Andhra Pradesh AP Board 5th Class Telugu Solutions 7th Lesson పద్యరత్నాలు Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Telugu Solutions Chapter 7 పద్యరత్నాలు
చిత్రం చూడండి.. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి. అష్టావధానం
ప్రశ్న 1.
చిత్రంలో ఏం జరుగుతున్నది? ఎవరెవరు ఉన్నారు? వారు ఏం చేస్తున్నారు?
జవాబు:
చిత్రంలో అష్టావధానం జరుగుతున్నది. మైకు ముందు ఇద్దరు అవధానులున్నారు. వారికి ఎదురుగా కుడి ప్రక్కన నలుగురు, ఎడమ ప్రక్కన నలుగురు (ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు) పృచ్ఛకులు కూర్చుని ఉన్నారు. వారు ఆ ఇద్దరు అవధానులను ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు అవధానులు జవాబులు పద్యాల రూపంలో చమత్కారంగా ఆశు వుగా చెప్తున్నారు.
ప్రశ్న 2.
మీకు తెలిసిన ఏవైనా పద్యాలు పాడండి!
జవాబు:
ఏదైనా ఒక చక్కని నీతి పద్యం భావయుక్తంగా, రాగయుక్తంగా ఉపాధ్యాయులు ముందుగా పాడి, తరువాత మరొక పద్యం విద్యార్థుల చేత పాడించాలి.
ప్రశ్న 3.
మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా చూశారా? చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది.
జవాబు:
మేము ఇలాంటి కార్యక్రమాలు చూశాము. శతవధానము చూశాము. అందులో – 100 మంది ప్రచ్ఛకులు ఉన్నారు. అవధానిగారు ఆ వందమంది అడిగే ప్రశ్నలకు – ఆశువుగా చమత్కారంగా పద్యరూపంలో సమాధానం చెప్పారు. చాలా ఆశ్చర్యం కలిగింది. అన్ని ప్రశ్నలు – పద్యాల రూపంలో ఎలా గుర్తు పెట్టుకున్నారా! అని ముక్కు మీద వేలు వేసుకున్నాం. అవధాని గారి ధారణ శక్తి చాలా గొప్పదని అందరూ పొగుడుతుంటే ఔననిపించింది.
ఈ అవధానం అనేది కేవలం మన తెలుగులో మాత్రమే కలదని, మరే భాషలోను ఈ అవధానం లేదని, అవధానిగారి ప్రక్కన ఉన్న సంచాలకులు చెప్పగానే ఎంతో ఆనందం కలిగింది. నేను కూడా ఈ అవధానం ఎలాగైనా నేర్చుకొని అందులో పాల్గోవాలపించింది. వారితో కలిసి ఒక్క పద్యమైనా పాడాలనిపించింది.
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
పద్యాలను రాగయుక్తంగా పాడండి.
జవాబు:
ఈ పద్యరత్నాలు’ అనే పాఠంలోని పద్యాలను విద్యార్ధులచే చక్కగా భావయుక్తంగా, రాగయుక్తంగా పాడించాలి. ముందుగా ఉపాధ్యాయులు ఆచరించి, అటు పై విద్యార్ధులచే ఆచరింప చేయాలి.
ప్రశ్న 2.
మీకు తెలిసిన కొన్ని నీతి పద్యాలు చెప్పండి!
జవాబు:
అ) సదౌష్టియె సిరియెసగును
సదౌష్టియె కీర్తి పెంచు, సంతుష్టిని, నా
సదౌష్టియె ఒన గూర్చును
సదౌష్టియె పాపములను చరచు కుమారా!
భావం :
మంచివారితో మాట్లాడడం వల్ల, స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది. పేరు ప్రతిష్ఠలు వస్తాయి. సంతృప్తి కలుగుతుంది. పాపాలు కూడా తొలగిపోతాయి.
ఆ) ఇనుడు వెలుగు నిచ్చు ఘనుఁడు వర్షము నిచ్చు,
గాలి వీచు చెట్లు పూలు పూచు
సాధు పుంగవులకు సహజ లక్షణమిది
లలిత సుగుణ జాల! తెలుగు బాల!
