Andhra Pradesh AP Board 5th Class Telugu Solutions 9th Lesson తరిగొండ వెంగమాంబ Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 5th Class Telugu Solutions Chapter 9 తరిగొండ వెంగమాంబ
చిత్రం చూడండి. ఆలోచించి మాట్లాడండి.
ప్రశ్నలకు జవాబులు చెప్పండి.
ప్రశ్న 1.
చిత్రంలో ఎవరెవరు ఉన్నారు? వారి గురించి మీకు తెలిసింది చెప్పండి.
జవాబు:
చిత్రంలో సావిత్రిబాయి ఫూలే, సరోజినీ నాయుడు, కస్తూర్భాగాంధీ, ఆతుకూరి మొల్ల.
1. సావిత్రిబాయి ఫూలే :
ఈమె భారతీయ సంఘ సంస్కర్త. ఉపాధ్యాయిని రచయిత్రి. ఈమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతిరావు ఫూలే భార్య. కులమతాల అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిని. ఈమె ‘మహారాష్ట్రలోని ‘సతారా’ జిల్లాలో ‘నయాగావ్’ అనే గ్రామంలో 1831 జనవరి-3న ఒకరైతు కుటుంబంలో జన్మించింది. 1840లో ఈమె 9వ ఏట, 12 ఏండ్ల వయసున్న జ్యోతిరావు ఫూలేను వివాహమాడింది. భర్తయే ఈమె. మొదటి గురువు.
2 సరోజినీ నాయుడు :
“భారత కోకిల”గా ప్రసిద్ది చెందిన ఈమె స్వాతంత్ర్య సమరయోధురాలు. కవయిత్రి. అఖిలభారత జాతీయ కాంగ్రెస్ (1952) మహాసభలకి తొలి మహిళా అధ్యక్షురాలు. ఈమె 1879లో ఫిబ్రవరి 13న హైదరాబాద్లో అఘోరనాధ్ చటోపాధ్యాయ. వరదసుందరీ దేవి దంపతులకు జన్మించినది. ఈమెకు మరో పేరు సరోజనీ ఛటోపాధ్యాయ. డా|| ముత్యాల గోవిందరాజులు నాయుడు ఈమె భర్త. జయసూర్య నాయుడు, పద్మజానాయుడు, రణధీర్ నాయుడు, నిలవార్ నాయుడు, లాలామణి నాయుడు, – వీరి సంతానం. ఈమె మొట్టమొదటి మహిళా గవర్నర్ [U.P] కూడా.
3. కస్తూర్బాగాంధీ :
కస్తూరిబాయి మోహన్ దాస్ గాంధీ భారత రాజకీయ కార్యకర్త. ఈమె మహాత్మగాంధీ భార్య. భర్తతో పాటు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నది. ఈమెను తన భర్త ప్రభావితం చేసాడు. ఈమె పోర్బందర్ లో 1869 ఏప్రియల్ 11న జన్మించింది. పూనేలో 1944లో ఫిబ్రవరి 22న మరణించెను. దక్షిణాఫ్రికా ప్రవాస భారతీయుల జీవన, పోరాటంలో గాంధీజీతో కలసి పోరాడెను.
4. ఆతుకూరి మొల్ల :
ఈమె అసలు పేరు ఆతుకూరి మొల్ల. ఈమె 16వ శతాబ్దపు కవయిత్రి. తెలుగులో రామాయణం రాసింది. ఈ రామాయణం మొల్ల రామాయణంగా తెలుగులో ప్రసిద్ధి పొందినది. ఈమె శైలి చాలా సరళమైనది. రమణీయమైనది. ఈమె కడప జిల్లా (ప్రస్తుత వై.యస్.ఆర్. జిల్లా)లో 1940లో గోపవరం మండలంలో గోపవరం గ్రామంలో జన్మించింది. గ్రంధావతారకను బట్టి ఏ గురువు వద్ద విద్య నభ్యసించలేదని ‘గోపవరపు శ్రీ కంఠ, మల్లీశుకృపచేత కవిత్వము అచ్చినదని తెలుస్తోంది. పోతన వలెనే ఈమె కూడా!
