Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 7th Lesson పద్యరత్నాలు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class Telugu Solutions Chapter 7 పద్యరత్నాలు
Textbook Page No. 61
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్ప౦డి..
ప్రశ్న1.
చిత్రంలో ఏమి జరుగుతున్నది?
జవాబు:
ఈ చిత్రంలో పెద్దలందరి సమక్షంలో విద్యార్థి ధైర్యంగా మైకులో ప్రసంగిస్తున్నాడు. పాఠశాలలో ఏదో చక్కటి కార్యక్రమం జరుగుతున్నది.
ప్రశ్న 2.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ? ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో నలుగురు పెద్దలు కూర్చుని, విద్యార్ధి, ప్రసంగాన్ని శ్రద్ధతో ఆలకిస్తున్నారు. ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు.
ప్రశ్న 3.
మీ బడిలో ఇలాంటివి ఏయే కార్యక్రమాలు చేస్తారు?
జవాబు:
మా బడిలో ఆగస్టు-15 స్వాతంత్ర్య దినోత్సవం, సెప్టెంబరు-5 గురుపూజోత్సవం; నవంబరు-14 బాలల దినోత్సవం; జనవరి-26 గణతంత్ర దినోత్సవం, పాఠశాల వార్షికోత్సవం లాంటి కార్యక్రమాలు చేస్తాము.
ప్రశ్న 4.
మీరెప్పుడైనా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారా?
జవాబు:
పాల్గొన్నాను. ఎన్నో బహుమతులు కూడా అందుకున్నాను.
Textbook Page No. 65
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
పద్యాలను రాగయుక్తంగా పాడండి.
జవాబు:
విద్యార్థికృత్యం
ప్రశ్న 2.
పుత్రుడు అంటే ఏవరు?
జవాబు:
కుమారుడు (పున్నామ నరకం నుంచి తప్పించువాడు)
ప్రశ్న3.
పరహితం అంటే ఏమిటి?
జవాబు:
ఇతరులకు మేలు చేయడం.
ప్రశ్న 4.
స్నేహితులతో ఎలా మెలగాలి?
జవాబు:
ఎంత స్నేహితురాలైనా వారిని వేళాకోళం చేయకూడదు. ఇష్టం కాస్తా అనిష్టంగా మారవచ్చు. ఒకసారి నోరుజారితే వెనక్కు తీసుకోలేము. మాట్లాడే ముందు ఆలోచించి కోవాలి.
చదవడం – వ్యక్త పరచడం
అ) కింది పద్య పాదాలను చదవండి. వాటిని పద్యాలలో గుర్తించి గీత గీయండి.
ప్రశ్న 1.
కులము కన్న మిగుల గుణము ప్రధానంబు
జవాబు:
కులము కన్న మిగుల గుణము ప్రధానంబు
ప్రశ్న 2.
“తేనెటీగ కూర్చి తెఱువరి కియ్యదా
జవాబు:
తేనెటీగ కూర్చి తెఱువరి కియ్యదా
ప్రశ్న 3.
ఎంత చెలిమి యున్న ఎగతాళి చేయకు
జవాబు:
ఎంత చెలిమి యున్న ఎగతాళి చేయకు
ప్రశ్న 4.
పరహితమ్ముకంటె పరమార్ధమున్నదా
జవాబు:
పరహితమ్ముకంటె పరమార్థమున్నదా
ఆ) కింది పద్య భావాన్ని చదవండి. అడిగిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
దేవుడికి పూజలు చేయడం కంటే సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన గొప్పది. మాట ఇవ్వడం కంటే ఆ మాట మీద నిలబడే గట్టి మనసు ముఖ్యం. కులాన్ని గౌరవించటం కంటే మంచి గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం.
ప్రశ్న 1.
పూజకంటే ముఖ్యమైనది ఏది?
జవాబు:
సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన గొప్పది.
ప్రశ్న 2.
మాట ఇవ్వడం కంటే ముఖ్యమైనది ఏది?
