AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం

Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 4th Class Telugu Solutions Chapter 8 బారిష్టర్ పార్వతీశం

Textbook Page No. 61

చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.

ప్రశ్నలకు జవాబులు చెప్ప౦డి.

ప్రశ్న 1.
చిత్రంలో సన్నివేశాల గురించి మాట్లాడండి?
జవాబు:
ప్రయాణం చేసి వస్తున్న ఆడ మనుషుల యొక్క ప్రయాణ సామాన్లను కూలీ మోసుకొస్తున్నాడు.

ప్రశ్న 2.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో ఒక మగ మనిషి (కూలి), ఒక ఆడ మనిషి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ సామాన్లు మోసుకొస్తున్నాడు. వెనకాల ఆ సామన్లకు సంబంధించిన ఆడవాళ్ళు నడిచివస్తున్నారు.

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 1

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం

ప్రశ్న 3.
మీరు ఎప్పుడైనా రైలు ప్రయాణం చేశారా? మీ ప్రయాణం గురించి చెప్ప౦డి?
జవాబు:
నేను చాలాసార్లు రైలు ప్రయాణం చేసాను. ప్రయాణానికి ముందు కావలసిన వస్తువులను అమ్మ, నాన్నలు చక్కగా బ్యాగ్ ల్లో సర్దుతారు. అక్కడ నుండి రైల్వే స్టేషను 1/2 గంట ముందుగా చేరుకుంటాము. ముందుగా ప్రకటించిన విధంగా రైలు ఫ్లాట్ ఫారం మీదకు రాగానే మాకు సంబంధించిన భోగిలోకి ఎక్కుతాము. మా సీట్లలో మేము కూర్చుంటాము.

ఎక్కినప్పటి నుండి దిగేవరకు భోగిలో ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. మాటి కొకసారి టీ, కాఫీ, అమ్మేవారు, తినే పదార్థాలు తీసుకొచ్చేవారు, ఒక్కరు వార్తా పత్రిక కొంటే- దాన్ని ఆ భోగిలో సగానికి పైగా అందరూ చదువుతారు. కోన్నవాడు తప్ప, సెల్ ఫోన్లో గట్టిగా. పాటలు వినేవాళ్ళు, పసి పిల్లల ఏడుపులు, కూర్చోటానికి సీట్లు లేనివాళ్ళు T.Cని బ్రతిమాలాడు కోవడం… ఇలా ఎన్నో సంఘటనలు, చూస్తూ ఉండలేగాని… ప్రయాణం చిరాకు తెలియదు. ఇట్టే ! మన ఊరు వచ్చేసిందే అనిపిస్తుంది. నాకు మాత్రం భలే సరదా….. రైలు ప్రయాణమంటే…..

Textbook Page No. 74

ఇవి చేయండి

వినడం – ఆలోచించి మాట్లాడటం

ప్రశ్న 1.
పార్వతీశం ఇంగ్లాండు వెళ్లడానికి ఏయే వస్తువులు తీసుకున్నాడు? మీరైతే ఏమేమి తీసుకెళ్లుతారు?
జవాబు:
దంత ధావనానికి పది కచ్చికల పొడుము, నాలిక గీసుకోవడానికి తాటాకు ముక్కలు, తలకు రాసుకోవడానికి కొబ్బరినూనె, తుడుచుకోవడానికి రెండు అంగ వస్త్రాలు, దేశవాళి దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు, నీళ్ళు తాగడానికి మరచెంబు, రొట్టెలు కాల్చుకోవడానికి గోధుమపిండి, నెయ్యి, కిరసనాయిలు, స్టవ్వు, అట్ల పెనము, అవకాయ, పడుకోవడానికి సరసరావుపేట మడత మంచం. బొంత నారింజ పండు శాలువా, తలంగచాప మొదలైన వన్నీ పార్వతీశం ఇంగ్లాండు వెళ్ళేటప్పుడు తనతో తీసుకుని వెళ్ళాడు.
నేనైతే…..నాతో పాటు కొన్ని బట్టలు, పుస్తకాలు, డబ్బులు క్రెడిట్ కార్డలు, పేస్ట్, బ్రష్ సోపు అమ్మ ఇచ్చిన తినుబండరాలు తీసుకు వెళ్తాను.