చెప్పమని రామచంద్రుడు,
చెప్పించిన పలుకు మీద జెప్పెదనే నెల్లప్పుడు నిహాపర సాధన,
మిప్పుణ్య చరిత్ర తప్పు లెంచకుడు కవుల్.
— మొల్ల
ప్రశ్న 2.
మీ అమ్మ గురించి చెప్పండి.
జవాబు:
మా అమ్మ చాలా మంచిది. మా అమ్మంటే నాకు చాలా ఇష్టం. మా అమ్మకు నేనంటే కూడా చాలా ఇష్టం. నన్ను చాలా ప్రేమగా చూస్తుంది. నన్ను చక్కగా చదివిస్తుంది. నాకు ఇష్టమైనవెన్నో చేసి పెడుతుంది. నేనేమైనా తప్పుచేస్తే…. కొట్టకుండా! నన్ను మందలిస్తుంది. నేను చేసే తప్పు వలన ఎన్ని ఇబ్బందు లొస్తాయో! ప్రేమతో చెబుతుంది.
నన్ను మంచి మార్గంలో నడిపిస్తుంది. రామాయణ, భారత, భాగవతాలలో చిన్నతనంలోనే మంచి పేరు తెచ్చుకున్న శ్రవణుడు. ప్రహ్లాదుడు, ధ్రువుడు, రాముడు మొదలగు వారి కథలు చెప్పి నాకు మార్గ నిర్దేశం చేస్తుంది. అందుకనే మా అమ్మంటే నాకు చాలా ఇష్టం.
ప్రశ్న 3.
మీరు చూపిన ఉద్యోగం చేస్తున్న ఆడవాళ్ళ గురించి చెప్పండి.
జవాబు:
మొదటగా ను అన్ము : నేను చూసిన ఉద్యోగం చేస్తున్న అడవాళ్ళలో మొదటిది మా అమ్మ. అమ్మ రోజు ఉదయం మా అందరికంటే ముందు లేస్తుంది. ఇల్లు శుభ్రం చేసుకునితను స్నానం చేసి పూజ చేసుకుని- నాన్నకు, నాకు, అక్కకు ఏమేమి ఇష్టమో అవి వండి క్యారేజీలు సర్ది-అప్పుడు మమ్మల్ని లేపి – మా స్కూలు బస్ వచ్చేలోపు మమ్మల్ని సిద్ధం చేసి-మాకు టాటా చెప్పి మమల్ని స్కూలుకు పంపించి – నాన్నకు బాక్సు ఇచ్చి తను క్యారేజీ తీసుకుని అపుడు ఉద్యోగానికి వెళ్తుంది.
మేము ఇంటికొచ్చిన కొద్దిసేపటికి తనూవస్తుంది అప్పుడు మళ్ళీ మాకు రుచికరమైనవి చేసిపెట్టి. మాతోపాటు కూర్చొని చదివించి, హోంవర్క్ చేయించి మమల్ని నిద్రపుచ్చి, తను కూడా నిద్రపోతుంది……
అమ్మ తరువాత నేను చూచిన ఉద్యోగం చేసే ఆడవాళ్ళల్లో రెండోవ్యక్తి మా టీచరు గారు ……..
ఇవి చేయండి
వినడం – ఆలోచించి మాట్లాడటం
ప్రశ్న 1.
వేంగమాంబలో మీకు వచ్చిన లక్షణాలు ఏమిటి ?
జవాబు:
ఆనాటి మూఢచారాలు ఎదిరించింది. ఎన్నో బాధలను, కష్టాలను తట్టుకుని సమాజంలో స్త్రీ తలచుకుంటే ఎంతో సాధించకలదు అని నిరూపించింది. ఆమె సంగీత సాహిత్యాలలోని అభినవేశము కలిగిన భక్తురాలు. ఎన్నో శతకాలు, గ్రంధాలు, భక్తి పారవశ్యంతో రచించినది. వెంగమాంబలోని ఈ విధమైన లక్షణాలు నాకు నచ్చినవి.
