AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ

Andhra Pradesh AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ Textbook Exercise Questions and Answers.

AP State Syllabus 5th Class Telugu Solutions Chapter 8 ఇటీజ్ పండుగ

చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ 1
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.

ప్రశ్న 1.
చిత్రంలో ఏం జరుగుతున్నది? ఎవరెవరున్నారు?
జవాబు:
చిత్రంలో వినాయకుని పూజ జరుగుచున్నది. చిత్రంలో వినాయకుడు, ఆయన వాహనం ఎలుక, నమస్కారం చేస్తున్న పిల్లలు ఉన్నారు.

ప్రశ్న 2.
మీరు జరుపుకునే ఒక పండుగ గురించి చెప్పండి.
జవాబు:
మేము జరుపుకునే మొదటి పండుగ ఉగాది. ఈ ఉగాది తెలుగు నెలలోలో మొదటిదైన చైత్రమాసంలో వస్తుంది. చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండుగ ఈ రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. ‘ ఉగస్య ఆది ఉగాది” ఉగము అంటే నక్షత్రం . అది మొదలు.. నక్షత్రగమనానికి మొదలు అని అర్ధం. ఒక సంవత్సరానికి రెండు ఆయనాలు. యుగము అంటే రెండు. ఈ రెండు ఆయనాలకు ప్రారంభరోజు కనుక యుగాది అన్నారు.

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ

ఈరోజు ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాము. ఈ పచ్చడి ‘తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు’ అనే షుడ్రుచుల (6) సమ్మేళనం. బెల్లం, మామిడి ముక్కలు, వేపపూత, ఉప్పు, కారం, చెరకుముక్కలు – ఇలా ఎవరి అలవాట్ల ప్రకారం వారు కలిపి ఉదయాన్నే ప్రసాదంగా తింటాము. కొత్త బట్టలు కట్టుకుంటాము. ఉగాది కవి సమ్మేళనాలు జరుగుతాయి. పంచాగ శ్రవణం ప్రధానంగా జరుగుతుంది. ఈ విధంగా ఉగాది పండుగను జరుపుకుంటాము.

ఇవి చేయండి

వినడం – ఆలోచించి మాట్లాడటం

ప్రశ్న 1.
పండుగ అంటే ఏమిటి ?
జవాబు:
సకుటుంబ – సపరివార – సమేతంగా అందరూ కలిసిమెలసి ఉత్సాహంగా జరుపుకునేదే పండుగ. సంస్కృత సంప్రదాయాలకు ప్రతీక ఈ పండుగ.

ప్రశ్న 2.
ఇటీజ్ పండుగ ఎలా జరుపుకుంటారు? .
జవాబు:
ఇది విశాఖ, విజయనగరం జిల్లాల్లోని మన్యం గిరిజనులు జరుపుకునే పండుగ. సంవత్సరంలోని 12 నెలలో నాల్గవ నెల పేరు ‘విటిజ్’. ఈ నెలలో వారు జరుపుకునే పండుగ ‘ఇటీజ్’. ముందుగా గ్రామస్థులు ఒక సమావేశం పెట్టుకుంటారు. ఈ సమావేశంలో తరువాతి శుక్రవారం చాటింపు వేస్తారు. ఆ తరువాతి శుక్రవారం పండుగ జరుపుకుంటారు.
AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ 3
పండుగరోజు ఇంటి ముందు, గోడల పై ముగ్గులు వేసి _ గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. రైతులు నాగలి, మోకు, పలుపు తాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లు కడిగి దేవుని దగ్గర పెడతారు. మామిడి కాయలు ముక్కలు చేసి బియ్యంతో కలిపి ‘బోనం’ వండుతారు. అది దేవునికి నైవేద్యం పెడతారు. ఆ నైవేద్యం, అన్నం, కూరలు, . వంటలు ఒకరికొకరు ఇచ్చుకుంటారు.

