే ఇఫ్తార్ అంటారు.

Textbook Page No. 56

పదజాలం

అ) పాఠంలో ఒత్తు పదాలను గుర్తించి రాయండి.

ఉదా : పొంగళ్ళు, పెద్ద ముగ్గు అత్తమ్మ
______________ _____________
______________ _____________
జవాబు:
1. గంగిరెద్దు
2) ముత్యాల ముగ్గు
3) పద్మాల ముగ్గు
4) నెమళ్ళముగ్గు
5) ఎండబెట్టి
6) దండగుచ్చి
7) బట్టలు
8) పొట్టేళ్ళు
9) అబ్బ

ఆ) క్రింది పదాలకు వ్యతిరేఖ పదాలు రాయండి.

వెళ్ళు × వెళ్ళద్దు
సంతోషం × దుఃఖం
దక్షిణం × ఉత్తరం
లోపల × బైట
ఎత్తు × ఎత్తద్దు, దించు
పొడవు × వెడల్పు
ఉదయించడం × అస్తమించడం
ముందు × వెనుక

AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి 4

ఇ) క్రింది పదాలకు అర్ధాలు రాసి వాక్యంలో ప్రయోగించండి.

ఉదా : సంబర పడ్డాడు = సంతోషపడ్డాడు
మా తమ్ముడు నాన్న ఇచ్చిన కారు బొమ్మను చూసి సంబరపడ్డాడు.

1. పశువులు = జంతువులు, గొడ్లు
సంక్రాంతి పండుగలలో – కనుమరోజు పశువులను పూజ చేస్తారు.
2. నెలలు = మాసాలు
ఆశ్వీజ, కార్తీక మాసాలు శరదృతువు. (లేదా) ఒక సంవత్సరానికి 12 నెలలు.
3. విశిష్ఠత = గొప్పతనము
పది మందిలో మన గొప్పతనము, చదువు వలన బయటపడుతుంది.
4. కలశం = చిన్న కుండ, (లేదా) చెంబు
ప్రతి పూజ ముందు కలశారాధనం చేస్తారు.
5. దండలు = మాలలు
అమ్మవారిని పూల మాలలతో అలంకరిస్తారు.

Textbook Page No. 57

ఈ) కింది గళ్ళలోని ఆహార పదార్థాల పదాలను వెతికి రాయండి.
AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి 6
ఉదా|| పులిహోర
1. _________
2. _________
3. _________
4. _________
5. _________
జవాబు:
AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి 5
1. హల్వా
2. పొంగలి
3. లడ్డూ
4. వడ
5. ” గారెలు డ్రూలు
6. అప్పడాలు వైరాలు
7. గవ్వలు
8. అన్నం
9. పెరుగు

ఉ) కింది తమాషా పదాలు చూడండి.

ఒకే పదం వేర్వేరు సందర్భాలలో వేరువేరు అర్ధాలతో ఉపయోగిస్తున్నాము. కింది ఉదాహరణలను గమనించండి. కింద ‘తల’ కు సంబంధించిన పదాలు ఉన్నాయి. వాటి అర్థాలను తెలుసుకోండి. వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు చెప్ప౦డి.
ఉదా॥ మట్టి – మట్టి అంటే మన్ను
AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి 7
1. తలవంపులు : అవమానాలు
2. తలసరి : సగటు
3. తలపండిన : జ్ఞానవంతులు, పెద్దలు, మేధావులు, పండితులు
4. తలలో నాలుక : అందరికీ అందుబాటులో ఉండడం, ఇష్టుడై ఉండుట
5. తలదూర్చడం : కల్పించుకోవడం

సొంత వాక్యాలు

1. తలవంపులు : బిడ్డలు తల్లిదండ్రులకు తలవంపులు తీసుకురాకూడదు.
2. తలసరి : వ్యక్తి తలసరి ఆదాయాన్ని బట్టి పన్ను విధించబడుతుంది.
3. తలపండిన : మా గురువుగారు తలపండిన మేధావి.
4. తలలో నాలుక : నా మిత్రుడు అందరికీ తలలో నాలుకగా మెలుగుతాడు.
5. తలదూర్చడం : మనకు కాని విషయంలో తలదూర్చడం మంచిది కాదు.