ప్రశ్న 2.
ఆనాటి సమాజ పరిస్థితులు ఎలా ఉండేవి?
జవాబు:
సమాజంలో కుల, మత భేదాలతో పాటు పేద-ధనిక, పండిత పామర; పాలకులు-పాలితులు, అధికారులు-సామాన్యులు; వంటి హెచ్చు తగ్గులుండేవి. సమాజంలో మూఢాచారాలుండేవి. భర్త చనిపోయిన స్త్రీ – బొట్టు కాటుక, జుట్టు, గాజులు తీసేయాలి. ఇవేకాక ఇంకా ఎన్నో మూఢచారాలతో సమాజ పరిస్థితులు ఆధారపడి ఉండేవి.
ప్రశ్న 3.
వేంగమాంబ ఏయే రచనలు చేశారు?
జవాబు:
నారసింహ శతకం, నారసింహ విలాస కధ, శివనాటకం, రాజయోగసారం, కృష్ణ నాటకం, పారిజాతా పహరణం, చెంచునాటకం, శ్రీ కృష్ణమంజరి, శ్రీ రుక్మిణీ నాటకం; ద్విపద భాగవతం, వాసిష్ఠ రామాయణం, ముక్తి కాంతా విలాసం, శ్రీ వేంకటాచల మహాత్మ్యం , అష్టాంగయోగసారం, అనే రచనలు చేసింది. వెంగమాంబ యక్షగానాలు చాలా ప్రసిద్ధి.
చదవడం – వ్యక్త పరచడం
అ) కింది పేరాను చదవండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
శ్రీమతి పొణకా కనకమ్మ:
పొణకా కనకమ్మ, నెల్లూరు జిల్లా మినగల్లు గ్రామంలో 10-6-1892న జన్మించారు. తండ్రి మరుపూరు కొండారెడ్డి, తల్లి కామమ్మ. మంచి సంపన్న స్థితిలోని కుటుంబానికి చెందినవారు. చిన్నతనంలోనే బాల్య వివాహం జరిగింది. ఆమె అప్పటిదాకా పెద్దగా ఏమీ చదువుకోనట్లే లెక్క. స్వయం కృషితో ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృతాలను | నేర్చి పాండిత్యాన్ని సాధించిన విదుషీమణి. సమాజ ఉద్ధరణ ఆమె జీవిత ధ్యేయంగా ఎంచుకున్నారు.
1913లో నెల్లూరుకు దగ్గరలో ఉన్న పొట్లపూడి గ్రామంలో “సుజన రంజని సమాజం” అనే సేవా సంస్థను స్థాపించి అర్హులకు సేవలు అందజేశారు. ముఖ్యంగా హరిజనులకు, సమాజంలో – అట్టడుగున ఉన్న దీనులకు, ఉన్నత స్థితి కల్పించటంలో ఆమె సేవలు సఫలమయ్యాయి. వారి జీవితాలను చీకటి నుండి వెలుగులోకి తెచ్చి సఫలీకృతు రాలైనారు కనకమ్మగారు.
ఆ ఏడాదే ఆమే స్నేహితులందరూ కలిసి నెల్లూరు రామానాయుడు వంటి వితరణ శీలుర ప్రోత్సాహంతో కొత్తూరు గ్రామంలో “వివేకానంద గ్రంధాలయం” ఏర్పాటు – చేసి పుస్తకాలతో విశ్వదర్శనం చేయటానికి గొప్ప అవకాశం కల్పించారు. కనకమ్మగారు జాతీయోద్యమంలో మహాత్మగాంధీ గారి శిష్యురాలై గణనీయంగా.. తన వంతు సేవలందించారు.
ప్రశ్నలు – జవాబులు:
ప్రశ్న 1.
పై పేరాలో ఎవరి గురించి చెప్పారు?
జవాబు:
శ్రీమతి పొణకా కనకమ్మ గారి గురించి చెప్పారు.
ప్రశ్న 2.
