Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 5th Lesson వ్యవసాయం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class EVS Solutions Lesson 5 వ్యవసాయం
I. విషయావగాహన:
ప్రశ్న 1.
వ్యవసాయం అనగానేమి?
జవాబు:
వ్యవసాయం అనగా మొక్కల పెరుగుదలకు, ఫల సాయానికి చేపట్టే చర్యలు. దీనిలో నేలను మొదటగా మొక్కల పెంపకానికి అనుగుణంగా తీర్చిదిద్ది ఆహారంను ఉత్పత్తి చేయు ప్రక్రియ ఉంటుంది.
ప్రశ్న 2.
రసాయన ఎరువులు, పురుగు మందులు ఉపయోగించటం మంచిదా? కాదా? ఎందుకు?
జవాబు:
క్రిమి కీటకాల నుంచి పంటలను రక్షించుకొనుటకు రసాయన ఎరువులు, పురుగుమందులను ఉపయోగిస్తారు. కానీ విచక్షణా రహితంగా క్రిమిసంహారకాల వాడుక పర్యావరణానికి హానికరం. మరియు కాన్సర్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది. కావున వాటి వాడకం మంచిది కాదు.
ప్రశ్న 3.
ఆహార ధాన్యాలు నిల్వ చేయడం వల్ల ఉపయోగాలేంటి?
జవాబు:
ఆహార ధాన్యాలు నిల్వచేయడం వల్ల ఉపయోగాలు :
- ఆహార ధాన్యాలు నిల్వ చేయడం ద్వారా వాటిని సంవత్సరమంతా వాడుకోవచ్చు.
- నిల్వ చేసిన ఆహార ధాన్యాన్ని మంచి. ఆదాయ వనరుగా వాడవచ్చు.
- భవిష్యత్ అవసరాలకు వాడుకోవచ్చు.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
వరి పంట గురించి తెలుసుకోవటానికి మా గ్రామంలో రైతుని ఈ క్రింది ప్రశ్నలు అడుగుతాను.
జవాబు:
- వ్యవసాయంలో దశలేవి?
- అన్ని రకాల పంటలు వరి, ప్రత్తి, మామిడి వంటివి పండించుటకు ఒకే రకమైన పద్ధతులు పాటిస్తారా?
- వ్యవసాయానికి ఉపయోగించే సాధనాలేవి?
- మంచి ఫలసాయానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
మీ ఇంటి పెరటిలో ధనియాలు, మెంతులు విత్తనాలు వేయండి. రెండు వారాల పాటు వాటి పెరుగుదలను పరిశీలించండి. మొక్కల పొడవులను కొలిచి మీ నోటు పుస్తకంలో నమోదు చేయండి.
జవాబు:
విద్యార్ధి కృత్యము.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:
ప్రశ్న 6.
మీ పరిసరాలలో ఉన్న రైతుల వద్దకు వెళ్ళి క్రింది పట్టికలో పొందు పరిచిన అంశాలను – సేకరించి రాయండి.
జవాబు:
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
కప్ప, సీతాకోక చిలుక జీవిత చక్రాలను గీయండి.
జవాబు:
VI. ప్రశంస:
అ) పేపరు కప్పులలో పెసలు, ఆవాలు, మినుములు, మిల్లెట్స్, నువ్వులు మొదలైనవి పెంచండి. మీ అమ్మ సహాయంతో మంచి ఆహార పదార్థాన్ని తయారు చేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
ఆ) మనం తినే ఆహారం వెనుక పని చేసే వ్యక్తులు, సంస్థలతో మైండ్ మ్యాసను నింపండి.
జవాబు:
అదనపు ప్రశ్నలు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
వరి పండించటంలోని దశలేవి ?
జవాబు:
వరి పండించడంలోని దశలు :
- పొలం దున్నటం
- చదును చేయటం
- నాట్లు వేయటం
- నీరు పెట్టడం
- ఎరువు పెట్టడం
- పంటను భద్ర పరచటం
- పంట కోయటం
- పంట నూర్చటం
- తూర్పార బట్టడం
- పంట నిలువ చేయటం
- మర పట్టడం
ప్రశ్న 2.
పంటలకు నీటి పారుదలకు ఉపయోగించే పద్దతులేవి ?
జవాబు:
పంటపొలానికి నీటిని సరఫరా చేయటాన్ని “నీటిపారుదల” అంటారు. వ్యవసాయానికి నీరు సరఫరా నాలుగు పద్ధతుల్లో చేస్తారు. అవి
- క్షేత్ర నీటి పారుదల
- చాళ్ళు నీటిపారుదల
- స్ప్రింక్లర్ నీటిపారుదల
- బిందు సేద్యం.
1. క్షేత్ర నీటిపారుదల :
వర్షపాతం తగినంతగా లేనప్పుడు ఈ విధానం ద్వారా పొలానికి నీరు సరఫరా చేస్తారు.
