Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 8th Lesson ప్రపంచాన్ని చూసి వద్దాం Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class EVS Solutions Lesson 8 ప్రపంచాన్ని చూసి వద్దాం
I. విషయావగాహన:
ప్రశ్న 1.
విదేశాలకు వెళ్లటానికి ఉపయోగించే రవాణా వ్యవస్థల పేర్లు రాయండి..
జవాబు:
మనం విదేశాలకు వెళ్ళటానికి అంతర్జాతీయ రవాణా వ్యవస్థను ఉపయోగిస్తాం. విదేశాలకు వెళ్ళటానికి వాయుమార్గాలు, జల మార్గాలు ప్రధానమైనవి. ఎక్కువ మంది విమానంలో ప్రయాణించటానికి మొగ్గు చూపుతారు కారణం తక్కువ సమయం పడుతుంది. తక్కువ ఖర్చు కోరుకునేవారు. ఓడలలో ప్రయాణిస్తారు, కానీ ఎక్కవ సమయం పడుతుంది.
ప్రశ్న 2.
ప్రజలు విదేశాలకు ఎందుకు వెళతారు?
జవాబు:
ప్రజలు వివిధ అవసరాల కోసం విదేశాలకు వెళతారు. కొందరు వ్యాపారం నిమిత్తం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం, ఆటలు,ఆడటంకోసం మరికొందరు విదేశాలు సందర్శనకోసం వెళతారు.
ప్రశ్న 3.
ఎగుమతులు మరియు దిగుమతులు అంటే ఏమిటో వివరించండి?
జవాబు:
ఎగుమతి :
ఒక దేశంలో దొరికే లేదా తయారు చేసే ఉత్పత్తులు లేక సరుకులు అధికంగా ఉంటే అవి ఇతర ప్రదేశాలకు పంపబడతాయి. ఈ పద్ధతిని ‘ఎగుమతి’ అంటారు. ఎగుమతిద్వారా విదేశీ కరెన్సీ లభిస్తుంది. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.
దిగుమతి :
ఒక ప్రదేశంలో దొరకని మరియు అవసరమైన ఉత్పత్తులను ఇతర ప్రదేశాల నుంచి తెప్పించు కొనుటను ” దిగుమతి” అంటారు.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
ఆపిల్ పండ్లు మీ గ్రామంలో లభించక పోవడంపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ అమ్మను నీవు ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
- అమ్మ మన ఊరిలో ఆపిల్ తోటలు ఉన్నాయా?
- మనకు ఆపిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి?
- ఆపిల్ తోటల పెంపకానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఏమిటి?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
మీ దగ్గరలోని వరి పండించే పొలాన్ని సందర్శించండి. అక్కడ ధాన్యం బస్తాల ఎగుమతిలో జరిగే ప్రక్రియను గమనించి ఒక నివేదిక తయారు చేయండి.
జవాబు:
విద్యార్ధి కృత్యము.
ప్రశ్న 6.
మీ గ్రామంలో / మీ గ్రామం చుట్టూ పక్కల లేదా దగ్గర పట్టణంలో ప్రముఖ పర్యాటక స్థలాలు వివరాలు సేకరించండి. ఒక ఆల్బం తయారు చేయండి.
జవాబు:
విద్యార్థి కృత్యము.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:
ప్రశ్న 7.
ఆంధ్రప్రదేశ్ పటంలో వివిద నౌకాశ్రయాలు, విమానాశ్రయాలను గుర్తించండి. వాటి పేర్లు రాయండి.
జవాబు:
మ్యాప్లోని నౌకాశ్రయాలు : విశాఖపట్నం నౌకాశ్రయం, కాకినాడ – నౌకాశ్రయం, మచిలీపట్నం – నౌకాశ్రయం.
విమనాశ్రయాలు : విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కడప, తిరుపతి విమానాశ్రయాలు
V. ప్రశంస:
ప్రశ్న 8.
విమానాశ్రయం యొక్క ప్రయోజనాలు ఏమిటి?
జవాబు:
- ఇది చాలా వేగవంత మైన రవాణా మార్గము మరియు దూరప్రయాణాలకు అనుకూలం.
- గాలి మార్గం ద్వారా ప్రయాణానికి సౌఖ్యం, సామర్ధ్యం లభిస్తాయి, మరియు సమయం.
అదనపు ప్రశ్నలు:
I. విషయావగాహన:
ప్రశ్న 1.
వివిధరకాల రావాణామార్గాలను పేర్కొనుము? ఎలాంటి రవాణా సాధనాలను ఉపయోగించి మనుషులను, వస్తువులను రవాణా చేస్తాము?
రవాణా మార్గాలలో రకాలు:
1. రోడ్డు మార్గాలు
2. రైలు మార్గాలు
3. నీటి మార్గాలు
4. వాయు మార్గాలు
జవాబు:
మనుషుల రవాణాకు వాడే పాధనాలు :
సైకిలు, మోటార్ బైక్, రైలు, ఓడ, కార్లు, విమానాలు, బన్లు మొదలైనవి.
వస్తువుల రవాణాకు వాడే సాధనాలు :
ట్రక్కులు, ఎడ్లబండి, ఓడలు, కార్గో విమానం, వ్యాగన్లు, మొదలైనవి.
ప్రశ్న 2.
గ్లోబల్ విలేజ్ అనగానేమి?
జవాబు:
- సమాచార వ్యవస్థ మరియు రవాణా వ్యవస్థ ప్రపంచాన్ని ఒక చిన్న గ్రామంగా మార్చి వేశాయి.
- సమాచార మరియు రవాణా వ్యవస్థలను అంతర్జాలం విపరీతంగా ప్రభావితం చేసి ప్రపంచాన్ని ఒక గ్రామంగా మార్చివేసింది.
- దీని వలన ప్రజల మధ్య దూరం తగ్గించబడింది. ప్రపంచంలో ఏ ప్రదేశంలో ప్రజలైనా చేరుకోదగ్గ విధంగా కనెక్ట్ చేయబడింది.
II. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:
ప్రశ్న 3.
మీ గ్రామంలో పండించే పంటలను పేర్కొనుము?
జవాబు:
విద్యార్థికృత్యము
ప్రశ్న 4.
మీ గ్రాయం నుంచి ఎగుమతి అయ్యే మరియు దిగుమతి అయ్యే వస్తువులను క్రింది పట్టికలో నమోదు చేయండి?
జవాబు:
విద్యార్థికృత్యము.
ప్రశ్న 5.
క్రింది పటంలో ని రవాణా మార్గాల పేర్లు తెల్పండి?
జవాబు:
విద్యార్థికృత్యము.
III. ప్రశంస:
ప్రశ్న 6.
ఈమె గురించి మీకు తెలుసా? ఆమె గురించి ఒక కొటేషన్ వ్రాయండి?”
జవాబు:
- ఈమె పేరు పూసర్ల వెంకట సింధు, ఈమె ఒక ప్రఖ్యాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఈమె మనదేశానికి గర్వకారణం.
- ఒలింపిక్ క్రీడలలో భారతదేశం తరపున 2016లో రజత పతకాన్ని సాధించిన మొదటి భారతీయ మహిళ. 2019 లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో బంగారు పతకాన్ని సాధించింది.
- భారత ప్రభుత్వం ఈమెను ‘పద్మభూషణ్, పద్మశ్రీ, రాజీవ్ ఖేల్ రత్న వంటి పురస్కారాల తో గౌరవించింది.
- రాష్ట్ర ప్రభుత్వం “డిప్యూటీ కలెక్టర్ ” ఉద్యోగం ఇచ్చి గౌరవించింది.
- ఆమె నుంచి నేర్చుకున్న కోటేషన్ , ” కలలుకను – కష్టపడు – సాధించు”.
బహుళైచ్ఛిక ప్రశ్నలు సూచన :
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
మనం విదేశాలకు దీనిద్వారా ప్రయాణిస్తాం …………………….
(A) వాయుమార్గం
(B) జలమార్గం
(C) A మరియు B
(D) ఏదీకాదు
జవాబు:
(C) A మరియు B
ప్రశ్న 2.
దేశ ఆర్థిక ప్రగతి దీనిపై ఆధారపడును …………………….
(A) ఎగుమతి
(B) దిగుమతి
(C) A మరియు B
(D) ఏదీకాదు
జవాబు:
(A) ఎగుమతి
ప్రశ్న 3.
మనం కావలసినవాటిని ఇతర ప్రాంతాల నుంచి ……………………. చేసుకుంటాము.
(A) ఎగుమతి
(B) దిగుమతి
(C) A మరియు B
(D) ఏదీకాదు
జవాబు:
(B) దిగుమతి
ప్రశ్న 4.
పూసర్ల సింధుకు లభించిన గౌరవం …………………….
(A) పద్మభూషణ్
(B) పద్మశ్రీ
(C) రాజీవ్ ఖేల్ రత్న
(D) పై అన్నీ
జవాబు:
(D) పై అన్నీ
ప్రశ్న 5.
రవాణా మరియు సమాచార వ్యవస్థలు ప్రపంచాన్ని ……………………. చేశాయి.
(A) గ్లోబల్ విలేజ్
(B) మొబైల్ విలేజ్
(C) A మరియు B
(D) ఏదీకాదు
జవాబు:
(A) గ్లోబల్ విలేజ్
ప్రశ్న 6.
ప్రపంచాన్ని గ్లోబల్ విలేజ్ గా మార్చిన అంశాలు …………………….
(A) రవాణా వ్యవస్థ
(B) సమాచార వ్యవస్థ
(C) A మరియు B
(D) ఏదీకాదు
జవాబు:
(C) A మరియు B
ప్రశ్న 7.
బంగాళాఖాతంలో ని సహజనౌకాశ్రయం (ఓడరేవు) …………………….
(A) విశాఖపట్నం
(B) కాకినాడ
(C) తిరుపతి
(D) ఏదీకాదు
జవాబు:
(A) విశాఖపట్నం
ప్రశ్న 8.
ఆంధ్రప్రదేశ్ లో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం …………………….
(A) గన్నవరం
(B) విశాఖపట్నం
(C) తిరుపతి
(D) ఏదీకాదు
జవాబు:
(B) విశాఖపట్నం
ప్రశ్న 9.
ఆంధ్రప్రదేశ్ లోని విమానాశ్రయాల సంఖ్య …………………….
(A) 4
(B) 6
(C) 7
(D) 9
జవాబు:
(B) 6
ప్రశ్న 10.
విదేశీ ప్రయాణాలకు కారణాలు క్రింది వాటిలో ఏవి …………………….
(A) వ్యాపారం
(B) పర్యటనకు
(C) ఆటలకు ఆ
(D) పై అన్నీ
జవాబు:
(D) పై అన్నీ