పొణకా కనకమ్మ ఏ సేవాసంస్థమ స్థాపించారు?
జవాబు:
“సుజన రంజని సమాజం” స్థాపించారు.
ప్రశ్న 3.
పొణకా కనకమ్మ స్థాపించిన గ్రంథాలయం ఏది ? దాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
జవాబు:
పొణకా కనకమ్మ స్థాపించిన గ్రంథాలయం “వివేకానంద గ్రంథాలయం” ఇది కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేశారు.
ఆ) కింది పేరాను చదవండి. తప్పు ఒప్పులను గుర్తించండి.
చుండూరు రత్నమ్మ:
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో రావు బహుదూర్ పైండా వెంకట చలపతి అనే జమీందార్ గారి పుత్రికారత్నం రత్నమ్మ. 7-2-1891న కాకినాడలో జన్మించింది. చిన్నతనం నుండి దేశం పరాయి వారి పాలన నుండి విముక్తం కావాలని కలలు కనేది.
ప్రముఖ గాంధేయ వాది, సంఘ సేవకురాలు, సంఘ సంస్కర్త అయిన రత్నమ్మ 1940లో వితంతు వివాహాలు జరిపించి సంస్కరణను ఆచరణలోకి తెచ్చిన ఉద్యమశీలి. స్త్రీలు స్వతంత్రంగా తమ కాళ్ల మీద నిలబడాలన్నది ఆమె ధ్యేయం. అందుకోసం వారి ఉపాధి కోసం “మహిళా పారిశ్రామిక సంఘం” ఏర్పరచింది. ఇందులో కుల, మత వివక్షను పాటించకుండా దళిత, హరిజన, అనాధ మహిళలకు స్థానం కల్పించి వారికి కుట్టుపనిలో శిక్షణ నిప్పించి, కుట్టు మిషన్లు కొని అందజేసిన దీన జన బాంధవురాలు.
” విద్య అందరి హక్కు” అని రత్నమ్మ నమ్మారు. అందుకోసం విద్యా గ్రంథాలయాలు ఏర్పరిచారు. సంస్కృతం, తెలుగు నేర్పటమే కాక సంగీతం, నృత్యం మొదలైన కళలలో ఆసక్తి ఉన్న బాలబాలికలకు ఆర్థిక సాయం అందించారు. తనలాగే స్త్రీ జనాభ్యున్నతి కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలను గుర్తించి వారికి కావలిసిన ఆర్థిక సదుపాయాలు అందజేసి వారిక వికాసానికి తోడ్పడ్డారు.
- చుండూరి రత్నమ్మ నెల్లూరు జిల్లాలో జన్మించింది. ( )
- స్త్రీలు స్వతంత్రంగా తమ కాళ్ళమీద నిలబడాలన్నది ఆమె ధ్యేయం. ( )
- ‘విద్య అందరి హక్కు’ అని రత్నమ్మ నమ్మారు. ( )
- చుండూరు రత్నమ్మ 2-7-1981లో జన్మించారు. ( )
జవాబు:
- చుండూరి రత్నమ్మ నెల్లూరు జిల్లాలో జన్మించింది. ( తప్పు )
- స్త్రీలు స్వతంత్రంగా తమ కాళ్ళమీద నిలబడాలన్నది ఆమె ధ్యేయం ( ఒప్పు )
- ‘విద్య అందరి హక్కు’ అని రత్నమ్మ నమ్మారు. ( ఒప్పు )
- చుండూరు రత్నమ్మ 2-7-1981లో జన్మించారు. ( తప్పు )
ఇ) కింది పేరాను చదవండి. ప్రశ్నలు తయారు చేయండి.