భావం :
సూర్యుడు వెలుగు నిస్తాడు. మేఘాలు వర్షాన్ని ఇస్తాయి. గాలి వీస్తుంది. చెట్లు పూలు పూస్తాయి. గొప్పవారికి ఇలాంటి లక్షణాలు సహజంగా ఉంటాయి.
ప్రశ్న 3.
చదువు లేకపోతే ఏమవుతుంది ?
జవాబు:
చదువు లేకపోతే – ఏది మంచి? ఏది చెడు తెలుసుకోగలిగే వివేకం ఉండదు. సంస్కారం కోల్పోతాం. మాట్లాడే విధానం, పని సాధించే తీరు తెలుసుకోలేము. ఎదుగుదల, అభివృద్ధి సజావుగా సాగదు. ఎప్పటికీ ప్రతి విషయంలో ఇంకొకరి మీద ఆధారపడాల్సి ఉంటుంది. కనుక అందరం చక్కగా చదువుకోవాలి.
చదవడం – వ్యక్తి పరచడం
అ) కింది భావాలకు సరియైన పద్య పాదాలు రాయండి.
ప్రశ్న 1.
మేఘం నీటితో నిండి ఉన్నప్పుడే వర్షిస్తుంది.
జవాబు:
నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘడు (9వ పద్యం)
ప్రశ్న 2.
మేలు చేసి పొమ్మ నుటే పెద్ద శిక్ష.
జవాబు:
పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు (3వ పద్యం)
ప్రశ్న 3.
విద్యకు పునాది నీతి.
జవాబు:
నీతియె మూలము విద్యకు (7వ పద్యం)
ప్రశ్న 4.
సత్యం పాపాలు తొలగిస్తుంది.
జవాబు:
సత్యమొకటి పాప సంహారమును జేయు (5వ పద్యం)
ప్రశ్న 5.
ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనకు విలువ పెరుగుతుంది.
జవాబు:
ప్రశ్నతోడ పెరుగు ప్రాభవమ్ము (2వ పద్యం)
ఆ) కింది పేరా చదివి ఖాళీలు పూరించండి.
ముక్తకం, అంటే ఒక పద్యం పూర్తి. అర్థాన్ని తనకు తానే ఇస్తూ ఇతర పద్యాలతో సంబంధం లేకుండా స్వయం సంపూర్ణంగా వినిపించేది. తెలుగులో ముక్తక రచనకు ‘శతక, చాటు’ పద్యాలను ఉదాహరణగా చెప్పవచ్చు. వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు ‘చాటు’ పద్య రచనలో చాలా ప్రసిద్ధులు, ముక్తకం ఒక పద్య ప్రక్రియ. శతకంలో కూడ ముక్తక లక్షణం ఉంటుంది.
స్వీయరచన
ప్రశ్న 1.
మనం ప్రశ్నలు ఎందుకు వేస్తాం?
జవాబు:
జ్ఞానం పెంచుకోవడానికి – అసలు విషయం తెలుసుకుని విలువలు పెంచుకోవడానికి, ప్రగతి సాధించడానికి ప్రశ్నలు వేస్తాం.
ప్రశ్న 2.
ఒక గ్రామంలో ఎవరెవరు ఉండడం అవసరమని పద్యంలో చెప్పారు?
జవాబు:
అవసరానికి అప్పిచ్చేవాడు, వైద్యుడు, ఎల్లప్పుడూ ప్రవహించే నది, మంచి చెడ్డలు చెప్పే బ్రాహ్మణుడు (పండితుడు) మొదలైనవారు గ్రామంలో ఉండడం అవసరమని పద్యంలో చెప్పారు.
ప్రశ్న 3.
ఉపకారం చేసేవారికి ఎలాంటి సహజగుణాలు ఉంటాయి?
జవాబు:
కోరకుండానే చెట్లు పండ్లనిస్తాయి. మేఘాలు అమృతం వంటి వర్షాన్నిస్తున్నాయి. నిండైన సంపదలచేత పండితులు ఆహంకారం పొందకుండా జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఈ విధమైన సహజ లక్షణాలుంటాయి.
