Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 6th Lesson నీరు ఎంతో విలువైనది Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class EVS Solutions Lesson 6 నీరు ఎంతో విలువైనది
I. విషయావగాహన:
ప్రశ్న 1.
నదుల వలన ఉపయోగాలలేవి ?
జవాబు:
నదుల వలన ఉపయోగాలు :
- వ్యవసాయానికి కావలసిన నీటి సరఫరాకు.
- త్రాగునీరుకు గాను
- రవాణా మార్గము గాను
- జలవిద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది.
- జల విహారం మరియు ఈత కొట్టుటకు ఉపయోగపడును.
ప్రశ్న 2.
కృష్ణానది ఉపనదులేవి?
జవాబు:
భీమ, గాయత్రి, ఘటప్రభ, కోయన, మలప్రభ, మున్నేరు, నిరపాలెం, పంచగంగ, తుంగభద్ర, వేమన, వ్యర నదులు కృష్ణానదికి ఉపనదులు.
ప్రశ్న 3.
నీటి కాలుష్యం గురించి క్లుప్తంగా రాయండి.
జవాబు:
మానవులు చేసే వివిధ పనులవల్ల నీటి కాలుష్యం ఔతుంది. పరిశ్రమల వ్యర్థాలు, పాల పరిశ్రమలు, వ్యవసాయ వ్యర్ధాలు, బొగ్గు విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే వ్యర్ధాలన్నీ నదులలోకి నేరుగా విడుదల చేయటం వల్ల నది నీరు కలుషితమగును. అట్టి నీరు త్రాగటానికి పనికిరాదు. ఆ నీటి వల్ల జలచరాలు జీవాన్ని కోల్పోతాయి. కలరా, టైఫాయిడ్, కామెర్లు, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతాయి.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
నదులు ఎండిపోవటానికి కారణాలేంటి?
జవాబు:
- ప్రధానంగా వాతావరణ మార్పులు నదులు ఎండిపోవటానికి కారణం.
- డామ్ నిర్మాణం
- నదులలో నీటిని వ్యవసాయానికి వాడటం వల్ల నదులు ఎండిపోతాయి. .
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
వివిధ నీటి వనరులు నుంచి నీటిని సేకరించి ఏ నీరు త్రాగటానికి అనుకూలంగా ఉందో చర్చించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:
ప్రశ్న 6.
కరువులు, వరదలకు ప్రజలు ఏవిధంగా ప్రభావితమయ్యారో పెద్దవాళ్ళ నుంచి పమాచారాన్ని సేకరించండి.
జవాబు:
- పంట పొలాలు పంటలు పండుటకు పనికి రాకుండాపోతాయి.
- పశువులు త్రాగటానికి, వ్యవసాయానికి నీరు లభ్యమవదు.
- అది కరువుకు, పశునష్టానికి దారితీస్తుంది.
- చాలా వ్యవసాయాధార కుటుంబాలు జీవనాధారం లేక వలసపోతారు.
V. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
నీటిని ఎలా పొదుపు చేస్తామో పోస్టర్‌ను తయారు చేసి మీ తరగతి గదిలో ప్రదర్శించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
VI. ప్రశంస:
ప్రశ్న 8.
నదుల కాలుష్యం నివారణపై కొన్ని నినాదాలు రాయండి.
జవాబు:
- ” నిర్మలంగా ఆలోచించండి – పచ్చదనం వైపు పయనించండి”.
- ” మీ నీటిని మార్చండి – జీవితాన్ని మార్చుకోండి”.
- ” మీరు. కాలుష్యం చేసే నీరు తిరిగి మీపై ప్రభావం చూపుతుంది”.
అదనపు ప్రశ్నలు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
ఆనకట్టలు అనగానేమి? వాటి ప్రయోజనాలేవి?
జవాబు:
జలాశయాలలో నీటిమట్టం పెంచటానికి నదీ వాలుకి అడ్డుగా నీటిని నిల్వ ‘చేయుటకు నిర్మించబడిన అడ్డుకట్టను “ఆనకట్ట” అంటారు. ప్రయోజనాలు : –
- త్రాగటానికి, నీటి పారుదలకు, విద్యుత్ ఉత్పత్తి మొదలైన వాటికి , ఉపయోగపడతాయి.
- వరదల నియంత్రణ, వ్యర్థాల నిర్వహణ, అనేక జంతువులకు ఆవాసంగా జల విహారంకు, ఈత కొట్టుటకు ఉపయోగపడతాయి.
ప్రశ్న 2.
కృష్ణానది గురించి వ్రాయండి?
జవాబు:
- భారతదేశంలోని పొడవైన నదులలో కృష్ణానదిది నాల్గవ స్థానం.
- ఇది మహారాష్ట్ర పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వరంలో జన్మించింది.
- దీని పొడవు 1400 కిలోమీటర్లు.
- ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి చివరగా కృష్ణాజిల్లా హంసల దీవి వద్ద సముద్రంలో (బంగాళాఖాతం) లో కలుస్తుంది.
- దీని ఉపనదులు భీమ, గాయత్రి, ఘటప్రభ, మలప్రభ, మున్నేరు పంచగంగ, తుంగభద్ర మొ||వి.
II. మాపింగ్ నైపుణ్యం:
ప్రశ్న 3.
ఆంధ్రప్రదేశ్ పటం చూసి క్రింది పట్టికను పూరించండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 4.
మునగటం – తేలడం ప్రయోగం. ఇది చేసి కనుక్కొందాం.
జవాబు:
- ఒక కుండ లేదా ‘బకెట్’ కొంత నీటితో నింపండి.
- కింద ఇచ్చిన జాబితా. ప్రకారం వస్తువులు సేకరించండి.
- నీటిలో ఒక్కొక్కటి వేసి గమనించండి.
- నీటిలో వేసే ముందు వస్తువు నీటిలో మునుగుతుందో తేలుతుందో ఊహించండి. కింది పట్టికలో రాయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
నీటిని నిల్వ చేయుటకు …………………… ను నిర్మిస్తారు.
(A) ఆనకట్ట
(B) రిజర్వా యర్
(C) A మరియు B
(D) ఏదీకాదు
జవాబు:
(C) A మరియు B
ప్రశ్న 2.
కృష్ణానది జన్మస్థానం మహారాష్ట్రలోని ……………………
(A) బోంబే
(B) పూసే
(C) మహాబలేశ్వరం
(D) షిరిడీ
జవాబు:
(C) మహాబలేశ్వరం
ప్రశ్న 3.
ఈ క్రింది వాటిలో మానవ జీవితంపై దుష్ప్రభావాన్ని చూ పే ……………………
(A) కరువు
(B) క్షామం
(C) వరదలు
(D) పైవన్నీ
జవాబు:
(D) పైవన్నీ
ప్రశ్న 4.
నీటి వనరులకు ముఖ్య మైన జలవనరు ……………………
(A) వర్షం
(B) నది
(C) కొలను
(D) టాంక్
జవాబు:
(A) వర్షం
ప్రశ్న 5.
సఆర్థర్ కాటన్ బారేజ్ ఏ నదిపై, ఎచ్చట నిర్మించారు.
(A) గోదావరి, విజయవాడ
(B) గోదావరి, ధవళేశ్వరం
(C) క్రిష్ణా, ధవళేశ్వరం
(D) క్రిష్ణా, విజయవాడ
జవాబు:
(B) గోదావరి, ధవళేశ్వరం
ప్రశ్న 6.
…………………… ఒక పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు.
(A) నాగార్జున సాగర్ డామ్
(B) ప్రకాశం బారేజ్
(C) ధవళేశ్వరం
(D) ఏదీకాదు
జవాబు:
(A) నాగార్జున సాగర్ డామ్
ప్రశ్న 7.
…………………… సం||లో నాగార్జున సాగర్ డ్యాం నిర్మించారు.
(A) 1962
(B) 1967
(C) 1954
(D) ఏదీకాదు
జవాబు:
(B) 1967
ప్రశ్న 8.
నాగార్జునసాగర్ కుడి కాలువ, ఎడమ కాలువ పేర్లు వరుసగా ……………………
(A) జవహార్ కాలువ, లాల్ బహదూర్ కాలువ
(B) లాల్ బహదూర్ కాలువ, జవహార్ కాలువ
(C) కుడి కాలువ, జవహార్ కాలువ
(D) ఏదీకాదు
జవాబు:
(A) జవహార్ కాలువ, లాల్ బహదూర్ కాలువ
ప్రశ్న 9.
ప్రకాశం బ్యా రేజ్ ఏ నదిపై నిర్మించిరి ……………………
(A) గోదావరి
(B) పెన్నా
(C) కృష్ణా
(D) ఏదీకాదు
జవాబు:
(C) కృష్ణా
ప్రశ్న 10.
ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి ……………………
(A) కందుకూరి వీరేశలింగం
(B) టంగుటూరి ప్రకాశం
(C) గాంధీ
(D) ఎవరూకాదు
జవాబు:
(B) టంగుటూరి ప్రకాశం