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ

రెండొవ రోజు ‘రొడ్డ కనుసు’ చేస్తారు. రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు, ‘కనుసు’ అంటే ఊరేగింపు. ఈ ఆకులు ఒంటికి కట్టుకుని, తలకు పక్షి ఈకలు పెట్టుకుని, ముఖం పై నలుపు, తెలుపు రంగులు చారలుగా పూసుకుని, రంగులు – బూడిద కలిపిన నీరు వెదురు గొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. పెద్ద పనసకాయను జంతుతల ఆకారంగా చేసి దాని పైకి బాణాలు వేస్తూ ఆడుతూ,పాడుతూ ‘సంకుదేవుని” దగ్గరకు వెళతారు.

ప్రతి ఇంటి నుండి గుప్పెడు విత్తనాలు, బియ్యం సేకరిస్తారు. గుడి దగ్గర బియ్యం వండి సంకుదేవునికి నివేదన చేస్తారు. ఆ విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు. మిగిలిన విత్తనాలు వారం రోజుల తరువాత ప్రతి ఇంటికి పంచుతారు. ప్రతి ఇంట్లో ఆ విత్తనాలను వారి వారి అసలు విత్తనాలలో కలుపుకుంటారు.
AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ 4
మూడు నుండి ఆరు రోజుల్లో ఏదో ఒకరోజు గ్రామస్థులంతా వేటకు వెళతారు. వేటకు వెళ్ళని వారిని – వరసైన వారు ఎగతాళి చేస్తారు. ‘వేట సాధించిన వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది”.

ఏడవరోజున అంటే చివరి రోజును “మారు ఇటీజ్” లేదా “నూరు ఇటీజ్” అంటారు. ఆరోజు దారికి అడ్డంగా వెదరు బొంగు కడతారు. వచ్చే పోయే వారికి ఆ వెదురు గోట్టాలతో వారి పై నీళ్ళు చల్లుతారు. వెదురు కర్రకు తాళ్ళను కట్టి ఊయలగా చేసి ఊగుతారు.

ఈ విధంగా మన్యం గిరిజనులు ‘ఇటీజ్’ పండుగ జరుపుతారు.

ప్రశ్న 3.
మనం జరుపుకునే పండుగలకు, గిరిజనలు జరుపుకునే పండుగలకు తేడా ఏమిటి ?
జవాబు:

  1. మనం జరుపుకునే పండుగలు – చాలా వరకు ఆచారాలు, పురాణ సంప్రదాయాలను, ఇతిహాసాలను, చారిత్రక నేపధ్యానికి కట్టుపడి ఉంటాయి.
  2. మనం జరుపుకునే పండుగలు – ఎక్కువ శాతం తిధులు నక్షత్రాలపై ఆధారపడి ఉంటాయి.
  3. ఆచార వ్యవహారాలపై ఆధారపడి ఉంటాయి.
  4. గిరిజనులు జరుపుకునే పండుగలు – వారి వారి ప్రాంతాలకు సంబంధించినవై ఉంటాయి,
  5. వారి వారి ఆచారాలు, కట్టుబాట్లకు, కట్టుబడి ఉంటాయి.
  6. వేషధారణలకు – ప్రాధాన్యత కలిగి ఉంటాయి.
  7. వారు బ్రతుకుతున్న – నేపధ్యానికి అనుకూలంగా ఉంటాయి.
  8. వారి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేల ఉంటాయి.

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ

చదవడం – వ్యక్త పరచడం

అ) కింది పేరాను చదవండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి పిల్లలు బడిని అందంగా ముస్తాబు చేస్తారు. వారివారి తరగతులను రంగురంగుల కాగితాలతో అలంకరిస్తారు. గుమ్మాలకు తోరణాలు కడతారు. తరగతిగది లోపలా బయటా ముగ్గులు వేస్తారు. పిల్లలందరూ దేశభక్తి గీతాలు సాధన చేసి జెండా వందనం రోజు పాడతారు. జనవరి 26వ తేదీన జరిగే గణతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకోవడం పిల్లలకు ఎంతో ఇష్టం. ఆ రోజు బడి అంతా పండుగ వాతావరణంతో కళకళలాడుతుంది.
AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ 5
ప్రశ్న 1.
గణతంత్ర దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
జవాబు:
ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకుంటారు.