ప్రశ్న 4.
శత్రువు విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి ?
జవాబు:
చంపదగిన శత్రువు చేతికి చిక్కినా – కీడు చేయకుండా ఏదేనా ఉపకారం చేసి పంపాలి. శత్రువు విషయంలో ఇదే మనం విధించే నిజమైన శిక్ష.
సృజనాత్మకత
ప్రశ్న 1.
నీకు తెలిసిన పద్యభావం ఆధారంగా చిన్న కధను రాయండి.
జవాబు:
భావం :
ఓ వేమా! చంపదగిన శత్రువు చేతికి చిక్కినా వాడికి కీడు చేయరాదు. తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష.
పై భావానికి కథ :
రామాపురం అనే గ్రామంలో కాముడు, సోముడు, అనే ఇద్దరు మిత్రులు కలిసి వ్యాపారం చేస్తుండేవారు. వ్యాపారం చక్కగా లాభాలతో సాగుతోంది. వచ్చిన లాభాలు ఇద్దరు సమంగా పంచుకునేవారు. ఒకసారి సోముడు తన కుటుంబంతో కలసి తీర్థయాత్రలకు వెళ్తూ…. తన దగ్గరున్న నగలు, ధనము, విలువైన వస్తువులు కాముడికిచ్చి “ఇవి నీ దగెరుంచుయాత్రనుండి తిరిగి వచ్చాక తీసుకుంటాను. గ్రామంలో దొంగల భయం ఉంది కదా!” అందుకని చెప్పి యాత్రకు వెళ్ళాడు. కొన్ని రోజులు గడిచాయి.
సోముడు తిరిగి వచ్చి మిత్రుడు కాముడుని కలసి తన సొమ్మును ఇవ్వమని కోరాడు. ఆ మాటలకు కాముడు కంటినీరు కారుస్తూ…సొమ్మును దొంగలెత్తికెళ్ళారని – నీ ధనంతో పాటు నావికూడా పోయినాయని అబద్దం అడాడు. ఆ మాటలు నమ్మి సోముడు బాధతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకు నిజంగా దొంగలు పడి కాముడి ఇల్లు మొత్తం దోచుకెళ్ళారు. తను చేసిన తప్పు తెలిసి కన్నీరు పెడుతూ సోముడిని కలిసి గోడు వెళ్ళబోసాడు.
మిత్రుడి బాధ చూడలేక సోముడు తన దగ్గరున్న కొంత ధనం చేతికిచ్చి మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టి, నేను నీకు తోడుంటాను. అని ధైర్యం చెప్పి పంపాడు. కాముడిలో పశ్చాత్తాపం మొదలైంది. మిత్రుడి మనసు ఎంత గొప్పదో తెలుసుకుని తనకు తానే సిగ్గుపడ్డాడు.
ప్రశంస
మీ తరగతి గదిలో ఎవరు బాగా పద్యాలు పాడతారు? వారిని నీవు ఎలా ప్రశంసిస్తావు?
జవాబు:
మా తరగతి గదిలో అందరూ తెలుగు చక్కగా చదువుతారు. అందులోను తెలుగు పద్యాలు చక్కగా చదువుతారు. పాడతారు. మా గురువుగారు మాకు అలా నేర్పించారు. ఐతే మా అందరిలో సౌమ్య మరీ చక్కగా, రాగయుక్తంగా, అందంగా వినసొంపుగా చదువుతుంది.
సౌమ్య పద్యం పాడుతుంటే, తరగతి గది చీమచిటుక్కు మనకుండా, నిశ్శబ్దంగా ఉంటుంది. వింటుంది, మేమందరం చెవులు రిక్కించి’ మరీ వింటాము. ప్రతి ఒక్కరం సౌమ్యలా పద్యం పాడాలని ప్రతిరోజు నేర్చుకుంటాం. ఎక్కడెక్కడా ఆపుతుంది – ఎక్కడెక్కడ పదవిభాగం చెస్తోంది. ఎక్కడ దీర్ఘాలు తీస్తోంది, ఎక్కడ కుదిస్తోంది. బాగా పరిశీలించమని మా తెలుగు గురువులు మాతో చెప్పారు.