జయంతి సూరమ్మ:
తాగుడు వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తూ “కల్లు మానండోయ్ బాబూ” అంటూ ధర్నా చేసింది జయంతి సూరమ్మ. ఈమె 1887లో శ్రీకాకుళం జిల్లా కవట అగ్రహారంలో పుట్టారు. కందుకూరి వీరేశలింగంగారి ప్రభావంతో సంఘసేవే పరమావధిగా భావించారు. ఆ రోజుల్లోనే తాగుబోతుల వెకిలి వేషాలను ప్రహసనాలుగా చేసి ప్రదర్శించేవారు. దాంతో ప్రజలకు బుద్ధివచ్చి “కల్లు జోలికి పోము” అని శపథం చేశారు. జయంతి సూరమ్మ లాగే దువ్వూరి సుబ్బమ్మ, దూబగుంట రోశమ్మ మద్యపాన నిషేధానికి కృషి చేశారు.
కాలం మారుతున్నా సమాజంలో ఈ తాగుడు చాపకింద నీరులాగా వ్యాపిస్తూ ఉంది. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి నేడు ప్రభుత్వం మధ్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తోంది. బెల్టుషాపులను రద్దు చేసింది. అమ్మకాలను కట్టడి చేసింది. ఈ చర్యలవల్ల ఎన్నో కుటుంబాల జీవితాలు ఆనందమయం అవుతున్నాయి.
జవాబు:
ప్రశ్నలు:
- ‘కల్లు మానండోయ్’ బాబు” అని చాటి చెప్పింది ఎవరు?
- జయంతి సూరమ్మ ఎప్పుడు ఎక్కడ జన్మించారు?
- తాగుబోతుల వెకిలి వేషాలను ఏ విధానం ద్వారా ఈమె ప్రదర్శించారు?
- జయంతి సూరమ్మ లాగా ఈ ఉద్యమంలో పాల్గొన్న వారెవరు?
పదజాలం
కింది పేరా చదవండి. గీత గీపివ పదాలు మన తెలుగు పలుకుబడులు (జాతీయాలు) ఇవి భాషకు అందాన్నిస్తాయి.
బాలలందరూ అన్నెంపున్నెం ఎరుగని వాళ్ళు, కల్లాకపటం తెలియనివారు. అల్లారుముద్దుగా పెరిగినవారు. ఆరునూరైనా వాళ్ళు అనుకున్నది చేస్తారు. అడపాదడపా అల్లరి చేస్తుంటారు. స్నేహానికి ఈడుజోడు చూసుకుంటారు. కొందరు మాటల్లో ఆరితేరినవారు. మరి కొందరు తలలోనాలుకలా ఉంటారు. ఆబాలగోపాలం పిచ్చాపాటితో జీవితం గడిపేస్తుంటారు.
పై పలుకుబడులకు అర్థాలు చూడండి. వాటిని ఉపయోగించి సొంతవాక్యాలు రాయండి.
గీత గీసిన పదాలు (పలుకుబడులు లేదా జాతీయాలు)
జవాబు:
- అన్నెం పున్నెం : అమాయకత్వం : పిల్లలు అన్నె పున్నెం తెలియని వాళ్ళు.
- కల్లాకపటం : ఏమీ తెలియని తనం : నా మిత్రుడు కల్లా కపటం తెలియనివాడు.
- అల్లారు ముద్దుగా : అప్యాయంగా : మా చెల్లి అల్లారు ముద్దుగా పెరిగింది.
- ఆరునూరైనా : ఎట్టిపరిస్థితిలో : మా తమ్ముడు అనుకున్నది ఆరునూరైనా జరగాల్సిందే
- అడదడపా : అప్పుడప్పుడూ : మా గ్రామనికి బస్సు అడదడపా వచ్చి వెళ్తుంటుంది.
- ఈడుజోడు : సరిజోడు : వారిద్దరూ ఒకరికొకరూ ఈడుజోడు.
- ఆరి తేరినవారు : నైపుణ్యం కలవారు : రాము, సోము, మల్లయుద్ధంలో ఆరితేరినవారు.
- తలలో నాలుక : అంటిపెట్టుకుని : నామిత్రుడు తరగతి గదిలో ప్రతి ఒక్కరికీ తలలో నాలుకగా ఉంటాడు.
