Andhra Pradesh AP Board 4th Class Maths Solutions 9th Lesson రాజు – కవి Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 4th Class Telugu Solutions Chapter 9 రాజు – కవి
Textbook Page No. 84
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్ప౦డి.
ప్రశ్న 1.
చిత్రంలో ఏమి జరుగుతున్నది?
జవాబు:
రాజుగారి సమక్షంలో పండిత సభ జరుగుతున్నది.
ప్రశ్న 2.
చిత్రంలో ఎవరెవరున్నారు? ఏం చేస్తున్నారు?
జవాబు:
రాజుగారు సింహాసనంలో ఆసీనులై ఆలకిస్తున్నారు. పండితులు వారి వారి పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. (కవులు వారి కవిత్వాన్ని వినిపిస్తున్నారు)
ప్రశ్న 3.
రాజు ఏమి మాట్లాడుతూ ఉండవచ్చు?
జవాబు:
పండితోత్తమా!… మహాకవీ… మీ పాండిత్యం… మీ కవిత్వం ఆమోఘం. మమ్మల్ని ఆనంద పెట్టారు. మిమ్మల్ని తగిన విధంగా సన్మానించడం మా కర్తవ్యం. అని మట్లాడుతూ ఉండవచ్చు.
Textbook Page No. 86
ఇవి చేయండి
నినడం – ఆలోచించి మాట్లాడటం
1. పద్యాలను లయ బద్దంగా రాగంతో పాడండి?
జవాబు:
విద్యార్థికృత్యం
2. రాజుగారిని ప్రజలు ఎందుకు గౌరవిస్తారు?
జవాబు:
రాజుగారంటే ప్రజలందరికీ భయం. ఆయన అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి, మన ప్రజలు రాజుగారిని గౌరవిస్తారు.
3. ప్రజల నాలుకల మీద జీవించటం అంటే ఏమిటి?
జవాబు:
శాశ్వతమైన కీర్తితో నిలిచి ఉండడం. (చనిపోయిన తరువాత కూడా! మంచి పేరుతో, కీర్తితో బ్రతికి ఉండడం)
Textbook Page No. 87
చదవడం – వ్యక్త పరచడం
అ) కింది పేరా ఆధారంగా తప్పు (✗) ఒప్పు (✓) గుర్తించండి.
రాజుగారు తరచూ యుద్ధాలు చేయవలసి వచ్చేది. కనుక అయన కత్తి రక్తాన్ని కురిపించేది. కవిగారి కలము అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది. రాజుగారు ఈ ప్రపంచం మొత్తాన్ని పరిపాలించారు. కవిగారి రచనల వలన చదివిన వారికి ఆనందం, మరణించాక పుణ్య ఫలం లభించేది. ఈ లోకాన్ని పై లోకాన్ని కూడా కవి ఏలగలిగాడు.
1. కవి కత్తి రక్తాన్ని కురిపించేది. ( )
జవాబు: ( తప్పు )
2. రాజు తరచు యుద్ధాలు చేసేవాడు. ( )
జవాబు: ( ఒప్పు )
3. రాజు రచనలు ఆనందం కలిగిస్తాయి. ( )
జవాబు: ( తప్పు )
4. కవి ఈ లోకాన్ని, పై లోకాన్ని ఏలగలిగాడు. ( )
జవాబు: ( ఒప్పు )
5. రాజు ఈ ప్రపంచాన్ని పరిపాలించాడు. ( )
జవాబు: ( ఒప్పు )
ఆ) కింది వాక్యాలకు ప్రశ్నలు తయారుచేయండి.
1. రాజు గారు, యుద్ధాలు చేయవలసి వచ్చేది.
జవాబు:
ఎవరు తరచూ యుద్ధాలు చేయవలసి వచ్చేది ?
2. కవిగారి కలము అమృతం వంటి చల్లనైన రచనలు అందించేది.
జవాబు:
కవి గారి కలము ఎటువంటి రచనలు అందించేది?