స్వీయరచన

కింది ప్రశ్నలకు జవాబులు రాయండి

ప్రశ్న 1.
సంక్రాంతి పండుగను ఎన్ని రోజులు జరుపుకుంటారు?
జవాబు:
సంక్రాంతి పండుగను మాసం రోజులు జరుపుకుంటారు. అందులో భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ప్రధానమైన పండుగ రోజులుగా జరుపుకుంటారు.

ప్రశ్న 2.
సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాలలో కనిపించే జానపద కళారూపాలు ఏవి?
జవాబు:
కోడి పందాలు, పొట్టేళ్ళ పందాలు, ఎడ్లబండి పరుగు పందాలు, గుర్రపుస్వారీ, సంగిడి రాళ్ళు ఎత్తడం, కుస్తీ పోటీలు, కబడ్డీ, వాలిబాల్ పోటీలు, ముగ్గుల పోటీలు, గంగిరెద్దులాటలు, బొమ్మల కొలువులు, హరిదాసుల పాటలు, గాలిపటాలాటలు.

ప్రశ్న 3.
భోగిపండుగను ఎలా జరుపుకుంటారు?
జవాబు:
భోగి పండుగను భోగిమంటలతో మొదలు పెడతారు. ఆమంటలలో ఆవు పేడ పిడకలు, పాత కర్రసామానును, ఎండు కట్టెలు వేస్తారు. పిడకల దండలు కూడా వేసి భోగిమంటలు వేసి నీళ్ళు కాస్తారు. ఆ నీళ్ళు పోసుకుంటే- సంవత్సరం పీడ తొలగిపోతుందని నమ్ముతారు. ఇంటి ముందు భోగి పళ్ళ ముగ్గు వేస్తారు- భోగి రోజు సాయంత్రం రేగుపళ్ళు, శనగలు, చెరుకు ముక్కలు, చిల్లర డబ్బులు, బంతిపూల రేకులు కలిపి పిల్లలకు, పెద్దలు భోగిపళ్ళు పోస్తారు. పెద్ద ముత్తైదువులను పిలిచి తాంబులాలు ఇస్తారు. ఈ విధంగా భోగి పండుగ జరుపుతారు.

AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి

ప్రశ్న 4.
ధనుర్మాసంలో మీ గ్రామంలో ఏయే కార్యక్రమాలు చేస్తారు?
జవాబు:
ధనుర్మాసంలో మా గ్రామంలో – తెల్లవారుఝాము నుండే కార్యక్రమాలు మొదలవుతాయి. పారాయణ మండలి సభ్యులందరూ తెల్లవారుఝామున నగర సంకీర్తన చేస్తారు. వైష్ణవ సంకీర్తన చేస్తారు. విష్ణుసహస్రనామ పారాయణ చేస్తారు. దేవాలయాల- అర్చకులు – గోదాదేవి వ్రాసిన తిరుప్పావై పాశురాలు రోజుకొక్కటి పాడి స్వామిని నిద్రలేపుతారు. అప్పుడు చేసిన “ధనుస్సును” (ప్రసాదాన్ని ) నివేదన చేసి భక్తులకు వితరణ చేస్తారు.