ప్రశ్న 2.
పాఠంలో మీకు నవ్వు తెప్పించిన సన్నివేశాలు ఏవి?
జవాబు:
మొదటిది : పార్వతీశం ఇంగ్లాండు వెళ్ళటానికి తనతోపాటు సర్దుకున్న వస్తువులు చూసి నవ్వొచ్చింది.
” రెండవది : రైలెక్కాక – తన వస్తువులు పడిపోకుండా… రైలు ఆగటానికి లాగే గొలుసును లాగి కట్టిన సన్నివేశం నాకు నవ్వు వచ్చింది.
మూడవది : చెన్నపట్నంలో, తెలియక ఆడవాళ్ళ టోపి కొని అక్కడ నుండి దానితో పడ్డ ఇబ్బందులు….. నాకు నవ్వొచ్చింది.
AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 3
నాల్గవది : పార్వతీశం లిఫ్ట్ ఎక్కిన సన్నివేశం నాకు నవ్వొచ్చింది.

ప్రశ్న 3.
పార్వతీశానికి లిఫ్ట్ వెళ్లడం వింతగా అనిపించింది కదా! మీకు – వింతగా అనిపించిన సందర్భాలు చెప్ప౦డి?
జవాబు:
మా కుటుంబ సభ్యులందరం ఒకసారి. చార్‌ధామ్ ప్రయాణం చేసాము. అక్కడ ‘కేదార్‌నాథ్’ వెళ్ళినప్పుడు విపరీతమైన మంచు పడుతూ ఉంటుందిఒక్కొక్కసారి ఊపిరి అందదు. అలాంటి ప్రదేశంలో నడవలేని వాళ్ళకి డోలీలో కూర్చో పెట్టుకుని భుజానికి ఎత్తుకుని నెత్తిన తగిలిచుకుని కేదార్నాధుని గుడి దాకా మోసుకొస్తారు. ఆ సన్నివేశం నాకు బాగా వింతగాను ఆశ్చర్యంగాను అనిపించింది..

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం

ప్రశ్న 4.
మీ ఇంట్లో గాని చూట్టు పక్కల గాని మీకు నవ్వు తెప్పించిన సన్నివేశాలను చెప్ప౦డి?
జవాబు:
విద్యార్థికృత్యం

ప్రశ్న 5.
పార్వతీశం ప్రయాణంలో ఏ ఏ ఊర్ల మీదుగా వెళ్లాడో చెప్పండి?
జవాబు:
పార్వతీశం ఇంగ్లాండు ప్రయాణానికి – నరసాపురం దగ్గర మొగలితుర్రు నుండి బయలు దేరి రైలెక్కి చెన్నపట్నం చేరుకున్నాడు. అక్కడ నుండి కొలంబో ప్రయాణమై ‘తూత్తుకూడిలో’ దిగాడు.
అక్కడ నుండి కొలంబోకి వెళ్ళే స్టీమరు’ ఎక్కి ‘మార్సెల్సు’ చేరుకున్నాడు.

Textbook Page No. 75

చదవడం – వ్యక్తి పరచడం

అ) కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి.

ఇంగ్లాండు ప్రయాణానికి తీసుకువెళ్ళవలసిన సామగ్రి గురించి ఆలోచించాను. కావలసిన సామాన్ల జాబితా రాసుకున్నాను. దంతధావనానికి పది కచ్చికల పొడుము, నాలిక గీసుకోడానిక తాటాకు ముక్కలు, తలకు రాసుకోడానికి కొబ్బరినూనె, తుడుచుకోడానికి రెండు అంగవస్త్రాలు, దేశవాళి దువ్వెన, బొట్టు పెట్టుకోడానికి కొబ్బరిచిప్పలో కొంచెం చాదు, నీళ్ళు తాగడానికి మరచెంబు,
రొట్టెలు కాల్చుకోడానికి గొధుమపిండి, నెయ్యి, కిరసనాయిలు, స్టవ్వు, అట్ల పెనము, అవకాయ, పడుకోడానికి నర్సరావుపేట మడతమంచం, బొంత, నారింజపండు శాలువా, తుంగచాప చాలా
అవసరమని కొన్నాను.

ప్రశ్న 1.
అంగవస్త్రాలు అంటే ఏమిటి?
జవాబు:
ఒళ్ళు తుడుచుకునే పెద్ద తుండు గుడ్డలు.

ప్రశ్న 2.
ఇంగ్లండు వెళ్ళటానికి పార్వతీశం ఏమేమి కొన్నాడు?
జవాబు:
పది పచ్చికల పొడుము, తాటాకు ముక్కలు, కొబ్బరినూనె, రెండు అంగవస్త్రాలు, దేశవాళి దువ్వెన, కొంచెం చాదు, మరచెంబు, గోధుమపిండి, నెయ్యి, కిరసనాయిలు, స్టవ్వు, ఆట్ల పెనము, ఆవకాయ, మడతమంచం, బొంత, నారింజపండు, శాలువా, తుంగచాప, మొ||వి ఇంగ్లాండు వెళ్ళటానికి పార్వతీశం కొన్నాడు.

ప్రశ్న 3.
“చాదు” దీనికి సరైన అర్థం రాసి వాక్యంలో ప్రయోగించండి?
జవాబు:
బొట్టు :- నుదుటికి బొట్టు అందాన్నిస్తుంది.

ఆ) తప్పు – ఒప్పులను గుర్తించండి

1. పార్వతీశం ప్యారిస్ -వెళ్ళాలనుకున్నాడు ( )
జవాబు: ( తప్పు )

2. తల దువ్వుకోడానికి దేశవాళి దువ్వెన కొనుక్కున్నాడు ( )
జవాబు: ( ఒప్పు )

3. రొట్టెల కోసం మినపపిండి తీసుకు వెళ్ళాడు. ( )
జవాబు: ( తప్పు )

4. నల్లశాలువా కొనుక్కొన్నాడు. ( )
జవాబు: ( తప్పు )

5. ఊరికి వెళ్ళాలంటే కావాల్సిన వస్తువుల జాబితా రాయాలి ( )
జవాబు: ( ఒప్పు)

ఇ) కింది పేరాను చదివి. ప్రశ్నలకు సరియైన జవాబులు రాయండి.

గుర్రానికి సుడులు మొదలైనవి చూడాలి. గాడిదకు సుడి అవసరం లేదు. గుర్రాన్ని కొనాలి. గాడిదను కొనక్కర్లేదు. గుర్రానికి జీను కావాలి. గాడిదకు అక్కర్లేదు. అశ్వానికి సంరక్షణ కావాలి. గార్దభానికి రక్షణ అవసరం లేదు. హయానికి గుగ్గిళ్ళ దాణా పెట్టాలి. గాడిదకు ఇవి అనవసరం. కనుక నేను గాడిదనే ఆధిరోహిస్తాను అన్నాడు గణపతి.

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం

Textbook Page No. 76

ప్రశ్న 1.
అశ్వం అంటే అర్థం ఏమిటి?
జవాబు:
గుఱ్ఱం.

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 4

ప్రశ్న 2.
అశ్వానికి పర్యాయపదాలు ఏమున్నాయి?
జవాబు:
మనసును గుఱ్ఱం, హయము

ప్రశ్న 3.
గాడిదను మరోలా పిలవవచ్చు. ఆ పేరు ఏది?
జవాబు:
గార్ధభము

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 18

ప్రశ్న 4.
గుర్రానికి చూడాలి.
జవాబు:
సుడులు

ప్రశ్న 5.
జీను ………… కు అవసరం లేదు.
జవాబు:
గాడిదకు

ఈ) కింది పదాలను ఉపయోగించి, సొంత వాక్యాలు రాయండి.

1. సంరక్షణ : _________
జవాబు: తల్లిదండ్రుల సంరక్షణలో పిల్లలు గొప్పవాళ్ళవుతారు.

2. దాణా : _________
జవాబు: మా గ్రామంలో పశువుల దాణా (తిండి) కొట్లున్నాయి.

