AP SCERT 6th Class Maths Textbook Solutions Chapter 10 ప్రాయోజిక జ్యామితి Ex 10.1 Textbook Exercise Questions and Answers.
AP State Syllabus 6th Class Maths Solutions 10th Lesson దత్తాంశ నిర్వహణ Exercise 10.1
ప్రశ్న 1.
6.9 సెం.మీ. పొడవు గల రేఖాఖండమును స్కేలు, వృత్తలేఖిని సాయంతో గీయండి.
సాధన.
స్కేలు సహాయంతో :
1. 6.9 సెం.మీ. పొడవు గల రేఖాఖండం గీయాలి.
2. కాగితంపై స్కేలును కదలకుండా ఉంచి, 0 సెం.మీ. కొలతవద్ద పెన్సిల్ తో ఒక బిందువును పెట్టి, దానికి A అని పేరు పెట్టాలి.
3. 6 సెం.మీ. దాటిన తరువాత 9 చిన్నగీతలు లెక్కపెట్టి, అక్కడ మరో బిందువును పెట్టి, దానికి B అని పేరు పెట్టాలి.
4. స్కేలు అంచువెంబడి A, B లను పెన్సిల్ తో కలపాలి.
5. 6.9 సెం.మీ. పొడవుగల రేఖాఖండం A, B నిర్మితమైనది.
వృత్తలేఖిని సహాయంతో :
6. 9 సెం.మీ. పొడవుగల రేఖాఖండం గీయవచ్చు.
సోపానం – 1 : l అనే రేఖను గీచి, దానిపై ఒక బిందువును గుర్తించి దానికి A అని పేరు పెట్టాలి.
సోపానం – 2 : వృత్తలేఖిని లోహపు ముల్లును స్కేలు 0 సెం.మీ. స్థానంలో ఉంచి, పెన్సిల్ ముల్లును 6.9 సెం.మీ. వద్ద ఉండునట్లు సరి చూడాలి.
సోపానం – 3 : వృత్తలేఖిని లోహపు ముల్లును ‘l’ రేఖపై గల A బిందువుపై దించి, పెన్సిల్ లో ఆ రేఖ పై ఒక చాపంను గీయాలి. చాపం రేఖల ఖండన బిందువును B అని పేరు పెట్టాలి.
సోపానం – 4 : ‘l’ రేఖపై 6.9 సెం.మీ. పొడవుగల AB రేఖాఖండం నిర్మితమైంది.
ప్రశ్న 2.
4.3 సెం.మీ. పొడవు గల రేఖాఖండమును స్కేలు సాయంతో గీయండి.
సాధన.
స్కేలు సహాయంతో :
1. 4.3 సెం.మీ. పొడవు గల రేఖాఖండం గీయాలి.
2. కాగితంపై స్కేలును కదలకుండా ఉంచి, 0 సెం.మీ. కొలతవద్ద పెన్సిల్ తో ఒక బిందువును పెట్టి, దానికి P అని పేరు పెట్టాలి.
3. 4 సెం.మీ. దాటిన తరువాత 3 చిన్నగీతలు లెక్కపెట్టి, అక్కడ మరో బిందువును పెట్టి, దానికి Q అని పేరు పెట్టాలి.
4. స్కేలు అంచువెంబడి P,Q లను పెన్సిల్ లో కలపాలి.
5. 4.3 సెం.మీ. పొడవుగల రేఖాఖండం P,Q నిర్మితమైనది.
ప్రశ్న 3.
M కేంద్రంగా, 4 సెం.మీ. వ్యాసార్ధంగా గల వృత్తం గీయండి.
సాధన.
MA = వ్యాసార్ధం = 4 సెం.మీ.
నిర్మాణము :
1. వృత్తలేఖిని ముల్లు, పెన్సిల్ కొన మధ్య దూరం 4 సెం.మీ. ఉండేలా చూడాలి.
2. కాగితంపై పెన్సిల్ తో ఒక బిందువును గుర్తించి, దానికి ‘M’ అని పేరు పెట్టాలి.
3. వృత్తలేఖిని లోహపు ముల్లు ‘M’ పై ఉంచాలి.
4. లోహపు ముల్లును కదలకుండా నొక్కి, పెన్సిల్ ముల్లును నెమ్మదిగా చుట్టూ కదుపుతూ ఒకే ప్రయత్నంలో వృత్తాన్ని గీయాలి.
ప్రశ్న 4.
ఒక వృత్తంను గీసి, దానిపై మూడు బిందువులు A, B, Cలు కింద సూచించిన విధంగా గుర్తించండి.
అ) A వృత్తంపై ఉండాలి , ఆ) B వృత్తం అంతరంలో ఉండాలి . ఖ) C వృత్త బాహ్యంలో ఉండాలి
సాధన.