3. ఈ లోకాన్ని పై లోకాన్ని కూడా కవి ఏలగలిగాడు.
జవాబు:
ఈ లోకాన్ని పైలోకాన్ని కూడా ఎవరు ఏలగలిగాడు?
ఇ) పాఠం ఆధారంగా ఖాళీలను పూరించండి.
1. పై పద్యాలలో కురియు అనే అర్థం వచ్చే పదం ఏది? ______
జవాబు: వరించు
2. కవి కలము నుంచి ఏమి పుట్టాయి?
జవాబు: సుధలు
3. అధికారం, ధనం తో కూడినది ఏది?
జవాబు: రాజదండం
4. ఎవరి ఇల్లు రతనాలతో కూడి ఉంది? _____
జవాబు: రాజుగారి ఇల్లు
Textbook Page No. 88
ఈ) గేయ పంక్తులను సరిచేసి రాయండి.
ప్రశ్న 1.
రక్తంబు రాజు వర్షించు చేతి కత్తి
జవాబు:
రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు
ప్రశ్న 2.
గురియు చేతి కలము సుధలు సుకవి
జవాబు:
సుకవి చేతి కలము సుధలు కురియు
ప్రశ్న 3.
యావత్ప్రపంచంబు అతడేలగలుగు
జవాబు:
అతడేలగలుగు యావత్ర్పపంచంబు
ప్రశ్న 4.
పరము నీతడేలగలుగు ఇహము
జవాబు:
నీతడేల గలుగు ఇహము పరము
ఉ) కింది వాక్యాలు పాఠంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించి గీత గీయండి
1. భక్తితోడు కవిని ప్రస్తుతింత్రు
జవాబు: 4వ పద్యంలో – 2వ వాక్యం
2. రాజు జీవించే రాతి విగ్రహములందు
జవాబు: 6వ పద్యంలో – 3వ వాక్యం
3. కవియును రాజిద్ధరాత్మ గౌరవ కముల్
జవాబు: 3వ పద్యంలో – 4వ వాక్యం
4. పూరి గుడిసెలోన పుట్టె నొకడు
జవాబు: 1వ పద్యంలో – 2వ వాక్యం
ఊ) కింది పేరా చదివి ఖాళీలు పూరించండి.
ఒకనాడు గజనీ మహమద్ నిండు కొలువులో మహాకవి యైన పిరదౌసిని పిలిచి తన విజయ – యాత్రలను గ్రంథంగా రచించమన్నాడు. పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తానన్నాడు. కవి సరే
అన్నాడు. ముప్పయి సంవత్సరాలు శ్రమించి అరవై వేల పద్యాలతో “షానామా” అనే గ్రంథం రచించాడు కవి. సభా మధ్యంలో రాజుగారికి అందజేశాడు. కాని రాజు బంగారు నాణాలకు బదులు వెండి నాణాలు ఇచ్చాడు. బాధపడిన కవి రాజుగారిని నిందిస్తు కొన్ని పద్యాలు రాశాడు. రాజు తప్పుగ్రహించి బంగారు నాణాలు పంపాడు
1. పై కథలో రాజు పేరు. ________
జవాబు: గజనీ మహమద్
2. కవి రాసిన గ్రంథం పేరు .________
జవాబు: షానామా.
3. గ్రంథం రాయడానికి ________ సంవత్సరాల కాలం పట్టింది.
జవాబు: ముప్పయి సంవత్సరాలు.
4. ‘కొలువు అనే పదానికి సమాన అర్థం ఇచ్చే పదం ఇదే పేరాలో ఉంది. వెతికి రాయండి ______
జవాబు: సభ
Textbook Page No. 89
5. ఈ పేరాకు తగిన శీరిక సూచించండి. ____________
జవాబు: కష్టఫలం, పశ్చ్యాత్తాపం, రాజు – కవి (ఏదైనా ఫరవాలేదు)
6. పై పేరాలో సంయుక్తాక్షరాలున్న పదాలను వెదికి రాయండి.