ఈ మాసమంతా…. దైవ చింతనలో కాలం గుడుపుతారు. ముక్కోటి ఏకాదశి రోజున నారాయణుని ఉత్తర ద్వార దర్శనం చేసుకుని తరిస్తారు.
ఈ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

Textbook Page No. 58

సృజనాత్మకత

రంగు రంగు ముగ్గుల చిత్రాలను సేకరించండి. తరగతిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థికృత్యము

ప్రశంస

మీ స్నేహితులు జరుపుకునే పండుగ సందార్భాలలో వారిని మీరు ఎలా అభినందిస్తారు?
జవాబు:
సౌమ్యా! నీకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు నీవు చాలా అందంగా ఉన్నావు. నువ్వు ధరించిన ఈ పట్టుపరికిణీ దుస్తులు నీకు చక్కగా ఉన్నాయి. మన పండుగ సంస్కృతి ఆచారాలు పాటిస్తున్నావు. అంతేకాక నువ్వు మీ ఇంటిముందు వేసిన ముగ్గు చూశాను. చాలా బాగుంది. అందులో గొబ్బెమ్మను పెట్టావు కదూ! చాలా బాగుంది, ఈ విధమైన ఆచారాలు నువ్వు బాగా పాటిస్తావు. నువ్వు మా అందరికీ ఆదర్శం. అందుకే నీకు మళ్ళి ఒక్కసారి పండుగ శుభాకాంక్షలు.

భాషాంశాలు

అ) క్రింది వాక్యాలలో గీత గీసిన పదాలను గమనించండి.
ఇది అందమైన నెమలి.
రమ పచ్చని గాజులు కొన్నది.
ఇది తియ్యని మామిడి పండు.
అరిసెలు కమ్మని వంటకం
అందమైన, పచ్చని, తియ్యని, కమ్మని అనేవి గుణాన్ని తెలిపే పదాలు. నెమలి,గాజులు,మామిడి, అరిసెలు అనే నామవాచకాల గుణాలని అవి తెలియజేస్తున్నాయి. ఒక వాక్యంలో నామవాచకం రంగు, రుచి,స్థితి మొదలైన గుణాలను తెలియజేసే పదాలను ‘విశేషణాలు’ అంటారు. వాక్యంలో విశేషణం సాధారణంగా నామవాచకానికి ముందు వస్తుంది.
జవాబు:
‘విద్యార్థికృత్యము.

ఆ) కింది వాక్యాలు చదవండి. విశేషణ పదాల కింద గీత గాయండి

AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి 8

1. ఏనుగు పెద్ద జంతువు.
జవాబు: పెద్ద

2. నిమ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది.
జవాబు: పుల్లని

3. పుస్తకానికి అందమైన అట్ట వేసారు.
జవాబు: అందమైన

4. పచ్చని గోరింటాకు ఎర్రగా పండుతుంది.
జవాబు: ఎర్రగా

5. కాచిన పాలు తాగాలి.
జవాబు: కాచిన

ఇ) కింది విశేషణ పదాలను ఉపయోగించి, వాక్యాలు రాయండి.
(చక్కని, మంచి, పెద్ద, తెలివైన, చురుకైన)
జవాబు:
1. మా అక్క చక్కని ముగ్గు వేసింది.
2. నా మిత్రుడు మంచి వాడు.
3. మా ఇంటి ముందు పెద్ద చెట్టు ఉంది.
4. తెనాలి రామలింగడు తెలివైనవాడు (లేదా) మా చెల్లి తెలివైనది.
5. మా చెల్లి తెలివైనది. చురుకైనది.

పదాలు – అర్థాలు

పద్మం = తామరపువ్వు
విశిష్టత = గొప్పతనం, ప్రత్యేకత
సంబరం = సంతోషం
ధనుస్సు = విల్లు
ఆయనం = గమనం
రాశి = నక్షత్రాల గుంపు
కలశం = చిన్నకుండ లేదా చెంబు
గొబ్బిళ్ళు = ముగ్గుపై పసుపు, కుంకాలు, పువ్వులు అలంకరించిన ఆవు పేడ ముద్దలు.

ఈ మాసపు గేయం

గొబ్బిళ్ళ పాట

గొబ్బియళ్ళో గొబ్బియళ్ళో
గొబ్బియళ్ళో చందమామ ఓ చందమామ

విత్తు విత్తు నాటారంట
ఏం విత్తు నాటారంట
రాజుగారి తోటలో ‘జాం విత్తు నాటారంట’
ఔనాట అక్కల్లార చంద్రగిరి భామల్లారా || గొబ్బి ||

పువ్వు పువ్వు పూచిందంట
ఏం పువ్వు పూచిందంట
రాజుగారి తోటలో ‘జాం పువ్వు పుచిందంట”
ఔనాట అక్కల్లార చంద్రగిరి భామల్లారా ||గొబ్బి!!

AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి 9

పండు పండు పండిందంట
ఏం పండు పండిందంట పండు పండిందంట
రాజుగారి తోటలో ‘జాం పండు పండిందంట”
ఔనాట అక్కల్లార చంద్రగిరి భామల్లారా
గొబ్బి ,.

AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి

ఈ మాసపు కథ

నకిలీ కన్ను

ధనికుడి లోభం, దరిద్రుడి దానం అని సామెత.
మౌల్వీ నసీరుద్దీన్ ప్రార్థన చేసుకునే మసీదు శిథిలావస్థకు చేరుకుంది. పాతదైపోయి ఎప్పుడైనా పడిపోయేట్టు ఉంది. అక్కడ ప్రార్థనకు వచ్చేవాళ్లంతా చాలా పేదవాళ్లు. మసీదును బాగుచేసుకోవాలన్న కోరిక ఉన్నా దానికి తగిన శ్లోమత లేనివాళ్లు.

మౌల్వీ నసీరుద్దీన్ కు మసీదు గురించిన చింత పట్టుకుంది. ప్రార్థన చేసుకునే సమయంలో మసీదు కూలితే? అన్నభయం పట్టుకుంది.
అయన బాగా ఆలోచించి మసీదు మరమ్మతుకు పథకం తయారుచేశాడు. ఇరుగు పొరుగు వాళ్లను సమావేశపరచాలని నిర్ణయించుకున్నాడు. ప్రయత్నం కూడా ప్రారంభించాడు.
AP Board 4th Class Telugu Solutions 6th Lesson ముగ్గుల్లో సంక్రాంతి 10
ముందుగా మౌల్వీ ఒక ధనికుడి ఇంటికి వెళ్లాడు. ఆయన ఎంత ధనికుడో అంత లోభి కూడా. ఆ ధనికుడి కళ్లలో ఒకటి నకిలీది. ఎవరికీ అతని దగ్గర చందా అడగాలన్న ఊహ కూడా కలగదు. మౌల్వీ నసీరుద్దీన్ ముందు అతని ఇంటికే వెళ్లాడు.

ధనికుడు మౌల్వీ వచ్చిన కారణం అడిగాడు. మౌల్వీ నసీరుద్దీన్ ధనికుడికి మసీదు పరిస్థితి వివరించాడు. ధనికుడు చందా ఇస్తాను కానీ ఒక షరతు ఉందన్నాడు. మౌల్వీ అడిగాడు, “ షరతు ఏమిటి?”

“నా కళ్లలో ఏది నకిలీ కన్నో కనుక్కో చందా ఇస్తాను” అన్నాడు ధనికుడు. మౌల్వీ ధనికుడి కళ్లలోకి ఒకసారి చూసి ఎడమకన్ను నకిలీదని చెప్పాడు. ధనికుడు ఆశ్చర్యపోయాడు. ఎలా కనుక్కోగలిగావని అడిగాడు.
మౌల్వీ సూటిగా జవాబిచ్చాడు ” మీ అసలు కన్నుకు దయా ప్రేమా ఉండవు కదా! అందుకే అది రాయిలా కనిపిస్తున్నది. మీ ఎడమ కంట్లో కొంచెం దయా ప్రేమా కనిపించాయి. కాబట్టి అదే నకిలీదై ఉండాలి”

మౌల్వీ నసీరుద్దీన్ నిర్మొహమాటంగా చెప్పిన మాటలకు లోభి అయిన ధనికుడు సిగ్గు పడ్డాడు. మొత్తం మసీదు మరమ్మతు ఖర్చు తానే భరించడమే కాక మౌల్వీకి కూడా మంచి కానుక ఇచ్చాడు.