Andhra Pradesh AP Board 5th Class EVS Solutions 9th Lesson ప్రమాదాలు – ప్రథమ చికిత్స Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class EVS Solutions Lesson 9 ప్రమాదాలు – ప్రథమ చికిత్స
I. విషయావగాహన:
ప్రశ్న 1.
మనం ఎందుకు భద్రతా చర్యలు పాటించాలి?
జవాబు:
ప్రమాదాలనివారణకు పొటించే చర్యలను “భద్రతాచర్యలు”అంటారు. ప్రమాదాలను నివారించుటకు మనం కొన్ని నియమాలు, మరియు భద్రతా చర్యలు తప్పక పాటించాలి.
ప్రశ్న 2.
ప్రధమ చికిత్స అంటే ఏమిటి? ఎప్పుడు అవసరం అవుతుంది?
జవాబు:
ప్రధమ చికిత్స :
ఆసుపత్రికి వెళ్ళేలోపు బాధితుడికి అందించాల్సిన తక్షణ చికిత్సను “ప్రధమచికిత్స” అంటాం. గాయాలకు, కాలినగాయాలకు,కుక్క కాటుకు, పాముకాటుకు, తేలు కుట్టినప్పుడు, నీళ్ళలో మనిగినప్పుడు ప్రమచికిత్స అవసరం.
ప్రశ్న 3.
అపర్ల వాళ్ళ తాతయ్యను పాము కాటు వేసింది. అతనికి ఎటువంటి ప్రధమ చికిత్సను సూచిస్తావు?
జవాబు:
- మొదట కాటు వేయబడిన భాగాన్ని నిశితంగా పరిశీలించి,విష సర్పమో కాదో నిర్ధారించుకోవాలి.
- సాధారణంగా పాము కాటుకు గురైన వ్యక్తి భయంతో సృహ తప్పి పడిపోతాడు అతని భయం తగ్గించేలా మాట్లాడాలి.
- విషం శరీరంలో ఇతర భాగాలకు వ్యాపంచకుండా ఒక గుడ్డతో గాయం పై భాగంలో గట్టిగా కట్టు కట్టాలి.
- పాము కరిచిన వ్యక్తి అచేతనంలోకి పోకుండా చూడాలి. 5. వెంటనే భాదితుడిని డాక్టరు వద్దకు తీసుకు వెళ్ళాలి.
II. ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:
ప్రశ్న 4.
108 సేవలు గురించి మరింతగా తెలుసుకోవడానికి 108 సిబ్బందిని ఏయే ప్రశ్నలు అడుగుతావు?
జవాబు:
- 108 సేవలు ఎప్పుడు మొదలైనవి?
- 108 అంబలెన్స్ కి మొబైల్ ద్వారా ఎలాసమాచారం ఇవ్వాలి?
- 108 ఎందుకు ఎమర్జెన్సీ నెంబర్?
- ఎందుకు 108 నెంబర్‌నే ఇచ్చారు?
III. ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:
ప్రశ్న 5.
మీకు దగ్గరలోని ఒక ప్రమాద స్థలాన్ని సందర్శించండి. ఆ ప్రమాదం జరగటానికి కారణాలు అన్వేషించండి. మీ పరిశీలనలు నమోదు చేయండి?
జవాబు:
విధ్యార్థి కృత్యము.
IV. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:
ప్రశ్న 6.
దీపావళికి బాణా సంచా తయారు చేసే సందర్భంలో తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు చర్చించండి?
జవాబు:
- కాటన్ దుస్తులను ధరించాలి. నైలాన్ వంటి సింధటిక్ వస్త్రాలను ధరించరాదు. ఎందుకంటే అవి మంటలను తేలికగా గ్రహిస్తాయి.
- క్రాకర్ లను కాల్చేటప్పుడు తగినంత దూరంగా ఉండాలి.
- ముఖాన్ని క్రాకర్స్ వెలిగించేటప్పుడు దూరంగా ఉండాలి
- ఇంటిలోపల, రద్దీ ప్రదేశాలలో బాణాసంచాకాల్చరాదు.
- పెద్ద వారి సమక్షంలో మాత్రమే బాణాసంచా కాల్చాలి.
IV. బొమ్మలు గీయడం – నమునాలు తయారు చేయడం:
ప్రశ్న 7.
బస్సులో ప్రయాణం చేసేటప్పుడు తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను సూచిస్తూ ఒక మైండ్ మేప్ గీయండి.
జవాబు:
VI. ప్రశంస:
ప్రశ్న 8.
108 మరియు 104 సేవలను ఏవిధంగా ప్రశంసిస్తావు?
జవాబు:
- ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలలోని ఆరోగ్య పరిస్థితిని మెరుగు పరచటానికి ఉద్దేసించిన సేవలు 104 మరియు 108.
- భారతదేశంలో అత్యవసర సేవలు నిర్వహించే స్వచ్చంద సంస్థ EMRI
- 108 అనేది అత్యవసర సేవలను నిరంతరం అందించే విభాగం. ఇది వైద్య పోలీస్ మరియు అగ్నిమాపక విభాగాలకు సంబంధించినది
- 104 అనేది మనకు ఉచిత వైద్య సలహాలు అందించే సేవ.
అదనపు ప్రశ్నలు:
ప్రశ్న 1.
కరెంటు పనివారు రబ్బరుతో తయారు చేసిన చేతి తోడుగులను ధరిస్తారు ఎందుకు ?