- ఆబాల గోపాలం : ప్రతి ఒక్కరూ (బాలుడి నుండి గోపాలుడి వరకు) శ్రీకృష్ణుని మురళీగానాన్ని ఆబాల గోపాలం ఇష్టపడుతుంది.
- పిచ్చాపాటి : ఊసుపోని మాటలు : సెలవల్లో మా మిత్రులందరం కలిసి పిచ్చాపాటి మాట్లాడుకుంటాం.
స్వీయరచన
ప్రశ్న 1.
వేంగమాంబలో మీకు నచ్చిన గుణాలు ఏంటి?
జవాబు:
ఆనాటి మూఢచారాలు ఎదిరించింది. ఎన్నో బాధలను, కష్టాలను తట్టుకుని సమాజంలో స్త్రీ తలచుకుంటే ఎంతో సాధించకలదు అని నిరూపించింది. ఆమె సంగీత సాహిత్యాలలోని అభినవేశము కలిగిన భక్తురాలు. ఎన్నో శతకాలు, గ్రంధాలు, భక్తి పారవశ్యంతో రచించినది. వెంగమాంబలోని ఈ విధమైన లక్షణాలు నాకు నచ్చినవి.
ప్రశ్న 2.
స్త్రీలు నేడు ఏఏ రంగాలలో పని చేస్తున్నారు ?
జవాబు:
స్త్రీలు నేడు అన్ని రంగాలలో పని చేస్తున్నారు.
ఉదా : ఉపాధ్యాయులుగా, వైమానిక రంగం, నౌకా రంగం, వైద్య రంగం మొ||.
ప్రశ్న 3.
పొణకా కనకమ్మ, చుండూరు రత్నమ్మ, జయంతి సూరమ్మల గురించి తెలుసుకున్నారు కదా! వారు వేటి కోసం పోరాడారో సొంతమాటల్లో రాయండి.
జవాబు:
పొణకా కనకమ్మ గారు :
“సుజన రంజని సమాజం” స్థాపించి – హరిజనులకు, దీనులకు ఉన్నతి స్థితి కల్పించడంలోను – విద్య ద్వారా సమాజ ఉద్ధరణ సాధ్యమని “వివేకానంద గ్రంథాలయం” స్థాపించి ప్రజలను విశ్వదర్శనం చేయించారు-సమాజ ఉద్దరణ కోసం పోరాడారు.
చుండూరు రత్నమ్మ గారు :
స్త్రీ జనోద్దరణ కోసం పోరాడారు. వితంతు వివాహాలు జరిపించారు. స్త్రీలు స్వతంత్రంగా తమ కాళ్ళ మీద నిలబడాలనే ధ్యేయంతో ” మహిళా పారిశ్రామిక సంఘం” ఏర్పరిచారు. కుల, మత వివక్షత లేకుండా మహిళా ఉద్ధరణ కోసం పాటు పడ్డారు.
జయంతి సూరమ్మ గారు :
మధ్యపాన నిషేధం కోసం పాటుపడ్డారు. తాగుబోతులలో మార్పు కోసం ఎన్నో నాటికలు, ప్రహసనాలు రాసి-వేసి “కల్లు మానండోయ్ బాబూ” అంటూ ధర్నా చేసి ప్రజలను “కల్లు జోలికి పోము” అని శపధాలు చేయించారు.
సృజనాత్మకత
స్త్రీల గొప్పతనాన్ని తెలిపే కొన్ని నినాదాలు తయారు చేయండి.
జవాబు:
- మహిళలను గౌరవిద్దాం.
- ఇల్లాలికి చదువు – ఇంటికి వెలుగు.
- ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో – అక్కడ దేవతలుంటారు.
- స్త్రీలు – దేశ సంస్కృతికి పట్టుకొమ్మలు.
- మహిళా సాధికారత – దేశ సౌభాగ్యం
- ఆడది అబల కాదు-సబల
- స్త్రీలు నేర్వలేని విద్యలేదు.
- అమ్మాయిని చదివిద్దాం – అభివృద్ధిని సాధిద్దాం.
ప్రశంస
ప్రశంస మీ తరగతిలో అమ్మాయిలు అన్ని రంగాలలో ముందున్నారు, అంటే బాగా చదువుతారు, ఆటల్లో రాణిస్తారు. నృత్యాలు చేస్తారు. పాటలు పాడుతారు. కార్యక్రమాలు నిర్వహిస్తారు. పరిశుభ్రత పాటిస్తారు. వాళ్ళని మీరు ఎలా అభినందిస్తారు.
జవాబు:
సోదరీ మణులారా! మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాను. మీరందరూ….. అన్ని రంగాలలో ఉన్నత స్థానాలు సంపాదిస్తున్నారు. ఆటలలో నీరజ, శృతి; పాటలలో సౌమ్య-అనుష్క; చదువులో మౌనిక-వసుప్రద, ప్రశాంతి-ప్రవల్లిక నృత్యంలో…… ఇలా అన్ని రంగాలలో మన తరగతిలోని మీరు ఉన్నత స్థానాన్ని సాధించి మన తరగతికి మంచి పేరు తీసుకొచ్చారు. మీరు ప్రదర్శించిన నేర్పు అందరినీ ఆకట్టుకుంది. అందుకనే మీకు ఈ అభినందనలు అందిస్తున్నాం.
భాషాంశాలు
I. సామాన్య వాక్యం :- ఇది రెండు రకాలు.
- క్రియా సహిత
- క్రియా రహిత వాక్యాలు
1. క్రియా సహిత వాక్యాలు :- ఈ వాక్యంలో ఒక సమాపకక్రియ ఉంటుంది.
ఉదా! పాప పాలు తాగుతుంది.
ఈశ్వర్ సినిమా చూస్తున్నాడు.
2. క్రియా రహిత వాక్యం :- ఈ వాక్యంలో క్రియ ఉండదు.
ఉదా॥ వాడు నా తమ్ముడు.
అతడు మంచి ఆటగాడు.
II. సంక్లిష్ట వాక్యం :- వాక్యంలో ఒక సమాపక క్రియ, ఒకటి లేదా అంతకు మించి అసమాపక క్రియలు ఉంటే అది సంక్లిష్ట వాక్యం .
ఉదా॥ రాము పాఠం చదివి, అన్నం తిని, నిద్రపోయాడు.
ప్రసాదు నడుస్తూ, తిన్నాడు.
III. సంయుక్త వాక్యం :- వాక్యంలో ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే అది . సంయుక్త వాక్యం.
ఉదా॥ సీత ఊరికి వెళ్ళింది ; వచ్చింది.
లక్ష్మీ పాలు త్రాగింది ; నిద్రపోయింది.
క్రింది వాక్యాలను చదవండి. సామాన్య, సంక్లిష్ట, సంయుక్త వాక్యాలను గుర్తించండి.
- లలిత పాట పాడింది………………..
- శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది………………..
- బలరాం సంతకు వెళ్ళి, కూరగాయలు తెచ్చాడు ………………..
- వివేకానందుడు షికాగోలో ఉపన్యసించాడు. ……………….
- సౌజన్య చాలా తెలివైనది, చురుకైనది. ………………….
- కమల పరీక్షలు రాసి, ఊరికి వెళ్లింది …………………
జవాబు:
- లలిత పాట పాడింది……………….. సామాన్య వాక్యం
- శారద టిఫిన్ తిన్నది, కాఫీ తాగింది……………….. సంయుక్త వాక్యం
- బలరాం సంతకు వెళ్ళి, కూరగాయలు తెచ్చాడు ……………….. సంక్లిష్ట వాక్యం
- వివేకానందుడు షికాగోలో ఉపన్యసించాడు. ………………. సంయుక్త వాక్యం
- సౌజన్య చాలా తెలివైనది, చురుకైనది. …………………. సంయుక్త వాక్యం
- కమల పరీక్షలు రాసి, ఊరికి వెళ్లింది ………………… సంక్లిష్ట వాక్యం
ధారణ చేద్దాం
ఊ|| కేయూరాణి న భూషయంతి పురుషం
హారా న చంద్రోజ్వలా:
న స్నానం న విలేపనం వ కుసుమం
నాలంకృతా మూర్ధజాః
వాణ్యేకా సమలజ్కరోతి పురుషం
యా సంస్కృతాధార్యతే
క్షీయంతే ఖిల భూషణాని సంతతం
వాగ్భూషణం భూషణం.
భావం :
మనిషికి అందాన్నిచ్చేవి కడియాలు, మురగులు, ధగధగలాడే నగలు కాదు. సువాసనలూరే లేపనాలతో స్నానం, పూలు అలంకరించిన జడలు ఇవేవి అందాన్నివ్వవు. వ్యక్తికి అందాన్నిచ్చేది, ఆ వ్యక్తి యొక్క సంస్కారవంతమైన మాట తీరే. ఏనాటికీ నిలిచేది వాగ్భూషణమే.
– భర్తహరి సుభాషితం
జవాబు:
విద్యార్థి పద్యాన్ని – భావాన్ని పద విభాగంతో చదవటం నేర్చుకుని, భావయుక్తంగా, అర్థవంతంగా ధారణచేయాలి. అందుకు ఉపాధ్యాయులు సహకరించాలి. అందులోని నీతిని, విషయాన్ని వంటపట్టించుకోవాలి.
పదాలు – అర్థాలు
అంతరాలు = తేడాలు
శతాబ్దం = వంద సంవత్సరాలు
పాటవం = సామర్థ్యం
ద్విపద = రెండు పాదాల పద్యం
మూఢాచారం = అవివేకమైన ఆచారాలు
కట్టుబాట్లు = నిబంధనలు
ఆంక్షలు : నిర్భంధాలు
సిద్ధహస్తురాలు = నేర్పరి
చలివేంద్రం = వేసవిలో మంచినీరు ఇచ్చుచోటు
అనఘాత్ములారా = పుణ్యాత్ములారా
చదువు – అర్ధం చేసుకో – ఆనందించు. పరీక్షల కోసం కాదు.
కవిత్రయం
“తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి” అనే సామెత విన్నారు కదా మహాభారతాన్ని సంస్కృతంలో వేదవ్యాసుడు రాశాడు. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడలు (మహాభారతాన్ని తెలుగులో రాశారు.
నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో ఉండేవాడు. నన్నయ్య 11వ శతాబ్దనికి చెందినవాడు. ఆరాజు కోరికపై సంస్కృతంలో ఉన్న భారతాన్ని నన్నయ్య తెలుగులో 35 రాశాడు. ఈయన నాది, సభా పర్వాలను, ఆరణ్యపర్వంలో ఆ కొంత భాగాన్ని రాశాడు. నన్నయ్య ‘అదికవి’ అంటారు. ఈయనకు ‘వాగనుశాసనుడు’ అనే బిరుదు కూడా ఉంది.
తిక్కన నెల్లూరును పాలించిన మనుమసిద్ది వద్ద మంత్రిగా ఉండే వాడు. ఈయన 13వ శతాబ్దానికి చెందినవాడు. మహాభారతంలో విరాటపర్వం మొదలు పదిహేను పర్వాలు 8 రాశాడు. ఈయనకు ‘కవి బ్రహ్మ’ ఉభయకవి మిత్రుడు’ అనే బిరుదులు ఉన్నాయి. తిక్కన ‘నిర్వచనోత్తర రామాయణం’ అనే మరో కావ్యం కూడా రాశాడు.
ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో 17 – ఉండే వాడు. ఎర్రన 14వ శతాబ్దం వాడు. భారతంలో జ అరణ్యపర్వంలో నన్నయ రాయగా మిగిలిన భాగాన్ని 1 ఎర్రన పూర్తి చేశాడు. ఎర్రన హరివంశం, నృసింహపురాణం కూడా సంక్ రాశాడు. ఈయనకు ‘ప్రబంధ పరమేశ్వరుడు’ ‘శంభుదాసుడు’ అనే బిరుదులున్నాయి.