జవాబు:
ఆ మాట మీద నిలబడే గట్టి మనసు ముఖ్య మైనది.
ప్రశ్న 3.
దృఢము అంటే అర్థమేమిటి?
జవాబు:
గట్టిది.
ప్రశ్న 4.
కులముకన్న ఏది గొప్పది?
జవాబు:
మంచి గుణం గొప్పది.
Textbook Page No. 66
పదజాలం
అ) కింది పదాలలో కొన్ని ఒత్తులు లోపించాయి. సరైన ఒత్తుతో పదాన్ని తిరిగి రాయండి.
జవాబు:
ఆ) కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి.
1. మాటకన్న నెంచ మనసు దృఢము.
జవాబు: గట్టిది.
2. ఛాయపోలిక కుజనసజ్జనుల మైత్రి
జవాబు: స్నేహం
3. మొదలు చూచిన కడుగొప్ప పిదప కుఱుచ …….
జవాబు: పొట్టి
4. తేనెటీగ కూర్చి తెఱువరి కీయదా. ……
జవాబు: బాటసారి
5. ఎంత చెలిమి యున్న నెగతాళి చేయకు. ……..
జవాబు: స్నేహము.
ఇ) కింది తమాషా వాక్యాలను చదవండి. జవాబుని కనిపెట్టండి.
ఉదా : వడను తినే వడ :
జవాబు: దవడ
1. రోజాలను పెట్టుకునే రోజాలు జవాబు: శిరోజాలు
2. జనాలు తినే జనం జవాబు: భోజనం
3. ఖండాలు, దేశాలు లేని పటం జవాబు: గాలిపటం
4. ప్రేమను పంచే కారం జవాబు: మమకారం
5. తాగలేని పాలు జవాబు: నేలపాలు
స్వీయరచన
అ) కింది పద్య పాదాలకు భావాలు సొంతమాటల్లో రాయండి.
ప్రశ్న 1.
ధనము కూడబెట్టి దానంబు సేయక
జవాబు:
ధనం దాచి పెట్టి దానం చేయక పోతే…….
ప్రశ్న 2.
ఎంత చెలిమి యున్న ఎగతాళి చేయకు
జవాబు:
ఎంత స్నేహం ఉన్నా కూడా! ఎగతాళి చేయకూడదు.
ప్రశ్న 3.
పరుల కొరకె నదులు ప్రవహించు
జవాబు:
ఇతరులకు ఉపయోగపడేందుకు మాత్రమే నదులు ప్రవహిస్తాయి.
ప్రశ్న 4.
మతములెన్నియున్న మానవత్తమొక్కటే
జవాబు:
ఎన్ని మతాలున్నా కూడా! మానవత్వం ఒక్కటే.
Textbook Page No. 67
ఆ) కొడుకు పుట్టినందుకు ఆనందం ఎప్పుడు కలుగుతుందని కవి చెప్పాడు?
జవాబు:
ప్రజలందరూ తన కొడకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే…తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని కవి చెప్పాడు.
ఇ) కవి ‘దానం చేయకుండా కూడబెట్టిన ధనం’ గురించి ఏమిని చెప్పాడో మీ సొంత మాటల్లో రాయండి.
జవాబు:
ఏ విధంగానైతే… తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెట్టి చివరకు బాటసారుల పాలు (ఇతరులు) చేస్తుందో…. అలాగే సంపాదించిన ధనం తాను అనుభవించకుండా
– దాచి పెట్టడం వల్ల ఉపయోగం లేదని అది చివరకు ఇతరుల పాలౌతుందని కవి చెప్పాడు.
ఈ) బలవంతుడు’ పద్యం నుండి మీరేమి గ్రహించారో రాయండి.
జవాబు:
ఎదుటవాని శక్తి నెఱిగి ప్రవర్తించాలి. మాట నిదానం అవసరం. కండ బలం కంటే బుద్ధి బలం గొప్పదని గ్రహించాను.