జవాబు:
ఎలక్ట్రిక్ షాక్ నుంచి రక్షించు కొనుట కోసం కరెంటు పనివారు రబ్బరుతో తయారు చేసిన చేతి తోడుగులను ధరిస్తారు.
ప్రశ్న 2.
ఆటలు ఆడేటప్పుడు పాటించే నియమాలేవి?
జవాబు:
ఆటలు ఆడేటప్పుడు పాటించే నియమాలు:
- ఆటనియమాలు తప్పనిసరిగా పాటించాలి .
- ఆటలు ఆడేటప్పుడు ఒకరిని ఒకరు తోసుకోరాదు.
- అనవసరపు వాదనలు చేయరాదు.
- ఆటల్లో బృంద స్ఫూర్తిని పెంపొందించు కోవాలి.
ప్రశ్న 3.
సెలవుల్లో స్కూల్ మాజమాన్యాలు స్కూళ్ళలో ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి?
జవాబు:
ప్రతి స్కూలు సరియైన ప్రణాళికతో విద్యార్థులను ప్రమాదం జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు క్రింది విధంగా చేపట్టాలి:
- అగ్ని ప్రమాదాలు నివారించుటకు ఫైర్ ఎక్స్ టింగ్విషర్లు పెట్టించాలి.
- వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రపరచాలి మరియు లీకేట్లు లేకుండా ఎప్పటికప్పుడు రిపేర్లు చేయించాలి.
- స్విచ్ బోర్డకు రిపేర్లు చేయించాలి. స్విచ్ బోర్డులు 6 అడుగులకు పై ఎత్తులో ఉండేటట్లు చూడాలి.
- విద్యార్థుల రక్షణకు కాంపాండ్ గొడ తగిన ఎత్తు కల్గి ఉండాలి.
- అంగ వైకల్యం గల పిల్లల కోసం ర్యాంప్ నిర్మించాలి.
II. సమాచార నైపుణ్యాలు – ప్రాజెక్టుల పని:
ప్రశ్న 3.
క్రింది మైండ్ మాప్ ను పూరించండి :
జవాబు:
విధ్యార్ధి కృత్యము
ప్రశ్న 4.
“ప్రధమచికిత్స పెట్టె ” నమూనాను తయారు చేయండి?
జవాబు:
విధ్యార్ధి కృత్యము
బహుళైచ్ఛిక ప్రశ్నలు:
సరియైన సమాధానాలను గుర్తించండి:
ప్రశ్న 1.
పోలీస్ కు సంబంధించిన అత్యపవర సేవల నెంబరు
(A) 108
(B) 104
(C) 100
(D) 102
జవాబు:
(C) 100
ప్రశ్న 2.
క్రింది వాటిలో ప్రకృతి వైపరీత్యాలకు ఉదాహరణలు.
(A) భూకంపాలు
(B) తూఫానులు
(C) వరదలు
(D) పై వన్నీ
జవాబు:
(D) పై వన్నీ
ప్రశ్న 3.
భద్రతా చర్యలను పాటించటం ద్వారా……………….. ను నివారించవచ్చు. .
(A) భద్రత
(B) ప్రమాదాలు
(C) విషాదాలు
(D) ఏదీకాదు
జవాబు:
(B) ప్రమాదాలు
ప్రశ్న 4.
రోడ్డు దాటుటకు ………………..ను వాడాలి.
(A) ట్రాఫిక్ సిగ్నల్స్
(B) జీబ్రాక్రాసింగ్స్
(C) కూడలి
(D) ఏదీకాదు
జవాబు:
(B) జీబ్రాక్రాసింగ్స్
ప్రశ్న 5.
+ అనే సింబల్ ను……………….. పై చూడగలం
(A) ప్రధమచికిత్స పెట్టె
(B) అంబలెన్స్
(C) ఎ మరియు బి
(D) ఏదీకాదు
జవాబు:
(C) ఎ మరియు బి
ప్రశ్న 6.
ఇది దేనిని సూచించును.
(A) కుడిచేతి మలుపు
(B) ఎడమచేతి మలుపు
(C) క్రాస్ రోడ్డు
(D) ఏదీకాదు
జవాబు:
(A) కుడిచేతి మలుపు
ప్రశ్న 7.
క్రింది వాటిపై ప్రయాణాలు మాదకరం
(A) ఫుట్ బోర్డు
(B) ఫుట్ పాత్
(C) జీబ్రాక్రాసింగ్
(D) ఏదీకాదు
జవాబు:
(A) ఫుట్ బోర్డు
ప్రశ్న 8.
గుర్తు దేనిని సూచించును ………………..
(A) రోడ్డుకాస్
(B) స్కూల్
(C) పెడెస్టి యన్ క్రాసింగ్
(D) ఏదీకాదు
జవాబు:
(B) స్కూల్
ప్రశ్న 9.
నడవటానికి ……………….. న ఉపయోగించాలి.
(A) ఫూట్ బోర్డు
(B) ఫూట్ పాత్
(C) జీ బ్రాక్రాసింగ్
(D) ఏదీకాదు
జవాబు:
(B) ఫూట్ పాత్
ప్రశ్న 10.
ప్రయాణం లో చేయకూడనిది ………………..
(A) అధికవేగం
(B) త్రాగి డ్రైవ్ చేయటం
(C) అధికబరువులతో ప్రయాణం
(D) పై అన్నీ
జవాబు:
(D) పై అన్నీ