సౌమ్య పద్యం పాడాక మాకు చలా ఆనందంగా ఉంటుంది. క్రిందటి సంవత్సరం నవంబరు 14 సందర్భంగా జిల్లా స్థాయిలో పద్యగాన పోటీలలో ఆమెకే ప్రధమ బహుమతి లభించింది. మేము కూడా చాలా ఆనందించాము. త్వరలో మేము కూడా అదే విధంగా పద్యగానం చేస్తాము.
భాషాంశాలు
(ఆ) కింది వాక్యాలు చదవండి.
సాధారణంగా భాషలో పదజాలాన్ని ……….
- పురుషులను బోధించే పదాలు – పుంలింగం
- స్త్రీలను బోధించే పదాలు – స్త్రీ లింగం
- ఇతరులను బోధించే పదాలు – నపుంసక లింగం అంటారు. (పక్షులు, జంతువులు, జడాలు)
కొన్ని భాషల్లో అర్ధంతో సంబంధం లేకుండా “పద స్వరూపాన్ని” బట్టి లింగం ఉంటుంది.
కొన్ని భాషల్లో అర్ధాన్ని బట్టి లింగం ఉంటుంది.
తెలుగులో మాత్రం అర్ధాల ప్రమాణం :
- తెలుగు వ్యాకరణంలో ఈ విభాగాన్ని ‘లింగం’ అనుకుండా “వాచకం” అంటారు.
- పురుషులను బోధించే పదాలు ” మహత్తులు”
- తక్కినవి ” అమహతులు”
- వాక్య నిర్మాణంలో స్త్రీలను బోధించే పదాలు ” ఏకవచనంలో – అమహత్తుతోను” బహువచనంలో – మహత్తుతోనూ” చేరతాయి.
ఉదా : అతను వచ్చాడు – అది/ఆమె వచ్చింది [ ఏకవచనం ]:
వాళ్ళు [ స్త్రీలు/పురుషులు ; స్త్రీ పురుషులు ] వచ్చారు.
అవి వచ్చా యి.
అందువల్ల స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే వాటిని “మహతీ వాచకాలు” అంటారు.
(ఆ) కింది పురుషవాచక పదాలకు స్త్రీ వాచక పదాలు రాయండి.
1. ఉపాధ్యాయుడు : ఉదా: ఉపాధ్యాయిని/ఉపాధ్యాయురాలు
2. నటుడు = నటి
3. గాయకుడు = గాయని/ గాయకీ
4. కళాకారుడు = కళాకారిణి
5. సైనికుడు = సైనికి/ సైనికురాలు
ధారణ చేద్దాం
ఉ॥ – మాటలచేత దేవతలు మన్నన జేసి వరంబు లిత్తు. రా
మాటలచేత భూపతులు మన్నన జేసి ధనంబు నిత్తు, రా
మాటలచేత మానినులు మన్నన జేసి మనంబు లిత్తు. రా…
మాటలు నేర్వకున్న మరి మానము హూనము కాదె యేరికన్
భావం :
మాట మంచిదైతే దేవతలు వరాలు ఇస్తారు. ఆ మాటలు రాజులకు నచ్చితే బహుమతులిస్తారు. ఆ మాటలలోని మాధుర్యాన్ని స్త్రీలు ఇష్టపడతారు. ఆ మాటలు సరిలేనప్పుడు ఎవరికైనా గౌరవం పోతుంది.
– భర్తహరి సుభాషితం
జవాబు:
విద్యార్థి పద్యాన్ని – భావాన్ని పద విభాగంతో చదవటం నేర్చుకుని, భావయుక్తంగా, అర్థవంతంగా ధారణ చేయాలి. అందుకు ఉపాధ్యాయులు సహకరించాలి. అందులోని నీతిని, విషయాన్ని వంటపట్టించుకోవాలి.
పదాలు – అర్థాలు
ఎడతెగక = అడ్డులేకుండా
ఉపకర్త = ఉపకారం చేసేవాడు
ద్విజుడు = బ్రహ్మణుడు
ఒరులు = ఇతరులు
అప్రియము = ఇష్టముకానిది
పొసగ = తగినట్లుగ
మనమునకు = మనస్సుకు
చిక్కెనేని = దొరికితే
పరాయణము = అభీష్టం
కీడు = హాని
పరమధర్మము = గొప్పధర్మం
పరిణితి = మార్పు
వాక్కు = మాట
సంశయించు = సందేహించు
అజ్ఞుడు = తెలివి తక్కువవాడు
ప్రాభవం = గొప్పతనం
సత్ = మంచి
గురుత = గొప్పతనం, బరువు
ఆర్యులు = పూజ్యులు
నింగి = ఆకాశం
కుచ్చితము = కపటము
వ్రేలుచు = వేలాడుతూ
మెండుగా = ఎక్కువగా
అమృతం = తియ్యని, వాన, నీరు
బుధులు = పండితులు
కోవిదుడు = విద్వాంసుడు
ఉద్ధతులుగారు = గర్వపడరు
మేఘుడు = మేఘం
నియత = నియమముగల
పెన్నిధి = గొప్పదైన నిధి
నిర్ణాయకమున్ = నిర్ణయించేది
సమృద్ధి = ఎక్కవగలిగి ఉండడం
చదువు – అర్థం చేసుకో – ఆనందించు. పరీక్షల కోసం కాదు.
కలమళ్ల శాసనం
పూర్వకాలంలో రాజులు శసనాలు వేసేవారు. శసనం రాజాజ్ఞను తెల్పుతుంది. శాసనాలు వాటిలోని విషయాన్ని బట్టి మూడు రకాలుగా ఉంటాయి. ఎక్కువభాగం ఇవి , దానశాసనాలు. కొన్ని ప్రశస్తి శాసనాలు మరికొన్ని ధర్మలిపి శాసనాలు.
దానశాసనాలంటే రాజులు, రాజ్యాధికారులు, సామంతులు మొదలైనవారు అలయాలకు, బ్రహ్మణులకు, మఠాలకు, విద్యాసంస్థలకు చేసిన దానాలను తెల్పేవి. ప్రశస్తి శాసనాలంటే రాజు విజయాలను ప్రశంసించేవి. ధర్మలిపి శాసనాలు మతపరమైన నియమాలను తేల్పేవి.
ఆంధ్రదేశంలో లభించే శాసనాలు కొన్ని విలలపై చెక్కినవి. మరికొన్ని రాగిరేకుల పై , చెక్కినవి. ఆంధ్ర దేశం క్రీస్తుపూర్వం నుండే శాసనాలు లభిస్తున్నాయి. మొదటి శాసనాలు ప్రాకృత భాషలో ఉన్నాయి. తర్వాత సంస్కృత ప్రాకృతి ఆ మిశ్రంగానూ, ఆ తర్వాత సంస్కృతం లోనూ శాసనాలు వచ్చాయి. ఈ శాసనాలలో ఊళ్ల పేర్లు, వ్యక్తుల పేర్లు – తెలుగులో కనిపిస్తాయి.
మొత్తం తెలుగులోనే మొదటిసారి శాసనాలు వేసినవారు రేనాటి చోళులు, రేనాడు అంటే ఇప్పటి వై.ఎస్.అర్. కడప జిల్లా ప్రాంతం. రేనాటి చోళరాజు ఎరికల్ ముతురాజు ధనుంజయుడు కలమళ్ల గ్రామంలో వేసిన శాసనం ఇది. శాసనంలో ని పదాలన్నింటికీ మనకు ఇంకా స్పష్టమైన అర్ధాలు తెలియపు. ఇది దాన శాసనం. ఈ దానాన్ని పాడుచేసిన వారికి పంచమహాపాతకాలు కలుగుతాయని ! శాపవాక్యంతో శాసనం ముగిసింది.
నాటి తెలుగు భాష ఎలావుందో, లిపి ఎలా వుందో, శాసనమెలా ఉంటుందో మీరు తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ.
(తొలి తెలుగు దివ్వె – తెలుగు మూలాల అధ్యయన సంఘం వారి సౌజన్యంతో)