సృజనాత్మకత
పరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి. ఆవులు పాలు ఇస్తున్నాయి. చెట్లు, తేనె, పండ్లను, ఇస్తున్నాయి కదా! ఇతరుల కోసం మీరు ఏమేమి చేయగలరో తెలుపుతూ చిన్న వ్యాసం రాయండి.
జవాబు:
పరుల కోసం జీవించే జీవితంలో ఆనందం, సంతృప్తి, సంతోషం ఉంటాయి. ఐతే.. తనకు మించిన, తలకు మించిన సహాయం కూడా మంచిది కాదు. ఎందుకంటే… చేయగలిగినంత సాయం ఉత్తమం కనుక.
నేను నాశక్తికి తగినట్లుగా ఇతరువల కోసం తగినంతగా పాటుపడతాను. నా తోటి ‘ పేద విద్యార్థులకు విద్యాదానం చేస్తాను. పుస్తకాల రూపంలో కాని, ధనరూపంలో కాని సాయం చేస్తాను. పెద్దలకు, వృద్ధులకు చేదోడు వాదోడుగా ఉంటాను. వికలాంగులకు సాయంగా ఉంటాను. ,
ఆయా పరిస్థితులను బట్టి, సమయానుకులంగా ఎల్లవేళలా! పరులకు మేలు చేస్తూనే ఉంటాను. ఆకలితో బాధపడుతున్న వారికి ఆకలి తీరుస్తాను.
ఈ విధంగా….ఇతరుల కోసం చిన్న చిన్న సహాయాలు చేస్తాను.
ప్రశంస
పద్యాల పోటీలో బాగా పద్యాలు చెప్పిన మీ మిత్రులను అభినందించండి.
జవాబు:
మిత్రమా! నీకు నా అభినందనలు. ఎంతో చక్కగా పద్యాలు చెప్పావు. ఎక్కడా తప్పులు రాలేదు. పైగా ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఒత్తి పలకాలో, ఎక్కడ తేలికగా పలకాలో!, ఎక్కడ ఆశ్చర్యంగా పలకాలో, అక్కడ అలాగే చెప్పావు. నువ్వు పద్యం చెబుతుంటే… వినటానికి చాలా బాగుంది. చాలా స్పష్టంగా పలికావు. అందుకే నీకు నా అభినందనలు.
భాషాంశాలు
అ) కింది వాక్యాలు చదవండి.
* సింధూజ పాట పాడింది.
* సింధూజ పాట పాడుతోంది
* సింధూజ పాట పాడబోతోంది.
Textbook Page No. 68
జవాబు:
పాడింది, వెళ్ళాము, వంటి పదాలు జరిగిపోయిన పనిని గురించి తెలియజేస్తున్నాయి. ఇలా జరిగిపోయిన పనిని తెలిపేదానిని ‘భూతకాలం’ అంటారు. ఆడుతున్నాడు. ఎక్కుతూ ఉంది .వంటి పదాలు జరుగుతున్న పనిని గురించి తెలియజేస్తున్నాయి. ఇలా జరుగుతూ ఉన్న పనిని తెలిపేదానిని ‘వర్తమానకాలం’ అంటారు. తెస్తాడు, వెళుతుంది వంటి పదాలు జరగబోయే పనిని తెలియజేస్తున్నాయి. ఇలా జరగబోయే పనిని గురించి తెలిపేదానిని ‘భవిష్యత్ కాలం’ అంటారు.
అ) కింది వాక్యాలు చదవండి. క్రియా పదాలను సరైన పట్టికలో రాయండి.
1. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు.
2. సింధుజ పాట పాడింది
3. రవి మామయ్య రేపు కొత్త బట్టలు తెస్తాడు.
4. కోతి కొబ్బరిచెట్టు ఎక్కుతున్నది.
5. మేము నిన్న సినిమాకు వెళ్ళాము.
6. నానమ్మ వచ్చే సోమవారం శ్రీశైలం వెళ్తుంది.
జవాబు:
ఆ) కింది వాక్యాలు చదవండి. ఏ కాలంలో ఉన్నాయో రాయండి.
1. జోసఫ్ రేపు విశాఖపట్నం వెళ్తాడు. ______
జవాబు: భవిష్యత్ కాలం
2. రమణి సినిమా చూసింది. ______
జవాబు: భూత కాలం
3. హర్షిత పాఠం చదువుతున్నది. _______
జవాబు: వర్తమాన కాలం
4. ఖాదర్ కథ రాశాడు. ______
జవాబు: భూత కాలం
5. మణిమెఖల ముగ్గు వేస్తున్నది. _______
జవాబు: వర్తమాన కాలం
6. రాబర్ట్ రేపు ఇంటికి రంగులు వేస్తాడు. _______
జవాబు: భవిష్యత్ కాలం
పద్య రత్నాలు
1. ధనము కూడబెట్టి దానంబు సేయక
తాను తినక లెస్స దాచుగాక
తేనెటీగ కూర్చి తెఱువరి కియ్యదా
విశ్వదాభిరామ వినురవేమ! – వేమన
అర్ధాలు : లెస్స = మిక్కిలి ఎక్కువగా బాగుగా; తెజువరి = బాటసారి తో
భావం : సంపాదించిన డబ్బును దానమన్నా చేయాలి; లేదా తాను తినాలి. ఈ రెండు కాకుండా దాచిపెట్టడం వల్ల ఎలాంటి లాభం లేదు. తేనెటీగ ఎంతో కష్టపడి తేనెను కూడబెడితే చివరికి అది బాటసారుల పాలవుతోంది కదా!
2. పుత్రోత్సాహము తండ్రికి
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు జనులా
పుత్రుని గనుగొని పొగడగ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! – బద్దెన
అర్ధాలు : పుత్రోత్సాహము = కొడుకు పుట్టిన సంతోషం; జన్మించినపుడె = పుటినపుడె; పొందుర = పొందుతాడు; జనులు = ప్రజలు; కనుగొని = గుర్తించి
భావం : కొడుకు పుట్టగానే తండ్రికి ఆనందం కలుగదు. ప్రజలందరూ తన కొడుకు గొప్పదనం చూసి పొగిడినప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుంది.
3. పరులకొరకె నదులు ప్రవహించు, గోవులు
పాలనిచ్చు, చెట్లు పూలు పూయు
పరహితమ్ము కంటె పరమార్థమున్నదా
లలిత సుగుణజాల తెలుగుబాల!
– జంధ్యాల పాపయ్య శాస్త్రి
అర్థాలు : పరులు = ఇతరులు; గోవులు = ఆవులు; పరహితము = ఇతరులకు మేలు; పరమార్థము = నిజమైన ప్రయోజనం
భావం : ఇతరుల కొరకే నదులు ప్రవహిస్తున్నాయి. ఆవులు పాలనిస్తాయి. చెట్లు పూలు పూస్తున్నాయి. ఇతరుల మంచి కంటె కోరదగినది ఇంకేమీ లేదు.
4. బలవంతుడ నాకేనుని
పలువురతో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!
– బద్దెన
అర్ధాలు : బలవంతుడు = బలంకలవాడు; పలువురు = చాలామంది; సర్పము = పాము; నిగ్రహించు = ఎదిరించి; పలుకుట = మాట్లాడడం
భావం : వేను బలవంతుణ్ణి అనే గర్వంతో ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఎంతటి బలవంతుడైనా కొన్ని సమయాల్లో తనకంటే తక్కువ బలం కలవారి చేతులలో ఓడిపోయే అవకాశం ఉంది. చీమలకంటె పాము బలమైనదికదా! అయినా చీమలగుంపు పామును కుట్టి చంపేయగలదు.