ప్రశ్న 2.
మీ బడిని గణతంత్ర దినోత్సవం రోజున ఎలా అలంకరిస్తారు ?
జవాబు:
బడిని ఆందంగా ముస్తాబు చేస్తారు. తరగతులను రంగు రంగుల కాగితాలతోను, గుమ్మాలను తోరణాలతోను అలంకరిస్తారు. ముగ్గులు వేస్తారు.

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ

ప్రశ్న 3.
మీరు ఏయే దేశభక్తి గీతాలు పాడతారు ?
జవాబు:
వందేమాతరం, జనగణమన, సారే జహసే అచ్చా – జెండా పాటలు పాడతాం.

ప్రశ్న 4.
మీ బడిలో ఏయే పండుగలు జరుపుకుంటారు ?
జవాబు:
మా బడిలో ఆగష్టు-15, నవంబరు – 14, జనవరి – 26, అక్టోబరు-2 (గాంధీ పుట్టినరోజు), సెప్టెంబరు-5 (గురుపూజోత్సవం) జరుపుకుంటాము.

ఆ) కింది పండుగ గురించి చదవండి. ప్రశ్నలు తయారు చేయండి.

మన పండుగలలో “దసరా” ఒకటి. ఇది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు జరుగుతుంది. అందుకే “దేవీ నవరాత్రులు” అంటారు. జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమిరోజు విజయం సాధించింది. అందుకే పదవ రోజును విజయదశమి అంటారు. ఈ పండుగ “శక్తి” ఆరాధనకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పండుగ రోజుల్లో దేవికి ఒక్కొక్కరోజు ఒక్కొక్క అలంకారంతో పూజలు చేస్తారు. విజయదశమి నాడే రాముడు రావణాసురుని పై విజయం సాధించాడు. అజ్ఞాత వాస సమయంలో జమ్మిచెట్టుపై పెట్టిన ఆయుధాలు పాండవులు తిరిగి తీసుకున్న రోజు కూడా విజయదశమే. అందువల్ల, జమ్మి ఆకులతో ఈ రోజు పూజచేస్తే మంచి జరుగుతుందంటారు.
AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ 6
జవాబు:
ప్రశ్నలు:

  1. దసరా ఎప్పుడు జరుపుకుంటాము?
  2. దసరా పండుగకు కారణం ఏంటి ?
  3. ఈ పండుగలో పదవరోజు ఏమంటారు ?
  4. విజయదశమి నాడు విజయం సాధించింది ఎవరు?
  5. ఈ పండుగ రోజున జమ్మిచెట్టు ప్రాధాన్యత ఎందుకు వచ్చింది?

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ

పదజాలం

అ) ఇటీజ్ పండుగ పాఠంలో మీరు గమనించిన కొత్త పదాలను రాయండి.
జవాబు:

  1. చైత్ పొరొబ్
  2. తుడుము
  3. కొమ్ముబూర
  4. థింసా
  5. రొడ్డు కనుసు
  6. నూరు ఇటీజ్
  7. కుదరు
  8. సంకు దేవుడు

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ

ఆ) పాఠంలో ఆడుతూపాడుతూ లాంటి జంట పదాలు ఉన్నాయి. కింది జంట పదాలను చదవండి. వాటిలో ఏవైనా నాలుగు జంట పదాలతో సొంతవాక్యాలు రాయండి.