2. చాళ్ళు నీటిపారుదల :
ఈ విధానంలో చాళ్ళు మరియు కందకాలు తవ్వివాటి ద్వారా నీరు సరఫరా చేస్తారు.
3. స్ప్రింక్లర్ నీటిపారుదల :
ఈ విధానంలో నియంత్రిత పద్ధతిలో ప్రత్యేక పైపుల ద్వారా వర్షం వలే నీటిని చల్లుతారు.
4. బిందు సేద్యం :
నీటి గొట్టానికి చిన్న చిన్న రంధ్రాలు చేసి నేలపై ఉంచుతారు. నీరు ఈ రంధ్రాల ద్వారా నేరుగా పంట మొక్కల వేళ్ళకు చేరుతుంది.
ప్రశ్న 3.
వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లు ఏమిటి ?
జవాబు:
నాగలి, గడ్డపార, విత్తనాలగొర్రు, కొడవలి, వరినాట్ల యంత్రం, కోతయంత్రం మొదలైనవి.
ప్రశ్న 4.
సేంద్రీయ వ్యవసాయం అనగానేమి? ప్రయోజనాలేమిటి?
జవాబు:
పశువుల వ్యర్థాలు, వర్మికంపోస్ట్, నూనె చెక్క మరియు జీవ వ్యర్ధాలను ఎరువుగా ఉపయోగించే సహాజ మరియు సాంప్రదాయ వ్యవసాయ పద్ధతిని “సేంద్రీయ వ్యవసాయం” అంటారు. ప్రయోజనాలు :
- పర్యావరణం పరిరక్షించబడును.
- నీటిని పొదుపు చేస్తుంది.
- నేలకోతను తగ్గిస్తుంది.
- నేలసారాన్ని పెంచును.
ప్రశ్న 5.
వరి జీవిత చక్రాన్ని గీయండి.
జవాబు:
ప్రశ్న 6.
వరిసాగులో దశలను తెలిపే క్రింది చిత్రాలను క్రమ పద్ధతిలో అమర్చండి.
జవాబు:
విద్యార్ధి కృత్యము.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
మనం ………. ఆహారాన్ని తీసుకోవాలి.
(A) ఆరోగ్యాన్నిచ్చే
(B) అనారోగ్యకరమైన
(C) A మరియు B
(D) ఏదీకాద
జవాబు:
(A) ఆరోగ్యాన్నిచ్చే
ప్రశ్న 2.
…………………. మనకు శక్తిని, ఆరోగ్యా న్నిస్తుంది
(A) పొలం
(B) పని
(C) ఆహారం
(D) ఏదీకాదు
జవాబు:
(C) ఆహారం
ప్రశ్న 3.
కప్ప పిల్లను ………….. అంటారు.
(A) కప్ప
(B) టాడ్ పోల్
(C) కాటర్ పిల్లర్
(D) ఏదీకాదు ప్రశ్న
జవాబు:
(B) టాడ్ పోల్
ప్రశ్న 4.
సేంద్రీయ వ్యవసాయాన్ని …………. అంటారు.
(A) కృత్రిమ వ్యవసాయం
(B) జీరో బడ్జెట్ నాచరల్ ఫార్మింగ్
(C) వ్యవసాయం
(D) ఏదీకాదు.
జవాబు:
(B) జీరో బడ్జెట్ నాచరల్ ఫార్మింగ్
ప్రశ్న 5.
క్రిమిసంహారకాల వాడకం ………… కు దారి తీస్తుంది.
(A) మొక్కలు
(B) పంటలు
(C) కాలుష్యం
(D) ఏదీకాదు
జవాబు:
(C) కాలుష్యం
ప్రశ్న 6.
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ఆహార పంట… ………..
(A) వరి
(B) గోధుమ
(C) జొన్న
(D) పప్పుధాన్యాలు
జవాబు:
(A) వరి
ప్రశ్న 7.
…………. % ప్రజల ముఖ్యవృత్తి వ్యవసాయం.
(A) 60 %
(B) 62 %
(C) 70 %
(D) 40 %
జవాబు:
(B) 62 %
ప్రశ్న 8.
భారతదేశంకు వరి, గోధుమలు పండించటంలో ………… స్థానం ఉంది.
(A) మొదటి
(B) రెండవ
(C) మూడవ
(D) ఏదీకాదు
జవాబు:
(B) రెండవ
ప్రశ్న 9.
మనకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు ……………
(A) కార్బోహైడ్రేట్స్
(B) ప్రొటీన్స్
(C) మినరల్స్
(D) ఏదీకాదు
జవాబు:
(A) కార్బోహైడ్రేట్స్
ప్రశ్న 10.
అన్ని రకాల పోషకాలు సమపాళ్ళలో ఉన్న ఆహారాన్ని …………. అంటారు
(A) సమతులాహారం
(B) భోజనం
(C) ఆహారం
(D) ఏదీకాదు
జవాబు:
(A) సమతులాహారం