విజయయాత్ర _____ _____ ______
____ ____ ____ _____ _____
జవాబు:
యాత్ర గ్రంథం పద్యం ఇస్తానన్నాడు సంవత్సరాలు శ్రమించి మధ్యంలో నిందిస్తూ.
పదజాలం
అ) కింది పదాలకు అర్థం రాసి సొంతవాక్యంలో రాయండి
1. సౌధం : భవనం
ఉదా : మా ఊళ్ళో ఎత్తైన భవనాలు ఉన్నాయి.
2. శతం : ______
_____________
జవాబు:
వంద, ఎన్నో
మా తోటలో ఎన్నో పూలు పూశాయి.
3. సుధ : ____________
______________
జవాబు:
అమృతం
దేవతలు అమృతం తాగారు.
4. తార : _____
____________
జవాబు:
నక్షత్రం
ఆకాశంలో నక్షత్రాలు మిణుకు మిణుకు మంటూ ఉంటాయి.
5. గగనం : ____
____________
జవాబు:
ఆకాశం
ఆకాశం ఎన్నో వింతలకు విడ్డూరాలకు ఆలవాలం.
ఆ) కింది పదాలకు పర్యాయపదాలు(అదే అర్థం ఇచ్చే ఇతర పదాలు) రాయండి:
ఇల్లు – నివాసం, గృహం
ధనం : ______, ______
జవాబు:
సంపద, సొత్తు, డబ్బు
కత్తి : _____, _____
జవాబు:
ఆయుధం, విలువైన, పదునైన, చాకు, బాకు
ప్రపంచం : ____, ______
విశ్వం, భువనము, లోకము
తార : ____, ____
జవాబు: నక్షత్రం, చుక్కలు
Textbook Page No. 90
ఇ) కింది పదాల ఆధారంగా చివర ‘లం’ వచ్చే పదాలు రాయండి
జవాబు:
స్వీయరచన
కింది ప్రశ్నలకు జవాబులు రాయండి
ప్రశ్న 1.
రాజును ప్రజలు ఎలా గౌరవించారు?
జవాబు:
‘అధికారాన్ని చూసి, ధనాన్ని చూసి రాజును ప్రజలంతా గౌరవించారు. రాజుగారి గుర్తుగా రాజ్యంతటా రాతి విగ్రహాలు చెక్కించి నిలిపి గౌరవించారు.
ప్రశ్న 2.
రాజు మరణిస్తే ఏమి జరిగింది?
జవాబు:
రాజు మరణిస్తే ఒక తార రాలిపోతుంది, అని అనుకున్నారు. రాజుగారి గుర్తుగా రాజ్యమంతటా రాతి విగ్రహాలు చెక్కించి నిలిపారు.
ప్రశ్న 3.
పూరిగుడిసెలో పుట్టినవాడు ఏమయ్యాడు?
జవాబు:
పూరి గుడిసెలో పుట్టినవాడు కవి అయినాడు. ప్రజలందరిచేత గౌరవించబడ్డాడు. మరణించాక కూడా ఆకాశంలో ధ్రువతారలా ప్రకాశించాడు. శాశ్వత కీర్తిని పొందాడు. ప్రజల నాలుకలపై జీవించే ఉన్నాడు.
ప్రశ్న 4.
రాజుకు, కవికి గల తేడాలను పట్టికలో రాయండి?
జవాబు:
Textbook Page No. 91
సృజనాత్మకత
పాఠంలో రాజు – కవి వీరిలో ఎవరు గొప్పవారో తెలుసుకున్నారు కదా! ఒక రోజు కొంగ కాకిని చూసి నీకన్నా నేనే గొప్ప అన్నది. అప్పుడు వాటి మధ్య జరిగే సంభాషణను రాయండి.
కొంగ : నేను తెల్లగా అందంగా, ఉంటాను.