3. అధిరోహించు : _____
జవాబు: రాజులు సింహాసనాన్ని అధిరోహిస్తారు.

ఉ) కింది వాక్యాలు చదివి, ప్రశ్నలు తయారు చేయండి.

ఉదా॥ గణపతి గాడిదమ అధిరోహిస్తామ అన్నాడు.
గణపతి ఏమనన్నాడు?

1. హయానికి గుగ్గిళ్ళు దాణా పెట్టాలి.
జవాబు:
హయానికి దాణాగా ఏది పెట్టాలి?

2. హయము అంటే అర్థం గుర్రం.
జవాబు:
హయము అనగా ఏంటి?

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం

3. ఆశ్వానికి సంరక్షణ కావాలి.
జవాబు:
సంరక్షణ దేనికి కావాలి?

4. నేను గాడిదనే అధిరోహిస్తాను.
జవాబు:
నేను దేనిని అధిరోహిస్తాను?

Textbook Page No. 77

ఊ) కింది పేరా చదివి పట్టిక పూరించండి.

నక్షత్రాలు – రాశులు – కారైలు

“ రోహిణి కారై ఎండకు రోళ్ళు పగులుతాయి అన్నావు కదా అవ్వా! అంటే ఏమిటి?” ” మాయమ్మే ఎంత చల్లగా అడిగినావే! ఎండకి వీవులు పగిలిపోవడంలా! నెత్తి మాడిపోవడంలా! అదేనే మనవరాలా!” అంది అవ్వ. –
“ అసలు కారైలంటే ఏమిటవ్వా?”
AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 5
“27 నక్షత్రాలు తెలుసుకదా! అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ (పూర్వఫల్గుణి), ఉత్తర (ఉ త్తర ఫల్గుణి) హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనూరాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు చొప్పున 27 నక్షత్రాలకు 108 పాదాలని,, వాటిని 9 పాదాలకు ఒక రాశి చొప్పున 12 రాశు లుగా మన పెద్దలు విభజించారు. అవి మేషం, వృషభం, మిధునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం.

పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు,అ పేరు పెట్టారు. అశ్విని ఉంటే ఆశ్వీయుజమాసం, కృత్తిక ఉంటే కార్తీక మాసం….. ఇలా ఇవన్ని చంద్రమానం మీద ఆధారపడి ఉన్నాయి. మన ప్రాచీన రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని సూర్యమాన, చంద్రమాన | ఆధారంగా పోందుపరిచారు. సూర్యుడు. ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కారై పేరు పెట్టారు. సంవత్సరానికి 27 కారైలు. కారైలు, నెలలు, రాశుల వారీగా పైరులకు వాతావరణం ఎలా ఉంటుందో సామెతల రూపంలో అందరికి అర్థమయ్యేలా చెప్పుకున్నారు.”

“ అశ్విని కురిస్తే అంతా నష్టం”
” భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజట”ఇలా చెప్పుకుంటే ఎన్నో…..

ఋ) రాశుల పేర్లను పట్టికలో వెతికి రాయండి:

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 6
జవాబు:
AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 7

1. మేషం
2. వృషభం
3. మిధునం
4. కర్కాటకం
5. సింహం
6. కన్య
7. తుల
8. వృశ్చికం
9. ధనస్సు
10. మకరం
11. కుంభం
12. మీనం

Textbook Page No. 78

పదజాలం

అ) ఈ పాఠంలో కొన్ని విదేశీ పట్టణాల పేర్లు ఉన్నాయి. అవి రాయండి. మీకు తెలిసిన మరికొన్ని విదేశీ పట్టణాల పేర్లు కూడా రాయండి:

_________ _________
_________ _________
_________ _________
_________ _________
జవాబు:
1. ఇంగ్లాండు
2. డల్లాస్
3. అట్లాండా
4. లాస్ ఏంజల్స్
5. కొలంబో
6. సిడ్నీ
7. న్యూయార్క్
8. చికాగో
9. శాన్ ఫ్రాన్సిస్కో

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం

ఆ) కింది ఏక వచన పదాలకు బహువచన పదాలు రాయండి:
AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 8
జవాబు:
AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 9

ఇ) కింది తమాషా వాక్యాలను చదవండి. ఒకే హల్లును ఉపయోగించి అర్థవంతమైన వాక్యాలు రాయడం కష్టమే! అయినా అసాధ్యం కాదు. ఇలాంటివి రాయడానికి మీరు ప్రయత్నం చేయండి.

1. కాకీక కాకికి కాక, కేకా? ( )
జవాబు: (కేకి అంటే నెమలి )
2. నాన్న నన్నెననిన నేను నాన్న ననను ( )
3. మీ మామ మా మామా ? మా మామ మీ మామా?
మీ మామ మీ మామే! మామామ మామామే! ( )
అదనపు ప్రశ్నలు :
4. నేను నిన్నన్నానా! ( )
5. బాబు, బాబీబాబు ( )
6. పాప పాపం పాపి – ( )
జవాబు:
విద్యార్థికృత్యము

Textbook Page No. 79

స్వీయరచన

కింది ప్రశ్నలకు జవాబులు రాయండి

ప్రశ్న 1.
ప్రయాణం కొరకు పార్వతీశం కొన్న వస్తువులేమిటి?
జవాబు:
దంత ధావనానికి పది కచ్చికల పొడుము, నాలిక గీసుకోవడానికి తాటాకు ముక్కలు, తలకు రాసుకోవడానికి కొబ్బరినూనె, తుడుచుకోవడానికి రెండు అంగ వస్త్రాలు, దేశవాళి దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు, నీళ్ళు తాగడానికి మరచెంబు, రొట్టెలు కాల్చుకోవడానికి గోధుమపిండి, నెయ్యి, కిరసనాయిలు, స్టవ్వు, అట్ల పెనము, అవకాయ, పడుకోవడానికి సరసరావు పేట మడత మంచం. బొంత, నారింజపండు శాలువా, తుంగచాప మొదలైనవన్నీ పాంర్వతీశం ఇంగ్లాండు వెళ్ళేటప్పుడు తనతో తీసుకుని వెళ్ళాడు.

ప్రశ్న 2.
పార్వతీశం ఇంగ్లాండు వెళ్ళాలని ఎందుకు నిశ్చయించుకున్నాడు?
జవాబు:
నరసాపురం మొగలితుర్రులో టెయిలర్ హైస్కూల్ లో అయిదో ఫారము పూర్తిచేసి స్నేహితుని హితోపదేశంతో బారిష్టర్ చదువుదామని పార్వతీశం ఇంగ్లాండు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు.

ప్రశ్న 3.
మార్సెల్సు హోటల్లో పార్వతీశం ఎందుకు గాబరా పడ్డాడు?
జవాబు:
మార్సెల్సు హోటలులో బంట్రోతు పార్వతీశం సామానును ఒక చిన్న గదిలో పెట్టాడు. తనను అందులో ఉండమంటాడేమో అనుకుని, ఒకేవేళ తనను చూచి లోకువ గట్టి ఎవరికీ పనికిరానిగది తనకు ఇచ్చారేమో అనుకున్నాడు. ‘ఈ చిన్న గదిలోకి నేను రాను” అన్నాడు. ఇహ లాభం లేదని బంట్రోతు తన చేయి పట్టుకుని లోపలికి లాగి తలుపు వేశాడు. వెంటనే అది అంతరిక్షంలోకి ఎగిరిపోయింది. ఆ విధానం చూసి హడలిపోయాడు. గాబరా పడ్డాడు పార్వతీశం. చివరి దాకా వెళ్ళాక బంట్రోత్తు తలుపు తీసి బయటకు రమ్మన్నాడు. తన సామాను తీసుకువెళ్ళి గదిలో పెట్టాడు బంట్రోత్తు. “శ్రమ పడకుండా మేడ, ఎక్కే గది, ఆ చిన్న గది” అని అప్పుడు తెలుసుకున్నాడు పార్వతీశం.