5. మొదలు చూచిన కడుగొప్ప పిదప కుఱుచ
ఆది కొంచెము తరువాత నధికమగుచు
తనరు దినపూర్వ పరభాగజనితమైన
ఛాయపోలిక కుజనసజ్జనుల మైత్రి
– ఏనుగు లక్ష్మణ కవి
అర్ధాలు : కురచ = పొట్టి; ఆది = మొదలు; తనరు = వర్ధిల్లు; దినపూర్వ = ఉదయకాల; ఛాయ = నీడ; కుజన = చెడ్డవారి; సజ్జనుల = మంచివారి; మైత్రి = స్నేహం
భావం : చెడ్డవారి స్నేహం ఉదయపు ఎండలో నీడలా ముందు గొప్పగా ఉండి తరువాత సన్నగిల్లుతుంది. మంచివారి స్నేహం మధ్యాహ్నపు ఎండలో నీడలా ముందు కొద్దిగా ఉండి మెల్లిగా వృద్ధిచెంది పెరుగుతుంది.
6. ఎంత చెలిమి యున్న ఎగతాళి చేయకు
సరసమంత నంత విరసమగును
మాట జారెనేని మరితీసుకోలేము
తెలిసి మెలగుమయ్య తెలుగుబిడ్డ!
– నార్ల చిరంజీవి
అర్ధాలు : చెలిమి = స్నేహం; ఎగతాళి = వెటకారం, వేళాకోళం; సరసం = ఇష్టం; విరసం = అనిష్టం
భావం : ఎంత స్నేహితులైనా వారిని వేళాకోళం చేయకూడదు. ఇష్టం కాస్తా అనిష్టంగా మారవచ్చు. ఒకసారి నోరుజారితే వెనక్కు తీసుకోలేము. మాట్లాడేముందు ఆలోచించు కోవాలి.
7. మతము లెన్ని యున్న మానవత్వ మ్మొక్కటె
జాతు లెన్ని యున్న నీతి యొకటె
పదము లెన్ని యున్న పరమార్థ మొక్కటే
వాస్తవమ్ము నార్లవారిమాట!
– నార్ల వెంకటేశ్వరరావు
అర్ధాలు : మానవత్వం = మనిషికి ఉండే సహజగుణం; పరమార్థం = గొప్పదైన అర్థం, గొప్పతనం
భావం : ఎన్ని మతాలున్నా తోటి మానవునికి సహాయం చేయమనే చెప్తాయి. జాతులెన్ని ఉన్నా నీతిగా బతకమనే చేస్తాయి. రచనలెన్నైనా వాటి గొప్పదైన భావం ఒకటే.
8. బ్రతుకచ్చు గాక బహుబంధనము లైన
వచ్చుగాక లేమి వచ్చుగాక
జీవధనములైన జెడుగాక పడుగాక
మాట దిరుగలేరు మానధనులు -పోతన
అర్ధాలు : బంధనములు = కట్లు; లేమి = పేదరికం, జీవదనం = ప్రాణం; మానధనులు = మానమే ధనంగా కలిగినవారు (పరువు కలిగినవారు)
భావం : మానధనులు మాట తప్పలేరు. బ్రతుకు ఉండవచ్చు, కష్టాలు రావచ్చు. పేదరికంలో మునిగిపోవచ్చు. ప్రాణాలే పోవచ్చు. ఏది ఏమైనా మాట తప్పరు.
9. పూజకన్న నెంచ బుద్ధి ప్రధానంబు
మాట కన్న నెంచ మనసు దృఢము
కులము కన్న మిగుల గుణము ప్రధానంబు
విశ్వదాభిరామ వినురవేమ!
-వేమన
అర్ధాలు : బుద్ధి = ఆలోచన; ప్రధానము = ముఖ్యం; దృఢము = గట్టిది.
భావం : దేవునికి పూజలు చేయడంకంటె సాటి మనిషికి సహాయం చేయాలన్న ఆలోచన ముఖ్యం. మాట ఇవ్వడం కంటె ఆ మాటమీద నిలబడే దృఢమైన మనస్సు ముఖ్యం. పుట్టిన కులం కంటె మంచి గుణాలను చూసి గౌరవించడం ముఖ్యం.
ఈ మాసపు గేయం
వీరగంధం
వీరగంధము తెచ్చినారము
వీరుడెవ్వడొ తెల్పుడీ
పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో
తెలుగు బావుట కన్ను చెదరగ
కొండవీటను నెగిరిప్పుడు
తెలుగు వారల కత్తి దెబ్బలు
గండికోటను కాచినప్పుడు
||వీర॥
నడుము కట్టిన తెలుగు బాలుడు
వెనుక తిరుగండెన్నడున్
బాస ఇచ్చిన తెలుగు బాలుడు
పారి పోవందెన్నడున్
||వీర॥
కవి పరిచయం : త్రిపురనేని రామస్వామి
కాలము : (15-1-1887 – 16-1-1943)
రచనలు : ‘సూతపురాణం’, ‘పల్నాటి పౌరుషం’
విశేషాలు : హేతువాద రచయిత. ఈయన కవిరాజు బిరుదును పొందారు.
ఈ మాసపు కథ
పేను-నల్లి
ఒక పేను రాజు గారి మంచంలో జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఒక నల్లి వచ్చింది. పేను ఆ నల్లికి అతిథి మర్యాదలు చేసింది. తరువాత “ఎందుకు వచ్చావు” అని పేను నల్లిని అడిగింది. “నువ్వు నాకు మంచి స్నేహితుడవు, నిన్ను ఒకటి అడగాలని వచ్చాను. నువ్వు ఒప్పుకుంటే నా కోరిక తీరుతుంది” అంది నల్లి.
“నువ్వు నాకు ప్రాణంతో సమానం. నీ కోరిక నావల్ల తీరుతుంది అంటే అంతకన్నా నాకు సంతోషం ఏముంది? నన్ను బతిమాలనక్కర్లేదు” అంది పేను అప్పుడు నల్లి “మిత్రమా! ఇంతకాలం మనుషుల రక్తం తాగి బతుకుతున్నాను. కాని ఏరోజు రాజుగారి రక్తం తాగలేదు. రుచి చూడలేదు. అప్పుడే కాచిననెయ్యి, తియ్యనిపప్పు, మంచికూరలు, రుచిగల వంటలు, ఊరగాయలు రకరకాల మాంసాలు, తీపి పదార్థాలు, పాలు, మీగడ పెరుగులు, మత్తుపానీయాలు, సువాసన ద్రవ్యాలు మొదలైనవి తిని, తాగి హాయిగా నీడలో ఉండే రాజుల రక్తం చాలా రుచిగా ఉంటుంది. ఈ మంచం మీద నన్ను ఉండనిస్తే నా కోరిక తీరుతుంది” అంది.
“సరే కానీ, సమయానికి తగినట్లుగా ఉండి రాజుగారు బాగా నిద్రపోయాక, మెల్లగా కరిచి, రక్తం పీల్చుకొని తెలివిగా అక్కడనుంచి తప్పించుకోవాలి సుమా!” అని చెప్పింది పేను.
“అలాగే చేస్తాను!” అని చెప్పి నల్లి ఒప్పుకొని మెల్లగా రాజు గారి మంచం మీద చోటు సంపాదించింది. ఒకరోజు రాజుగారు నిద్రలోకి వెళ్లకుండానే నల్లి ఆశపడి, తొందరపడి కరిచింది, ఆ అంతే! రాజుగారు ఉలిక్కిపడి లేచి చిరాకుగా “ఎవరక్కడ?” అని అరచి “దీపం తీసుకురండి! నన్ను ఏదో కుట్టింది. వెతికి చంపండి” అని ఆజ్ఞాపించాడు.
సేవకుడు దీపం తెచ్చేలోపు నల్లి గబగబా వెళ్ళి మంచం సందులో దాక్కుంది. పేను వేగంగా వెళ్లలేక పోయింది. దీపపు వెలుతురులో పేను కనడబడింది రాజభటునికి, అంతే! “ఇదే ప్రభూ! మిమ్మల్ని కుట్టి ఉంటుంది” అని రాజుగారితో చెబుతూ ఆ పేనుని నలిపి, చంపేసాడు.