శుచి – శుభ్రం
అన్నెం – పున్నెం
ఇరుగు – పొరుగు
ఇల్లు – వాకిలి
ఊరు – పేరు
ఉక్కిరి – బిక్కిరి
తిండి – తిప్పలు
కట్టు – బొట్టు
చిందర – వందర
నగ – నట్ర
పొలం – పుట్ర

జవాబు:

  1. శుచి – శుభ్రం అనేవి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి.
  2. చదువు కోకపోతే బ్రతుకు చిందర – వందర.
  3. అతడు అన్నెం – పున్నెం తెలియని అమాయకుడు.
  4. తిండి తిప్పలు లేక వలస కార్మికులు కష్టపడ్డారు.
  5. మన కట్టు-బొట్టు సంప్రదాయాన్ని – గౌరవాన్ని కాపాడతాయి.
  6. ఇరుగు-పొరుగు వారితో మంచిగా ఉండాలి.

ఇ) కింది మాటలను చూడండి. మొదట + మొదట = మొట్టమొదట అవుతుందని మన వ్యాకరణాలు చెప్తున్నాయి. ఇటువంటి మరికొన్ని మాటలు చూడండి.

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ

తుట్ట – తుట్టతుద
అట్ట – అట్టడుగు
కట్ట – కట్టకడ
చిట్ట – చిట్టచివర
ఎట్ట – ఎట్టకేలకు
పట్ట – పట్టపగలు
వీటిలో నాలుగింటిని వాక్యాలలో ఉపయోగించండి.
ఉదా : మొట్టమొదట : మన మొట్ట మొదటి – పండుగ ఉగాది.
జవాబు:

  1. ఎట్టకేలకు – అందరం ఎట్టకేలకు ఇంటికి చేరాము.
  2. చిట్ట చివర – ఊరు చిట్టచివర మజ్జిచెట్టు.
  3. అట్ట డుగు – కుండ అట్టడుగున నీరు త్రాగకూడదు.
  4. పట్ట పగలు – ఆ వీధిలో పట్టపగలు దొంగతనం జరిగింది.

స్వీయరచన

ప్రశ్న 1.
ఇటీజ్ పండుగను ఎప్పుడు చేసుకుంటారు?
జవాబు:
మార్చి లేదా, ఏప్రిల్ నెలలో చేస్తారు.

ప్రశ్న 2.
కుదురు వద్ద ఏం పెడతారు? దానిని ఎలా తయారు చేస్తారు?
జవాబు:
కుదురు వద్ద బోనం పెడతారు. దానిని మామిడి ముక్కలను బియ్యంతో కలిపి తయారు చేస్తారు.

ప్రశ్న 3.
ఇటీజ్ పండుగ రెండవరోజు ఎలా జరుపుకుంటారు?
జవాబు:
రెండవరోజు ‘రొడ్డ కనుసు’ చేస్తారు. అంటే మామిడి – సీతాఫలం మొదలైన ఆకులు కట్టుకుని, తలకు పక్షి ఈకలు పెట్టుకుని, ముఖంపై నలుపు, తెలుపు రంగు చారలుగా పూసుకుని, రంగులు – బూడిద కలిపిన నీళ్ళు వెదురు గొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారు. పెద్ద పనపకాయను జంతువు తలగా చేసి దాని పైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ ‘సంకుదేవుని’ దగ్గరకు వెళ్తారు. ప్రతి ఇంటి నుండి గుప్పెడు బియ్యం సేకరించి గుడి దగ్గర వండి సంకుదేవునికి నివేదన చేస్తారు. అది ప్రసాదంగా తింటారు. ఈ విధంగా రెండవరోజు జరుపుకుంటారు.

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ

ప్రశ్న 4.
ఇటీజ్ పండుగ చివరి రోజు ఏయే కార్యక్రమాలు చేస్తారు ?
జవాబు:
చివరిరోజును ‘మారు ఇటీజ్’ లేక ‘నూరు ఇటీజ్’ అంటారు. ఆరోజు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు. వెదురు గొట్టాలతో వచ్చే పోయే వారిపై నీళ్ళు చల్లుతారు. వెదురు కర్రకు తాళ్ళను కట్టి ఊయలగా చేసి ఊగుతారు.