కాకి : నా నలుపే నాకు అందం
కొంగ : నేను ఒంటికాలు మీద ఉండగలను
కాకి : నాకు నిశిత పరిశీలన ఎక్కువ
కొంగ : నేను నీటి పైన ఉండగలను
కాకి : నేను వేడిని తట్టుకోగలను
కొంగ : నన్ను చూడటానికి ప్రజలు వస్తారు
కాకి : జనానికి నేను మేలు చేస్తాను.
ఈ విధంగా ఎవరికి వారే గొప్ప అని నిరూపించుకున్నారు.
ప్రాజెక్టు పని
మీ ఉపాధ్యాయుని సహాయంతో పాఠశాల వార్షికోత్సవానికి ఏ సామగ్రి కొనవలసి వస్తుందో పట్టిక తయారు చేయండి.
జవాబు:
విద్యార్థికృత్యము.
భాషాంశాలు
పాఠంలోని నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియా పదాలను గుర్తించి ఈ కింది పట్టికలో రాయండి.
జవాబు:
కవి పరిచయం
కవి : గుర్రం జాషువా కాలము : (28-09-1895 – 27-07-1971) రచనలు : ‘పిరదౌసి’, ‘గబ్బిలము’, ‘క్రీస్తు చరిత్ర’ విశేషాలు : ప్రశస్తమైన పద్యశిల్పం, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల పట్ల అపారమైన ప్రేమ, సామజిక అసమానతల పట్ల ఆగ్రహం జాషువా కవిత్వ లక్షణాలు. గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు. నవయుగ కవి చక్రవర్తి, కళాప్రపూర్ణ
బిరుదులున్నాయి.
పదాలు – అర్థాలు
సౌధం = భవనం
ప్రబలటం = ఎక్కువ కావటం
శతం = నూరు, వంద
ధనమయం – = ధనంతో నిండినది
గండవితతిమయం = రాళ్లతో నిండినది
ప్రస్తుతింతురు = పొగుడుతారు
ఇహం = ఈ లోకం
గగనం = ఆకాశం
జన్మించటం = పుట్టటం
సుకవి = మంచి కవి
రాజదండం = రాజశాసనం
రుచిమయం = కాంతి తో నిండినది
ఆత్మగౌరవకాములు = తమ గౌరవాన్ని కోరుకొనేవారు
సుధ = అమృతం
పరం = పరలోకం
తార = నక్షత్రం
ఈ మాసపు గేయం
వెయ్యేళ్ళకవినోయ్
వేయి సంవత్సరాల్ వెనకాల కవినోయ్
వేయి సంవత్సరాల్ పోయాక కవినోయ్
వేదాల ఋక్కులో పాడాను నేనోయ్
వాల్మీకి గొంతులో ప్రవహించినానోయ్
|| వేయి॥
వ్యాసర్షి గీతిలో ప్రజ్వరిల్లానోయ్
కవి గుణాధ్యుని రక్తకణమునూ నేనోయ్
కాళిదా’సా’నంద కంపిత స్వరమునోయ్
ఆంధ్రకవి భవభూతి అమృత శోకాన్నోయ్
||వేయి॥
తిక్కన్న తెలుగులా తీర్పునైనానోయ్
ఈనాటి పాటలో ఇమిడిపోయానోయ్
అన్ని బాసల వన్నె చిన్నె లైనానోయ్
ఆశాంతములవరకు ఆవరిచానోయ్
|| వేయి ||
కవి పరిచయం
కవి : అడివి బాపిరాజు
కాలము’ : ( 15-01-1887 – 16-01-1943)
రచనలు : ‘నారాయణరావు’, ‘హిమబిందు’, ‘గోన గన్నారెడ్డి’, ‘శశికళ’, ‘గంగిరెద్దు’
విశేషాలు : అడవి బాపిరాజు కవి, నవలాకారుడు. కథకుడు, చిత్రకారుడు.
ఈ మాసపు కథ
దెబ్బకు దెబ్బ
ఒక రైతు ఉండేవాడు. అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొని వచ్చి పట్టణంలో అమ్మేవాడు. ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషించుకొనేవాడు. ఒకరోజు కట్టెలుకొట్టి బండినిండా వేసుకొని పట్టణానికి వస్తున్నాడు రైతు. ఒక వ్యాపారి ఎదురై కట్టెలు బేరం చేశాడు. ఈ కట్టెలబండి ఎంతకిస్తావని అడిగాడు. రైతు 20 రూపాయలన్నాడు.
‘సరే నాతో రా’ అన్నాడు వ్యాపారి. రైతు బండి తోలుకొని వ్యాపారి వెంట అతని ఇంటికి వెళ్లాడు. అక్కడ కట్టెలుదించాడు. వ్యాపారి ఇరవై రూపాయలు ఇచ్చాడు.
రైతు ఖాళీ బండి తోలుకొని వెళ్లబోతుంటే వ్యాపారి ఆపాడు, “అదేంటి రైతన్నా! నా బండి తీసుకొని ఎక్కడికి పోతున్నావ్? కట్టెలతో పాటు బండి కూడా కొనుక్కున్నాను కాదా!”
“అదెట్లా ” అన్నాడు రైతు.
“ఎట్లా ఏమిటి. ఇట్లానయ్యా” అంటూ వ్యాపారి వివరించాడు.” ఈ కట్టెల బండికి నన్ను ఇరవై రూపాయలడిగావా, లేదా?” “అడిగాను” “నీకు ఇరవై రూపాయలు ఇచ్చానా?” “ఇచ్చావు”
“అయితే చెప్పు. ఈ బండి నాదై పోయింది కదా!” అంటూ .. వ్యాపారి బండి లాక్నున్నాడు. అమాయకుడైన రైతు తలవంచుకొని ఇంటికి వెళ్లిపోయాడు. రైతుకు ఒక కూతురు ఉంది. చాలా తెలి పైన పిల్ల, తండ్రి నడిగి కథంతా తెలుసుకుంది. వ్యాపారికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు కొన్ని ఎండు మోపు కట్టుకుని అమ్మడానికి వ్యాపారి ఇంటికి వెళ్లింది.
“షావుకారు గారూ! కొన్ని ఎండుకట్టెలున్నాయి. కొంటారా?”
” ఎంత ” “రెండు గుప్పిళ్లు ధాన్యం”. వ్యాపారికి బేరం చాలా లాభసాటిగా కనిపించింది. కట్టెలమోపు తీసుకున్నాడు. ఆ అమ్మాయికి రెండు గుప్పిళ్ల ధాన్యం ఇవ్వబోయాడు.
“షావుకారుగారూ! ధాన్యాంతోపాటు మీరెండు గుప్పిళ్లూ కూడా కోసి ఇవ్వండి”.
అమె మాటలు విని వ్యాపారి చకితుడయ్యాడు. “అంటే అర్థమేమిటి?”
” ఏముందిందులో ఆర్థం కాకపోవడానికి. రెండు గుప్పిళ్ల ధాన్యానికి మీరు కట్టెలు కోన్నారా, లేదా?”
“అవును” “మరి ఇవ్వండి. ధాన్యంతో పాటు మీ రెండు గుప్పిళ్లూ కూడా కోసి ఇవ్వండి. నేను సరిగ్గానే చెప్పానా?” “అదెట్లా” గట్టిగా కేకలు వేశాడు వ్యాపారి. “ధాన్యంతో పాటు ఎవరైనా తమ గుప్పిళ్లు కూడా కోసి ఇస్తారా?” ” ఎందుకు ఇవ్వకూడదు?” “కాని, ఎట్లా?”
అమ్మాయి అంది, “మా నాన్న కట్టెలతో పాటు బండి కూడా మీకు ఇవ్వలేదూ! అట్లాగే. మరచి పోయారా?” అమె మాటలు విన్న వ్యాపారి తల సిగ్గుతో వంగిపోయింది. ఆమెకు క్షమాపణ చెప్పి బండి ఇచ్చేశాడు.