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 10

ప్రశ్న 4.
ప్రతిరోజూ మీరు బడికి వస్తారుకదా! ఏమేమి తెచ్చుకుంటారు?
జవాబు:
నేను ప్రతిరోజు బడికి వస్తూ! పుస్తకాలు పెట్టిన సంచి, కలము, మంచి నీళ్ళ సీసా, భోజనము, వానాకాలంలో ఐతే గొడుగు, చలికాలం ఐతే ఉన్ని చొక్కా, తెచ్చుకుంటాను. ”

సృజనాత్మకత

మీరు చేసిన ఒక ప్రయాణం గురించి, చూసిన ప్రదేశం గురించి దినచర్య రాయండి. అందులో మీరు వెళ్ళిన ఊరు – ఏ రోజున – ఎవరెవరు వెళ్లారు – ఏయే వాహనాలతో వెళ్ళారు – ఏయే ప్రదేశాలను చూశారు – ఏయే ఆహార పదార్థాలను తిన్నారు – ఆ ప్రదేశాలను చూసినపుడు మీకు ఎలా అనపించింది – వంటి వివరాలతో మీ దినచర్య రాయండి.
జవాబు:
దినచర్య :
ఈ రోజు తేదీ మే-15 : నేను, నాన్న, అమ్మ, చెల్లి, కలసి కాశీ బయల్దేరాము. ఇంటి నుండి కారులో రైల్వే స్టేషన్ కి వెళ్ళి అక్కడ నుండి ‘గంగా, కావేరి’ ఎక్స్ ప్రెస్ ఎక్కాము. రాత్రి ప్రయాణం కనుక వెంటనే అందరం నిద్రలోకి వెళ్ళాము.
ఈ రోజు తేదీ మే-16 : ప్రయాణంలో రెండోరోజు మొత్తం రైలులోనే గడిచింది. వచ్చే పోయే ప్రయాణికులు, వస్తువులు అమ్మేవారు. చాలా సందడిగా గడిచింది. ఈ రోజు రైలులోనే నిద్ర.

ఈ రోజు తేదీ మే-17 : ఈ రోజు తెల్లవారుజామున 3-30 సమయం, అలహాబాదులో రైలు ఆగింది. మేమందరం దిగాము. దిగి కారు మాట్లాడుకుని త్రివేణి సంగమంకి వెళ్ళి గంగ, యమున, సరస్వతి, సంగమ ప్రదేశంలో స్నానం చేసి శక్తి పీఠం దర్శించుకున్నాం. కోటను చూశాం. ఇక్కడ నుండి మధ్యాహ్నం రైలేక్కి వారణాసి చేరుకున్నాం. సాయంత్రం 6గంటల సమయంకి ఆంధ్రాశ్రమం చేరుకున్నాం. రాత్రికి విశ్వేశ్వర దర్శనం చేరుకున్నాం.

ఈ రోజు తేదీ మే-18 : ఈ రోజు వారణాసిలో గంగ స్నానం చేసి, విశ్వేశ్వర దర్శనం, డుంఢిగణపతి, కాలభైరవ, అన్నపూర్ణ, విశాలక్ష్మీ, సంకటహరణ హనుమాన్, లార్డ్ భైరవ మొదలగు దేవాలయాలు దర్శనం చేసుకున్నాం.
ఈ రోజు తేదీ మే-19 : విజయవాడుకు బయల్దేరాం. గంగా, కావేరి ఎక్స్ ప్రెస్ ఎక్కి మే-21కి చేరుకున్నాం. ఇది మా కాశీయాత్ర దినచర్య.

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం

ప్రశంస

ప్రయాణంలో మీకు సహకరించిన మీ తోటి ప్రయాణికుడ్ని ఎలా ప్రశంసిస్తారు
జవాబు:
మిత్రమా! మీకు ధన్యవాదాలు. ఈ ప్రయాణంలో మీరు కూడా నాతో పాటు ” ఉండడం వలన నాకు ఎంతో మేలు కలిగింది. సమయానికి మీరు డబ్బు సమకూర్చకపోతే….నేను చాలా ఇబ్బంది పడేవాడిని. నా పర్సు పోయిందని నేను గమనించలేక పోయాను. మీరు చేసిన మేలుకు కృతజ్ఞతలు. ఎంత మంచివారితో, గొప్ప మనస్సున్న వారితో నేను ప్రయాణం చేస్తున్నానో తెలుసుకున్నాను. మీకు సమస్కారాలు. మీరు కూడా నాతో పాటు ఒక్కసారి మా ఇంటికి వచ్చి నా ఆతిధ్యాన్ని తీసుకుని వెళ్ళాలి. అప్పుడు నాకు సంతృప్తి…ధన్యవాదాలు.

Textbook Page No. 80

1. భాషాంశాలు

ఇంతకుముందు పాఠాలలో క్రియల గురించి తెలుసుకున్నారుకదా! క్రియాపదాలను వాక్యాలలో వాడినప్పుడు అవి రెండు రకాలుగా పనిచేస్తాయి.

ఒకటి : వాక్యాన్ని పూర్తిచేయటం
రెండు : వాక్యాన్ని పూర్తిచేయకపోవడం
కింది ఉదాహరణలు చూడండి:
సమాపక క్రియ వాక్యాలు

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 11

పై వాక్యాలు చూడండి. మొదటి మూడు వాక్యాలు పూర్తి అయ్యాయి కదా! కాని తర్వాతి మూడు వాక్యాలు పూర్తి కాలేదు వాటిని పూర్తిచేయ్యాలంటే మరొక పదం ఏదో రావాలి. వాటిని ఎట్లా పూర్తి చెయ్యవచ్చో చూడండి.

4. రవి ఇంటిపని చేసి నిద్రపోయాడు.’
5. పిల్లలు నడుస్తూ మాట్లాడుతున్నారు.
6. లత పరీక్ష రాసి వస్తుంది.

ఇప్పుడు ఈ వాక్యాలు పూర్తి అయిన వాక్యాలే కదా! దీన్నిబట్టి మనం ఈ కింది విషయం తెలుసుకుంటాం: చేశాడు, నడుస్తున్నారు, రాస్తుంది, నిద్రపోయాడు, మాట్లాడుతున్నారు, వస్తుంది – ఇవి వాక్యాన్ని పూర్తిచేయ గలవు. కనుక ఇవి సమాపక క్రియలు. చేసి, నడుస్తూ, రాసి – ఇవి వాక్యాన్ని పూర్తి చేయలేవు. కనుక ఇవి అసమాపక క్రియలు.
ముందు పాఠాలలో సమాపక అసమాపక క్రియాపద వాక్యాలను గుర్తించండి.
AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 12
జవాబు:
AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 13

కవి పరిచయం

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 2

కవి : మొక్కపాటి వరసింహశాస్త్రి
కాలము : (9.10.1892 – 5.3.1973)
రచనలు: “మొక్కుబడి, అభ్యుదయం, పెదమామయ్య’.
విశేషాలు : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జన్మించారు.
‘బారిష్టర్ పార్వతీశం’ తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన హాస్యనవల.

పదాలు – అర్థాలు

కాపురస్థలం = నివాసం ఉండే చోటు
హితోపదేశం = మేలుచేసే మాట చెప్పడం
సామగ్రి = సామాన్లు, వస్తువులు
కచ్చికలు = కాల్చిన పిడకలు
చాదు = పిండితో తయారుచేసిన బొట్ట
గార్డు = కాపలావ్యక్తి
చెన్నపట్నం = మద్రాసు, చెన్నయ్
దొరసాని = తెల్లజాతి స్త్రీ
బంట్రోతు = సేవకుడు
అంతరిక్షమార్గం = ఆకాశంవైపు
ఐదవ ఫారము = 10వ తరగతి
బారిష్టరు = ఇంగ్లండులో న్యాయశాస్త్రం,
దంతధావనము = పళ్ళు తోముకోవడం
అంగవస్త్రం = తువ్వాలు
దేశవాళీ దువ్వెన = చెక్కతో చేసిన దువ్వెన
ప్రాధేయపడితే = బతిమాలితే
దొర = తెల్లజాతి పురుషుడు
బస = తాత్కాలిక నివాసం
స్టీమరు = అవిరితో నడిచే పెద్ద నావ

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం

ఈ మాసపు పాట

ఏరువాకపాట

ఏరువాకోచ్చింది ఏరువాకమ్మ
నల్ల మబ్బులు నల్గిక్కుల పారి
|| ఏరు ||

AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 14

ఎఱ్ఱన్ని మెఱుపులు ఏగిరించాయి
ఎత్తైన కొండలు ఎతకరించాయి
పరుగెత్తి కోకిలా పాట పాడింది
నెమిలమ్మ మైమరచి నాట్యమాడింది
|| ఏరు||

ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ….
జనమందరూ వేగ కూడి రావాలి
గాదెల్లో విత్తనాలు గట్టిగా తేవాలి
గంపల్లో విత్తనాలు దండిగా తేవాలి
||ఏరు||

మృగశిర చిందించె ముసలెద్దు రంకేసె
దుక్కిటెద్దుల దెచ్చి అరక గట్టాలి
దున్నినా చేలన్నీ మిన్నగా పండాలి
ఒక్క గింజకు కోటి గింజలవ్వాలి
|| ఏరు ||

కవి పరిచయం

కవి : బిరుదురాజు రామరాజు
కాలము : ( 16-04-1925 – 8-02-2010 )
రచనలు . : ‘తెలుగు జానపద రామాయణం’ ” తెలుగు సాహిత్యోద్ధారకులు’
విశేషాలు : ఈయన వరంగల్ దగ్గర దేవనూరు గ్రామంలో జన్మించారు. తెలుగు జనపద గేయసాహిత్యం పై మొట్ట మొదటగా పరిశోధన చేశారు.
AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 15

ఈ మాసపు కథ

అత్యాశ

ఒక అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. నక్కలు సాధారణంగా పులులు, సింహాలు వంటి క్రూరమృగాలు వేటాడి తినగా వదిలిన మాంసం, ఎముకలు తిని బతుకుతాయి. రెక్కాడితే గాని డొక్కాడదు’ అన్న బాధ వీటికి లేదు.
అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న నక్కకు ఒక సువర్ణావకాశం లభించింది. ఒక వేటగాడు వేటాడి చంపిన లేడిని భుజాన వేసుకొని వస్తూ బలిష్ఠంగా ఉన్న ఒక అడవి పందిని చూశాడు. గురి చూసి ఆ సూకరాన్ని బాణంతో కొట్టాడు. అది గురి తప్పి పందికి గాయం చేసింది. అడవి పంది రెచ్చిపోయి కోపంతో వేటగాడి మీద దాడి చేసి చంపింది. తర్వాత పంది కూడా చచ్చింది.

ఆ పెనుగులాటలో ఒక పాము కూడా నలిగి నుగ్గునుగ్గయి చనిపోయింది. నక్క ఎదురుగా చనిపోయిన పంది, పాము, లేడి, మనిషి కళేబరాలు ఉన్నాయి. నక్క అనందానికి అంతులేదు. ‘బోలెడంత మాంసం. మంచి విందు భోజనం! ఆహా! ఏమి నాభాగ్యం ! అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు లేడు’ అని మనసులో అనుకుంది.

‘సరేలే! ఈ నాలుగింటి మాంసం ఎపుడైనా తినవచ్చు ముందగా నరాలతో తయారు చేసిన వింటి నారిని తింటాను’ అనుకొని వింటిని కాలికింద పెట్టి నారిని కొరికింది. బిగుతుగా ఉన్న నారి తెగిపోవటం వల్ల విల్లు వేగంగా నక్క గుండెకు తగిలింది. అ దెబ్బకు నక్క గిలగిల తన్నుకుంటూ చనిపోయింది.

అశ అతిగా మారితే అన్నీ కావాలనుకుంటారు. ఉన్నవాటితో సర్దుకోలేరు. ఆ ప్రయత్నంలో ఆలోచన లేకుండా ప్రవర్తిస్తారు. దానితో ప్రమాదం కొని తెచ్చుకుంటారు అనటానికి ఈ ‘అత్యాశ’ కథ ఒక ఉదాహరణ.
AP Board 4th Class Telugu Solutions 8th Lesson బారిష్టర్ పార్వతీశం 16