ప్రశ్న 5.
మీరు జరుపుకునే ఒక పండుగ గూర్చి రాయండి.
జవాబు:
మేము జరుపుకునే మొదటి పండుగ ఉగాది. ఈ ఉగాది తెలుగు నెలలో మొదటిదైన చైత్రమాసంలో వస్తుంది. చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండుగ. ఈ రోజున సృష్టి జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. ‘ ఉగస్య ఆది ఉగాది” ఉగము అంటే నక్షత్రం . అది మొదలు. నక్షత్రగమనానికి మొదలు అని అర్ధం. ఒక సంవత్సరానికి రెండు ఆయనాలు. యుగము అంటే రెండు ఈ రెండు ఆయనాలకు ప్రారంభరోజు కనుక యుగాది అన్నారు.

ఈరోజు ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాము. ఈ పచ్చడి ‘తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు’ అనే షుడ్రుచుల (6) సమ్మేళనం. బెల్లం, మామిడి ముక్కలు, వేపపూత, ఉప్పు, కారం, చెరకుముక్కలు – ఇలా ఎవరి అలవాట్ల ప్రకారం వారు కలిపి ఉదయాన్నె ప్రసాదంగా తింటాము. కొత్త బట్టలు కట్టుకుంటాము. ఉగాది కవి సమ్మేళనాలు జరుగుతాయి. పంచాగ శ్రవణం ప్రధానంగా జరుగుతుంది. ఈ విధంగా ఉగాది పండుగను జరుపుకుంటాము.

సృజనాత్మకత

ఇటీజ్ పండుగ గూర్చి నీ మిత్రునకు లేఖ రాయండి.
జవాబు:
లేఖ

విజయవాడ,
24.6.2020

ప్రియమైన మిత్రుడు, సాహిత్ కు,
తేజ వ్రాయునది—

సాహిత్ అక్కడ నీవు క్షేమమని తలచుచున్నాను. ఇక్కడ నేను క్షేమం. ఈ లేఖ నీకు వ్రాయటానికి కారణం – నీకు ఒక కొత్త పండుగ గురించి చెప్పాలని వ్రాస్తున్నాను.

మొన్న సెలవులలో నేను మా పెదనాన్న గారి ఊరు ‘పాడేరు’ వెళ్ళాను. అక్కడి గిరిజనులు జరుపుకునే ‘ఇటీజ్’ అనే పండుగను చూశాను. ఈ పండుగ రోజున వీళ్ళు డప్పులు, తుడుములు, కొమ్ముబూరలు వాయిస్తూ, సందడిగా చేస్తారు. వీళ్ళు ఈ పండుగ రోజులు చేస్తారు. వాళ్ళ ‘కుదురు’ దేవునికి బోనం నివేదన చేస్తారు. మరొకరోజు ‘రొడ్డ కనుసు’ చేస్తారు. ఈ పండుగ చాలా చిత్రంగా ఉంటుంది. చూసి తీరాల్సిన పండుగ. మరిన్ని విశేషాలు మనం కలిసినప్పుడు చెప్తాను. నువ్వు కూడా ఇలాంటి పండుగ ఏదైనా చూసావా! తెలియచేయి.

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ

ఇట్లు
నీ మిత్రుడు
తేజ

చిరునామా
శ్రీ శివగారు,
గాంధీనగర్,
గుంటూరు.

భాషాంశాలు

అ) కింది వాక్యాలను చదవండి. గీత గీసిన అక్షరాలను గమనించండి.

  1. పాలు, సేమ్యాతో పాయసం చేస్తారు.
  2. మీ కోసం నేను బొమ్మలు తెచ్చాను.
  3. తరుణ్ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది.
  4. సుస్మితకు శిరీష చాక్లెట్లు ఇచ్చింది.
  5. హనుమంతుడు రాముని యొక్క దూతగా లంకకు వెళ్ళాడు.
    AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ 7

పై వాక్యాలలో గీత గీసిన వాటిని గమనించారు కదా! ఇవి లేకుంటే వాక్యాలు పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు కదా! అంటే ఇవి వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇలాంటి వాటిని ‘విభక్తి ప్రత్యయాలు’ అంటారు. ఈ ప్రత్యయాలు ఎనిమిది. ఇవి లేకపోతే పదాల మధ్య సంబంధం సరిగా తెలియదు.

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ
AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ 8
కింది ఖాళీలను సరైన ప్రత్యయాలతో పూరించండి. విభక్తులను బ్రాకెట్లలో రాయండి.
ఉదా : ఊరిలో ఇటీజ్ పండుగ చేస్తున్నారు. ( షష్ఠీ విభక్తి )
1. శ్రీకాకుళం ……………….. దీనిని ‘మామిడి టెంక పండుగ’ అంటారు ( )
2. ఇటీజ్ పండుగ ……………….. ‘చైత్ పొరొబ్’ అని కూడా అంటారు. ( )
3. ఈ పండుగ విజయనగరం ప్రాంతం……………….. చేస్తారు. ( )
4. మంచి పుస్తకం ……………….. మంచి మిత్రుడు లేడు. ( )
5. మట్టి ………………… బొమ్మలు చేయవచ్చు. ( )
జవాబు:
1. శ్రీకాకుళంలోదీనిని ‘మామిడి టెంక పండుగ’ అంటారు ( షష్ఠీ విభక్తి )
2. ఇటీజ్ పండుగను చైత్ పొరొబ్’ అని కూడా అంటారు. (ద్వితీయ విభక్తి)
3. ఈ పండుగ విజయనగరం ప్రాంతంలో చేస్తారు. ( షష్ఠీ విభక్తి )
4. మంచి పుస్తకం కంటే మంచి మిత్రుడు లేడు. (పంచమీ విభక్తి)
5. మట్టితో బొమ్మలు చేయవచ్చు. (తృతీయ విభక్తి)

ప్రాజెక్టు పని

మీ గ్రామాల్లో జరిగే పెళ్లిళ్ళు, పండుగలు జాతరలలో ఉపయోగించే సంగీత వాయిద్యాల గురించి సమాచారం సేకరించి పట్టికను రాయండి. అందులో ఒక వాయిద్యం గురించి రాసి, తరగతి గదిలో ప్రదర్శించండి.

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ

పాడుకుందాం :

తేనెకన్న మధురం రా తెలుగు

తేనెకన్న మధురం రా, తెలుగు, ఆ
తెలుగుదనం మా కంటి వెలుగు.

ఆరుద్ర తెలుగుగడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన, మా
తెలుగు గుండెలో స్నేహం ఎంత వెచ్చన!
మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన, మన
తరతరాల కథను పాడు గుండె ఝల్లన.
AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ 9
పాటుపడిన వాళ్ళకే లోటు లేదని
చాటి చెప్పు తల్లికదా తెలుగుతల్లి

లలితకళలు సంగీతం సాహిత్యం
తెలుగుతల్లి జీవితాన దినకృత్యాలు.
గత చరిత్ర ఘన చరిత్ర ఎంత ఖ్యాతి!
గర్వించదగ్గ జాతి తెలుగుజాతి!

అయినా గతంకన్న భవిష్యత్తు ఆశాజనకం
ఆ భావికొరకు ధరించాలి దీక్షాతిలకం

అ) కింది పాట పాడండి, ఇవి సవర భాషలో, తెలుగు భాషలో ఉన్నాయి.
AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ 10

కవి పరిచయం

కవి : గిడుగు వెంకట రామమూర్తి
కాలము : 29-8-1863 నుండి 22-1-1940 వరకు
రచనలు : “బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం”

విశేషాంశాలు : ఆధునిక తెలుగు భాషా ప్రవక్త. ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంథిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు. తన జీవిత కాలంలో వ్యావహారిక భాషా ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. సవర పాటలు, కథల సేకరించి సవర వాచకాలు రూపొందించారు. సవర-ఇంగ్లీషు నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన చేశారు. సవరల కోసం సవర వ్యాకరణం రచించారు. భారతదేశంలో తొలి తరం మానవశాస్త్రవేత్తలో ఒకరు.
AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ 2

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ

పదాలు – అర్థాలు

తుడుము = గిరిజన వాయిద్య పరికరం
కొమ్ముబూర = కొమ్ముతో తయారు చేసే బూర
సందడి = పండుగలో అందరూ కలిసిమెలసి తిరుగడం
మొక్కుబడులు = భగవంతునికి చెల్లించే ముడుపులు
తోరణం = గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ
కుదురు = కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక
హేళన = ఎగతాళి
థింసా, కోయ = గిరిజన నృత్యాలు
అటక = చిన్నమిద్దె
రొడ్డ కనుసు = గ్రామ ఊరేగింపు

చదువు – అర్థం చేసుకో – ఆనందించు. పరీక్షల కోసం కాదు.

క్రిస్మస్

ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగలలో క్రిస్మస్ పండుగ ఒకటి. ఈ పండుగ క్రైస్తవులకు అతి పెద్ పండుగ. డిసెంబరు 24న క్రిస్మస్ ఈవగానూ, 25న క్రిస్మస్ గానూ జరుపుకుంటారు.

సంప్రదాయ కథనాల ప్రకారం జీసస్ ఒక పశు వులశాలలో, పశువుల మధ్య పుట్టాడని, జన్మించగానే ఆయ తల్లి మేరీ మాత ఆయనను వస్త్రాలతో చుట్టి – వారున్న ధర్మశాలలో ఖాళీ లేనందున పశువుల కొట్టంలోనే ఉంచవలసి వచ్చిందని ‘బైబిలు’ చెబుతోంది. ఆయన పుట్టిన రోజు రాత్రి ఆ ఊరికి పక్కనున్న పొలాల్లో కొందరు పశు, వుల కాపర్లు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు.
AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ 11

AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ

అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగి వచ్చాడు. ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు – గొర్రెల కాపరులు భయపడ్డారు. దేవదూత వాళ్ళతో “భయపడకండి ఇదిగో మీకొక – సంతోషకరమైన శుభవార్త. ఇవ్వాళ బెత్ల హేంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు. ఆయన అందరికీ ప్రభువు. ఒక పసికందు పొత్తిగుడ్డలో చుట్టబడి పశువులశాలో ఉన్న దాణా తొట్టెలో పడుకుని ఉంటాడు.

ఇదే మీకు అనవాలు.” దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా దేవదూతలతో నిండిపోయింది. వాళ్ళంతా దేవునికి స్తుతి అగీతాలు పాడి మాయమయ్యారు. గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకకు చేరుకున్నారు. అక్కడ తొట్టెలో పడుకుని ఉన్న శిశువును చూశారు.

అలా 2000 సంవత్సరాల కిందట డిసెంబరు 24వ తేదీ అర్ధరాత్రి ఏసుక్రీస్తు – జన్మించాడు. అందువల్ల ఆ మరునాడు అంటే డిసెంబరు 25వ తేదీ క్రిస్మస్ పండుగని -జరుపుకుంటున్నారు.
AP Board 5th Class Telugu Solutions 8th Lesson ఇటీజ్ పండుగ 12
ఈ పండుగకు క్రైస్తవులు తమ ఇళ్ళను, చర్చిలను అలంకరిస్తారు, వెదురు బద్దలతో, రంగు కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారుచేసి ఇంటికప్పు మీద ఎత్తులో పెడతారు. రాత్రివేళ దీపాలంకరణతో ఇళ్ళు, చర్చిలు అందంగా ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ ఒక క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేస్తారు. ఇది ఈ పండుగ ప్రత్యేకత.

ఈ చెట్టును రంగురంగుల ఆ కాగితాలతోనూ, కాగితపు నక్షత్రాలతోనూ, చిరు గంటలతోనూ, చిన్న, చిన్న గాజు గోళాలతోనూ అలంకరిస్తారు. క్రిస్మస్ రోజున బంధువుల ఇళ్ళకు, మిత్రుల ఇళ్ళకు వెళ్ళి ప్రేమాభిమానాలతో క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతారు.