Andhra Pradesh AP Board 5th Class Telugu Solutions 5th Lesson తోలుబొమ్మలాట – ఒక జానపదకళ Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Telugu Solutions Chapter 5 తోలుబొమ్మలాట – ఒక జానపదకళ
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
చిత్రంలో ఏం జరుగుతున్నది ?
జవాబు:
చిత్రంలో ముగ్గురు చిందేస్తూ మైకులు ముందు పాడుతున్నారు. చిత్రంలో బుర్రకథ జరుగుతున్నది.
ప్రశ్న 2.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు ? ఏ మేం చేస్తున్నారు ?
జవాబు:
చిత్రంలో ముగ్గురు ఉన్నారు. మొదటివాడు “రాజకీయం”. రెండవవాడు “కథకుడు”. మూడవవాడు ” హాస్యగాడు”. వీరు చేతుల్లో వారివారి వాద్యాలను పట్టుకుని మైకు ముందు బుర్రకథ చెబుతున్నారు.
ప్రశ్న 3.
ఇలాంటి ప్రదర్శనలు మీరు ఇంకా ఏమేమి చూసారు ?
జవాబు:
హరికథ, గంగిరెద్దులాట, కోలాటం, పులి వేషం లాంటి ప్రదర్శనలు చూసాము.
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
జానపదకళల్లో తోలుబొమ్మలాట గురించి తెలుసుకున్నావు కదా? నీకేమనిపించింది?
జవాబు:
ఈ తోలుబొమ్మలాట గ్రామీణ జీవితాలను ప్రతిబింబించే ఆట. ఈ కళకు ఎంతో శ్రద్ధ, శ్రమ అవసరమనిపించింది. బొమ్మలు తయారు చేసే విధానంలో నేర్పు అవసరమనిపించింది. ఎన్నో పురాణగాధలు తెలిసి ఉండాలి అనిపించింది. ఎన్నో నీతి కథలు సూక్తులు, సామెతలు తెలిసి ఉండాలనిపించింది. అంతేకాదు – ఇది శ్రుత సాహిత్యంతో కూడినది కనుక ఎంతో జ్ఞాపకశక్తి అవసరమనిపించింది.
ప్రశ్న 2.
మీ ఊరి జాతరలో, పండుగలలో మీరు చూసిన జానపదకళల గురించి చెప్పండి.
జవాబు:
కోలాటం : ఈ జానపద కళ ఒక బృందంగా ప్రదర్శించబడుతుంది. ఈ ప్రదర్శనలోని కళాకారులు “సరి” పంఖ్యలో ఉంటారు. చక్కటి అందమైన రంగు రంగుల దుస్తులు ధరిస్తారు. వీరి చేతిలో రెండు కోలాటం కర్రలుంటాయి. వాటితో ప్రతి ఇద్దరూ జతగడుతూ లయాత్మకంగా తిరుగుతూ – చేతులలోని కర్రలతో కొడుతూ చప్పుడుచేస్తూ పాడతారు, ఆడతారు. ఆ సమయంలో వాళ్ళ , కాళ్ళకున్న గజ్జల చప్పుడు కూడా ఎంతో లయాత్మకంగా వినటానికి ఆనందంగా ఉంటుంది.
ప్రశ్న 3.
పాఠంలో మీకు నచ్చిన అంశం ఏమిటి? తోలుబొమ్మల్లా మీరు ఏయే బొమ్మలు తయారు చేస్తారు?
జవాబు:
పాఠంలో నాకు నచ్చిన అంశం తోలుబొమ్మలు తయారు చేసే విధానం. ఇది చాలా కష్టంతో కూడినదని శ్రద్ధతో కూడినదనిపించింది. ఈ విధంగా మేము మట్టి బొమ్మలు . తయారు చేస్తాం. వినాయకచవితికి-సంక్రాంతికి బొమ్మలు తయారుచేసి వాటికి ప్రకృతికి హాని కలిగించని రంగులద్ది ప్రజలకు అందిస్తాం. ఈ మట్టి బొమ్మల్లో-మనషుల బొమ్మలు,దేవతల బొమ్మలు, పక్షుల బొమ్మలు, జంతువుల బొమ్మలు తయారు చేస్తాం.
చదవడం – వ్యక్త పరచడం
అ) పాఠం చదవండి. పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
ప్రశ్న 1.
తోలుబొమ్మలాట ఏయే జిల్లాలలో ప్రదర్శిస్తారు ?
జవాబు:
శ్రీకాకుళం, విశాఖపట్టణం, జిల్లాల్లో ప్రదర్శిస్తారు.
ప్రశ్న 2.
తోలుబొమ్మల తయారీలో వాడే రంగులు ఏవి ?
జవాబు:
ప్రకృతి పరంగా దొరికే మోదుగపువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులను తోలు బొమ్మల తయారీలో వాడతారు.
ప్రశ్న 3.
తోలు బొమ్మలాటలో నవ్వించే పాత్రలు ఏవి ?
జవాబు:
తోలు బొమ్మలాటలో నవ్వించే రెండు హాస్య పాత్రలుంటాయి. అవి ” కేతిగాడు, బంగారక్క” ఈ కేతిగాడినే జుట్టు పోలిగాడు అంటారు.
ఆ) కింది జానపద కళల గురించి చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
తప్పెటగుండ్లు : జానపద కళారూపాలలో ఒకటైన తప్పెటగుండ్లు ప్రత్యేకించి విశాఖ జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంది. గుండ్రంగా రేకుతో చేసిన తప్పెట్లను ఈ బృందం కళాకారులు మెడలో వేసుకుని పాడుతూ ఆ పాటకు అనుగుణంగా గుండ్రంగా తిరుగుతూ నాట్యం చేస్తారు. పాటకు అనుగుణంగా తప్పెట్లను వాయిస్తుంటారు. ఈ వాయిద్యాల్ని, గుండెమీద ! పెట్టుకుని వాయించడం కారణంగా తప్పెట ‘గుండు’ అనే పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. యాదవులు ఈ తప్పెట గుండ్లను ప్రవర్శించేవాళ్ళు.
ప్రశ్న 1.
తప్పెటగుండ్లు ఏ ప్రాంతానికి చెందింది?
జవాబు:
తప్పెటగుండ్లు విశాఖ జిల్లాకు చెందింది.
ప్రశ్న 2.
తప్పెటగుండ్లు అనే పేరు ఎలా వచ్చింది ?
జవాబు:
గుండ్రంగా రేకుతో చేసిన తప్పెట్లను మెడలో వేసుకొని ఈ వాద్యాలను గుండెమీద పెట్టుకుని వాయించడం వల్ల దానికి తప్పెట గుండ్లు అనే పేరు వచ్చింది.
ప్రశ్న 3.
తప్పెట గుండ్లను ఎవరు ప్రదర్శించేవారు ?
జవాబు:
తప్పెట గుండ్లును జోగాట అంటారు. జోగులు అనే తెగవారు ఈ ఆటలను ప్రదర్శించడం వల్ల దీనినే జోగాట అనికూడా అంటారు.
ఇ) కింది జానపద కళ గురించి చదవండి. ప్రశ్నలు తయారు చేయండి.
కోలాటం : గ్రామీణ ప్రాంత ప్రజలు తాము చేసే నిత్యకృత్యాలలోని అలసటను మరచిపోయేందుకు ఉపయోగించే కళారూపం కోలాటం. కోలాటం ఆటలో కళాకారుల రెండు చేతులలో కోలలు ధరించి వాటిని తాడిస్తూ కోలాటం ఆడుతారు. ఇందులో ఏకకోలాటం, జంట కోలాటం, జడకోలాటం, స్త్రీల కోలాటం, పురుషుల కోలాటం లాంటివి ఎన్నో ఉన్నాయి. కోలాటం నృత్యంలో సుమారు 16 మంది నుండి 40 మంది వరకు పాల్గొనవచ్చు.
జవాబు:
ప్రశ్నలు :
- కోలాటం ఎందుకు ఆడతారు ?
- కోలాటం ఎలా ఆడతారు ?
- కోలాటం ఎన్ని విధాలు ?
- కోలాటంలో ఎంతమంది పాల్గొనవచ్చు.
పదజాలం
అ) కింది జానపద కళల పేర్లు చదవండి. వాటిలో మీ ప్రాంతపు జానపద కళలను గుర్తించి “O” చుట్టండి.
జవాబు:
ఆ) “తొంభై ఆమడలైనా వెళ్ళి తోలుబొమ్మలాట చూడాలి” అనేది ఒక నానుడి. నానుడులు, సామెతలు లాగే జనుల నోట పుట్టాయి. కింది సామెతలు చూడండి. వాటి ఆర్థాలు తెలుసుకోండి.
సామెత : ఆరునెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట.
అర్థం : ఎవరితోనైనా ఆరు నెలలు కలిసి వుంటే వారి లక్షణాలు మనకు కొన్ని అబ్బుతాయి. మంచి వాళ్ళతో వుంటే మంచి లక్షణాలు, చెడ్డ వారితో ఉంటే చెడు లక్షణాలు కలుగుతాయని అర్థం.
సామెత : రోట్లో తలదూర్చి రోకటి పోటుకు వెరచినట్లు
అర్థం : ఒక విషయంలో ఇబ్బంది కలుగుతుందని తెలిసికూడా నెత్తినేసుకుని ఆ తరువాత వచ్చిపడే కష్టాన్ని తలచుకుని బాధపడటం.
సామెత : ఆవులిస్తే పేగులు లెక్క పెట్టినట్లు
అర్థం : పైన కనపడే విషయాన్ని బట్టి దాని లోతును గ్రహించడం, ఆసాధారణ ప్రతిభ, తెలివి తేటలు కలిగిన చోట ఉపయోగించే వాక్యం.
కింది సామెతలను సరైన పదంతో పూరించండి.
ఉదా : ………….. పిల్ల …………………. కి ముద్దు.
కాకి పిల్ల కాకికి ముద్దు.
ప్రశ్న 1.
…………….. కాటుకు ………………… దెబ్బ.
జవాబు:
కుక్క కాటుకు చెప్పు దెబ్బ
ప్రశ్న 2.
……………….. వంగనిది …………………….. వంగునా?
జవాబు:
మొక్కై వంగనిది మానై వంగునా ?
ప్రశ్న 3.
అదిగో …………………… అంటే ఇదిగో ……………………. అన్నట్లు.
జవాబు:
అదిగో పులి అంటే ఇదిగో మేక అన్నట్లు
ప్రశ్న 4.
ఇంట్లో …………………. మోత బయట …………………. మోత.
జవాబు:
ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత.
ప్రశ్న 5.
……………………. మంచిదైతే ……………. మంచిది.
జవాబు:
నోరు మంచిదైతే ఊరు మంచిది
ఈ) పాఠం చదవండి. అందులో కొన్ని పదాలకు మీ ప్రాంతాలలో వేరు పదాలు వాడుతుండవచ్చు. ఎలాంటి పదాలను గుర్తించి రాయండి.
ఉదా : ఎటువంటి – ఎలాంటి
జవాబు:
- తెలుస్తున్నది – తెలుస్తోంది
- ఉపయోగిస్తారు- వాడతారు
- చేసుకుంటారు – చేస్తారు
- నవ్విస్తుంటారు – నవ్విస్తారు
స్వీయరచన
ప్రశ్న 1.
తోలు బొమ్మల తయారీలో రంగుల కోసం ఏమేమి ఉపయోగిస్తారు ?
జవాబు:
తోలు బొమ్మల తయారీలో రంగుల కోసం ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు చూసి ఉపయోగిస్తారు
ప్రశ్న 2.
కలాకారుల పిల్లలకు తోలుబొమ్మలాట కళలో ఏయే అంశాలలో శిక్షణనిస్తారు ?
జవాబు:
కళాకారుల పిల్లలకు చిన్నప్పటినుంచే ఈ కళపై శిక్షణనిస్తారు. తోలు బొమ్మలు తయారు చేయడం, వాటిని ఆడించడం, పద్యాలు, పాటల గానం, సంభాషణలు పలికే తీరు, తదితర అంశాలపై శిక్షణనిస్తారు.
ప్రశ్న 3.
తోలు బొమ్మలాటకు కధావస్తువులుగా వేటిని తీసుకుంటారు ?
జవాబు:
తోలు బొమ్మలాటకు రామయణ, భారత, భగవత కథా వస్తువులతో పాటుగా సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకాలలోని పద్యాలను, శ్లోకాలను, సూక్తులను, నీతి వాక్యాలను, సామెతలను తీసుకుంటారు.
ప్రశ్న 4.
తోలుబొమ్మలాట గురించి ఐదు వాక్యాలు రాయండి.
జవాబు:
తోలుబొమ్మలాట అనేది ఒక చక్కని జానపద కళారూపం. ఈ ఆట క్రీ.పూ. 3వ శతాబ్దం నాటికే తెలుగు ప్రాంతంలో ప్రచారంలో ఉంది. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన ‘ఆరె’ కులస్థుల నుండి ఈ తోలుబొమ్మలాట ఇతర కులస్థులు నేర్చుకున్నారు. ఈ బొమ్మలను ఒక అడుగు నుండి నాలుగు, ఐదు అడుగుల ఎత్తు వరకు తయారు చేస్తారు.
ఈ బొమ్మలను ఆడించడానికి ఒక వెదురు బద్దె ఆధారంగా ఉంటుంది. ప్రదర్శించే సమయంలో ‘ఆరు’ నుండి ఎనిమిది మంది కళాకారులు ఉంటారు. మన సంస్కృతిలో భాగమైన ఈ కళారూపాలను కాపాడుకుందాం.
సృజనాత్మకత
తోలు బొమ్మల్లాగే మనం గుడ్డతో బొమ్మలు, కాగితంతో బొమ్మలు తయారు చేసుకోవచ్చు. ఇక్కడ వేలికి తొడిగే కాగితపు బొమ్మలను చూడండి. ఇలాంటివి తయారు చేద్దామా? అయితే కాగితాలు తీసుకోండి. మీరు బొమ్మలు తయారు చేయండి. వాటిని ఉపయోగించి. ఒక కథను చెప్పండి.
జవాబు:
కథ : అదొక దట్టమైన అడవి. ఆ అడవిలో చాలా రకాల జంతువులు నివసిస్తున్నాయి. ఒకరోజు పొడవు మెడ జిరాఫీ, జిత్తుల మారి నక్క, చెవుల పిల్లి, ఒక సమావేశమయ్యాయి. ఈ అడవిలో ఇన్నేళ్ళుగా నివసిస్తున్నాము మనకు తెలియని ప్రదేశం లేదు. మనం చూడని చోటు లేదు.
ఐతే మనలో గొప్ప ఎవరు? మనలో బలవంతుతుడు ఎవరు? అనే విషయం మీద వాదులాడుకున్నాయి. నేనంటే నేనని పోట్లాడుకున్నాయి. ఆ వాదన ఎంతకీ తెగటం లేదు. ఇంతలో ఆ ప్రక్కన నీళ్ళ మడుగులో స్నానం చేసి పెద్దగా ఘీంకరిస్తూ వేగంగా ఒక పెద్ద కొండలాంటి ఏనుగు ఈ మూడింటి వైపు వచ్చింది.
ఆ ఘీంకారానికి ఆ వేగానికి ఆ కారానికి భయపడి ఈ మూడు జంతువులు దాక్కున్నాయి. కొద్ది సేపటికి ధైర్యం తెచ్చుకొని బైటకు వచ్చి వాటి వాదన వినిపించాయి. ఆ వాదన విని కొండంత ఏనుగు నేనే గొప్ప, నేనే బలశాలిని అని అరిచి, కొట్టినంత పని చేసి వాటిని ఒప్పించింది.
తప్పేదిలేక బతుకు జీవుడా అనుకుని ఆ ఏనుగుతో కలిసి 10 అడుగులు ముందుకు వేసాయి. అంతే ఆ పక్క పొదల్లోంచి పెద్ద సింహం గాండ్రిస్తూ వీటిమీదకు వచ్చింది. చేసేది లేక ప్రాణం అరచేతిలో పెట్టుకుని ఏనుగుతో సహ కాలికి బుద్ధి చెప్పాయి.
పిల్లలూ ఈ కథ వలన మీకు తెలియాల్సిన నీతి ఏంటంటే ఎవరికి వారే తానే – గొప్ప, తానే బలవంతుడు అని విర్రవీగకూడదు. ఆహంకారం కూడదు. తెలివితో బ్రతకాలి.
ప్రశంస
జానపద కళలను ప్రదర్శించే కళాకారులను మీరు ఏవిధంగా గౌరవిస్తారు? ఏవిధంగా ప్రశంసిస్తారో చెప్పండి.
జవాబు:
జానపదకళలను ప్రదర్శించే కళాకారులను ముందుగా నేను పరిచయం చేసుకుంటాను. వారిని గౌరవంగా సంబోధిస్తాను. వారు ప్రదర్శించే కళను గురించి పూర్తిగా తెలుసుకుంటాను. అవకాశం ఉంటే నేర్చుకుంటాను. వారు వారి కళను ప్రదర్శించే సమయంలో ఎంతో శ్రద్ధతో చూస్తాను. కరతాళ ధ్వనులతో ఆసమయంలో అభినందిస్తాను.
ఆ తరువాత వారిని వారి వేషధారణ గుర్తించి – వారిలోని నేర్పును ప్రశంసిస్తాను. శక్తి ననుసరించి నాతో పాటు మరో కళాభిమానం కలిగిన పదిమందితో జట్టు కట్టి వారి సహయంతో కళాకారులకు ధన సహాయం చేస్తాను. మా తల్లి దండ్రులతో కలిసి గ్రామాధికారిని సంప్రదించి మరికొన్ని ప్రదర్శనలు ఏర్పాటు చేసి వారిని వారిలోని ఆ జానపదకళను ప్రచారం జరగటానికి కృషి చేస్తాను.
భాషాంశాలు
అ) కింది వాక్యాలు చదవండి.
- వాల్మీకి రామాయణాన్ని రచించాడు.
- దశరథుడు అయోధ్యను పాలించాడు.
- సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
- నవీన్ (ఎలుక వీరుడు’ కథ చదువుతున్నాడు.
పై వాక్యాలకు సంబంధించిన ప్రశ్నార్ధక వాక్యాలను చదవండి.
- రామాయణాన్ని ఎవరు రచించారు?
- అయోధ్యను ఎవరు పాలించారు?
- దురాచారాలను ఎవరు నిర్మూలించారు?
- ఎలుక వీరుడు’ కథను ఎవరు చదివారు?
ఆ) పిల్లలూ! పై వాక్యాలలో ఏ ప్రశ్నార్థక పదం ఉన్నదో గమనించండి. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలేవో చెప్పండి. ఇలా “ఎవరు” అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని “కర్త” అంటారు.
క్రింది ప్రశ్నలు చదవండి.
- వాల్మీకి దేన్ని రచించాడు?
- దశరథుడు దేన్ని పాలించాడు?
- సంఘ సంస్కర్తలు వేటిని నిర్మూలించారు?
- నవీన్ ఏ కథను చదివాడు?
ఇ) ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలు ఏవో చెప్పండి. మీరు చెప్పిన మాటలను అంటే ఎవరిని, దేనిని వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చు పదాలను ‘కర్మ’ అంటారు.
జవాబు:
- వాల్మీకి రామాయణాన్ని రచించాడు.
- దశరథుడు అయోధ్యను పాలించాడు.
- సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలించారు.
- నవీన్ ‘ఎలుక వీరుడు’ కథ చదువుతున్నాడు.
ఈ విధంగా ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలను సమాధానంగా వచ్చే పదాలను – ‘కర్మ’ ప్రధాన వాక్యాలు అంటారు.
ఈ) క్రియలు :
ఒక పని జరగటానికి తెలియచేసే పదాలను క్రియ లంటారు.
ఉ) కింది వాక్యాలను చదవండి. కర్త, కర్మ, క్రియలను గుర్తించి రాయండి.
2. సుబ్బు బొమ్మలు గీశాడు.
3. మేరి పాట పాడింది
4. గాంధీ మనకు స్వాతంత్ర్యం సాధించాడు.
5. శ్రీకృష్ణదేవరాయలు విజయనగరాన్ని పాలించాడు.
ఊ) క్రియలు ప్రధానంగా రెండు రకాలు.
- సమాపక క్రియ,
- అసమాపక క్రియ,
ఒక క్రియా పదం వాక్యాన్ని పూర్తి చేస్తే అది ‘సమాపక క్రియ’..
ఉదా : సలీం పాఠం చదివాడు.
‘చదివాడు’ అని క్రియాపదం వలన వాక్యం పూర్తి అయింది. కనుక ఈ వాక్యంలోని చదివాడు అనేది సమాపక క్రియ.
ఒక క్రియా పదం వాక్యాన్ని పూర్తి చేయలేకపోతే అది అసమాపక క్రియ
ఉదా : సలీం పాఠం చదివి………
‘చదివి’ అనే క్రియా పదం వలన వాక్యం పూర్తి కాలేదు. కనుక ఈ వాక్యంలోని చదివి అనేది. అసమాపక క్రియ.
కొన్ని సమాపక క్రియా వాక్యాలు
- సాహిత్ పని పూర్తి చేసాడు.
- పద్మావతి ఊరు వెళ్ళింది
- ప్రసన్న వంట చేసింది
- శృతి చక్కగా చదివింది
అసమాపక క్రియా వాక్యాలు
- సాత్ పని పూర్తి చేసి………..
- తన పద్మావతి ఊరు వెళ్ళి ………….
- ప్రపన్న వంట చేసి …………..
- శృతి తకుగా చది ………………..
ధారణ చేద్దాం
విద్య వలనను వినయంబు, వినయమునను
బడయు పాత్రత, పాత్రత వలన ధనము
ధనము వలవను ధర్మంబు, దాని వలన
ఐహికాముష్మిక సుఖంబు లందు నరుడు
భావం :
మానవుడు విద్యవల్ల వినయాన్ని పొంధుతాడు. విషయం వల్ల అర్హత వస్తుంది. అర్హత ధనాన్ని చేకూరుస్తుంది. ‘ఆ ధనం ఉంటే ధర్మం చేయవచ్చు. ధర్మ గుణం వల్ల ఈ లోకంలోనూ, తరువా… పరలోకంలోనూ సుఖాలు పొందుతాడు.
జవాబు:
విద్యార్థి పద్యాన్ని – భావాన్ని పద. .విభాగంతో చట… న, భావయుక్తంగా, అర్థవంతంగా ధారణచేయాలి. అందుకు ఉప్యా యులు సహకరించాలి. అందులోని నీతిని, విషయాన్ని వంటపట్టించుకోవాలి.
కవి పరిచయం
ఈ పాఠానికి కె. వి రామకృష్ణ రచించిన “తోలుబొమ్మలాట” వ్యాసం ఆధారం.
పదాలు – అరాలు
ప్రాచీన = పాత. పురాతన
ప్రాముఖ్యం = ప్రాధాన్యం
అమడ = ఎనిమిదిమైళ్ళ దూరం
శతాబ్దం = వంద సంవత్సరాలు
నానుడి = వాడుకగా అనే మాట, సామెత
తర్ఫీదు = శిక్షణ, అభ్యాసం
రక్తి కట్టడం = అలరించడం
శ్రుత పాండిత్యం= వినడం ద్వారా నేర్చుకోవడం
చమత్కారం= నేర్పు
పారాయణం = శ్రద్ధగా చదవడం
చదువు – అర్ధం చేసుకో – ఆనందించు. పరీక్షల కోసం కాదు.
కూచిపూడి నృత్యం – ఒక సంప్రదాయ కళ
కూచిపూడి నృత్యం తెలుగువారి ప్రత్యేక నృత్యరీతి. ఇది ఆంధ్రరాష్ట్రంలో కృష్ణాజిల్లాలోని దివిసీమలో ‘ కూచిపూడి’ అనే గ్రామంలో కొన్ని శతాబ్దాల పూర్వం అవిర్భవించిన కళారూపం. ఈ ఊరి పేరుతోనే ఇది ప్రసిద్ధమైంది.
సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యకళకు మూలపురుషుడు అంటారు. అయన నాడు ప్రచారంలో ఉన్న యక్షగానాది కళారూపాలను స్వీకరించి కూచిపూడి నృత్య ప్రక్రియను అభివృద్ధి చేశాడు. ఈయన రచించిన నాట్య నాటకం,భామాకలాపం.తెలుగులో ఇది మొట్ట మొదటి నృత్యనాటకం. కూచిపూడి నాట్యకళాకారులు విస్తృతంగా ప్రదర్శించే నాటకమిది.
నాట్యం అభినయప్రధానం అభినయం నాలుగు రకాలు. అవయవాల కదలికతో భావవ్యక్తీకరణ అంగికాభినయం. భాష ! ద్వారా వ్యక్తీకరణ వాచికాభినయం. వేషం ద్వారా భావవ్యక్తీకరణ ఆహార్యాభినయం. శరీరంలో కలిగే మార్పుల ద్వారా భావవ్యక్తీకరణ సాత్వికాభినయం.
కూచిపూడి కళాకారులు తమ నృత్య నాటకాలతో పాటు పగటి వేషాలు కూడా వేస్తారు. వాళ్లు వేసే పగటి వేషాల్లో ప్రధానమైనది అర్ధనారీశ్వరవేషం. అర్థనారీశ్వర వేషంలో కుడివైపు పురుషుడు, ఎడమవైపు స్త్రీ ఉంటారు. ఈ రెండు వేషాలను వేరుచేస్తు పై నుండి క్రింది వరకు ఒక తెర ఉంటుంది. ఒక వేషం మాట్లాడేటప్పుడు రెండోవైపును తెర కప్పుతుంది.
జనానికి వినోదం కలిగించడం వారిని నాటకంవైపు ఆకర్షించడం ఈ పగటి వేషాల ప్రయోజనం. ఈ వేషాల ద్వారా సాంఘిక దురాచారాలను విమర్శించడం కూడా ఉంది.
కూచిపూడి నాటక ప్రదర్శనలను ‘ భాగవత మేళా’ అని కూడా అంటారు. వీటిల్లో స్త్రీ పురుష పాత్రలు రెండూ ఉంటాయి. కాని ఇటీవలి వరకు స్త్రీ పాత్రను కూడా పురుషులే ధరించేవారు. ఇప్పుడు స్త్రీలు కూడా ధరిస్తున్నారు.
కీ.శే. భాగవతుల రామయ్య, హరిమాధవయ్య, చింతా వెంకట రామయ్య, తాడేపల్లి పేరయ్య, భాగవతుల విస్సయ్య, వెంపటి వెంకట నారాయణ, దర్బా వెంకటేశ్వర్లు వేదాంతం పార్వతీశం, వేదాంతం వెంకటాచలపతి, వేదాంతం రాయకృష్ణయ్య, వేదాంతం రాఘవయ్య, చింతా కృష్ణమూర్తి, వేణుగోపాలకృష్ణశర్మ, వేదాంతం రత్తయ్యశర్మ, వేదాంతం సీతారామశాస్త్రి మొరలయినవారు కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు.